
నిందితుడు సాయిబాబా
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డిలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి అత్తను హత్య చేసి అడ్డుపడ్డ భార్య గొంతు కోశాడు. ఈ ఘటన సంగారెడ్డిలోని పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ పద్మారావు కాలనీలోని ఓ ఇంట్లో జరిగింది. రుద్రారంకు చెందిన సాయిబాబా.. తన భార్య సత్యవతిని సంసారానికి రాకుండా అత్త శాంతమ్మ అడ్డుపడుతోందని కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం అత్త శాంతమ్మ(40) ఇంటికి వచ్చి ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు.
శాంతమ్మపై దాడి చేస్తున్న సమయంలో సాయబాబాను భార్య సత్యవతి అడ్డుకుంది. మరింత కోపంతో సాయిబాబా తన భార్య గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. భార్య గొంతు కోయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన సత్యవతిని చికిత్స కోసం స్థానికులు సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి నిందితుడు సాయిబాబా లొంగిపోయియాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
చదవండి: జూబ్లీహిల్స్‌లో కి‘లేడీ’: లిఫ్ట్ అడిగి, బట్టలు చించుకుని కేకలేస్తూ..
Comments
Please login to add a commentAdd a comment