
మెక్సికోలో ఘోరం జరిగింది. పోలీసులు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 12 మంది పోలీసులు సహా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ రాష్ట్రమైన గురెరోలోని కోయుక డీ బెనిటేజ్ నగరంలో సోమవారం ఈ దారుణం చోటుచేసుకున్నట్లు పోలీసులు ధృవీకరించారు.
దాడి జరిగిన సమయంలో జాతీయ భదత్ర విభాగానికి చెందిన సీనియర్ అధికారి ప్రయాణిస్తున్నట్లు, అతన్ని లక్ష్యంగా చేసుకొని కాల్పులకు పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో సదరు అధికారితోపాటు, మొత్తం 16 మంది మరణించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాల్పులకు గల కారణాలపై విచారిస్తున్నారు.
ఈ ఘటనపై అలెజాండ్రో హెర్నాండెజ్ అనే అధికారి మాట్లాడుతూ.. ప్రాథమిక విచారణ ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో 13 మంది మున్సిపల్ పోలీసులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. దాడి చేసిన వారిని డ్రగ్ సరాఫరా చేసే ముఠాగా అనుమానిస్తున్నట్లు తెలిపారు.
చదవండి:బంగ్లాదేశ్‌లో రెండు రైళ్లు ఢీ.. 20 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment