
శంషాబాద్: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన సంఘటన శంషాబాద్ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. ఆర్‌జీఐఏ సీఐ శ్రీనివాస్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. స్థానిక రాళ్లగూడ యాదవ్‌కాలనీలో పెద్దులు, దానమ్మ (25)దంపతులు నివాసం ఉంటున్నారు. దానమ్మ కూరగాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, పెద్దులు ఏ పని చేయకపోగా మద్యానికి బానిసై తరచు భార్యతో గొడవపడుతుండేవాడు.
బుధవారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న పెద్దులు దానమ్మ మెడపై గొడ్డలితో నరకడంతో ఆమె కుప్పకూలింది. సమీపంలోనే ఉంటున్న సోదరులకు సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకుని పరిశీలించగా అప్పటికే దానమ్మ మృతిచెందింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: చర్మం ఒలిచినా దక్కని ఫలితం)
Comments
Please login to add a commentAdd a comment