లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హత్య కేసులో బెయిల్ బయటకు వచ్చిన ఓ వ్యక్తి.. తన భార్య, ముగ్గురు పిల్లలను అతి కిరాతకంగా కాల్చి చంపాడు. ఈ ఘోరం వారణాసిలోని భైదానీ ప్రాంతంలో సోమవారం అర్థరాత్రి వెలుగుచూసింది.
పోలీసుల వివరాల ప్రకారం.. రాజేంద్ర గుప్తా అనే వ్యక్తి 1997కు సంబంధించి ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాయడు. సోమవారం రాత్రి తన ఇంట్లోకి ప్రవేశించి గాఢ నిద్రలో ఉన్న భార్య నీతూ గుప్తా(45), కుమారులు నవేంద్ర(25), సుబేంద్ర(15), కూతురు గౌరంగి(16)పై కాల్పులు జరిపాడు. వారు మరణించారని ధృవవీకరించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు.
కుటుంబం హత్యపై సమాచారం అందుకున్న వారణాసి పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే నిందితుడు సైతం వారణాసిలోని రోహనియా ప్రాంతంలో శవమై కనపించాడు. తన భార్య, పిల్లలను చంపిన తర్వాత నిందితుడు హత్య చేసుకొని మరణించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా కొన్ని రోజులుగా బార్యభర్తల మధ్య వివాదాలు జరుగుతున్నాయని రాజేంద్ర గుప్తా తల్లి పోలీసులకు తెలిపారు.
ఈ సంఘటనపై వారణాసి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌరవ్ బన్స్వాల్ మాట్లాడుతూ. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని కాల్చి చంపినట్లు తమకు సమాచారం అందిందని చెప్పారు. కుటుంబ కలహాలు, చేతబడి వంటి అనేక కోణాల్లో మేము కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రాజేంద్ర గుప్తా మృతదేహాన్ని కూడా వారణాసి నుంచి స్వాధీనం చేసుకున్నామని, అతను హత్యకు గురయ్యాడా లేదా ఆత్మహత్య చేసుకొని మరణించాడా అని తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment