
రాంచీ : హైదరాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యాచార ఘటన మరువకముందే రాంచీలో లా విద్యార్ధిని (25)ని అపహరించి సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. ఈ దారుణానికి పాల్పడిన 12 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాంచీ శివార్లలో ఈనెల 26న సాయంత్రం 5.30 గంటలకు యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగులు ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను చితకబాది బాధితురాలిని బలవంతంగా సమీపంలోని ఇటుకల బట్టీ వద్దకు తీసుకువెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నిందితులందరినీ అరెస్ట్ చేసి వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఎస్పీ రిషబ్ కుమార్ ఝా తెలిపారు. నిందితుల నుంచి కారు,బైక్, పిస్టల్, ఎనిమిది మొబైల్ ఫోన్లు, బాధితురాలి నుంచి లాక్కున్న ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment