
ఉత్తరప్రదేశ్ లక్నోలో విషాదం చోటు చేసుకుంది. గుండె పోటుతో 19 ఏళ్ల విద్యార్థిని మరణించింది. అనికా రస్తోగి రామ్ మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీ విద్యార్థిని. హాస్టల్‌లో ఉండి చదువుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి హాస్టల్ రూమ్‌లో గుండెపోటుతో మరణించారు.
ఆదివారం ఉదయం హాస్టల్ రూంలో నిద్రిస్తున్న అనికాతో మాట్లాడేందుకు ఆమె స్నేహితురాలు వెళ్లింది. అయితే ఆపస్మారక స్థితిలో ఉండడం గమనించింది. హుటాహుటీనా ఆస్పత్రికి తరలించింది. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమె అప్పటికే మృతి చెందినట్లు పోటీసులు ప్రకటించారు.
మూడవ సంవత్సరం బీఏ ఎల్‌ఎల్‌బీ చదువుతున్న రస్తోగి తండ్రి మహారాష్ట్ర కేడర్‌కు చెందిన 1998 ఐపీఎస్ అధికారి సంజయ్ రస్తోగి. ప్రస్తుతం ఢిల్లీలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)లో ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. కుమార్తె మరణించినట్లు సంజయ్ రస్తోగికి పోలీసులు సమాచారం అందించారు.