ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువవుతున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు సడెన్ హార్ట్ ఎటాక్‌లు ఆందోళన కలిగిస్తున్నాయి. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి గుండెపోటుతో ప్రాణాలు విడుస్తున్నారు. ఈ మరణాలు యువతలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా మరో 30 ఏళ్ల యువకుడు ఆకస్మిక గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో వెలుగుచూసింది.
మహోబాలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో 30 ఏళ్ల అగి జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ తన ల్యాప్ టాప్‌లో పనిచేస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా తన కుర్చీపై కుప్పకూలిపోయాడు. పక్కన కూర్చున్న అతని సహచరులు ఇతరులను అప్రమత్తం చేసి, అతన్ని అతని డెస్క్ నుండి బహిరంగ ప్రదేశంలోకి మార్చారు.
వారు అతని ముఖం మీద నీరు చల్లి, మేల్కొలిపే ప్రయత్నం చేశారు. యువకుడికి సీపీఆర్ ఇచ్చేందుకు సైతం యత్నించారు. కానీ ఫలితం లేకపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే యువకుడు బ్యాంక్‌లో కుప్పకూలిన వీడియో అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
खौफनाक...
लैपटॉप पर काम करते करते कुर्सी पर ही HDFC Bank मैनेजर की मौत हो गई।
38 साल उम्र थी।
कुछ सेकंड पहले तक कीबोर्ड पर हाथ चला रहे थे।
अगले पल कुर्सी पर ही जान निकल गई।
यूपी के महोबा ब्रांच में थे।#mahoba#covidvaccines #covid #heartattack #hdfc #uttarpradesh pic.twitter.com/xXuw9Ndhnu— Sunil Yadav B+ (@sunilyadav21) June 26, 2024
Comments
Please login to add a commentAdd a comment