Law Student Who Misbehaved With Aparna Balamurali Suspended - Sakshi
Sakshi News home page

Aparna Balamurali : హీరోయిన్‌తో అనుచిత ప్రవర్తన, విద్యార్థిపై సస్పెన్షన్‌ వేటు

Jan 22 2023 10:11 AM | Updated on Jan 22 2023 10:50 AM

Law Student Who Misbehaved With Aparna Balamurali Suspended - Sakshi

అభిమానం శృతి మించితే మొదటికే మోసం వస్తుంది. ఇటీవల నటుడు అజిత్‌ అభిమానులు ఇద్దరు అత్యుత్సాహంతో ప్రాణాలను కోల్పోయారు. తాజాగా మరో అభిమాని భవిష్యత్తునే నాశనం చేసుకుంటున్నాడు. ఈ ఘటన కేరళలో జరిగింది. వివరాలు.. దక్షిణాదిలో క థానాయకిగా మంచి పేరు తెచ్చుకుంటున్న నటి అపర్ణ బాలమురళి. ఈ మలయాళీ కుట్టి 8 తూట్టాక్కల్‌ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని చిత్రాలు నటించినా, సూర్యతో జతకట్టిన సూరరై పోట్రు చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అదేవిధంగా ఇటీవల అ శోక్‌ సెల్వన్‌ సరసన నటించిన నిత్తం ఒరు వానం చిత్రంలోని నటనకు మంచి ప్రశంసలను అందుకుంది. ఇలా త మిళం, మలయాళం భాషల్లో నటిస్తున్న అపర్ణ బాల ముర ళి తాజాగా నటించిన తంగం అనే మలయాళ చిత్రం ని ర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాల్లో అపర్ణ బాలమురళి పాల్గొంటుంది. అలా ఇటీవల కేరళ రాష్ట్రం, ఎర్నాకులంలోని లా కళాశాలలో జరిగిన చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమంలో పాల్గొంది.

అప్పుడు ఆ కళాశాల విద్యార్థి ఒకరు నటి అపర్ణ బాలమురళికి పుష్పగుత్తితో స్వాగతం పలికే క్రమంలో ఆమె భుజంపై చేయి వేశాడు. అతని ప్రవర్తనకు అపర్ణ బాలమురళి సిగ్గుతో పక్కకు జరిగింది. అనంతరం ఆ విద్యార్థి అనాగరిక చర్యకు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆ విద్యార్థి మీరంటే చాలా అభిమానం అని, అలాంటి అత్యుత్సాహంతోనే అలా ప్రవర్తించినట్లు సంజాయిషీ ఇచ్చుకుని క్షమాపణ కోరాడు.

అయినప్పటికీ ఆ లా కళాశాల నిర్వాహకులు కూడా జరిగిన ఘటనపై నటి అపర్ణ బాలమురళికి క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా ఆ విద్యార్థిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. దీంతో అపర్ణతో  ఆటలా? చేయి వేస్తే సస్పెండే అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా నటి అపర్ణపై జరిగిన అనాగరిక చర్యను నటి మంజిమ మోహన్, మొదలగు పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు.

  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement