స‍్టార్ హీరో చిత్రంలో సూరారై పోట్రు హీరోయిన్..! | Soorarai Potru fame Aparna Balamurali In dhanush upcoming film | Sakshi
Sakshi News home page

Aparna Balamurali: ధనుష్‌ చిత్రంలో సూరారై పోట్రు హీరోయిన్..!

Published Wed, Jun 14 2023 7:00 AM | Last Updated on Wed, Jun 14 2023 7:03 AM

Soorarai Potru fame Aparna Balamurali In dhanush upcoming film - Sakshi

ధనుష్‌ ప్రస్తుతం కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. దీంతో ధనుష్‌ తర్వాత చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఇది ఆయన 50వ చిత్రం కావడం గమనార్హం. ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం నిర్వహించనుండడం విశేషం. ధనుష్‌ చాలా కాలాం క్రితం పా.పాండి అనే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన విషయం తెలిసిందే.

( ఇది చదవండి:పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ క్వీన్.. సోషల్ మీడియాలో వైరల్! )

ఆ చిత్రం మంచి విజయం సాధించింది. దీంతో ఆయన ద్వితీయ ప్రయత్నానికి సిద్ధమయ్యారు. ఇది కమర్షియల్‌ అంశాలతో కూడిన కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. అన్నదమ్ముల అనుబంధాలను ఆవిష్కరించే ఈ చిత్రంలో భారీ తారాగణం నటించనున్నారు. ఇప్పటికే త్రిష కథానాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అదేవిధంగా దుషారా విజయన్‌, సుధీప్‌ కిషన్‌, విష్ణువిశాల్‌, కాళిదాస్‌ జయరాం కీలకపాత్రలకు ఎంపికై నట్లు తెలుస్తోంది. తాజాగా సూరారై పోట్రు చిత్రం ఫేమ్‌ అపర్ణా బాలమురళి నటించబోతున్నట్లు సమాచారం. ఈమె చిత్రంలో సుదీప్‌ కిషన్‌కు జంటగా నటించనున్నట్లు తెలిసింది. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. జులై 1న ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు తాజా సమాచారం. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రం కోసం చైన్నె, వీసీఆర్‌ రోడ్డులో 500 ఇళ్లతో కూడిన భారీ సెట్‌ రెడీ అవుతున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం.

( ఇది చదవండి: సర్జరీ చేయించుకున్న ప్రముఖ నటి.. వారి కోసం ఓ సలహా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement