Aparna Balamurali
-
నిండు చందమామలా నేషనల్ అవార్డ్ హీరోయిన్ (ఫోటోలు)
-
తెరమీద కనిపిస్తే చాలు,అదో అందమైన ఫీలింగ్, నటి లేటెస్ట్ ఫోటోలు
-
'కిష్కింద కాండం' సినిమా రివ్యూ (ఓటీటీ)
రీసెంట్ టైంలో మలయాళంలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ మూవీ 'కిష్కింద కాండం'. రూ.7 కోట్ల ఖర్చు పెట్టి థియేటర్లలో రిలీజ్ చేస్తే రూ.75 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?అప్పు పిళ్లై (విజయ రాఘవన్) ఆర్మీ మాజీ అధికారి. అడవిని ఆనుకుని ఉండే పెద్ద ఇంట్లో ఉంటాడు. ఓరోజు ఈయన గన్ మిస్ అవుతుంది. ఎన్నికల టైం కావడంతో తుపాకీని స్టేషన్లో అప్పగించాలని నోటీసులు ఇస్తారు. కట్ చేస్తే ఓ కోతి చేతిలో గన్ కనిపిస్తుంది. అది తనదేనని అప్పు పిళ్లై కన్ఫర్మ్ చేస్తాడు. ఇతడికి అజయ్ చంద్రన్ (ఆసిఫ్ అలీ) అనే కొడుకు. అజయ్ తొలి భార్య చనిపోవడం, కొడుకు కనిపించకుండా పోవడంతో అపర్ణ (అపర్ణా బాలమురళి)ని రెండో పెళ్లి చేసుకుంటాడు. అజయ్ చంద్రన్ మొదటి భార్య ఎలా చనిపోయింది? మిస్ అయిన కొడుకు ఏమయ్యాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: రూమర్స్ కాదు నిజంగానే కీర్తి సురేశ్‌కి పెళ్లి సెట్!)ఎలా ఉందంటే?మిస్టరీ థ్రిల్లర్ అనగానే దాదాపు ఒకే ఫార్మాట్లో స్టోరీ ఉంటుంది. ఓ హత్య, దాని చుట్టూ సాగే దర్యాప్తు. హంతకుడిని పోలీసులు పట్టుకోవడం ఇదే కాన్సెప్ట్ కనిపిస్తుంది. కానీ 'కిష్కింద కాండం' పూర్తిగా డిఫరెంట్. పాట, ఫైట్ లాంటివి ఏం ఉండవు. ఎప్పుడూ చూసే మిస్టరీ థ్రిల్లర్ లాంటి సినిమానే కానీ నేపథ్యమే వేరు. దానిని చూపించిన విధానం చాలా కొత్తగా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కథ కూడా ఎక్కువ పాత్రలు లేకుండా చాలా సింపుల్‌గా తేల్చేశారు.మతిమరపు వ్యక్తి, కనపడకుండా పోయిన తుపాకీ, బుల్లెట్ గాయంతో చనిపోయిన కోతి, తప్పి పోయిన పిల్లాడు ఇవే ఈ కథ లోని ముఖ్యమైన అంశాలు. ఇంతకీ మించి చెబితే సినిమాలోని థ్రిల్‌ని మీరు మిస్ అయిపోతారు. ఎందుకంటే చిన్న స్టోరీ లైన్ మీద ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో.. చూస్తున్న ప్రేక్షకుడిని చివరి వరకు కూర్చోబెట్టడం అంటే అంత ఈజీ కాదు. కానీ 'కిష్కింద కాండం' అది చేసి చూపించింది. రైటింగ్ పరంగా ఇది టాప్ క్లాస్ వర్క్.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)కథ, మాటలు అందించిన బాహుల్ రమేశ్.. సినిమాటోగ్రఫీ కూడా చేశారు. కథ రాసుకున్న వాడే కెమెరా పడితే ఆ విజువల్స్ ఎలా ఉంటాయో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. మూవీ చాలా నెమ్మదిగా మొదలవుతుంది. చెప్పాలంటే తొలి అరగంట జరిగే సీన్లు చూస్తే బోర్ కొట్టేస్తుంది. కానీ ఆ తర్వాత ఉల్లిపాయ ఒక్కో పొర విప్పినట్లు కథలో ఒక్కో లేయర్ రివీల్ అవుతూ ఉంటుంది. అప్పటివరకు సస్పెన్స్, థ్రిల్లింగ్‌గా సాగే ఈ చిత్రం.. క్లైమాక్స్‌కి వచ్చేసరికి ఓ రకమైన సంతృప్తితో పాటు ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది.'జీవితం ముందుకు సాగాలంటే నిజంతో పాటు అబద్ధం కూడా అవసరం', 'ఎవరికీ ఉపయోగపడని నిజాలు తెలుసుకుని ఏం చేస్తాం'.. సినిమా చూసిన తర్వాత ఈ రెండు డైలాగ్స్ మీకు తెగ నచ్చేస్తాయి. అలానే తండ్రి గజిని, కొడుకు కమల్ హాసన్ అని మీకు కచ్చితంగా అనిపిస్తుంది. కమర్షియల్ మూవీస్ అంటే ఇష్టపడేవాళ్లు, స్లోగా సాగే సినిమాలంటే ఇష్టం లేనివాళ్లకు ఇది నచ్చకపోవచ్చు. కాబట్టి దానికి తగ్గట్లు ప్లాన్ చేసుకోండి. రెండు గంటల నిడివితో తీసిన మిస్టరీ థ్రిల్లర్.. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: 'లెవల్ క్రాస్' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ థ్రిల్లర్.. తెలుగులోనూ
తెలుగులో కమర్షియల్ సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. మలయాళంలో మాత్రం థ్రిల్లర్ మూవీస్ ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అలా సెప్టెంబరులో రిలీజైన ఓ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. రూ.5 కోట్లు పెడితే రూ.50 కోట్లు వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు ఆ మూవీనే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు.అపర్ణ బాలమురళి, అసిఫ్ అలీ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ మూవీ 'కిష్కింద కాండం'. కోతుల బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల దృష్టిలోనూ పడింది. దీంతో ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూశారు. ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చేసింది. నవంబర్ 19 నుంచి హాట్‌స్టార్‌లో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది.(ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న డైరెక్టర్ క్రిష్)'కిష్కింద కాండం' విషయానికొస్తే.. అజయన్ (అసిఫ్ అలీ), అపర్ణ (అపర్ణ బాలమురళి) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కానీ అప్పటికే అజయన్కి పెళ్లయి బాబు కూడా పుడతాడు. కానీ భార్య చనిపోవడంతో ఈ పెళ్లి చేసుకుంటాడు. కానీ ఇది జరిగిన కొన్నిరోజులకే కొడుకు మాయమవుతాడు. ఆ కుర్రాడు ఏమైపోయాడు? అజయన్ తండ్రి వల్ల ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అనేదే మిగతా స్టోరీ.చివరి వరకూ సినిమాలో ట్విస్ట్‌ను కొనసాగించడంతో పాటు థ్రిల్‌ను ఏమాత్రం తగ్గనీయకుండా దర్శకుడు సినిమా తీశాడు. 'కిష్కింద కాండం' టైటిల్ పెట్టడానికి కూడా కారణముంది. కోతులు ఎక్కువగా కనిపించే ఆ ఊరిలో వింత సంఘటనలు జరుగుతుంటాయి. ఓ సందర్భంలో మనిషి శవం ఉండాల్సిన చోట కోతి శవం కనిపిస్తుంది. ఇలా మొదటి నుంచి చివరివరకు ట్విస్టులు, థ్రిల్స్ మిమ్మల్ని మైండ్ బ్లాక్ చేయడం గ్యారంటీ.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ అంటేనే ఇమేజ్ డ్యామేజ్.. ఎప్పుడు తెలుసుకుంటారో?) -
పీచు మిఠాయ్...
సైకిలు మీద ప్రేమ షికారుకు వెళ్లారు సందీప్ కిషన్, అపర్ణా బాలమురళి. ఈ జాలీ రైడ్‌లో ‘పీచు మిఠాయ్...’ అంటూ పాట పాడుకున్నారు. ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘రాయన్’లో సందీప్ కిషన్, అపర్ణా బాలమురళి ఓ జంటగా నటించారు. సినిమాలో ఈ ఇద్దరి మధ్య ‘పీచు మిఠాయ్..’ అంటూ సాగే రొమాంటిక్, మెలోడీ సాంగ్‌ను విడుదల చేశారు.ఏఆర్ రెహమాన్ స్వరపరచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా విజయ్ ప్రకాశ్, హరిప్రియ పాడారు. తెలుగు, తమిళ భాషల్లో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 13న రిలీజ్ కానుంది. తెలుగు వెర్షన్‌ని ఏషియన్–సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి విడుదల చేయనుంది. -
అపర్ణకు కంగ్రాట్స్ చెప్పిన నయనతార.. ఎందుకో తెలుసా..?
కోలీవుడ్ హీరోయిన్ అపర్ణ బాలమురళికి నయనతార కంగ్రాట్స్ చెప్పారు.. ఎందుకు? ఏమిటా కథ. చూసేస్తే పోలా. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై లేడీ సూపర్‌స్టార్‌గా వెలిగిపోతున్న నటి నయనతార. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటూనే నిర్మాతగా మారి రౌడీ పిక్చర్స్ పతాకంపై పలు చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇటీవల వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తూ చేతినిండా ఆర్జిస్తున్నారు. అంతేకాకుండా ఇతర వ్యాపార రంగాల్లోనూ ప్రవేశించి సహ నటీమణులకు రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు. ఇకపోతే నటి అపర్ణ బాలమురళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. 2015లో మొదట మలయాళ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై ఆపై 2017లోకోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ మలయాళ బ్యూటీ.. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినా, సూరరై పోట్రు తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' చిత్రంలో సూర్యకు జంటగా నటించి అందరి ప్రశంసలు అందుకోవడంతో పాటు జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. కాగా మలయాళంలో బిజీగా ఉన్న ఈమె ప్రస్తుతం తమిళంలో ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న 50వ చిత్రంలో నటిస్తున్నారు. అలాంటిది అపర్ణ బాలమురళి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకొనే పనిలో పడినట్టు తెలుస్తోంది. అందుకు ఈ భామ నటి నయనతారను స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలో నటిస్తూనే ఇతర రంగాలపై దృష్టి సాగించారు. అలా తన మిత్రులతో కలిసి వస్త్ర వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఈ విషయం తెలిసిన నయనతార ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఎక్స్ మీడియాలో చేసిన పోస్టులో ‘మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. మీ నూతన వెంచర్ సక్సెస్ కావాలి. ఆల్ ద బెస్ట్’అని పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Aparna Balamurali✨ (@aparna.balamurali) -
స్టార్ హీరో చిత్రంలో సూరారై పోట్రు హీరోయిన్..!
ధనుష్ ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో ధనుష్ తర్వాత చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఇది ఆయన 50వ చిత్రం కావడం గమనార్హం. ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం నిర్వహించనుండడం విశేషం. ధనుష్ చాలా కాలాం క్రితం పా.పాండి అనే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన విషయం తెలిసిందే. ( ఇది చదవండి:పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ క్వీన్.. సోషల్ మీడియాలో వైరల్! ) ఆ చిత్రం మంచి విజయం సాధించింది. దీంతో ఆయన ద్వితీయ ప్రయత్నానికి సిద్ధమయ్యారు. ఇది కమర్షియల్ అంశాలతో కూడిన కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. అన్నదమ్ముల అనుబంధాలను ఆవిష్కరించే ఈ చిత్రంలో భారీ తారాగణం నటించనున్నారు. ఇప్పటికే త్రిష కథానాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా దుషారా విజయన్, సుధీప్ కిషన్, విష్ణువిశాల్, కాళిదాస్ జయరాం కీలకపాత్రలకు ఎంపికై నట్లు తెలుస్తోంది. తాజాగా సూరారై పోట్రు చిత్రం ఫేమ్ అపర్ణా బాలమురళి నటించబోతున్నట్లు సమాచారం. ఈమె చిత్రంలో సుదీప్ కిషన్‌కు జంటగా నటించనున్నట్లు తెలిసింది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. జులై 1న ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తాజా సమాచారం. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రం కోసం చైన్నె, వీసీఆర్ రోడ్డులో 500 ఇళ్లతో కూడిన భారీ సెట్ రెడీ అవుతున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. ( ఇది చదవండి: సర్జరీ చేయించుకున్న ప్రముఖ నటి.. వారి కోసం ఓ సలహా!) -
గీతగోవిందం వసూళ్లను విరాళంగా ఇచ్చాం, అందుకేనేమో!
‘‘గీతగోవిందం’ సినిమాను కేరళలో విడుదల చేసి, వసూళ్లను అక్కడ విరాళంగా ఇచ్చాం(కేరళలో 2018 వచ్చిన వరదలను ఉద్దేశిస్తూ). బాహుశా.. అందుకేనేమో మలయాళ హిట్ మూవీ ‘2018’ ని తెలుగులో విడుదల చేసే అవకాశం నాకు వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ వేణు, ఆంథోనీ, పద్మ కుమార్‌గార్లకు థ్యాంక్స్. హృదయాన్ని హత్తుకునే సినిమా ‘2018’’ అని నిర్మాత ‘బన్నీ’ వాసు అన్నారు. టోవినో థామస్, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘2018’. జూడ్ ఆంథోనీ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో ఈ నెల 3న రిలీజైంది. ఈ మూవీని ఈ నెల 26న తెలుగులో ‘బన్నీ’ వాసు విడుదల చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ‘2018’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో టోవినో థామస్ మాట్లాడుతూ–‘‘ఇకపై నేను నటించే సినిమాలను తెలుగులోనూ విడుదల చేస్తాను’’ అన్నారు. ‘‘ఈ సినిమాని థియేటర్స్‌లో చూడండి’’ అన్నారు జూడ్ ఆంథోనీ జోసెఫ్. ఈ కార్యక్రమంలో అపర్ణా బాలమురళి, నిర్మాత ఎస్కేఎన్ పాల్గొన్నారు. -
హీరోయిన్‌తో అనుచిత ప్రవర్తన, విద్యార్థిపై సస్పెన్షన్ వేటు
అభిమానం శృతి మించితే మొదటికే మోసం వస్తుంది. ఇటీవల నటుడు అజిత్ అభిమానులు ఇద్దరు అత్యుత్సాహంతో ప్రాణాలను కోల్పోయారు. తాజాగా మరో అభిమాని భవిష్యత్తునే నాశనం చేసుకుంటున్నాడు. ఈ ఘటన కేరళలో జరిగింది. వివరాలు.. దక్షిణాదిలో క థానాయకిగా మంచి పేరు తెచ్చుకుంటున్న నటి అపర్ణ బాలమురళి. ఈ మలయాళీ కుట్టి 8 తూట్టాక్కల్ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని చిత్రాలు నటించినా, సూర్యతో జతకట్టిన సూరరై పోట్రు చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అదేవిధంగా ఇటీవల అ శోక్ సెల్వన్ సరసన నటించిన నిత్తం ఒరు వానం చిత్రంలోని నటనకు మంచి ప్రశంసలను అందుకుంది. ఇలా త మిళం, మలయాళం భాషల్లో నటిస్తున్న అపర్ణ బాల ముర ళి తాజాగా నటించిన తంగం అనే మలయాళ చిత్రం ని ర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో అపర్ణ బాలమురళి పాల్గొంటుంది. అలా ఇటీవల కేరళ రాష్ట్రం, ఎర్నాకులంలోని లా కళాశాలలో జరిగిన చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంది. అప్పుడు ఆ కళాశాల విద్యార్థి ఒకరు నటి అపర్ణ బాలమురళికి పుష్పగుత్తితో స్వాగతం పలికే క్రమంలో ఆమె భుజంపై చేయి వేశాడు. అతని ప్రవర్తనకు అపర్ణ బాలమురళి సిగ్గుతో పక్కకు జరిగింది. అనంతరం ఆ విద్యార్థి అనాగరిక చర్యకు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆ విద్యార్థి మీరంటే చాలా అభిమానం అని, అలాంటి అత్యుత్సాహంతోనే అలా ప్రవర్తించినట్లు సంజాయిషీ ఇచ్చుకుని క్షమాపణ కోరాడు. అయినప్పటికీ ఆ లా కళాశాల నిర్వాహకులు కూడా జరిగిన ఘటనపై నటి అపర్ణ బాలమురళికి క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా ఆ విద్యార్థిపై సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో అపర్ణతో ఆటలా? చేయి వేస్తే సస్పెండే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా నటి అపర్ణపై జరిగిన అనాగరిక చర్యను నటి మంజిమ మోహన్, మొదలగు పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. A college student misbehaved with actress Aparna Balamurali during the promotion function of Thangam movie. @Vineeth_Sree I'm surprised about your silence 🙏 What the hell #Thankam film crew doing there. @Aparnabala2 #AparnaBalamurali pic.twitter.com/icGvn4wVS8 — Mollywood Exclusive (@Mollywoodfilms) January 18, 2023