suspention
-
‘కలెక్టర్ బ్రో’ సహా ఇద్దరు ఐఏఎస్‌ల సస్పెన్షన్
తిరువనంతపురం: కేరళలో ఇద్దరు ఐఏఎస్ అధికారులపై వేటుపండింది. క్రమశిక్షణ ఉల్లంఘన కారణంతో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వం సోమవారం ఇద్దరు ఐఏఎస్ అధికారులు కె గోపాలకృష్ణన్, ఎన్ ప్రశాంత్‌లను సస్పెండ్ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మత ఆధారిత ప్రభుత్వ అధికారుల వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేసినందుకు ఐఏఎస్ గోపాలకృష్ణను సస్పెండ్ చేయగా, సోషల్ మీడియాలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని విమర్శించినందుకు ఐఏఎస్ ప్రశాంత్‌పై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్‌కు ‘‘కలెక్టర్ బ్రో’’గా సోషల్ మీడియాలో పాపులారిటీ ఉంది. అయితే.. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా అధికారులను సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశించారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు.. తన మొబైల్ ఫోన్‌ను గుర్తుతెలియని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారని ఐఏఎస్ అధికారి కె. గోపాల్‌కృష్ణన్ అన్నారు. తన అనుమతి లేకుండా మతపరమైన వాట్సాప్ గ్రూపులను సృష్టించారని ఐఏఎస్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. ఐఏఎస్ అధికారి వాదనలను పోలీసు దర్యాప్తు అధికారి తోసిపుచ్చారు. ఆయన ఫోన్ హ్యాక్ చేయబడిందని తమకు ఎటువంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. ఫోరెన్సిక్ పరీక్ష కోసం పరికరాన్ని సమర్పించే ముందు గోపాలకృష్ణన్ మొబైల్ ఫోన్‌ను చాలాసార్లు రీసెట్ చేసినట్లు పోలీసులు వెల్లడించినట్లు తెలిపారు. -
లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూ: పోలీసు అధికారులపై సస్పెన్షన్
చండీగఢ్: పంజాబ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కస్టడీలో ఉండి ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూపై రాష్ట్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఇంటర్వ్యూపై విచారణ జరిపిన పంజాబ్ హోంశాఖ.. ఇంటర్వ్యుకు సహకరించిన పోలీసులు అధికారులపై చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీలు)సహా ఏడుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. అయితే ఈ ఇంటర్వ్యూ 2023లో పంజాబ్ జైలులో ఖైదీగా ఉన్న సమయంలో జరగటం గమనార్హం. ఈ ఇంటర్వ్యులో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యలో లారెన్స్ బిష్ణోయ్ పాత్రపై ప్రశ్నించారు. ఇంటర్వ్యూ ప్రసారమైన అనంతరం సెప్టెంబరు, 2023లో పంజాబ్ , హర్యానా హైకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది. పోలీసు కస్టడీలో ఉన్న ఖైదీకి ఇంటర్వ్యూ ఎలా ఏర్పాటు చేశారని మండిపడింది. ఇక..ఈ సంఘటన పంజాబ్ జైలు వ్యవస్థలో భద్రతా ప్రోటోకాల్‌లకు సంబంధించి తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తింది. జైలు నుంచి రికార్డ్ చేసిన ఇంటర్వ్యూను అనుమతించిన వైఫల్యాలపై పోలీసు శాఖ అంతర్గత దర్యాప్తును ప్రారంభించింది.చదవండి: దావూద్ బాటలో.. బిష్ణోయ్ నేరసామ్రాజ్యం -
ఎన్నికల వేళ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై సస్పెన్షన్
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు అమరావతి నియోజకవర్గం ఎమ్మెల్యే సుల్భా ఖోడ్కేపై కాంగ్రెస్ ఆరేళ్లపాటు సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఏడాది ప్రారంభంలో శాసన మండలి ఎన్నికల్లో.. ప్రతిపక్షాల మహా వికాస్ అఘాడి కూటమి అభ్యర్థి పీడబ్ల్యూపీ నేత జయంత్ పాటిల్ ఓడిపోయారు. అయితే ఈ ఎన్నికలో క్రాస్ ఓటింగ్ చేసిన ఏడుగురు ఎమ్మెల్యేల్లో సుల్భా ఖోడ్కే ఒకరు.Maharashtra Pradesh Congress has expelled Amravati MLA Sulabha Khodke from the party for six years due to anti-party activities. pic.twitter.com/p3lUIbWEYk— ANI (@ANI) October 12, 2024అయితే ఆమె పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అనేక ఫిర్యాదులు వచ్చాయని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే ఒక ప్రకటనలో తెలిపారు. అందుకే పార్టీ మహారాష్ట్ర ఇంచార్జి రమేష్ చెన్నితాల ఆదేశాల మేరకే ఆమెను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
బ్రజ్ మండల్ యాత్ర.. 24 గంటల ఇంటర్నెట్ బంద్
చండీగఢ్: బ్రజ్ మండల్ జలాభిషేక యాత్ర నేపథ్యంలో హర్యానా రాష్ట్ర ప్రభత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది చోటుచేసుకున్న ఘర్షణలను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా నుహ్ జిల్లాలో 24 గంటలపాటు మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సర్వీసులను నిలిపివేసినట్లు ప్రకటించింది. నుహ్ జిల్లాలో ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం సాయత్రం 6 గంటల వరకు ఇంటర్నెట్ సర్వీస్‌ను నిలిపివేస్తున్నట్లు హర్యానా అడిషినల్ చీఫ్ సెక్రటరీ( హోం ) అనురాగ్ రస్తోంగి తెలిపారు. అసత్యాలు, పుకార్లు.. సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా వ్యాప్తి చెందకుండా అడ్డుకుంనేందుకు వాట్సాప్, ఫేస్బుక్, ట్విటర్(ఎక్స్)పై సస్పెన్షన్ విధించామని పేర్కొన్నారు.మరోవైపు.. యాత్ర ప్రశాంతంగా జరిగేలా నుహ్ జిల్లా మొత్తం భద్రత ఏర్పాట్లు చేసినట్ల పోలీసులు తెలిపారు. గతేడాది జూలై 31న యాత్ర సందర్భంగా విశ్వహిందూ పరిషత్ నిర్వహించి ఊరేగింపులో చోటుచేసుకున్న ఘర్షణలో ఇద్దరు హోంగార్డులు, 15 మంది మృతి చెందారు. రాళ్లు విసిరి.. కార్లకు నిప్పుపెట్టారు. అదే రాత్రి గురుగ్రామ్‌లోని ఓ మసీద్‌పై దాడి ఘటనలో ఓ వ్యక్తి మరణించారు. ఆ తర్వాత కూడా పలు ఘర్షణలు చోటుచేసుకోగా.. ఆరుగురు మృతి చెందారు. అప్పడు సీఎంగా ఉన్న ప్రస్తుత కేంద్ర మంత్రి మనోహర్ కట్టర్ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించారు. -
సందేశ్‌ఖాలీ కేసు: షాజహాన్ ఖాన్‌కు షాక్ ఇచ్చిన టీఎంసీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో సందేశ్‌ఖాలీ కేసులో ప్రధాన నిందితుడైన షేక్ షాజహన్ ఖాన్‌పై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వేటు వేసింది. టీఎంసీ పార్టీకి సంబంధించిన అన్ని పదువుల నుంచి షాజహన్ ఖాన్‌ను సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ ఆరేళ్లు కొనసాగుతుందని టీఎంసీ పార్టీ వెల్లడించింది. సందేశ్‌ఖాలీ కేసులో షాజహన్ ఖాన్ పోలీసులు అరెస్ట్ చేసిన కొన్ని గంటల్లో టీఎంసీ ఆయన్ను సస్పెండ్ చేసింది. గత ఎన్నిరోజులుగా పరారీలో ఉన్న షాజహన్ ఖాన్ ఎట్టకేలకు పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. సందేశ్‌ఖాలీలోని భూములు లాక్కొని.. అక్కడి మహిళలపై లైగింక దాడులకు పాల్పడినట్లు షాజహన్ ఖాన్‌తో ఆయన అనుచరులపై ఆరోపణలు ఉన్నాయి. కొన్ని రోజులు సందేశ్ ఖాలీ గిరిజన మహిళలు షాజహన్ ఖాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమయంలో ఈ నిరసనలు పశ్చిమ బెంగాల్లో రాజకీయల్లో తీవ్ర దుమారం రేపాయి. ఇప్పటి వరకు స్పందించని టీఎంసీ.. నిన్న ప్రధానిమోదీ బెంగాల్ పర్యటన అనంతరం తమ నేత అరెస్ట్ కావటం ఆవెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయటం గమనార్హం. ఇక.. టీఎంసీ నేత డెరెక్ ఓబ్రియన్, మంత్రి బ్రత్య బసు మీడియా సమావేశంలో తమ పార్టీ నేత షాజహన్ ఖాన్‌పై సస్పెన్షన్ విధించినట్లు మీడియాకు తెలిపారు. ‘సందేశ్‌ఖాలీ కేసు విషయంలో మేం చట్టప్రకారం నడుచుంటాం. కానీ.. ఈ విషయంలో బీజేపీ కావాలని మాకు అడుగడుగునా అడ్డుపడుతోంది. బీజేపీకి మేము సవాల్ విసురుతున్నాం. మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం సందేశ్‌ఖాలీ విషయం మాకు కేంద్రానికి మధ్య.. బీజేపీకి టీఎంసీ మధ్య విషయం. ఇక్కడ రెండు పార్టీలు ఉన్నాయి. ఒకటి మాటలు చెప్పేదైతే.. టీఎంసీ చెప్పిన మాటలను ఆచరిస్తుంది’అని డెరెక్ ఓబ్రియన్ అన్నారు. -
మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవులు మంత్రులపై వేటు!
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల్దీవులు మంత్రులపై ఆ దేశ ప్రభుత్వం వేటు వేసింది. ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది మాల్దీవులు ప్రభుత్వం. మంత్రులు మరియం షియునా, మల్షా షరీఫ్ , మహ్జూమ్ మజీద్ సస్పెన్షన్‌కు గురైనట్లు మాల్దీవులు స్థానిక మీడియా వెల్లడించింది. ఇప్పటికే మంతత్రి మరియం షియునా ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమైనవి అని మాల్దీవులు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా ప్రకటించిన కొద్ది గంటల్లోనే వారిపై మాల్దీవులు ప్రభుత్వం సస్పెన్ వేటు వేయటం గమనార్హం. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యదీప్ పర్యటనకు వెళ్లిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. వాటిలో ఓ వీడియోపై మాల్దీవులు మంత్రి మరియం షియునా చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. లక్ష్యదీప్ బీచ్‌లో మోదీ నడుస్తున్న ఓ వీడియోపై మరియం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ దేశపు తోలు బోమ్మ అని అనుచిత కామెంట్ చేశారు. దీంతో ఒక్కసాగా ఆమె వ్యాఖ్యలు వివాదాస్పంగా మారాయి. ఆమె వ్యాఖ్యలను భారత్‌లోని పలువురు తీవ్రంగా ఖండించారు. మాల్దీవులు మంత్రి చేసిన అవమానపూరిత వ్యాఖ్యలపై బాలీవుడ్ నటులు సైతం తీవ్రంగా ఖండిచారు. ‘భారత్‌పై మాల్దీవులు దేశ మంత్రులు అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా ఆశ్చర్యం కలిగించింది. పొరుగు దేశంతో తాము స్నేహంగానే ఉండాలనుకుంటాం. కానీ, వారి ద్వేషాన్ని సహించము. మాల్దీవులులో ఎన్నోసార్లు పర్యటించాను. అయితే ఇటువంటి సమయంలో భారత్‌లోని దీవులను పర్యటిస్తూ.. మన పర్యాటకానికి మద్దతు ఇద్దాం’ అని బాలీవుడ్ నటుడు ఆక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ‘చాలా పరిశుభ్రమై లక్ష్య ద్వీప్ బీచ్‌ను ప్రధాని మోదీ పర్యటించడం ఎంతో బాగుంది. విశేషమేంటంటే అవి కూడా మన దేశంలో ఉండటం’ అని నటుడు సల్మాన్ ఖాన్ తెలిపారు. ఇక.. వీరితోపాటు చాలామంది ప్రముఖులు, సామాన్యులు కూడా మాల్దీవులు మంత్రి వ్యాఖ్యలను సోషల్‌మీడియాలో తీవ్రంగా ఖండిస్తున్నారు. తమ మాల్దీవులు పర్యటనను కూడా రద్దు చేసుకుంటున్నామని భారతీయ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. చదవండి: మోదీపై అనుచిత పోస్టు.. ఖండించిన మాల్దీవుల ప్రభుత్వం -
సస్పెన్షన్ల వేళ.. నితిన్ గడ్కరీని కలిసిన శశిథరూర్
ఢిల్లీ: పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసుపై ఉభయ సభల్లో గత రెండు మూడు రోజులుగా గందరగోళం నెలకొంటోంది. దుండగుల చొరబాటుపై కేంద్ర మంత్రి అమిత్ షా స్పందించాలని విపక్షాలు పట్టుబడటంతో సభకు ఈ రోజు కూడా అంతరాయం జరిగింది. నేడు లోక్‌సభలో 49 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి ధన్యవాదాలు తెలిపారు. కేరళలోని జాతీయ రహదారి-65ను పూర్తి చేసినందుకు గాను నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు తెలుపుతున్న ఫొటోను ఎక్స్‌లో షేర్ చేశారు. 1/2 Took the opportunity, amid the LokSabha disruption, to thank @nitin_gadkari for his excellent cooperation in completing work on the NH66 from Kazhakuttam to Karode (which will one day offer a 4-lane link from Thiruvananthapuram to Kanyakumari).I initiated this project pic.twitter.com/UBETf7gM4o — Shashi Tharoor (@ShashiTharoor) December 19, 2023 'కాళకుటం నుంచి కరోడ్ వరకు ఎన్‌హెచ్-65ను పూర్తి చేసినందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ధన్వవాదాలు. తిరువనంతపురం నుంచి కన్యాకుమారి వరకు నాలుగు లైన్ల రహదారికి భవిష్యత్‌లో ఇది అనుసంధానం అవుతుంది. ఈ రహదారి అభివృద్ధి పనులను నేనే ప్రారంభించాను. ఓవర్‌పాస్‌లు, ట్రాఫిక్ లైన్లు, మెరుగైన అనుసంధానం కోసం నియోజక వర్గం ప్రజల అభ్యర్థనల మేరకు కేంద్ర మంత్రిని కలిశాను. సాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.' అని శశిథరూర్ ట్వీట్ చేశారు. మంగళవారం సస్పెన్షన్ అయిన ఎంపీల్లో శశిథరూర్ కూడా ఒకరు. ఇదీ చదవండి: లోక్ సభలో నేడు 49 మంది ఎంపీలపై వేటు -
హీరోయిన్‌తో అనుచిత ప్రవర్తన, విద్యార్థిపై సస్పెన్షన్ వేటు
అభిమానం శృతి మించితే మొదటికే మోసం వస్తుంది. ఇటీవల నటుడు అజిత్ అభిమానులు ఇద్దరు అత్యుత్సాహంతో ప్రాణాలను కోల్పోయారు. తాజాగా మరో అభిమాని భవిష్యత్తునే నాశనం చేసుకుంటున్నాడు. ఈ ఘటన కేరళలో జరిగింది. వివరాలు.. దక్షిణాదిలో క థానాయకిగా మంచి పేరు తెచ్చుకుంటున్న నటి అపర్ణ బాలమురళి. ఈ మలయాళీ కుట్టి 8 తూట్టాక్కల్ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని చిత్రాలు నటించినా, సూర్యతో జతకట్టిన సూరరై పోట్రు చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అదేవిధంగా ఇటీవల అ శోక్ సెల్వన్ సరసన నటించిన నిత్తం ఒరు వానం చిత్రంలోని నటనకు మంచి ప్రశంసలను అందుకుంది. ఇలా త మిళం, మలయాళం భాషల్లో నటిస్తున్న అపర్ణ బాల ముర ళి తాజాగా నటించిన తంగం అనే మలయాళ చిత్రం ని ర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో అపర్ణ బాలమురళి పాల్గొంటుంది. అలా ఇటీవల కేరళ రాష్ట్రం, ఎర్నాకులంలోని లా కళాశాలలో జరిగిన చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంది. అప్పుడు ఆ కళాశాల విద్యార్థి ఒకరు నటి అపర్ణ బాలమురళికి పుష్పగుత్తితో స్వాగతం పలికే క్రమంలో ఆమె భుజంపై చేయి వేశాడు. అతని ప్రవర్తనకు అపర్ణ బాలమురళి సిగ్గుతో పక్కకు జరిగింది. అనంతరం ఆ విద్యార్థి అనాగరిక చర్యకు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆ విద్యార్థి మీరంటే చాలా అభిమానం అని, అలాంటి అత్యుత్సాహంతోనే అలా ప్రవర్తించినట్లు సంజాయిషీ ఇచ్చుకుని క్షమాపణ కోరాడు. అయినప్పటికీ ఆ లా కళాశాల నిర్వాహకులు కూడా జరిగిన ఘటనపై నటి అపర్ణ బాలమురళికి క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా ఆ విద్యార్థిపై సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో అపర్ణతో ఆటలా? చేయి వేస్తే సస్పెండే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా నటి అపర్ణపై జరిగిన అనాగరిక చర్యను నటి మంజిమ మోహన్, మొదలగు పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. A college student misbehaved with actress Aparna Balamurali during the promotion function of Thangam movie. @Vineeth_Sree I'm surprised about your silence 🙏 What the hell #Thankam film crew doing there. @Aparnabala2 #AparnaBalamurali pic.twitter.com/icGvn4wVS8 — Mollywood Exclusive (@Mollywoodfilms) January 18, 2023 -
టీఆర్ఎస్ నుంచి మురళీయాదవ్ సస్పెన్షన్
మెదక్ మున్సిపాలిటీ: నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదన్నారు. పార్టీ ఇప్పటికే ఆయన భార్యకు ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్పర్సన్ పదవి, ఆయనకు మున్సిపల్ చైర్మన్ పదవి, పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టిందని గుర్తు చేశారు. చదవండి: 34 ఏళ్లు పనిచేసినా హోంగార్డు.. ఎస్పీ అవుతాడా? -
ఆ మేడం వస్తే మేం వెళ్లిపోతాం!
ఆదిలాబాద్: ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది తీరు మారడం లేదు. గతనెల జిల్లా కేంద్రంలోని రూరల్ కేజీబీవీలో కలుషిత ఆహారం తిని 90 మంది విద్యార్థులు ఆస్పత్రిపాలైన విషయం తెలిసిందే. కేజీబీవీలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని విద్యార్థులు కన్నీరుమున్నీరు కాగా, కలెక్టర్ విచారణ చేపట్టి రూరల్ కేజీబీవీ ప్రత్యేక అధికారిపై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే ఎస్వోపై సస్పెన్షన్ ఎత్తివేయించేందుకు కేజీబీవీలో పనిచేస్తున్న సిబ్బంది ప్రయత్నాలు ప్రారంభించారు. ఈమేరకు విద్యార్థులతో బలవంతంగా తెల్లకాగితంపై సంతకాలు తీసుకుంటున్నారు. దీంతో విద్యార్థుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. ఎస్వోను తిరిగి విధుల్లోకి తీసుకుంటే తాము ఈ పాఠశాల నుంచి వెళ్లిపోతామని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. చికెన్, బిస్కెట్లు పెడతామని.. ఫుడ్ పాయిజన్ తర్వాత పరిస్థితి మారిందని విద్యార్థులు చెబుతున్నారు. చదువుతోపాటు నాణ్యమైన భోజనం పెడుతున్నారని పేర్కొంటున్నారు. అయితే రెండు రోజుల క్రితం పాఠశాలలో పనిచేసే స్వీపర్ కవిత, వంటచేసే సిబ్బంది సుందరమ్మ, సరస్వతి, అనిత బలవంతంగా తెల్లకాగితంపై సంతకాలు చేయించారని విద్యార్థులు చెబుతున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో పాఠశాలలో డ్యూటీ సీఆర్టీ మాత్రమే ఉన్నారు. వీరితోపాటు ఈ సిబ్బంది పనిచేస్తున్నారు. ఒక్కొక్కరిని పిలిచి చికెన్ తింటారా.. బిస్కెట్లు కావాల అని అడిగి 7, 8వ తరగతి విద్యార్థులతో తెల్లకాగితంపై సంతకాలు చేయించుకున్నారు. ఎందుకు సంతకాలు తీసుకుంటున్నారని విద్యార్థులు ప్రశ్నిస్తే మీకు చికెన్, బిస్కెట్లు తెప్పించడానికని వారిని నమ్మించారు. అయితే గతంలో ఎప్పుడూ ఇలా సంతకం పెట్టించలేదని, కొత్తగా ఎందుకు పెట్టిస్తున్నారని మరికొంతమంది అడిగారు. ఈ సిబ్బంది సస్పెన్షన్‌కు గురైన ఎస్వోకు మద్దతుగా సంతకాలు చేయించినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. వీరితోపాటు ఓ దళిత సంఘానికి చెందిన నాయకుడు ఫుడ్‌పాయిజన్ జరిగిన సమయంలో విద్యార్థులకు మద్దతుగా నిలవగా, ప్రస్తుతం ఎస్వోకు మద్దతుగా విద్యార్థులతో సంతకాలు పెట్టించేందుకు ఒత్తిడి తెస్తున్నట్లు పేర్కొంటున్నారు. ‘మీరు రెండు సంవత్సరాలు ఉండి వెళ్లిపోతారు.. పాత టీచర్‌ను తీసుకుంటే మీకేం ఇబ్బంది’ అని విద్యార్థులను ప్రశ్నించారని తెలిపారు. నిబంధనల ప్రకారం కేజీబీవీలోకి ఎవరినీ అనుమతించరాదు. అయినా అక్కడ పనిచేసే సిబ్బందిని బెదిరించి సదరు నాయకుడు క్యాంపస్‌లోనికి వచ్చి విద్యార్థులను బెదిరించినట్లు సమాచారం. తల్లిదండ్రుల ఆందోళన.. కేజీబీవీలో విద్యార్థినిలను ఇబ్బందులకు గురిచేసిన విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం కేజీబీవీ వద్ద ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయులను, అక్కడ పనిచేసే సిబ్బందిని నిలదీశారు. తమకు తెలియకుండా తమ పిల్లలతో తెల్లకాగితంపై ఎందుకు సంతకాలు తీసుకున్నారని నిలదీశారు. తమ పిల్లలకు ఏమైన జరిగితే వారే బాధ్యులని హెచ్చరించారు. ఎస్వోను తిరిగి ఈ పాఠశాలలో తీసుకుంటే తమ పిల్లల్ని ఈ పాఠశాలలో చదివించమని స్పష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు డీఈఓకు ఫిర్యాదు చేశారు. తమ పిల్లల నుంచి బలవంతంగా సంతకాలు తీసుకున్న సిబ్బందిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడ చదువుకోం మా పాత మేడం ఉన్నప్పుడు సరిగా మాకు భోజనం పెట్టేవారు కాదు. నాసిరకం భో జనం, కలుషిత నీరు అందించారు. దీంతో తాము అనారోగ్యం బారిన పడ్డాం. ఫుడ్ పాయిజన్‌తో ఆస్పత్రి పాలయ్యాం. ఆ మేడం సస్పెండ్ అయినప్పటి నుంచి నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. మళ్లీ ఆమె వస్తే మేం ఇక్కడ చదువుకోం. – నిక్షిత, విద్యార్థిని బలవంతంగా సంతకాలు.. రెండు రోజుల కింద స్వీపర్, అటెండర్ నన్ను గేటు దగ్గరికి పిలిచి ఒక తెల్లకాగితంపై సంతకం తీసుకున్నారు. ఎందుకోసమని అడిగితే చికెన్, బిస్కెట్లు ఎంతమంది తింటారనేది రాసుకుంటున్నామని చెప్పారు. వారు ఒత్తిడి చేయడంతో నాకు తోచక సంతకం చేశాను. – ప్రసన్న, విద్యార్థి విద్యార్థులతో మాట్లాడాను కేజీబీవీ విద్యార్థులతో తెల్ల కాగితంపై సంతకాలు తీసుకున్న విషయం నా దృష్టికి వచ్చింది. నేను పాఠశాలకు వెళ్లి విద్యార్థులు, సిబ్బంది, ఉపాధ్యాయులతో మాట్లాడాను. సిబ్బందికి ఈ విషయమై హెచ్చరించాను. ఇలాంటివి మళ్లీ జరిగితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశాను. – ప్రణీత, డీఈఓ, ఆదిలాబాద్ -
ఏసీపీ జయరాం సస్పెన్షన్‌పై అధికారుల విచారణ
సాక్షి,హైదరాబాద్: వనస్థలిపురం ఏసీపీ జయరాం సస్పెన్షన్‌కు కారణమైన భూ వివాదంలో అధికారుల విచారణ కొనసాగుతోంది. బాధితులు డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో రాచకొండ సీపీ కార్యాలయం అధికారులు భూవివాదానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో విచారణా అధికారులు బాధితులతో కలిసి భూమిని పరిశీలించారు. బాచారం సర్వే నెంబర్ 73 నుంచి 101మధ్య సర్వే నెంబర్లలోని 412 ఎకరాల భూమిని పరిశీలించారు. ఔటర్ రింగు రోడ్డుకు ఆనుకొని ఉన్న ఈ భూమి వేల కోట్ల విలువ కలిగి ఉంది. సానా సతీష్ బినామీల ఆధీనంలో ఉన్న 412 ఎకరాల్లో వివాదం చోటు చేసుకుంది. ఇటీవల తప్పుడు కేసులు, బెదిరింపులతో భూమి స్వాధీనం చేసుకొని అక్రమంగా ఫెన్సింగ్ నిర్మాణం చేశారు. కమల ప్రియా ఆటో జనరల్ ఏజన్సీ పేరుతో ఈ వివాదాస్పద భూమిపై భారీ లోన్ కూడా తీసుకున్నారు. కోల్‌కతా ఫైనాన్స్ కంపెనీ నుంచి భారీగా రుణం తీసుకున్న సానా సతీష్ బినామీ కంపెనీ హైపొతికేషన్ పేరుతో ఆ భూముల్లో బోర్డ్ ఏర్పాటు చేశారు. గతంలో టెనెంట్స్‌కు, యజమానులకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ భూమి అసలు యజమానులు పూణేకు చెందిన రాజా ఆనందరావు కుంటుంబ సభ్యులు. దీంతో సాన సతీష్ డాక్యుమెంట్లు నకిలీ అని రంగారెడ్డి కోర్టులో ఆనందరావు వారసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇదే భూమిపై ప్రస్తుతం హైకోర్టులో మరో కేసు విచారణలో ఉంది. ఈ కేసు విషయంలో గతంలో తహశీల్దార్, వీఆర్ఓలపై సస్పెన్షన్ వేటు పడింది. విజయా రెడ్డి అనే తహశీల్దార్ దారుణ హత్యకు గురయ్యారు. ఇప్పుడు వనస్థలిపురం ఏసీపీ జయరాం సస్పెండ్ అయ్యారు. ఈ కేసుపై ప్రస్తుతం స్పెషల్ టీం అధికారులు సమగ్రంగా విచారణ చేస్తున్నారు. పూర్తిగా విచారిస్తే సానా సతీష్‌తో పాటు మరికొందరు పెద్దల పాత్ర ఉంటుందని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్పై వేటు అమీర్‌పేట: ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్.మురళీకృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రేమించిన వ్యక్తి తనను మోసం చేశాడని న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఓ మహిళను ఏసీపీ జయరాం వద్దకు పంపించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడంలో కారకుడయ్యాడని నిర్ధారించిన ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేసినట్లు తెలిసింది. కాగా సానా సతీష్ భూ వివాదంలో ఇటీవల సస్పెన్షన్‌కు గురైన ఏసీపీ జయరాం కార్యాలయంలోనే ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు మురళీకృష్ణను సస్పెండ్ చేశారు. ఎస్ఆర్నగర్ నూతన ఇన్స్పెక్టర్గా నర్సింహారెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇబ్రహీంపట్నం భూములపై సీబీఐ విచారణ జరిపించాలి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అన్యాక్రాంతముతున్న ప్రభుత్వ భూముల విషయంలో ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలని మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాచారం భూ వివాదంతో పాటు ఓ ప్రైవేటు సంస్థ 500 ఎకరాల్లో ఫెన్సింగ్ వేసి కుంటలు, చెరువులను కబ్జా చేసిందని, ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన భూములు ప్రైవేటు పరం అయ్యాయన్నారు. ఈ విషయంలో స్థానిక ఎంఎల్ఏ ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. -
బీజేపీ నేత అంజిబాబు పార్టీ నుంచి సస్పెండ్
సాక్షి, విజయవాడ: మద్యం అక్రమంగా తరలిస్తూ అడ్డంగా దొరికిపోయిన బీజేపీ నేత గుడివాక రామాంజనేయులు అలియాస్ అంజిబాబుపై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆదివారం ఓ లేఖ విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రామాంజనేయుల్ని బీజేపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ నేతలు అక్రమ కార్యకలాపాలు, సంఘ విద్రోహ చర్యలను పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించదని, రామాంజనేయులు వ్యవహరంలో పార్టీ క్రమశిక్షణ సంఘం ఆధ్వర్యంలో తదుపరి చర్యలు కొనసాగుతాయని ఆ పార్టీ పేర్కొంది. కాగా 2019 ఎన్నికల్లో రామాంజనేయులు మచిలీపట్నం ఎంపీ స్థానానికి బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నల్గొండ జిల్లా చిట్యాల నుంచి కారులో అక్రమంగా మద్యం తరలిస్తుండగా ఆయన దొరికిపోయారు. గుంటూరు ఏఈఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిపిన దాడుల్లో రామాంజనేయులు రూ.6 లక్షల విలువైన మద్యం బాటిల్స్‌తో పట్టుబడ్డారు. ఆయనతో పాటు సురేశ్, నరేశ్ అనే ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. (మద్యం అక్రమ రవాణా: బీజేపీ నేత అరెస్ట్) ఇక ఇటీవల కాలంలో ఏపీ బీజేపీ నేతలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ సస్పెన్షన్ వేటుకు గురవుతున్న విషయం తెలిసిందే. పార్టీ నిబంధనలకు విరుద్దంగా మాట్లాడిన వెలగపూడి గోపాలకృష్ణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై బీజేపీ వైఖరి గందరగోళంగా ఉందని వ్యాసం రాసిన బీజేపీ నేత, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు, డాక్టర్ ఓవీ రమణను ఇదివరకే బీజేపీ సస్పెండ్ చేసింది. -
శిరోముండనం కేసులో ఎస్ఐ అరెస్టు
తూర్పు గోదావరి, సీతానగరం (రాజానగరం): దళిత యువకుడిపై అమానుషంగా దాడి చేయడమే కాదు.. స్టేషన్లో శిరోముండనం చేసిన కేసులో ట్రైనీ ఎస్సై ఫిరోజ్‌షాను పోలీసు ఉన్నతాధికారులు అరెస్టు చేశారు. అంతేకాదు అతడితో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లపై నా సస్పెన్షన్ వేటు వేశారు. ఈ కేసులో ఏడుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సీతానగరం మండలంలోని మునికూడలికి చెందిన ఎస్సీ యువకుడు ఇండుగుబిల్లి ప్రసాద్‌కు పోలీస్ స్టేషన్లో ఎస్సై ఫిరోజ్ సమక్షంలోనే తీవ్రంగా కొట్టి, ట్రిమ్మర్‌తో శిరోముండనం చేశారు. వివరాల్లోకి వెళ్లితే.. ఈ నెల 18వ తేదీ రాత్రి 9.30 గంటలకు మునికూడలి వద్ద ఇసుక లారీ ముగ్గళ్లకు చెందిన బైక్‌ను ఢీకొట్టడంతో ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి కాలు విరిగింది. దీంతో అక్కడే ఉన్న కొంతమంది ఎస్సీ యువకులు లారీని అడ్డుకుని డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అదే సమయంలో కారుపై వచ్చిన వైఎస్సార్ సీపీ నాయకుడు, మునికూడలి పంచాయతీ మాజీ సర్పంచ్ భర్త కవల కృష్ణమూర్తి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని, లారీని పంపేయాలనడంతో యువకులు తిరగబడ్డారు. కాలు విరిగి ఉంటే లారీని పంపమంటారేంటని తీవ్ర వాగ్వాదానికి దిగారు. (పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ యువకుడికి శిరోముండనం ) అంతే కాదు వారు కారు అద్దాలను పగలకొట్టారు. ఘర్షణ జరుగుతుందని తెలుసుకున్న అడపా పుష్కరం అక్కడికి చేరుకోగా అతడిని కూడా కొట్టారు. దీంతో పుష్కరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఐదుగురు యువకులు తనను కొట్టడంతో చేయి గూడె జారిపోయిందని, కారు అద్దాలు పగులకొట్టారని ఈనెల 19న ఫిర్యాదు చేశాడు. ఈనెల 20న ఇన్చార్జ్ ఎస్సై షేక్ ఫిరోజ్ షా ఇండుగుమిల్లి ప్రసాద్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి తన సిబ్బందితో కలిసి చేతులు, కాళ్లు, పిరుదులపై తీవ్రంగా కొట్టడమే కాకుండా, ట్రిమ్మర్ తెప్పించి, గెడ్డం, మీసాలు, తల వెంట్రుకలను తొలగించించారు. బాధితుడు ప్రసాద్ తల్లి సత్యవతి స్టేషన్‌కు వచ్చి తన కుమారుడుని విడిచిపెట్టాలని ఎస్సైను కోరగా, ఆమెను కూడా దుర్భాషలాడినట్టు ఆరోపించింది. అనంతరం రాత్రి సమయంలో విడిచిపెట్టడంతో మంగళవారం సమాచారం అందుకున్న దళిత సంఘాలు రంగంలోకి దిగి అర్బన్ ఎస్పీ శేముషీ బాజ్‌పేయ్, నార్త్‌జోన్ డీఎస్పీ సత్యనారాయణరావు, హుమన్‌రైట్స్ వారికి ఫోన్ల ద్వారా సమాచారం అందించారు. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ సత్యనారాయణరావు, సీఐ పవన్‌కుమార్ రెడ్డి, ఎస్సై యామన సుధాకర్ మునికూడలి వెళ్లి విచారణ చేపట్టారు. బాధితుడిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, వైద్యసేవలు అందించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఇన్చార్జ్ ఎస్సైను సస్పెండ్ చేశామని, ఎస్సై, కవల కృష్ణమూర్తితో పాటుగా ఏడుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ సత్యనారాయణరావు తెలిపారు. ‘పోలీసులను ఉద్యోగం నుంచి తొలగించాలి’ తాడితోట: దళిత యువకుడి శిరోముండనం కేసులో సీతానగరం పోలీసులను ఉద్యోగం నుంచి తొలగించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ డిమాండ్ చేశారు. రోడ్డు ప్రమాదం జరగగా ఇండుగుమిల్లి ప్రసాద్ అనే యువకుడిని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి శిరోముండనం చేసిన పోలీసులను సస్పెండ్ చేయడం కాకుండా ఉద్యోగం నుంచి తొలగించి వారిని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబానికి జీఓ నంబర్ 95 ప్రకారం సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ఆదుకోవాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమానుష చర్య : జక్కంపూడి రాజా ఇలాంటి సంఘటనలు జరగడం అమానుషమని, ఇది హేయమైన చర్యని, దీనికి కారణమైన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటారని కాపు కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. మునికూడలిలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సంఘటనతో పార్టీకి సంబంధం లేదని, దళితులకు ఎప్పుడూ పార్టీ పెద్దపీట వేసిందన్నారు. ఇప్పటికే ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారన్నారు. బాధితుడ్ని బొల్లినేని హాస్పటల్లో ఆయన పరామర్శించారు. -
భారత ఐటీపై హెచ్1బీ వీసాల రద్దు ప్రభావం?
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయులకు ఇతర వీసాలతోపాటు హెచ్1బీ వీసాలను అమెరికా రెండేళ్లపాటు రద్దు చేయడంతో భారత్‌కు చెందిన 200 బిలియన్ డాలర్ల ఐటీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురయింది. భారత ఐటీ పరిశ్రమకు 70 శాతం రెవెన్యూ ఒక్క ఉత్తర అమెరికా ప్రాంతం నుంచే రావడం అందుకు కారణం. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వలస కార్మికుల వీసాలపై కొనసాగిన అనిశ్చిత పరిస్థితుల్లో భారతీయ పరిశ్రమ చిన్న చిన్న ప్రత్యమ్నాయాలను అనుసరించిందని, ఇప్పుడు అలాంటి ప్రత్యమ్నాయాలే పరిశ్రమను రక్షించగలవని కొన్ని దిగ్గజ ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి. భారత ఐటీ పరిశ్రమ ‘స్వీయలంబన’ సాధించాల్సిందేనని టెక్ మహీంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ వ్యాఖ్యానించారు. ప్రధానంగా హెచ్1బీ వీసాలపైనే ఆధారపడే పరిస్థితి నుంచి భారతీయ పరిశ్రమ క్రమంగా బయట పడేందుకు ప్రయత్నిస్తోంది. అమెరికాలో అత్యధిక ఉద్యోగులను కలిగిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, అమెరికాలో పది వేల మంది ఉద్యోగులను కలిగిన రెండో పెద్ద సంస్థ ఇన్ఫోసిస్, అజీమ్ ప్రేమ్‌జీ నాయకత్వంలోని విప్రో కంపెనీలు అట్లాంటా, మిచిగాన్ రాష్ట్రాల్లో యూనివర్సిటీల నుంచే క్యాంపస్ సెలక్షన్లను చేపడుతున్నాయి. (హెచ్ 1బీ: భవిష్యత్తుపై మనోళ్ల బెంగ!) ఒక్క టెక్ మహేంద్రనే 2017 సంవత్సరంలోనే దాదాపు రెండువేల మంది అమెరికన్లను నియమించుకుంది. స్థానిక నియామకాలకే ఇప్పుడు కూడా ఆ కంపెనీ ప్రాధాన్యత ఇస్తోంది. భారతీయులకు అమెరికా వీసాలు ఇవ్వడం వల్ల స్వల్పకాలికంగా భారత ఐటీ కంపెనీలు లబ్ది పొందవచ్చునేమోగానీ దీర్ఘకాలికంగా మాత్రం అమెరికా ఆర్థిక వ్యవస్థకే లాభదాయకమని, ఈ విషయాన్ని ఆ దేశం కూడా ఏదో ఒక రోజున గ్రహించక పోదని గుర్నాని అభిప్రాయపడ్డారు. ఒక్క అమెరికాలోనే కాకుండా అమెరికాతో ‘బిజినెస్ ఫ్రెండ్లీ’గా ఉంటోన్న ఇరుగు పొరుగు దేశాలకు కూడా భారత ఐటీ కంపెనీలు విస్తరించాయి. అలా మెక్సికోలో టీసీఎస్, విప్రో కంపెనీలు తమ యూనిట్లను ఏర్పాటు చేయగా, ఇన్ఫోసిస్ కూడా అదే మార్గాన్ని అనుసరించింది. మెక్సికోలో దాదాపు పది ఐటీ దిగ్గజ కంపెనీలు ఉన్నట్లు భారత్‌లోని మెక్సికో రాయబారి మెల్బాప్రియా తెలిపారు. గిగ్ ఎకానమీ బాగా విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాలోకి ఐటీ కంపెనీలకు అవసరమైన నిపుణులు స్థానికంగానే దొరకుతారు. భారత్‌లో కూడా ఐటీ పరిశ్రమ వేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో ఐటీ నిపుణులు అమెరికా వీసాలపైనే ఎక్కువగా ఆశ పెట్టుకోవాల్సిన అవసరం లేదని ‘టాలెంట్ 500 ఏఎన్ఎస్ఆర్’ లాంటి సంస్థలు కూడా అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో జాత్యాహంకార గొడవలు పెరుగుతున్న సమయంలో భారత ఐటీ నిపుణులు వెనక్కి వచ్చేందుకు కూడా ఇష్టపడవచ్చని ఐటీ పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. అమెరికా వీసాల రద్దు పట్ల భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, స్వావలంబన సాధించగలమని వారంటున్నారు. -
అమరావతి ఎస్ఐపై సస్పెన్షన్ వేటు
సాక్షి, గుంటూరు : ప్రేమజంటను బెదిరించి నగదు డిమాండ్ చేయడంతో పాటు, మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన అమరావతి ఎస్ఐ రామాంజనేయులుపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని గుంటూరు రూరల్ ఎస్పీ విజయారావు తెలిపారు. (కోర్కె తీర్చాలంటూ ఎస్ఐ ఒత్తిడి) మరోవైపు లైంగిక వేధింపులకు పాల్పడిన ఎస్ఐ రామాంజనేయులు, అతడి డ్రైవర్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశించింది. వారం రోజుల్లోగా ఛార్జ్‌షీట్ దాఖలు చేసేవిధంగా విచారణ పూర్తి చేయాలని జిల్లా రూరర్ ఎస్పీకి మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశాలు ఇచ్చారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్న ఆమె... ‘దిశ’ చట్టం స్పూర్తితో రాష్ట్రంలో మహిళల భద్రతకు అనేక చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో సాక్షాత్తూ రక్షణగా ఉండాల్సిన పోలీసులు కీచకులుగా మారితే చాలా కఠినంగా వ్యవహరించాలని జిల్లా పోలీస్ అధికారులకు సూచించారు. -
నగరి మున్సిపల్ కమిషనర్‌పై సస్పెన్షన్ వేటు
సాక్షి, అమరావతి : చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. కరోనా నివారణపై ఆయన చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహిత్యంగా ఉన్నాయంటూ ఈ చర్యలు తీసుకుంది. ఈ మేరకు నగరి మున్సిపల్ కమిషనర్‌ను సస్పెండ్ చేస్తూ మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
డాక్టర్ సుధాకర్‌పై సస్పెన్షన్ వేటు
సాక్షి,విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ఉన్నతాధికారులపై తప్పుడు ఆరోపణలు చేసినందుకుగాను డాక్టర్ సుధాకర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో అనస్థీషియా వైద్యుడుగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా ప్రభుత్వంపై బురద జల్లుతూ తప్పుడు ఆరోపణలు చేసినట్లు రుజువు కావడంతో ఉన్నతాధికారులు ఆయనను బుధవారం సస్పెండ్ చేశారు. ఇక డాక్టర్ ఆరోపణలపై క్షేత్రస్థాయిలో వైద్యులతో కూడిన కమిటీని నియమించి ఉన్నతాధికారులు విచారణ జరిపించారు. కాగా గతంలోను డాక్టర్ సుధాకర్ పనితీరుపై, వ్యవహార శైలిపై అనేక ఆరోపణలు ఉన్నాయని అవి పోలీసు కేసు వరకు వెళ్లినట్లు డాక్టర్ల కమిటీ పేర్కొంది. అదే విధంగా టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటికి డాక్టర్ వెళ్లి మూడు గంటల పాటు ఉన్నట్లు సీసీ కెమెరాలలో రికార్డు అయినట్లు కమిటీ వెల్లడించింది. ఇక ప్రభుత్వాన్ని, కరోనా నియంత్రణలో కష్టపడుతున్న వైద్యుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడంలో భాగంగానే కుట్రలు చేసినట్లు కమిటీ నిర్ధారించింది. కమిటీ సిఫారస్సుల మేరకు ఆయనపై పోలీసు కేసు నమోదు చేసి సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. -
కరోనా కాటు : 36 వేల మంది ఉద్యోగులు సస్పెన్షన్
కరోనా వైరస్ సంక్షోభం ఫలితంగా బిజినెస్ ట్రావెలర్ బ్రిటీష్ ఎయిర్వేస్ (బీఏ)భారీ సంఖ్యలో ఉద్యోగులను తాత్కాలికంగా తొలగించనున్నది. సుమారు 36 వేల మంది ఉద్యోగులను సస్పెండ్ చేయాలని భావిస్తోంది. ఈ అంశంపై త్వరలోనే కంపెనీ ఒక నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో యునైట్ యూనియన్‌తో బ్రిటీష్ ఎయిర్వేస్ ఒక ఒప్పందం కుదర్చుకోనుంది. బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన క్యాబిన్ క్రూ, గ్రౌండ్ స్టాఫ్, ఇంజినీర్లు, హెడ్ ఆఫీసులో పనిచేసే దాదాపు 80 శాతం మంది ఉద్యోగుల వరకు విధుల నుంచి తొలగించనుది. అంతేకాదు రానున్న రెండు నెలల్లో సగం జీతానికే (50 శాతం వేతన కోత) పైలట్లు విధులను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి విమానయాన సంస్థ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుందని సమాచారం. మరోవైపు మరో ప్రత్యర్థి సంస్థ వర్జిన అట్లాంటిక్ రాబోయే రోజుల్లో వందల మిలియన్ల పౌండ్ల విలువై ఉద్దీపన కోసం యూకే ప్రభుత్వాన్ని ఆశ్రయించనుందని భావిస్తున్నారు. అయితే యూకే ఆర్థికమంత్రి రిషి సునక్ ఇటీవలమాట్లాడుతూ, విమానయానసంస్థలకు "చివరి ప్రయత్నంగా"సహాయం చేయడానికి మాత్రమే ప్రభుత్వం అడుగులు వేస్తుందని, వాటాదారుల నుండి డబ్బును సేకరించడానికి ప్రయత్నించమని విమానయాన సంస్థలను కోరారు. ఈ విషయంలో "కేసుల వారీగా" నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. కాగా కరోనా కల్లోలం కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలన్నీదాదాపు దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలను రద్దు చేశాయి. బీఏ కంపెనీ కూడా దాదాపు అన్ని విమానాలు సేవలు నిలిపి వేసింది. ప్రపంచ ప్రయాణ ఆంక్షలు, క్షీణిస్తున్న డిమాండ్ విమానయాన సంస్థలు కుదేలవుతున్న సంగతి విదితమే. (కరోనా : ఎయిరిండియా పైలట్లకు షాక్) చదవండి : కరోనా : పాలసీదారులకు గుడ్ న్యూస్ కరోనాపై పోరు : గూగుల్ భారీ సాయం చైనా నగరంలో కుక్క మాంసంపై శాశ్వత నిషేధం -
టీఆర్ఎస్లో భగ్గుమన్న వర్గ విభేదాలు!
సాక్షి, నాగార్జునసాగర్(నల్గొండ): అధికార టీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారని టీఆర్ఎస్ నేత ఎంసీ కోటిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక దీనిపై బుధవారం విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి స్పందిస్తూ.. పార్టీ నుంచి నేతలను సస్పెండ్ చేసే అధికారం పార్టీ అధ్యక్షుడికి మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ రాష్ట్ర పార్టీ బాధ్యులను.. పార్టీ అధ్యక్షుని ఆదేశం మేరకే సస్పెండ్ చేస్తూ వస్తున్నామన్నారు. అక్కడ ఏం జరిగిందన్నది స్పష్టంగా తెలియదని, అసలు విషయం తాను తెలుసుకుంటానని మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. -
ఎస్సై, కానిస్టేబుల్ సస్పెండ్..?
సాక్షి, శంకరపట్నం(మానకొండూర్): కేశవపట్నం ఎస్సై శ్రీనివాస్‌ను సోమవారం పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఆరు నెలల క్రితం జమ్మికుంట పోలీస్‌స్టేషన్ నుంచి ఎస్సై శ్రీనివాస్ బదిలీపై కేశవపట్నం వచ్చారు. గతంలో ఇప్పలపల్లె గ్రామ శివారులో పేకాటలో పట్టుబడిన వారిలో కొందరిపై కేసు నమోదు చేసి, మరి కొందరిని కేసు నమోదు చేయకుండా విడిచిపెట్టారు. ఈ విషయమై ‘పేకాటలో పోలీసుల చేతివాటం’శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. పేకాటలో పట్టుబడిన వారిలో కొందరిని విడిచిపెట్టడంతోపాటు కానిస్టేబుల్ రాజునాయక్ డబ్బులు వసూళ్లు చేసినట్లు ఆరోపణలు వచ్చా యి. సివిల్ తగాదాల్లో తలదూర్చి వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శలు ఉన్నా యి. శంకరపట్నం మండల సర్పంచ్ల ఫోరం ఎమ్మెల్యే, అధికారులకు ఎస్సై శ్రీని వాస్‌పై ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఎస్సై శ్రీనివాస్, కానిస్టేబుల్ రాజునాయక్‌ను సస్పెండ్ చేస్తూ వేటు వేసినట్లు సమాచారం. కరీంనగర్లో పని చేస్తున్న ఓ ఎస్సైకి కేశవపట్నం ఎస్సైగా బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. -
మహేశ్వర్‌రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేశారు?: క్యాట్
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ ట్రైనీ కేవీ మహేశ్వర్‌రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేశారో బుధవారం తెలియజేయాలని కేంద్ర హోం శాఖను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) ఆదేశించింది. తనను అన్యాయంగా సస్పెండ్ చేశారని పేర్కొంటూ మహేశ్వర్‌రెడ్డి క్యాట్‌ను ఆశ్రయించారు. ఈ కేసును మంగళవారం క్యాట్ అడ్మినిస్ట్రేటివ్ మెంబర్ బీవీ సుధాకర్ విచారించి హోం శాఖకు నోటీసులు జారీ చేశారు. అఖిల భారత సర్వీస్ రూల్స్ (డీఅండ్‌ఏ)–1969 ప్రకారం సస్పెండ్ చేయడానికి వీల్లేదని, కేంద్రం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని మహేశ్వర్‌రెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. ఇప్పటికే మహేశ్వర్‌రెడ్డి ఐపీఎస్ శిక్షణ పూర్తి చేశారని, పోస్టింగ్ అందుకోవాల్సిన దశలో నిరాధార ఆరోపణల ఆధారంగా ఆయనను సస్పెండ్ చేశారని చెప్పారు. నిబంధనల ప్రకారం ఓ క్రిమినల్ కేసు పెండింగ్ ఉందని చెప్పి సర్వీస్ నుంచి సస్పెండ్ చేయడానికి వీల్లేదని, అలాంటి కేసుల్లో 48 గంటల పాటు రిమాండ్‌లో ఉన్నప్పుడు మాత్రమే సస్పెండ్ చేయొచ్చని చట్టంలో ఉందన్నారు. భువన అనే యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మహేశ్వర్‌రెడ్డి మోసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో కేంద్రం ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. -
మొయినాబాద్ ఎంపీఓపై వేటు
సాక్షి, రంగారెడ్డి: మొయినాబాద్ మండల పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న ఉషాకిరణ్‌పై వేటు పడింది. ఆమె గతంలో పనిచేసిన చోట నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని తేలడంతో సస్పెండ్ చేస్తూ ఇంచార్జి కలెక్టర్ హరీష్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మొయినాబాద్ మండల పంచాయతీ అధికారిగా పదోన్నతి పొందడానికి ముందు ఉషాకిరణ్.. ఇబ్రహీంపట్నం మండలం పోచారం పంచాయతీ సెక్రటరీగా 2018–19లో విధులు నిర్వర్తించారు. ఈ సమయంలో పంచాయతీ పరిధిలో పన్నుల రూపంలో వసూలైన రూ.7.72 లక్షలను ప్రభుత్వ ఖజానాలో జమచేయకుండా సొంత అవసరాలకు వినియోగించుకున్నట్లు విచారణలో తేలింది. ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించిన ఇంచార్జి కలెక్టర్ ఆమెను సస్పెండ్ చేశారు. అసలు కారణం ఇదేనా..? మొయినాబాద్‌లో మండల పంచాయతీ అధికారిగా తన బాధ్యతలను విస్మరించి అనధికార వెంచర్ల యాజమానులకు సహకరించారనే ఆరోపణలు సైతం ఉషాకిరణ్‌పై వెల్లువెత్తాయి. అనుమతి లేని వెంచర్ల ఏర్పాటుపై చూసీచూడనట్లు వ్యవహరించేందుకు యజమానుల నుంచి భారీగా డబ్బులు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఉన్నతాధికారుల పేర్లను, హోదాను కూడా ఆమె వాడుకున్నట్లు తెలుస్తోంది. మూడు నాలుగు రోజులుగా మొయినాబాద్ మండల పరిధిలో అనధికార లేఅవుట్లను అధికారులు స్పెషల్ డ్రైవ్ పేరిట నేలమట్టం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెపై ఆరోపణలు, అనధికార వెంచర్ల ఏర్పాటులో తన పాత్ర వెలుగులోకి వస్తోంది. ఈ విషయం యంత్రాంగం దృష్టికి వెళ్లడంతో ఆమె తొలుత పనిచేసిన చోటు నుంచి విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఈ క్రమంలో పోచారంలో నిధులు దుర్వినియోగం జరిగినట్లు తేలడంతో ఆ వెంటనే సస్పెండ్ చేసినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఇద్దరు ఎస్ఐలు, కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు
సాక్షి, మచిలీపట్నం: విధి నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఇరువురు ఎస్ఐలు, ఓ కానిస్టేబుల్‌పై జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రవీంద్రనాథ్‌బాబు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ నెల 14వ తేదీన నిర్వహించిన మెగా లోక్ అదాలత్‌లో ఓ కేసులో రాజీ చేసే క్రమంలో బాధితుడిని భయబ్రాంతులకు గురిచేసి పెనుగంచిప్రోలు ఎస్ఐ ఎండీ అష్ఫాక్ భారీగా డబ్బులు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు రావడంతో ఎస్పీ సమగ్ర విచారణకు ఆదేశించగా వాస్తవమని తేలడంతో ఎస్ఐపై చర్యలకు సిఫార్సు చేస్తూ డీఐజీకి నివేదిక సమర్పించారు. అదే విధంగా కైకలూరు టౌన్ పరిధిలోని అయోధ్యపురంలో పేకాట శిబిరంపై జరిపిన దాడిలో 2.10 లక్షల నగదు, ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈకేసులో నిందితులకు సహకరించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొన్న కలిదిండి ఎస్ఐ వై.సుధాకర్, రూరల్ కానిస్టేబుల్ రజనికుమార్ (పీసీ నం.2365)లపై సమగ్ర విచారణ జరిపించి డీఐజీకి నివేదిక సమర్పించారు. డీఐజీ ఆదేశాల మేరకు ఈ ఇరువురు ఎస్ఐలతో పాటు కానిస్టేబుల్లపై సస్పెన్షన్ వేటు వేస్తూ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. అవినీతి రహిత పోలీసింగ్ దిశగా.. పోలీస్ శాఖలో అవినీతి పరులపై జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రవీంద్రనాథ్ బాబు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఏ చిన్న ఆరోపణలు వచ్చినా వెంటనే ఊపేక్షించడం లేదు. పైగా ప్రత్యేకంగా నిఘా బృందాలను ఏర్పాటు చేసుకుని జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లలో రోజువారీ కార్యకలాపై ప్రత్యేక నిఘా ఉంచారు. గతంలో నాగాయలంక పోలీస్ స్టేషన్ పరిధిలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు సహకరించిన కోడూరు ఎస్ఐ ప్రియకుమార్‌ను, అవనిగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట శిబిరం నిర్వహిస్తున్న వారికి సహకరించిన కానిస్టేబుల్ రమే‹ష్‌ను కూడా ఇదే విధంగా సస్పెండ్ వేశారు. అవినీతి రహిత పోలీసింగ్ కోసం ఎస్పీ రవీంధ్ర నాథ్ బాబు తీసుకుంటున్న చర్యల పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. క్రమశిక్షణా రాహిత్యాన్ని ఉపేక్షించేది లేదు పోలీస్ శాఖలో విధి నిర్వహణలో అలసత్వాన్ని గానీ, క్రమశిక్షణా రాహిత్యాన్ని గానీ ఊపేక్షించేది లేదు. పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరిపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేశాం. ప్రత్యేక బృందాలతో ప్రతి ఒక్కరి పనితీరును ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం. అవినీతి రహిత పోలీసింగ్ కోసం కృషి చేస్తున్నాం. – రవీంద్రనాథ్‌బాబు, ఎస్పీ, కృష్ణా జిల్లా -
ఉన్నది పాయో...ఉంచుకున్నది పాయో!
సాక్షి, పెద్దపల్లి: బీ-ఫారం కోసం ఎదురుచూస్తున్న ఆశావహుడికి అనూహ్యంగా సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది. టికెట్ కోసం ఉన్న పార్టీ మారితే కొత్త పార్టీలో గట్టిషాక్ తగిలింది. పార్టీలో చేరిన నెల రోజులు కూడా గడవకముందే ఆ పార్టీ నుంచి వేటు పడింది. మంథని నుంచి బీజేపీ టికెట్ ఆశిస్తున్న కమాన్‌పూర్ జెడ్పీటీసీ మేకల సంపత్‌యాదవ్‌కు విచిత్ర పరిస్థితి ఎదురైంది. అనుచిత వ్యాఖ్యలని.. టీఆర్ఎస్కు చెందిన సంపత్ మంథని నుంచి బీజేపీ టికెట్ ఆశించారు. ఇందుకోసం బీజేపీకి దరఖాస్తు చేసుకున్నారు కూడా. అవకాశం ఇస్తామనే ఖచ్చితమైన హామీతో గత నెల 24వ తేదీన రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ సమక్షంలో టీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. బీజేపీ అభ్యర్థిత్వం తనకే ఖరారైందనే ధీమాతో శుక్రవారం సంపత్ హైదరాబాద్ పార్టీ కార్యాలయానికి కూడా వెళ్లారు. అయితే తనపై అనుచిత వ్యాఖ్యల చేశారనే అభియోగంపై పార్టీ నుంచి కమాన్‌పూర్ జెడ్పీటీసీ మేకల సంపత్‌యాదవ్, మంథని పార్టీ అసెంబ్లీ కన్వీనర్ బోగ శ్రీనివాస్‌లను సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసిపేట లింగయ్య ప్రకటించారు. బీఫారం కోసం వేచి ఉన్న సంపత్‌కు సస్పెన్షన్ ఆర్డర్ రావడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో టికెట్ ఆశించి బీజేపీలో చేరిన జెడ్పీటీసీని ఏకంగా సస్పెండ్ చేయడం కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మంథనిని మాత్రం పెండింగ్‌లో పెట్టింది. ఇటీవల మూడో జాబితా ప్రకటన సందర్భంగా సంపత్‌కు దాదాపు టికెట్ ఖరారైందని మీడియాలో ప్రచారం జరిగింది. జాబితాలో మాత్రం పేరు కనిపించలేదు. కాని బీఫారం తనకే వస్తుందనే ధీమాతో సంపత్ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇరువురి సంభాషణ సాకుగా మేకలపై సస్పెన్షన్ వేటు వేయడంపై కమలంలో కలకలం సృష్టిస్తోంది. కాగా వేరే వ్యక్తికి టికెట్ ఇప్పించుకొనే కుట్రలో భాగంగానే తనను సస్పెండ్ చేశారని సంపత్ యాదవ్ ఆరోపిస్తున్నారు. తన సస్పెన్షన్ చెల్లదంటున్నారు. వివాదం ఇదీ...: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా గత నెలలో కరీంనగర్లో బహిరంగ సభ నిర్వహించారు. సభకు జనాలను తరలించేందుకు పార్టీ అందచేసిన నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ బోగ శ్రీనివాస్, సంపత్ యాదవ్ మాట్లాడుకున్న ఫోన్ రికార్డ్ ఒకటి బయటకు వచ్చింది. నియోజకవర్గానికి కేటాయించిన రూ.6 లక్షలను పార్టీ జిల్లా అధ్యక్షుడు కాసిపేట లింగయ్య ఖర్చు చేయలేదని, టికెట్ ఆశిస్తున్న మరో వ్యక్తియే భరించాడంటూ ఇరువురు మాట్లాడుకున్న సంభాషణ కలకలం సృష్టించింది. దీంతో పార్టీ క్రమశిక్షణను మీరి అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంగా బీజేపీ నుంచి శ్రీనివాస్, సంపత్ యాదవ్‌లను సస్పెండ్ చేస్తూ ‘కాసిపేట’ ఆదేశాలు జారీచేశారు. వ్యాఖ్యల కారణంగానే వేటు... పార్టీనేతల పట్ల అనుచిత వాఖ్యలు చేసినందునే బోగ శ్రీనివాస్, మేకల సంపత్ యాదవ్‌లను బీజేపీ నుంచి సస్పెండ్ చేశాం. ఆయనకు పార్టీ టికెట్, బీ–ఫారం ఇవ్వలేదు. అమిత్‌షా పర్యటనం సందర్భంగా కేటాయించిన నిధుల వ్యవహారంలో, క్రమశిక్షణ రాహిత్యం కారణంగా వేటు వేయాల్సి వచ్చింది. -కాసిపేట లింగయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కుట్రపూరితంగానే సస్పెన్షన్ ఎలాంటి తప్పు చేయకపోయినప్పటికి, కనీసం సంజాయిషీ నోటీసు ఇవ్వకుండా సస్పెండ్ చేశారు. మంథని బీజేపీ అభ్యర్థిగా రాష్ట్ర పార్టీ ప్రకటించిన నేపథ్యంలో నన్ను సస్పెండ్ చేయడం శోచనీయం. పార్టీకి నష్టం కలిగించే వాఖ్యలు ఎక్కడా చేయలేదు. ఇది కేవలం కుట్ర పూరితంగా జరిగిందే. నాపై చర్యతీసుకునే అధికారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికే ఉంది. జిల్లా అధ్యక్షుడు చేసిన సస్పెన్షన్ చెల్లదు. -మేకల సంపత్ యాదవ్, జెడ్పీటీసీ, కమాన్‌పూర్ -
ప్రొఫెసర్ బాబులుపై సస్పెన్షన్ వేటు
సాక్షి, కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా జేఎన్టీయూ-కే ఎంటెక్ విద్యార్థినులను లైంగికంగా వేధించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ బాబులుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు జేఎన్టీయూ-కే వీసీ వీఎస్ఎస్.కుమార్ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. మూడు రోజులుగా ఈ వ్యవహారంపై వివాదం చెలరేగి విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేయడం, మహిళా కమిషన్ జోక్యం చేసుకోవడం, విచారణ కమిటీ ఏర్పాటైన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ప్రొఫెసర్ బాబులుపై విద్యార్థులు ఇచ్చిన లేఖ ఆధారంగా రిజిస్ట్రార్ సుబ్బారావు కాకినాడ సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై 254, 254ఎ, 509 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసినట్లు సీఐ చైతన్య కృష్ణ చెప్పారు. త్వరలోనే ప్రొఫెసర్‌ను అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. -
ఎమ్మెల్సీ వెంట వెళ్లేదెవరో.!
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి సస్పెన్షన్ వ్యవహారం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని కోరుతూ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారం హైదరాబాద్‌లో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ప్రత్యేకంగా సమావేశమై ఏకగ్రీవంగా తీర్మానించిన విషయం విదితమే. ఈ లేఖను జిల్లా పార్టీ వ్యవహారాల ఇన్చార్జి తుల ఉమ సీఎం కేసీఆర్‌కు అందజేశారు. ఈ మేరకు భూపతిరెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తే టీఆర్ఎస్ను విడిచి వెళ్లేవారు ఎవరుంటారనే అంశంపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఆయన ప్రధాన అనుచరులు ఎవరు., ఏ మేరకు ప్రభావం పడుతుంది అనే అంశాలపై ఇంటలిజెన్స్ అ ధికారులు వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. కాగా సస్పెన్షన్‌పై జిల్లా ప్రజాప్రతినిధుల నిర్ణయం నేపథ్యంలో భూపతిరెడ్డి సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నం చేసినట్లు పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది. సీఎం నిర్ణయంపై ఉత్కంఠ భూపతిరెడ్డి సస్పెన్షన్‌కు సంబంధించి అధినేత కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చి న లేఖ మేరకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తు న్నట్లు సీఎం ప్రకటిస్తారా? లేక పార్టీ క్రమశి క్షణ సంఘానికి సిఫార్సు చేస్తారా అనే అం శంపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. గు రువారం సీఎం కేసీఆర్ నిర్ణయం వెలువడుతుందని భావించినప్పటికీ ప్రకటన రాలేదు. దీంతో ఈ ఉత్కంఠ రెండు, మూడు రోజులు కొనసాగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ తరలివెళ్లిన అనుచరులు.. విషయం తెలుసుకున్న భూపతిరెడ్డి అనుచరవర్గం హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లి కలుసుకున్నారు. రూరల్ నియోజకవర్గానికి చెందిన పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు భూపతిరెడ్డిని కలిశారు. డీఎస్, బాజిరెడ్డిల మధ్య కూడా ఆధిపత్య పోరు.. రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాజిరెడ్డికి, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి మధ్యే కాకుండా, రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్తోనూ ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం విదితమే. డీఎస్ ప్రతిపాదించిన శ్మశాన వాటికల నిర్మాణం పనులకు బాజిరెడ్డి అనుచరవర్గం ఎంపీపీలు తీర్మానం చేయకుండా అడ్డుకున్న విషయం ఇటీవల ఈ నేతల మధ్య ఆధిపత్యపోరును రచ్చకీడ్చింది. గతంలో బాజిరెడ్డి ప్రతిపాదించిన ఉపాధి హామీ పనులను తీర్మానం చేయకుండా డీఎస్ అనుచర ఎం పీపీ అడ్డుకున్న విషయం విదితమే. ఇప్పుడు భూపతిరెడ్డిపై సస్పెన్షన్ వ్యవహారం కొనసాగుతున్న నేపథ్యంలో డీఎస్ వర్గీయుల వ్యవహార శైలి ఆసక్తికరంగా మారింది. క్రమశిక్షణ తప్పినందుకే.. ♦ ఎమ్మెల్సీ భూపతిరెడ్డిని సస్పెండ్ చేయాలని తీర్మానించాం ♦ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇందూరు (నిజామాబాద్ అర్బన్): క్రమశిక్షణ తప్పినందుకే ఎమ్మెల్సీ భూపతిరెడ్డిని సస్పెండ్ చేయాలని ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులందరం తీర్మానం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపినట్లు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గురువారం ప్రగతిభవన్‌లో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న మంత్రి అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇచ్చిన పదవిని, గౌరవాన్ని కళ్లకు అద్దుకొని కాపాడుకోవాలని.. ఆ విధంగా భూపతిరెడ్డి నడుచుకోలేదన్నారు. ఎంత ఎదిగితే అంత ఒదగాలని పెద్దలు చెప్పారని అన్న మంత్రి మితిమీరితే ఎం తటివారైన సరే వారిపై చర్యలు తప్పవన్నారు. ఒకసారి పొరపాటు జరిగితే దా నిని సరిదిద్దుకోవలే తప్ప మళ్లీ మళ్లీ చేయడం ప్రభుత్వానికి, పార్టీకి, ప్రజలకు, కార్యకర్తలకు ఇబ్బంది వస్తుందన్నారు. భూపతిరెడ్డికి సీఎంతో పాటు తాను, ఎం పీ, ఎమ్మెల్యేందరూ పిలిపించుకుని చెప్పినప్పటికీ ఆయన వైఖరి మారలేదన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో సంబంధిత ఎమ్మెల్యేకు తెలియకుండా కార్యక్రమాలు నిర్వహించడం, వ్యవహారాల్లో తలదూర్చడం వల్ల అక్కడ గ్రూపు లు ఏర్పడ్డాయన్నారు. ఇది సంప్రదాయం కాదన్నారు. పార్టీ సూచనలు పాటించకుండా పదవులు ఉన్నాయని ఆహంకారంతో భిన్నంగా, విరుద్ధంగా వెళ్లిన వారు ఎవరైనా సరే పార్టీకి, ప్రభుత్వానికి అతీతులు కారని మంత్రి స్పష్టం చేశారు. -
నేనెలాంటి తప్పు చేయలేదు...అయినా..
సాక్షి, అమరావతి : అమరావతి: ఇరిగేషన్ శాఖలో సెక్షన్ ఆఫీసర్ వెంకట రామిరెడ్డి సస్పెన్షన్‌పై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వెంకట్రామిరెడ్డిపై బుధవారం సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సస్పెన్షన్‌కు గురైన వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ...‘నేనెలాంటి తప్పు చేయకపోయినా సస్పెండ్ చేశారు. ఎలాంటి విచారణకు అయినా సిద్ధం. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. 50 ఏళ్లకే ఉద్యోగుల పదవీ విరమణ ఆలోచన లేదని చెప్పారు. లేని జీవోని దొంగిలించానని నాపై సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెన్షన్‌పై స్పందించాలని సచివాలయ ఉద్యోగ సంఘాన్ని కోరాం. వాళ్లు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. రెండు రోజుల్లో చెబుతామన్నారు. ఉద్యోగుల సంఘం నిర్ణయాన్ని బట్టి ఏం చేయాలో ఆలోచిస్తాం.’ అని అన్నారు. ఉద్యోగుల్లో అభద్రతా భావం... హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులు అభద్రతతో ఉన్నారని ఏపీ సచివాలయం ఉద్యోగిని భావన అన్నారు. ఏకపక్షంగా ఉద్యోగులను సస్పెండ్ చేయడం సరికాదన్నారు. ఉద్యోగుల్లో అభ్రదతా భావం తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఉద్యోగుల సంఘం స్పందనను బట్టి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. ఈ చర్యపై ఏపీ సచివాలయం మూడో బ్లాక్ వద్ద బుధవారం సాయంత్రం కొందరు ఉద్యోగులు నిరసనకు ప్రయత్నించారు. అయితే, సచివాలయంలో ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదని సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణపై వారంతా మండిపడ్డారు. సచివాలయం ఉద్యోగుల అసోసిషన్ వద్ద భవిష్యత్ కార్యచరణ పై చర్చలు జరిపారు. ఉద్యోగుల నిరసనతో ఎట్టకేలకు వారిని కలిసేందుకు మురళీకృష్ణ ముందుకొచ్చారు. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులతో మురళీకృష్ణ చర్చలు సాగిస్తున్నారు. నేను ఏ తప్పు చేయలేదు..విచారణకు నేను సిద్ధం -
రోజా సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
న్యూఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఏపీ అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఎమ్మెల్యే రోజా రాసిన లేఖను స్పీకర్‌కు పంపామని ఆమె తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ న్యాయస్థానం దృష్టికి తీసుకు వచ్చారు. అయితే ఆ లేఖ తమకు అందలేదని అసెంబ్లీ తరఫు న్యాయవాది చెప్పడంతో ధర్మాసనం ఆ లేఖను కోర్టులోనే ఇప్పించింది. లేఖను సంబంధిత శాఖలకు పంపించి, తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాదికి సూచించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘చిత్రం’పై చిక్కిన అర్చకుడు, సస్పెన్షన్ వేటు
భద్రాచలం: భద్రాచలం రామాలయ అర్చకుడు మధుసూదనాచార్యులుపై సస్పెన్షన్ వేటు పడింది. రామాలయం గర్భగుడిలో మూలవిరాట్ ఫొటోలను తీసిన అర్చకుడిని దేవస్థానం అధికారులు గుర్తించారు. అతనిపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు సరైన పర్యవేక్షణ చేయకపోవడంతోనే ఇలా జరిగిందని భావించి ఆలయ ప్రధాన అర్చకుడితో పాటు మరో ముఖ్య అర్చకుడిని సంజాయిషీ కోరుతూ ఆలయ ఈఓ ప్రభాకర్ శ్రీనివాస్ బుధవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. గర్భగుడిలోని మూలవరులను సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీసి బయటికి పంపించడంతో అవి సామాజిక మాధ్యమాల్లో విస్త్రతంగా చక్కర్లు కొట్టాయి. దీనిపై పత్రికలలో వార్తలు రావడంతో స్పందించిన ఈఓ విచారణకు ఆదేశించారు. ఆలయ సూపరింటెండెంట్ భవాని రామకృష్ణ దీనిపై విచారణ చేపట్టారు. గర్భగుడిలోని మూలవరులకు బెంగుళూరుకు చెందిన భక్తుడు బంగారు ఆభరణాలు సమర్పించగా వాటిని శుక్రవారం రోజున అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇప్పటి వరకు మూడు శుక్రవారాలలో మాత్రమే స్వామి వారికి బంగారు కవచాలను అలంకరించగా, ఆయా రోజుల్లో గర్భగుడిలో విధులను నిర్వహించిన అర్చకుల నుంచి విచారణ అధికారి భవాని రామకృష్ణ వివరాలను రాబట్టారు. మూడు శుక్రవారాలలో స్వామి వారి అలంకరణను నిశితంగా పరిశీలించారు. కాగా సెల్ఫోన్లో బయటకు వచ్చిన ఫొటోలు ఈనెల 16న తీసినట్టుగా గుర్తించారు. ఆ రోజు ఆలయ విధుల్లో ఉన్న మదన్‌మోహనాచార్యులు గర్భగుడిలో మూలవరుల మూర్తులను సెల్‌ఫోన్ ద్వారా తీసినట్లు వెల్లడయింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఈఓ ఆయనపై సస్పెన్షన్ వేటు విధించారు. అర్చకుల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ప్రధాన అర్చకుడు, మరో ముఖ్య అర్చకుడు ఈ విషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని భావించి.. ఇందుకు గల కారణాలపై వివరణ కోరుతూ సంజాయిషీ నోటీసు జారీ చేశారు. ఎంతో పవిత్రంగా భావించే స్వామి వార్ల మూలవరుల ఫొటోను అర్చకుడే సెల్‌ఫోన్ ద్వారా తీసి సామాజిక మాధ్యమాల్లో ఇతరులకు పంపించటంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి పరిణామాలు మరోసారి జరగకుండా దేవస్థాన అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. -
చేయని తప్పుకు రోజాకు 14 నెలలు శిక్షా?
-
చేయని తప్పుకు రోజాకు 14 నెలలు శిక్షా?
విజయవాడ: చేయని తప్పుకు ఎమ్మెల్యే రోజాను శాసనసభ నుంచి సస్పెండ్ చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి అన్నారు. మహిళల సమస్యలపై నిలదీస్తున్న రోజా గొంతు నొక్కాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆమె శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కొత్త రాజధానిలో తెలుగుదేశం ప్రభుత్వం కొత్త సంప్రదాయాలకు తెర తీస్తోంది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్షానికి సభలో మాట్లాడటానికి అవకాశం ఇస్తుందని భావించాం. అయితే ప్రతిపక్ష నేతపై ఏ రకంగా వ్యక్తిగత విమర్శలు చేస్తోందో గమనించే ఉంటారు. సమస్యలను లేవనెత్తితే...ఆ అంశాలను పక్కదాని పట్టించేందుకు ప్రభుత్వం వ్యక్తిగత దూషణలకు దిగుతోంది. ఎమ్మెల్యే రోజాపై మరో ఏడాదిపాటు సస్పెన్షన్ కొనసాగించాలని ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు చేయడం దారుణం. చేయని తప్పుకు రోజా 14 నెలలు శిక్ష అనుభవించారు. మళ్లీ కొత్తగా ఎమ్మెల్యే అనిత అంశాన్ని తెరమీదకు తెచ్చి మరో ఏడాది సస్పెండ్ చేయాలని చూడటం దారుణం. రోజా చేసిన తప్పేంటి?. టీడీపీ సర్కార్ హయాంలో ఎమ్మార్వో వనజాక్షిపై దాడి, రితేశ్వరి ఆత్మహత్యం అంశం, కాల్‌మనీ దారుణాలపై అసెంబ్లీ సాక్షిగా నిలదీశారనే కక్షపూరితంగా సస్పెండ్ చేశారు. తాజాగా అనంతపురం జిల్లాలో పయ్యావుల కేశవ్ వర్గం ఓ మహిళపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆ అంశాన్ని నిలదీసిందుకా? లేక విశాఖలో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తామంటే అడ్డుకున్నందుకా రోజాను సస్పెండ్ చేసింది. రోజాను చూస్తే చంద్రబాబుకు ఎందుకంత భయం?. దళితల కోసం ఏనాడు పోరాటం చేయని అనితా ఈరోజు రాజకీయ మైలేజ్ కోసం రోజాను ఇరికిస్తున్నారు. హత్య చేసిన ఖూనీకోరుకు ఒకేసారి శిక్షవేస్తారు. అలాగే దోషికి శిక్ష విధించేటప్పుడు చివరి కోరిక అడుగుతారని... అలాంటిది ఏకపక్షంగా సస్పెన్షన్ చేసిన రోజాను... ప్రభుత్వం వివరణ అడగకపోవడం మహిళగా సిగ్గుపడుతున్నా. మహిళల పట్ల ప్రభుత్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు.’ అని అన్నారు. -
తుదినిర్ణయం సభకే వదిలేసిన ప్రివిలేజ్ కమిటీ
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను మరో ఏడాదిపాటు సస్పెండ్ చేయాలని ప్రివిలేజ్ కమిటీ సిఫార్స్ చేసింది. అయితే సస్పెన్షన్ విషయంలో తుది నిర్ణయాన్ని సభకే వదిలిపెట్టినట్టు ప్రివిలేజ్ కమిటీ తెలిపింది. ఈ మేరకు ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌పై స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గురువారం ప్రివిలేజ్ కమిటీ 62 పేజీల నివేదిక అందజేసింది. దీనిపై సోమవారం అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. కాగా అనుచితంగా ప్రవర్తించారంటూ గతంలో ఎమ్మెల్యే రోజాను శాసనసభ నుంచి ఏడాది పాటు స్పీకర్ సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే. ఈ సస్పెన్షన్ డిసెంబర్లోనే ముగిసింది. -
12 మంది వ్రత పురోహితుల సస్పెన్షన్
అన్నవరం దేవస్థానంలో కలకలం అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో 12 మంది వ్రత పురోహితులను ఈఓ కె. నాగేశ్వరరావు మంగళవారం సస్పెండ్ చేశారు. కోడ్ ఆఫ్ కాండక్ట్ పాటించకపోవడం, వి«ధులకు గైర్హాజరవడం వంటి అభియోగాలపై ఈ చర్య తీసుకున్నారు. దేవస్థానంలో ప్రతి పురోహితుడు విధిగా కట్టు, బొట్టు, శిఖ ధరించాలని 2 నెలల క్రితం ఈఓ ఆదేశించారు. కొంతమంది వ్రత పురోహితులు దీనిని పాటించడంలేదు. దీంతో అన్ని వ్రత మండపాలకూ ఈఓ మంగళవారం తిరిగి ఆ పురోహితులను గుర్తించి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా రు. సస్పెండైన పురోహితులు వారంలోగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. -
‘చేతులు చాచకుండా బతకలేరా?’
హైదరాబాద్: పౌరసరఫరాల శాఖలోని అధికారులు, సిబ్బంది, రిటైర్డ్ ఉద్యోగులపై వస్తున్న విమర్శలు, అవినీతి ఆరోపణలపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ తీవ్రంగా స్పందించారు. క్వాలిటీ కంట్రోల్ విభాగంలో పనిచేస్తున్న నలుగురు తాత్కాలిక ఉద్యోగులపై ఆయన వేటు వేశారు. పదవీ విరమణ తర్వాత తాత్కాలికంగా ఉద్యోగం చేస్తున్న ఎంఎస్ఏ సలీం (కరీంగనర్), జె.భాస్కర్‌రెడ్డి(నల్లగొండ), వి.వెంకటరమణ (ఖమ్మం), ఎం.బాల్‌రెడ్డి (రంగారె డ్డి)లపై ఆయన సస్పెన్షన్ వేటు వేశారు. తీరు మారకుంటే రెగ్యులర్ ఉద్యోగులపైనా చర్యలు తప్పవని సీవీ ఆనందర్ హెచ్చరించారు. శుక్రవారం పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో జిల్లా మేనేజర్లు, టెక్నికల్ సిబ్బందితో సమావేశమైన ఆయన ధాన్యం కొనుగోళ్లపై చర్చించారు. ‘కార్పొరేషన్ జీతాలు ఇస్తున్నా.. చేతులు చాచకుండా పనిచేయాలేరా.. మీకు ఇదేం రోగం’ అని మండిపడ్డారు. ఒకవైపు కఠినంగా ఉంటున్నామంటుంటే టెక్నికల్ సిబ్బంది ఏకంగా మిల్లర్ల నుంచి పర్సెంటేజీలు పెంచుకుంటూ పోతున్నారా అని నిలదీశారు. ‘ కనీసం 30శాతం మిల్లర్లతో మీరు కుమ్మక్కయ్యారు. ప్రతీ 270 క్వింటాళ్లకు ఒక రేటు ఫిక్స్ చేశారు. మీరెవరెవరు ఏం చేస్తున్నారో, ఎవరెవరి దగ్గర ఎంతెంత తీసుకుంటున్నారో నా దగ్గర ఏసీబీ, విజిలెన్స్, ఇంటలిజెన్స్ నివేదికలు ఉన్నాయి. ఇకపై మీ పద్దతులు మార్చుకోవాల్సిందే..’ అని కమిషనర్ హెచ్చరించారు. పౌరసరఫరాల శాఖ ప్రభుత్వానికి కీలకమైనదని, నిజాయితీగా పనిచేస్తున్న మిల్లర్లను కూడా కొందరు ఉద్యోగులు వదలడం లేదని, తప్పులు చేసే వారిని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ‘ కార్పొరేషన్‌ను చంపకండి. బతికించుకోండి. హౌసింగ్ కార్పొరేషన్ పరిస్థితి కళ్ల ముందే కనిపిస్తోంది కదా..? అ పరిస్థితిని మీరు కొనితెచ్చుకుంటే ఎలా? మిల్లర్ల దగ్గర చేతులు చాపకండి.. వారితో డిన్నర్లు, లంచ్‌లు చేయకండి.. నిజాయితీ పరులను పీడించకండి..’ అని హితవు పలికారు. -
ఉపాధ్యాయుడి సస్పెన్షన్
మండల సాధన దీక్షకు సంఘీభావం తెలిపినందుకు చందుర్తి: చందుర్తి మండలం రుద్రంగిని మండల కేంద్రంగా ప్రకటించాలని ఉద్యమంలో పాల్గొన్న ఉపాధ్యాయుడు అంబటి శంకర్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి సస్పెండ్ చేస్తూ ఉత్వర్తులను జారీ చేసినట్లు రుద్రంగి జిల్లా పరిషత్ ఉన్నత పాuý శాల ప్రధానోపాధ్యాయుడు పాడురంగం తెలిపారు. రుద్రంగికి చెందిన శంకర్ పాఠశాలకు సెలవుపెట్టి గ్రామస్తులతో కలిసి మండల సాధన ఉద్యమంలో పాల్గొన్నారు. దీనిని తీవ్రంగా పరిగణించిన జిల్లా విద్యాధికారి శ్రీనివాసాచారి అతడిని సస్పెండ్ చేశారు. అయితే దీనిని గ్రామస్తులు తీవ్రంగా పరిగనిస్తున్నారు. సోమవారం ఆందోళన చేపట్టేందుకు జేఏసీ నాయకులు సిద్ధమవుతున్నారు. దళిత సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు డీఈవో తీరూను తప్పుపట్టాయి. -
కాసిపేట గని సర్ధార్‌పై సస్పెన్షన్ వేటు
కాసిపేట : మందమర్రి ఏరియా కాసిపేట గనిలో సర్ధార్ సారం శంకరయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. బుధవారం పది రోజుల సస్పెండ్ ఉత్తర్వులు అందించి ఒక్కరోజు గడవగానే సస్పెన్షన్ ఆర్డర్ రద్దు చేశారు. సూపర్వైజర్, ఇంజినీర్లకు హెచ్చరికలతో వదిలి సర్ధార్‌ను సస్పెండ్ చేయడం మానసికంగా వేధించడమేనని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 15న గనిలో స్టార్టర్ మీదపడి కోట శ్రీనివాస్ అనే ఎలక్ట్రీషీయన్ కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి. మొదట సాధారణ గాయాలు అని సరిపెట్టుకున్న అధికారులు పరిస్థితి తీవ్రంగా ఉండి శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో ఆపరేషన్ కావడంతో విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలున్నాయి. సిబ్బంది కేటాయింపు పనుల పర్యవేక్షణలో సూపర్వైజర్, ఇంజినీరింగ్ అధికారుల బాధ్యత ఉండగా కేవలం సర్ధార్లను బలిచేయడం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. వేధింపులు మానుకోవాలి సింగరేణిలో అధికారులు, సూపర్వైజర్లు సర్ధార్‌లు, ఓర్మెన్లపై వేధింపులు మానుకోవాలని హెచ్ఎమ్మెఎస్ ఏరియా ఉపాద్యక్షుడు బోనాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ డిస్ట్రిక్ సర్దార్ పరిధిలో టెండల్, జనరల్ మజ్ధూర్, టింబర్‌మెన్, సఫోర్ట్మెన్, కోల్‌కట్టర్, ఎలక్ట్రీషీయన్, హాలర్ డ్రైవర్స్, ఎస్‌డీయల్ అపరేటర్స్, పుషర్స్, హెల్ఫర్స్, షార్ట్ ఫైరర్, ట్రామర్, బెలన్మజ్ధూర్ వివిధ విభాగాలకు చెందిన కార్మికులు వివిధ పనిస్థలాల్లో పనిచేస్తుంటారన్నారు. ఎవరికి ఏం జరిగిన సర్ధార్‌ను బాధ్యడిని చేయడం సరికాదన్నారు. సంభంధం లేని విషయంలో కాసిపేటగనిలో ఎలక్ట్రీషియన్‌కు గాయాలు కాగా సర్ధార్‌ను సస్పెండ్ చేయడం దారుణమన్నారు. -
కీచక టీచర్ల సస్పెన్షన్
కోరుట్ల: మండలంలోని చినమెట్‌పల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థినుల వేధించిన ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, హిందీ ఉపాధ్యాయుడు రాజేశంను డీఈవో శ్రీనివాసాచారి శనివారం సస్పెండ్ చేశారు. కొంత కాలంగా పాఠశాలలో చదువుతున్న 8, 9, 10వ తరగతి విద్యార్థినులతో ఈ ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు పది రోజుల క్రితం చినమెట్‌పల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో జగిత్యాల డిప్యూటీ డీఈవో జగన్మోహన్రెడ్డి విచారణ జరిపారు. అనంతరం నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారికి అందించారు. నివేదిక ప్రకారం డీఈవో ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
అల్కా లంబా అధికార ప్రతినిధి హోదాపై వేటు
న్యూఢిల్లీ: ఎమ్మెల్యే అల్కా లంబా అధికార ప్రతినిధి హోదాపై ఆమ్ ఆద్మీ పార్టీ రెండు నెలల పాటు సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ అధికార పార్టీ ప్రతినిధి హోదా నుంచి ఆమెను రెండు నెలలపాటు తప్పిస్తూ ఆప్ గురువారం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా రవాణా శాఖమంత్రి పదవి నుంచి గోపాల్ రాయ్ తప్పుకున్న నేపథ్యంలో రిలీవ్ అయ్యారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇక తన సస్పెన్షన్‌పై అల్కా లంబా స్పందిస్తూ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. ఒకవేళ తెలియక తప్పుగా మాట్లాడి ఉంటే వాటిని వెనక్కి తీసుకుంటానని ఆమె ట్విట్ చేశారు. కాగా ఢిల్లీ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి గోపాల్ రాయ్ రెండు రోజుల క్రితం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాల రీత్యా తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. దీంతో గోపాల్ రాయ్ మంత్రిత్వ శాఖ బాధ్యతలను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో మంత్రి సత్యేంద్ర జైన్‌కు అప్పగించారు. కాగా బస్సుల కుంభకోణంలో గోపాల్ రాయ్ పై ఆరోపణలు రాగా దీనిపై విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. -
పోలీస్ ఠాణాలో ప్రేమికుల ఆత్మహత్య!
రాంచి: జార్ఖండ్ లోని పోలీసుల అదుపులో ప్రేమికుల జంట ఆత్మహత్య కలకలం రేపింది. పోలీసుల అదుపులో ఉన్న ముస్లిం యువకుడు, హిందూ యువతి అనుమానాస్పద స్థితిలో మరణించారు, రాంచీలోని అర్గోరా పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఘటన చోటు చేసుకుంది. ఈ జంట ఆత్మహత్యలపై పలు అనుమానాలు నెలకొన్నాయి. గొడ్డాజిల్లాకు చెందిన ముస్లిం వ్యక్తి మహమ్మద్ గఫర్, హిందూ మతానికి చెందిన అమ్మాయి (15) నెలన్నర క్రితం పారిపోయి మతాంతర వివాహం చేసుకున్నారు. దీంతో తమ కూతురుని కిడ్నాప్ చేసి, పెళ్లి చేసుకున్నాడంటూ అమ్మాయి తరపు కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అంతకుముందే గఫర్ కు వివాహమైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ జంటను అదుపులోకి తీసుకున్న పోలీసులు రాంచీలోని అర్గోరా పోలీస్ స్టేషన్ లో వుంచారు. ఏం జరిగిందో తెలియదుకానీ తెల్లవారేసరికి ఇద్దరూ శవాలై తేలారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించిన అధికారులు విచారణ చేపట్టారు. అటు గుర్తు తెలియని విషపదార్థం సేవించడం వల్లనే చనిపోయి వుంటారని తమ ప్రాథమిక విచారణలో తేలిందని రాంచీ ఏఎస్పీ కులదీప్ ద్వివేది తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై విచారణకు ఆదేశించామన్నారు. ఈ ఘటనలో ఒక మహిళా ఏఎస్ఐ సహా ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశామని అధికారి తెలిపారు. -
రోజా సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధం
శాసనసభ స్పీకర్ కోడెలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ తక్షణమే సస్పెన్షన్ ఉపసంహరించాలని విజ్ఞప్తి * ఈ సస్పెన్షన్ బిజినెస్ రూల్స్‌కి కూడా విరుద్ధం * 340 నిబంధనకు వక్రభాష్యం చెబుతున్నారు.. * చట్టసభల్లో నిబంధనల అతిక్రమణలు విచారణార్హమే * సాక్షాత్తూ సుప్రీంకోర్టే అనేకమార్లు చెప్పింది.. * ప్రజాస్వామ్యంలో ఎవరి అధికారమూ తిరుగులేనిది కాదు.. * లోక్‌సభలో పెప్పర్‌స్ప్రే ఘటన రోజు ఏం చేశారు? * న్యాయస్థానాలు ప్రశ్నించేలా మన నిర్ణయాలుండరాదు * శాసనసభ ఔన్నత్యానికి భంగం కలగరాదు... * అదే జరిగితే అదో విషాద దినం... వైఎస్సార్సీపీ శాసనసభ్యురాలు ఆర్.కె.రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం చెల్లదని, ఆమె సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధం, చట్ట వ్యతిరేకం కనుక తక్షణమే ఉపసంహరించాలని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జగన్ మంగళవారం స్పీకర్‌కు ఒక లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన రోజాను సస్పెండ్ చేయడం నిబంధనలకు ఎలా విరుద్ధమో వివరించారు. పార్లమెంటు ఉభయసభలు పాటిస్తున్న నియమనిబంధనలు, గతంలో ఇలాంటి సందర్భాలలో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు వంటి అంశాలన్నింటినీ నివేదించారు. చట్టసభలు న్యాయస్థానాల పరిధిలోకి రావంటూ శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యల అసంబద్ధతను కూడా జగన్ ఎత్తి చూపారు. స్పీకర్‌ను ఉద్దేశించి జగన్మోహన్రెడ్డి రాసిన లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గారికి.. ‘‘ఇటీవల ముగిసిన శాసనసభా సమావేశాల్లో మా ఎమ్మెల్యే ఆర్.కె.రోజాను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బిజినెస్ రూల్స్ 340(2) ప్రకారం ఒక ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ తీర్మానం ఆమోదించిన సంగతి తెల్సిందే. రూల్ 340 ఏం చెబుతున్నదంటే... 1)ఒక సభ్యుడు పదే పదే సభాపతిని అగౌరవపరుస్తూ, సభా నిబంధలను అదే పనిగా ఉల్లంఘిస్తూ, ఉద్దేశపూర్వకంగానే సభా కార్యక్రమాలకు భంగం కలిగిస్తున్నట్లుగా స్పీకర్ భావించినపుడు... 2) అలా వ్యవహరిస్తున్న సభ్యుడి సస్పెన్షన్ తీర్మానం తన ముందుకు వచ్చినపుడు ఆ శాసనసభా సమావేశాల్లో తదుపరి మిగిలి ఉన్న కాలానికి ఆ సభ్యుడిని సభా కార్యక్రమాల్లో లేకుండా స్పీకర్ సస్పెండ్ చేయవచ్చు. అయితే ఆ సభ్యుడి సస్పెన్షన్‌ను ఆ తదుపరి ఎప్పుడైనా ఉపసంహరిస్తూ మళ్లీ తీర్మానం చేసే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. 3) అలా సస్పెండ్ అయిన సభ్యుడు ఈ నిబంధన కింద శాసనసభ ప్రాంగణం నుంచి వెళ్లి పోవాల్సి ఉంటుంది’ సభా నియమాలు ఇంత స్పష్టంగా ఉన్న నేపథ్యంలో... 340 నిబంధన కింద ఒక సభ్యుడి సస్పెన్షన్‌కు తీర్మానం వచ్చినపుడు అది సభా నియమాలకు లోబడి ఉన్నదా అనేది స్పీకర్ కచ్చితంగా పరిశీలించాలి. ఒక వేళ అది సభా నియమాలకు లోబడి లేనట్లయితే అలాంటి తీర్మానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ స్పీకర్ అనుమతించకూడదు. సభలోని వంద శాతం సభ్యులు ఆమోదిస్తారని భావించినా కూడా ఇలాంటి అక్రమమైన తీర్మానాన్ని చేపట్టకూడదు. దురదృష్టకర సంఘటన.. బ్లాక్‌డే.. డిసెంబర్ 2015, 18వ తేదీ నాటి ఆంధ్రప్రదేశ్ శాసనసభా కార్యక్రమాల రికార్డులను చూస్తే... శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు 340 నిబంధనను అనుసరించి రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రతిపాదించారు. (వాస్తవానికి ఈ నిబంధన కింద సభా సమావేశాలు మిగిలి ఉన్న కాలానికే ఒక సభ్యుడిని లేదా సభ్యురాలిని సస్పెండ్ చేయాలి) నిబంధనలకు పూర్తిగా విరుద్ధమైన ఈ తీర్మానాన్ని స్పీకర్ అపుడే అభ్యంతరం తెలిపి ఆపాల్సింది. కానీ యనమల ప్రతిపాదించిన తీర్మానాన్ని సభలో అనుమతించి ఆ తరువాత రోజాను సస్పెండ్ చేయడం రాష్ట్ర శాసనసభ చరిత్రలో అత్యంత దురదృష్టకర సంఘటన. అదొక బ్లాక్‌డే. నిబంధనలున్నది ఉల్లంఘించడానికా..? జరిగిన ఈ తప్పును కప్పి పుచ్చుకోవడానికి.. శాసనసభ చాలా అత్యున్నతమైనదని, సభ బిజినెస్ రూల్స్‌ను పాటించాల్సిన అవసరం అంతకంటే లేదని శాసనసభా వేదికపైనే మంత్రి యనమల వెల్లడించారు. 1994-99 మధ్య ఐదేళ్ల పాటు స్పీకర్‌గా పనిచేసిన వ్యక్తి సభా నిబంధనలు అసందర్భమని ఎలా చెబుతారు? అలాంటపుడు ఇక నిబంధనలు ఎందుకున్నట్లు? లోక్‌సభలో మాత్రం నిబంధనలు ఎందుకు ఉండాలి? ఆ నిబంధనలున్నవి ఉల్లంఘించడానికేనా? పార్లమెంటు ఉభయసభలు, రాష్ట్రాల శాసనసభలు.. భారత రాజ్యాంగంలోని 208 లేదా 118 అధికరణల కింద రూపొందించుకున్న సభా నియమనిబంధనల ప్రకారం నడుస్తున్నాయి. ఈ నిబంధనలను అనుసరించే మన చట్ట సభలు కూడా నడుస్తున్నాయి. మన అసెంబ్లీ రూల్స్ ఇంచుమించుగా లోక్‌సభ నిబంధనల తరహాలోనే ఉంటాయి. ఇవన్నీ కాల పరీక్షకు నిలబడ్డాయి. సభ్యులమైన మనం ఈ నిబంధనలను అనుసరించకూడదని భావించినపుడే సమస్యలు తలెత్తుతాయి. రోజా శాసనసభ్యత్వం అలాగే ఉంటుంది... రోజా సస్పెండ్ అయ్యారు కనుక ఆమె ఒక సాధారణ వ్యక్తి మాత్రమేనని, శాసనసభ్యురాలిగా ఆమెకు ఎలాంటి ప్రభుత్వ సౌకర్యాలు కల్పించడానికి అర్హురాలు కాదని, వేతనం రాదని, ఎమ్మెల్యేగా ఆమెకు కేటాయించిన అధికార గృహంలో నివాసం ఉండరాదని కూడా శాసనసభా వ్యవహారాల మంత్రి చెప్పారు. ఆమెను కేవలం శాసనసభా కార్యక్రమాల నుంచి మాత్రమే సస్పెండ్ చేశారని, ఆమె శాసనసభ్యత్వం అలాగే ఉందనే విషయం యనమల మరిచారా? లోక్‌సభలో 374.. అసెంబ్లీలో 340... ఒకటే... లోక్‌సభ బిజినెస్ రూల్స్‌లోని 374వ నిబంధనను ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తున్నాను. రాష్ట్ర శాసనసభలో 340 వ నిబంధన ఎలాఉందో లోక్‌సభలోని 374 లో కూడా అవే అంశాలున్నాయనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. ‘374 (1) ఒక సభ్యుడు పదే పదే స్పీకర్‌ను అగౌరవపరుస్తూ సభా నిబంధనలను అదే పనిగా ఉల్లంఘిస్తూ, ఉద్దేశపూర్వకంగానే సభా కార్యక్రమాలకు భంగం కలిగిస్తున్నట్లుగా స్పీకర్ భావించినపుడు. (2) అలాంటి సందర్భంలో అలా వ్యవహరిస్తున్న సభ్యుడి సస్పెన్షన్ తీర్మానం తన ముందుకు వచ్చినపుడు ఆ శాసనసభా సమావేశాల్లో తదుపరి మిగిలి ఉన్న కాలానికి ఆ సభ్యుడిని సభా కార్యక్రమాల్లో లేకుండా సస్పెండ్ చేయవచ్చు. అయితే ఆ సభ్యుడి సస్పెన్షన్‌ను ఆ తదుపరి ఎప్పుడైనా ఉపసంహరిస్తూ మళ్లీ తీర్మానం చేసే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. (3) అలా సస్పెండ్ అయిన సభ్యుడు ఈ నిబంధన కింద శాసనసభ ప్రాంగణం నుంచి వెళ్లి పోవాల్సి ఉంటుంది’ లోక్‌సభలో పెప్పర్ స్ప్రే కంటే ఘోరమా..? ఈ సందర్భంగా 2014 ఫిబ్రవరి 13వ తేదీన లోక్‌సభలో చోటు చేసుకున్న పరిణామాలను గుర్తుకు తెచ్చుకోవాలి. ఆరోజు లోక్‌సభలో విపరీతమైన ఘర్షణ, ఉద్రిక్త వాతావరణం, గందరగోళం నెలకొంది. పోడియం వద్ద ఎంపీల మధ్య ముష్టిఘాతాలు చోటు చేసుకోవడమే కాక ఆరోగ్యానికే తీవ్ర హానికరమైన పెప్పర్ స్ప్రేను కొందరు సభ్యులు ప్రయోగించారు. ఈ గలాభాకు, గందరగోళానికి కారణమైన 18 మంది ఎంపీలను లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ఆ లోక్‌సభా సమావేశాలు మిగిలి ఉన్న కాలానికే సస్పెండ్ చేయడం ఇక్కడ గమనించాల్సిన అంశం. లోక్‌సభలో అలాంటి నిర్ణయం తీసుకున్నపుడు ఏపీ అసెంబ్లీలో మాత్రం ఇలాంటి అసాధారణమైన నిర్ణయం ఎలా తీసుకుంటారు? దేశం మొత్తం అనుసరించే విధానాలకు ఇక్కడ మాత్రమే భిన్నమైన భాష్యాన్ని చెబుతూ అనుసరిస్తున్నారు. పైగా ఆరోజు లోక్‌సభలో జరిగిన ఘటనలతో పోల్చితే ఏపీ శాసనసభలో జరిగింది చాలా స్వల్పం. అవసరమైతే బిజినెస్ రూల్స్ సవరించాలి.. అందువల్ల, శాసన సభ నియమనిబంధనలకు మనం ఎంత కచ్చితంగా కట్టుబడి ఉన్నాం... ఎంత నిస్పాక్షికంగా సభా కార్యకలాపాలను నడిపిస్తున్నాం అనే దానిపై అంతా అధారపడి ఉంటుంది. కారణాలేవైనా ప్రస్తుతం ఉన్న నియమనిబంధనలు సరిపోవని మొత్తం సభ భావిస్తే, నిబంధనలకు అవసరమైన సవరణలను చేయడానికి గాను అసెంబ్లీ నిబంధనల కమిటీకి నివేదించాలి. ఆ విషయాన్ని సభ్యులందరికీ తెలియజేయాలి. ఆ తర్వాత వాటినే అమలు చేయాలి. ‘బిజినెస్ రూల్స్ పట్టించుకోనవసరం లేదు. సభలో స్పీకర్ నిర్ణయమే అంతిమం’ అనే వ్యాఖ్యలు చట్టం తెలియకపోవడం వల్లే చేశారనుకోవాలి. అటువంటి వైఖరి దురదృష్టకరం. మనం పారదర్శకమైన, హేతుబద్ధమైన, అర్థవంతమైన విధానాన్ని అనుసరించక పోతే మనం తీసుకునే నిర్ణయాలు న్యాయస్థానాలు ప్రశ్నించే విధంగానే తయారవుతాయి. అదే కనుక జరిగితే శాసనసభల ఔన్నత్యానికి భంగం వాటిల్లుతుంది. అదే జరిగిననాడు మనందరికీ అదొక విషాద దినంగా మారుతుంది. నేను 2015 డిసెంబర్ 19వ తేదీన రాసిన లేఖలో కూడా ఏపీ శాసనసభ నియమాల్లో 340 (2) నిబంధన ప్రకారం రోజా సస్పెన్షన్ విరుద్ధమని, ఉపసంహరించుకోవాలని మీకు విజ్ఞప్తి చేశాను. ఈ అంశాలన్నింటి నేపథ్యంలో.. బిజినెస్ రూల్స్‌కు విరుద్ధంగా ఏడాది పాటు చేసిన రోజా సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవాలని మీకు మరోమారు విజ్ఞప్తి చేస్తున్నాను. 340(2) నిబంధన కింద ఆమెను సస్పెండ్ చేయడం చట్ట విరుద్ధం , రాజ్యాంగ విరుద్ధమని మీకు మనవి చేస్తున్నాను. కృతజ్ఞతలతో మీ విశ్వాసపాత్రుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిబంధనలను అతిక్రమిస్తే న్యాయస్థానాల్లో విచారణార్హమే.. శాసనసభ సర్వోన్నతమైనదని, సభ తీసుకునే నిర్ణయాలను ఏ న్యాయస్థానం కూడా ప్రశ్నించజాలదని శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల చెప్పారు. బహుశా ఆయన భారత రాజ్యాంగంలో 212 అధికరణలోని అంశాల ఆధారంగా అలాంటి అభిప్రాయానికి వచ్చినట్లుంది. స్పీకర్ స్థానం అనేది రాజ్యాంగం ప్రకారం అత్యున్నతమైన దే. కానీ స్పీకర్ స్థానంలో ఉన్న అతడు/ఆమె సభా నియమనిబంధనలకు లోబడి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. స్పీకరే కాదు చట్టసభలోని సభ్యులు కూడా వాటికి లోబడే విధులు నిర్వహించాలి. ఈ నియమ నిబంధనలకు లోబడే చట్ట సభలు నడుస్తాయి కనుక రాజ్యాంగంలోని 122/212 అధికరణల ప్రకారం వీటికి కొన్ని రక్షణలు కల్పించారు. 212 అధికరణలో ఏముందో ఇక్కడ పొందు పరుస్తాను. 212(1) ప్రకారం.. ‘‘నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయన్న ఆరోపణలపై రాష్ట్ర శాసనసభల కార్యకలాపాల చట్టబద్ధతను ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేదు’’ దీనిని బట్టి సుస్పష్టంగా అర్థం అయ్యేది ఏమిటంటే నిబంధనలకు విరుద్ధంగా చట్టసభలు వెళుతున్నాయనే ఆరోపణలపై న్యాయ సమీక్షకు అవకాశం లేదు. కానీ అసెంబ్లీ నియమనిబంధనలను అతిక్రమించినపుడు న్యాయస్థానాలు సమీక్ష చేయరాదనే అడ్డు ఏమీ లేదు. ‘రాజా రాంపాల్ వర్సెస్ లోక్‌సభ స్పీకర్’ కేసులో సుప్రీంకోర్టు సుస్పష్టంగా ఇలా చెప్పింది. ‘పార్లమెంటు ఉభయ సభల్లో నియమ నిబంధనలు అతిక్రమించినట్లు వెల్లడైతే అవి హైకోర్టులలో, లేదా సుప్రీంకోర్టులో విచారణార్హంఅవుతాయి. ఈ సందర్భంలో రాజ్యాంగంలోని 122/212 అధికరణలలోని రక్షణలు అడ్డురావు.’ ఎవరి అధికారాలూ తిరుగులేనివి కావు... ఏ రాజ్యాంగ పదవికి సంక్రమించిన అధికారాలైనా, రక్షణలైనా తిరుగులేనివి కావనే నియమంపైనే మన రాజ్యాంగ ప్రజాస్వామ్య పునాదులు ఏర్పడ్డాయి. అందుకని అధికారాలను తమకు నచ్చని, ఎంపిక చేసుకున్న వ్యక్తులపై అడ్డగోలుగా, ఇష్టానుసారం ప్రయోగించడానికి వీలు లేదు. సహజన్యాయ సూత్రాలకు, నియమనిబంధనలకు విరుద్ధంగా రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు నిర్ణయాలు తీసుకున్న అనేక సందర్భాలలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. రాజ్యాంగంలోని పదో షెడ్యూలు ప్రకారం స్పీకర్ తీసుకునే నిర్ణయాలు న్యాయస్థానాల పరిధిలోకి రాకపోయినా స్పీకర్ చర్యల్లో జోక్యం చేసుకోకుండా సుప్రీంకోర్టును నిరోధించజాలవనే విషయం మీకూ తెలిసిందే. అందుకు తాజా ఉదాహరణను ఇక్కడ పొందు పరుస్తున్నాను. బాల్‌చంద్ర ఎల్ జార్కిహోలి అండ్ అదర్స్ వర్సెస్ బి.ఎస్. యడ్యూరప్ప అండ్ అదర్స్ (కర్నాటక) కేసులో రాజ్యాంగంలోని పదో షెడ్యూలు కింద 13 మంది ఎమ్మెల్యేలను కర్నాటక స్పీకర్ అనర్హులుగా ప్రకటించిన నిర్ణయం చెల్లదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ సభ్యులను అనర్హులుగా ప్రకటించడం ‘సభ్యుల అనర్హత నిబంధనలు 6(5)(బి), 7(3)-1986’ను అతిక్రమిస్తూ తీసుకున్న నిర్ణయమని, పైగా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా జరిగిందని సుప్రీంకోర్టు ఈ కేసులో పేర్కొన్నది. -
ఈరోజు రోజా రేపు నేనా..?
-
స్పీకర్‌పై మాకు గౌరవం ఉంది, కానీ: రాహుల్
న్యూఢిల్లీ : పార్టీ ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ రెండోరోజు కూడా తమ ఆందోళనను కొనసాగిస్తోంది. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట బుధవారం కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన నిర్వహించారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీలు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆందోళనకు ఆర్జేడీ, జేడీయూ, వామపక్షాలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ లోక్ సభ స్పీకర్‌పై తమకు గౌరవం ఉందని, స్పీకర్‌ను గౌరవిస్తామని అన్నారు. అయితే స్పీకర్ తీసుకున్న అన్ని నిర్ణయాలను తాము ఆమోదించలేమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడుతూ తమ నిరసన కొనసాగుతోందని, సస్పెన్షన్ ఎత్తివేతపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. కాగా సభా కార్యకలాపాలాకు అడ్డుతగులుతున్నారన్న కారణంతో సోమవారం 25 మంది కాంగ్రెస్ ఎంపీలను లోక్ సభ స్పీకర్ అయిదు రోజుల పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నిన్న కూడా కాంగ్రెస్ ఆందోళన చేసింది. మరో పక్క ఈ రోజు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ ను ఎత్తివేసే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాల సమాచారం. -
ఆ ముగ్గురిపై వేటు!
విజయవాడ: బెజవాడ కేంద్రంగా దేశంలోని వివిధ రాష్ట్రాలకు పాత ఇనుమును అక్రమంగా రవాణా చేసి పన్ను ఎగగొడుతున్న డీలర్ కేసు వాణిజ్య పన్నుల శాఖ అధికారుల మెడకు చుట్టుకుంది. ఈ కేసులో ముగ్గురు అధికారులపై వేటు పడింది. నందిగామ సర్కిల్ సీటీఓ సూర్యప్రకాష్, ప్రస్తుతం విజయవాడ-2 డివిజన్లో రివిజన్ డీసీటీవోగా పనిచేస్తున్న సునీత, ఏసీటీవో ఎం.వి.రావులను సస్పెండ్ చేస్తూ వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ శ్యామలరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
'టెన్త్' డ్యూటీలో నిర్లక్ష్యం.. ఎంఈవో, సీఎస్ల సస్పెన్షన్
పదోతరగతి పరీక్షల్లో ఉత్తర్వుల మేరకు కాకుండా విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులు సహా ఒక సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్లు పరీక్షల డైరెక్టర్ సురేందర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు జిల్లాలోని సెట్టిపల్లి, తుమ్మలపల్లి పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న ఇన్విజిలేటర్, ఇద్దరు చీఫ్ సుపరింటెండెట్లతోసహా గుడేపల్లి ఎంఈవోను బాధ్యతల నుంచి తప్పించి వేరే వారిని నియమించామన్నారు. మంగళవారం జరిగిన పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 6, 47,428 మంది (99.2 శాతం) హాజరయ్యారని, నాలుగోరోజు 10 మాల్‌ప్రాక్టీసు కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇందులో విజయనగరం జిల్లాలో 5, చిత్తూరు జిల్లాలో 4, కడపలో ఒక మాల్‌ప్రాక్టీసు కేసు నమోదయిదన్నారు. -
దేవాదాయశాఖ ఇన్ స్పెక్టర్ పై సస్పెన్షన్ వేటు
విశాఖపట్నం: దేవాదాయ శాఖ టౌన్ ఇన్ స్పెక్టర్ రాజకుమారిపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాలు...కోర్టుకు సంబంధించిన రిపోర్టులను పట్టించుకోకపోవడంతో పాటు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుల విచారణలో అలసత్వం ప్రదర్శించినందుకు ఆమెపై సస్పెన్షన్ వేటు వేసినట్లు సమాచారం. సస్పెన్షన్ కు సంబంధించిన ఉత్తర్వులను దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ పుష్పవర్ధన్ వెల్లడించారు. -
మాజీ సీఎం కుమారుణ్ని సస్పెండ్ చేసిన కాంగ్రెస్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కాంగ్రెస్ నేత నేదురుమల్లి జనార్థన్ రెడ్డి తనయుడు.. ఏపీసీసీ జనరల్ సెక్రటరీ నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రకటించారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నందునే రామ్‌కుమార్ రెడ్డిని సస్సెండ్ చేసినట్లు ఆదివారం హైదరాబాద్‌లో రఘువీరా మీడియాకు చెప్పారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటిచేసి ఓటమిపాలైన రామ్‌కుమార్.. బీజేపీలో చేరతారనే వార్తలు గత కొద్దికాలంగా బలంగా వినిపిస్తున్నాయి. ఆయన కూడా ఈ వార్తలను ఖండించకపోవడం గమనార్హం. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సమక్షంలో రామ్ కుమార్ రెడ్డి కషాయ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని తెలిసింది. -
స్పీకర్‌కు, సభకు దండం పెడుతూ..
-
8మంది వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
-
జువైనల్ హోం వార్డెన్ల సస్పెన్షన్
నిజామాబాద్ : నిజామాబాద్ పట్టణంలోని జువైనల్ హోమ్‌లో పనిచేస్తున్న ఇద్దరు వార్డెన్లు సస్పెండయ్యారు. వివరాలు.. జువైనల్ హోమ్ లోని నలుగురు బాల నేరస్తులు ఈనెల 2వ తేదీన పరారయ్యారు. వారు పారిపోయి నాలుగు రోజులైనా ఆచూకి లభించకపోవటంతో హోమ్ వార్డెన్లు నాగేంద్ర, ప్రభాకర్‌లను ఉన్నతాధికారులు గురువారం సస్పెండ్ చేశారు. -
13మంది కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ సభ్యులపై ఒక్కరోజు పాటు సస్పెన్షన్ వేటు పడింది. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించటంతో స్పీకర్ మధుసుదనాచారి మంగళవారం సభ నుంచి జానారెడ్డి మినహా 13మంది కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేశారు. సభ్యుల సస్పెన్షన్‌ను మంత్రి హరీష్ రావు ప్రతిపాదించారు. సస్పెండ్ అయిన సభ్యుల వివరాలు: 1. జీవన్ రెడ్డి 2. డీకె అరుణ 3. మల్లు భట్టి విక్రమార్క 4. సంపత్ కుమార్ 5. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 6. గీతారెడ్డి 7, పువ్వాడ అజయ్ కుమార్ 8. ఉత్తమ్ కుమార్ రెడ్డి 9. పద్మావతి రెడ్డి 10.భాస్కరరావు 11. రాంరెడ్డి వెంకటరెడ్డి 12. కృష్ణారెడ్డి 13. రామ్మోహన్ రెడ్డి -
కొట్టుకున్న మహిళా కానిస్టేబుళ్ల సస్పెన్షన్
-
కొట్టుకున్న మహిళా కానిస్టేబుళ్ల సస్పెన్షన్
గుంటూరు : పట్టాభిపురం పోలీస్ స్టేషన్ వద్ద ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు కొట్టుకున్న ఘటనపై ఎస్పీ రామకృష్ణ సీరియస్ అయ్యారు. కానిస్టేబుళ్లు శ్రీదేవి, విజయలక్ష్మిలను సస్పెండ్ చేస్తూ ఆయన బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లో వెళితే తన భర్త వెస్లీతో పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుని తనకు, తన పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నారని, న్యాయం చేయాలని కోరుతూ మహిళా పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రమావత్ శ్రీదేవి మంగళవారం పట్టాభిపురం పీఎస్ ఎదుట తన తల్లితో కలిసి ధర్నాకు దిగారు. అంతకు ముందు ఇదే విషయమై మహిళా కానిస్టేబుళ్లు విజయలక్ష్మి, శ్రీదేవి మధ్య ఘర్షణ జరిగింది. అది కాస్తా శ్రుతిమించి ఇరువురు కొట్టుకున్నారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ విజయలక్ష్మి గాయపడింది. ఆమెను చికిత్స నిమిత్తం తరలించి, శ్రీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె భర్త వెస్లీని అదుపులోకి తీసుకున్నారు. -
అసభ్యంగా ప్రవర్తించిన టీచర్‌పై సస్పెన్షన్ వేటు
నల్గొండ : పాఠశాలలో మద్యం తాగి అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు పడింది. డీఈవో విశ్వనాథరావు శనివారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. దేవరకొండ మండలం గొట్టిముక్కల ప్రాధమికోన్నత పాఠశాలలో గురువారం హలీం అనే ఉపాధ్యాయుడు వీరంగం సృష్టించిన ఉదంతాన్ని పత్రికులు, టీవీ ఛానళ్లలో రావటంతో విద్యాశాఖ మంత్రితో పాటు, ఉన్నతాధికారులు ఈ ఉదంతాన్ని తీవ్రంగా పరిగణించారు. దీంతో జిల్లా విద్యాశాఖ టీచర్ తతంగంపై నివేదిక తయారు చేసి సస్పెండ్ చేసింది. -
శివప్రసాద్ రెడ్డి, మణిగాంధీపై సస్పెన్షన్ ఎత్తివేత
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శివప్రసాద్ రెడ్డి, మణిగాంధీలపై సస్పెన్షన్ ఎత్తివేశారు. వీరు ఇరువురు గురువారం క్షమాపణ చెప్పటంపై వారిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసినట్లు స్పీకర్ కోడెల శివప్రసాద్ సభలో ప్రకటించారు. కాగా తమ పార్టీ సభ్యుల మీద విధించిన సస్పెన్షన్‌ను తొలగించాలంటూ ప్రతిపక్ష పార్టీ ఉప త జ్యోతుల నెహ్రూ బుధవారం సభలో స్పీకర్‌కు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. అలాగే సభ్యులు క్షమాపణలు చెబితే సస్పెన్షన్ తొలగించడానికి అభ్యంతరం లేదని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఈమేరకు షరతులతో కూడిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. అయితే నిన్న ఈ ఇద్దరు సభ్యులు అందుబాటులో లేకపోవడంతో ఈరోజు ఉదయం వారిపై సస్పెన్షన్ తొలగింది. -
వీరంగం వేసిన షాహీర్పై సస్పెన్షన్ వేటు
కాకినాడ : కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మద్యం సేవించి విధులు నిర్వహించిన ఎంఎన్‌వో షాహీర్పై సస్పెన్షన్ వేటు పడింది. షాహీర్పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకట బుద్ధ తెలిపారు. ఆస్పత్రిలో ఎవరైనా మద్యం సేవించి విధులు నిర్వహిస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన గురువారమిక్కడ విజ్ఞప్తి చేశారు. షాహీర్పై వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ 307 కింద కేసు నమోదు అయ్యింది. కాగా షాహీద్ ఈరోజు ఉదయం మద్యం మత్తులో వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగికి అమర్చిన అక్సిజన్ అతడు తొలగించాడు. దాంతో సదరు రోగి ఆరోగ్య పరిస్థితి విషమంగా మరింది. దీంతో బంధువులు తీవ్ర ఆందోళనకు గురైయ్యారు. రోగి బంధువులు ఎంఎన్‌వోకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... ఆసుపత్రి గేటు వద్ద ఆందోళనకు దిగారు. ఎంఎన్‌వోను వెంటనే విధుల నుంచి తొలగించాలని ఆసుపత్రి సూపరింటెండెట్‌ను డిమాండ్ చేశారు.