పదోతరగతి పరీక్షల్లో ఉత్తర్వుల మేరకు కాకుండా విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులు సహా ఒక సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్లు పరీక్షల డైరెక్టర్ సురేందర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పదోతరగతి పరీక్షల్లో ఉత్తర్వుల మేరకు కాకుండా విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులు సహా ఒక సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్లు పరీక్షల డైరెక్టర్ సురేందర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు జిల్లాలోని సెట్టిపల్లి, తుమ్మలపల్లి పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న ఇన్విజిలేటర్, ఇద్దరు చీఫ్ సుపరింటెండెట్లతోసహా గుడేపల్లి ఎంఈవోను బాధ్యతల నుంచి తప్పించి వేరే వారిని నియమించామన్నారు.
మంగళవారం జరిగిన పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 6, 47,428 మంది (99.2 శాతం) హాజరయ్యారని, నాలుగోరోజు 10 మాల్‌ప్రాక్టీసు కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇందులో విజయనగరం జిల్లాలో 5, చిత్తూరు జిల్లాలో 4, కడపలో ఒక మాల్‌ప్రాక్టీసు కేసు నమోదయిదన్నారు.