tenth class Exams
-
AP: నేటి నుంచి పదో తరగతి పరీక్షలు
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు (3.15 గంటలు) పరీక్ష ఉంటుంది. చివరి పరీక్షను రంజాన్ సెలవు ఆధారంగా ఈ నెల 31 లేదా ఏప్రిల్ ఒకటో తేదీన నిర్వహిస్తారు. 2024–25 విద్యా సంవత్సరానికిగాను రాష్ట్రవ్యాప్తంగా 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 6,19,275 మంది రెగ్యులర్, 30,609 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థుల్లో ఇంగ్లిష్ మీడియంలో 5,64,064 మంది, తెలుగు మీడియంలో 51,069 మంది, ఉర్దూలో 2,471 మంది, హిందీలో 16 మంది, కన్నడలో 623 మంది, తమిళంలో 194 మంది, ఒడియాలో 838 మంది పరీక్షలు రాసేందుకు ఎన్రోల్ చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,450 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. వాటిలో 163 సమస్యాత్మక సెంటర్లుగా గుర్తించి సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. హాల్‌టికెట్ చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. పరీక్ష సెంటర్ల వద్ద 144 సెక్షన్ కొనసాగుతుందని పదో తరగతి పరీక్షల విభాగం ఉత్తర్వులు జారీచేసింది. ఇన్విజిలేటర్లతోపాటు సెంటర్లలో విధులు నిర్వర్తించే పోలీసులు, ఏఎన్ఎంలతో సహా ఎవరూ ఫోన్లు, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లకూడదని స్పష్టంచేసింది. ఈ పరీక్షల పర్యవేక్షణకు రాష్ట్రవ్యాప్తంగా 156 ఫ్లైయింగ్ స్క్వాడ్స్‌ను నియమించింది. జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్‌తోపాటు రాష్ట్రస్థాయిలో ఎస్ఎస్సీ డైరెక్టరేట్‌లోను ప్రత్యేక కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుంది. పరీక్షలపై ఫిర్యాదుల కోసం 0866–2974540 నంబర్‌ను కేటాయించారు. ఓపెన్ టెన్త్ పరీక్షలు కూడా నేటి నుంచే.. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే పదో తరగతి (ఓపెన్ టెన్త్) పరీక్షలు కూడా సోమవారం నుంచి ప్రారంభమవుతాయి. రెగ్యులర్ పరీక్షలు జరిగే తేదీలు, సమయాల్లోనే ఈ పరీక్షలు ఉంటాయని అధికారులు ప్రకటించారు. ఓపెన్ టెన్త్ పరీక్షలు ఈ నెల 28వ తేదీతో ముగియనున్నాయి. ఈ పరీక్షలకు 30,334 మంది హాజరుకానున్నారు. వీరికోసం 471 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
వారం రోజుల్లో పరీక్షలు.. అంతలోనే దుర్మరణం
బంజారాహిల్స్: వారంరోజుల్లో పదోతరగతి పరీక్షలు.. ఈలోగా స్నేహితులతో సరదాగా గడుపుదామనుకున్నాడు.. అంతలోనే ఓ విద్యార్థి రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బోరబండకు చెందిన ఆటోడ్రైవర్ జగదీశ్ కుమారుడు భరణిసాయి లోకేష్(15) అదే ప్రాంతంలోని ఎస్వీఎస్ పబ్లిక్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 18వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండగా ఆదివారం ఉదయం నలుగురి స్నేహితులతో కలిసి బైక్‌లపై బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కుకు బయలుదేరారు. శ్రీనగర్‌కాలనీ టీవీ9 జంక్షన్లో సాయిలోకేశ్ బైక్‌ను టర్న్ చేసే క్రమంలో అదుపుతప్పింది. దీంతో రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి ఎగిరి స్ట్రీట్‌లైట్ స్తంభానికి తగలడంతో సాయిలోకేశ్ తల పగిలి అక్కడికక్కడే చనిపోయాడు. పక్కనే బైక్‌లు నడుపుతున్న స్నేహితులు ఒక్కసారిగా వచి్చన పెద్ద శబ్దం విని షాక్‌కు గురయ్యారు. రెప్పపాటులో రక్తపుమడుగులో ఉన్న స్నేహితుడిని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఒక్కగానొక్క కొడుకు కళ్లముందే విగతజీవిగా మారడంతో జగదీశ్‌తోపాటు కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. శనివారం రాత్రే కొడుకును తీసుకెళ్లి రహమత్‌నగర్‌లో పరీక్షాకేంద్రాన్ని చూసి వచ్చానని, ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకుందని తండ్రి బోరున విలపించాడు. బంజారాహిల్స్ పోలీసులు ఘటనాస్థలంలో సీసీ ఫుటేజీలను సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హెల్మెట్ ధరించి ఉంటే ఆ బాలుడు బతికి ఉండేవాడని పోలీసులు వెల్లడించారు. -
12 ఏళ్లకే టెన్త్ పాసైన గుంటూరు విద్యార్థిని.. ఎన్ని మార్కులంటే?
సాక్షి, గుంటూరు: గుంటూరు నగరానికి చెందిన చిర్రా అనఘాలక్ష్మి 11 ఏళ్ల 8 నెలల వయసులోనే 10వ తరగతి పరీక్షలు రాసింది. బ్రాడీపేటలోని సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో చదివిన అనఘాలక్ష్మి అన్ని సబ్జెక్టులలో 90కి పైగా మార్కులతో మొత్తం 600కు గాను 566 మార్కులు సాధించింది. పదేళ్ల వయసులో గణితంలో శతావధానం చేసిన అనఘాలక్ష్మి ప్రతిభను గుర్తించిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రత్యేక అనుమతి ఇవ్వడంతో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిందని పాఠశాల డైరెక్టర్ ఆర్.రాము తెలిపారు. (‘జోసా’లో సీట్ల జోష్.. ఐఐటీ, ఎన్ఐటీలలో భారీగా పెరిగిన సీట్ల సంఖ్య) -
విద్యాశాఖ కార్యాచరణ.. మే మొదటి వారంలో పది ఫలితాలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను సజావుగా ముగించడంతోపాటు ఫలితాలను కూడా సాధ్యమైనంత త్వరగా విడుదల చేసేందుకు విద్యాశాఖ కార్యాచరణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 26 నాటికి మూల్యాంకనాన్ని ముగించడానికి ఏర్పాట్లు చేస్తోంది. మే మొదటి వారానికల్లా ఫలితాలను విడుదల చేయాలనే కృతనిశ్చయంతో ఉంది. పదో తరగతి తర్వాత విద్యార్థులు పై తరగతుల్లోకి వెళ్లేందుకు ఆలస్యం కాకుండా ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేపట్టింది. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పరీక్షలు.. పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ఏప్రిల్ 3 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. గతంలో 11 పేపర్లుగా ఈ పరీక్షలను నిర్వహించేవారు. కరోనా సమయంలో వీటిని ఏడింటికి తగ్గించారు. 2021–22లో సైన్స్ సబ్జెక్టులోని భౌతిక, రసాయన శాస్త్రాలు (పీఎస్), జీవశాస్త్రం (ఎన్ఎస్)లకు వేర్వేరుగా కాకుండా ఒకే పేపర్, ఒకే పరీక్షగా మార్పు చేశారు. దీంతో పదో తరగతిలో పబ్లిక్ పరీక్షల పేపర్ల సంఖ్య ఆరుకు తగ్గింది. ఈ ఏడాది (2022–23) కూడా ఆరు పేపర్లలోనే పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్ సబ్జెక్టులో పీఎస్, ఎన్ఎస్ పేపర్‌ను రెండు భాగాలుగా విభజించి ఇస్తారు. రెండు బుక్లెట్లలో వీటికి సమాధానాలు రాయాలి. ముందుగా భౌతిక, రసాయన శాస్త్రాల ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అనంతరం జీవశాస్త్రం ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. మొత్తం 6.6 లక్షల మంది విద్యార్థులు కాగా పదో తరగతి పరీక్షలకు ఇప్పటికే 6.6 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరు రాసే సమాధానాల పత్రాలు 50 లక్షల వరకు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో ఏజెన్సీ జిల్లాలను మినహాయించి తక్కిన 23 జిల్లాల్లో మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఒక్కో కేంద్రానికి కేటాయించే పరీక్షల సమాధాన పత్రాల సంఖ్య 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు మాత్రమే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. గతంలో 13 జిల్లాల్లో మాత్రమే మూల్యాంకన కేంద్రాలు ఉండేవి. దీనివల్ల ఒక్కో జిల్లా కేంద్రంలో 4.5 లక్షల సమాధానాల పత్రాలను మూల్యాంకనం చేయాల్సి వచ్చేది. దీంతో భారీ ఎత్తున టీచర్లు అవసరమయ్యేవారు. అలాగే ఫలితాల వెల్లడిలోనూ ఆలస్యమయ్యేది. కేంద్రాల పెంపు వల్ల మూల్యాంకనాన్ని త్వరగా ముగించొచ్చని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 18న పదో తరగతి పరీక్షలు ముగియగానే అదే నెల 19 నుంచి 26 వరకు ఈ మూల్యాంకనాన్ని నిర్వహించేలా ఎస్ఎస్సీ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 22న రంజాన్ ఉండటంతో ఆ రోజు మూల్యాంకనం నుంచి ముస్లిం సిబ్బందికి మినహాయింపు ఇవ్వనున్నారు. మూల్యాంకనాన్ని 26న ముగించాక రెండు వారాల్లో వాటిని కంప్యూటరీకరించి ఫలితాల విడుదలకు చర్యలు చేపట్టనున్నారు. తత్కాల్ ఫీజుతో పరీక్ష దరఖాస్తుకు అవకాశం.. కాగా పదో తరగతి పరీక్షలకు తత్కాల్ స్కీమ్ కింద పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నామని ప్రభుత్వ పరీక్షల డైరక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు. ఈ నెల 23 నుంచి 26 వరకు తత్కాల్ స్కీమ్ కింద రూ.500 అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అలాగే రూ.1,000 అపరాధ రుసుముతో ఈ నెల 27 నుంచి 31 వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇదే చివరి అవకాశమని మరోసారి పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. ఏప్రిల్‌లో పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే వారికి మాత్రమే ఆ తర్వాత నిర్వహించే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అవకాశం ఉంటుందని వివరించారు. -
టెన్త్ మోడల్ పేపర్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: ఏప్రిల్ 3 నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన మోడల్ పేపర్లను ఎస్సెస్సీ పరీక్షల విభాగం గురువారం విడుదల చేసింది. వందశాతం సిలబస్ నుంచి వీటిని రూపొందించారు. కోవిడ్ తర్వాత ఈ తరహా పరీక్ష జరపడం ఇదే మొదటిసారి. 2020లో 3 సబ్జెక్టులు నిర్వహించిన తర్వాత కోవిడ్ ఉధృతి దృష్ట్యా పరీక్షలను వాయిదా వేశారు. 2021లో అసలు పరీక్షలే నిర్వహించలే దు. 2022లో పరీక్షలు పెట్టినా 70 శాతం సిలబస్‌నే అమలు చేశారు. మూడేళ్ల తర్వాత పూర్తిస్థాయి సిలబస్‌తో నిర్వహించనున్నారు. దీంతో టెన్త్ పరీక్షల విధానం పూర్తిగా అర్థమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు పాఠశాలల యాజమాన్యాలకు సూచించారు. వంద శాతం ఫలితాలు సాధించే దిశగా కృషి చేసేందుకు ఇదే సరై న మార్గమని అభిప్రాయపడుతున్నారు. గతంలో పరీక్షలను 11 పేపర్లతో నిర్వహించగా, ఇప్పుడు 6 పేపర్లకు కుదించారు. ఇది కూడా కొత్త విధానం కావడంతో అవగా హన కల్పించాలని హెచ్ఎంలకు పాఠశాల విద్యాశాఖ సూచించింది. డిసెంబర్ కల్లా సిలబస్ పూర్తి చేసి, జనవరిలో రివిజన్ చేపట్టడంతోపాటు, బోర్డు విడుదల చేసిన మోడల్ పేపర్లతో విద్యార్థులను సన్నద్ధం చేయాలని చెప్పింది. ఏయే చాప్టర్ల నుంచి ఏ తరహా ప్రశ్నలు రావొచ్చు, మార్కులు ఎలా ఉంటాయనే వివరాలను, మోడల్ పేపర్లను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. వీటిని అనుసరిస్తే మంచి మార్కులు సాధించవచ్చని అధికారులు అంటున్నారు. -
ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇవి ఏప్రిల్ 13వ తేదీ వరకూ కొనసాగుతాయి. బుధవారం రాష్ట్ర పరీక్షల విభాగం దీనికి సంబంధించిన టైమ్ టేబుల్, ఇతర విధివిధానా లను విడుదల చేసింది. అలాగే పరీక్షల్లో ఇప్పటి వరకు ఉన్న 11 పేపర్ల విధానా నికి బదులు ఆరు పేపర్లతో పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా మార్పులు చేస్తూ విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో జారీ చేశారు. టెన్త్‌తో పాటు 9వ తరగతి సమ్మేటివ్ అసెస్ మెంట్–2 కూడా 6 పేపర్లతోనే నిర్వ హించనున్నట్టు జీవోలో పేర్కొ న్నారు. ప్రతీ సబ్జెక్టులోనూ వంద మార్కులుంటాయి. 4 ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీ క్షల నుంచి 20 మార్కులు, పబ్లిక్ పరీ క్షలో 80 మార్కులు ఉంటాయి. మొత్తం ఆరు సబ్జెక్టులకు ఎఫ్ఏల ద్వారా 120 మార్కులు, పబ్లిక్ పరీక్షల ద్వారా 480.. మొత్తం 600 మార్కులకు పరీక్ష ఉంటుంది. సైన్స్ మినహా అన్ని సబ్జెక్టుల పరీక్షలకు 3 గంటల వ్యవధి ఉంటుంది. సైన్స్‌లో మాత్రం బయలాజి క ల్ సైన్స్, ఫిజికల్ సైన్స్.. 2 పేపర్లుగా విభజించా రు. ఒక్కో పేపర్‌కు గంట న్నర వ్యవధి ఇస్తారు. మొదటి పేపర్ పరీక్ష జరిగిన తర్వాత ఆ సమాధాన పత్రాల సేకర ణకు అదనంగా 20 నిమి షాలు ఇస్తా రు. అంటే సైన్స్ 2 పేపర్ల పరీక్ష వ్యవధి 3.20 గంటలు ఉంటుంది. ఓరియంటల్ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ పరీక్షల్లో సంస్కృతం పేపర్–1, పేపర్–2గా ఒక్కొక్కటి 200 మార్కులకు ఉంటుంది. ఇదీ టెన్త్ టైమ్ టేబుల్... వంద శాతం సిలబస్‌తో పరీక్షలు: మంత్రి సబిత ఈ సారి టెన్త్ పరీక్షలను వంద శాతం సిలబస్‌తో నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సబిత తెలిపారు. పరీక్షల్లో వ్యాసరూప ప్రశ్న లకు మాత్రమే ఇంటర్నల్ చాయిస్ ఉంటుందని, సూక్ష్మరూప ప్రశ్నలకు చాయిస్ లేదని ఆమె వెల్లడించారు. టెన్త్ పరీక్షల నిర్వహణపై బుధవారం మంత్రి విద్యా శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు. టెన్త్ పరీక్షలకు సంబంధించి నమూనా ప్రశ్న పత్రాలను వెంటనే విద్యార్థులకు అందు బాటులో ఉంచాలని ఆదేశించారు. అలాగే విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలని, వాటికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయా లని సూచించారు. సెలవు దినాల్లో కూడా ప్రత్యేక తరగతులను నిర్వ హించాలని పేర్కొ న్నారు. ఏదైనా సబ్జెక్టులో వెనుకబడిన వారిని గుర్తించి ఆ విద్యార్థులకు ప్రత్యేక బోధన చేయాలని సూచించారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రీ ఫైనల్స్ నిర్వహించాలని స్పష్టంచేశారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఉత్తీర్ణత శాతం సాధించేలా చర్యలు తీసుకో వాలని కోరారు. ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరు ణ, పాఠశాల విద్యా సంచాలకు రాలు దేవసేన, ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు కృష్ణారావు తదితరు లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
టెన్త్‌లో ఆరా? పదకొండు పేపర్లా? ఎస్సీఈఆర్టీ మొగ్గు ఎటువైపు?
సాక్షి, హైదరాబాద్: మార్చిలో నిర్వహించాల్సిన టెన్త్ వార్షిక పరీక్షలపై ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఆరు పేపర్లా? 11 పేపర్లతో పరీక్ష నిర్వహించాలా? అనే అంశంపై తర్జన భర్జనలు పడుతున్నారు. గురువారం సమావేశమైన రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎస్సీఈఆర్టీ) అధికారులు.. ఈ ఏడాది వరకు 11 పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్తేనే బాగుంటుందని అభిప్రాయపడినట్టు తెలిసింది. క్షేత్రస్థాయిలో ప్రధానోపాధ్యాయులు ఇచ్చిన సలహా మేరకు ముందుకు వెళ్ళాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు విద్యాశాఖకు ప్రతిపాదనలు పంపేందుకు ఎస్సీఈఆర్టీ సిద్ధమైనట్లు తెలిసింది. అయితే పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు మాత్రం ఈ ప్రతిపాదనలపై విముఖత వ్యక్తం చేస్తున్నారు. 11 పేపర్లకు బదులు ఆరు పేపర్లతోనే పరీక్షలు జరపాలని భావిస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. ఇలా ప్రతి సందర్భంలోనూ ఎస్సీఈఆర్టీ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ మధ్య సమన్వయం కొరవడుతుండటం గమనార్హం. తొలుత 11 పేపర్లకే షెడ్యూల్! ఈ ఏడాది స్కూల్స్ ఆరంభంలోనే 9, 10 తరగతులకు పరీక్షలపై పాఠశాల విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. గతంలో మాదిరి 11 పేపర్లతోనే పరీక్షలు ఉంటాయని తెలిపింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఇందుకు అనుగుణంగానే నవంబర్ 1వ తేదీ నుంచి జరిగే ఎస్ఏ– 1 పరీక్ష ప్రశ్నపత్రాలను జిల్లా అధికారులు రూపొందించి, కొన్ని చోట్ల ప్రింటింగ్‌కు కూడా పంపారు. అయితే ఈ సమయంలోనే ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కరోనా సమయంలో ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు కూడా అదే మాదిరిగా విద్యార్థులకు సరళంగా ఉండేలా, వారిపై భారం తగ్గించేలా ఆరు పేపర్లతో పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు. హెచ్‌ఎంల్లో వ్యతిరేకత 11 పేపర్లకు సిద్ధమైన నేపథ్యంలో, ప్రశ్నపత్రాల ప్రింటింగ్‌కు ఆర్డర్లు కూడా ఇచ్చిన తర్వాత పేపర్లు తగ్గించడం ఇబ్బంది కల్గిస్తుందని పలు జిల్లాల హెచ్ఎంలు అభిప్రాయపడ్డారు. దీనివల్ల విద్యార్థులు కూడా గందరగోళంలో పడే వీలుందని స్పష్టం చేశారు. దీంతో ఎస్ఏ–1 వరకూ 11 పేపర్లతో పరీక్షలు నిర్వహించి, ఎస్ఏ–2 (వార్షిక పరీక్షలు) మాత్రం ఆరు పేపర్లతో నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. దీనిపై ఎస్సీఈఆర్టీ జిల్లాల వారీగా అభిప్రాయాలు తెలుసుకుంది. వార్షిక పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఎస్ఏ–1 తోడ్పడుతుందని, ఎస్ఏ–1 ఒక రకంగా, ఎస్ఏ–2 మరో రకంగా ప్రశ్న పత్రాలు ఉంటే విద్యార్థులు ఇబ్బందుల్లో పడే వీలుందనే అభిప్రాయం వ్యక్తమైంది. దీన్ని ఆధారంగా చేసుకునే ఎస్సీఈఆర్టీ రెండు పరీక్షలను 11 పేపర్లతోనే నిర్వహిస్తే బాగుంటుందనే ప్రతిపాదనను సిద్ధం చేసింది. కానీ పాఠశాల విద్యాశాఖ విముఖత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. దీనిపై నాన్చకుండా విధానం ఏదైనా ముందే స్పష్టత ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. అప్పుడే ఆ మేరకు వార్షిక పరీక్షలకు సిద్ధమయ్యే వీలుంటుందని అంటున్నారు. -
టెన్త్‌లో ఈసారీ ఆరు పేపర్లే
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది తరహాలోనే ఈ ఏడాది కూడా పదో తరగతి పరీక్షలను 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. టెన్త్‌తోపాటు మిగతా క్లాసుల పరీక్షలూ ఆరు పేపర్లతోనే జరపనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యాధికారులను ఆదేశించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా విద్యార్థులపై భారం పడకుండా ఉండేందుకు టెన్త్ పరీక్ష పేపర్లను రాష్ట్ర ప్రభుత్వం 2020–21 విద్యాసంవత్సరంలోనే 11 నుంచి 6కు కుదించింది. అయితే కరోనా తీవ్రత దృష్ట్యా ఆ ఏడాది పరీక్షలను రద్దు చేసింది. ఇక 2021–22 విద్యాసంవత్సరంలోనూ ఆ ప్రకారమే 6 పేపర్లతో పరీక్ష నిర్వహించింది. ప్రతి సబ్జెక్టులోనూ పేపర్–1, పేపర్–2 బదులుగా ఒకే పేపర్‌ను 80 మార్కులకు ఇచ్చింది. మిగిలిన 20 మార్కులకు ఇంటర్నల్స్‌లో విద్యార్థులు పొందిన మార్కులను జతచేసింది. తాజాగా 2022–23 విద్యాసంవత్సరంలోనూ ఇదే విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 1 నుంచి మొదలుకానున్న సమ్మెటివ్ అసెస్మెంట్–1 పరీక్షలను ఇదే విధానంలో నిర్వహించనున్నట్లు పేర్కొంటూ టైంటేబుల్‌ను విడుదల చేసింది. పేపర్ల ముద్రణ జరిగే వేళ... వాస్తవానికి సమ్మెటివ్ అసెస్మెంట్–1 పరీక్షలు 11 పేపర్లతో ఉంటాయని తొలుత పాఠశాల విద్యాశాఖ పేర్కొనడంతో జిల్లా అధికారులు ఈ తరహాలోనే పేపర్లు రూపొందించారు. కొన్నిచోట్ల వాటిని ప్రింటింగ్‌కు కూడా పంపారు. ఈ దశలో విద్యాశాఖ 11కు బదులు 6 పేపర్లే ఉంటాయని చెప్పడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు గందరగోళంలో పడ్డారు. విద్యార్థులు కూడా 11 పేపర్ల పరీక్షకు సిద్ధమై ఇప్పుడు 6 పేపర్లతో రాయాల్సి రానుండటంతో ఆందోళన చెందుతున్నారు. అయితే స్కూళ్ల ప్రారంభంలోనే ఈ మార్పు గురించి వివరించి ఉంటే విద్యార్థులను సంసిద్ధులను చేయడానికి వీలుండేదని పలువురు ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. కొరవడిన సమన్వయం.. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) పరీక్షా పేపర్లపై వారం క్రితమే విద్యాశాఖ డైరెక్టర్‌కు కొన్ని సూచనలు చేసినట్లు తెలిసింది. తొలుత ఈ సూచనలను పట్టించుకోకుండా పక్కన పడేసిన డైరెక్టర్.. ఆ తర్వాత ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో ఎస్సీఈఆర్టీ ప్రతిపాదనను అమలు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే దసరా సెలవులను రెండు వారాలపాటు ఇస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇవ్వడం.. గతంలో ఇచ్చిన సెలవులను మినహాయించి దసరా సెలవులను కుదించాలంటూ ఎస్‌ఈసీఆర్‌టీ సిఫార్సు చేయడం.. దాన్ని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పట్టించుకోకపోవడం చూస్తుంటే ఈ రెండు విభాగాల మధ్య సమన్వయం కొరవడిందన్న విమర్శలు వస్తున్నాయి. తక్కువ సమయంలో విద్యార్థులను ఎలా సిద్ధం చేయాలి? పరీక్షల తీరును ఉన్నఫళంగా మార్చడం వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు గందరగోళంలో పడే ప్రమాదం ఉంది. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే పరీక్షలపై దృష్టి పెడుతున్న విద్యార్థులను అధికారులు పరిగణనలోకి తీసుకోవాలి. 11 పేపర్లతో టెన్త్ పరీక్ష ఉంటుందని విద్యార్థులను తయారు చేశాం. తక్కువ వ్యవధిలో ఆరు పేపర్లకు సిద్ధం చేయాల్సి రావడం కొంత ఇబ్బందిగానే ఉంటుంది. – రాజా భానుచంద్ర ప్రకాశ్, ప్రభుత్వ హెచ్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
పది పరీక్షలు ప్రారంభం.. వచ్చే నెలాఖరుకు ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి మొదలయ్యే పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమైంది. మొత్తం 2,861 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 5.08 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. క్షేత్ర స్థాయి ఏర్పాట్లపై పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఆదివారం వర్చువల్ పద్ధతిలో అధికారులతో సమీక్షించారు. విద్యార్థులకు సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు. మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని, అదనపు బల్లలు, ఇతర సౌకర్యాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని.. వాటికయ్యే ఖర్చు పరీక్షల విభాగం భరిస్తుందని తెలిపారు. తర్వాత ‘సాక్షి’ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. పరీక్షల ఫలితాలను ఎట్టి పరిస్థితుల్లో జూన్ నెలాఖరుకు వెల్లడించాలని నిర్ణయించామన్నారు. వీలైనంత త్వరగా మార్కుల మెమోలు కూడా అందే ఏర్పాటు చేస్తామన్నారు. జూన్ 2 నుంచి సమాధాన పత్రాల మూల్యాంకనం మొదలవుతుందని, పరీక్షలు జరుగుతుండగానే ఇందుకు కసరత్తు మొదలు పెట్టాలని భావిస్తున్నామని చెప్పారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా నిఘా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2,861 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేశారు. చీఫ్ సూపరింటెండెంట్ గదిలో సీసీ కెమెరాను ఏర్పాటు చేసి అక్కడ ప్రశ్నపత్రాల బండిల్‌ను ఓపెన్ చేస్తారు. సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక పోలీసుల పహారా ఉంటుంది. -
పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వార్తలు.. సంచలన విషయాలు వెలుగులోకి
సాక్షి, కర్నూలు: ఏపీ పదో తరగతి పరీక్షల్లో అక్రమాలు జరిగాయన్న ఘటనలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాల్ ప్రాక్టిస్‌లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందిదే ప్రధాన పాత్రగా తేల్చారు. దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్ కూడా వెలుగులోకి వచ్చింది. చిత్తూరు పదో తరగతి పరీక్షా పత్రాల మాల్‌ప్రాక్టీస్‌లో తిరుపతి నారాయణ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ గిరిధర్‌రెడ్డిని నిందితుడిగా గుర్తించారు. అలాగే తిరుపతి ఎన్ఆర్ఐ కాలేజ్ లెక్చరర్ సుధాకర్‌ను నిందితులుగా గుర్తించారు. వీరిద్దరిపై కేసులు నమోదు చేశారు. నారాయణ విద్యాసంస్థల అధినేత గత ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆనాడు ప్రభుత్వాన్ని అడ్డంపెట్టుకుని యథేచ్చగా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే మాదిరిగా అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నించగా పోలీసులు వాటిని అడ్డుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తులోఆడుకునే ప్రయత్నాలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. చదవండి: (గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసిన సీఎం జగన్ దంపతులు) -
ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజైన బుధవారం 98.97 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 6,21,799 మంది విద్యార్థులకు గాను 6,15,318 మంది హాజరయ్యారన్నారు. వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో 3 చొప్పున మాల్ ప్రాక్టీసు కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. దానిని లీక్‌గా పరిగణించలేం.. తొలిరోజు టెన్త్ ప్రశ్నపత్రం లీక్ అయినట్లు సోషల్ మీడియా, కొన్ని చానల్స్‌లో జరిగిన ప్రచారం వాస్తవం కాదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల సమయంలో ఎవరో 10వ తరగతి ప్రశ్నపత్రం, పరీక్ష కేంద్రంలోని ఫొటోలు సర్క్యులేట్ చేయడం ప్రారంభించినట్లు తమకు తెలిసిందని వెల్లడించారు. పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైనందున దానిని లీక్‌గా పరిగణించలేమని పేర్కొన్నారు. అలజడి రేకెత్తించడానికి ఇది ఎవరో కావాలనే సృష్టించినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. నంద్యాల జిల్లా కొలిమగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి జెడ్పీ హైస్కూల్ కేంద్రంగా ఇది జరిగినట్లు గుర్తించినట్టు తెలిపారు. ఇందుకు కారణమైన వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్ స్పష్టం చేశారు. బాధ్యులైన చీఫ్ సూపర్వైజర్, ఇన్విజిలేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరీక్ష కేంద్రం వద్ద నిబంధనల మేరకు మొబైల్ ఫోన్లను లోపలకు అనుమతించరాదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ప్రశ్నపత్రం వాట్సాప్‌లో హల్చల్ అయిన వ్యవహారంలో కర్నూలు డీఈవో ప్రాథమిక విచారణ జరిపి, ప్రశ్నపత్రం వెలుగులోకి వచ్చిన పరీక్ష కేంద్రాన్ని గుర్తించి సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష విధుల నుంచి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారి, సంబంధిత పరీక్ష గది ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. ఈ ఘటన పరీక్ష ప్రారంభమైన రెండు గంటల తర్వాత జరిగింది కాబట్టి ఇది మాల్‌ప్రాక్టీస్ కిందకు వస్తుందని, ప్రశ్నపత్రం లీకేజి కిందకు రాదని దేవానందరెడ్డి స్పష్టం చేశారు. ‘నారాయణ’ ఉపాధ్యాయుడి నిర్వాకం చిత్తూరు (కలెక్టరేట్): పదో తరగతి పరీక్షల్లో అడ్డదారుల్లో ర్యాంకులను సాధించేందుకు నారాయణ స్కూలు సిబ్బంది చేసిన యత్నం బహిర్గతమైంది. చిత్తూరులోని ఓ వాట్సాప్ గ్రూప్‌లో కాంపోజిట్ తెలుగు ప్రశ్నపత్రం ఫొటో కాపీ చక్కర్లు కొట్టింది. ఈ విషయాన్ని డీఈవో శ్రీరామ్ పురుషోత్తం కలెక్టర్ హరినారాయణన్ దృష్టికి తీసుకెళ్లి.. చిత్తూరు ఎస్పీ రిశాంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గిరిధర్ అనే వ్యక్తి ప్రశ్నాపత్రాన్ని వాట్సాప్‌లో పోస్ట్ చేసినట్లు గుర్తించారు. అతను తిరుపతిలోని ఎస్వీ బ్రాంచ్ నారాయణ పాఠశాలలో పదో తరగతి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నట్లు తేలింది. దీనిపై విచారణ జరుగుతోంది. -
పదో తరగతి పరీక్షలకు సమగ్ర ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ నెల 27 నుంచి మే 9 వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 6,22,537 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 3,20,063 మంది బాలురు కాగా 3,02,474 మంది బాలికలు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం 3,776 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. పరీక్షలు నిర్దేశిత తేదీల్లో రోజూ ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు జరగనున్నాయి. విద్యార్థులు ఉదయం 8.30 గంటలకల్లా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష కేంద్రాల్లోకి 9.30 గంటల వరకు అనుమతిస్తామని.. ఆ తర్వాత ఎవరినీ లోపలకు అనుమతించబోమని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు. పదో తరగతి పరీక్షల చరిత్రలో తొలిసారిగా విద్యార్థులకు 24 పేజీల బుక్‌లెట్‌ను పంపిణీ చేయనున్నారు. వీటిలోనే సమాధానాలు రాయాలి. ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు పదో తరగతి పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్ జరగకుండా 156 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 292 సిట్టింగ్ స్క్వాడ్లు పర్యవేక్షించనున్నాయి. ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన సామగ్రి మొత్తాన్ని అన్ని జిల్లాల కేంద్రాలకు తరలించారు. విద్యార్థులకు ఏప్రిల్ 18 నుంచే హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. కోవిడ్ ప్రొటోకాల్‌ను అనుసరించి పరీక్షలకు ఏర్పాట్లు చేపట్టారు. రూముకు 16 మంది చొప్పున ఉంచడంతోపాటు భౌతికదూరం పాటించేలా, మాస్కు ధరించేలా చర్యలు తీసుకుంటున్నారు. మంచినీటి సదుపాయం, ఏఎన్ఎంల నియామకం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సదుపాయం, పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు భద్రత వంటి చర్యలు చేపట్టారు. మే 22 వరకు మూల్యాంకనం కాగా పదో తరగతి పరీక్షలకు సంబంధించిన మూల్యాంకన ప్రక్రియను మే 13 నుంచి ప్రారంభించనున్నారు. ఇది మే 22 వరకు కొనసాగుతుంది. ఈ మేరకు తాత్కాలిక షెడ్యూల్‌ను ఎస్ఎస్సీ బోర్డు సిద్ధం చేసింది. పరీక్ష కేంద్రాల్లో ఫోన్లు, డిజిటల్ పరికరాలకు నో ఎంట్రీ పరీక్ష కేంద్రాల్లోకి చీఫ్ సూపరింటెండెంట్లు తప్ప ఇతరులెవరూ ఫోన్లను తీసుకువెళ్లడానికి వీలులేదు. అలాగే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర డిజిటల్ పరికరాలను కూడా అనుమతించరు. ప్రశ్నపత్రాల లీకేజీకి ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం లేకుండా ఏర్పాట్లు చేపట్టారు. పరీక్షల నిర్వహణలో విద్యాశాఖతోపాటు ట్రెజరీ, రెవెన్యూ, పోలీసు, పోస్టల్, ఏపీఎస్ఆర్టీసీ, ట్రాన్స్‌కో, వైద్య, ఆరోగ్య శాఖ, తదితర అన్ని విభాగాలను సమన్వయం చేసి ఎక్కడా సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ అంటూ సంఘవిద్రోహ శక్తులు పుకార్లను వ్యాపింప చేయకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు చేపట్టారు. ఫేక్, గాసిప్ ప్రశ్నపత్రాలను కూడా ప్రచారంలోకి తేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాంటి వాటిని వ్యాపింపచేసే వారిపై క్రిమినల్ చర్యలు చేపడతారు. -
మార్చిలో పదో తరగతి పరీక్షలు: మంత్రి ఆదిమూలపు సురేష్
సాక్షి, గుంటూరు: ఏపీలో పదో తరగతి పరీక్షలు మార్చిలో నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. సంక్రాంతి నాటికి సిలబస్ పూర్తి చేయాలని విద్యాసంస్థలకు సూచించారు. 15 నుంచి 18 ఏళ్ల లోపు విద్యార్థులకు ప్రతి స్కూల్లో 95% వ్యాషినేషన్ పూర్తి చేశామని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో అమ్మఒడి మూడో విడత ఇస్తామని పేర్కొన్నారు. నిబంధనలు పాటించని బీఈడీ, డీఈడీ కాలేజీలు 375 మూతపడ్డాయని మంత్రి సురేష్ తెలిపారు. చదవండి: (ఫిట్మెంట్తో పాటు ఉద్యోగులకు సీఎం జగన్ మరో గుడ్‌న్యూస్) ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రైవేటు యూనివర్సిటీలో చట్టసవరణ ద్వారా 35% ఫ్రీ సీట్లు ఇప్పించామని పేర్కొన్నారు. సంక్షేమం రెండు కళ్ళుగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఏ విద్యార్ధి డబ్బులు లేక విద్యకు దూరం కాకూడదని అమ్మఒడి ఇచ్చి విద్యార్థులకు యూనిఫామ్, బుక్స్‌తో పాటు మధ్యాహ్నం పౌష్టికాహారం అందిస్తున్నామని పేర్కొన్నారు. కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ఇంగ్లీష్ మీడియం చెప్తూ తెలుగు కూడా బోధిస్తున్నామన్నారు. చదవండి: (పీఆర్సీపై సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన) -
‘పది’లో ఇక 6 పేపర్లే.. టీఎస్ సర్కార్ కీలక ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: పదోతరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 విద్యా సంవత్సరానికి గానూ పదో తరగతి పరీక్షల పేపర్లను కుదించింది. దీంతో ఈ ఏడాది టెన్త్‌లో 11 పేపర్లకు బదులు ఆరు పేపర్లతో పరీక్షలు ఉండనున్నట్లు, ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పేపర్‌గానే పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా 2020-21లో 6 పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోగా.. 2021-22లో కూడా ఈ విధంగానే అమలు చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించడం గమనార్హం. చదవండి: భారత్: మన ఇంటర్నెట్ వేగం అంతంతే! -
ఏపీలో టెన్త్ పరీక్షలు వాయిదా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గురువారం పాఠశాల విద్యా శాఖ అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పదో తరగతి పరీక్షల అంశం చర్చకు రాగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో వాటిని వాయిదా వేయాలని సీఎం ఆదేశించారు. సమావేశానంతరం మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. కరోనా విజృంభణ నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జూన్ 7 నుంచి జరగాల్సిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జూలైలో కరోనా పరిస్థితులను బట్టి పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆ తర్వాత షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థులు స్కూళ్లకు రాలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతోపాటు 1–9 తరగతుల పరీక్షలను రద్దు చేశామని గుర్తు చేశారు. పదో తరగతి పరీక్షలను జూన్ 7 నుంచి నిర్వహించేందుకు గతంలోనే షెడ్యూల్ ఇచ్చినా.. కరోనా పరిస్థితులు ఇంకా పూర్తిగా సద్దుమణగనందునే వాయిదా వేశామన్నారు. విద్యార్థుల ఉన్నత చదువులకు ఇంటర్, టెన్త్ పరీక్షలు చాలా అవసరమని చెప్పారు. పరీక్షలు రద్దు చేయొద్దని మెజారిటీ ఉపాధ్యాయ సంఘాలు, మేధావులు కోరారన్నారు. పరీక్షల వాయిదాపై ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పదో తరగతి విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా క్లాసులు ఉంటాయని చెప్పారు. పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో టీచర్లు స్కూళ్లకు రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కరోనాతో మృతి చెందిన ఉపాధ్యాయులకు ఆయన సంతాపం తెలిపారు. పరీక్షలపై రాజకీయం సరికాదు పరీక్షలకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సురేష్ మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన అంశాన్ని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాజకీయ విమర్శలకు అంశాలు కావాలంటే.. విద్యార్థులకు విద్యాకానుక కిట్లు ఎలా పాఠశాలలకు చేరుస్తున్నారో అడగండి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఇన్ని విద్యా పథకాలను ఎలా అమలు చేస్తున్నారని అడగండి. నాడు నేడు పనులు మొదటి విడత ముగిశాయి.. రెండో విడత ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించండి. అంతేకానీ పిల్లల భవిష్యత్తును కాలరాయాలనే ఉద్దేశంతో పరీక్షలు రద్దు చేయాలని కోరవద్దు. విద్యార్థులు పరీక్షలు రాసి ప్రతిభావంతులైతే టీడీపీకి ఓట్లు వేయరని లోకేష్ భయపడుతున్నారు. పరీక్షలు రాయకుండా అడ్డుకుంటే భవిష్యత్తులో ఓట్లు వేస్తారని ఆయన అనుకుంటున్నారేమో. పరీక్షల నిర్వహణ రాజకీయ అంశం కాదు.. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన అంశం’ అని మంత్రి దుయ్యబట్టారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహిస్తామని తేల్చిచెప్పారు. చదవండి: ఏపీలో టెన్త్ పరీక్షలపై హైకోర్టు విచారణ ఆనందయ్య మందుపై కేంద్రం అభిప్రాయం ఏంటో?: ఏపీ హైకోర్టు -
ఏపీ: టెన్త్ పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వాహణపై సోమవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. టెన్త్ పరీక్షల నిర్వహణపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షలకు ఇంకా సమయం ఉందని పేర్కొంది. జూన్ 7నుంచి టెన్త్ పరీక్షల షెడ్యూల్ ఉందని, ఈ లోగా కరోనా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని సమాధానమిచ్చింది. టెన్త్ పరీక్షల వాయిదా విషయంపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఏపీ సర్కార్ పేర్కొంది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టుజూన్ 2కు వాయిదా వేసింది. కాగా ఇటీవల కరోనా వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణ విషయంలో పునరాలోచించాలని హైకోర్టు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. తల్లిదండ్రులు, విద్యార్థుల ఆందోళనలను, మానసిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని పరీక్షల నిర్ణయాన్ని పునఃసమీక్షించాలంది. అధికారులతో మాట్లాడి ఏ విషయం తమకు చెప్పాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్‌కు సూచించింది. ప్రభుత్వం తెలియచేసే వైఖరిని బట్టి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంది. ఈ నేపథ్యంలోనే ఇంటర్ పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేయాల్సిందిగా హైకోర్టు చేసిన సూచనను పరిగణలోకి తీసుకుంటూ, న్యాయస్థానం అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. చదవండి: ఇంటర్ పరీక్షలు వాయిదా -
కరోనా ఎఫెక్ట్: ఐసీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతుండటంతో పరీక్షలు ఒక్కొక్కటిగా రద్దవుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేశాయి. మరికొన్ని వాయిదా వేశాయి. తాజాగా మరో పరీక్ష రద్దయ్యింది. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ (ఐసీఎస్ఈ) పదో తరగతి పరీక్షల్ని రద్దు చేసింది. ఈ విషయాన్ని ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఏప్రిల్ 16వ తేదీన జారీ చేసిన సర్క్యూలర్‌ను ఉపసంహరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా విద్యార్థులు, టీచింగ్ స్టాఫ్ ఆరోగ్యం ముఖ్యమని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీఎస్ఈ పేర్కొంది. అయితే ఐసీఎస్ఈ ఇంటర్ పరీక్షలు మాత్రం షెడ్యూల్ ప్రకారం ఆఫ్‌లైన్‌లో జరగనున్నాయని పేర్కొంది. ఈ పరీక్షల తేదీలను జూన్‌లో నిర్వహించే సమీక్ష తర్వాత ప్రకటించనున్నారు. ఇదిలా ఉండగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. -
టెన్త్ పరీక్షలను రద్దు చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం
-
తెలంగాణ: టెన్త్ పరీక్షలు అవసరమా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలో ఎలా ముందుకు సాగాలన్న విషయంలో ఉన్నతాధికారులు తర్జనభర్జన పడుతున్నారు. మరో వారం పది రోజులు వేచి చూసి... తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. అప్పటివరకు కేసుల పెరుగుదల పరిస్థితిని చూసి ముందుకు సాగితే బాగుంటుందన్న యోచనలో ఉన్నారు. మే 17వ తేదీ నుంచి టెన్త్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అసలు పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల నిర్వహణ అవసరమా? అన్న భావనలోనే ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలిసింది. గతేడాదిలాగే పదో తరగతి వార్షిక పరీక్షలను రద్దు చేసి పాస్ చేయాలన్న భావనలో ఉన్నట్లు సమాచారం. గతేడాది ఫార్మేటివ్ అసెస్మెంట్స్ (ఎఫ్ఏ) పరీక్షలు, ఒక సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్ష జరిగాయి. వాటితోపాటు ఇంటర్నల్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు మార్కులను కేటాయించి పాస్ చేశారు. అయితే ఈసారి అవేవీ జరుగలేదు. ఒకే ఒక ఎఫ్ఏ పరీక్షను కొన్ని పాఠశాలల్లో నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎలా ముందుకు సాగాలన్న విషయంలో అధికారులు వివిధ కోణాల్లో ఆలోచనలు చేస్తున్నారు. మే నెల మొదటివారం వరకు కరోనా వ్యాప్తిని పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకోవాలని, కేసులు తగ్గితే కనుక పరీక్షలు నిర్వహించాలనే భావనలో ఉన్నట్లు తెలిసింది. కేసుల వ్యాప్తి తగ్గకపోతే మాత్రం పరీక్షలు రద్దు అయ్యే అవకాశం ఉంది. ఇక ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు పరీక్షలు లేకుండానే పైతరగతులకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఫస్టియర్ పరీక్షలపై అస్పష్టత ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థుల విషయంలోనూ ఆలోచన చేస్తున్నారు. కేసులు తగ్గితే పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. లేదంటే మాత్రం కనీస మార్కులతో పాస్ చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. గతేడాది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో కనీస పాస్ మార్కులతో విద్యార్థులను ఉత్తీర్ణులను చేశారు. ఈసారి కూడా అలా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ మాత్రం మే 1వ తేదీ నుంచి పరీక్షలు యథావిధిగా ఉంటాయని శుక్రవారం మీడియాతో పేర్కొన్నారు. పరీక్షల రద్దు విషయంలో తామేమీ ఆలోచన చేయడం లేదని, దానిపై ఏమైనా ఉంటే ప్రభుత్వం నిర్ణయం తీసు కుంటుందని పేర్కొన్నారు. మరోవైపు ద్వితీయ సంవత్సర విద్యార్థుల విషయంలో మాత్రం పరీక్షలు ఉంటేనే బాగుంటుందన్న ఆలోచనలో ప్రభు త్వం ఉన్నట్లు తెలిసింది. ఉన్నత విద్యకు వెళ్లే, ఇతర రాష్ట్రాలకు వెళ్లే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకపోతే సమస్యలు ఎదురవుతాయని భావిస్తున్నారు. అయితే షెడ్యూలు ప్రకారం మే 2 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహిం చాలా? లేదంటే కొన్నాళ్లు వాయిదా వేసి నిర్వహించాలా? అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై మరో నాలుగైదు రోజుల్లో ఉన్నతస్థాయిలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. చదవండి: (టెస్టులు లక్ష.. టీకాలు లక్ష) -
టెన్త్.. ఆరు ప్రశ్న పత్రాలే..
సాక్షి, హైదరాబాద్: కరోనా కారణంగా రాష్ట్రంలో ప్రత్యక్ష విద్యా బోధన దెబ్బతిన్న నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పదో తరగతి పరీక్షల్లో ఉండే 11 ప్రశ్నపత్రాలను ఆరుకు కుదించింది. ప్రశ్నల్లో రెట్టింపు చాయిస్ ఉండేలా ఏర్పాట్లు చేసింది. మొత్తం 20 ప్రశ్నలు ఇచ్చి ఏవైనా 10 ప్రశ్నలకు జవాబు రాయాలని అడిగే విధానాన్ని కొత్తగా ప్రవేశ పెట్టనుంది. గతం లో 10 మార్కులకే ఉన్న ఆబ్జెక్టివ్/బహుళైచ్ఛిక ప్రశ్నలను 20 మార్కులకు పెంచేలా చర్యలు చేపట్టింది. దీంతో విద్యార్థులకు ఎక్కువ ఆప్షన్లు లభించనుండగా, ఒత్తిడికి లోనుకాకుండా కూడా ఉంటారు. మే 17 నుంచి నిర్వహించనున్న పదో తరగతి వార్షిక పరీక్షల్లో వీటిని అమలు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షల సమయం పెంపు.. పదో తరగతి పరీక్షల సమయాన్ని ప్రభుత్వం మరో అర గంట పెంచింది. గతంలో 2.45 గంటలు ఉన్న పరీక్ష సమయాన్ని 3.15 గంటలకు పొడిగించింది. సెప్టెంబర్ 1 నుంచి నిర్వహించిన ఆన్లైన్ బోధన, ప్రస్తుతం చేపట్టబోయే ప్రత్యక్ష బోధనకు సంబంధించిన పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు ఇచ్చేలా చర్యలు చేపట్టింది. అన్ని సబ్జెక్టుల్లో కోర్ కాన్సెప్ట్‌లు, బోధించించాల్సిన అంశాలకు సంబంధించి ఇప్పటికే కేలండర్‌ను ప్రకటించింది. వాటి ప్రకారమే ప్రశ్నలు అడిగేలా చర్యలు చేపట్టింది. జనరల్ సైన్స్ ప్రశ్నపత్రం కూడా ఒక్కటే ఉంటుంది. అయితే అందులో మూల్యాంకన సౌలభ్యం కోసం ఫిజికల్ సైన్స్ (పార్ట్–ఎ)కు, బయోలాజికల్ సైన్స్‌కు (పార్ట్–బి) వేర్వేరుగా జవాబు పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. రాత పరీక్ష, ఇంటర్నల్స్ మార్కుల్లో ఎలాంటి మార్పు ఉండదని, ప్రతి సబ్జెక్టుకు 100 చొప్పున 600 మార్కులు ఉంటాయని స్పష్టం చేసింది. ఓరియంటల్ ఎస్సెస్సీ, వొకేషనల్ కోర్సుల్లోనూ ఎలాంటి మార్పులు లేవని వెల్లడించింది. ఇదీ ప్రశ్న పత్రాల స్వరూపం – 2 ఫార్మేటివ్ అసెస్మెంట్స్ కింద ఇంటర్నల్స్‌కు 20 మార్కులు – ఒక్కో ప్రశ్న పత్రంలో 20 ఆబ్జెక్టివ్/బహుళైచ్ఛిక ప్రశ్నలకు 20 మార్కులు – వాక్య రూపంలో సమాధానాలు రాయాల్సిన ప్రశ్నలకు 60 మార్కులు ఉంటాయి. 60 మార్కుల కోసం ఇచ్చే ప్రశ్నల స్వరూపం – వ్యాసరూప ప్రశ్నల విభాగంలో రెండు సెక్షన్లు ఉంటాయి. ఒక సెక్షన్లో ఇచ్చే 3 ప్రశ్నల్లో ఒక్క ప్రశ్నకు సమాధానం రాయాలి. దానికి 8 మార్కులు ఉంటాయి. మరో సెక్షన్‌లోనూ 3 ప్రశ్నల్లో ఒక దానికి సమాధానం రాయాలి. 8 మార్కులు ఉంటాయి. ఇందులో మొత్తంగా 16 మార్కులు. – స్వీయ రచన విభాగంలో 2 సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్లో 4 చొప్పున 8 ప్రశ్నలు ఉంటాయి. అందులో 2 చొప్పున 4 ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఒక్కో దానికి 4 మార్కుల చొప్పున 16 మార్కులు ఉంటాయి. – సృజనాత్మకత విభాగంలో 3 ప్రశ్నల్లో ఒక దానికి సమాధానం రాయాలి. దానికి 8 మార్కులు ఉంటాయి. – అవగాహన, ప్రతిస్పందన విభాగంలో మూడు ప్యాసేజీలు ఉంటాయి. వాటికి 20 మార్కులు ఉంటాయి. – గతంలో ద్వితీయ భాష మినహా మిగతా 5 సబ్జెక్టుల్లో రెండు చొప్పున 10 పేపర్లు ఉండేవి. ఇప్పుడు ద్వితీయ భాష, మిగతా 5 సబ్జెక్టులకు 5 పేపర్లే ఉంటాయి. ప్రతి సబ్జెక్టులో ఆబ్జెక్టివ్/బహుళైచ్ఛిక ప్రశ్నలవి 20 మార్కులు కలుపుకొని 80 మార్కులకు ఒక్కో ప్రశ్న పత్రాన్ని ఇస్తారు. ఇలా మొత్తంగా 480 మార్కులు ఉంటాయి. అలాగే ఒక్కో సబ్జెక్టులో ఇంటర్నల్స్ 20 మార్కులు ఉంటాయి. ఇలా ద్వితీయ భాష, 5 సబ్జెక్టుల్లో మొత్తం 120 మార్కులు ఉంటాయి. – గతంలో హిందీ మినహా ఇతర సబ్జెక్టుల్లో ఉన్న 10 పేపర్లలో ఒక్కో పేపర్లో ఆబ్జెక్టివ్‌ను 5 మార్కులకు 10 ప్రశ్నలు ఇచ్చి ఒక్కో దానికి అర మార్కు ఇచ్చేవారు. ఇలా ప్రతి సబ్జెక్టులో రెండు పేపర్లలో కలిపి 10 మార్కులకు ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉండేవి. ఇప్పుడు 20 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 20 మార్కులు ఉండనున్నాయి. -
మే 17 నుంచి టెన్త్ పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్: మే 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించేలా పాఠశాల విద్యా శాఖ అకడమిక్ క్యాలెండర్‌ను ఖరారు చేసింది. కరోనా కారణంగా 11 ప్రశ్నపత్రా లకు బదులు ఈసారి 6 ప్రశ్నపత్రాలతోనే పరీక్షలను నిర్వహించ నుంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9, 10 తరగతులకు ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారం భించనున్నందున.. పని దినాలు, బోధన, పరీక్ష లకు సంబంధించిన షెడ్యూల్ తదితర అం శాలతో ప్రతిపాదిత క్యాలెండర్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. ప్రభు త్వం ఒకటి, రెండు రోజుల్లో ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. అయితే ఇందులో 9, 10 తరగతులకు మాత్రమే అకడమిక్ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. మిగతా తరగతుల విషయాన్ని ప్రస్తా వించలేదు. ఆయా తరగతులకు ప్రత్యక్ష బోధన నిర్వహిస్తుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ 1 నుంచి 8 తరగతు లకు ప్రత్యక్ష బోధన కుదరకపోతే ఆన్లైన్/ డిజిటల్ విధానంలోనే బోధనను కొనసాగించి, విద్యార్థులకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే అధికారులు మాత్రం ఫిబ్రవరి తరువాత 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష బోధనను ప్రారంభించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ అంశాలన్నింటిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మొత్తం 204 పనిదినాలు మొత్తంగా 204 పని దినాలుగా నిర్ణయించారు. అందులో గత సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్/డిజిటల్ పద్ధతిలో 115 రోజులు అవుతాయి. ఇక ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మే 26వ తేదీ వరకు 89 రోజుల పని దినాలు ఉంటాయి. ఈ రోజుల్లో ప్రత్యక్ష విద్యా బోధనతో పాటు ఆన్లైన్/డిజిటల్ విద్యా బోధన కొనసాగుతుంది. ఫిబ్రవరిలో 24, మార్చిలో 25, ఏప్రిల్‌లో 21, మేలో 19 పని దినాలు ఉంటాయి. ఉదయం 9.30 నుంచి బడి పాఠశాలలు ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు ఉంటాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉదయం 8:45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయి. డిజిటల్ బోధన పదో తరగతికి ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు (రెండు పీరియడ్లు) ఉంటుంది. 9వ తరగతికి సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు (రెండు పీరియడ్లు) ఉంటాయి. 70 శాతం సిలబస్‌నే టీచర్లు ప్రత్యక్ష బోధనతోపాటు, ఆన్లైన్/డిజిటల్ విధానంలో బోధిస్తారు. మిగతా 30 శాతం సిలబస్ ప్రాజెక్టు వర్క్స్, అసైన్మెంట్లకే ఉంటుంది. వాటిని ఇంటర్నల్ అసెస్మెంట్స్, సమ్మేటివ్ అసెస్మెంట్/బోర్డు పరీక్షల్లో పరిగణనలోకి తీసుకోరు. ప్రత్యక్ష బోధనకు హాజరు తప్పనిసరి కాదు ప్రత్యక్ష బోధనకు హాజరు తప్పనిసరి కాదు. ఇంటినుంచే చదువుకుంటామంటే తల్లిదండ్రుల అంగీకారంతో అనుమతించాలి. కనీస హాజరును పట్టించుకోకుండా పరీక్షలకు అనుమతించాలి. ఏ ఒక్క విద్యార్థినీ ఏ కారణంతోనూ పరీక్షల నుంచి విత్‌హెల్డ్‌లో పెట్టడానికి వీల్లేదు. విద్యార్థుల ఆరోగ్య ప్రణాళిక – పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభానికి ముందే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీతో సమావేశం నిర్వహించాలి. కోవిడ్ జాగ్రత్తలు, రోగనిరోధకత పెంపు, మానసిక ఆరోగ్యం, పరిశుభ్రత, భౌతిక దూరం పాటించడం తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి. – విద్యార్థులకు రెగ్యులర్‌గా ఆరోగ్య పరీక్షలు చేయించాలి. పాఠశాలల్లో విద్యార్థులకు, సిబ్బందికి ఐసోలేషన్ రూమ్‌లను ఏర్పాటు చేయాలి. విద్యార్థులకు ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉంటే వారి తల్లిదండ్రులకు తెలియజేసి, తగిన జాగ్రత్తలతో ఇళ్లకు పంపేందుకు రవాణా సదుపాయం కల్పించాలి. ఇవీ అకడమిక్ క్యాలండర్‌లోని ప్రధాన అంశాలు ఫిబ్రవరి 1: పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభం మే 26 : చివరి పని దినం మే 27 – జూన్ 13 : వేసవి సెలవులు పరీక్షల షెడ్యూల్ మార్చి 15 లోగా: ఫార్మేటివ్ అసెస్మెంట్–1 పరీక్ష ఏప్రిల్ 15 లోగా: ఫార్మేటివ్ అసెస్మెంట్–2 పరీక్ష మే 7 – మే 13 : 9వ తరగతికి సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ) పరీక్షలు మే 17 – మే 26 : పదో తరగతి పరీక్షలు. (మార్చి/ఏప్రిల్‌లో సైన్స్ సెమినార్లు, ఎగ్జిబిషన్లను వర్చువల్‌గానే నిర్వహించాలి) -
పది పరీక్షలు పూర్తిగా రద్దు చేయాలి: విష్ణు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షలు నిర్వహించే విధానం పూర్తిగా రద్దు చేస్తే బాగుంటుందని టాలీవుడ్ హీరో మంచు విష్ణు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్ చేశారు. ‘ఈ ఏడాదే కాకుండా పది పరీక్షలు పూర్తిగా రద్దు చేయబడాలని నేను బలంగా కోరుకుంటున్నాను. 14,15 ఏళ్ల వయసులో బోర్డు పరీక్షలు అంటూ విద్యార్థులపై ఒత్తిడి అవసరమా? ఈ పరీక్షల ఉద్దేశం ఏమిటి?’ అంటూ మంచు విష్ణు ట్విటర్లో ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక పలువురు నెటిజన్లు విష్ణు అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. గతంలో 7వ తరగతి విద్యార్థులకు కూడా బోర్డు పరీక్షలు ఉండేవని ఆ తర్వాత తీసేశారని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ‘విద్యాభ్యాసానికి మన పరీక్షల నిర్వహణ వ్యవస్థ ఒక శాపం లాంటిది’ అని జాకీర్ హుస్సేన్ కమిటీ 1939 లోనే వ్యాఖ్యానించిన విషయాన్ని మరో నెటిజన్ గుర్తుచేశాడు. ఇక కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాలు పది పరీక్షలను రద్దు చేశాయి. అంతేకాకుండా సీబీఎస్ఈ పరిధిలోని 10,12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్ ఇస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. I strongly believe that board exams for 10th Grade must be abolished. Totally. Forever. Not just this year. What is the purpose of this board exam pressure for 14/15year olds????? — Vishnu Manchu (@iVishnuManchu) June 29, 2020 -
టెన్త్ పరీక్షలపై కొనసాగుతున్న ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన పదో తరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ హైకోర్టులో ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లాల వారీగా పరీక్షలు నిర్వహించేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టును కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కంటైన్మెంట్ జోన్లలో ఉండే విద్యార్థుల పరిస్థితి ఏంటని శుక్రవారం హైకోర్టు ప్రశ్నించింది. (‘పది’పై హైకోర్టులో విచారణ) ఇప్పుడు పరీక్షలు రాయలేని విద్యార్థులకు సప్లిమెంటరీకి అనుమతి ఇస్తామని ప్రభుత్వం తెలపగా, సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అయితే రెగ్యులర్ విద్యార్థులుగా గుర్తిస్తారా అని హైకోర్టు తిరిగి ప్రశ్నించింది. ఈ మేరకు ప్రభుత్వాన్ని సంప్రదించి తమ నిర్ణయాన్ని రేపు చెబుతామని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. దీంతో శనివారం కంటైన్మెంట్ జోన్లు, సప్లిమెంటరీపై పూర్తి వివరాలను తెలియజేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు మళ్లీ రేపటికి(శనివారం) వాయిదా వేసింది. (ఏపీలో మరో 50 పాజిటివ్ కేసులు) -
పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ
-
టెన్త్ పరీక్షలపై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన పదో తరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ జిల్లాల వారీగా పదో తరగతి పరీక్షల నివేదికను హైకోర్టుకు నివేదించారు. ఈ క్రమంలో జిల్లాల వారీగా పదో తరగతి పరీక్షల నిర్వహణకు సిద్ధంగా ఉన్నారా అని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పది పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉందని అడ్వాకేట్ జనరల్ పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణలో ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఈ పరిస్థితుల్లో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. దీనిని పరిశీలించిన హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు మధ్యలో నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల సడలింపులు ఇవ్వడంతో తిరిగి పరీక్షలు నిర్వహించేందుందు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును విన్నవించింది. (దేశంలో 24 గంటల్లో 9,304 కేసులు) -
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ కారణంగా వాయిదా పడ్డ పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. హైకోర్టు ఇటీవల జారీచేసిన మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. జూన్ 8 నుంచి జూలై 5వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలన్నీ ఉదయం 9.30 నుంచి మధ్యాహం 12.15 గంటల వరకు జరుగనున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతిపరీక్షకు రెండు రోజుల వ్యవధి వచ్చేలా షెడ్యూల్‌ను రూపొందించారు. అలాగే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులందరూ భౌతిక దూరం పాటించేలా పరీక్ష హాల్లో చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతమున్న 2,530 పరీక్షా కేంద్రాలకు అదనంగా మరో 2,005 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. -
పది పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టెన్త్ పరీక్షలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని దాఖలు చేసిన అఫిడవిట్‌పై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టిన హైకోర్టు జూన్ 8 నుంచి పదో తరగతి పరీక్షలను నిర్వహించుకోవాలని అనుమతి ఇచ్చింది. విచారణ సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద అన్ని చర్యలు తీసుకుంటామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. (‘కేసీఆర్ భాష సరిగా లేదు’) జూన్ 3న కోవిడ్ పరిస్థితులను సమీక్షించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదేవిధంగా జూన్ 4న కోవిడ్ పరిస్థితులపై నివేదిక సమర్పించాలని హైకోర్టు సూచించింది. ఇక జూన్ 8న పరీక్షలు నిర్వహించుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతి పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండాలని హైకోర్టు పేర్కొంది. టెన్త్ క్లాస్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పరీక్షల సమయంలో అన్ని చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. -
కోవిడ్-19 ఎఫెక్ట్ : సీబీఎస్ఈ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్న క్రమంలో సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్‌లో ఉన్న టెన్త్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు సీబీఎస్ఈ ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించబోమని బోర్డు స్పష్టం చేసింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో నెలకొన్న పరిస్థితిని నిశితంగా పరిశీలించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. కాగా పది, పన్నెండో తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేస్తారని గతంలో వచ్చిన వార్తలను సీబీఎస్ఈ తోసిపుచ్చింది. పరీక్షలను పూర్తిగా రద్దు చేసే అంశంపై తుది నిర్ణయం తీసుకోలేదని గతంలో ప్రకటించిన సీబీఎస్ఈ బోర్డు తాజాగా పదో తరగతి పెండింగ్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. చదవండి : సీబీఎస్ఈ సిలబస్ హేతుబద్ధీకరణ -
పరీక్షలు జరుగుతాయి.. చదువుకోండి
సాక్షి, విశాఖపట్నం: ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకున్న కరోనావైరస్ అన్ని వ్యవస్థల్నీ చిన్నాభిన్నం చేసేస్తోంది. ఆర్థిక, సామాజిక పరంగా ప్రభుత్వాలు, ప్రజలు, సంస్థలు.. కోలుకోనంతగా దెబ్బతిన్నాయి. అదే కోవలో విద్యా వ్యవస్థ కూడా కరోనా దెబ్బకు కునారిల్లుతోంది. సెట్స్ వాయిదా పడ్డాయి. పరీక్షలు రద్దయ్యాయి. ముఖ్యంగా పదో తరగతి పరీక్షలు కూడా మరోసారి వాయిదా వేశారు. అయితే ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు ఎంతగానో దోహదపడుతున్నాయి. ప్రభుత్వం వద్దన్నా కొన్ని ప్రైవేటు పాఠశాలలు మాత్రం 9వ తరగతి వరకూ పరీక్షలు నిర్వహిస్తామంటూ తల్లిదండ్రులకు ఫోన్ చెయ్యడం గమనార్హం. ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయి. ఒకటి నుంచి పదో తరగతి పరీక్షలు మరి కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యేవి. ఎంసెట్, నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షలు కూడా మే నెలలో నిర్వహించేందుకు విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రైవేట్ విద్యా సంస్థలు, అకాడమీలు పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ తరగతులు కూడా ప్రారంభించారు. పదోతరగతి పరీక్షలకు కూడా అంతా సిద్ధమవుతున్నారు. కానీ ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయిన ఒకట్రెండు రోజులకే కోవిడ్–19 దేశంలో విశ్వరూపం చూపించడం మొదలు పెట్టింది. దీంతో ఒకటి నుంచి 10వ తరగతి వరకూ వార్షిక పరీక్షలు వాయిదా పడ్డాయి. 9వ తరగతి వరకూ పరీక్షలు నిర్వహించే వీలు లేకపోవడంతో ఆ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థుల్ని పై క్లాసులకు ఎలాంటి పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మార్చి 22 నుంచి ఎవ్వరికీ ఒక్క క్లాసు కూడా జరగకపోవడంతో అంతా ఇంటిపట్టునే ఉండిపోయారు. ఏప్రిల్ 14 వరకూ లాక్డౌన్ నిర్వహించడంతో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూతపడ్డాయి. పరీక్షలూ వాయిదా పడ్డాయి. దీంతో విద్యార్థులంతా ఇళ్లకే పరిమితమైపోవడంతో ఆన్లైన్లో పాఠాలు, హోంవర్క్‌లు పంపిస్తున్నారు వివిధ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు. కోచింగ్ సెంటర్లూ ఖాళీ అయిపోయాయి. కరోనా ప్రభావం తగ్గిన తర్వాతే అన్ని పరీక్షలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యార్థులంతా ఆన్లైన్ చదువులపైనే దృష్టిసారించారు. విద్యార్థులు నష్టపోకుండా... ఈ విద్యా సంవత్సరంలో జ్ఞాన సముపార్జన అవకాశాన్ని నష్టపోకుండా ఇంటర్నెట్లో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు 10వ తరగతి వరకూ పాఠాలు బోధిస్తుండటంతో విద్యార్థులు వాటిపై దృష్టి సారించారు. ఇవి కాకుండా దీక్షా యాప్ ద్వారా మొబైల్ ఫోన్లో పాఠాలు వినే వెసులుబాటు ఉంది. ఎంసెట్, నీట్, జేఈఈ వంటి ప్రవేశ ప రీక్షలకు శిక్షణ ఇచ్చే విద్యా సంస్థలు తమ వివరాల్ని రిజిస్టర్ చేసుకున్న వారికి ఆన్లైన్లో సందేహాల్ని నివృత్తి చేస్తున్నారు. పరీక్షలు జరుగుతాయి.. చదువుకోండి పరీక్షలు రద్దు చేసి.. పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా.. ప్రైవేట్ విద్యా సంస్థలు మాత్రం పరీక్షలు నిర్వహిస్తామని చెబుతున్నాయి. తమ స్కూల్స్‌లో చదువుతున్న విద్యార్థులకు యాజమాన్యం ఫోన్ చేసి.. ఫైనల్ పరీక్షలు జరుగుతాయి కాబట్టి చదువుకోవాలని చెబుతున్నారు. ప్రభుత్వం రద్దు చేసిందని చెబుతుంటే.. దాంతో తమకు సంబంధంలేదనీ.. ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ కావాలని తెగేసి చెబుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో పరిస్థితీ.. కరోనా వైరస్ కారణంగా పరీక్షలు, వాటి ఫలితాలు వాయిదా పడటంతో విద్యార్థుల్లో ఆందోళన పెరిగింది. ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలు రాసి.. వాటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇంతవరకూ ఇంటర్ స్పాట్ వాల్యూషన్ కూడా మొదలు కాలేదు. పదో తరగతి పరీక్షలు ఎప్పుడు జరుగుతా యన్నది కూడా ఇంకా స్పష్టత లేకపోవడంతో వారు మరో రకమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇక నీట్ జేఈఈ అడ్వాన్స్, ఎంసెట్, పీజీ, ఇంజినీరింగ్... ఇలా అన్ని రకాల విద్యల్ని అభ్యసిస్తున్న వారి పరిస్థితి ఒక్కో రకంగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందో ళన విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్నీ వెంటాడుతోంది. పరీక్షలు నిర్వహించడానికి వీల్లేదు కోవిడ్–19 ప్రభావంతో 9వ తరగతి వరకూ వార్షిక పరీక్షలు రద్దు చేసి పై తరగతులకు ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో ఈ ఉత్తర్వులను అన్ని పాఠశాలలూ అనుసరించాల్సిందే. ఏ ప్రైవేట్ పాఠశాలైనా పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.– బి.లింగేశ్వరరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి. -
పదో తరగతి పరీక్షలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9.30 గంటలకు పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. పరీక్షల నిర్వహణకు తెలంగాణలో 2,530 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. నేటి నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో సబ్బులు, లిక్విడ్ సబ్బులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచారు. జలుబు, దగ్గుతో వచ్చే విద్యార్థులకు ప్రత్యేక రూములు ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రం దగ్గర ఇద్దరు వైద్యులు,శానిటైజర్ ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణలో 30,500 మంది ఇన్విజిలేటర్లుగా బాధ్యతలు నిర్వర్తించనుండగా.. మాస్ కాపీయింగ్ జరగకుండా ఉండేందుకు 144 సిట్టింగ్ స్క్వాడ్స్, 4 ఫ్లైయింగ్ స్క్వాడ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. -
శరవేగంగా ‘పది’కి ఏర్పాట్లు
గుంటూరు ఎడ్యుకేషన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కారణంగా ఈ నెల 23 నుంచి ప్రారంభం కావాల్సిన పరీక్షలను ప్రభుత్వం 31వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. కాగా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు, పరీక్షల నిర్వహణలో చోటు చేసుకున్న మార్పులపై ఉపాధ్యాయులకు పూర్తిస్థాయిలో శిక్షణ కల్పించిన విద్యాశాఖ అధికారులు పరీక్షల విధి నిర్వహణలో పాటించాల్సిన నియమ, నిబంధనలపై జిల్లాలోని ఐదు విద్యాశాఖ డివిజన్ల వారీగా చీఫ్ సూపరింటెండెంట్లు, శాఖాధికారులకు అవగాహన కల్పించారు. దీంతో పాటు ఐదు డివిజన్ల వారీగా సమీక్షా సమావేశాలను సైతం పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల్లోని 1,041 ఉన్నత పాఠశాలల నుంచి పరీక్షలకు హాజరు కానున్న 60,042 మంది విద్యార్థులకు 269 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసిన అధికారులు పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లతో పాటు విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై దృష్టి కేంద్రీకరించారు. దీంతో పాటు పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులనే నియమించేందుకు చర్యలు చేపట్టారు.సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని చీఫ్ సూపరింటెండెంట్‌గా నియమించడంతో పాటు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులను ఒక్కో కేంద్రానికి ఒకరి చొప్పున పర్యవేక్షణకునియమిస్తున్నారు. 3,000 మంది ఇన్విజిలేటర్లు పదో తరగతి పరీక్షల విధులకు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మూడు వేల మంది ఉపాధ్యాయులను ఇన్విజిలేటర్లుగా నియమించేందుకు చర్యలు చేపట్టారు. ఇన్విజిలేటర్లుగా నియమించే క్రమంలో సీనియారిటీతో పాటు గతంలో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించిన ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏ మండలంలో పని చేస్తున్న ఉపాధ్యాయులను అదే మండలంలోని పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్లుగా నియమించాలని ప్రభుత్వ పరీక్షల విభాగ డైరెక్టర్ ఏ.సుబ్బారెడ్డి ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రతి మండల పరిధిలోని పరీక్షా కేంద్రాల్లో అవసరమైన ఇన్విజిలేటర్ల మొత్తం సంఖ్యను పరిగణలోకి తీసుకుని, అవసరమైతేనే పక్క మండలాల్లోని ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇది మండల పరిధిలోని ఇన్విజిలేటర్ల సంఖ్యలో ఐదు శాతానికి మించకూడదని స్పష్టం చేశారు. దీంతో పాటు పరీక్షా కేంద్రాల్లో మాల్ ప్రాక్టీసుతో పాటు అవకతవకలకు ఆస్కారం ఇవ్వకుండా ఇన్విజిలేటర్లను ప్రతి మూడురోజులకోసారి జంబ్లింగ్ విధానంలో ఇతర పరీక్షా కేంద్రాలకు పంపనున్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ జిల్లాకు చేరవేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. విద్యార్థుల హాల్ టికెట్లను పరీక్షలకు వారం రోజుల ముందుగా పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. -
వేర్వేరుగా పరీక్ష రాయనున్న కవలలు వీణావాణి
సాక్షి, సిటీబ్యూరో: పదో తరగతి వార్షిక పరీక్షల సమయం సమీపిస్తోంది. విద్యార్థులకు సంబంధించిన హాల్‌టికెట్లను రెండు మూడు రోజుల్లో వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 19 నుంచి జరగనున్న టెన్త్ వార్షిక పరీక్షలకు గ్రేటర్ పరిధిలో 1.72 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరి కోసం 761 పరీక్ష కేంద్రాలను ఎంపిక చేశారు. ఎగ్జామ్స్ దగ్గర పడుతుండటంతో ఇటు విద్యార్థుల్లోనూ.. అటు తల్లిదండ్రుల్లోనూ ఆందోళన మొదలైంది. పరీక్షల సమయంలో ఎలాంటి ఆందోళనకు గురికావద్దని నిపుణులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలనిపిల్లలకు మానసికంగా ధైర్యం చెప్పి అండగా ఉండాలని సూచిస్తున్నారు. కోరితేవీణావాణీలకు స్క్రైబ్స్ పుట్టుకతోనే రెండు తలలు అతుక్కునిజన్మించిన వీణావాణీలు 2016 వరకు నిలోఫర్ ఆస్పత్రిలో ఉన్నారు. అక్కడ వారు ప్రత్యేక ఉపాధ్యాయుల పర్యవేక్షణలో చదువుకోవడం తెలిసిందే. 2017 జనవరిలో వారిని స్టేట్‌హోంకు తరలించగా.. మహిళా శిశుసంక్షేమశాఖ అధికారులు 2018 విద్యా సంవత్సరంలో వీరికి వెంగళ్రావునగర్ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ కల్పించారు. వీరికి వేర్వేరు అడ్మిషన్ నంబర్లు (5618, 5619) ఇచ్చారు. ఇటీవల వీరు ఎస్ఎస్సీ బోర్డుకు దరఖాస్తు చేసుకోగా.. ఇద్దరికీ కలిపి ఒకే హాల్‌టికెట్ ఇవ్వాలా? వేర్వేరుగా ఇవ్వాలా? అనే అంశంపై బోర్డు అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. పరీక్ష రాసే అర్హత, శక్తిసామర్థ్యాలు వారికి ఉన్నట్లు నిర్ధారించుకుని ఇద్దరికీ వేర్వేరుగా రెండు హాల్‌టికెట్లు జారీ చేయాలని నిర్ణయించారు. మరో రెండు మూడు రోజుల్లో వీరికి హాల్ టికెట్లు అందజేసే అవకాశం ఉంది. వీరిలో ఒకరి ముఖం కింది వైపు చూస్తుంటే.. మరొకరిది పైకి చూస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు కూర్చొని స్వయంగా పరీక్ష రాసే అవకాశం తక్కువ. వీణావాణీలు కోరితే ఇద్దరికీ స్క్రైబ్‌లను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా విద్యాశాఖప్రకటించింది. ఈసారైనా గట్టెక్కేనా? హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మొత్తం 82 వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నారు. వీరిలో 7200 మంది వరకూ సర్కారు బడుల్లో చదువుతున్న పిల్లలున్నారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 47155 వేల మంది విద్యార్థులు ఉండగా, 17 వేల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. మేడ్చల్ జిల్లా పరిధిలో 43139 వేలకుపైగా విద్యార్థులు పరీక్షకు హాజరు కానుండగా, పది వేల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం (సీసీఈ)తో పరీక్షల తీరు మారింది. పిల్లల్లో సృజనాత్మకత, విషయ పరిజ్ఞానం పెంపొందించాలనే లక్ష్యంతో రూపొందించిన సిలబస్‌పై పలు పాఠశాలల్లోని ఉపాధ్యాయులు పట్టు సాధించలేకపోయారు. ఫలితంగా మ్యాథ్స్, సైన్స్‌ల్లో మూడేళ్లుగా విద్యార్థుల ఉత్తీర్ణత తగ్గుతూ వస్తోంది. ఈ సారి ఎలాగైనా ఉత్తీర్ణత శాతం పెంచి జిల్లా పరువు నిలబెట్టాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. తల్లిదండ్రులూ.. ఈ జాగ్రత్తలు తీసుకోండి డిస్ట్రిక్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు ద్వారా రూపొందించిన ప్రశ్నపత్రాలతో ఇప్పటికే అభ్యాస పరీక్షలు నిర్వహించాం. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, ఆ మేరకు వారికి సబ్జెక్టుల వారీగా ప్రత్యేక శిక్షణనిస్తున్నాం. ఉపాధ్యాయులతో పాటు ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుపై శ్రద్ధ చూపించాలి. వేళకు ఆహారం అందివ్వడంతో పాటు వేళకు నిద్ర పుచ్చడం, తెల్లవారుజామున 5 గంటలకు నిద్రలేపి చదివించడం, చదువుకునే సమయంలో సాధ్యమైనంత వరకు టీవీ, సెల్‌ఫోన్ వంటివాటికి దూరంగా ఉంచాలి. ఇంట్లో తల్లిదండ్రులు ఎటువంటి వాదులాటకు దిగకూడదు. పిల్లల భావోద్వేగాలపై ప్రభావం చూపే అంశాలను చర్చించరాదు. ప్రతికూల వాతావరణం పిల్లల జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తుంది. – బి.వెంకటనర్సమ్మ, హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి -
మార్చి 21 నుంచి టెన్త్ పరీక్షలు!
సాక్షి,హైదరాబాద్: పదోతరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈమేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు ముమ్మరం చేసింది. ఇంటర్మీడియేట్ పరీక్షలు ముగిసే రెండ్రోజుల ముందు టెన్త్ పరీక్షలు ప్రారంభిస్తుండగా...ఈ సారి కూడా అదే తరహాలో పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. వారంలోపు పరీక్షల షెడ్యూల్‌ను ప్రభు త్వ పరీక్షల విభాగంప్రకటించే అవకాశం ఉంది. మార్చి21 నుంచి పరీక్షలు ప్రారంభించే అంశంపై అధికారులు చర్చించినప్పటికీ.. షెడ్యూ ల్లో ఒకట్రెండు రోజులు అటుఇటు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్‌ను బోర్డు విడుదల చేసింది. మార్చి 4 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలను, 5 నుంచి ద్వితీయ సంవత్సర పరీక్షలను ప్రారంభించేలా షెడ్యూలును (టైంటేబుల్) బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ప్రకటించారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇంటర్ జనరల్, వొకేషనల్ విద్యార్థులకు 2020 ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షను జనవరి 28న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, ఎని్వరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను అదే నెల 30న నిర్వహిస్తామని వెల్లడించారు. వొకేషనల్ పరీక్షలకు కూడా ఇవే తేదీలను వర్తింపజేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 9.5 లక్షల మంది హాజరుకానున్నారు. -
నేటి నుంచి ‘పది’ మూల్యాంకనం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం జిల్లాలో ఈనెల 15నుంచి ప్రారంభం కానుంది. గతంలో మాదిరిగానే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కలిపి ఒకే మూల్యాంకన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. హయత్‌నగర్ మండలంలోని వర్డ్ అండ్ డీడ్ స్కూల్లో జవాబు పత్రాలను దిద్దేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 26వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. పదో తరగతి వార్షిక పరీక్షలు ఈనెల 3న పూర్తయ్యాయి. జిల్లాకు సంబంధించిన జవాబు పత్రాలు మూల్యాంకనం కోసం ఇతర జిల్లాలకు పంపించారు. ఇతర జిల్లాలవి మన దగ్గరకు చేరవేశారు. అన్ని సబ్జెక్టులు కలిపి సుమారు ఆరు లక్షల జవాబు పత్రాలు వచ్చినట్లు సమాచారం. వీటిని మూల్యాంకనం చేసి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకం. జవాబు పత్రాలు దిద్దే బాధ్యతలను సబ్జెక్టుల వారీగా స్కూల్ అసిస్టెంట్ల్ల(ఎస్ఏ)కు అప్పగించారు. వీరికి సహాయకులుగా సెకండ్ గ్రేడ్ టీచర్ల(ఎస్జీటీ)కు విధులు కేటాయించారు. ఇలా మొత్తం మూడు వేల మంది టీచర్లు మూల్యాంకన విధుల్లో పాల్గొనాల్సి ఉంది. మూల్యాంకనం.. విధుల్లో భాగమే ఎప్పటిలాగే ఈసారి కూడా ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన మూల్యాంకనం చేపడుతున్నారు. ఈ మూల్యాంకనం విధులకు హాజరయ్యేందుకు చాలా మంది ఉపాధ్యాయులు వెనకాడుతున్నారు. మూడు జిల్లాల ఉపాధ్యాయులు హాజరుకావాల్సి ఉండగా కొందరు డుమ్మా కొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. కొందరు టీచర్లు ప్రజాప్రతినిధులతో సిఫారసు కూడా చేయించుకుంటున్నారని వినికిడి. దూరభారం కారణంగా తాము రాలేమని టీచర్లు చెబుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మూడు సంవత్సరాల కిందట ఏర్పడిన కొత్త జిల్లాల వారీగా మూల్యాంకన కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ని ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు లేవనెత్తారు. ఇందుకు అంగీకరించని ప్రభుత్వం.. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే నిర్వహించాలని సూచించింది. ముఖ్యంగా మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు సుదూర ప్రాంతంలో ఉన్న మూల్యాంకన కేంద్రానికి రాకపోకలు సాగించేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. కొందరు అనారోగ్య కారణంగా మూల్యాంకనానికి విముఖత చూపిస్తుండగా.. మరికొందరు ఉద్దేశపూర్వకంగానే గైర్హాజరవుతున్నట్లు ఆరోపణలున్నాయి. సబ్జెక్టుల వారీగా నియమించిన ఉపాధ్యాయులు విధులకు హాజరుకాకపోతే.. మిగిలిన వారిపై భారం పడుతుంది. పైగా 11 రోజుల్లోనే అన్ని పేపర్లను మూల్యాంకనం చేయాల్సి ఉంది. సరిపడు ఉపాధ్యాయులు హాజరుకాకపోతే మూల్యాంకన ప్రక్రియ ఆలస్యం అయ్యేందుకు ఆస్కారం ఉంది. గతేడాది వివిధ జిల్లాలకు చెందిన సబ్జెక్టు ఉపాధ్యాయులు కొందరు రాకపోవడంతో మూల్యాంకన ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. ఇది ఈ ఏడాది పునరావృతమైతే రాష్ట్రవ్యాప్తంగా ఫలితాల ప్రకటనపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉండటంతో జిల్లా విద్యాశాఖ అప్రమత్తమైంది. కచ్చితంగా విధులు కేటాయించిన ఉపాధ్యాయులు మూల్యాంకనానికి హాజరుకావాల్సిందేనని, ఉదయం 9 గంటల వరకు మూల్యాంకన కేంద్రంలో రిపోర్టు చేయాలని స్పష్టం చేసింది. -
ముగిసిన ‘పది’ పరీక్షలు
ఆరిలోవ(విశాఖతూర్పు): పదో తరగతి పబ్లిక్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. గత నెల 18న ప్రారంభమైన పరీక్షలు 17రోజుల పాటు జరిగాయి. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ రెండో తేదీకే ముగియాల్సి ఉన్నా ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా వాయిదా పడిన ఇంగ్లిష్ పరీక్ష ను బుధవారం నిర్వహించడంతో మూడో తేదీతో ముగి శాయి. జిల్లావ్యాప్తంగా 242 పరీక్ష కేంద్రాల్లో 56,683 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో బాలురు 28,953 మంది కాగా 27,730 మంది బాలికలున్నారు. ఈ సారి పరీక్షల నిర్వహణలో విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు అనుకూలంగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పరీ క్షలు ప్రశాంతంగా ముగిశాయి. 13 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 242మంది చీఫ్ ఎగ్జామినర్లు, 242మంది అసిస్టెంట్ చీఫ్ ఎగ్జామినర్లు పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించారు. అన్నీ ప్రభుత్వ కేంద్రాలే.. ఈ సారి పదో తరగతి పరీక్షలను నగరంతో పాటు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే నిర్వహించారు. సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన కొయ్యూరు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, చింతపల్లి గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల, క్రిస్టియన్ అరకు ఆదర్శ పాఠశాల, అనంతగిరి ప్రభుత్వ ఆదర్శ పాఠశాల, పాడేరులోని ఏపీ గిరిజన విద్యార్థుల సంక్షేమ పాఠశాల, చింతపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పెదబయలులోని జిల్లా పరి షత్ ఉన్నత పాఠశాలలపై ప్రత్యేక నిఘాపెట్టారు. 144 సెక్షన్ అమలు చేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రైవేట్ యాజమాన్యాలకు సహకారం?: టెన్త్ పరీక్షల్లో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల పెత్త నం సాగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీఈవో కార్యాలయంలో కొందరు అధికారులు ప్రైవేట్ యాజ మాన్యాలకు సహకరించారనే విమర్శలున్నాయి. వారి పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇన్విజిలేటర్ల ద్వారా బిట్, చిన్న ప్రశ్నలకు జవాబులు అందించడంలో సహకారం అందించినట్లు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విమర్శలు వస్తున్నాయి. -
‘పది’ విద్యార్థులకు స్నాక్స్ పంపిణీ
ముషీరాబాద్: అతనో చిరు వ్యాపారి.. అయితేనేం సేవలో పెద్ద మనసున్న వ్యక్తి. ముషీరాబాద్ ఏక్‌మినార్‌లోని మసీదు ఎదుట ఓ చిన్న కూల్‌డ్రింక్స్ దుకాణం నిర్వహించే షాహెద్ సేవా దృక్పథంతో ముందుకెళ్తున్నాడు. తనకు తోచిన సాయం చేస్తూ గొప్పగా జీవిస్తున్నాడు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న విషయం విదితమే. సాయంత్రం 7గంటల వరకు విద్యార్థులు స్కూళ్లోనే ఉండాల్సి రావడంతో ఆకలితో అలమటిస్తున్నారు. ఇది గమనించిన సామాజిక కార్యకర్త మహ్మద్ షాహెద్.. వారి ఆకలి తీర్చాలని నిర్ణయించుకున్నాడు. గత ఐదేళ్లుగా పరీక్షలకు 40 రోజుల ముందు నుంచి ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులకు (దాదాపు 100 మంది) ప్రతిరోజు స్నాక్స్ అందజేస్తున్నాడు. అరటిపండ్లు , మిక్చర్, జ్యూస్, వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్స్, గ్లూకోజ్ ప్యాకెట్స్, మ్యాంగో టెట్రా ప్యాకెట్స్ ఇలా ఒక్కో రోజు ఒక్కో రకం అందిస్తున్నాడు. ప్రతిరోజు రూ.2,500 చొప్పున 40 రోజులకు రూ.లక్ష సేవకు వెచ్చిస్తున్నాడు. ‘నాంది’ ఫౌండేషన్‌కు ముందే షాహెద్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం విశేషం. తన షాప్‌లో షాహెద్ సేవానందం... ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, ఎవరైనా సహాయం కోరితే నాకు తోచిన సహాయం చేయడం బాధ్యతగా భావిస్తాను. నేను పెద్దగా చదువుకోకపోయినా కష్టపడి చదువుకునే పేద విద్యార్థులకు సహాయం చేయాలనుకున్నాను. సేవలోనే నాకు ఆనందం ఉంది. నాకు ఎంత ఆదాయం వస్తుందనేది ముఖ్యం కాదు.. నాకున్న దాంట్లో నేనెంత సహాయం చేస్తున్నాననేదే ముఖ్యం. – షాహెద్ -
ప్రభుత్వ పాఠశాలల్లోనే.. ‘పది’ పరీక్షా కేంద్రాలు!
తూర్పుగోదావరి , రాయవరం (మండపేట): వచ్చే విద్యా సంవత్సరంలో నిర్వహించే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రభుత్వ పాఠశాలల్లోనే నిర్వహించేలా విద్యా శాఖ చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ నుంచి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందాయి. గతేడాది వరకూ ఈ పరీక్షలను ప్రైవేటు స్కూల్స్‌లోనూ నిర్వహించేవారు. దీంతో ఇందుకు సాధ్యాసాధ్యాలను జిల్లా విద్యాశాఖ పరిశీలిస్తోంది. గతేడాది పరిస్థితి ఇదీ.. గతేడాది జిల్లాలోని 301 పరీక్షా కేంద్రాల్లో 65,768 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. వీటిలో 57 కేంద్రాలను ప్రైవేటు పాఠశాలల్లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ కేంద్రాలకు ప్రభుత్వ పాఠశాలలను గుర్తించాల్సి ఉంటుంది. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు ఎంతమంది రాస్తారన్న విషయం ఖరారైన తరువాత పరీక్షా కేంద్రాల జాబితాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంది. ప్రైవేటు కేంద్రాల కుదింపునకు చర్యలు జిల్లాలో ఉన్న 57 ప్రైవేటు పాఠశాలల్లో కేంద్రాల విషయంలో జిల్లా విద్యా శాఖకు కొంత ఇబ్బంది ఏర్పడుతున్నట్టు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బంది లేకున్నా, రాజమహేంద్రవరం, కాకినాడ వంటి పట్టణాల్లో ప్రైవేటు పరీక్షా కేంద్రాలకు బదులు ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేయడం కత్తి మీద సాము చందంగా ఉంటుందని అంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇంతవరకు ప్రైవేటు పాఠశాలల్లో నిర్వహించిన కేంద్రాలు 80 శాతం పట్టణాల్లోనే ఉన్నాయి. అందుతోన్న సమాచారం మేరకు 30 ప్రైవేటు కేంద్రాలు తగ్గే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రైవేటు కేంద్రాల రద్దు ఎందుకంటే.. సర్కారు బడుల్లో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అవసరమైన మౌలిక వసతులు లేవని ప్రైవేటు పాఠశాలలను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ కేంద్రాలున్న చోట ప్రైవేటు పాఠశాలల వర్గాలు పెత్తనం చెలాయిస్తున్నాయని, కొన్నిచోట్ల ప్రశ్నా పత్రాలను ముందుగానే తెరుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం ఏర్పడుతుందని విద్యా శాఖ అనుమానం. ఈ చర్యలకు అడ్డుకట్ట వేసేందుకే ప్రభుత్వ పాఠశాలల్లోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పోలీస్టేషన్‌కు 4 కిలోమీటర్ల పరిధిలో.. గతేడాది వరకు పోలీస్టేషన్ నుంచి రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాఠశాలలనే పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేసేవారు. దీని వల్ల ఎక్కువగా ప్రైవేటు పాఠశాల్లోనే కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి వచ్చేది. ఈ ఏడాది పోలీస్టేషన్ నుంచి పరీక్షా కేంద్రాల పరిధి 4 కిలోమీటర్లకు పెంచారు. కళాశాలలూ పరిశీలించే అవకాశం దీంతో ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో టెన్త్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇంటర్, టెన్త్ పరీక్షల షెడ్యూల్‌ను అనుసరించి దీనిపై నిర్ణయం ఉండే అవకాశం ఉంది. కసరత్తు చేస్తున్నాం ప్రభుత్వ పాఠశాలల్లోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలనే విషయంపై కసరత్తు చేస్తున్నాం. డివిజన్ కేంద్రాల నుంచి సమాచారం రప్పిస్తున్నాం. నెలాఖరు నాటికి స్పష్టత వసుతంది. – జి.నాగేశ్వరరావు, ఏడీ, ప్రభుత్వ పరీక్షల విభాగం, కాకినాడ కట్టుదిట్టంగా నిర్వహించేందుకే.. మాస్ కాపీయింగ్ నిరోధానికి ఏటా విద్యా శాఖ కొత్త విధానాలను అవలంబిస్తోంది. టెన్త్ పరీక్షలను పూర్తిగా ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నాం. – ఎస్.అబ్రహం, జిల్లా విద్యాశాకాధికారి, కాకినాడ -
అబ్బాయి ఫెయిల్.. కుటుంబం పండుగ..!!
భోపాల్, మధ్యప్రదేశ్ : పదో తరగతిలో ఫెయిల్ అబ్బాయినో లేక అమ్మాయినో ఇంట్లో ఏమంటారు?. ఏం చదివావు ఏడాదిగా అని ప్రశ్నిస్తారు. తప్పినందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మధ్యప్రదేశ్‌లోని ఓ కుటుంబం మాత్రం ఇందుకు విభిన్నంగా స్పందించి స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. పదో తరగతి తప్పిన అబ్బాయి చేతికి పుష్పగుచ్ఛం ఇచ్చి, వీధిలో అందరికీ స్వీట్స్ పంచిందా కుటుంబం. పెద్ద ఎత్తున మేళతాళాలతో ఊరేగింపును నిర్వహించింది. టపాసులు పేల్చింది. ఎందుకిలా చేస్తున్నారని స్థానికులు అడిగిన ప్రశ్నకు పరీక్షల్లో తప్పినందుకు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని, జీవితంలో ఇది ఒక్కటే చివరి పరీక్ష కాదని చెప్పడానికే ఇలా చేస్తున్నామని బాలుడి కుటుంబ సభ్యులు వివరించారు. నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాయని చెప్పిన కొడుకు అన్షును తండ్రి సురేంద్ర గట్టిగా కౌగిలించుకున్నారని, అనంతరం స్నేహితులకు, బంధువులకు ఫోన్లు చేసి రప్పించారని పేర్కొన్నారు. ఈ ఘటనతో అన్షు ఆశ్చర్యపోయాడని వివరించారు. దీంతో బాలుడి తండ్రి పాజిటివ్ థింకింగ్‌కు ఫిదా అయిన స్థానికులు కూడా ఊరేగింపులో పాల్గొన్నారు. ఊరేగింపు అనంతరం మాట్లాడిన బాలుడు తనకు చదువుకోవాలని లేదని, తండ్రి ట్రాన్స్‌పోర్టు బిజినెస్‌ను కొనసాగించాలని భావిస్తున్నట్లు వెల్లడించాడు. సోమవారం మధ్యప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు వెల్లడయ్యాయి. ఫలితాలు వెలువడిన గంటల్లోనే దాదాపు 11 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
ఆర్థిక స్వార్థం వల్లే టెన్త్ పరీక్షల్లో కాపీయింగ్
ఏలూరు (మెట్రో) : జిల్లాలో ఆర్థిక స్వార్థం వల్లే పదో తరగతి పరీక్షల్లో కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారని కలెక్టర్ కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ ప్రగతితీరుపై ఆయన సమీక్షించారు. ఇటీవల నిర్వహించిన టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో చాలాచోట్ల కాపీలు జరిగాయంటే డబ్బులే ప్రధాన కారణంగా భావిస్తున్నానని, డబ్బులు తీసుకుని కాపీలను ప్రోత్సహించడం దుర్మార్గమన్నారు. ఒక విద్యార్థి విషయంలో డీఈఓ మళ్లీ పరీక్ష రాయించడాన్ని కలెక్టర్ తప్పుపట్టారు. ఏ అధికారంతో ఒక విద్యార్థితో తిరిగి జవాబులు రాయించారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ నివేదిక ప్రకారం బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆన్లైన్ విధానం ద్వారా అవినీతికి అడ్డుకట్ట జిల్లాలో హాస్టళ్లలో ఆన్లైన్ విధానాన్ని అమలు చేయడం వల్ల అవినీతికి అడ్డుకట్ట వేయగలిగామని కలెక్టర్ భాస్కర్ తెలిపారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో గురువారం సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలు తీరు, స్కాలర్‌షిప్‌ల జారీ వంటి అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో 8 వేలమంది విద్యార్థులను చేర్చుకోగా అందులో 6,700 మంది హాజరవుతున్నట్టు ఇన్నాళ్లూ అధికారులు లెక్కలు చూపించారని, బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయడంతో హాస్టళ్లలో ఉండేవారి సంఖ్య కేవలం 4,800 మందికి మించలేదన్నారు. డీఈఓ సీవీ రేణుక, అదనపు జేసీ షరీఫ్, సాంఘిక సంక్షేమశాఖ డీడీ రంగలక్ష్మీ దేవి, బీసీ సంక్షేమశాఖాధికారి జి.లక్ష్మీప్రసాద్ పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించాలి జిల్లాలో రోడ్డు ప్రమాదంలో ఒక్క మనిషి కూడా చనిపోకుండా ఉండేలా ప్రణాళిక రూపొందించాలే తప్ప మరణాల సంఖ్యను తగ్గిస్తామంటూ నివేదికలు సమర్పించడం ఏమిటని కలెక్టర్ భాస్కర్ రవాణా శాఖాధికారులను ప్రశ్నించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో గురువారం రాత్రి జిల్లా స్థాయి రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశానికి కలెక్టర్ భాస్కర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. 9 నుంచి సమ్మెటివ్ పరీక్షలు ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : ఏప్రిల్ 9వ తేదీ నుంచి సమ్మెటివ్(ఎస్ఏ –2) పరీక్షలు నిర్వహించనున్నట్టు డీఈఓ సీవీ రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా సంస్థ(ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్ రామకృష్ణారెడ్డి నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయని తెలిపారు. ఏప్రిల్ 9వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ 1 నుంచి 9వ తరగతి వరకూ ఎస్ఏ 2 పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వీటిలో భాగంగా 9వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకూ విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకూ, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకూ విద్యార్థులకు ఏప్రిల్ 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ పరీక్షలు జరుగుతాయన్నారు. మార్పులకు అనుగుణంగా జివి మాల్ ఏలూరు (మెట్రో): రిటైల్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా టెక్స్టైల్స్ రంగంలో నూతన ఒరవడి సృష్టించేందుకు జివి మాల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మాల్ ఎమ్‌డి జి.ఉమామహేశ్వరరావు తెలిపారు. స్థానిక ఆకర్‡్షప్రైడ్లో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని దుకాణాల కంటే భిన్నంగా 365 రోజులు ఒకే ధరను తమ మాల్లో వస్త్రాలపై నిర్ణయించామని చెప్పారు. లక్కీషాపింగ్మాల్ అధినేత రత్తయ్య, ఏలూరు జివి మాల్ అధినేత కె.రామకృష్ణ పాల్గొన్నారు. -
హడావుడి.. గందరగోళం!
కడప ఎడ్యుకేషన్: పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. ఎక్కడా ఆరోపణలకు తావివ్వం. కాపీయింగ్ జరగకుండా అరికడతాం. పరీక్షల పారదర్శకత కోసమే ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ విధానంలో నియమిస్తున్నాం. ఎక్కడైనా కాపీయింగ్‌కు పాల్పడితే యాక్టు 25ను అమలు చేస్తామని విద్యాశాఖాధికారుల డీంబకాలు తప్ప ఎక్కడా అమలు జరిగిన దాఖలాలు కనిపించలేదు. పరీక్షల్లో అంతా హడావుడి ఆర్భాటం చేశారే తప్ప కొత్తగా సాధించిందేమీ లేదు. అటు పిల్లలను, ఇటు ఇన్విజిలేటర్లను భయాందోళనకు గురి చేసి బయటనుంచి కాపీలను రాకుండా కొంతమేర అరికట్టారేమోకానీ కొన్ని పరీక్షా కేంద్రాల్లో మాత్రం మాస్‌కాపీయింగ్, చూచిరాతలు జోరుగా సాగాయి. దీంతోపాటు చాలా చోట్ల కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల యాజామాన్యం డబ్బులను ఎరవేసి తమకు అనుకూలమైన చీఫ్, డిపార్టుమెంట్ అధికారులతోపాటు ఇన్విజిలేటర్లను నియమించుకుని తమ పనిని చక్కబెట్టుకున్నారని జోరుగా ఆరోపణలు వచ్చాయి. ప్రొద్దుటూరు డిప్యూటీ డీఈఓ ఇటీవలే కొత్తగా బాధ్యతలను తీసుకోవడం.. ఆ డివిజన్‌పై సరైన అవగాహన లేకపోవడం తదితర కారణాలతో ప్రొద్దుటూరులో కూడా జోరుగా మాస్ కాపీయింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇ రాయచోటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇక్కడ చాలామంది చీఫ్, డిపార్టుమెంట్ అధికారులతోపాటు ఇన్విజిలేటర్లు ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు ఇచ్చే కాసులకు కక్కుర్తిపడి లోలోపల జోరుగా కాపీయింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు ఈ ఏడాది అర్హత లేని వారిని కూడా స్క్వాడ్ వి«ధుల్లో నియమించారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపించాయి. పులివెందుల,వీఎన్‌పల్లి, ఎర్రగుంట్ల, ఖాజీపేట, మఠం, రాజంపేటలో కూడా కాపీయింగ్ ఆరోపణలున్నాయి. పకడ్బందీగా నిర్వహించాం:పది పరీక్షలను ఈ ఏడాది చాలా పకడ్బందీగా నిర్వహించాం. ఆరోపణలు వచ్చిన ప్రతిచోట గట్టి నిఘాను ఉంచి పరీక్షలను ప్రశాంతంగా నడిపించాం. కాపీయింగ్‌ను అరికట్టాం. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిని పరీక్ష విధుల నుంచి కూడా తొలగించాం. పరీక్షలు ప్రశాతంగా ముగిశాయి. – పొన్నతోట శైలజ, డీఈఓ -
ముగిసిన 10 పరీక్షలు
ఆరిలోవ(విశాఖతూర్పు) :పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఈ పరీక్షలు ఈనెల 15న ప్రారంభమైన విషయం తెలిసిందే. పరీక్షలు ముగియడంతో విద్యార్థుల్లో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. సాంఘిక శాస్త్రం–2 పరీక్ష ముగియగానే పరీక్ష హాల్ నుంచి బయటకు వచ్చి స్నేహితులతో కరచాలనం చేసుకొని సరదాగా గడిపారు. ఎలా రాశావని ఒకర్నొకరు అడుగుతూ సందడిగా గడిపారు. పదికి పది గ్యారంటీ అంటూ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. పరీక్షలు ముగియడంతో సాయంత్రం విద్యార్థులంతా బీచ్‌లో వాలిపోయారు. ఇదిలావుండగా ఒకేషనల్ కోర్సులు చదువుతున్న వారికి ఈ నెల 29 వరకూ పరీక్షలు జరగనున్నాయి. 99 శాతానికి పైగా హాజరు.. విద్యాశాఖ అధికారులు జిల్లాలో 55,493 మంది విద్యార్థులకు పరీక్ష హాల్ టిక్కెట్లు పంపించారు. వారిలో 99 శాతం పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 597 మంది ప్రైవేట్ విద్యార్థులున్నారు. ప్రతి పరీక్షకు 100కు పైగా గైర్హాజరయ్యారు. గణితం పరీక్షకు (1,2 పేపర్లు) అన్నింటికంటే ఎక్కువగా 142 మంది గైర్హాజరయ్యారు. మాల్ ప్రాక్టీస్ కేసులు లేవు జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఈవో బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో విద్యార్థులు ఎలాంటి మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడే అవకాశం కలగలేదన్నారు. దీంతో ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించగలిగామన్నారు. జిల్లాలో 240 పరీక్ష కేంద్రాలను 13 స్క్వాడ్ బృందాలు, రాష్ట్ర పరిశీలకులు సందర్శించి విధులు సక్రమంగా నిర్వహించామన్నారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేశామన్నారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడానికి సహకారం అందించిన పోలీసులు, వైద్య సిబ్బంది, 13 స్క్వాడ్ బృందాలు, రాష్ట్ర పరిశీలకులు, ఇన్విజిలేటర్లు, పరీక్ష నిర్వహణ అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఐదుగురిపై వేటు.. పరీక్షలు మొదలయినప్పటి నుంచి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఐదుగురిపై డీఈవో బి.లింగేశ్వరరెడ్డి వేటు వేశారు. వారిలో నలుగురు అధికారులను విధుల నుంచి బహిష్కరించగా, ఒక ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేయడం విశేషం. ఈనెల 21న జిల్లాలో పాడేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చీఫ్ సూపరింటిండెంట్ కృష్ణమూర్తి, డిపార్టుమెంట్ ఆఫీసరు ఎన్ఎస్ఎస్ పడాల్ పరీక్షల ప్రారంభమయినప్పటి నుంచి సరిగా విధులు నిర్వహించడం లేదనే ఆరోపణలున్నాయి. వీరిపై ఆ పరీక్ష కేంద్రం అబ్జర్వేటర్ ఇచ్చిన నివేదిక మేరకు డీఈవో విధుల నుంచి తప్పించారు. ఈనెల 23న అరుకు వేలీలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రం విధులు సరిగా నిర్వహించని చీఫ్ సూపరింటిండెంట్ రామారావు, నక్కపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రం విధుల సక్రమంగా నిర్వహించని చీఫ్ సూపరింటిండెంట్ పద్మావతిని విధుల నుంచి తప్పించారు. ఇదిలా ఉండగా వీరితో పాటు నక్కపల్లి హైస్కూల్ కేంద్రంలో ఇన్విజిలేటరుగా విధులు నిర్వహిస్తూ పరీక్ష హాల్లోనే సెల్ఫోన్లో మాట్లాడుతూ డీఈవో కంటపడిన (జానకయ్యపేట హైస్కూల్ భౌతిక శాస్త్రం) ఉపాధ్యాయుడు ఎం.రమణబాబును సస్పెండ్ చేశారు. -
‘తల్లి’డిల్లిన హృదయంతో..
పిఠాపురం : ప్రతిరోజూ ఎదురొచ్చి సాగనంపే తల్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయి శోకాన్ని మిగిల్చగా.. కనీసం తల్లి ఆఖరి చూపునకు కూడా నోచుకోలేక గుండెల నిండా బరువును నింపుకొని పదో పరీక్షకు హాజరైంది ఆ విద్యార్థిని. కొత్తపల్లి మండలం శ్రీరాంపురం శివారు ముమ్మిడివారిపోడుకు చెందిన బత్తినీడి అప్పారావు భవానీ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె అనంతలక్ష్మి ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు మూలపేట హైస్కూల్లో రాస్తోంది. ప్రతిరోజూ ఉదయాన్నే లేచి కుమార్తెను తయారు చేసి ఎదురు వచ్చి పరీక్షకు పంపించేది తల్లి భవానీ. అయితే శనివారం భవానీ తీవ్ర అస్వస్థతకు గురవ్వగా ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించి ఆదివారం ఇంటికి తీసుకువచ్చారు. సోమవారం ఉదయం పరీక్షకు వెళ్లేందుకు సిద్ధమవుదామని లేచిన కుమార్తె అనంతలక్ష్మి తల్లిని లేపింది. ఆమె ఎంతకు లేవకపోవడంతో విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పింది. వారు వచ్చి చూడగా ఆమె మృతి చెంది ఉండడంతో అందరు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇంతలో పరీక్షకు సమయం దగ్గర పడడంతో తల్లి ఆఖరి చూపును కూడా వదులుకుని అనంతలక్ష్మి పుట్టెడు దుఃఖంతో పరీక్ష కేంద్రానికి వచ్చి పరీక్ష రాసింది. ఇక్కడ పరీక్ష కేంద్రంలో కుమార్తె పరీక్ష రాస్తుంటే అదే సమయంలో అక్కడ మరుభూమిలో తల్లికి అంత్యక్రియలు నిర్వహించడం స్థానికులను కలచివేసింది. అయితే ఆమె పరీక్ష రాసి ఇంటికి వెళ్లే సరికి తల్లి అంత్యక్రియలు పూర్తి కావడంతో తల్లి కోసం గుండెలవిసేలా రోదించిన ఆమెను ఆపడం ఎవరి తరం కాలేదు. -
దుఃఖాన్ని దిగమింగుకుని..
కురవి/మరిపెడ: తండ్రి మృతితో దుఃఖాన్ని దిగమింగుకుని విద్యార్థి పదో తరగతి పరీక్ష రాసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని నేరడ శివారు మంచ్యా తండాలో చోటు చేసుకుంది. ఈ విషాదకరమైన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నేరడ శివారు మంచ్యా తండాకు చెందిన భూక్య రాజు(40) గుండెపోటుతో శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి కుమారుడు భూక్య కుమార్ మరిపెడలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుకుంటున్నాడు. కుమార్ ప్రసుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. తండ్రి రాజు మృతి చెందిన విషయం తెలిసి కుమార్ కన్నీరుమున్నీరయ్యాడు. గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు మనోధైర్యం ఇవ్వడంతో కన్నీళ్లను దిగమింగుకుంటూ మరిపెడలోని సీతారాంపురం జెడ్పీ హైస్కూల్లో కుమార్ సైన్స్ రెండో పేపర్ రాశాడు. పెద్దనాన్న అయిన మాధవపురం సర్పంచ్ ఇస్లావత్ వెంకన్న పరీక్ష సమయం ముగియగానే కుమార్‌ను ద్విచక్రవాహనంపై తీసుకుని తండాకు చేరుకున్నాడు. తండాకు వచ్చిన కుమార్ తండ్రి శవంపై పడి నాన్న లే నాన్న అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. నన్ను ఒంటిరి చేసి వెళ్లావా? అంటూ రోదిస్తుంటే తండావాసులు కన్నీటిపర్యంతమయ్యారు. వెంటనే తండావాసులు అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. దింపుడు కల్లం వద్ద తండ్రి ముఖం చూస్తూ బోరున విలపించాడు. చితికి నిప్పంటించాడు. అశ్రునయనాల నడుమ అంత్యక్రియలు ముగిశాయి. కుమార్‌కు తోడుగా తల్లి శారద ఉంది. ఈ సంఘటనతో తండాలో విషాదం అలుముకుంది. రెండు రోజులు సెలవులు ఉండడంతో కుమార్ తండాలోనే ఉంటాడని బంధువులు తెలిపారు. -
అనుభవం.. నేర్పని పాఠం!
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి జవాబుపత్రాలు మూల్యాంకనం చేయడం ఎంత ముఖ్యమో.. వచ్చిన మార్కులు టోటలింగ్ చేయడం, మార్కుల పోస్టింగ్‌లు పరిశీలించడం కూడా అంతే ముఖ్యం. ఇందులో స్పెషల్ అసిస్టెంట్ల(ఎస్ఏ)లే కీలకం. మూల్యాంకనంలో ప్రతి ముగ్గురు ఏఈ(అసిస్టెంట్ ఎగ్జామినర్లు)లకు ఒక స్పెషల్ అసిస్టెంట్(ఎస్ఏ)ను ఇవ్వాల్సి ఉంది. సుమారు 400 మందికి పైగా స్పెషల్ అసిస్టెంట్లు అవసరం కాగా వీరిలో సగంమంది కూడా రావడం లేదు. ఏటా ఇదే తంతు. గత అనుభవాలతో విద్యాశాఖ అధికారులు గుణపాఠం నేర్చుకోని పరిస్థితి. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఏప్రిల్ 2 నుంచి పదో తరగతి మూల్యాంకనం ప్రారంభం కానుంది. జిల్లాకు దాదాపు 5.40 లక్షల జవాబు పత్రాలు రానున్నాయి. రెండు రోజులుగా జవాబుపత్రాలు వస్తున్నాయి. స్థానిక కేఎస్ఆర్ బాలికల పాఠశాలలోని స్ట్రాంగ్‌రూంలో భద్రపరుస్తున్నారు. స్పెషల్ అసిస్టెంట్లు కీలకం ♦ అసిస్టెంట్ ఎగ్జామినర్లు పేపర్లు దిద్ది మార్కులు వేసిన తర్వాత స్పెషల్ అసిస్టెంట్లు జవాబుపత్రం తీసుకుని మార్కుల పోస్టింగ్‌లు, మార్కుల టోటలింగ్ పరిశీలించాలి. ♦ ఏఈలు జవాబు పత్రాలు దిద్దుతున్న కంగారులో మార్కుల టోటలింగ్‌లో ఏవైనా తప్పులు జరిగే అవకాశం ఉంది. దీనికితోడు మండుతున్న వేసవితో ఉక్కపోత, సౌకర్యాల లేమితో తీవ్ర అసహనానికి లోనవుతుంటారు. ఈ క్రమంలో చిన్నచిన్న తప్పులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏఈలు దిద్దిన జవాబు పత్రాలను స్పెషల్ అసిస్టెంట్లు మరోసారి పరిశీలించి మార్కుల వివరాలను ధ్రువీకరిస్తారు. ♦ పొరపాటున ఏఈల చేతుల్లో టోటలింగ్‌లో తక్కువ వచ్చిన అంశాల్ని స్పెషల్ అసిస్టెంట్లు గుర్తించిన సందర్భాలు అనేకం. చాలీచాలని రెమ్యూనరేషన్ మూల్యాంకనం విధుల్లో పాల్గొంటున్న ఇతర అన్ని కేడర్ల కంటే కూడా స్పెషల్ అసిస్టెంట్లకే రెమ్యూనరేషన్ తక్కువ. ఏఈలకు డీఏ, పేపర్లు దిద్దినందుకు రోజుకు సగటున రూ.550 దాకా వస్తుంది. చీఫ్ ఎగ్జామినర్లకు కూడా ఇదే స్థాయిలో వస్తుంది. అయితే స్పెషల్ అసిస్టెంట్లకు మాత్రం కేవలం రూ.137.50లతో సరిపెడుతున్నారు. దీనికి తోడు డీఏ ఇవ్వడం లేదు. మండుతున్న ఎండలకు తోడు ఆశించిన స్థాయిలో రెమ్యూనరేషన్ ఇవ్వకపోవడంతోనే చాలామంది టీచర్లు స్పెషల్ అసిస్టెంట్లుగా వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదనే చర్చ జరుగుతోంది. గుణపాఠం నేర్వని విద్యాశాఖ ఏటా ఇదే తంతు. గత అనుభవాలతో గుణపాఠం నేర్చుకోవడం లేదు. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొంది. స్పెషల్ అసిస్టెంట్లుగా వచ్చేందుకు టీచర్లు ఆసక్తి చూపడం లేదు. మూల్యాంకనంలో ఏమాత్రం తేడా వచ్చినా నష్టోపోయేది విద్యార్థులే. వారికి ఇష్టమున్నా.. లేకున్నా అధికారులే బలవంతంగా విధుల్లోకి తీసుకోవాలి. అలా చేస్తేనే పూరిస్థాయిలో స్పెషల్ అసిస్టెంట్లు వస్తారు. అయితే అధికారులు అలా చేయకపోవడం గమనార్హం. సమస్యను అధిగమిస్తాం ఏప్రిల్ 2 నుంచి 15వ తేదీ వరకు మూల్యాంకనం జరుగుతుంది. రెమ్యూనరేషన్ తక్కువ, డీఏ ఉండదనే కారణంతో స్పెషల్ అసిస్టెంట్లుగా వచ్చేందుకు ఆసక్తి చూపని పరిస్థితి వాస్తవమే. ఈసారి సమస్యను అధిగమిస్తాం. వీలైనంత ఎక్కువ మందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటాం. – గోవిందు నాయక్,డిప్యూటీ క్యాంపు ఆఫీసర్ -
ఉరుకులు.. పరుగులు
సాక్షి, నెట్వర్క్ : మరికల్లో జరిగిన ఎస్సెస్సీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్‌గానే స్పందించారు. కలెక్టర్ రొనాల్డ్‌రోస్, ఎస్పీ అనురాధ, ఆర్జేడీ విజయలక్ష్మి, డీఈఓ సోమిరెడ్డిలతోపాటు ఇతర అధికారులు బుధశారం ఉరుకులు, పరుగులు పెట్టడంతోపాటు క్షేత్రస్థాయి అధికారులను, సిబ్బందిని సైతం పరుగులు పెట్టించారు. స్వయంగా ఉన్నతాధికారులు సైతం సమస్యాత్మక కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. ఇలాంటి పొరపాటు మళ్లీ జరగకుండా బాధ్యులపై కఠినంగా వ్యవహరించారు. ఇప్పటికే 11 మందిపై వేటుపడింది. ఆ రోజు విధుల్లో ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లు కూడా సస్పెన్షన్‌కు గురయ్యారు. భూత్పూర్ ఓ విద్యార్థి డిబార్ మండల కేంద్రంలోని రెండు సెంటర్లలో జరుగుతున్న పదో తరగతి పరీక్షలను బుధవారం కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఆకస్మిక తనిఖీ చేశారు. పంచవటి విద్యాలయం, జెడ్పీ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు పరీక్ష రాస్తున్న గదుల వెనుక నుంచి వెళ్లి కలెక్టర్ పర్యవేక్షించారు. విద్యార్థులు కిటికీల నుంచి చీటీలు పడేసినట్లు గమనించిన కలెక్టర్ కొన్ని చీటీలు తీసి క్షుణ్ణంగా పరిశీలించారు. వాటిలో ఉన్న అక్షరాలను గుర్తించి ఓ గదిలో విద్యార్థుల రాత ట్యాలీ చేసి పరిశీలించారు. మరో చీటీలో ఏకంగా విద్యార్ధి పేరు చీటీపై రాసినట్లు గుర్తించిన కలెక్టర్ ఆ విద్యార్థి గురించి ఆరా తీశారు. కాసేపటి తర్వాత మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన విద్యార్థిని గురించి డీబార్ చేయాలని చీఫ్ సూపరింటెండెంట్‌కు ఆదేశించి వెళ్లి పోయారు. ఇదిలాఉండగా కలెక్టర్ తనిఖీకి రావడంతో ఇన్విజిలేటర్లు ఆందోళనకు గురయ్యారు. ఉన్నతాధికారుల తనిఖీ నారాయణపేట రూరల్: మరికల్లో ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై అప్రమత్తమైన విద్యాశాఖా అధికారులు పోలీస్, రెవెన్యూ అధికారులతో కలిసి పరీక్ష కేంద్రాల తనిఖీ ముమ్మరం చేశారు. డీఈఓ సోమిరెడ్డి, నారాయణపేట సబ్ కలెక్టర్ కృష్ణాధిత్యాతో పాటు మండలానికి ప్రత్యేక పరిశీలకులుగా నియమించిన జిల్లా సివిల్ సప్లయీస్ డీఎం భిక్షపతి, ఏఎంఓ రవీందర్, ఎంపీడీఓ వెంకటయ్య పట్టణంలోని ఆరు కేంద్రాలను తనిఖీ చేశారు. సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన ప్రభుత్వ గ్రౌండ్, బాలికల ఉన్నత పాఠశాల చుట్టు పోలీసు, రెవిన్యూ సిబ్బందితో బందోబస్తు పెంచారు. అలాగే మోడ్రన్ స్కూల్ కేంద్రంలో ఎస్ఐ ఎం.కృష్ణయ్య ఆధ్వర్యాన వీడియో చిత్రీకరణ చేపట్టారు. డీఈఓ హల్చల్ మరికల్: స్థానిక బాలుర, బాలికల ఉన్నత పాఠశాలోని పరీక్ష కేంద్రాలను బుధవారం డీఈఓ సొమిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి హల్చల్ చేశారు. గణితం పేపర్–1 పరీక్ష రాస్తున్న విద్యార్థుల ప్యాడ్లు, చూట్టు పక్కల ప్రాంతాలను క్షుణంగా పరిశీలించారు. ఎవరైనా మాస్‌కాపీయింగ్‌కు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఎఫ్ఓ పరిశీలన అడ్డాకుల: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డీఎఫ్ఓ గంగారెడ్డి తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలోని గదులన్నింటినీ ఎంపీడీఓ బి.నర్సింగ్‌రావుతో కలిసి పరిశీలించారు. మాస్ కాపీయింగ్‌కు అవకాశం ఇవ్వకుండా పకడ్బందీగా పరీక్షలను నిర్వహించాలని ఇన్విజిలేటర్లను, నిర్వాహకులను ఆదేశించారు. ముగ్గురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్ : ఎస్పీ మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో కలకలం సృష్టించిన పదో తరగతి ప్రశ్నపత్రం లీక్‌పై మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవలే మరికల్ మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ప్రశ్నపత్రం లీక్‌పై కేసు నమోదు చేయించిన ఎస్పీ అనురాధ స్వయంగా దృష్టిసారించారు. ఈ కేసులో పోలీసులు చేసిన విచారణలో లభించిన సాక్ష్యాధారాల మేరకు స్థానికంగా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలడంతో ఎస్పీ ఆ రోజు విధుల్లో ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెన్షన్ చేస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉంటూ సున్నితమైన అంశాల పట్ల నిర్లక్ష్యం వహించడం, వ్యక్తిగత లాభాపేక్షతో వ్యవహరించడం ఏమాత్రం సహించరాదని స్పష్టం చేశారు. విధులు పట్ల ఎవరు నిర్లక్ష్యం చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. భూత్పూర్లోని ఓ పరీక్ష కేంద్రం వెనకాల -
సీఎస్ వర్సెస్ డీఓ
గణపురం(భూపాలపల్లి) : గణపురం మండలంలోని చెల్పూరు çపదో తరగతి పరీక్ష కేంద్రం నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్(సీఎస్) ప్రభాకర్‌రెడ్డి, డిపార్టమెంటల్ అధికారి(డీఓ)నర్సింహచారి మధ్య గత రెండు రోజులుగా జరుగుతున్న గొడవలు వీధికెక్కాయి. పరీక్ష కేంద్రంలో ఒకరినొకరు దూషించుకుంటూ దాడి చేసుకునేందుకు యత్నించడంతో పరీక్షలు రాసే విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. వివరాలిలా ఉన్నాయి.. ఈ నెల 16న పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాగా గణపురం మండల కేంద్రంలో రెండుసెంటర్లతోపాటు చెల్పూరు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరో సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న పరీక్షల్లో సీఎస్ ప్రభాకర్‌రెడ్డి మొదటి రోజు నుంచి సెంటర్లో మాస్ కాపీయింగ్ నడుస్తున్నా పట్టించుకోవడం లేదని డీఓ నర్సింహచారి ఆరోపిస్తూ గొడవకు దిగుతున్నుట్ల సమాచారం. అందులో భాగంగా సోమవారం ఇంగ్లిష్ మొదటి పేపర్ పరీక్ష జరుగుతుండగా పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్ చేతిలో చిట్టీ ఉండడం గమనించిన డీఓ ఆమె చేతిని లాక్కొని సీఎస్ వద్దకు తీసుకెళ్లాడు. అయితే ఈ పెనుగులాటలో ఆమె చేతులకు ఉన్న గాజులు పగిలిపోయి గాయాలయ్యాయి. విద్యాసంస్థల యాజమాన్యాల వద్ద« డబ్బులు తీసుకుంటూ మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్నారంటూ సీఎస్ ప్రభాకర్‌రెడ్డితో డీఓ నర్సింహచారి గొడవకు దిగారు. రెండు రోజులపాటు పరీక్ష కేంద్రంలో ఈ తంతు నడుస్తుండడంతో విషయం తెలుసుకున్న డీఈఓ శ్రీనివాస్ రెడ్డి సంఘటనపై విచారణ జరపాలని గణపురం ఎంఈఓ చిలువేరు సురేందర్, వెంటాపురం ఎంఈఓ శాగర్ల అయిలయ్యను ఆదేశించారు. వారిచ్చిన నివేదిక ఆధారంగా డీఓను తొలగిస్తున్నట్లు ఆదేశా>లు జారీచేశారు. ఆయన స్థానంలో కర్కపల్లి పాఠశాల ప్రధానోపాద్యాయుడు భద్రయ్యను నియమిస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. మొత్తానికి సీఎస్, డీఓల మధ్య జరిగిన గొడవతో చెల్పూరు పదో తరగతి పరీక్షా కేంద్రంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే పరీక్ష కేంద్రాల్లోకి బయటి వ్యక్తులు వచ్చి వారి సెల్ఫోన్లలో పరీక్ష పత్రాలను ఫొటోలు తీసుకొని వెళ్తున్నారని, మాస్‌కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
మాస్‌కాపీయింగ్ చేస్తే డీబార్
వీరఘట్టం: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే డీబార్ చేస్తామని, మాస్ కాపీయింగ్‌కు ప్రోత్సహించే ఇన్విజిలేటర్లను సస్పెండ్ చేస్తామని రాష్ట్ర పరిశీలకులు ఎస్.అరుణకుమారి హెచ్చరించారు. వీరఘట్టంలో బాలుర, బాలికోన్నత పాఠశాలల్లో జరుగుతున్న పదో తరగతి పరీక్షలను ఆమె శుక్రవారం పరిశీలించారు. ఇక్కడ ఇన్విజిలేషన్ నియామకాల్లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చిలిచిలికి గాలివానలా మారడంతో గురువారం ఇన్విజిలేషన్ చేసిన ఉపాధ్యాయులను క్షణాల్లో రిలీవ్ చేసి వీరి స్థానంలో 22 మంది ఉపాధ్యాయులకు శుక్రవారం ఇన్విజిలేషన్ బాధ్యతలు అప్పగించారు. వెంటనే ఎంఈఓ జి.సుబ్రహ్మణ్యం ఈ రెండు పాఠశాలలకు చెరో 11 మందిని కేటాయించారు. అనంతరం అరుణకుమారి బాలుర, బాలికోన్నత పాఠశాలల పరీక్షా కేంద్రాల్లోని ప్రతీ గదిని క్షుణ్ణంగా పరిశీలించారు. మంచి వాతావరణంలో పరీక్షలు జరుగుతున్నప్పుడు ఎందుకు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఇద్దరు హెచ్ఎంలు డి.నాగమణి, ఎం.వి.నర్శంగరావును ప్రశ్నించారు. ఇక మీదట జరగబోయే పరీక్షలన్నింటినీ పక్కాగా నిర్వహించాలని స ూచించారు. విద్యార్థులు బెంగ పడవద్దు ఉపాధ్యాయుల మధ్య జరిగిన తగాదా చివరకు పరీక్షా కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా ముద్ర పడేలా చేసిందని అరుణకుమారి పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరుగుతుంటే ఎందుకు మాస్‌కాపీయింగ్ జరుగుతున్నట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయని చీఫ్, డిపార్ట్మెంట్ అధికారులను ప్రశ్నించారు. ఎటువంటి బెంగ పడకుండా పరీక్షలను ప్రశాంతంగా రాయాలని విద్యార్థులకు సూచించారు. అయితే శుక్రవారం పరీక్షలు ప్రారంభమయినప్పటి నుంచి ముగిసే వరకు వరుసగా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న అధికారులు వచ్చి పరీక్షల తీరు పరిశీలించడంతో విద్యార్థులు బిక్కు బిక్కుమంటూ పరీక్షలు రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిట్టింగ్ స్క్వాడ్ల నియామకం టెన్త్ పరీక్షల సందర్భంగా వీరఘట్టం బాలుర, బాలికోన్నత పాఠశాలల్లో మొదటి రోజు జరిగిన తగాదా నేపథ్యంలో రెండో రోజు ఇక్కడ సిట్టింగ్ స్క్వాడ్ల నియామకం జరిగింది. బాలుర ఉన్నత పాఠశాలలో సింహాద్రినాయుడు, బాలికోన్నత పాఠశాలలో పి.రామచంద్రరావు సిట్టింగ్ వేశారు. అన్ని గదులను పరిశీలించారు. ఇక ప్రతి రోజూ సిట్టింగ్ స్క్వాడ్లు వస్తుంటారని టెక్కలి ఉపవిద్యాశాఖాధికారి టి.జోగారావు తెలిపారు. అకారణంగా మమ్మల్ని ఎందుకు రిలీవ్ చేశారు వీరఘట్టం బాలుర, బాలికోన్నత పాఠశాలల్లో మొదటి రోజు జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ రెండు హైస్కూల్ల్లో ఇన్విజిలేషన్ చేస్తున్న 22 మందిని శుక్రవారం విధుల నుంచి తప్పించడంపై పలువురు ఉపాధ్యాయులు మండిపడ్డారు. అకారణంగా మమ్మల్ని ఎందుకు తొలగించారంటూ రాష్ట్ర పరిశీలకులు ఎస్.అరుణకుమారిని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని వదిలేసి ఇంత మందిని రిలీవ్ చేయడం సరైన విధానం కాదని పలువురు ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని, రిలీవ్ అయిన వారందరూ తప్పు చేసినట్టు కాదని, పరిస్థితులను అర్ధం చేసుకోవాలని ఆమె ఉపాధ్యాయులకు సూచించారు. -
తల్లి మరణించినా లక్ష్యం విడవకుండా..!
బల్లికురవ: తల్లి చినపోయినా ఆ బాధను మనసుసులోనే దిగమింగుకుని, మనోధైర్యంతో బల్లికురవ పరీక్ష కేంద్రంలో ఓ విద్యార్థిని పదోతరగతి పరీక్షలకు హాజరవుతోంది. మండలంలోని చిన అంబడిపూడి గ్రామానికి చెందిన కోవూరి వెంకటశేషయ్య, కుమార్తె సరళను 18 సంవత్సరాల క్రితం మార్టూరు మండలం, చిమ్మరిబండకు చెందిన పల్లపు వెంకటేశ్వర్లుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు, ఆరు సవత్సరాల క్రితం సరళ అనారోగ్యం బారిన పడటంతో, నీవు నాకు అక్కర్లేదని, వెంకటేశ్వర్లు చిత్రహింసలకు గురిచేయడంతో సరళ పిల్లలను తీసుకుని పుట్టింటికి చేరింది. కుమార్తె ప్రియాంక స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పదో తరగతి చదువుతోంది. సరళ అనారోగ్యంతో రెండు కిడ్నీలు దెబ్బతిన్న ఈ నెల 12న మరణించింది. ప్రియాంక తల్లి అంత్యక్రియలకు హాజరై తిరగి పాఠశాలకు వచ్చి, తాత, వెంకటశేషయ్య, విద్యాలయం ప్రత్యేకాధికారి సరళ కుమారి ఇచ్చిన ప్రోత్సాహంతో పరీక్షలు రాస్తోంది. తన తల్లి చనిపోయింది. తండ్రి వెంకటేశ్వర్లు పట్టించుకోవడం లేదు. దాతలు సహకారం అందిస్తే తాను, తన సోదరుడు అనిల్ ఉన్నత చదువులు చదువుకోగలమని విద్యార్థిని చెప్పింది. -
హవ్వ.. నవ్విపోదురు గాక..
ఏలూరు (ఆర్ఆర్ పేట) : నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు.. అన్నట్టుంది అధికారుల తీరు.. చివరికి పదో తరగతి పరీక్షలను కూడా తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వాడుకుంటున్నట్టు ఉంది. జనరల్ విద్యార్థులకు సాధారణ తెలుపు రంగు ప్రశ్నాపత్రాలను ఇచ్చినప్పటికీ కాంపోజిట్ విద్యార్థులకు పసుపు రంగులో ఇచ్చారు. దీంతో పాటు ఈ పేపరులో గద్య ప్రశ్నల్లో 3వ ప్రశ్న ఫక్తు ముఖ్యమంత్రి ప్రచారానికి, స్వోత్కర్షకు వినియోగించుకున్నారు. అమరావతి నిర్మాణంపై ప్రశ్న ఇస్తూ అందులో రాష్ట్ర రాజధాని అమరావతిని 35 సంవత్సరాల్లో దశలవారీగా నిర్మిస్తారని, ఆకాశ హారŠామ్యలు, ఉద్యాన వనాలు, సరస్సులు నిర్మించబడతాయని పేర్కొన్నారు. చివరగా అమరావతి నగరం శరవేగంగా అభివృద్ధి చెందడానికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషి అభినందనీయమంటూ ముగింపుకొచ్చారు. వర్షం వస్తే కారిపోయే భవనాలు, పూర్తిస్థాయిలో అసెంబ్లీ హాలు, శాసనమండలి నిర్మితం కాకపోయినా శరవేగంగా అభివృద్ధి చెందుతోందంటూ పదో తరగతి విద్యార్థులకు తప్పుడు సంకేతాలివ్వడం కోసమే ఇటువంటి ప్రశ్నలిచ్చారని పలువురు చర్చించుకుంటున్నారు. అమరావతిపై ప్రశ్న ఇవ్వడమే అతిగా ఉంటే అందులో ముఖ్యమంత్రి కృషి అని పేర్కొనడం రాజకీయ దివాళాకోరుతనమని ఉపాధ్యాయ వర్గాలు పేర్కొంటున్నారు. విద్యార్థులకు అదనపు మార్కులివ్వాలి విద్యార్థులను పక్కదారి పట్టించేందుకే ఇటువంటి ప్రశ్న ఇచ్చారు. ఈ ప్రశ్నను తొలగించి విద్యార్థులందరికీ అదనపు మార్కులివ్వాలి. 35 వేల మంది రైతుల భూములు బలవంతంగా లాక్కొని, వారి పొట్ట కొట్టిన చంద్రబాబు ప్రైవేట్ వర్సిటీలకు తక్కువ ధరకే కట్టబెట్టిన విషయాన్ని ఎలా మర్చిపోతాం. సొంత డబ్బాతో విద్యార్థుల ఆలోచనలను పక్కదారి పట్టించి తన గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదం. – కాకి నాని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు -
కఠిన పరీక్ష
కడప ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం కఠినచర్యలు చేపడుతోంది. పరీక్ష విధుల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినా, కాపీయింగ్‌కు పాల్పడినా కొరడా ఝుళిపించేందుకు సన్నద్ధమవుతోంది. పర్యవేక్షకులుగా వేళ్లేవారు విధుల్లో అప్రమత్తంగా లేకుంటే మాత్రం చర్యలు తప్పవు. ఈనెల15 నుంచి నిర్వహించనున్న పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో అమలు చేయనున్న నిబంధనలు చూస్తే విద్యార్థులకు పరీక్ష అయినా సిబ్బందికి మాత్రం అగ్నిపరీక్షే అని పలువురు అంటున్నారు. పరీక్ష నిర్వహణ విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే గతంలో పరీక్ష విధుల నుంచి తొలగించేవారు. కానీ ఇప్పుడు సంబంధిత నిబంధనలను కఠినతరంగా చేశారు. 1997 చట్టం 25 సెక్షన్ 10లోని నిబంధనలను అమలు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ చట్టం ప్రకారం పదో తరగతి పరీక్షల విధుల్లో సక్రమంగా పనిచేయలేదని రుజువైతే క్రిమినల్ కేసు నమోదుతోపాటు ఆరునెలల నుంచి 3 సంవత్సరాల వరకూ జైలు, రూ.5 వేలు నుంచి రూ.లక్ష దాకా జరిమానా విధించనున్నట్ల తెలిసింది. కాఫీలకు పాల్పడితే..: పరీక్ష కేంద్రంలోకి స్క్వాడ్ వచ్చినప్పుడు విద్యార్థులు చీటిలతో పట్టుబడినా పక్కవారి పేపర్లో చూచిరాస్తున్నా అందుకు సంబంధించిన ఇన్విజిలేటర్‌తోపాటు డిపార్టుమెంట్ ఆఫీసర్, చీఫ్ సూపరిండెంట్పైనా చర్యలు చేపట్టనున్నారు. పరీక్షకు హాజరయ్యే ప్రతి విద్యార్థిని తనిఖీ చేసి లోపలికి పంపాలని సూచించినట్లు తెలుస్తోంది. సమస్యాత్మక కేంద్రాలలో సీసీ కెమెరాలు జిల్లాలోని 8 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఇందులో దువ్వూరు, చక్రాయపేట(గండి), కమలాపురం(బాయిస్), నందిమండలం, బి.మఠం, పెనగలూరు మండలం చక్రంపేట, కొండాపురం మండలం తాళ్లపొద్దుటూరు, వనిపెం ట జెడ్పీ హైస్కూల్స్ ఉన్నాయి. æవీటిలో విద్యాశాఖాధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఆందోళనలో ఇన్విజిరేటర్లు పరీక్ష కేంద్రాల్లోని గదుల్లో ఉపాధ్యాయిని ఇన్విజిలేటర్‌గా ఉంటే బాలికలను తనిఖీ చేయడం వీలవుతుంది. పురుష ఉపాధ్యాయుడైతే బాలురను తనిఖీ చేయడం కుదురుతుంది. కానీ చాలా పరీక్ష గదుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ ఉండేచోట సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల కొందరు వద్ద చీటీలు ఉండిపోయే ప్రమాదం ఉందని ఇన్విజిలేటర్ల ఆందోళన చెందుతున్నారు. ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు సంఘాలు అంటున్నాయి. ఈ ఏడాది 35,737 మంది ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న పదవ తరతగతి పరీక్షలను జిల్లావ్యాప్తంగా 35,737 మంది విద్యార్థులు రాయనున్నారు. వీరికోసం 164 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పకడ్బందీగా నిర్వహిస్తాం ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలను మొదలుపెట్టాం. జిల్లావ్యాప్తంగా ఉన్న 164 పరీక్ష కేంద్రాలలో ఎవరు కూడా కింద కూర్చోని పరీక్షలు రాయకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నాం. దీంతో పాటు అన్ని కేంద్రాలలో విద్యార్థులకు తాగునీరు వంటి వసతులను ఏర్పాటు చేస్తున్నాం. పరీక్షల విధుల పట్ల ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని లేనిపక్షంలో చట్టం 25ను అమలుచేయాల్సి వస్తుంది. ఏమాత్రం నిర్యక్ష్యం, అలసత్వం ప్రదర్శించినా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. – పొన్నతోట శైలజ, డీఈఓ -
పదిలమైన ఫలితాల కోసం...
బాలికల్లో డ్రాపవుట్స్‌ను తగ్గించేందుకు ఆవిర్భవించిన కస్తూర్బా పాఠశాల విద్యార్థులు ఇప్పుడు ఆంగ్లమాధ్యమానికి అప్‌గ్రేడ్ అయ్యారు. ఐదేళ్లుగా ఎలాగోలా వంటబట్టించుకున్నా...పబ్లిక్ పరీక్షలు తొలిసారిగా రాస్తున్నారు. శతశాతం ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో రకరకాలుగా ప్రణాళికలు రూపొందించిన అధికారులు వాటిని పక్కాగా అమలుచేస్తున్నారు. విజయనగరం అర్బన్: కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న పదోతరగతి విద్యార్థినులు మెరుగైన వార్షిక ఫలితాలు సాధన కోసం సర్వశిక్షాభియాన్(ఎస్ఎస్ఏ) యంత్రాంగం కుస్తీ పడుతోంది. ఆంగ్లమాధ్యమం ప్రారంభించిన తరువాత ఈ ఏడాదే తొలిసారిగా పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. దీనివల్ల ఫలి తాల్లో ఏమాత్రం తేడా రాకుండా ఉండాలనే లక్ష్యంతో ఎస్ఎస్ఏ అధికారులు ప్రత్యేక శ్రద్ధచూపుతున్నారు. జిల్లాలోని 33 కేజీబీవీల్లో విద్యార్థుల సామర్థ్యాలపై ఇప్పటికే అంచనావేసి ప్రత్యేక తర్ఫీదులను ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. ఏడాదిలో ఇంతవరకు జరిగిన వివిధ రకాల పరీక్షల్లో ప్రదర్శించిన సామర్థ్యాలకు అనుగుణంగా తరగతిలో విద్యార్థులను విభజించి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇటీవల సబ్జెక్ట్‌లోని రెండేసి చాప్టర్ల వారీగా టెస్ట్‌లు పెట్టారు. వీటి ఫలితాలను ప్రామాణికంగా తీసుకొని విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేశారు. ఒక్కో కేజీబీవీలలో 5 నుంచి 6 శాతం వంతున జిల్లా వ్యాప్తంగా 360 మంది వెనుకబడిన విద్యార్థులున్నట్టు గుర్తించారు. వీరందరినీ పాస్ చేయించేం దుకు శ్రద్ధ చూపుతున్నారు. ఎస్ఎస్ఏ పీఓ నుంచి సెక్టోరియల్ అధికారి వరకు ఒక్కో అధికారి ఒక్కో కేజీబీవీని దత్తత తీసుకొని అక్కడి వెనుకబడిన విద్యార్థినుల ఉత్తర్ణత బాధ్యతను తీసుకున్నారు. రోజూ నిర్వహించే ఉద్యోగ విధులతోపాటు అదనంగా ఈ బాధ్యత నిర్వర్తించాలి. సబ్జెక్ట్ వారిగా మాదిరీ ప్రశ్నపత్రాలను తయారు చేసి వాటి ద్వారా వెనుకబడినవారికి తర్ఫీదు ఇస్తున్నారు. టాప్ ఫైవ్ విద్యార్థులను ఒక చోటకు చేర్చి 10/10 సాధన కోసం శిక్షణ ఇస్తున్నారు. పరీక్షకు హాజరుకానున్న 1,139 మంది విద్యార్థినులు వచ్చేనెల 15 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు కేజీబీ వీల నుంచి 1,045 మంది విద్యార్థినులు హాజరవుతున్నారు. కేజీబీవీల పరిధిలోని ఉపాధ్యాయులు రూపొం దించిన ప్రత్యేక ప్రశ్నావళితో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. గతేడాది సాధించిన 92.3 శాతం ఉత్తీర్ణత కంటే మెరుగైన ఫలితాలకోసం ప్రణాళికలు రూపొం దిస్తున్నారు. విద్యార్థినుల్లో పరీక్షపై భయం పోగొట్టే ప్రక్రియలో భాగంగా పాఠశాల స్థాయిలో మానసికోల్లా స కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ‘అమ్మ ఒడి’ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలలకు పిలిపించి వారిని గౌరవించే కార్యక్రమం విద్యాలయం స్థాయిలో చేపట్టారు. ఇలాంటి వాటి ద్వారా వారిలో పరీక్షలంటే భయం పోతుందని ఎస్ఎస్ఏ అధికారులు అంటున్నారు. ఉత్తీర్ణతా శాతంపెంపునకు ప్రణాళికలు కేజీబీవీల్లో పదో తరగతి ఉత్తీర్ణతా శాతాన్ని గతేడాది కంటే మెరుగుపరచడానికి క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రూపొందించాం. గతేడాది 92 శాతం ఉత్తీర్ణత సాధించాం, ఈ ఏడాది సీసీఈ విధానం అమలులో ఉండడంతో ఏమాత్రం తగ్గకుండా శతశాతం ఫలితాలకు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం జరుగుతున్న గ్రాండ్ ఫైనల్, ఈ నెల 24 నుంచి జరిగే ప్రీ ఫైనల్ పరీక్షల తరువాత పాఠశాల స్థాయిలో విద్యార్థుల సామర్ధ్యం తెలుస్తుంది. తద్వారా బోధనపై శ్రద్ధపెడతాం. ఇంగ్లిష్ మాధ్యమంపైభయాన్ని పోగొట్టాం నాలుగేళ్లక్రితం ఆరోతరగతిలో ఇంగ్లిష్ మాధ్యమం మొదలైంది. తొలి బ్యాచ్ పదోతరగతి పరీక్షలు ఈ ఏడాది రాస్తున్నారు. వీరికి తొలి రోజుల్లో ఇంగ్లిష్ మాధ్యమమంటే భయం ఉం డేది. దీనిని పోగొట్టడానికి ఏడా ది బోధనలో అధిక ప్రాధాన్యమిచ్చాం. దీనివల్ల ఫలితా లను మెరుగవుతాయన్న నమ్మకం ఉంది. – బలగ జ్యోతి, స్పెషల్ ఆఫీసర్, కేజీబీవీ, గంట్యాడ ఫలితాలకోసం ప్రత్యేక కార్యాచరణ కేజీబీవీల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక కార్యచరణను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. ఉదయం 8.30 నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభమవుతుండగా సాయంత్రం 5.30 గంటల వరకు చివరి తరగతిని నిర్వహిస్తారు. పదో తరగతి బోధించే ఉపాధ్యాయులకు వరుస సెలవులు మంజూరు చేయరు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధతో పాఠాల పునశ్చరణ చేస్తున్నారు. సిలబస్ పూర్తయిన చోట సబ్జెక్టుల వారీగా వినిధరూపాల్లో ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టాలని నిర్ణయించారు. ఏ ప్రశ్నలు వచ్చే అవకాశముంది. వాటిని ఎలా రాయాలి తెలుసుకోవాలనే దానిపై శ్రద్ధ తీసుకుంటున్నారు. -
మార్చి 15నుంచి పదోతరగతి పరీక్షలు
-
పదో తరగతి పరీక్షలు షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 15 నుంచి 29వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు టెన్త్ పరీక్షల షెడ్యూల్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం విడుదల చేశారు. ఈసారి పదో తరగతి పరీక్షలకు 6,36,831 మంది విద్యార్థులు హాజరుకాబోతున్నారని, ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 2,850 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేసినట్టు మంత్రి తెలిపారు. ఈసారి పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, విద్యార్థులు కింద కూర్చుని కాకుండా బల్లలపైనే కూర్చుని పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేశామన్నారు. మే మొదటివారంలో పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేస్తామని చెప్పారు. -
'టెన్త్'కు లీక్ తెగులు
‘నారాయణ’ సంస్థల నుంచే ప్రశ్నపత్రాల లీకేజీ - పరీక్షా కేంద్రాల సిబ్బందితో కుమ్మక్కై ప్రశ్నపత్రాల సేకరణ - తమ విద్యార్థులకు వాట్సాప్‌లో సమాధానాల చేరవేత - నెల్లూరులో సైన్స్ పేపర్ –1, మడకశిరలో తెలుగుపేపర్ –1 లీక్ - కదిరిలో ముందుగానే బయటకొచ్చిన హిందీ పేపర్ - జవాబులు సిద్ధం చేస్తూ మీడియాకు చిక్కిన ‘నారాయణ’ సిబ్బంది - రాష్ట్రంలో సర్వసాధారణంగా మారిపోయిన లీకేజీలు - పరీక్షల ప్రారంభానికి ముందే వాట్సప్‌లలో ప్రత్యక్షం - టెన్త్ పత్రాలు రోజూ బయటకు వస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం - కష్టపడి చదివిన విద్యార్థులకు తీవ్ర అన్యాయం సాక్షి, అమరావతి లీక్... లీక్... లీక్... ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. లక్షలాదిమంది విద్యార్థుల భవితవ్యంతో ముడిపడి ఉన్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాలు ముందుగానే బయటకొచ్చేస్తున్నాయి. ఈ ప్రశ్నపత్రాల లీకేజీ వెనుక రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ విద్యాసంస్థ ‘నారాయణ’ హస్తం ఉండడం నిర్ఘాంతపరుస్తోంది. ఇప్పటివరకు పరీక్ష పత్రాల లీకేజీలు జరిగిన కేంద్రాలన్నీ నారాయణ స్కూళ్లే కావడం గమనార్హం. అయితే పరీక్షా కేంద్రాల ఇన్విజిలేటర్లు, ఇతరులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం వరకే విద్యాశాఖ పరిమితమవుతోంది. ఈ సంస్థ మంత్రి నారాయణకు సంబంధించినది కావడం, మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయనా స్వయానా వియ్యంకులు కావడం వల్లే అధికారులు ప్రశ్నాపత్రాల లీకేజీలపై కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజుకో ప్రశ్నపత్రం లీకవుతున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనమూ లేకపోవడం పట్ల విద్యారంగ నిపుణులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని చోట్లా ‘నారాయణ’ నుంచే... – నెల్లూరులోని నారాయణ హైస్కూల్నుంచి టెన్త్ సైన్స్ పేపర్–1ను శనివారం వాట్సప్ ద్వారా బయటకు పంపించారు. అధికారులు చీఫ్‌సూపరింటెండెంటు, డిపార్టుమెంటల్ ఆఫీసర్‌పై శాఖాపరమైన చర్యలకు ఆదేశించి చేతులు దులుపుకున్నారు. నారాయణ సంస్థకు చెందిన వ్యక్తులతో పాటు కొంతమంది ప్రభుత్వ టీచర్లుకూడా ఈ లీకేజీ వెనుక ఉన్నారని చెబుతున్నారు. – పదో తరగతి పరీక్షలు ఈనెల 17నుంచి ప్రారంభం కాగా, తొలిరోజే తెలుగు పేపర్–1 ప్రశ్నపత్రం అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి లీకైంది. అరగంటకే నలుగురు యువకులు కిటికీలోనుంచి ప్రశ్నపత్రం సెల్ఫోన్లో ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పెట్టారు. ఈ ఘటనకు కారకుడైన హిందూపురం పట్టణంలో నారాయణ పాఠశాలకు సంబంధించిన ఏఓ ముత్యాలును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయన మొబైల్ ఫోన్ నుంచి పలువురికి ప్రశ్నపత్రం పంపాడని తేలింది. – ఆ తర్వాత రెండు రోజులకే కదిరి పట్టణంలో హిందీ ప్రశ్నపత్రం లీక్ అయింది. నారాయణకు చెందిన పాఠశాలలో సిబ్బంది జవాబులు సిద్ధం చేస్తూ మీడియా కంట పడ్డారు. పట్టణంలో నారాయణ పాఠశాల విద్యార్థులు రాస్తున్న అన్ని కేంద్రాలకు జవాబులు పంపేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు కదిరి పట్టణంలోని అన్ని కేంద్రాల నుంచి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్ల సెల్ఫోన్లు సీజ్ చేసి విచారణ చేశారు. ప్రశ్నపత్రం ఈ ప్రాంతం నుంచి లీక్ కాలేదని తేల్చారు. అయితే ఈ ప్రశ్నపత్రం, సమాధానాల పత్రాలు నారాయణ పాఠశాలకు అనంతపురం జిల్లా నుంచి కాకుండా బయట జిల్లాల నుంచి వచ్చినట్లు విద్యాశాఖాధికారులు అనుమానిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు నారాయణ పాఠశాలలకు ఇదే తరహాలో ప్రశ్నపత్రం వెళ్లిందని, అందులో భాగంగానే కదిరి బ్రాంచ్‌కు వచ్చిందని వారు అంతర్గతంగా చెబుతున్నారు. ఆ సంస్థల్లో ఏటా ఇదేతంతు సాగుతోందని కొందరు అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై డీఈఓ లక్ష్మినారాయణ కేసు నమోదు చేయాలని పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేయగా ఆధారాలున్నాయా? అని ప్రశ్నించారు. వేరే ప్రాంతం నుంచి ఈ ప్రశ్నపత్రం వచ్చిందని వారు పేర్కొనగా తమ పరిధిలో ఈ ఘటన జరిగితేనే కేసు నమోదు చేస్తామని చెప్పి పోలీసులు కేసు నమోదుకు అంగీకరించకపోవడం విశేషం. –చిత్తూరు జిల్లాలో తిరుపతి, చిత్తూరు, పీలేరు, పుత్తూరు పరీక్షా కేంద్రాల్లో రోజు ప్రశ్నాపత్రాలు బయటకు వస్తున్నా ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి సెల్ఫోన్లో ఫోటోలు తీసి సంబంధిత సబ్జెక్టు నిపుణులకు వాట్సాప్‌లో పంపిస్తున్నారు. వారి నుంచి సమాధానాలు సేకరించి పిల్లలతో యథేచ్ఛగా మాస్ కాపీయింగ్ చేయిస్తున్నారు. – కడప జిల్లాలోనూ ఇదే తరహా లీకేజీలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వాట్సప్‌లలో ప్రశ్నపత్రాలు పరీక్షకు ముందే దర్శనమిస్తున్నా మౌనం దాలుస్తున్నారు. గ్రేడ్ల పోటీ వల్లే లీకేజీలు.. నారాయణ సంస్థలో ఆయా స్కూళ్ల డీన్లు, ప్రిన్సిపాళ్లకు ఎవరు ఎక్కువ ఏ గ్రేడ్లు సాధిస్తే వారికి అనేక రకాల ప్రోత్సాహకాలు ఇస్తామని చెబుతుండడంతో ఆ స్కూళ్లన్నీ ఈ అక్రమాలకు తెగబడుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ముందుగానే ఆయా స్కూళ్ల సిబ్బందితో కుమ్మక్కై ప్రశ్నపత్రాలను బయటకు తెస్తున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ షరామామూలుగా మారినా ప్రభుత్వం నుంచి స్పందన కరవైంది. ఈ లీకేజీల వ్యవహారంపై మంత్రి గంటాతోపాటు ఉన్నతాధికారులు కూడా పట్టీపట్టనట్లుంటున్నారు. కఠిన చర్యలు శూన్యం పరీక్ష ప్రారంభానికి ముందే ప్రశ్నపత్రాలు వాట్సప్‌లలో ప్రత్యక్షమవుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశ్నపత్రాలను ముందుగానే బయటకు తెచ్చి, ఫోన్లలో వాట్సాప్‌ల ద్వారా తమ విద్యార్థులకు పంపించి, పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నా విద్యాశాఖ కళ్లప్పగించి చోద్యం చూస్తోంది. అప్పుడప్పుడు మొక్కుబడిగా ఆయా కేంద్రాల ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటోంది. ప్రభుత్వపరంగా కఠినమైన చర్యలు చేపట్టకపోవడంతో లీకేజీ ఆగడాలకు బ్రేకులు పడడం లేదు. పరీక్షా కేంద్రాల్లో స్మార్ట్ ఫోన్లను నిషేధించామని అధికారులు చెబుతున్నారు. అయితే, నిత్యం పరీక్షకు ముందుగానే ఈ ఫోన్లలోనే ప్రశ్నపత్రాలు çబయటకు వస్తున్నాయి. సమాధానాలు వాట్సాప్‌ల ద్వారా పరీక్ష కేంద్రాల్లో ఎంపిక చేసిన కొందరు విద్యార్థులకు చేరుతున్నాయి. రాత్రింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థులు ఈ లీకేజీలతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తమకు అన్యాయం జరుగుతోందని వారు వాపోతున్నారు. ప్రశ్నపత్రాల లీక్ నిజమే: పరీక్షల విభాగం డైరెక్టర్ పదో తరగతి ప్రశ్నపత్రాలు బయటకు వస్తున్న మాట నిజమేనని, వీటిపై విచారణ జరుగుతోందని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ భార్గవ చెప్పారు. నెల్లూరు నారాయణ హైస్కూల్ నుంచి ప్రశ్నపత్రం బయటకు వచ్చిన ఘటనపై ఇంకా తమకు పూర్తి నివేదిక రావాల్సి ఉందన్నారు. ‘నారాయణ’లో లీక్‌లపై ఫిర్యాదులు.. సస్పెన్షన్లు.. నెల్లూరు(టౌన్): పదో తరగతి పరీక్షల్లో ప్రశ్నపత్రం లీకుపై నెల్లూరు జిల్లా విద్యాశాఖాధికారులు చర్యలు చేపట్టారు. నెల్లూరు ధనలక్ష్మీపురంలోని నారాయణ హైస్కూల్లో ఫిజిక్స్ ప్రశ్నపత్రం లీకైనట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నారాయణ స్కూల్లో జరుగుతున్న పరీక్షల్లో ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వహిస్తున్న మహేష్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. మహేష్ ఈదూరు హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అక్కడి చీఫ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, డిపార్ట్మెంటల్ అధికారి ముంతాజ్ తెహజాలను పరీక్షల విధుల నుంచి తొలగించారు. ఫిజిక్స్ పేపర్ లీకుపై నెల్లూరు జిల్లా విద్యాశాఖాధికారి మువ్వా రామలింగం సైబర్ క్రైం కింద పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ప్రశ్నపత్రం లీకైన పాఠశాల మంత్రి నారాయణకు చెందినది కావడంతో ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరుపుతారా? లేక తూతూమంత్రంగా ముగిస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
టెన్త్ విద్యార్థులకు 'ఫిజిక్స్' ఫీవర్
పాసవుతామా లేదా అని విద్యార్థుల బెంగ - సబ్జెక్ట్ టీచర్లకు బదులు లెక్చరర్లతో ప్రశ్నపత్రం రూపకల్పన! - ఫలితంగా విద్యార్థుల స్థాయికి మించి ప్రశ్నలు - 13, 17 ప్రశ్నలకు 6 మార్కులు కలిపే అవకాశం - నేడు నిపుణుల కమిటీతో పరీక్షల విభాగం డైరెక్టర్ భేటీ - విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూస్తామంటున్న అధికారులు - కనీసం 16 మార్కులు కలపాలి: రాష్ట్ర ఫిజికల్ సైన్స్ ఫోరం సాక్షి, హైదరాబాద్: పదో తరగతి విద్యార్థిని ఇంటర్ స్థాయి ప్రశ్నలు ఎలా అడిగారు? కొన్ని ప్రశ్నలైతే ఏకంగా జేఈఈ మెయిన్ స్థాయిలో ఎలా వచ్చాయి? ప్రతిభావంతుడైన విద్యార్థికి సైతం పరీక్షలో అసలు పాసవుతామా అని బెంగ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ప్రశ్నపత్రం రూపకల్పన నిబంధనలు పాటించారా? శనివారం విద్యార్థులకు చుక్కలు చూపిన టెన్త్ ఫిజిక్స్ ఎగ్జామ్‌పై తలెత్తుతున్న సందేహాలివీ! సీనియర్ సబ్జెక్టు టీచర్ల ఆధ్వర్యంలో తయారవ్వాల్సిన ఈ ప్రశ్నపత్రం లెక్చరర్ల కనుసన్నలో తయారైనట్లు తెలుస్తోంది. అందువల్లే ఎన్నడూ లేని విధంగా అత్యంత కఠినంగా ప్రశ్నలు వచ్చాయని, ప్రతిభావంతులైన విద్యార్థులు సైతం ప్రశ్నపత్రం చూడగానే తెల్లముఖం వేశారని చెబుతున్నారు. వాస్తవానికి ప్రశ్నపత్రం రూపకల్పనలో సబ్జెక్టు టీచర్లైన ఆరుగురు ఉపాధ్యాయులు ఆరు రకాల ప్రశ్నపత్రాల్ని తయారు చేస్తారు. అనంతరం వీటిని మోడరేటర్లు(సీనియర్ సబ్జెక్టు టీచర్లు) పరిశీలించి బ్లూప్రింట్ ఆధారంగా క్వశ్చన్ పేపర్ ఖరారు చేస్తారు. బ్లూప్రింట్ నిబంధనల ప్రకారం.. ప్రశ్నపత్రం తయారీలో మూడు కేటగిరీలుగా ప్రశ్నలను ఎంపిక చేయాలి. 50 శాతం సాధారణ, సులభతరమైన ప్రశ్నలు, 30 శాతం స్టాండర్డ్ ప్రశ్నలు, 20 శాతం కఠినమైన ప్రశ్నలను నిర్దేశిస్తూ ప్రశ్నపత్రాన్ని రూపొందించాలి. కానీ టెన్త్ జనరల్ సైన్స్–1 ప్రశ్నపత్రంలో ఈ నిబంధనలు పాటించలేదు. పాఠ్యాంశంలో లేని ప్రశ్నలు ఎక్కువగా రావడంతో విద్యార్థులు పరీక్ష హాలులోనే బిత్తరపోవాల్సి వచ్చింది. మోడరేటర్లుగా లెక్చరర్లు! ప్రశ్నపత్రం తయారీ బృందంలో నిపుణులైన ఆరుగురు టీచర్లతో పాటు ఇద్దరు సీనియర్ సబ్జెక్టు టీచర్లు ఉంటారు. ఆరుగురు నిపుణుల బృందం తయారు చేసిన ప్రశ్నపత్రాన్ని పరిశీలించి ఖరారు చేయాల్సిన బాధ్యత సీనియర్ సబ్జెక్టు టీచర్లపై ఉంటుంది. కానీ తాజాగా టెన్త్ జనరల్ సైన్స్–1 పేపర్ తయారు చేసిన బృందంలో లెక్చరర్లు ఉన్నట్లు తెలిసింది. సీనియర్ సబ్జెక్టు టీచర్ల స్థానంలో ఉన్న ఇదర్దూ లెక్చరర్లే కావడంతో విద్యార్థుల సామర్థ్యానికి మించిన ప్రశ్నలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రశ్నపత్రం గందరగోళంగా మారింది. సాధారణంగా ప్రశ్నపత్రం రూపకల్పనలో టీచర్ల ఎంపికను ఎస్ఎస్సీ బోర్డు అధికారులే నిర్ణయించాలి. కానీ బోర్డుకు సంబంధం లేని అధికారుల ప్రమేయంతో మోడరేటర్ల నియామకం జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ ప్రశ్నలకు ఆరు మార్కులు.. శనివారం జరిగిన జనరల్ సైన్స్–1లో 13, 17వ ప్రశ్నలకు సంబంధించిన కాన్సెప్ట్ పాఠ్య పుస్తకంలోనే లేదు. 13వ ప్రశ్నలో ఒక పైపులో రెండు లెన్స్ సెట్ చేసి చందమామను చూస్తే ఎలా కనిపిస్తుందని అడిగారు. అలాగే 17 (ఏ) ప్రశ్నలో ఫార్ములాను బేస్ చేసుకొని ప్రశ్న ఇచ్చారు. ఈ రెండింటికి పుస్తకంలో సమాధానాలు లేవని నిపుణులు చెబుతున్నారు. ఇవి సిలబస్‌లో లేని ప్రశ్నలు అయినందున ఈ రెండు ప్రశ్నలకు (13వ ప్రశ్నకు 2, 17 ప్రశ్నకు 4) విద్యార్థులకు 6 మార్కులు కలుపుతారని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. నేడు నిపుణుల కమిటీతో భేటీ టెన్త్ ఫిజికల్ సైన్స్ పేపర్–1 విషయంలో సోమవారం పేపర్ సెట్టర్స్, మోడరేటర్స్, సబ్జెక్టుల నిపుణుల కమిటీతో సమావేశం నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సురేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం నాటి పరీక్షలో ఔట్ ఆఫ్ ది సిలబస్ ప్రశ్నలు లేవని, అయితే పాఠ్య పుస్తకంలోని కాన్సెప్ట్‌కు అనుగుణంగా రెండు ప్రశ్నలు ట్విస్ట్ చేసి ఇచ్చినట్లు ఆయన వివరించారు. 13, 17వ ప్రశ్నలను ఇలా ఇచ్చారని, వాటికి సంబంధించి నిపుణుల కమిటీతో పరిశీలన జరుపుతామని చెప్పారు. కమిటీ పరిశీలన తర్వాత అవసరమైతే యాడ్ ఆన్ స్కోర్ ఇస్తామని, విద్యార్థులకు ఎలాంటి నష్టం కలుగకుండా చర్యలు చేపడతామని వెల్లడించారు. కనీసం 16 మార్కులు కలపాలి ‘‘పరీక్షలో వచ్చిన ప్రశ్నలు పదో తరగతి విద్యార్థి స్ధాయికి మించి ఉన్నాయి. విద్యార్థి సామర్థ్యానికి అనుగుణంగా.. జీవో 17 ప్రకారం తయారు చేసిన బ్లూప్రింట్ ప్రకారం ప్రశ్నపత్రం లేదు. అందువల్ల ప్రతి విద్యార్థికి కనీసం 16 మార్కులను కలపాలి. మున్ముందు ఇలాంటివి పునరావృతం కాకుండా... ఎన్సీఈఆర్టీ, డీజీఈ, సీ అండ్ డీఎస్ఈ ఆధ్వర్యంలో పరీక్ష పేపర్ తయారీకి శాశ్వత ప్యానెల్ ఏర్పాటు చేయాలి. ఎన్సీఈఆర్టీ తయారు చేసినట్లుగా రాష్ట్రంలోనూ పాఠ్యపుస్తకం ఆధారంగా ప్రశ్నల నిధిని ఏర్పాటు చేసుకోవాలి. దీంతోపాటు ఫిజికల్ సైన్స్ పేపర్‌ను రెండు పేపర్లుగా (భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం) వేర్వేరుగా నిర్వహించాలి. – సాయి ప్రసాద్‌రావు, రాష్ట్ర ఫోరం ఆఫ్ ఫిజికల్ సైన్స్ అధ్యక్షుడు -
250 మంది విద్యార్థుల గైర్హాజరు
అనంతపురం ఎడ్యుకేషన్ : పదోతరగతి పరీక్షల్లో భాగంగా శనివారం జరిగిన సైన్స్ పేపర్–1 పరీక్షకు జిల్లాలో 250 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 49,137 మంది విద్యార్థులకు గాను 48,887 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి, డీఈఓ లక్ష్మీనారాయణ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్, స్క్వాడ్ బృందాలు 90 కేంద్రాలను తనిఖీ చేశాయి. -
చూసిరాతలు
–‘పది’ పరీక్షల్లో యథేచ్ఛగా మాస్ కాపీయింగ్ – సిబ్బందే ప్రోత్సహిస్తున్న వైనం – ఒక్క కేంద్రంలోనూ చర్యలు తీసుకోని అధికారులు – ఆందోళన చెందుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు - యాక్ట్–25 అభాసుపాలు అనంతపురం ఎడ్యుకేషన్ : కళ్యాణదుర్గం పట్టణంలోని ఓ కేంద్రంలో ఇన్విజిలేటర్ చొరవ తీసుకుని ఓ విద్యార్థిని రాసిన జవాబు పత్రాన్ని అదే గదిలో ఇతర విద్యార్థులకు అందజేశారు. చూసిరాతను ప్రోత్సహించారు. ఇన్విజిలేటరే కల్పించుకుని తన పేపరు ఇతర విద్యార్థులకు ఇవ్వడంతో సదరు విద్యార్థిని ప్రశ్నించే సాహసం చేయలేదు. – మరో కేంద్రంలో ఉదయం ఎనిమిది గంటలకే మూడో అంతస్తుపై పుస్తకాలు పెడుతున్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత అటెండర్, వాటర్‌బాయ్ తదితరులు ప్రశ్నపత్రాన్ని పరిశీలించి.. పైకి వెళ్లి జవాబులు తీసుకొచ్చి తమకు అనుకూలమైన వారికి చిట్టీలు ఇస్తున్నారు. పదో తరగతి పరీక్షలు ఏ రీతిన జరుగుతున్నాయో ఈ రెండు ఘటనలే నిదర్శనం. ఈ నెల 17 నుంచి పరీక్షలు జరుగుతున్నాయి. నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లూ ఉండకూడదని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ కోన శశిధర్ మరో అడుగు ముందుకేసి గతంలో ఎప్పుడూ లేని విధంగా చీఫ్ సూపరింటెండెంట్లను నియోజకవర్గాలు మార్పు చేశారు. గతంలో ఏ స్కూల్లో అయితే హెచ్ఎంగా ఉండేవారో అదే స్కూల్లో చీఫ్ సూపరింటెండెంట్‌గా నియమించేవారు. ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ కొత్త సంప్రదాయానికి తెర తీశారు. ఇక ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి జిల్లా పరిశీలకులుగా ఇక్కడే మకాం వేశారు. రోజూ పదుల సంఖ్యలో కేంద్రాలు తనిఖీలు చేస్తున్నారు. అయినా ప్రయోజనం ఉండడం లేదు. చాలా కేంద్రాల్లో మాస్‌కాపీయింగ్ యథేచ్ఛగా జరుగుతోంది. ఈ విషయంలో కొందరు ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు చక్రం తిప్పుతున్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లను ప్రలోభపెట్టి తమ విద్యార్థులకు లబ్ధి చేకూరేలా చూస్తున్నారు. పలు ప్రాంతాల్లో పరీక్షల నిర్వహణ సిబ్బంది కూడా ప్రైవేట్ పాఠశాలల పిల్లలకు మాత్రమే చిట్టీలు ఇవ్వడం, చూసిరాతలు ప్రోత్సహించడం, బిట్స్‌కు సమాధానాలు చెప్పడం వంటివి చేస్తున్నారు. మరోవైపు ఆయా కేంద్రాలకు ఎవరైనా తనిఖీకి వస్తే నిమిషాల్లోనే అందర్నీ అలర్ట్ చేస్తున్నారు. తనిఖీ అధికారులు బయటకు వెళ్లగానే మళ్లీ తమ పని కానిచ్చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళన మరోవైపు కష్టపడి చదువుకుని పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తాము ఏడాదంతా కష్టపడి చదివి పరీక్షలు రాస్తుంటే, తమతో పాటు రాస్తున్న మరికొందరు విద్యార్థులకు చిట్టీలు ఇవ్వడం, చూసి రాయిస్తుండటంతో వారు మనస్తాపానికి గురవుతున్నారు. వారితో పాటు తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులే అక్రమాలను ప్రోత్సహిస్తున్నారంటూ వాపోతున్నారు. యాక్ట్ 25 అభాసుపాలు యాక్ట్- 25 నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు పాల్పడినా, ప్రోత్సహించినా ఈ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేయొచ్చు. ఆర్నెల్ల నుంచి మూడేళ్ల వరకు జైలుశిక్షతో పాటు రూ.5 వేల నుంచి రూ. లక్ష వరకు జరిమానా ఉంటుంది. ఇంతటి కఠినమైన చట్టం అమలులో ఉన్నా కొందరు బరి తెగిస్తూ అక్రమాలకు పాల్పడుతుండటం గమనార్హం. ఈ వ్యవహారం వెనుక కొందరు అధికారుల అండ కూడా ఉందనే ప్రచారం సాగుతోంది. కూడేరులో గణితం పేపర్ లీక్ కూడేరు : కూడేరు హైస్కూల్ పరీక్షా కేంద్రం నుంచి శుక్రవారం పదోతరగతి గణితం పేపర్–2 ప్రశ్నపత్రం బయటకు వచ్చింది. 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. 11 గంటలకు ప్రశ్నపత్రం బయట హల్చల్ చేసింది. దాని ఆధారంగా జవాబు స్లిప్పులను పరీక్షా కేంద్రంలోని గదుల్లోకి వేసేందుకు కొందరు యువకులు ప్రయత్నించారు. అయితే.. పోలీసులు వారి ప్రయత్నాలను అడ్డుకున్నారు. పరీక్షా కేంద్రంలో నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ప్రశ్నపత్రం బయటకు రావడం గమనార్హం. కొందరు సిబ్బంది సెల్ఫోన్లను లోపలికి తీసుకెళుతున్నారని, వాట్సాప్ ద్వారానో, ఇతరత్రా మార్గాల్లోనో బయటకు పంపివుంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
అధికారుల పరుగులు!
– పదో తరగతి పేపర్ లీక్ వ్యవహారంతో అప్రమత్తం – ఇంగ్లిష్ పరీక్షకు గట్టి ఏర్పాట్లు అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకు అధికారులను పరుగులు పెట్టిస్తోంది. మడకశిర, కదిరి ఘటనల నేపథ్యంలో మంగళవారం జరిగిన ఇంగ్లిష్ పేపర్–1 పరీక్షకు విద్యాశాఖ గట్టి ఏర్పాట్లు చేసింది. విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ, ప్రత్యేక బృందాలు జిల్లా వ్యాప్తంగా వివిధ కేంద్రాలను తనిఖీలు చేశాయి. ఎక్కడా ఎలాంటి సమస్యా తలెత్తకపోవడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. మొత్తం 49,131 మంది విద్యార్థులకు గాను 48,773 మంది హాజరయ్యారు. 358 మంది గైర్హాజరయ్యారు. 94 కేంద్రాలను అ«ధికారులు తనిఖీలు చేశారు. -
పదోతరగతి పరీక్షలు ప్రారంభం
-
కష్ట'పది'
-
‘ఇన్విజిలేషన్’ తిరకాసు!
– విధుల్లో చేరేందుకు మునిసిపల్ టీచర్లు ససేమిరా – కలెక్టర్, ఆర్జేడీ కన్నెర్ర...చేరని వారిపై యాక్ట్–25 కింద కేసు – నేటి ఉదయం వరకు గడువు అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి పరీక్షల ఇన్విజిలేషన్ విధుల్లో కొందరు టీచర్లు తిరకాసు పెట్టారు. ముఖ్యంగా నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ స్కూళ్లలో పని చేస్తున్న టీచర్లు విధులకు డుమ్మా కొట్టేందుకు ఎత్తుగడ వేశారు. చివరకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్జేడీ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. విధుల్లో చేరని వారిపై కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే యాక్ట్ 25 కింద కేసులు నమోదు చేయాలని వారు ఆదేశించారు. అనంతపురం నగర పరిధిలోని మునిసిపల్ కార్పొరేషన్ స్కూళ్లలో పని చేçస్తున్న వారిలో సుమారు 120 మంది టీచర్లను ఇన్విజిలేషన్ విధులకు నియమించారు. వీరంతా గురువారం ఉదయం 10 గంటలకు ఆయా సెంటర్లలో రిపోర్టు చేసుకోవాల్సి ఉంది. అయితే 80 శాతం మంది సాయంత్రం వరకు రిపోర్టు చేసుకోలేదు. ఆర్డర్లు రద్దు చేసుకునేందుకు పైరవీలు చేశారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు, రాజకీయ నేతలతో ఒత్తిళ్లు చేయించే పనిలో పడ్డారు. దీంతో ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన తీవ్రంగా పరిగణించారు. ఏ ఒక్కరి ఆర్డరు రద్దు చేయొద్దని, అందరూ విధిగా చేరాల్సిందేనంటూ స్పష్టం చేశారు. నేటి ఉదయం వరకు గడువు విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) ప్రతాప్‌రెడ్డి సాయంత్రం సమీక్షించారు. విధుల్లో చేరకపోతే యాక్ట్ 25 కింద కేసులు నమోదు చేస్తామంటూ అందరికీ వాట్సాప్ మేసేజ్‌లు, ఎస్ఎంఎస్లు పంపాలని ఆదేశించారు. దీంతో విద్యాశాఖ అధికారులు మెసేజ్‌లు పంపగా ఆగమేఘాల మీద 90 శాతం మంది విధుల్లో చేరారు. తక్కిన వారు కూడా శుక్రవారం ఉదయంలోగా చేరాలని ఆదేశించారు. అనారోగ్యం ఉంటే వైద్యధ్రువీకరణ పత్రాలు సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో డీఈఓ లక్ష్మీనారాయణ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్, డిప్యూటీ డీఈఓలు చాంద్‌బాషా, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. నిబంధనలు పాటించలేదు – ఫ్యాప్టో సీఓలు, డీఓలు, ఇన్విజిలేటర్ల నియామకాల్లో నిబంధనలు పాటించలేదంటూ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) నాయకులు ఆరోపించారు. ఈ మేరకు ఆర్జేడీకి వినతిపత్రం అందజేశారు. 8 కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలల నుంచి 50 శాతం టీచర్లను అందులోనూ ఇంటర్ ఇన్విజిలేషన్ విధులకు వెళ్లనివారిని పదో తరగతి ఇన్విజిలేషన్‌కు నియమించాలని పేర్కొన్నారు. ఇంకా అవసరమైతే అదే మండలం, మరీ అవసరమైతే సమీప మండలాల నుంచి నియమించాలని తెలిపారు. ఈ నిబంధనలు పాటించలేదని పేర్కొన్నారు. 8 మంది టీచర్లుంటే ఆరుగురిని డ్యూటీకి వేశారని, 25 మంది టీచర్లున్న పాఠశాలల నుంచి ఒక్కరినీ నియమించలేదని వివరించారు. 8 కిలోమీటర్లు దాటిì నియమించిన టీచర్లకు టీఏ,డీఏ ఇవ్వాలని నిబంధన ఉన్నా...అధికారులు మాత్రం ‘నో టీఏ, డీఏ’ అంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారని గుర్తు చేశారు. -
ఆల్ ద బెస్ట్
- నేటి నుంచి పదో తరగతి పరీక్షలు - తొలిరోజు అరగంట ముందే చేరుకోవాలి అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి విద్యార్థులు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. శుక్రవారం నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. విద్యార్థులు ఇప్పటికే పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యారు. అయితే..తొలిసారి పబ్లిక్ పరీక్షలు రాస్తుండటంతో విద్యార్థుల్లోనూ, వారి తల్లిదండ్రుల్లోనూ ఆందోళన కన్పిస్తోంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 49,555 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందుకోసం 193 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. తొలిరోజు విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ఈసారి ఒక్క విద్యార్థీ నేలపై కూర్చుని పరీక్ష రాయకూడదనే ఉద్దేశంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఈ విషయంలో విద్యాశాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఆర్జేడీ పలుమార్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి కేంద్రంలోనూ బెంచీలు ఏర్పాటు చేశారు. ఇన్విజిలేటర్ల నియామకంలో కాస్త గందరగోళం నెలకొన్నా.. పరీక్షల ప్రారంభం సమయానికి అన్నీ సర్దుకుంటాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా మునిసిపల్ టీచర్లు డ్యూటీ రద్దు చేసుకునే యోచనలో ఉండటం సమస్యగా మారింది. ఈ విషయాన్ని కలెక్టర్ సీరియస్‌గా పరిగణించారు. ప్రతి ఒక్కరూ విధిగా వెళ్లాల్సిందేనని, లేనిపక్షంలో తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించారు. పరీక్షా కేంద్రంలో ఏ చిన్న పొరబాటు జరిగినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. చిట్టీలు దొరికినా, చూచిరాతలు ప్రోత్సహించినా, ఇతరత్రా ఎలాంటి అక్రమ చర్యలకు పాల్పడినా బా«ధ్యులపై యాక్ట్ 25 కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డీఈఓ లక్ష్మీనారాయణ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థీ ఎలాంటి ఆందోళన, భయం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని అధికారులు సూచిస్తున్నారు. వెక్కిరిస్తున్న వెలుతురు, ఉక్కపోత సమస్యలు ఫర్నీచర్ ఏర్పాటు విషయంలో అధికారులు చర్యలు తీసుకున్నా...చాలా కేంద్రాల్లో కరెంట్ సదుపాయం కల్పించలేకపోయారు. ఫలితంగా విద్యార్థులకు చీకటి, ఉక్కపోత కష్టాలు తప్పేలా లేవు. జిల్లా కేంద్రంలోని సెంటర్లలోనే ఇలాంటి సమస్య ఉందంటే ఇక మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని కేంద్రాలు రేకుల షెడ్లలో ఏర్పాటు చేశారు. వాటిలో పరీక్షలు రాసే విద్యార్థులకు కష్టాలు తప్పవని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
‘పది’ పాట్లు
పలుచోట్ల ఫ్యాన్లులేవు.. మరికొన్ని చోట్ల చీకటి గదులు సౌకర్యాల కల్పనలో ఈసారీ విద్యాశాఖ విఫలం అసౌకర్యాల నడుమే రేపటి నుంచి పది పరీక్షలు విద్యార్థుల భవిష్యత్‌ను నిర్ణయించే పదోతరగతి పరీక్షలు రాసే సమయం రానే వచ్చింది. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే విద్యాశాఖ ఈసారి కూడా అరకొర సౌకర్యాల నడుమే పరీక్షలను నిర్వహించడానికి సిద్ధమైంది. పైకేమో అన్ని సౌకర్యాలు కల్పించామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే మాత్రం పరీక్ష కేంద్రాల్లో కనీసం వసతులు లేవు. చిత్తూరు, ఎడ్యుకేషన్: ప్రశాంత వాతావరణంలో పది పరీక్షలు నిర్వహిస్తామని చెబుతున్న విద్యాశాఖ ఈసారి కూడా అసౌకర్యాల నడమ పరీక్షలను ప్రారంభిస్తోంది. ఓ వైపు ఎండలు మండుతున్నాయి. విద్యార్థులు వాటిని తట్టుకుని పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం ఒక కష్టమైతే అక్కడి అసౌర్యాల నడుమ పరీక్షలు రాయడం విద్యార్థులకు పెనుసవాల్‌గా మారనుంది. పరీక్షా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని విద్యాశాఖాధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అసౌకర్యాలు కనిపిస్తున్నాయి. పదోతరగతి పరీక్షా కేంద్రాల ఏర్పాట్లపై జిల్లావ్యాప్తంగా పరిశీలించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. భావి భవిష్యత్‌కు తొలిమెట్టు.. పదోతరగతి విద్యార్థులపై విద్యాశాఖతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. కానీ పరీక్షలు రాసే వేళకు మాత్రం అధికారులు సౌకర్యాల కల్పనలో చతికిలపడుతున్నారు. భానుడి ప్రకంపనలు.. జిల్లాలో వేసవి ఎండలు భగభగమంటున్నాయి. పది పరీక్షా కేంద్రాల్లో చాలాచోట్ల కనీసం ఫ్యాన్లు కూడా లేవు. దీంతో విద్యార్థులు ఉక్కపోతలోనే పరీక్షలు రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి కొన్ని కేంద్రాల్లో ఫ్యాన్లు ఉన్నప్పటికీ అవి పనిచేయడం లేదు. దానికి తోడు విద్యుత్ బకాయిలు పేరుకుపోవడంతో సంబం ధిత అధికారులు విద్యుత్ సరఫరా నిలిపేశారు. వీటిని గుర్తించి ముందస్తు సౌకర్యాలు కల్పించాల్సిన విద్యాశాఖ ఆ దిశగా ప్రయత్నించడంలో విఫలమైంది. విరిగిన బల్లలే దిక్కు.. విద్యార్థులందరూ కచ్చితంగా బ ల్లలపై కూర్చొని పరీక్షలు రాసే విధంగా ఏర్పాట్లు చేశామని జిల్లా ఇన్చార్జ్ డీఈవో శ్యామ్యూల్ ఇటీవల విలేకరులకు తెలిపారు. కానీ క్షేత్రస్థాయిలో పరీక్షా కేంద్రాలను పరిశీలిస్తే అన్నీ లోపాలే కనిపిస్తాయి. ఏదో బల్లలు వేశాం.. చేతులు దులుపుకున్నాం అన్నట్లు విద్యాశాఖకానిచ్చింది. ఫలితంగా విద్యార్థులకు విరిగిన బల్లలను, కూర్చొవడానికి ఇబ్బం దిగా ఉన్న వాటిని వేసింది. పలుచోట్ల విద్యార్థులకు సరిపడా బల్లలు ఇంకా సర్దుబాటు చేయలేకపోయినట్లు పలు పరీక్షా కేంద్రాల సిబ్బంది చెబుతున్నారు. ఇంటర్ పరీక్షల్లో ఎదురైన సమస్యలు పది పరీక్షల్లో కాకుండా ముందస్తు చర్యలు చేపట్టనప్పటికీ బల్లల కొరతతో పాటు తాగునీటి వసతి సరిగా కల్పించలేదు. శ్రీకాళహస్తిలో.. పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏ, బీ రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే పరీక్షా కేంద్రాల్లోని ఏ ఒక్కరూములో కూడా ఫ్యాన్లు, లైట్లు లేవు. అలాగే బీ కేంద్రంలో కేవలం గది మొత్తానికి ఒక ఫ్యాన్ మాత్రమే ఉంది. అలాగే బాబుఅగ్రహారం పాఠశాలలో ఇప్పటివరకు తరగతి గదిలో బెంచీలు ఏర్పాటు చేయలేదు. తాగనీటి వసతి అరకొరగానే కల్పించారు. కొత్తపేట బాలికల పాఠశాలలో మూడు గదుల్లో పూర్తిగా ఫ్యాన్లు లేవు. ఒక గదిలో బెంచీలు కూడా లేవు. పానగల్, గిరిజన పాఠశాలలోని కేంద్రాల్లో లైట్లు, ఫ్యాన్లు, తాగునీటి ఇబ్బందులు ఉన్నాయి. పూతలపట్టులో.. పూతలపట్టు నియోజవర్గంలోని ఎర్రచెరువుపల్లె జెడ్పీ హైస్కూల్లో గతంలో పలుమార్లు యథేచ్ఛగా మాస్‌కాపీయింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాజీ మంత్రికి చెందిన పాఠశాల విద్యార్థులు ఈ పరీక్షా కేంద్రంలో ప్రతిఏటా పరీ క్షలు రాస్తున్నారు. తమ పాఠశాల విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చేలా అడ్డదారులు తొక్కుతున్నారనే విమర్శలున్నా యి. అయితే ఇలాంటి ఆరోపణలున్న సమస్యాత్మక కేంద్రంలో విద్యాశాఖ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. -
పది పరీక్షలు ప్రారంభం
పదో తరగతి పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. 10.38 లక్షల మంది విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ సారి పరీక్షా కేంద్రాల వద్ద నిఘా మరింత కట్టుదిట్టం చేశారు. ఆరు వేలకు పైగా స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగాయి. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ప్లస్‌టూ పబ్లిక్ పరీక్షలు ఈ నెల రెండో తేదీన ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు కట్టుదిట్టమైన ఆంక్షలు, నిబంధనల నడుమ సాగుతున్నాయి. గతంలో ప్లస్‌టూ పరీక్షలు ముగియగానే లేదా, చివరి దశలో ఉన్నప్పుడు పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయి. అయితే ఈ సారి తక్కువ కాల వ్యవధిలో సాగుతుండడం గమనార్హం. మంగళవారం నాటికి పది పరీక్షలకు తగ్గ అన్ని ఏర్పాట్లు చేశా రు. బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు పరీక్షా కేంద్రాల వైపుగా విద్యార్థినీవిద్యార్థులు కదిలారు. 10.38 లక్షల మంది: పదో తరగతి పరీక్షలను ఈ ఏడాది పుదుచ్చేరితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా రెగ్యులర్, ప్రైవేటు విద్యార్తులు 10 లక్షల 38 వేల 22 మంది రాస్తున్నారు. ఇందులో విద్యార్థులు 4.98 లక్షలు, విద్యార్థినులు 4.95 లక్షల మంది ఉన్నారు. 3371 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు తగ్గ అన్ని ఏర్పాట్లు చేశారు. చెన్నైలో 571 పాఠశాలలకు చెందిన 51 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయడానికి 229 సెంటర్లను ఎంపిక చేసి, అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షలు ప్రారంభం: తొలి రోజు పరీక్షకు ఉదయాన్నే ఎనిమిది, ఎనిమిదిన్నర గంటల కల్లా విద్యార్థులు తమ తమ పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీగా భద్రతా చర్యలు చేశారు. ప్రతి విద్యార్థిని హాల్ టికెట్ల పరిశీలన, క్షుణ్ణంగా తనిఖీల అనంతరం లోనికి అనుమతించారు. సరిగ్గా తొమ్మిది గంటలకు విద్యార్థులను వారికి కేటాయించిన సీట్లలో కూర్చోబెట్టారు. సమాధానాలు రాసేందుకు ఇచ్చిన పత్రాల్లో పేర్లు, ఇతర వివరాలను నింపేందుకు పది నిమిషాలు కేటాయించారు. మరో పదిహేను నిమిషాలు ప్రశ్న పత్రాలను చదువుకునేందుకు అవకాశం కల్పించారు. సరిగ్గా తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్ష నిర్వహించారు. మాస్ కాపీయింగ్, అవకతవకలు జరగకుండా 6,403 ప్రత్యేక స్క్వాడ్లను రంగంలోకి దిగి, తనిఖీలు చేశాయి. జైలు శిక్షను అనుభవిస్తున్న ఖైదీలు పలువురు పరీక్షలు రాయడం విశేషం. ఇందులో 229 మంది ఖైదీలు ఉండగా, వీరిలో పది మంది మహిళా ఖైదీలు ఉన్నారు. చెన్నై పుళల్, తిరుచ్చి, కోయంబత్తూరు, నెల్లై పాళయం కోట్టై జైళ్లల్లో ఖైదీల కోసం పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మాతృ భాషలో పరీక్ష రాస్తామో లేదో అన్న ఆందోళన మంగళవారం తెలుగు విద్యార్థుల్లో నెలకొన్న విషయం తెలిసిందే. రాత్రికి రాత్రే ప్రశ్నపత్రాలు సిద్ధం కావడం, తమకు ఎదురైన కష్టాలు వైదొలగడంతో తెలుగు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. మాతృభాషలో పరీక్షలు రాశారు. -
‘కార్పొరేట్’ వల
ఇంటర్లో ప్రవేశాలకు కసరత్తు పీఆర్వోల హల్చల్.. తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త.. ఆదిలాబాద్ టౌన్ : పదో తరగతి పరీక్షలు ఇంకా పూర్తి కాలేదు.. ఫలితాలు కూడా వెలువడలేదు. కానీ.. ఇప్పటికే జిల్లాలో కార్పొరేట్ కళాశాల ప్రచారం జోరుగా సాగుతోంది. పదో తరగతి విద్యార్థుల వివరాలను సైతం సేకరించారు. విద్యార్థుల ఇంటికి రాజకీయ నాయకులుచేసే ప్రచారం తలదన్నేలా ఉంది. ఫోన్ చేయడం.. ఎస్సెమ్మెస్‌లు ఇంటికి వచ్చి కళాశాలల గురించి వివరించి కళాశాలల్లో చేర్పించుకునేందుకు వల పన్నుతున్నారు. పిల్లలను తమ కళాశాలల్లో చేర్పించేందుకు ఆయా మండలాలో పీఆర్వోలను నియమించుకున్నారు. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఆయా పాఠశాలల యాజమాన్యాలకు నజరానాలు ప్రకటిస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలలే టార్గెట్... జిల్లాలో 40 వేల వరకు పదో తరగతి విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, బెల్లంపల్లిలలో ప్రైవేటు కళాశాలల్లో డేస్కాలర్స్‌కు రూ.10 వేల నుంచి 12 వేల ఫీజు వసూలు చేస్తున్నాయి. హైదరాబాద్, చుట్టు పక్కల జిల్లాల్లో ఏడాదికి 60 వేల నుంచి రూ.లక్ష వరకు ఫీజులు ఉన్నాయి. అయితే.. తమ కళాశాలల్లో చేరితే ఫీజుల్లో రాయితీ ఇస్తామంటూ విద్యార్థులకు వల వేస్తున్నారు. 9 గ్రేడింగ్ పైన వచ్చిన వారికి డిస్కౌంట్ ఇస్తామంటూ ప్రగల్బాలు పలుకుతున్నారు. కాగా.. కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థులను చేర్చుకునేందుకు ప్రైవేటు పాఠశాలలనే టార్గెట్ చేసుకొని ముందుకు సాగుతున్నాయి. దీనికి ప్రిన్సిపాళ్లను మచ్చిక చేసుకొని విద్యార్థుల పేర్లు, వారి అడ్రస్‌లు సేకరించి తల్లిదండ్రులకు కళాశాలలకు సంబంధించిన సమాచారాన్ని మేసేజ్ ద్వారా, పోస్టు ద్వారా పంపిస్తున్నారు. పిల్లలను చేర్చుకునేందుకు మార్గాన్ని సుగమం చేసుకుంటున్నారు. పీఆర్వోలకు ఆఫర్లు.. కార్పొరేట్ కళాశాలలు మండలాల వారీగా పీఆర్వోలను నియమించాయి. హైదరాబాద్ వంటి నగరాలకు చెందిన వారితోపా టు స్థానికంగా ఉండే ప్రైవేటు పాఠశాలల టీచర్లు, కొంత మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఎల్ఐసీ ఏజెంట్లకు కమీషన్లు అంది స్తూ విద్యార్థులను చేర్చడానికి పావులు కదుపుతున్నాయి. ఒక్క విద్యార్థిని చేర్పిస్తే రూ.3,500 నుంచి రూ.7 వేల వరకు అందిస్తున్నాయి. టార్గెట్ పూర్తి చేసిన వారికి టూర్స్, వారి దగ్గరి బంధువుల పిల్లలకు ఫీజుల్లో రాయితీ ఆఫర్లు ఇస్తున్నాయి. స్థానిక కళాశాలలదీ అదేతీరు.. ప్రైవేటు కళాశాలలు ఆదిలాబాద్ పట్టణంతోపాటు ఆయా మండలాల్లోని విద్యార్థులకు వల వేస్తున్నాయి. కళాశాలలో బోధించిన లెక్చరర్లకు టార్గెట్ విధిస్తున్నారు. 9.5 గ్రేడింగ్ నుంచి 9.9 గ్రేడింగ్ వచ్చిన విద్యార్థులకు ఫ్రీ సీట్లు ఇస్తామని ప్రకటిస్తున్నారు. విద్యార్థుల ఇంటికి వెళ్లి ఫీజు రాయితీ, స్కాలర్ షిప్ వచ్చే విద్యార్థులకు కేవలం రూ.500తో తమ కళాశాలల్లో అడ్మిషన్ కల్పిస్తామని అంటున్నారు. గతేడాది కూడా ఇదే విధంగా చేర్పించుకొని పరీక్షల సమయంలో విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని పలువురు విద్యార్థులు పేర్కొంటున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు పదో తరగతి ఫలితాలు రాక ముందు అడ్మిషన్లు తీసుకొవద్దు. కార్పొరేట్, ప్రైవేటు కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేయిస్తాం. ఈ విషయం నా దృష్టికి వచ్చింది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. ప్రభుత్వ కళాశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అనుభవజ్ఞులైన లెక్చర ర్లు విద్యాబోధన చేస్తున్నారు. కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలల్లో వేల ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ కళాశాలలో చేరితే మంచి విద్యతోపాటు ఉచితంగా చదుకునే అవకాశం ఉంది. - ప్రభాకర్, ఆర్ఐవో ఆదిలాబాద్ -
గంట ముందే పరీక్ష హాల్లోకి
ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందుగానే అనుమతించాలని నిర్ణయం ♦ పదోతరగతి పరీక్షల నిర్వహణపై మంత్రి కడియం శ్రీహరి సమీక్ష ♦ పరీక్ష సమయం దాటిన 5 నిమిషాల వరకూ అనుమతి ♦ ఈ నెల 21 నుంచి పరీక్షల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు ♦ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు కడియం ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: ఈనెల 21వ తేదీ నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పరీక్షల ఏర్పాట్లపై విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రంజీవ్ ఆర్ ఆచార్య, పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్‌తో కలసి కడియం శ్రీహరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షలకు విద్యార్థులను ఉదయం 8:45 గంటలకు పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని గతంలో ఉత్తర్వులు జారీ చేసినా, ఉదయం 8:30 గంటల నుంచే అనుమతించాలని స్పష్టం చేశారు. పరీక్షల కోసం వచ్చే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పరీక్ష కేంద్రా ల వద్ద వేచి ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ముందుగానే విద్యార్థులను అనుమతించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని జిల్లాల్లోనూ 8:30 గంటల నుంచే పిల్లలను పరీక్ష హాల్లోకి పంపించాలని స్పష్టం చేశారు. పరీక్ష సమయం దాటిన 5 నిమిషాల వరకు విద్యార్థులను అనుమతించాలన్నారు. మెడికల్ సిబ్బందికి రెమ్యూనరేషన్.. పరీక్ష విధులకు హాజరయ్యే మెడికల్ సిబ్బంది రెమ్యూనరేషన్ అడుగుతున్నట్లు నల్లగొండ జిల్లా కలెక్టర్ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో మెడికల్ సిబ్బందికి రెమ్యునరేషన్ ఇవ్వాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్లు రూపొందించి పంపాలని ఆదేశించారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ప్రైవేటు పాఠశాలల్లోనే ఎక్కువ సంఖ్యలో పరీక్ష కేంద్రాలు ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రైవేటు స్కూళ్లు, ఏజెన్సీలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. సెల్ప్ సెంటర్లు, సమస్యాత్మక కేంద్రాలు, కాంపౌండ్ గోడలు లేని స్కూళ్లలో డిప్యూటీ తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీసు సిబ్బందిలో సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలన్నారు. వరంగల్‌లో 34 సెల్ప్ సెంటర్ల ను ఏర్పాటు చేయడం అవసరమా లేదా అన్న దానిపై ఆర్డీవోలను క్షేత్రస్థాయికి పంపించి, ప రిశీలించి నిర్ణ యం తీసుకోవాలని వరంగల్ కలెక్టర్‌ను ఆదేశించారు. పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు ఈ నెల 12 నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలు కీలకమైనవని, వెయిటేజీతో ముడిపడిన సబ్జెక్టులు కావడంతో వాటి నిర్వహణ పకడ్బందీగా ఉండేలా చూడాలన్నారు. జిల్లాల్లో ఇంటర్మీడియట్ విద్య అధికారులతో సమీక్షించి, మాస్ కాపీయింగ్ జరగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీరు, ఫర్నీచర్ సమస్య ఉన్న కేంద్రాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రంజీవ్ ఆర్ ఆచార్య ఆదేశించారు. టాయిలెట్లకు నీటి వసతి లేకపోతే ముందే ట్యాంకర్ల ద్వారా తెప్పించి అందుబాటులో ఉంచాలన్నారు. అన్ని కేంద్రాల్లో విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలలకు చెందిన వారిని వాటర్ బాయ్స్‌గా నియమించవద్దని పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ ఆదేశించారు. గతంలో వాటర్ బాయ్స్ పేరుతో కేంద్రంలోకి వచ్చిన వారు సెల్ఫోన్లలో ఫొటోలు తీసి బయటకు పంపించిన దాఖ లాలు ఉన్నాయని గుర్తుచేశారు. వృద్ధులను, నిరక్షరాస్యులు మాత్రమే నీళ్లు అందించేలా చర్యలు చేపట్టాలని పేరొన్నారు. పరీక్ష కేంద్రాల్లో ఎవరూ సెల్ఫోన్లు వాడటానికి వీల్లేదని, చీఫ్ సూపరింటెండెంట్లు కూడా కెమెరాలు లేని సెల్ ఫోన్లనే వినియోగించాలని స్పష్టం చేశారు. పరీక్షలతో సంబంధంలేని వారిని ఎట్టి పరిస్థితుల్లో కేంద్రాల్లోకి అనుమతించవద్దన్నారు. -
టెన్త్ పరీక్షలయ్యేదాకా టీచర్లకు సెలవుల్లేవు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల సమయం సమీపిస్తున్నందున పదో తరగతి విద్యార్థులకు బోధించే టీచర్లు ఇప్పటి నుంచి సెలవులు పెట్టొద్దని, వాటిని అనుమతించొద్దని పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ ఆదేశించారు. బుధవారం పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షలు నిర్వహించే గదుల్లో ఫర్నిచర్, లైటింగ్ వంటి అన్ని సదుపాయాలు ఉండేలా చూడాలని పేర్కొన్నారు. -
ఒకే ఎగ్జామ్ కేలండర్‌ను అమలు చేయాలి
సాక్షి, విజయవాడ బ్యూరో/ఏలూరు: రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్నట్లుగానే మిగిలిన తరగతుల విద్యార్థులకు ఒకే సమయంలో పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇందుకు సంబంధించి విద్యాశాఖ రూపొందించే ఎగ్జామ్ కేలండర్‌ను బీసీ, ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా తప్పనిసరిగా అనుసరించాలని ఆయన స్పష్టం చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ పనితీరుపై ముఖ్యమంత్రి గురువారం రాత్రి విజయవాడలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వైఫల్యాన్ని అధిగమించేందుకు నిపుణుల బృందాన్ని నియమించి, మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. సమస్యల్లో ఉన్నాం... ఆదాయం లేదు ప్రస్తుతం రాష్ర్ట ప్రభుత్వం సవాలక్ష సమస్యల్లో ఉందని, ఆదాయం కూడా లేదని దాని వల్ల సంక్షేమ పథకాలు ఆలస్యమవుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆయన గురువారం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో జనచైతన్య యాత్రలో, అంతకు ముందు విజయవాడలో టెలీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. తర్వాత దెందులూరు హైస్కూల్లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. సాక్షి పత్రిక చదివి మనసులు పాడుచేసుకోవద్దంటూ విమర్శలు గుప్పించారు. జనచైతన్యయాత్రలకు గ్రేడింగ్ హైదరాబాద్: తెలుగుదేశం నిర్వహిస్తున్న జనచైతన్యయాత్రల తీరును పరిశీలించి గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తెలిపారు. ఆయన సుమారు ఏడు వేల మంది పార్టీ నేతలు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు మీడియా కమిటీ జాతీయ సమన్వయకర్త ఎల్వీఎస్సార్కే ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. వరద ప్రాంతాలైన చిత్తూరు, నెల్లూరు తదితర జిల్లాల్లోని పార్టీ కార్యకర్తలు, నేతలు వరద సహాయ, పునరావాస చర్యల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు. మార్క్ జుకర్ బర్గ్ (ఫేస్బుక్), బిల్‌గేట్స్ (మైక్రోసాఫ్ట్), వారెన్ బఫెట్ (వ్యాపారవేత్త) స్ఫూర్తితో యువత, కార్పొరేట్ వర్గాలు ఏపీ అభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరారు. కాగా, చంద్రబాబు శనివారం ఉదయం తెలంగాణ రాష్ట్ర పార్టీ నేతలతో సమావేశం అవుతారు. ఆదివారం చంద్రబాబును తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు దంపతులు కలిసే అవకాశం ఉంది. ఈ నెలాఖరులో మెదక్ జిల్లాలోని తన ఫాంహౌస్‌లో నిర్వహిస్తున్న అయుత చండీయాగంలో పాల్గొనాల్సిందిగా వారు ఆహ్వానించనున్నారు. అదేరోజు రాత్రి ఎన్టీఆర్ పెద్ద కుమార్తె లోకేశ్వరి మనుమరాలి వివాహ రిసెప్షన్లో బాబు పాల్గొంటారు. జల సంరక్షణపై కలసి పనిచేస్తాం జల సంరక్షణ, నీటి యాజమాన్య పద్ధతులపై రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు యూరోపియన్ బిజినెస్ అండ్ టెక్నాలజీ సెంటర్(ఈబీటీసీ) సంసిద్ధత వ్యక్తం చేసింది. విజయవాడ సీఎం కార్యాలయంలో బాబుతో ఈబీటీసీ ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. -
మార్చి 21 నుంచే పదో తరగతి పరీక్షలు
- ఎగ్జామ్స్ టైంటేబుల్‌ను ఖరారు చేసిన ప్రభుత్వం - నేడు అధికారికంగా షెడ్యూల్ జారీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను 2016 మార్చి 21 నుంచి ఏప్రిల్ 9 వరకు నిర్వహించేందుకు రూపొందించిన టైంటేబుల్‌ను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సంబంధిత ఫైలుపై మంగళవారం సంతకం చేశారు. దీంతో ప్రభుత్వ పరీక్షల విభాగం బుధవారం టైంటేబుల్‌ను జారీ చేసేందు కు సిద్ధమవుతోంది. ప్రస్తుతం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల కమిషన్ అనుమతి కోసం మంగళవారం సాయంత్రం సంప్రదించగా పరీక్షలకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాబోదని కమిషన్ మౌఖికంగా పేర్కొంది. ఈసారి పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు ఉంటాయి. ద్వితీయ భాష పరీక్ష మాత్రం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఉంటుంది. ఇదీ ఒక పేపరే ఉంటుంది. మిగితా సబ్జెక్టులు రెండు చొప్పున పేపర్లు ఉంటాయి. మార్చి 23న హోలీ, 25న గుడ్ ఫ్రైడే, 27నఆదివారం, ఏప్రిల్ 3న ఆదివారం, 5న జగ్జీవన్‌రామ్ జయంతి, 8న ఉగాది కావడంతో ఆయా తేదీలను విద్యాశాఖ తొలగించి టైంటేబుల్ రూపొందించింది. ఇదీ పరీక్షల షెడ్యూలు 21-3-2016 - ప్రథమ భాష పేపరు-1 22-3-2016 - ప్రథమ భాష పేపరు-2 24-3-2016 - ద్వితీయ భాష 26-3-2016 - ఇంగ్లిషు పేపరు-1 28-3-2016 - ఇంగ్లిషు పేపరు-2 29-3-2016 - గణితం పేపరు-1 30-3-2016 - గణితం పేపరు-2 31-3-2016 - జనరల్ సైన్స్ పేపరు-1 1-4-2016 - జనరల్ సైన్స్ పేపరు-2 2-4-2016 - సోషల్ స్టడీస్ పేపరు-1 4-4-2016 - సోషల్ స్టడీస్ పేపరు-2 6-4-2016 - ఓఎస్సెస్సీ ప్రధాన భాష పేపరు-1 7-4-2016 - ఓఎస్సెస్సీ ప్రధాన భాష పేపరు-2 9-4-2016 - ఎస్సెస్సీ వొకేషనల్ (థియరీ) -
'టెన్త్' డ్యూటీలో నిర్లక్ష్యం.. ఎంఈవో, సీఎస్ల సస్పెన్షన్
పదోతరగతి పరీక్షల్లో ఉత్తర్వుల మేరకు కాకుండా విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులు సహా ఒక సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్లు పరీక్షల డైరెక్టర్ సురేందర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు జిల్లాలోని సెట్టిపల్లి, తుమ్మలపల్లి పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న ఇన్విజిలేటర్, ఇద్దరు చీఫ్ సుపరింటెండెట్లతోసహా గుడేపల్లి ఎంఈవోను బాధ్యతల నుంచి తప్పించి వేరే వారిని నియమించామన్నారు. మంగళవారం జరిగిన పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 6, 47,428 మంది (99.2 శాతం) హాజరయ్యారని, నాలుగోరోజు 10 మాల్‌ప్రాక్టీసు కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇందులో విజయనగరం జిల్లాలో 5, చిత్తూరు జిల్లాలో 4, కడపలో ఒక మాల్‌ప్రాక్టీసు కేసు నమోదయిదన్నారు. -
నేటి నుంచి పది పరీక్షలు
కడప ఎడ్యుకేషన్: నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని సెంటర్లలో మంచి నీటి సౌకర్యం, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 162 పరీక్ష కేంద్రాలలో 35, 642 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 18,135 బాలురు కాగా 17,507 మంది బాలికలు ఉన్నారు. విద్యార్థులకు సరిపడా టేబుళ్లు ఏర్పాటు చేసి.. హాల్‌టికెట్ నంబర్లు వేశామని డీఈఓ డీఈఓ బండ్లపల్లె ప్రతా్ప్రెడ్డ్డి తెలిపారు. పరీక్షా కేంద్రాలకు నిర్ణీత సమయం కంటే 45 నిమిషాలు ముందుగా చేరుకోవాలని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్టు తప్ప ఏ విధమైన కాగితాలు తీసుకెళ్లరాదన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని చెప్పారు. పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్లు ఉండకూడదన్నారు. అలా ఉంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా కాపీయింగ్‌కు పాల్పిడితే చర్యలు తప్పవన్నారు. పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించేందుకు సిట్టింగ్, ఫ్లైయింగ్ స్క్వాడ్ సిద్ధంగా ఉందన్నారు. -
నేలపై కూర్చుని పరీక్ష రాసే దుస్థితి రానివ్వం
గుంటూరు ఎడ్యుకేషన్ : పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు నేలపై కూర్చుని పరీక్ష రాయాల్సిన దుస్ధితి తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టామని జిల్లా విద్యాశాఖాధికారి కేవీ శ్రీనివాసులు రెడ్డి స్పష్టం చేశారు. 10వ తరగతి పరీక్షల ఏర్పాట్లపై డీఈవో శ్రీనివాసులు రెడ్డి శుక్రవారం సాక్షితో మాట్లాడుతూ ఈనెల 26వ తేదీ నుంచి జరగనున్న పబ్లిక్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 60,926 మంది విద్యార్థులు హాజరుకానున్నారని చెప్పారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 56,179 మంది, ప్రైవేటుగా హాజరయ్యే వారు 4,747 మంది ఉన్నారని వివరించారు. జిల్లా నలుమూలలా 287 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసి తాగునీరు, ఫర్నిచర్ సదుపాయాలను కల్పించామని, విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగుకుండా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించామని, మాల్ ప్రాక్టీసులను నిరోధించేందుకు 14 ఫ్లయింగ్ స్వ్వాడ్‌లు, 34 సిట్టింగ్ స్క్వాడ్లను నియమించినట్టు చెప్పారు. విద్యార్థులు ఉదయం 8.30 గంటల కల్లా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించడం ప్రారంభించి, 9.30కి పరీక్షను ప్రారంభించేలా సూపరింటెండెంట్లకు, శాఖాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ఉదయం 9.30 తరువాత పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్థులను లోపలికి అనుమతించడం సాధ్యం కాదన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించి, విద్యార్థులను నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రానికి పంపేలా చూడాలని సూచించారు. పోలీస్స్టేషన్లు, తాలూకా కార్యాలయాలకు దూరంగా ఉన్న 51కేంద్రాలను సి.సెంటర్లుగా గుర్తించి, ఆయా కేంద్రాలకు పోలీసు బందోబస్తు నడుమ ప్రశ్నపత్రాలు తీసుకెళ్లి, పరీక్ష అనంతరం తిరిగి జవాబు పత్రాలను తీసుకువచ్చే ఏర్పాట్లు చేశామని వివరించారు. ఇందుకోసం నియమించిన 34 మంది రూట్ అధికారులు ఆయా కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్‌గా వ్యవహరిస్తారని చెప్పారు. 10వ తరగతి పరీక్షల జిల్లా పరిశీలకుడిగా రంపచోడవరం ఐటీడీఏ ఈవో రాజీవ్‌ను ప్రభుత్వం నియమించిందన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను పూర్తిగా విద్యాశాఖ అధీనంలోకి తీసుకుంటామని, పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టామని చెప్పారు. -
‘పది’కి కొత్త పరీక్షలు!
నూతన విధానంలో టెన్త్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి పరీక్ష సమయం అదనంగా 15 నిమిషాలు పెంపు రాష్ట్రంలో నూతన విధానంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఇన్నాళ్లుగా పాఠం చివరిలో ఇచ్చిన ప్రశ్నలకే పరీక్షల్లోనూ సమాధానాలు రాస్తున్న దానికి బదులుగా... అసలు ఎలాంటి ప్రశ్నలు వస్తాయో తెలియని విధానంలో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అందులోనూ ఈసారి పరీక్షల్లో ఆబ్జెక్టివ్ పేపర్ విడిగా ఉండదు. విద్యార్థులు ప్రశ్నలను బాగా చదివి అర్థం చేసుకోవడం కోసం అదనంగా 15 నిమిషాల సమయం ఇవ్వనున్నారు. మొత్తంగా ఒక్కో సబ్జెక్ట్‌లో 80 మార్కులకే (ఒక్కో పేపర్ 40 మార్కుల చొప్పున రెండు పేపర్లు) పరీక్షలు జరుగనుండగా... ఇంటర్నల్స్‌కు 20 మార్కులు వేయనున్నారు. 25న ప్రారంభమయ్యే ఈ పరీక్షలకు 5.65 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. - సాక్షి, హైదరాబాద్ ఏర్పాట్లన్నీ పూర్తి.. రాష్ట్రంలో ఈ నెల 25వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2,600 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 5,65,000 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు వెల్లడించారు. ఈసారి కొత్త విధానంలో పరీక్షలను నిర్వహిస్తున్నందున విద్యార్థులు ప్రశ్నలను బాగా చదివి అర్థం చేసుకునేందుకు అదనంగా 15 నిమిషాల సమయం ఇస్తున్నట్లు చెప్పారు. ప్రశ్నలు ఏ రూపంలో ఉంటాయో కూడా తెలియని పరిస్థితుల్లో విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని... ప్రశ్నలను అర్థం చేసుకొని జవాబులు రాయాలని చిరంజీవులు సూచించారు. ఇక 49,410 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని.. వీరికి ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. మరోవైపు అన్ని సబ్జెక్టులకు రెండు పేపర్ల చొప్పున ఉండగా ద్వితీయ భాషకు ఒకే పేపర్ ఉంటుందని, ఆ పరీక్ష రోజున మాత్రం విద్యార్థులకు 3:15 గంటల సమయం (ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు) ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పరీక్షల విభాగం డెరైక్టర్ శేషుకుమారి తెలిపారు. పాఠం చివరన ప్రశ్నలు లేకపోవడం, విద్యార్థులే ఆలోచించి నేర్చుకునేలా అమల్లోకి తెచ్చిన ‘నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ)’ విధానంలో మొదటిసారిగా విద్యార్థులు ఈ నెల 25 నుంచి పరీక్షలు రాయనున్నారు. పకడ్బందీగా పరీక్షలు: చిరంజీవులు పదో తరగతిలో ఫలితాలు ముఖ్యం కాదని, పకడ్బందీగా పరీక్షలను నిర్వహించాలని పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు అధికారులను ఆదేశించారు. మాల్‌ప్రాక్టీస్‌కు ఏ మాత్రం అవకాశం లేకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరీక్షల ఏర్పాట్లపై మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, విద్యాశాఖ, రెవెన్యూ, విద్యుత్, వైద్యారోగ్య శాఖల అధికారులతో చిరంజీవులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశించారు. ‘‘పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ను అమలు చేయాలి. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలి. తాగునీరు, ఫర్నీచర్, టాయిలెట్ సదుపాయం కల్పించాలి. రూమర్స్, పేపర్ లీక్ వంటి వాటిపై వెంటనే చర్యలు చేపట్టాలి. పరీక్షల సమయంలో ఆయా ప్రాంతాల్లో కరెంటు కోత విధించవద్దు. వైద్యారోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలి. రవాణా సదుపాయం కల్పించాలి. చీఫ్ సూపరింటెండెంట్ మినహా మరెవరు కూడా సెల్‌ఫోన్ తీసుకెళ్లవద్దు..’’ అని ఆయన సూచించారు. పరీక్షా కాలం.. 10,978 ఉన్నత పాఠశాలల నుంచి విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొత్తం పరీక్షా కేంద్రాలు.. 2,600. ఇందులో రెగ్యులర్ విద్యార్థులకు 2,383 కేంద్రాలు, ప్రైవేటు విద్యార్థులకు 231 కేంద్రాలు. పరీక్షలు రాసే మొత్తం విద్యార్థులు 5,65,000. ఇందులో రెగ్యులర్ 5,15,590, ప్రైవేటు విద్యార్థులు 49,410 మంది. ఇక వొకేషనల్ విద్యార్థులు 11,041 మంది. పరీక్షలు రాసేవారిలో 2,92,764 మంది బాలురు, 2,72,236 మంది బాలికలు. మాస్ కాపీయింగ్‌ను నిరోధించేందుకు 144 ఫ్లైయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. వీటితోపాటు సమస్యాత్మక కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లు ఉంటాయి. ద్వితీయ భాష మినహా ఒక్కో పేపర్లో 40 మార్కులకు (ఒక సబ్జెక్టులో మొత్తంగా 80 మార్కులకు) రాత పరీక్ష ఉంటుంది. ఒక్కో సబ్జెక్టులో ఇంటర్నల్స్‌కు 20 మార్కుల చొప్పున ఉంటాయి. ఈ కొత్త విధానంలో ఆబ్జెక్టివ్ పేపర్ ఉండదు. ప్రైవేటు విద్యార్థులకు మాత్రం ఉంటుంది. ఓఎంఆర్ జవాబు పత్రంపై హాల్‌టికెట్ నంబర్ వేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గతంలో ఫెయిలై ఇప్పుడు పరీక్ష రాస్తున్న ప్రైవేటు విద్యార్థులు ఈసారితోపాటు వచ్చే జూన్/జూలైలో నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షలే పాత విధానంలో చివరి అవకాశం. ఆ తర్వాత (2016 మార్చి నుంచి) కొత్త విధానంలోనే వారు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. పది నిమిషాలకు మించితే నో విద్యార్థులు పరీక్ష కేంద్రానికి అరగంట ముందుగానే చేరుకోవాలి. పరీక్ష హాల్లోకి 15 నిమిషాల ముందు అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభమయ్యాక గరిష్టంగా 10 నిమిషాల వరకు మాత్రమే విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. అంతకు మించి ఆలస్యమైతే వెనక్కి వెళ్లాల్సిందే. ఇక ఎండాకాలం అయినందున విద్యార్థులు పరీక్షకు వచ్చేప్పుడు భోజనం చేసి రావడం మంచిది. వీలయితే వాటర్ బాటిల్ వెంట తెచ్చుకోవాలి. మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. -
పదో తరగతి పరీక్షలు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా 1.73 లక్షల విద్యార్థులు సాక్షి, ముంబై: రాష్ట్రంలో ఎస్ఎస్సీ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మొత్తం 17,32,898 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో 9,59,450 మంది బాలురు, 7,73,448 మంది బాలికలు ఉన్నారు. పుణే, నాగ్‌పూర్, ఔరంగాబాద్, ముంబై, కొల్హాపూర్, అమరావతి, నాసిక్, లాతూర్, కొంకణ్ విభాగాల ఆధ్వర్యంలో 4,222 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముంబై జోన్లో మొత్తం 3,82,437 మంది, పింప్రి-చించ్‌వడ్‌లోని 30 పరీక్ష కేంద్రాలలో 23,569 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఉదయం మొదటి భాషకు సంబంధించి తెలుగు, మరాఠీ, కన్నడ, తమిళంతోపాటు ఇతర భాషల పరీక్షలు జరిగాయి. ద్వితీయ, తృతీయ భాషల పరీక్ష మధ్యాహ్నం జరిగింది. మహారాష్ట్ర సెకండరీ, హయ్యర్ సెకండరీ బోర్డు ఆదేశాల మేరకు పది నిమిషాల ముందే విద్యార్థులకు ప్రశ్నపత్రాలు అందించారు. తగ్గుతున్న తెలుగు మీడియం విద్యార్థులు..! తెలుగు మీడియం విద్యార్థుల సంఖ్య ప్రతీ ఏడాదీ తగ్గుతూ వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా తెలుగు మీడియం పాఠశాలలు తక్కువగానే ఉన్నా తెలుగును సబ్జెక్ట్‌గా తీసుకునే విద్యార్థుల సంఖ్య ఎక్కువే. అయితే ప్రతి ఏడాదీ వీరి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ముంబై తూర్పు బోరివలిలోని చైతన్య తెలుగు హైస్కూల్ , పశ్చిమ ములూండ్లోని మున్సిపల్ కార్పొరేషన్ స్కూళ్లలో పూర్తిగా తెలుగు మీడియంలో బోధిస్తున్నారు. చైతన్య పాఠశాలలో గతేడాది 250 మంది పరీక్ష రాయగా, ఈ ఏడాది 225 మంది రాస్తున్నారు. ములూండ్ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో కూడా ఇదే పరిస్థితి. ఆంధ్ర ఎడ్యుకేషన్ సోసైటీ స్కూల్ నుంచి ఈ సారి 341 మంది ఉండగా వీరిలో 130 మంది తెలుగు భాష ఎంచుకున్నవారున్నారు. అయితే గతేడాది 145 మంది తెలుగులో పరీక్ష రాశారని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మి లలితా తెలిపారు. -
టెన్త్ పరీక్షల కోసం కంట్రోల్‌రూం
- సమస్యలుంటే 040- 23231858 నంబర్‌కు ఫోన్ చేయండి - జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి సాక్షి, రంగారెడ్డి జిల్లా: మార్చి 25 నుంచి నిర్వహించే పదో తరగతి పరీక్షలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో పదో తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 427 పరీక్షా కేంద్రాలున్నందున ప్రతి కేంద్రం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలకు 94,181 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి కేంద్రంలో నిరంతరంగా విద్యుత్తు సరఫరా చేయడంతోపాటు మౌలికవసతులు కల్పించాలన్నారు. ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై జిల్లా విద్యాశాఖలో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. సమస్యలుంటే 040- 23231858 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. పరీక్ష నిర్వహణకు 4,710 మంది ఇన్విజిలేటర్లను నియమిస్తున్నామని, 45 రూట్ అధికారులు, 427 ఛీఫ్ సూపరింటెం డెంట్లు, 20 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించి పరీక్షలు పక్కాగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం డీఈఓ రమేష్ మాట్లాడుతూ ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.15వరకు పరీక్ష జరుగుతుందని, కొత్త పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తున్నందున విద్యార్థులు ప్రశ్నాపత్రాన్ని చదువుకునేందుకు వీలుగా 15 నిమిషాల సమయం అదనంగా ఇస్తున్నామన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ సుభాష్‌చంద్రబోస్, ఆర్టీఓ దుర్గాదాస్ తదితరులు పాల్గొన్నారు. -
పదింతలు మెరుగయ్యేలా..
విజయనగరం అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షలు తరుముకొస్తున్నాయి. కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉంది. మార్చి 26వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ప్రత్యేక బోధనపై ఉపాధ్యాయులకు విద్యాశాఖ దిశానిర్దేశం చేసింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా స్పెషల్ క్లాసులు ఇటీవల మొదలయ్యాయి. గత ఏడాది జిల్లాలో వచ్చిన 91.8 శాతం ఉత్తీర్ణతను మెరుగుపర్చేందుకు ప్రణాళికలకు రూపొందిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు మరింత శ్రద్ధచూపితే కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి ఐదు స్థానాలలో జిల్లా నిలిచే అవకాశం ఉంటుందని జిల్లా విద్యాశాఖ భావిస్తోంది. జిల్లాలో 360 ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలలకు చెందిన 29,841 మంది విద్యార్థులు పదోతరగతి వార్షిక పరీక్షలు రాయబోతున్నారు. వీరికోసం జిల్లా వ్యాప్తంగా 170 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) విధానం అమ ల్లోకొచ్చాక ర్యాంకుల పోటీ తగ్గిపోయినా చాలా పాఠశాలలు నూరుశాతం ఉత్తీర్ణతపై దృష్టి పెట్లాయి. సమ్మేటివ్ (త్రైమాసిక, అర్ధవార్షిక) పరీక్షల్లో మంచి ప్రతిభ చూపిన విద్యార్థులు ఉన్నారు, అలాగే ఆ పరీక్షల్లో వెనుకబడిన వారూ ఉన్నారు. వీరిని పాఠశాల స్థాయిలో బేరీజు వేసుకుని వార్షిక పరీక్షలకు సిద్ధంచేస్తున్నారు. ఈ మేరకు ఉత్తీర్ణతా శాతం బాగా పెరగవచ్చని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రణాళికతో ముందుకెళ్తే జిల్లాకు ప్రస్తుతమున్న 8వ స్థానాన్ని నూతన ఆంధ్రప్రదేశ్‌లో మెరుగుపర్చుకునే అవకాశముంది. మరి లక్ష్య సాధన లో పురోగమిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ విద్యలో ప్రమాణాలు సాధించేందుకు జిల్లా లో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ మొదలైంది. వాస్తవానికి 10వ తరగతి విద్యార్థులకు గత ఏడాది నవంబర్ నుంచి ప్రతి రోజూ సాయంత్రం అదనంగా గంట తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సిలబస్ పూర్తయింది. ఇక నుంచి పునశ్చరణ తరగతులు మొదలవుతున్నాయి. పదోతరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా విద్యాశాఖ నూతన కార్యాచరణ ప్రకారం ఉదయం 8.30గంటల నుంచి ప్రత్యేక పునశ్చరణ తరగతులు ప్రారంభించి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తున్నారు. పదో తరగతి బోధించే ఉపాధ్యాయులకు వరుస సెలవులు మంజూరు చేయకుండా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సిలబస్ పూర్తయిన చోట సబ్జెక్టుల వారీగా వివిధరూపాల్లో ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టాలని నిర్ణయించారు. బ్లూప్రిం ట్ ప్రకారం విద్యార్థుల సంసిద్ధత, చర్చలు, సమీక్షల ద్వారా ప్రతిభా ప్రగతికి ప్రయత్నిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధతో పాఠాల పునశ్చరణ చేస్తున్నారు. ఆదివారం, ఇతర సెలవుల రోజున ఏదో ఒక సబ్జెక్ట్ టీచర్ రోజంతా ఉండి విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నారు. పరీక్షలో ఏ ప్రశ్నలు వచ్చే అవకాశముంది. వాటిని ఎలా రాయాలనే దానిపై సిద్ధం చేస్తున్నారు. ఉత్తీర్ణతా శాతం పెంపునకు ప్రణాళికలు పదో తరగతి ఉత్తీర్ణతా శాతాన్ని గత ఏడాది కంటే మెరుగుపరచడానికి క్షేత్రస్థాయిలో ప్రణాళికలు వేశామని డీఈఓ కృష్ణారావు అన్నారు. గత ఏడాది ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాల్లో 91.8 శాతం ఉత్తీర్ణతతో 8వ స్థానంలో ఉన్నామని తెలిపారు. ఈ ఏడాది కొత్తరాష్ట్రంలో మరింత మెరుగుపడేలా పాఠశాలస్థాయిలో ప్రణాళికలు వేశామని చెప్పారు. వచ్చేనెల మొదటివారంలో జరిగే ప్రీ ఫైనల్ పరీక్షల తరువాత పాఠశాల స్థాయిలో విద్యార్థుల సామర్థ్యంపై ఒక అంచనా వస్తుందని తెలిపారు. నిర్ణీత టైమ్ టేబుల్ ప్రకారం ప్రత్యేక ప్రణాళికను పూర్తిచేసి మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. -
రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు 12 రోజుల గడువు
టెన్త్‌లో తప్పిన విద్యార్థులు వెంటనే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫీజు కట్టాలి సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి శుక్రవారం నుంచి 12 రోజులు గడువు ఇచ్చినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ బి.మన్మథరెడ్డి తెలిపారు. గురువారం పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫెయిల్ అయిన విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం వేచి ఉండకుండా వెంటనే అడ్వాన్స్‌డ్‌సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు కట్టాలని సూచించారు. రీ కౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.500 ఫీజును డీడీ లేదా చలాన్ రూపంలో చెల్లించాలన్నారు. దరఖాస్తును హైదరాబాద్‌లోని ప్రభుత్వ పరీక్షల కమిషనర్‌కు పంపించాలని సూచించారు. రీ వెరిఫికేషన్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ. 1000 ఫీజు చలాన్ రూపంలోనే కట్టాలి. డీడీలను అంగీకరించరు. www.bsep.org వెబ్సైట్లో దరఖాస్తు నమూనా పొందవచ్చు. రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు రీకౌంటింగ్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. -
ఇంగ్లీష్ మీడియంలో ఇరగదీశారు
- సరాసరి కంటే ఇంగ్లిష్ మీడియంలో ఉత్తీర్ణత శాతం ఎక్కువ - 4.95 లక్షల మందిలో 4.60 లక్షల మంది పాస్ - మొత్తం విద్యార్థుల్లో సగం ఇంగ్లిషు మీడియం వారే - 10 జీపీఏ సాధించిన వారు 4,085 మంది - ఏపీ గురుకులాల హవా - విడుదలైన పదో తరగతి ఫలితాలు సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల్లో ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు అధిక ఉత్తీర్ణత సాధించారు. పరీక్ష రాసిన మొత్తం విద్యార్థుల సరాసరితో పోల్చితే ఇంగ్లిష్ మీడియంలో ఉత్తీర్ణులైన వారి శాతం ఎక్కువగా నమోదైంది. మొత్తంగా 83.17 శాతం మంది ఉత్తీర్ణులు కాగా ఇంగ్లిషు మీడియంలో మాత్రం 92.90 శాతం మంది పాసయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతంతో పోల్చినా ఇంగ్లిష్ మీడియంలో ఉత్తీర్ణులైన వారి శాతమే ఎక్కువగా ఉంది. మార్చి/ఏప్రిల్ నెలల్లో జరిగిన పరీక్ష ఫలితాలను సచివాలయ డి బ్లాక్‌లో గురువారం గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ అహ్మద్ విడుదల చేశారు. ఈసారి పరీక్షలకు మొత్తంగా మొత్తంగా 12,15,391 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే 10,10,960 మంది విద్యార్థులు (83.17 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు విద్యార్థులను మినహాయిస్తే.. రెగ్యులర్ విద్యార్థుల్లో 10,61,703 మంది పరీక్షలకు హాజరుకాగా 9,40,924 మంది (88.62 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. సత్తా చాటిన బాలికలు.. పదో తరగతిలోనూ బాలికలే సత్తా చాటారు. బాలురు 87.96 శాతం వుంది ఉత్తీర్ణులు కాగా, బాలికలు 89.33 శాతం వుంది పాస్ అయ్యూరు. 5,44,538 మంది బాలురు పరీక్షలు రాయగా 4,78,955 మంది (87.96 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇక 5,17,165 మంది బాలికలు పరీక్షలు రాయగా 4,61,969 మంది (89.33 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఏపీ గురుకులాల హవా.. మేనేజ్మెంట్ల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల హవా కొనసాగింది. వాటిల్లో 95.41 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో ఈసారి బాలికల (94.07) కంటే బాలురు (97.68 శాతం) అధిక శాతం మంది ఉత్తీర్ణులు కావడం విశేషం. 99 స్కూళ్లు ఆంధ్రప్రదేశ్ గురుకులాల సొసైటీ పరిధిలో ఉండగా 91 పాఠశాలల విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 51 స్కూళ్ల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. 7,750 మంది పరీక్షలు రాయగా 7,602 మంది (98.1 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 48 గురుకుల బాలుర స్కూళ్లు ఉండగా 28 స్కూళ్లలో 100 శాతం ఫలితాలు వచ్చాయి. 43 బాలికల పాఠశాలు ఉండగా 23 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. సాంఘిక సంక్షేమ గురుకులాల్లోనూ బాలికల (90.22 శాతం) కంటే బాలురే (94.15 శాతం) అధిక సంఖ్యలో ఉత్తీర్ణులయ్యారు. ఇంగ్లిష్ మీడియం విద్యార్థుల సంఖ్యలో పెరుగుదల.. ఈసారి పదో తరగతి పరీక్షలు రాసిన వారిలో ఇంగ్లిషు మీడియం విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రైవేటు స్కూళ్లతోపాటు ప్రభుత్వ సక్సెస్ స్కూళ్లు, గురుకుల విద్యాలయాల్లో ఇంగ్లిషు మీడియం ఉండటమే ఇందుకు కారణం. 3,28,256 మంది విద్యార్థులు 2012లో ఇంగ్లిష్ మీడియంలో పదో తరగతి పరీక్షలు రాయగా, గత ఏడాది 4,62,984 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇక ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగి 4,95,225కు చేరుకుంది. అందులో 4,60,086 మంది (92.90 శాతం) ఉత్తీర్ణులయ్యారు. పది జీపీఏ గుంటూరులో అధికం..: గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) పదికి పది సాధించిన విద్యార్థులు గుంటూరులో ఎక్కువ మంది ఉన్నారు. మొత్తంగా పది జీపీఏ సాధించిన విద్యార్థులు 4,085 మంది ఉండగా, గుంటూరు జిల్లాలో 586 మంది పది జీపీఏ సాధించారు. ఆ తర్వాత స్థానంలో 562 మందితో రంగారెడ్డి నిలిచింది. పది జీపీఏ సాధించిన విద్యార్థుల సంఖ్యలో విజయనగరం జిల్లా (46 మంది) చివరి స్థానంలో నిలిచింది. గిరిజన గురుకులాల్లో 89.94 శాతం ఉత్తీర్ణత పదో తరగతి పరీక్షా ఫలితాల్లో రాష్ట్రంలోని 77 ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల నుంచి 89.94 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు గురుకులం కార్యదర్శి హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. వీరిలో బాలికలు 90.50 శాతం, బాలురు 89.63 శాతమని వివరించారు. 5,606 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షకు హాజరుకాగా... 5,029 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. సీతంపేట, భద్రగిరి, దమ్మపేట, కొమరాడ, కులకచెర్ల, మల్లి, తుమ్మలవలస, కొయ్యూరు, జి.మాడుగుల బాలుర గురుకుల పాఠశాలలో, భద్రగిరి, కొత్తగూడ, కూనవరం, సీతంపేట, వనపర్తి బాలికల పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. -
20వ తేదీ తరువాత టెన్త్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ఫలితాలను ఈ నెల 20వ తేదీ తరువాత విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో... వీలైతే ఈ నెల 24వ తేదీ కంటే ముందుగానే ఫలితాలను విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. -
‘పది’ పరీక్షలు ప్రక్షాళన
మెదక్, న్యూస్‌లైన్: పదోతరగతి పరీక్షల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుతమున్న 11 పేపర్ల స్థానంలో తొమ్మిది పేపర్లకే పరీక్షలు నిర్వహించేందుకు ఎస్ఎస్సీ బోర్డు ప్రణాళికను సిద్ధం చేసింది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సబ్జెక్టులకు ఒక్కోపేపర్, గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులకు రెండేసి పేపర్ల చొప్పున పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ఒక్కో సబ్జెక్టుకు వందమార్కుల చొప్పున మొత్తం 600 మార్కులకు పరీక్షలు నిర్వహించనున్నారు. అందులో కూడా 80 మార్కులకు రాత పరీక్ష, 20 మార్కులకు ఇంటర్నల్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ విధానానికి విద్యార్థులు అలవాటయ్యేందుకు తొమ్మిదో తరగతిలోనూ ఇదే పద్ధతి ప్రవేశపెట్టాలని (ఎన్సీఈఆర్టీ) రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి భావిస్తోంది. ఉత్తీర్ణత మార్కులు మాత్రం 35 శాతంగానే నిర్ధారించనున్నట్లు స మాచారం. విద్యాశాఖ, ఎన్సీఈఆర్టీ లు ఆమోదం తెలుపగా, వచ్చేవారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లనున్నట్లు సమాచారం. ముందస్తు ప్రణాళికతో ముందుకు బట్టీ విధానానికి స్వస్తి పలికి, పరీక్షల భయాన్ని తొలగించి, విద్యార్థుల్లోని సామర్థ్యాలను గుర్తించి, నైపుణ్యాలను వెలికి తీసేందుకు ప్రభుత్వం 2012-13 విద్యా సంవత్సరం 1 నుంచి 8వ తరగతి వరకు నిరంతర సమగ్ర మూల్యాంకన(సీసీఈ) విధానాన్ని ప్రవేశపెట్టింది. అనంతరం గత ఏడు 9వ తరగతికి, ఈసారి 10వ తరగతి విద్యార్థులకు సీసీఈ ప్రకారం సిలబస్‌ను రూపొందించి నూతన పాఠ్యపుస్తకాలను అందజేశారు. ముఖ్యంగా పదోతరగతి విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని గత ఏప్రిల్‌లో తొమ్మిదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు చివరి పరీక్ష రోజునే పాఠ్య పుస్తకాలను అందజేశారు. పేపర్ల స్వరూపం మూడు లాంగ్వేజ్‌లు (తెలుగు, హిందీ, ఇంగ్లీష్)లకు ఒక్కో పేపర్ పరీక్ష నిర్వహించనున్నారు. గణితం మొదటి పేపర్లో సంఖ్యలు, సమితులు, బీజగణితం, ప్రోగ్రెషన్, కోఆర్డినేట్ జామెట్రీ, రెండవ పేపర్లో త్రికోణమితి, క్షేత్రగణితం, సంఖ్యాశాస్త్రాలుంటాయి. సైన్స్ జీవశాస్త్రానికి ఒకపేపర్, బౌతిక, రసాయన శాస్త్రాలు మరో పేపర్లో ఉంటాయి. సాంఘిక శాస్త్రం మొదటి పేపర్లో భూగోళం, అర్థశాస్త్రం, రెండవపేపర్లో పౌరశాస్త్రం, చరిత్ర పేపర్లు ఉంటాయి. 80 మార్కుల రాత పరీక్షలో కనీసం 28 మార్కులు, ఇంటర్నల్‌లో 7 మార్కులు వస్తే విద్యార్థి ఉత్తీర్ణత సాధిస్తాడు. అంటే భాషేతర సబ్జెక్టులకు ఒక్కో పేపర్‌కు 50 మార్కులు ఉండగా అందులో 40 మార్కులు రాత పరీక్షకు, 10 మార్కులు ఇంటర్నల్‌కు ఉంటాయి. మారనున్న గ్రేడింగ్ కొత్త విధానంతో గ్రేడింగ్ విధానం కూడా మారనుంది. లాంగ్వేజెస్ పరీక్షల్లో 91 నుంచి 100 మార్కులు వస్తే ఏ-1 గ్రేడ్ 10 పాయింట్లు, 81 నుంచి 90 మార్కులు వస్తే ఏ-2 గ్రేడ్ 9 పాయింట్లు, 71 నుంచి 80 మార్కులు వస్తే ఇ-1 గ్రేడ్ 8 పాయింట్లు, 61 నుంచి 70 మార్కులు వస్తే ఇ-2 గ్రేడ్ 7పాయింట్లు, 51 నుంచి 60 మార్కులు వస్తే సీ-1 గ్రేడ్ 6 పాయింట్లు, 41 నుంచి 50 మార్కులు వస్తే సీ-2 గ్రేడ్ 5 పాయింట్లు, 35 నుంచి 40 మార్కులు వస్తే డీ-1 గ్రేడ్ 4 పాయింట్లు, 1 నుంచి 34 మార్కులు వస్తే డీ-2 గ్రేడ్ 3 పాయింట్లు వస్తాయి, అదేవిధంగా భాషేతర సబ్జెక్టుల్లో 46 నుంచి 50 వస్తే ఏ-1 గ్రేడ్ 10 పాయింట్లు, 41 నుంచి 45 వస్తే ఏ-2 గ్రేడ్ 9 పాయింట్లు, 36 నుంచి 40 వస్తే బి-1 గ్రేడ్ 8 పాయింట్లు, 31 నుంచి 35 వస్తే బీ-2 గ్రేడ్ 7 పాయింట్లు, 26 నుంచి 30 వస్తే సీ-1 గ్రేడ్ 6 పాయింట్లు, 21 నుంచి 25 వస్తే సీ-2 గ్రేడ్ 5 పాయింట్లు, 18 నుంచి 20 వస్తే డీ-1 గ్రేడ్ 4 పాయింట్లు, 1 నుంచి 17 వస్తే డీ-2 గ్రేడ్ 3 పాయింట్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ, ఎన్సీఈఆర్టీ ఈ విధానానికి తమ ఆమోదం తెలిపిందని జూన్ 2న ఏర్పడనున్న కొత్త రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపనున్నట్లు సమాచారం. -
చిట్టచివరి పరీక్ష రోజు.. బాలిక మృతి
పదో తరగతి పరీక్షలలో చిట్టచివరి పరీక్ష మంగళవారం జరుగుతోంది. సోషల్ రెండో పేపర్ రాసేస్తే ఇక పరీక్షలు అయిపోతాయి. మరో రెండు నెలల్లో కాలేజీకి వెళ్లిపోవచ్చని ఆ చిన్నారి అనుకుంది. అంతలోనే కారు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. ఆమె ప్రాణాలు బలిగొంది. ఈ దారుణ సంఘటన శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం చిట్టుపూడివలస వద్ద సంభవించింది. పదోతరగతి పరీక్ష రాయడానికి పరీక్ష కేంద్రానికి వెళ్తున్న ఓ విద్యార్థినిని కారు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. అయితే పోలీసులు మాత్రం కారును వదిలేశారంటూ పోలీసులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన స్థలం వద్దకు వచ్చిన పోలీసులను గ్రామస్తులు తరిమికొట్టారు. -
16 నుంచి ‘ఓపెన్’ పరీక్షలు
కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్ :ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్ష లు ఈ నెల 16 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ అంజయ్య గురువారం ఒక ప్రకటనలో తెలి పారు. ప్రాక్టికల్ పరీక్షలు 26 నుంచి జరుగుతాయని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలకు 2,146 మంది, ఇంటర్మీడియట్ పరీక్షలకు 3,022 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పదో తరగతి విద్యార్థుల కోసం పది, ఇంటర్ విద్యార్థుల కోసం తొమ్మిది కేంద్రాలను ఏర్పాటు చేశామని డీఈఓ తెలిపారు. అభ్యర్థులు సంబంధిత స్టడీ సెంటర్ ద్వారా గానీ, ఏపీఓపెన్ స్కూల్ వెబ్సైట్ ద్వారా గానీ ఈ నెల 10 వరకు హాల్‌టికెట్లు పొందవచ్చన్నారు. పరీక్షల నిర్వహణకు కలెక్టర్ కోన శశిధర్ ఆధ్వర్యంలో పోలీస్, రెవెన్యూ, విద్యాశాఖ సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేశామని, జిల్లా స్థాయిలో ఐదు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలనూ నియమించామన్నారు. ఈ ఏడాది జిల్లా స్థాయి పరిశీలకులను కూడా నియమించామన్నారు. పరీ క్షలు మొదలైన తర్వాత కేవలం 15 నిముషాల వరకే అభ్యర్థులను అనుమతిస్తామని స్పష్టం చేశారు. -
దర్జాగా చూచిరాతలు
పాఠశాలల యాజమాన్యాల ప్రోత్సాహం ఉత్తీర్ణత శాతం పెంపునకు అడ్డదారులు నర్సీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : పదో తరగతి పరీక్షల్లో పెద్ద ఎత్తున మాస్‌కాపీయింగ్ జరుగుతోంది. ఒకపక్క పరీక్షలు, మరోపక్క ఎన్నికలు రావడంతో ఈ పరీక్షలపై అధికారులు దృష్టిసారించకపోవడాన్ని అవకాశంగా చేసుకుని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల యాజమాన్యాలు చూచిరాతలను ప్రోత్సహిస్తున్నాయి. పరీక్ష ప్రారంభమైన అర్ధగంటలోపే ప్రశ్నపత్రం బయటకు వస్తోంది. వెనువెంటనే జవాబుపత్రాన్ని తయారుచేసి విద్యార్థులకు అందజేస్తున్నారు. ఈ ప్రక్రియ నడపడానికి ప్రైవేటు పాఠశాలల యాజమాన్య ప్రతినిధులు బృందంగాఏర్పడి వాహనంలో పలు సెంటర్లకు తిరుగుతూ వీటిని చేరవేస్తున్నారు. ఈ తతంగం జరగడానికి విద్యాశాఖాధికారులు, ఆయా కేంద్రాల పరీక్ష నిర్వాహకులు ప్రధానభూమిక పోషిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణంలో ఏడు కేంద్రాలతో పాటు వేములపూడిలోని రెండు కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాల్లో 1600మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ప్రధానంగా పట్టణంలో ఏడు కేంద్రాల్లో ఈ తతంగం జరుగుతోంది. ఎన్నికల హడావిడిలో అధికారులు, పోలీసులు, మీడియా నిమగ్నమై ఉండడంతో ఇదే అదనుగా ప్రైవేటు యాజమాన్యాలు తమ ఉత్తీర్ణత శాతాలను పెంచుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. పర్యవేక్షణాధికారులకు, ఇన్విజిలేటర్లకు ప్రైవేటు, ప్రభుత్వ యాజమాన్యాలు పెద్ద మొత్తంలో ముట్టజెప్పడం వల్లే ఈ తతంగం గుట్టుచప్పుడు కాకుండా జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల కాసుల కక్కుర్తి కారణంగా కష్టపడి చదివిన విద్యార్థులు పరీక్ష కేంద్రంలో జరుగుతున్న ఈ విషయాన్ని జీర్ణించుకోలేక తల్లిదండ్రుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లావిద్యాశాఖాధికారి దృష్టిసారించి నర్సీపట్నంలో జరుగుతున్న మాస్‌కాపీయింగ్‌కు అడ్డుకట్ట వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై డీఈవో బి.లింగేశ్వరరెడ్డిని సంప్రదించగా ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ జరగకుండా ఫ్లయింగ్స్క్వాడ్లు, సిట్టింగ్‌స్క్వాడ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఏ కేంద్రం నుంచైనా ప్రశ్నపత్రం బయటకు వచ్చినట్టు తెలిస్తే సంబంధిత కేంద్ర నిర్వాహకులపై చర్యలు చేపడతామన్నారు. -
తొలిరోజే 9 మంది డీబార్
ముగ్గురు ఇన్విజిలేటర్లను రిలీవ్ చేసిన అధికారులు కాపీయింగ్‌పై కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదులు చిత్తూరు(టౌన్), న్యూస్‌లైన్: పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే 9 మంది విద్యార్థులు డీ బార్ అయ్యారు. ముగ్గురు ఉపాధ్యాయులను అధికారులు విధుల నుంచి రిలీవ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా 267 సెంటర్లలో పరీక్షలు ప్రారంభమయ్యా యి. తెలుగు పరీక్షకు 53,834 మందికి గాను 561 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. కడప ఆర్జేడీ, పరిశీలకులు రమణకుమార్ మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడి న 8 మంది విద్యార్థులను డీబార్ చేశా రు. పెనుమూరు జెడ్పీహెచ్ఎస్లో ఇద్ద రు, ఎస్ఆర్పురం మండలం కొత్తపల్లిమిట్ట హైస్కూల్లో ఇద్దరు, చిత్తూరులోని ఆర్కే మోడల్ పాఠశాలలో నలుగురు(ప్రైవేటు విద్యార్థులు) డీబార్ అ య్యారు. గంగాధరనెల్లూరు మండలంలోని ఓ పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు చేరవేసేందుకు స్లిప్స్ పట్టుకొని తిరుగుతున్న ఇద్దరు ఇన్విజిలేటర్లును గుర్తించి వాళ్లని ఆయన విధుల నుంచి రిలీవ్ చేశారు. అలాగే మదనపల్లె ఉప విద్యాశాఖాధికారి కె.శామ్యూల్ కురబలకోట మండలంలోని ముదివేడు హైస్కూల్ లో కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఒక విద్యార్థినిని డీబార్ చేశారు. తిరుపతి ఉప విద్యాశాఖాధికారి చంద్రయ్య తిరుపతి సమీపంలోని సూర్యనాయనిపల్లె లో ఉన్న పరీక్షా కేంద్రంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఒక టీచర్‌ను రిలీవ్ చేశారు. మొత్తంగా తొలిరోజే 9 మంది విద్యార్థులు డీబార్ కావడం, ముగ్గురు ఉపాధ్యాయులను పరీక్షల విధుల నుంచి రిలీవ్ చేయడం ఉపాధ్యాయవర్గాల్లో సంచలనం రేపింది. మారిన ప్రశ్నపత్రం తిరుపతిలోని శేషాచల ఇంగ్లీష్ మీడి యం పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు ఒక ప్రశ్నపత్రానికి బదులు ఇన్విజిలేటర్ మరో ప్రశ్నపత్రం ఇచ్చాడు. కాంపోజిట్ తెలుగు రాయాల్సిన విద్యార్థులకు జనరల్ తెలుగు ప్రశ్నపత్రం ఇచ్చారు. సద రు విద్యార్థులు పరీక్ష ప్రారంభమైన కొంతసేపటికి విషయాన్ని గుర్తించారు. కాపీయింగ్‌పై ఫిర్యాదులు పరీక్షల్లో కాపీయింగ్ జరుగుతుందం టూ డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదులు వచ్చాయి. బి.కొత్తకోటలోని గట్టు జెడ్పీహెచ్ఎస్లో, గుర్రంకొండ జెడ్పీహెచ్ఎస్లో కాపీయింగ్ జరుగుతోందని ఫి ర్యాదు చేశారు. అలాగే చిత్తూరులోని గంగనపల్లెలో ఉన్న పరీక్షా కేంద్రం వద్ద కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఫిర్యాదు అందింది. ఈ విషయాన్ని విద్యాశాఖాధికారులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. బైరాగిపట్టెడలోని ఎంజీ ఎం పరీక్షా కేంద్రంలో ఫర్నిచర్ లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశా రు. ఆర్జేడీ, డీఈవో, జిల్లా పరీక్షల వి భాగం ఏసీ, ఫ్లయింగ్ స్క్వాడ్ తదితర అధికారులు జిల్లా వ్యాప్తంగా ఉన్న 85 పరీక్షా కేంద్రాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. -
తొలిరోజు ప్రశాంతం
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. కేంద్రాలను కలెక్టర్ ఎం.గిరిజాశంకర్, డీఈఓ చంద్రమోహన్లు తనిఖీ చేశారు. ఉద యం 8.30గంటల వరకే విద్యార్థులు కేంద్రాల వ ద్దకు చేరుకున్నారు. విద్యార్థుల వెంట వారి తల్లిదండ్రులు రావడంతో కేంద్రాల వద్ద సందడి నెలకొంది. జిల్లావ్యాప్తంగా 250 కేంద్రాల్లో 47,210మంది విద్యార్థులు హాజరు కావల్సి ఉండ గా 46,972 మంది విద్యార్థులు హాజరయ్యారు. మరో 238 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ప్రైవేటు 4684మంది విద్యార్థులకు 269మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని మాడల్‌బేసిక్ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు. పరీక్ష ల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్షలో ఎవరైనా కాపీయింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాపీయింగ్‌ను ప్రొత్సహించే వారిపై కూడా చర్యలు తప్పవన్నారు. విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, 250 పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. పరీక్షలు సక్రమంగా నిర్వహించేందుకు 12 ఫ్లయింగ్‌స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామని, ఈ బృందాలు ప్రతిరోజు 5 నుంచి 6 కేంద్రాలను తనిఖీ చేస్తాయని కలెక్టర్ చెప్పారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడం జరిగిందని, పరీక్షలు జరుగుతున్న రోజులు జిరాక్స్ కేంద్రాలన్నీ మూసి ఉంచాలని యజమానులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఎవరైన అవకతవకలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బాష్యం ఉన్నత పాఠశాలలో విజయసాయి అనే విద్యార్థిని నామినల్‌రోల్ లేదంటూ అధికారులు పరీక్షా కేంద్రంలోకి అనుమతివ్వక పోవడంతో విద్యార్థి తలి ్లదండ్రులు ఆందోళనకు దిగారు. విషయం డీఈఓ దృష్టికి వెళ్లడంతో ఆయన కేంద్ర వద్దకు వచ్చి విద్యార్థికి పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చారు.జిల్లావ్యాప్తంగా జరిగిన మొదటి రోజు పదో తరగతి పరీక్షల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఈఓ చంద్రమోహన్ తెలిపారు. -
'టెన్త్'కు..రెడీ
-
‘టెన్త్’కు..రెడీ
నేటి నుంచి ప్రారంభం కానున్న టెన్త్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 250 పరీక్షా కేంద్రాల్లో 52,461మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షార్ధులు తమ హాల్‌టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించి కేంద్రాలకు చేరుకోవచ్చు. గంట ముందుగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. డీఈవో చంద్రమోహన్ జిల్లాకేంద్రంలోని మాడల్ బేసిక్ పాఠశాలలోని ఓ కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. మహబూబ్‌నగర్ విద్యావిభాగం, న్యూస్‌లైన్ : పదో తరగతి పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పలు పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను డీఈఓ చంద్రమోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 250 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 47,021 మంది రెగ్యులర్, 5,440 మంది ప్రయివేట్ మొత్తం 52,461 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని అన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న 250 కేంద్రాల్లో పకడ్బందీ చర్యలు తీసుకున్నామన్నారు. ఫర్నిచర్ కొరత ఉన్న కేంద్రాల్లో ఇతర పాఠశాలల నుంచి తెప్పించామన్నారు. ప్రతి కేంద్రంలో నీటి సౌకర్యం, వైద్యసదుపాయం కల్పిస్తామని వెల్లడించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు 250 పరీక్షా కేంద్రాల్లో 250 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 250 మంది డిపార్టుమెంటల్ అధికారులు, 3200 మంది ఇన్విజిలేటర్లను, 12 ప్లైయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించినట్లు తెలిపారు. పరీక్ష ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు ఉంటుందని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఒక గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. తమ వెంట ప్యాడ్లు, పెన్నులు తెచ్చుకోవాలని, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వెంట తెచ్చుకోరాదని సూచించారు. హాల్‌టికెట్ చూపి ఆర్టీసీ బస్సులో విద్యార్థులు ఉచితంగా ప్రయాణించవచ్చని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఉంటుందని తెలిపారు. పకడ్బందీగా నిర్వహించాలి పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా ని ర్వహించాలని జిల్లా విద్యాధికారి చంద్రమోహన్ అన్నారు. బుధవారం డీఈఓ కార్యాలయంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, కస్టోడియన్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓఎంఆర్ పత్రం నింపడంలో విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఒక గంట ముందుగానే పోలీసుస్టేషన్ల నుంచి పరీక్షా పత్రాలను తెచ్చుకోవాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సిబ్బంది కచ్చితంగా సమయపాలన పాటించాలన్నారు. సమావేశంలో డిప్యూటీ ఈఓలు తదితరులు పాల్గొన్నారు. -
పది ‘పరీక్ష’
కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: పదో తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఎప్పటిలానే ఈసారీ విద్యార్థులకు సమస్యలు తప్పేట్లు లేవు. ఈ ఏడాది మార్చిలోనే ఎండలు మండిపోతుండటంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇదే సమయంలో విద్యుత్ కోతలు ఆందోళన కలిగిస్తున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్లో 4 గంటలు, డివిజన్ కేంద్రాల్లో 6 గంటలు, మండల కేంద్రాల్లో 8 గంటల కోత విద్యార్థుల భవిష్యత్‌పై ప్రభావం చూపనుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృతం కాగా చాలా పాఠశాలల్లో సిలబస్‌ను మమ అనిపించారు. చాలాచోట్ల బట్టీ కొట్టించినట్లు తెలుస్తోంది. మరోవైపు జిల్లా విద్యాశాఖాధికారులు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. అక్రమాలకు పాల్పడితే క్షమించేది లేదని.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇన్ని ఇక్కట్ల నడుమ గురువారం నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుండి 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఉదయం 8.45 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలని.. ఆలస్యమైతే 10 గంటల వరకు అనుమతిచ్చేందుకు నిర్ణయించారు. రెగ్యులర్ విద్యార్థులు 47,057 మందికి 199, ప్రైవేట్ విద్యార్థులు 6,293 మందికి 28 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష సమయంలో విద్యుత్ కోత తలెత్తకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమస్యలు ఉత్పన్నమైతే హెల్ప్‌లైన్ నెంబర్ల(98499 32289, 08518-277064)ను సంప్రదించాలని సూచించారు. టీచర్లకు ఎన్నికల టెన్షన్ ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికలు ఉండటంతో ఉపాధ్యాయులకు పరీక్షలు, ఎన్నికల బాధ్యతలు అప్పగించడం అధికారులకు తలనొప్పిగా మారింది. కర్నూలు నగరం నుంచి ఆలూరు, ఆదోని, ఆస్పరి, కౌతాళం, చాగలమర్రి, రుద్రవరం, ఆళ్లగడ్డ, ఆత్మకూరు తదితర దూర ప్రాంతాలకు ఎన్నికల విధులు వేయడంతో కొందరు ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 29వ తేదీన టెన్త్ పరీక్ష ముగియగానే, అటు నుంచి అటే ఎన్నికల విధులు నిర్వహించే కేంద్రానికి వెళ్లాలంటే సమయం సరిపోదని వారు వాపోతున్నారు. -
అ‘టెన్’షన్
రాయవరం, న్యూస్‌లైన్: పదో తరగతి పరీక్షలు మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. పరీక్షలు దగ్గర పడుతుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పాటు విద్యాశాఖాధికారులకు కూడా టెన్షన్ మొదలైంది. పదో తరగతి ఫలితాలపైనే జిల్లా విద్యాశాఖాధికారుల పనితీరు ఆధారపడి ఉండడంతో మెరుగైన ఉత్తీర్ణత సాధించేందు కు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. 312 పరీక్షా కేంద్రాలు జిల్లాలో 60,753 మంది రెగ్యులర్ విద్యార్థులు, 7,936 మంది ప్రైవేట్ విద్యార్థులు 312 పరీక్ష కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలను రాయనున్నారు. రాజమండ్రి, కాకినాడల్లో 13 పరీక్షా కేంద్రాలు (ఏ సెంటర్లు), పోలీస్టేషన్‌కు దగ్గర్లో 212 పరీక్షా కేంద్రాలు (‘బీ’ సెంటర్లు) ఉన్నాయి. పోలీస్టేషన్‌కు ఎనిమిది కిలోమీటర్ల పైబడి 87 పరీక్షా కేంద్రాలు (‘సీ’ సెంటర్లు) ఉన్నాయి. 312 పరీక్షా కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు డిపార్ట్మెంట్ అధికారుల నియమించినట్టు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వెంకట్రావు తెలిపారు. 15 ఫ్లెయింగ్ స్క్వాడ్స్ పరీక్షల్లో కాపీ జరగకుండా చూసేందుకు 15 ఫ్లెయింగ్స్క్వాడ్స్ను ఏర్పాటు చేసినట్టు వెంకట్రావు తెలిపారు. ఈ స్క్వాడ్స్ జిల్లాలోని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేస్తాయన్నారు. అదేవిధంగా 87 సెంటర్లలో కార్ కస్టోడియన్లను నియమించామన్నారు. పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాలు జిల్లాకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే ఆరు రోజులకు సంబంధించిన పేపర్లు జిల్లాకు చేరుకున్నాయి. ఈ పేపర్లను ఆయా పరీక్షా కేంద్రాల దగ్గర్లో ఉన్న పోలీస్టేషన్లో భద్రపరుస్తున్నారు. పరీక్ష రోజున వాటిని కేంద్రానికి తీసుకువెళతారు. మిగిలిన పరీక్షలకు చెందిన ప్రశ్నాపత్రాలు ఈ నెల 24వ తేదీ నాటికి జిల్లాకు రానున్నట్టు సమాచారం. ఇన్విజిలేటర్ల సమస్య ప్రతీ 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ను నియమించాల్సి ఉంది. దాని ప్రకారం జిల్లాలో 3,434 మంది ఇన్విజిలేటర్లు అవసరమవుతారు. పదో తరగతి పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా ఎస్జీటీ ఉపాధ్యాయులను నియమించేవారు. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను ఇన్విజిలేషన్ విధులకు నియమించవద్దంటూ ఉపాధ్యాయ సంఘాలు డెరైక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌ను కోరాయి. దాంతో పదోతరగతి ఇన్విజిలేటర్లుగా స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని, తప్పకపోతే ఎస్జీటీలను నియమించాలని ఆదేశాలు ఇచ్చారు. పదోతరగతి పరీక్షలు, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఒకేసారి రావడంతో గందరగోళం నెలకొంది. ఈ సమస్యను జిల్లా విద్యాశాఖ ఎలా అధిగమిస్తుందో వేచి చూడాలి. -
పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై సమీక్ష
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు జాయింట్ కలెక్టర్ ఐ.ప్రకాష్‌కుమార్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. స్థానిక అంబేద్కర్ భవన్లో మంగళవారం నిర్వహించిన పదో తరగతి పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారుల సమావేశంలో అదనపు జాయింట్ కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సమావేశానికి జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎ.రాజేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అదనపు జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. పరీక్షల నిర్వహణలో జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. పరీక్షల నిర్వహణలో అలసత ్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వవద్దన్నారు. పరీక్షల నిర్వహణలో పొరపాట్లు జరిగితే కఠిన చర్యలు తప్పవని ప్రకాష్‌కుమార్ హెచ్చరించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని చీఫ్‌లు, డిపార్టుమెంటల్ అధికారులు ఆదేశించారు. తప్పు చేస్తే సస్పెన్షన్.. పదో తరగతి పరీక్షల నిర్వహణలో అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని డీఈఓ డాక్టర్ ఎ.రాజేశ్వరరావు హెచ్చరించారు. పరీక్షల నిర్వహణలో తప్పు చేస్తే సస్పెండ్ చేసేందుకు వెనుకాడేది లేదని ఆయన స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలన్నారు. విద్యార్థులు బల్లల మీద కూర్చొని పరీక్షలు రాసేలా ఫర్నిచర్ ఏర్పాటు చేయాలని సూచించారు. పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం, అత్యవసర మందులతో వైద్య సిబ్బందిని పరీక్ష కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని చెప్పారు. అన్ని పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధించాలన్నారు. విద్యార్థులను ఉదయం 9 గంటలకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. 26వ తేదీన ఇన్విజిలేటర్లుతో సమావేశం నిర్వహించి పరీక్షల నిర్వహణకు అవసరమైన సూచనలివ్వాలన్నారు. చీఫ్‌లు, డిపార్టుమెంట్ అధికారులు ప్రతిరోజు ప్రశ్నపత్రాలను బయటకు తీసే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఆరోజు తేదీ ఏ సబ్జెక్టు, ఏ పేపర్ అన్ని విషయాలను గమనించి ప్రశ్నపత్రాలను బయటకు తీయాలన్నారు. యాక్టు 25 అమలు.. పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ పరీక్షల డెరైక్టర్ ఆదేశాల మేరకు యాక్టు 25 అమలు చేస్తున్నట్లు డీఈఓ రాజేశ్వరరావు తెలిపారు. ఈ చట్టం కింద పరీక్షల విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించినా ఉద్దేశపూర్వకంగా తప్పు చేసినా రూ.500 నుంచి లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు. అవసరమైతే 3 నెలల నుంచి ఒక సంవత్సరం వరకు జరిగిన పొరపాటు తీవ్రతను బట్టి జైలు శిక్ష కూడా విధిస్తారు. పరీక్షల హాలులో విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడితే ఆ విద్యార్థిని డీబార్ చేయడంతో పాటు అక్కడి ఇన్విజిలేటర్‌ను సర్వీస్ నుంచి సస్పెండ్ చేస్తామని డీఈఓ హెచ్చరించారు. పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అందరూ సమన్వయంతో పని చేయాలని డీఈఓ కోరారు. 14 సిట్టింగ్ స్క్వాడ్లు జిల్లాలో పదో తరగతి పరీక్షలకు మొత్తం 39,601 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిలో 35,304 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 4297 మంది ప్రైవేట్ విద్యార్థులు, మొత్తం 195 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 173 కేంద్రాలు రెగ్యులర్ విద్యార్థులకు, 22 కేంద్రాలు ప్రైవేట్ విద్యార్థులకు కేటాయించారు. మొత్తం 14 పరీక్ష కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు డీఈఓ చెప్పారు. ఈ పరీక్ష కేంద్రాలన్నింటిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ఈ కేంద్రాలన్నింటి కీ ప్రత్యేకంగా 14 సిట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు, 31 మంది సీ సెంటర్ కస్టోడియన్లు ఆయా పరీక్ష కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లుగా వ్యవహరిస్తారని తెలిపారు. అంధ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 48 మంది స్క్రైబ్‌లను ఏర్పాటు చేసినట్లు రాజేశ్వరరావు చెప్పారు. పరీక్షల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని డీఈఓ కోరారు. సమావేశంలో ఉపవిద్యాధికారులు బి.విజయభాస్కర్, ఇ.సాల్మన్, కొల్లా వెంకట్రావు, కాశీశ్వరరావు, షేక్ చాంద్‌బేగమ్, వి. రామ్మోహనరావు, అసిస్టెంట్ కమిషనర్ సి.నాగప్ప, చీఫ్‌లు, డీఓలు పాల్గొన్నారు. సమావేశానికి హాజరుకాని చీఫ్‌లు, డీఈఓలకు మెమోలు జారీ చేయాలని డీఈఓ ఆదేశించారు. -
టెన్త్ ఫలితాలు వచ్చి నాలుగు నెలలైనా అందని లాంగ్ మెమోలు
రాష్ట్ర ప్రభుత్వ అలసత్వంతో విద్యార్థులకు తప్పని కష్టాలు నాలుగైదు రోజుల్లో ఇంటర్ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తులు అందుకు లాంగ్ మెమోను అప్లోడ్ చేయడం తప్పనిసరి లేదంటే విద్యార్థులు స్కాలర్షిప్ను కోల్పోయే ప్రమాదం కానీ సమైక్య సమ్మెతో ఇప్పట్లో మెమోల పంపిణీ కష్టమే సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలై నాలుగు నెలలు కావస్తున్నా విద్యార్థులకు ఇంకా అధికారిక మెమోలు అందలేదు. తాత్కాలిక మెమోలతోనే ఇంటర్ కాలేజీల్లో చేరిన 10 లక్షల మందికి పైగా విద్యార్థులు, అధికారిక మార్కుల జాబితాలు ఎప్పుడు వస్తాయోనన్న ఆందోళనలో పడ్డారు. ఎందుకంటే మరో మూడు నాలుగు రోజుల్లో ప్రారంభమయ్యే స్కాలర్‌షిప్‌ల ప్రక్రియ కోసం అధికారక మెమోలు సమర్పించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో వారు స్కాలర్షిప్ను కోల్పోయే ప్రమాదముంది. మామూలుగానైతే ఫలితాలు ప్రకటించిన నెల రోజుల్లోనే అధికారిక మెమోలు విద్యార్థులకు చేరాలి. మరీ ఆలస్యమైనా రెండు మాసాల్లోనైనా చేరి తీరాలి. ఈ ఏడాది మే 17న పదో తరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించారు. కానీ రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా నాలుగు మాసాలు కావస్తున్నా ఈసారి లాంగ్ మెమోల జాడే లేదు. నాలుగు రోజుల్లో దరఖాస్తుల ప్రక్రియ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మరో నాలుగు రోజుల్లో ప్రకటన వెలువడనుంది. దరఖాస్తు కోసం కచ్చితంగా అధికారిక మార్కుల జాబితాను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. దీంతో లక్షలాది మంది విద్యార్థులకు ఇప్పుడు ఆందోళన మొదలైంది. ప్రభుత్వ నిర్వాకం వల్ల మార్కుల మెమోల జారీలో ఆలస్యం అవుతోంది. సీమాంధ్ర జిల్లాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందంతా సమ్మెలో ఉండటమే ఆలస్యానికి కారణమని అధికారులంటున్నా, ఇతరత్రా అనేక కారణాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సమ్మె ఎప్పుడు విరమిస్తారన్న దానిపై స్పష్టత లేని నేపథ్యంలో ఇప్పటికిప్పుడు మెమోలను పంపినా అవి సకాలంలో విద్యార్థులకు అందుతాయో లేదోననే గందరగోళం నెలకొంది. అందకపోతే అకారణంగా తాము నష్టపోవాల్సి వస్తుందని విద్యార్థులు వాపోతున్నారు. పరీక్షల విభాగం వైఫల్యమే మార్చి 22-ఏప్రిల్ 9 మధ్య జరిగిన పదో తరగతి పరీక్షల ఫలితాలు మే 17న విడుదలయ్యాయి. రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు కలిపి 9,89,478 మంది పాసయ్యారు. జూన్‌లో జరిగిన అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో మరో 83,131 మంది పాసయ్యారు. ఇంటర్లో చేరినా వీరెవరికీ లాంగ్ మెమోలు ఇంతవరకు అందలేదు. ఫలితాలొచ్చి నాలుగు నెలలవుతున్నా అసలు ప్రభుత్వ పరీక్షల విభాగం నుంచి మెమోలు జిల్లాలకు వెళ్లనే లేదు. ఈ ఘోర వైఫల్యానికి బోర్డు అలసత్వమే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెగ్యులర్ విద్యార్థుల మెమోల ముద్రణ మే నెలకు ముందే పూర్తయి పరీక్షల విభాగానికి అందినా వాటిని వెంటనే జిల్లాలకు పంపడంలో అధికారులు జాప్యం చేసినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు విద్యార్థుల మెమోల ముద్రణ కొంత ఆలస్యమవడంతో అన్నీ కలిపి ఒకేసారి పంపించాలనే ఆలోచనల నేపథ్యంలో జాప్యం జరిగినట్టు సమాచారం. అంతా సమ్మెలోనే.. ఇప్పట్లో మెమోలు కష్టమే! రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతి రేకిస్తూ సీమాంధ్రలో ఆగస్టు 15 నుంచి విద్యా శాఖ ఉద్యోగులు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. 21వ తేదీ నుంచి ఉపాధ్యాయులు కూడా సమ్మెకు దిగారు. డీఈఓ కార్యాలయాల సిబ్బంది, పాఠశాలల్లోని బోధన, బోధనేతర సిబ్బంది మొత్తం సమ్మెలోనే ఉండటంతో మెమోలను ఎవరికి పంపాలి, స్కూళ్లలో వాటిని విద్యార్థులకు పంపిణీ చే సే బాధ్యతను తీసుకునేది ఎవరు వంటివాటిపై గందరగోళం నెలకొంది. అధికారులు ముందుగా మేల్కొంటే సమస్య తలెత్తేదే కాదని విద్యాశాఖ వర్గాలే అంటున్నాయి. నాలుగైదు రోజుల్లో పంపుతాం ‘‘ప్రస్తుత ఆందోళనల నేపథ్యంలో విద్యార్థులకు మెమోలు పంపిం చేందుకు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాం. స్కూళ్లలో బాధ్యులకు మెమోలు అందించేలా చర్యలు చేపడుతున్నాం. నాలుగైదు రోజుల్లో మెమోలు విద్యార్థులకు అందేలా ఏర్పాట్లు చేస్తున్నాం’’ - మన్మథరెడ్డి, డెరైక్టర్, ప్రభుత్వ పరీక్షల విభాగం