Telangana: SSC Exam Papers Reduced From 11 To 6 - Sakshi
Sakshi News home page

‘పది’లో ఇక 6 పేపర్లే.. టీఎస్‌ సర్కార్‌ కీలక ఉత్తర్వులు

Published Mon, Oct 11 2021 3:40 PM | Last Updated on Mon, Oct 11 2021 7:57 PM

Telangana: 10th Class Exam Paper Reduced From 11 To 6 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పదోతరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 విద్యా సంవత్సరానికి గానూ పదో తరగతి పరీక్షల పేపర్లను కుదించింది. దీంతో ఈ ఏడాది టెన్త్‌లో 11 పేపర్లకు బదులు ఆరు పేపర్లతో పరీక్షలు ఉండనున్నట్లు, ఒక్కో స‌బ్జెక్టుకు ఒక్కో పేప‌ర్‌గానే ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా 2020-21లో 6 పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోగా.. 2021-22లో కూడా ఈ విధంగానే అమలు చేయాలని తెలంగాణ సర్కార్‌ నిర్ణయించడం గమనార్హం.
చదవండి: భారత్‌: మన ఇంటర్నెట్‌ వేగం అంతంతే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement