మార్చిలో పదో తరగతి పరీక్షలు: మంత్రి ఆదిమూలపు సురేష్‌ | AP: Minister Adimulapu Suresh On 10th Class Exams | Sakshi
Sakshi News home page

మార్చిలో పదో తరగతి పరీక్షలు: మంత్రి ఆదిమూలపు సురేష్‌

Published Fri, Jan 7 2022 4:37 PM | Last Updated on Fri, Jan 7 2022 6:47 PM

AP: Minister Adimulapu Suresh On 10th Class Exams - Sakshi

సాక్షి, గుంటూరు: ఏపీలో పదో తరగతి పరీక్షలు మార్చిలో నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. సంక్రాంతి నాటికి సిలబస్ పూర్తి చేయాలని విద్యాసంస్థలకు సూచించారు. 15 నుంచి 18 ఏళ్ల లోపు విద్యార్థులకు ప్రతి స్కూల్లో 95% వ్యాషినేషన్ పూర్తి చేశామని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో అమ్మఒడి మూడో విడత ఇస్తామని పేర్కొన్నారు. నిబంధనలు పాటించని బీఈడీ, డీఈడీ కాలేజీలు 375 మూతపడ్డాయని మంత్రి సురేష్‌ తెలిపారు.

చదవండి: (ఫిట్‌మెంట్‌తో పాటు ఉద్యోగులకు సీఎం జగన్‌ మరో గుడ్‌న్యూస్‌)

ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రైవేటు యూనివర్సిటీలో చట్టసవరణ ద్వారా 35% ఫ్రీ సీట్లు ఇప్పించామని పేర్కొన్నారు. సంక్షేమం రెండు కళ్ళుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఏ విద్యార్ధి డబ్బులు లేక విద్యకు దూరం కాకూడదని అమ్మఒడి ఇచ్చి విద్యార్థులకు యూనిఫామ్, బుక్స్తో పాటు మధ్యాహ్నం పౌష్టికాహారం అందిస్తున్నామని పేర్కొన్నారు. కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ఇంగ్లీష్ మీడియం చెప్తూ తెలుగు కూడా బోధిస్తున్నామన్నారు.

చదవండి: (పీఆర్సీపై సీఎం వైఎస్‌ జగన్‌ కీలక ప్రకటన)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement