
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9.30 గంటలకు పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. పరీక్షల నిర్వహణకు తెలంగాణలో 2,530 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. నేటి నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో సబ్బులు, లిక్విడ్ సబ్బులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచారు. జలుబు, దగ్గుతో వచ్చే విద్యార్థులకు ప్రత్యేక రూములు ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రం దగ్గర ఇద్దరు వైద్యులు,శానిటైజర్ ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణలో 30,500 మంది ఇన్విజిలేటర్లుగా బాధ్యతలు నిర్వర్తించనుండగా.. మాస్ కాపీయింగ్ జరగకుండా ఉండేందుకు 144 సిట్టింగ్ స్క్వాడ్స్, 4 ఫ్లైయింగ్ స్క్వాడ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment