
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 15 నుంచి 29వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు టెన్త్ పరీక్షల షెడ్యూల్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం విడుదల చేశారు. ఈసారి పదో తరగతి పరీక్షలకు 6,36,831 మంది విద్యార్థులు హాజరుకాబోతున్నారని, ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 2,850 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేసినట్టు మంత్రి తెలిపారు. ఈసారి పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, విద్యార్థులు కింద కూర్చుని కాకుండా బల్లలపైనే కూర్చుని పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేశామన్నారు. మే మొదటివారంలో పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment