Tenth Schedule
-
మార్చి 15నుంచి పదోతరగతి పరీక్షలు
-
పదో తరగతి పరీక్షలు షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 15 నుంచి 29వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు టెన్త్ పరీక్షల షెడ్యూల్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం విడుదల చేశారు. ఈసారి పదో తరగతి పరీక్షలకు 6,36,831 మంది విద్యార్థులు హాజరుకాబోతున్నారని, ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 2,850 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేసినట్టు మంత్రి తెలిపారు. ఈసారి పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, విద్యార్థులు కింద కూర్చుని కాకుండా బల్లలపైనే కూర్చుని పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేశామన్నారు. మే మొదటివారంలో పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేస్తామని చెప్పారు. -
18న కేంద్ర హోంశాఖ నేతృత్వంలో భేటీ
పదవ షెడ్యూల్ సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీపై చర్చ సాక్షి, హైదరాబాద్: పదవ షెడ్యూల్లో గల సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీపై ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ఈ నెల 18వ తేదీన కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీకి రావాల్సిందిగా ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ బుధవారం లేఖ రాసింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇరు రాష్ట్రాలు సంప్రదింపుల ద్వారా దీనిపై ఒక ఒప్పందానికి రాని పక్షంలో కేంద్రమే చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇరు రాష్ట్రాలు కమిటీలను ఏర్పాటు చేశాయి. టీ సర్కారు తమ సీఎస్ రాజీవ్‌శర్మ, ఏజీ రామకృష్ణారెడ్డితో కమిటీని ఏర్పాటు చేయగా ఏపీ ప్రభుత్వం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాల సుబ్రహ్మణ్యంతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు గత నెల 18వ తేదీన సమావేశమైనప్పటికీ ఒక ఒప్పందానికి రాలేదు. ఇదే విషయాన్ని ఏపీ ఇటీవల కేంద్ర హోంశాఖకు లేఖ ద్వారా తెలియజేసింది. దీంతో కేంద్ర హోంశాఖ ఈ నెల 18న భేటీ ఏర్పాటుచేసింది. పదవ షెడ్యూల్ సంస్థల ఆస్తులు, అప్పుల వివరాలను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. ఆ వివరాలను కేంద్ర హోంశాఖకు అందజేయాలని నిర్ణయించింది. జనాభా ప్రాతిపదికన ఆస్తులు, అప్పులు పంపిణీ చేయాల్సిందిగా కోరనుంది. 9వ షెడ్యూల్ సంస్థల ఆస్తులు రూ.50 వేల కోట్లు ఇలా ఉండగా 9వ షెడ్యూల్ సంస్థల ఆస్తులు, అప్పుల వివరాలను సేకరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేకంగా నమూనా పత్రాన్ని రూపొందించి సంస్థల వారీగా ఆస్తులు, అప్పుల వివరాలను సేకరించనుంది. ఆయా సంస్థల్లో ఉద్యోగుల వివరాలను ప్రాంతాల వారీగా సేకరించాలని కూడా నిర్ణయించింది. రూ.50 వేల కోట్ల వరకు ఆస్తులుంటాయని ప్రాథమికంగా అంచనా వేసింది. సేకరించిన వివరాలను షీలా బిడే కమిటీకి సమర్పించనుంది. -
ఏపీ లేఖలతో కొత్త వివాదం
► పదో షెడ్యూల్ సంస్థలకు నేరుగా ఏపీ సర్కారు లేఖలు ► చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ఏపీపై తెలంగాణ ఆగ్రహం ► లేఖలు పట్టించుకోవద్దని అన్ని సంస్థలకూ సీఎస్ సర్క్యులర్ సాక్షి, హైదరాబాద్: పదో షెడ్యూల్ సంస్థల ఆస్తులు ఉమ్మడివని.. వాటిని పంచుకుందామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేరుగా సంబంధిత సంస్థల అధిపతులకు లేఖలు రాయడం వివాదాస్పదమవుతోంది. ఏపీ వైఖరిపై తెలంగాణ సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ లేఖలను అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ శుక్రవారం అన్ని సంస్థలకూ ప్రత్యేకంగా సర్క్యులర్ జారీ చేశారు. ఏపీ నుంచి లేఖలు అందుకున్న సంస్థల అధిపతులు వెంటనే తనకు సమాచారం అందించాలని, భవిష్యత్తులోనూ ఏపీ నుంచి ఎటువంటి లేఖలు వచ్చినా తెలియజేయాలని ఆదేశించారు. నేరుగా పదో షెడ్యూల్ సంస్థలకు ఏపీ లేఖలు రాయటం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం నిబంధనలకు పూర్తి విరుద్ధమని సీఎస్ ఇచ్చిన సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి, లేదా సీఎస్ నుంచి సీఎస్‌కు, లేకపోతే స్టేట్ రీ ఆర్గనైజేషన్(ఎస్ఆర్) టు ఎస్ఆర్ విభాగానికి సమాచార మార్పిడి జరగాలని, పరిపాలనలో అదే సంప్రదాయం పాటించాలని సూచించారు. ఇదేమీ పట్టించుకోకుండా దాదాపు వంద సంస్థలకు ఏపీ లేఖలు రాయడాన్ని సీఎస్ తప్పుబట్టారు. పదో షెడ్యూల్లో మొత్తం 142 సంస్థలు ఉన్నాయి. వీటిలో 122 తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. 16 ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయి. నాలుగు సంస్థలు రెండు చోట్లా ఉన్నాయి. షెడ్యూల్ పది సంస్థల వ్యవహారాలన్నీ సంయుక్తంగా నిర్వహించాలని, జనాభా నిష్పత్తి ప్రకారం విభజించాలనేది ఏపీ ప్రభుత్వ వాదన. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 75 ప్రకారం భౌగోళికత ఆధారంగా ఈ సంస్థలన్నీ తమకే చెందుతాయనేది తెలంగాణ ప్రభుత్వ వాదన. అవసరమైతే ఏపీ విజ్ఞప్తి మేరకు ఆ సంస్థల సేవలు మాత్రం వినియోగించుకోవచ్చని చెబుతోంది. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని విభజన వివాద పరిష్కారాల కమిటీలో ఈ వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అన్ని సంస్థల హెచ్వోడీలకు ఏపీ ప్రభుత్వం గత 15 రోజుల నుంచి లేఖలు రాయటం వివాదాస్పదంగా మారింది. -
బ్రాండ్ తెలంగాణ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక బ్రాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా సేంద్రియ పండ్లు, కూరగాయలు, అల్లం, కల్తీలేని కారం, పసుపు తదితరాలను ప్రజలకు సరఫరా చేసేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అందుకోసం తెలంగాణ రాష్ట్ర ఉద్యానాభివృద్ధి సంస్థ (టీహెచ్‌డీసీ)ను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అధికారులు త్వరలో ఈ కార్పొరేషన్‌కు సంబంధించి విధివిధానాలు ఖరారు చేసి ఫైలును సీఎం ఆమోదానికి పంపించనున్నారు. ఈ బాధ్యతను ఆయిల్‌ఫెడ్ ఎండీ ఎ.మురళికి అప్పగించారు. ఉద్యానశాఖ చేసిన ప్రతిపాదనల ప్రకారం 2016-17 ఏడాదిలో కార్పొరేషన్‌కు ప్రభుత్వం రూ. 250 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలి. ఈ కార్పొరేషన్ ద్వారా రైతులు పండించిన పండ్లు, కూరగాయలు, కారం, అల్లం, పసుపు సహా ఇతర పదార్థాలను సేకరించేందుకు మండలాల్లో రూ.100 కోట్లతో కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. మరో రూ. 100 కోట్లతో మెదక్ జిల్లా ములుగు మండలం తునికి బొల్లారం గ్రామంలో ఫుడ్ పార్కును, ప్రాసెసింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. సేంద్రియ పద్ధతిలో పండించిన మేలురకం పండ్లు, కూరగాయలు సహా ఇతర ఆహార ఉత్పత్తులను విక్రయిస్తారు. ఈ విక్రయ కేంద్రాల్లో విజయ నూనె, పాలను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచే అంశం కూడా సర్కారు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. కార్పొరేషన్ చైర్మన్‌గా సీఎం! కొత్తగా ఏర్పాటు చేయనున్న కార్పొరేషన్‌కు చైర్మన్‌గా ముఖ్యమంత్రి వ్యవహరించాలని ఉద్యానశాఖ ప్రతిపాదించింది. వైస్ చైర్మన్‌గా వ్యవసాయశాఖ మంత్రి వ్యవహరిస్తారు. వీరితోపాటు మరో 9 మంది డెరైక్టర్లు ఉంటారు. సేంద్రియ పద్ధతిలో రైతులు పండించే కూరగాయలు, పండ్లు, అల్లం, కారం, ఇతర సుగంధ ద్రవ్యాలు తదితర ఉత్పత్తుల సేకరణ, మార్కెటింగ్, రవాణా, ప్రాసెసింగ్, అదనపు ఉత్పత్తుల బాధ్యతను కార్పొరేషన్ తీసుకుంటుంది. కూరగాయల సాగులో స్వయం సమృద్ధి సాధించడం, రాష్ట్ర అవసరాలకు పోను దేశంలోని ఇతర ప్రాంతాలతోపాటు విదేశాలకు కూడా ఎగుమతులు చేసే లక్ష్యంతో కార్పొరేషన్ పనిచేస్తుంది. -
వర్సిటీల సేవలపై కుదరని సయోధ్య
పాతపద్ధతిలోనే కొనసాగించాలన్న ఏపీ, నో చెప్పిన తెలంగాణ అంబేడ్కర్ సార్వత్రిక, తెలుగు వర్సిటీ సేవల వివాదం హైదరాబాద్: పదో షెడ్యూల్లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక, తెలుగు యూనివర్సిటీల సేవల ఒప్పంద విషయంలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. భౌగోళికంగా తెలంగాణలో ఉన్న వర్సిటీల సేవలు కావాలంటే ఆ ప్రభుత్వంతో చట్టపరంగా ఒప్పందం కుదుర్చుకోవాలని హైకోర్టు మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. సేవల ఒప్పందం విషయమై ఇరు రాష్ట్ర ప్రభుత్వాల విద్యాశాఖ కార్యదర్శులు సమావేశం కావాలని సూచించిన నేపథ్యంలో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులు రాజీవ్ రంజన్ ఆచార్య, సుమిత్రా దేవరాతోపాటు అంబేడ్కర్ వర్సిటీ రిజిస్ట్రార్ సుధాకర్, తెలుగు వర్సిటీ వీసీ శివారెడ్డి, రిజిస్ట్రార్ తోమాసయ్య, తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి చాంబర్లో గురువారం భేటీ అయ్యారు. గతేడాది మాదిరిగా తాము ఎటువంటి నిధులు అందించకున్నా తమ రాష్ట్రానికి సేవలు ఉచితంగా అందించాలని ఏపీ ప్రభుత్వం కోరగా, తెలంగాణ అధికారులు విముఖత వ్యక్తం చేశారు. ఏపీలోని స్టడీ సెంటర్లు, వర్సిటీ పీఠాల నిర్వహణను తాము చేపట్టలేమని, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే స్తోమత లేదని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సూచించే షరతులు, నిబంధనలను పాటిస్తామని ఏపీ అధికారులు పేర్కొన్నారు. ఎవరివాదనకు వారు కట్టుబడి ఉండడంతో ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదరలేదు. అయితే, చర్చల ద్వారా వచ్చిన పురోగతిని తమ ముందు ఉంచాలని ఇరురాష్ట్రాల అడ్వొకేట్ జనరళ్లను హైకోర్టు ధర్మాసనం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ కేసు ఈ నెల 4వ తేదీన ధర్మాసనం ముంగిట ఏ సమాచారంతో హాజరవుతారన్నది ఆసక్తికరంగా మారింది. -
పదో షెడ్యూల్‌పై న్యాయపోరాటం
పదో షెడ్యూల్ అంశాలపై ఏపీ ఆలోచన సీఎంతో భేటీ అయిన గంటా సాక్షి, హైదరాబాద్: పదోషెడ్యూల్‌లో ఉన్న సంస్థలు పదేళ్లపాటు ఉమ్మడిగానే కొనసాగాల్సిం దేనని, ఈ విషయంలో అవసరమైతే న్యాయపోరాటం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావి స్తోంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం రాజ్యాంగ నిపుణులు, సీనియర్ న్యాయవాదులతో చర్చించారు. ఇంటర్మీడియెట్ పరీక్షలు, ఎంసెట్, పదో షెడ్యూల్లోని సంస్థలకు సంబంధించి మంత్రి గంటా శ్రీనివాసరావు తెలంగాణ విద్యామంత్రి జగదీశ్వర్‌రెడ్డితో సోమవారం చర్చలు జరపడం తెలి సిందే. ఆయన మంగళవారం సీఎం చంద్రబాబు ని కలసి చర్చల సారాంశాన్ని నివేదించారు. ఉమ్మడి సంస్థలపై తెలంగాణ ప్రభుత్వ వాదన ను సీఎం దృష్టికి తెచ్చారు. ఇంటర్మీడియెట్ పరీక్షలు సహ అన్నీ ఉమ్మడిగానే కొనసాగాలని, ఈ విషయంలో రాజీవద్దని చంద్రబాబు స్పష్టంచేసినట్లు తెలిసింది. విభజన చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘిస్తుండడాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తేనున్నారు. అసరమైతే కేంద్ర జోక్యాన్ని కూడా కోరనున్నారు. తెలంగాణ ప్రభుత్వం మరింత దూకుడుగా వెళ్తే మాత్రం న్యాయపోరాటం ద్వారా అడ్డుకట్టవేయాలన్న అభిప్రాయానికి వచ్చారు. విభజన చట్టంలోని సెక్షన్ 95, 75 ప్రకారం పదో షెడ్యూల్లోని సంస్థలను ఇరు రాష్ట్రాలు సంప్రదింపులతో ఏకాభిప్రాయం వచ్చాకే విభజన చేయాలి. అలా కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యామండలిని, ఇంట ర్మీడియెట్బోర్డును ఏర్పాటుచేసింది. ఇక దీనిపై ఉపేక్షిస్తే ఇతర సంస్థల విషయంలోనూ ఇలాగే ముందుకు వెళ్తుంది. ముందుగానే దీనికి అడ్డుకట్టవేయాలి. అందుకు తక్షణమే కేంద్రం జోక్యాన్ని కోరాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ అంశంపై రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ దృష్టికి తెచ్చారు. మరోవైపు రాష్ట్ర ఎంపీలతో కూడా దీనిపై కేంద్రానికి వినతిపత్రం అందింపచేయనున్నారు. అవసరమైతే మంత్రులు, ఇతర ముఖ్యు లు కూడా కేంద్రప్రభుత్వం వద్దకు వెళ్లి రాష్ట్రం లోని తాజా పరిస్థితులను వివరించాలని భావిస్తున్నారు. ప్రజాప్రయోజనవాజ్యం మరోవైపు సోమవారం నాటి మంత్రుల భేటీ సమయంలో తాము వేరేగా ఇంటర్మీడియెట్, ఎంసెట్ పరీక్షలు నిర్వహించుకుంటామని తెలంగాణ మంత్రి పేర్కొనడంతో దాని ఆధారంగా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఉమ్మడి పరీక్ష రాసి రెండో సంవత్సరంలో వేర్వేరు పరీక్ష సరికాదని, ఇది తమ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని కొంతమంది విద్యార్థులతో సుప్రీంలో పిల్ దాఖలు చేయించే సూచనలు కనిపిస్తున్నాయి. -
16 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
- ఇరు రాష్ర్ట ప్రభుత్వాలు ఏర్పడ్డాకే తుది నిర్ణయుం సాక్షి, హైదరాబాద్: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను వచ్చే నెల 16 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ వున్మథరెడ్డి తెలిపారు. ప్రతి రోజు ఉదయుం 9:30 గంటల నుంచి వుధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఈనెల 30వ తేదీలోగా సంబంధిత స్కూళ్లలో హెడ్వూస్టర్లకు ఫీజు చెల్లించాలని సూచించారు. జూన్ 2వ తేదీన రాష్ట్ర విభజన జరుగుతున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణ ఎలా ఉంటుందన్న దానిపై ప్రభుత్వం నిర్ణయుం తీసుకోవాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పదో షెడ్యూలులో ప్రభుత్వ పరీక్షల విభాగం లేనందున జూన్ 2లోగా దీన్ని రెండుగా విభజించాల్సి ఉంది. అరుతే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పూర్తయ్యే వరకు పరీక్షల విభాగాన్ని ఉమ్మడిగానే ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆగస్టు 31 వరకు ఇరు ప్రాంతాల విద్యార్థులకు ఉమ్మడిగానే పరీక్షలు నిర్వహించాలన్న యోచనలో ఉంది. సెప్టెంబర్ 1 నుంచి విభజనను అమలు చేయనున్నట్లు సమాచారం. రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు ఏర్పడ్డాక ఈ విషయంపై తగిన నిర్ణయం తీసుకోనున్నాయి. ఇక అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల వూల్యాంకనాన్ని వూత్రం ఎక్కడికక్కడే (తెలంగాణ విద్యార్థుల జవాబుపత్రాలు తెలంగాణలో, సీవూంధ్ర విద్యార్థులవి సీవూంధ్రలో) చేరుంచాలని అధికారులు ఇప్పటికే నిర్ణరుంచారు.