- ఇరు రాష్ర్ట ప్రభుత్వాలు ఏర్పడ్డాకే తుది నిర్ణయుం
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను వచ్చే నెల 16 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ వున్మథరెడ్డి తెలిపారు. ప్రతి రోజు ఉదయుం 9:30 గంటల నుంచి వుధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఈనెల 30వ తేదీలోగా సంబంధిత స్కూళ్లలో హెడ్‌వూస్టర్లకు ఫీజు చెల్లించాలని సూచించారు.
జూన్ 2వ తేదీన రాష్ట్ర విభజన జరుగుతున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణ ఎలా ఉంటుందన్న దానిపై ప్రభుత్వం నిర్ణయుం తీసుకోవాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని పదో షెడ్యూలులో ప్రభుత్వ పరీక్షల విభాగం లేనందున జూన్ 2లోగా దీన్ని రెండుగా విభజించాల్సి ఉంది. అరుతే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు పూర్తయ్యే వరకు పరీక్షల విభాగాన్ని ఉమ్మడిగానే ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆగస్టు 31 వరకు ఇరు ప్రాంతాల విద్యార్థులకు ఉమ్మడిగానే పరీక్షలు నిర్వహించాలన్న యోచనలో ఉంది.
సెప్టెంబర్ 1 నుంచి విభజనను అమలు చేయనున్నట్లు సమాచారం. రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు ఏర్పడ్డాక ఈ విషయంపై తగిన నిర్ణయం తీసుకోనున్నాయి. ఇక అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల వూల్యాంకనాన్ని వూత్రం ఎక్కడికక్కడే (తెలంగాణ విద్యార్థుల జవాబుపత్రాలు తెలంగాణలో, సీవూంధ్ర విద్యార్థులవి సీవూంధ్రలో) చేరుంచాలని అధికారులు ఇప్పటికే నిర్ణరుంచారు.
16 నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
Published Fri, May 16 2014 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 7:23 AM
Advertisement