పదో షెడ్యూల్ అంశాలపై ఏపీ ఆలోచన
సీఎంతో భేటీ అయిన గంటా
సాక్షి, హైదరాబాద్: పదోషెడ్యూల్‌లో ఉన్న సంస్థలు పదేళ్లపాటు ఉమ్మడిగానే కొనసాగాల్సిం దేనని, ఈ విషయంలో అవసరమైతే న్యాయపోరాటం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావి స్తోంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం రాజ్యాంగ నిపుణులు, సీనియర్ న్యాయవాదులతో చర్చించారు. ఇంటర్మీడియెట్ పరీక్షలు, ఎంసెట్, పదో షెడ్యూల్‌లోని సంస్థలకు సంబంధించి మంత్రి గంటా శ్రీనివాసరావు తెలంగాణ విద్యామంత్రి జగదీశ్వర్‌రెడ్డితో సోమవారం చర్చలు జరపడం తెలి సిందే. ఆయన మంగళవారం సీఎం చంద్రబాబు ని కలసి చర్చల సారాంశాన్ని నివేదించారు. ఉమ్మడి సంస్థలపై తెలంగాణ ప్రభుత్వ వాదన ను సీఎం దృష్టికి తెచ్చారు. ఇంటర్మీడియెట్ పరీక్షలు సహ అన్నీ ఉమ్మడిగానే కొనసాగాలని, ఈ విషయంలో రాజీవద్దని చంద్రబాబు స్పష్టంచేసినట్లు తెలిసింది. విభజన చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘిస్తుండడాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తేనున్నారు.
అసరమైతే కేంద్ర జోక్యాన్ని కూడా కోరనున్నారు. తెలంగాణ ప్రభుత్వం మరింత దూకుడుగా వెళ్తే మాత్రం న్యాయపోరాటం ద్వారా అడ్డుకట్టవేయాలన్న అభిప్రాయానికి వచ్చారు. విభజన చట్టంలోని సెక్షన్ 95, 75 ప్రకారం పదో షెడ్యూల్‌లోని సంస్థలను ఇరు రాష్ట్రాలు సంప్రదింపులతో ఏకాభిప్రాయం వచ్చాకే విభజన చేయాలి. అలా కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యామండలిని, ఇంట ర్మీడియెట్‌బోర్డును ఏర్పాటుచేసింది. ఇక దీనిపై ఉపేక్షిస్తే ఇతర సంస్థల విషయంలోనూ ఇలాగే ముందుకు వెళ్తుంది. ముందుగానే దీనికి అడ్డుకట్టవేయాలి. అందుకు తక్షణమే కేంద్రం జోక్యాన్ని కోరాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ అంశంపై రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ దృష్టికి తెచ్చారు. మరోవైపు రాష్ట్ర ఎంపీలతో కూడా దీనిపై కేంద్రానికి వినతిపత్రం అందింపచేయనున్నారు. అవసరమైతే మంత్రులు, ఇతర ముఖ్యు లు కూడా కేంద్రప్రభుత్వం వద్దకు వెళ్లి రాష్ట్రం లోని తాజా పరిస్థితులను వివరించాలని భావిస్తున్నారు.
ప్రజాప్రయోజనవాజ్యం
మరోవైపు సోమవారం నాటి మంత్రుల భేటీ సమయంలో తాము వేరేగా ఇంటర్మీడియెట్, ఎంసెట్ పరీక్షలు నిర్వహించుకుంటామని తెలంగాణ మంత్రి పేర్కొనడంతో దాని ఆధారంగా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఉమ్మడి పరీక్ష రాసి రెండో సంవత్సరంలో వేర్వేరు పరీక్ష సరికాదని, ఇది తమ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని కొంతమంది విద్యార్థులతో సుప్రీంలో పిల్ దాఖలు చేయించే సూచనలు కనిపిస్తున్నాయి.
పదో షెడ్యూల్‌పై న్యాయపోరాటం
Published Wed, Oct 29 2014 3:40 AM | Last Updated on Sat, Jun 2 2018 2:36 PM
Advertisement