ఏపీకి వేరుగానే ఎంసెట్: మంత్రి గంటా
హైదరాబాద్ : యూనివర్శిటీల్లో ఖాళీగా వున్న పోస్టుల త్వరలో భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. రిజర్వేషన్లకు అనుగుణంగానే పోస్టుల భర్తీ జరుగుతుందని ఆయన గురువారమిక్కడ స్పష్టం చేశారు. శాసనమండలిలో ఉద్యోగుల భర్తీపై చర్చనంతరం... మంత్రి గంటా వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో పలు ఉన్నత విద్యాక్షేత్రాల ఏర్పాటుకు సంబంధించిన భూసేకరణ జరిగిందని చెప్పారు.
విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన 11 కేంద్ర సంస్థల్లో ఏడు విద్యాసంస్థలు ఉన్నాయన్నారు. తిరుపతిలో ఐఐటీ, విశాఖలో ఐఎంఎం ఏర్పాటు అవుతున్నాయని, స్థల ఎంపిక ఖరారైనట్లు చెప్పారు. గన్నవరం ఎన్ఐటీలో వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు జరుగుతాయని గంటా చెప్పారు. ఎంసెంట్ని ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తుందని, అయితే ఉమ్మడి ఎంసెట్ నిర్వహణకు తెలంగాణ రాష్ట్రం ససేమిరా అంటుందని ఆయన తెలిపారు.