
గంటా శ్రీనివాసర రావు
విశాఖపట్నం: ఏపి రాజధాని విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉందని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. రాజధాని ఏర్పాటుకు, ప్రాంతాల అభివృద్ధికి సంబంధం లేదన్నారు. బడ్జెట్‌లో ప్రవేశ పెట్టిన ఐదువేల కోట్ల రూపాయలతో మొత్తం రుణమాఫీ సాధ్యం కాదని చెప్పారు. అయితే ఏం చేసైనా రుణమాఫీ చేస్తామన్నారు.
తెలంగాణలో స్థానికతపై తానుగాని, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుగాని తేల్చలేరని చెప్పారు. ఆ విషయాన్ని చట్టపరమైన అంశాల ప్రాతిపదికనే తేల్చాల్సి ఉందన్నారు. బాక్సైట్ తవ్వకాలపై పునరాలోచన చేస్తున్నట్లు మంత్రి గంటా చెప్పారు.