సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన పదో తరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ జిల్లాల వారీగా పదో తరగతి పరీక్షల నివేదికను హైకోర్టుకు నివేదించారు. ఈ క్రమంలో జిల్లాల వారీగా పదో తరగతి పరీక్షల నిర్వహణకు సిద్ధంగా ఉన్నారా అని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పది పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉందని అడ్వాకేట్ జనరల్ పేర్కొన్నారు.
కరోనా నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణలో ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఈ పరిస్థితుల్లో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. దీనిని పరిశీలించిన హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు మధ్యలో నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల సడలింపులు ఇవ్వడంతో తిరిగి పరీక్షలు నిర్వహించేందుందు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును విన్నవించింది. (దేశంలో 24 గంటల్లో 9,304 కేసులు)
Comments
Please login to add a commentAdd a comment