- ముగ్గురు ఇన్విజిలేటర్లను రిలీవ్ చేసిన అధికారులు
- కాపీయింగ్‌పై కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదులు
చిత్తూరు(టౌన్), న్యూస్‌లైన్: పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే 9 మంది విద్యార్థులు డీ బార్ అయ్యారు. ముగ్గురు ఉపాధ్యాయులను అధికారులు విధుల నుంచి రిలీవ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా 267 సెంటర్లలో పరీక్షలు ప్రారంభమయ్యా యి. తెలుగు పరీక్షకు 53,834 మందికి గాను 561 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. కడప ఆర్‌జేడీ, పరిశీలకులు రమణకుమార్ మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడి న 8 మంది విద్యార్థులను డీబార్ చేశా రు.
పెనుమూరు జెడ్పీహెచ్‌ఎస్‌లో ఇద్ద రు, ఎస్‌ఆర్‌పురం మండలం కొత్తపల్లిమిట్ట హైస్కూల్‌లో ఇద్దరు, చిత్తూరులోని ఆర్‌కే మోడల్ పాఠశాలలో నలుగురు(ప్రైవేటు విద్యార్థులు) డీబార్ అ య్యారు. గంగాధరనెల్లూరు మండలంలోని ఓ పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు చేరవేసేందుకు స్లిప్స్ పట్టుకొని తిరుగుతున్న ఇద్దరు ఇన్విజిలేటర్లును గుర్తించి వాళ్లని ఆయన విధుల నుంచి రిలీవ్ చేశారు.
అలాగే మదనపల్లె ఉప విద్యాశాఖాధికారి కె.శామ్యూల్ కురబలకోట మండలంలోని ముదివేడు హైస్కూల్ లో కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఒక విద్యార్థినిని డీబార్ చేశారు. తిరుపతి ఉప విద్యాశాఖాధికారి చంద్రయ్య తిరుపతి సమీపంలోని సూర్యనాయనిపల్లె లో ఉన్న పరీక్షా కేంద్రంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఒక టీచర్‌ను రిలీవ్ చేశారు. మొత్తంగా తొలిరోజే 9 మంది విద్యార్థులు డీబార్ కావడం, ముగ్గురు ఉపాధ్యాయులను పరీక్షల విధుల నుంచి రిలీవ్ చేయడం ఉపాధ్యాయవర్గాల్లో సంచలనం రేపింది.
మారిన ప్రశ్నపత్రం
తిరుపతిలోని శేషాచల ఇంగ్లీష్ మీడి యం పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు ఒక ప్రశ్నపత్రానికి బదులు ఇన్విజిలేటర్ మరో ప్రశ్నపత్రం ఇచ్చాడు. కాంపోజిట్ తెలుగు రాయాల్సిన విద్యార్థులకు జనరల్ తెలుగు ప్రశ్నపత్రం ఇచ్చారు. సద రు విద్యార్థులు పరీక్ష ప్రారంభమైన కొంతసేపటికి విషయాన్ని గుర్తించారు.
కాపీయింగ్‌పై ఫిర్యాదులు
పరీక్షల్లో కాపీయింగ్ జరుగుతుందం టూ డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదులు వచ్చాయి. బి.కొత్తకోటలోని గట్టు జెడ్పీహెచ్‌ఎస్‌లో, గుర్రంకొండ జెడ్పీహెచ్‌ఎస్‌లో కాపీయింగ్ జరుగుతోందని ఫి ర్యాదు చేశారు. అలాగే చిత్తూరులోని గంగనపల్లెలో ఉన్న పరీక్షా కేంద్రం వద్ద కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఫిర్యాదు అందింది. ఈ విషయాన్ని విద్యాశాఖాధికారులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. బైరాగిపట్టెడలోని ఎంజీ ఎం పరీక్షా కేంద్రంలో ఫర్నిచర్ లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశా రు. ఆర్‌జేడీ, డీఈవో, జిల్లా పరీక్షల వి భాగం ఏసీ, ఫ్లయింగ్ స్క్వాడ్ తదితర అధికారులు జిల్లా వ్యాప్తంగా ఉన్న 85 పరీక్షా కేంద్రాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.