Ramana Kumar
-
ఎస్పీ రమణకుమార్ బదిలీ
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఎస్పీ ఎం.రమణకుమార్‌కు బదిలీ అయ్యారు. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్, ఇతర రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 11 మంది నాన్‌క్యాడర్ ఐపీఎస్‌లను బదిలీ చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా ఆయనకు బదిలీ అయ్యింది. 2021 జూలై 30 ఎస్పీగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. సుమారు రెండేళ్ల మూడు నెలలపాటు విధులు నిర్వర్తించారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు జారీకి ముందు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పర్యటించింది. కీలకమైన శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించిన ఈసీ ఉన్నతాధికారులు రాష్ట్రంలో కీలక పదవుల్లో నాన్‌కేడర్ అధికారులు ఉన్నట్లు గుర్తించారు. ఎన్నికల కోడ్ అమలులోకి రాగా ఉన్నతాధికారులను బదిలీ చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాల ఎస్పీలను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా అడిషనల్ ఎస్పీ అశోక్‌కు బాధ్యతలు అప్పగించాలని ఈసీ ఆదేశించింది. -
అడిషనల్ డీజీ విజయ్‌కుమార్‌కు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్
సాక్షి, హైదరాబాద్ / న్యూఢిల్లీ: పోలీస్‌శాఖలో విశిష్ట సేవలకుగాను సీనియర్ ఐపీఎస్ అధికారి గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఆపరేషన్స్ అడిషనల్ డీజీ విజయ్‌కుమార్, సంగారెడ్డి ఎస్పీ మదాడి రమణకుమార్‌లకు కేంద్ర ప్రభుత్వ అత్యుత్తమ పోలీస్ పతకాలు దక్కాయి. ఈ ఇద్దరు అధికారులకు రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకం (ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్ట్వ్ గిష్డ్ సర్విస్) కేంద్ర హోంశాఖ ప్రకటించింది. 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వివిధ విభాగాలకు చెందిన 954 మందికి పోలీస్ పతకాలు సోమవారం కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వీటిలో ఒకరికి రాష్ట్రపతి పోలీస్ శౌర్యపతకం, 229 మందికి పోలీస్ శౌర్యపతకాలు, 82 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకాలు, 642 మందికి ప్రతిభా పోలీస్ పతకాలు దక్కాయి. విజయ్‌కుమార్ : తెలంగాణ నుంచి జాతీయస్థాయిలో పోలీస్ పతకాలు దక్కిన వారిలో సీనియర్ ఐపీఎస్ అధికారి విజయ్‌కుమార్ 1997 బ్యాచ్ ఐపీఎస్‌కు చెందినవారు. ప్రస్తుతం గ్రేహౌండ్స్ అ డిషనల్ డీజీగా విధులు నిర్వర్తిస్తున్న ఈయన గతంలో కేంద్ర ప్రభుత్వ డిప్యుటేషన్‌పై ఇంటెలిజెన్స్‌లో పదేళ్లపాటు పనిచేశారు. హైదరాబాద్ సిటీ, మాదాపూర్ డీసీపీగా, కడప, నల్లగొండ జిల్లాల ఎస్పీగా కూడా పనిచేశారు. రమణకుమార్: రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకం దక్కిన మరో అధికారి మదాడి రమణకుమార్ ప్రస్తుతం సంగారెడ్డి ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన సుదీర్ఘకాలంపాటు ఏసీబీలో పనిచేశారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్లో పనిచేస్తున్న ఎస్పీ భాస్కరన్‌కు పోలీస్ శౌర్య పతకం దక్కింది. భాస్కరన్ సహా మొత్తం 22 మందికి పోలీస్ శౌర్య పతకాలు(పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంట్రీ–పీఎంజీ) , ఉత్తమ ప్రతిభా పోలీస్ పతకాలు (పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) పది మందికి దక్కాయి. నలుగురు జైలు అధికారులకు కూడా... నలుగురు జైలు అధికారులకు కూడా పతకాలు లభించాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ గౌరి రామచంద్రన్, డిప్యూటీ జైలర్ చెరుకూరి విజయ, అసిస్టింట్ డిప్యూటీ జైలర్ సీ.హెచ్.కైలాశ్, హెడ్‌వార్డర్ జి.మల్లారెడ్డిలు ప్రతిభా పతకాలకు ఎంపికయ్యారు. జహీరాబాద్ ఫైర్‌స్టేషన్‌కు చెందిన లీడింగ్ ఫైర్‌మ్యాన్ శ్రీనివాస్‌కు ఫైర్ సర్విస్ ప్రతిభా పురస్కారం దక్కింది. హోంగార్డులు కె.సుందర్‌లాల్, చీర్ల కృష్ణ సాగర్లకు హోమ్గార్డ్స్ – సివిల్ డిఫెన్స్ పతకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వీరిద్దరూ బీచ్పల్లి వద్ద కృష్ణా నదిలో కొట్టుకుపోతున్న తల్లి, ఇద్దరు పిల్లలను రక్షించడంతో ఈ అవార్డుకు ఎంపిక చేశారు. -
కరీంనగర్ సీపీగా సత్యనారాయణ
సాక్షి, కరీంనగర్: ఐదేళ్ల సుదీర్ఘకాలం కరీంనగర్ పోలీసు కమిషనర్‌గా వ్యవహరించిన వీబీ కమలాసన్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో రామగుండం సీపీ వి.సత్యనారాయణను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కమలాసన్‌రెడ్డిని ప్రభుత్వం డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది. వి.సత్యనారాయణ రామగుండంలో సుమారు మూడేళ్ల పాటు కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. అంతకుముందు హైదరాబాద్ వెస్ట్ జోన్, సౌత్ జోన్లలో డీసీపీగా వ్యవహరించారు. కాగా.. రామగుండం పోలీస్ కమిషనర్‌గా అవినీతి నిరోధక శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.రమణకుమార్ నియమితులయ్యారు. రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలం కోరెం గ్రామానికి చెందిన రమణ కుమార్ హైదరాబాద్‌లో వివిధ శాఖల్లో ఎస్పీ హోదాలో బాధ్యతలు నిర్వర్తించారు. కరీంనగర్‌పై చెరగని ముద్ర కరీంనగర్ సీపీగా సుదీర్ఘకాలం పనిచేసిన కమలాసన్‌రెడ్డి శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో ఆధునిక సాంకేతికతను వినియోగించారు. కరుడుగట్టిన నేరస్థులపై పీడీయాక్టు అమలు చేశారు. బ్లూకోల్ట్స్ విభాగాన్ని ఏర్పాటు చేసి సమాచారం అందించిన నిమిషాల వ్యవధిలోనే పోలీసులు వాలిపోయే విధంగా చర్యలు తీసుకున్నారు. సీపీ తీసుకున్న చర్యల కారణంగా దేశంలోనే ఉత్తమ పోలీస్స్టేషన్లుగా చొప్పదండి, జమ్మికుంట ఎంపికయ్యాయి. ప్రజల రక్షణ భద్రతలో దేశవ్యాప్తంగా నాలుగో స్థానం, పీడీయాక్టు అమలులో 2వ స్థానం సాధించారు. కమిషనరేట్ పరిధిలో 10 వేల సీసీ కెమెరాలు లక్ష్యంగా పెట్టుకోగా దాతల సహాయంతో 8,500 పైగా సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి. కరీంనగర్ సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలో ‘మియావాకీ’ చిట్టడవుల ప్రాజెక్టు ఏర్పాటు చేసి 12,500 మొక్కలు మొదటి దశలో, 14,800 మొక్కలు పెంచి ఆదర్శంగా నిలిచారు. దీంతోపాటు నక్షత్ర, రాశి వనాలను ఏర్పాటు చేసి రాష్ట్రానికే కరీంనగర్ పోలీసులను ఆదర్శంగా నిలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, హెల్మెట్ వినియోగంలో యువతలో జరిమానాల ద్వారా భయాన్ని కల్పించారు. ఆపరేషన్ నైట్ సేప్టీలో భాగంగా దొంగతనాలకు అడుకట్ట వేశారు. ప్రతిరోజూ కమిషరేట్‌లో నాఖాబందీ నిర్వహించి అక్రమార్కులకు, నేరగాళ్లకు సింహస్వప్నమయ్యారు. కమిషనరేట్‌లో 2 లక్షలకు పైగా ప్రజలు హ్యాక్ ఐ యాప్‌ను వినియోగింపచేశారు.లేక్ పోలీస్‌స్టేషన్, టాస్క్‌ఫోర్స్ విభా గాన్ని ఏర్పాటు చేసి అసాంఘిక శక్తుల ఆటలు కట్టించడంలో తనవంతు పాత్ర పోషించారు. భూదందాలు, సెటిల్మెంట్లు చేసి అక్రమాలకు పాల్పడిన 102 మందిపై పీడీయాక్టు విధించారు. కరీంనగర్ టూటౌన్, త్రీటౌన్, జమ్మికుంట, రామడుగు, ఎల్ఎండీ, గంగాధరతో పాటు వివిధ పోలీసుస్టేషన్లను ఆధునికీకరించారు. దివ్యాంగులు పోలీసుస్టేషన్లకు వచ్చేందుకు వీల్చైర్లు, ర్యాంపులు నిర్మించారు. నిజాం కాలం నాటి గోల్‌బంగ్లాను ఆధునికీకరించి అంతర్జాతీయ ప్రమాణాలతో జిమ్నాజియం ఏర్పాటు చేశారు. ఫిర్యాదుల ఫీడ్ బ్యాక్డే ద్వారా కేసుల పురోగతిని సమీక్షించారు. ఆటోలు, టాక్సీలకు క్యూఆర్ కోడ్ అమలు చేసి ప్రజలకు రక్షణ కల్పించారు. రామగుండం నుంచి కరీంనగర్‌కు.. కొత్త జిల్లాల అనంతరం ఏర్పాటైన రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన వెలివల సత్యనారాయణ కరీంనగర్ సీపీగా త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. 2006 బ్యాచ్‌కు చెందిన సత్యనారాయణ డీసీపీగా హైదరాబాద్ వెస్ట్ జోన్, సౌత్ జోన్లలో విధులు నిర్వర్తించి సమర్థవంతుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన 2018 సెప్టెంబర్ 26న రామగుండం పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. సుమారు మూడేళ్లపాటు రామగుండం సీపీగా పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రల పరిరక్షణకు తన వంతు కృషి చేశారు. పెద్దపల్లి, మంచిర్యాల డివిజన్లలో అక్రమార్కులపై కొరడా ఝులిపించారు. శాసనసభ, పార్లమెంటు, పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా తనదైన మార్కు చూపించారు. కమలాసన్ రెడ్డి వారసుడిగా కరీంనగర్‌కు రానున్నారు. ఐదేళ్లకు బదిలీ అయిన కమలాసన్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా కరీంనగర్లో ఏర్పాటైన పోలీస్ కమిషనరేట్‌కు 2016 అక్టోబర్ 11న తొలి కమిషనర్‌గా వీబీ కమలాసన్ రెడ్డి నియమితులయ్యారు. సుదీర్ఘంగా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలపాటు కమిషనర్‌గా వ్యవహరించిన ఆయన కరీంనగర్‌పై చెరగని ముద్ర వేశారు. సమర్థవంతుడైన అధికారిగా పేరున్న కమలాసన్ రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సదభిప్రాయం ఉండడంతో ఇన్నేళ్ల పాటు కొనసాగారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో కమలాసన్ రెడ్డిని బదిలీ చేసినట్లు తెలుస్తోంది. డీఐజీ హోదాలో ఉన్న ఆయనను డీజీ కార్యాలయానికి అటాచ్ చేయగా, హైదరాబాద్‌లోనే ఆయనకు పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
ఎవరిని కాపాడాలనుకుంటున్నారు?
సాక్షి, హైదరాబాద్ : కళియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి నగలు, పింక్ డైమండ్ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి రావినుతల శశిధర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీటీడీ మాజీ చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ రమణకుమార్‌పై తీవ్రంగా మండిపడ్డారు. రమణకుమార్ ఎవరిని కాపాడాలని ప్రయత్నిస్తున్నారని, తన హయంలో ఆరోపణలు వస్తే ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు. రమణకుమార్ మీడియా ప్రకటనను చూస్తే అధికారుల నిర్లక్ష్యం కనబడుతుందని ఆరోపించారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పకుండా రిటైర్డ్ అధికారులతో ఎందుకు మట్లాడిస్తున్నారని నిలదీశారు. ఎవరో చెప్పిన మాటలు విని నివేదికలు తయారు చేసే అధికారులు టీటీడీలో ఉన్నారా ప్రశ్నించారు. ఈ విషయంపై వెంటనే సీబీఐ విచారణ జరిపిస్తే అసలు విషయాలు బయటకి వస్తాయని శశిధర్ అన్నారు. -
శ్రీవారి ఆభరణాల వ్యవహారంలో కోత్త కోణం
-
‘పింక్ డైమండ్‌పై రమణ దీక్షితులు ఫిర్యాదు చేశారు’
సాక్షి, చిత్తూరు: పింక్ డైమండ్‌పై రమణ దీక్షితులే తనకు ఫిర్యాదు చేశారని టీటీడీ మాజీ చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ రమణకుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పిక్ డైమండ్‌పై ఫిర్యాదు చేసి.. రమణ దీక్షితులు తనను పక్కదారి పట్టించారని అన్నారు. పింక్ డైమండ్‌పై రమణ దీక్షితులు ఇచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్నానని, అందుకే తన రిపోర్టులో ఆ విషయం ప్రస్తావించానని తెలిపారు. రమణ దీక్షితులు ఆరోపణలో వాస్తవం లేదని జస్టిస్ జగన్నాథరావు కమిటీ నివేదికలో తేలిపోయిందన్నారు. బంగారు డాలర్ల విచారణ భాగంలోనే పింక్ డైమండ్ విషయం బయటపడిందన్నారు. గతంలో బొక్కసానికి సంబంధించిన రెండు తాళాలు డాలర్ శేషాద్రి వద్దే ఉండేవని, తన రిపోర్టులో ఆయన దగ్గర తాళాలు ఉండకూడదని పేర్కొన్నానట్లు తెలిపారు. దీంతో తాను ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఆభరణాల భద్రత విషయంలో చాలా మార్పులు చేశారని తెలిపారు. శ్రీ వారి నగలను ఆలయంలో జమాలజీ ల్యాబ్ ఏర్పాటుచేసి లెక్కగట్టారన్నారు. తాను ఇంతవరకూ పింక్ డైమండ్‌ని చూడలేదన్నారు. అదేవిధంగా రమణ దీక్షితులు టీటీడీకి ఇచ్చిన విరాళాన్ని తన అకౌంట్లో వేసుకునే వారని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని అప్పటి ఈవో రమణాచారి దృష్టికి తీసుకెళ్లామని, అయితే ఈవో ఆయన్ని మందలించి వదిలేశారని రమణ కుమార్ చెప్పారు. ప్రస్తుత పరిణామాలపై సీబీఐ విచారణ చేయించాలని ఆయన కోరారు. -
సూర్యకుమారిని విద్యాసాగర్ మోసం చేశాడు
సాక్షి, విజయవాడ : విజయవాడలో సంచలనం సృష్టించిన డాక్టర్ కొర్లపాటి సూర్య కుమారి విషాదానికి కారణం మాజీ ఎమ్మెల్యే తనయుడు విద్యాసాగర్‌రావు అని పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. తదుపరి విచారణ అనంతరం అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయనున్నారు. నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన సూర్యకుమారి శనివారం రైవస్ కాలువలో శవమై కనిపించింది. విస్తృత గాలింపుల అనంతరం ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు కాలువలో ఓ ముళ్లకంపలో చిక్కుకొని ఆమె మృతదేహం లభించింది. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణను చూస్తున్న జాయింట్ కమిషనర్ రమణ కుమార్ రైవస్ కాలువ వద్ద మృతదేహం బయటకు తీసిన సమయంలో ఉండగా సాక్షి మీడియా ఆయనను సంప్రదించి వివరాలు కోరింది. దీనికి ఆయన స్పందిస్తూ సూర్యకుమారిని విద్యాసాగర్ మోసం చేశాడని అన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం తీసుకోవడానికి అతడే కారణం అని తెలిపారు. తమ పరిశోధనలో ఇదే విషయం తెలిసిందని, అయితే, స్నేహితులు, బంధువులను ప్రశ్నించి పూర్తి పరిశోధన చేయాల్సి ఉందని, అది పూర్తయ్యాక విద్యాసాగర్‌పై సంబంధిత సెక్షన్లు నమోదు చేస్తామన్నారు. తమ విచారణలో వారిద్దరి ఏడేళ్ల నుంచే సంబంధం ఉందని తెలిసిందన్నారు. ఈ కేసును చేధించేందుకు ఆరు బృందాలు పెట్టినట్లు తెలిపారు. -
జిల్లాలో పనిచేసిన ప్రతి అధికారి ఆదర్శప్రాయుడే
► కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ కడప అర్బన్ : జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ఎర్రచందనం అక్రమ రవాణా నివారణ కోసం, రోడ్డు ప్రమాదాల నివారణకు స్పెషల్ డ్రైవ్ లాంటి కార్యక్రమాలు రాష్ట్రంలోనే ప్రథమ స్థాయిలో నిలిచేలా జిల్లా పోలీసు అధికారులు కృషి చేశారని కడప, కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ ప్రశంసించారు. జిల్లా ఎస్పీగా పనిచేస్తూ నెల్లూరుజిల్లాకు బదిలీపై వెళుతున్న పీహెచ్డీ రామకృష్ణ, జిల్లా అదనపు ఎస్పీగా పనిచేస్తూ ప్రకాశం జిల్లా ఎస్పీగా పదోన్నతిపై వెళుతున్న బి.సత్య ఏసుబాబు, పులివెందుల ఏఎస్పీగా పనిచేస్తూ తూర్పుగోదావరి జిల్లా ఓఎస్డీగా వెళుతున్న అన్బురాజన్, జిల్లాలో ఐపీఎస్ శిక్షణ పూర్తి చేసుకున్న గౌతమిసాలీలకు ఆదివారం కడప నగర శివార్లలోని మేడా కన్వెక్షన్ హాలులో వీడ్కోలు, సన్మాన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఐజీతోపాటు అధికారులకు పోలీసులు స్వాగతం పలికారు. అనంతరం డీఐజీ మాట్లాడుతూ అంకితభావంతో ఎస్పీ రామకృష్ణ, మిగతా అధికారులు పనిచేసి జిల్లా పేరును రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచేలా చేశారన్నారు. జిల్లా పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు అగ్రహారం శ్రీనివాసశర్మ మాట్లాడుతూ జిల్లా పోలీసు యంత్రాం గానికి ఎస్పీ రామకృష్ణ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారన్నారు. జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో పోలీసు యంత్రాంగం, ప్రజలు, మీడియా తన విధులను చట్టపరంగా నిర్వర్తించేందుకు ఎంతో సహకరించారన్నారు. అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) సత్య ఏసుబాబు మాట్లాడుతూ జిల్లా పోలీసు యంత్రాంగం శాంతిభద్రతల పరిరక్షణలో తన వెన్నంటి ఉన్నారన్నారు. పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ పోలీసు అధికారుల సహకారంతో అనేక టాస్క్‌లను పూర్తి చేయగలిగామన్నారు. డీటీసీ బసిరెడ్డి మాట్లాడారు. అనంతరం అధికారులను సన్మానించారు. ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ బి.శ్రీనివాసులు, ఎస్బీ డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, కడప డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్, రాజంపేట డీఎస్పీ రాజేంద్ర, మైదుకూరు డీఎస్పీ బీఆర్ శ్రీనివాసులు, షౌకత్ అలీ, సుధాకర్, ట్రాఫిక్ డీఎస్పీ భక్తవత్సలం, మహిళా అప్‌గ్రేడ్ డీఎస్పీ వాసుదేవన్, డీసీఆర్బీ డీఎస్పీ నాగేంద్రుడు, ఏఆర్ డీఎస్పీ మురళీధర్, సీఐలు, ఎస్ఐలు, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
పాఠశాలల్లో వసతులు తప్పనిసరిగా ఉండాలి
ఎంఈవోల సమావేశంలో ఆర్జేడీ రమణకుమార్ చిత్తూరు(సెంట్రల్): జిల్లాలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి వసతి తప్పనిసరిగా ఉండేలా చూడాలని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడీ) రమణకుమార్ తెలిపారు. ఆయన బుధవారం జిల్లాలోని ఎంఈవోలతో సమావేశమయ్యూ రు. ఆయన మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం అమలును పరిశీలించే క్రమంలో రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లోని మౌలిక వసతులను పరిశీలించేందుకు సుప్రీం కోర్టు ఒక కమిటీని వేసిందన్నారు. ఈ కమిటీ చిత్తూరు జిల్లాలో త్వరలో పర్యటించనుందని తెలిపారు. ఆ సమయూనికి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానంగా మరుగుదొడ్లు, తాగునీటి వసతి తప్పకుండా ఉండేలా చూడాలన్నారు. ఈ మేరకు జిల్లాలోని ఏయే పాఠశాలల్లో మరుగుదొడ్లు సమగ్రంగా ఉన్నాయి. ఎక్కడ లేవనే విషయాన్ని పరిశీలిం చి వివరాలు ఇవ్వాలన్నారు. అలాగే తాగునీటి వసతి ఉన్న, లేని వాటి వాటి వివరాలను సర్వశిక్షాభియాన్ (ఎస్ఎస్ఏ) ప్రాజెక్ట్ అధికారికి సమర్పించాలన్నారు. ఈ నివేదిక పరిశీలన అనంతరం అవసరమైన నిధులను ఎస్ఎస్ఏ ప్రాజెక్ట్ అధికారి విడుదల చేస్తారని చెప్పారు. సంబంధిత ఉన్నత పాఠశాలల్లో డీవైఈవోలు, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనులను త్వరిత గతిన జరిగేలా ఎంఈవోలు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. డీఈవో ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు స్థానిక సంస్థల అధ్యక్షుల సహాయ సహకారాలు తీసుకోవాలని తెలిపారు. ఎస్ఎస్ఏ పీవో లక్ష్మీ మాట్లాడుతూ పాఠశాలల్లో మరుగుదొడ్ల రిపేర్లు, తాగునీటి వసతి కల్పనకు సంబంధించిన వివరాలను అందించిన తర్వాత ఇంజినీరింగ్ అధికారులు అంచనాలు తయారు చేస్తారని తెలిపారు. అనంతరం సంబంధిత పనులకు టెండర్లు పిలవడమో.. లేక నామినేషన్ ప్రాతిపదికన కేటాయించడమో చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఎస్ఎస్ఏ ఈఈ నతానియల్, డీవైఈవోలు చంద్రయ్య, శామ్యూల్, వాసుదేవనాయుడు తదితరులు పొల్గొన్నారు. -
తొలిరోజే 9 మంది డీబార్
ముగ్గురు ఇన్విజిలేటర్లను రిలీవ్ చేసిన అధికారులు కాపీయింగ్‌పై కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదులు చిత్తూరు(టౌన్), న్యూస్‌లైన్: పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే 9 మంది విద్యార్థులు డీ బార్ అయ్యారు. ముగ్గురు ఉపాధ్యాయులను అధికారులు విధుల నుంచి రిలీవ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా 267 సెంటర్లలో పరీక్షలు ప్రారంభమయ్యా యి. తెలుగు పరీక్షకు 53,834 మందికి గాను 561 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. కడప ఆర్జేడీ, పరిశీలకులు రమణకుమార్ మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడి న 8 మంది విద్యార్థులను డీబార్ చేశా రు. పెనుమూరు జెడ్పీహెచ్ఎస్లో ఇద్ద రు, ఎస్ఆర్పురం మండలం కొత్తపల్లిమిట్ట హైస్కూల్లో ఇద్దరు, చిత్తూరులోని ఆర్కే మోడల్ పాఠశాలలో నలుగురు(ప్రైవేటు విద్యార్థులు) డీబార్ అ య్యారు. గంగాధరనెల్లూరు మండలంలోని ఓ పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు చేరవేసేందుకు స్లిప్స్ పట్టుకొని తిరుగుతున్న ఇద్దరు ఇన్విజిలేటర్లును గుర్తించి వాళ్లని ఆయన విధుల నుంచి రిలీవ్ చేశారు. అలాగే మదనపల్లె ఉప విద్యాశాఖాధికారి కె.శామ్యూల్ కురబలకోట మండలంలోని ముదివేడు హైస్కూల్ లో కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఒక విద్యార్థినిని డీబార్ చేశారు. తిరుపతి ఉప విద్యాశాఖాధికారి చంద్రయ్య తిరుపతి సమీపంలోని సూర్యనాయనిపల్లె లో ఉన్న పరీక్షా కేంద్రంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఒక టీచర్‌ను రిలీవ్ చేశారు. మొత్తంగా తొలిరోజే 9 మంది విద్యార్థులు డీబార్ కావడం, ముగ్గురు ఉపాధ్యాయులను పరీక్షల విధుల నుంచి రిలీవ్ చేయడం ఉపాధ్యాయవర్గాల్లో సంచలనం రేపింది. మారిన ప్రశ్నపత్రం తిరుపతిలోని శేషాచల ఇంగ్లీష్ మీడి యం పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు ఒక ప్రశ్నపత్రానికి బదులు ఇన్విజిలేటర్ మరో ప్రశ్నపత్రం ఇచ్చాడు. కాంపోజిట్ తెలుగు రాయాల్సిన విద్యార్థులకు జనరల్ తెలుగు ప్రశ్నపత్రం ఇచ్చారు. సద రు విద్యార్థులు పరీక్ష ప్రారంభమైన కొంతసేపటికి విషయాన్ని గుర్తించారు. కాపీయింగ్‌పై ఫిర్యాదులు పరీక్షల్లో కాపీయింగ్ జరుగుతుందం టూ డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదులు వచ్చాయి. బి.కొత్తకోటలోని గట్టు జెడ్పీహెచ్ఎస్లో, గుర్రంకొండ జెడ్పీహెచ్ఎస్లో కాపీయింగ్ జరుగుతోందని ఫి ర్యాదు చేశారు. అలాగే చిత్తూరులోని గంగనపల్లెలో ఉన్న పరీక్షా కేంద్రం వద్ద కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఫిర్యాదు అందింది. ఈ విషయాన్ని విద్యాశాఖాధికారులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. బైరాగిపట్టెడలోని ఎంజీ ఎం పరీక్షా కేంద్రంలో ఫర్నిచర్ లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశా రు. ఆర్జేడీ, డీఈవో, జిల్లా పరీక్షల వి భాగం ఏసీ, ఫ్లయింగ్ స్క్వాడ్ తదితర అధికారులు జిల్లా వ్యాప్తంగా ఉన్న 85 పరీక్షా కేంద్రాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.