సూర్యకుమారిని విద్యాసాగర్‌ మోసం చేశాడు | vidyasagar cheated suryakuamari | Sakshi
Sakshi News home page

సూర్యకుమారిని విద్యాసాగర్‌ మోసం చేశాడు

Published Sat, Aug 5 2017 8:42 PM | Last Updated on Sun, Sep 17 2017 5:12 PM

సూర్యకుమారిని విద్యాసాగర్‌ మోసం చేశాడు

సూర్యకుమారిని విద్యాసాగర్‌ మోసం చేశాడు

సాక్షి, విజయవాడ : విజయవాడలో సంచలనం సృష్టించిన డాక్టర్‌ కొర్లపాటి సూర్య కుమారి విషాదానికి కారణం మాజీ ఎమ్మెల్యే తనయుడు విద్యాసాగర్‌రావు అని పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. తదుపరి విచారణ అనంతరం అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయనున్నారు. నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన సూర్యకుమారి శనివారం రైవస్‌ కాలువలో శవమై కనిపించింది. విస్తృత గాలింపుల అనంతరం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలకు కాలువలో ఓ ముళ్లకంపలో చిక్కుకొని ఆమె మృతదేహం లభించింది.

ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణను చూస్తున్న జాయింట్‌ కమిషనర్‌ రమణ కుమార్‌ రైవస్‌ కాలువ వద్ద మృతదేహం బయటకు తీసిన సమయంలో ఉండగా సాక్షి మీడియా ఆయనను సంప్రదించి వివరాలు కోరింది. దీనికి ఆయన స్పందిస్తూ సూర్యకుమారిని విద్యాసాగర్‌ మోసం చేశాడని అన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం తీసుకోవడానికి అతడే కారణం అని తెలిపారు. తమ పరిశోధనలో ఇదే విషయం తెలిసిందని, అయితే, స్నేహితులు, బంధువులను ప్రశ్నించి పూర్తి పరిశోధన చేయాల్సి ఉందని, అది పూర్తయ్యాక విద్యాసాగర్‌పై సంబంధిత సెక్షన్లు నమోదు చేస్తామన్నారు. తమ విచారణలో వారిద్దరి ఏడేళ్ల నుంచే సంబంధం ఉందని తెలిసిందన్నారు. ఈ కేసును చేధించేందుకు ఆరు బృందాలు పెట్టినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement