విజయవాడ: విజయవాడలో సంచలనం సృష్టించి మిస్టరీగా మారిన డాక్టర్ కొర్లపాటి సూర్య కుమారి అదృశ్యం కేసులో పోలీసులకు ఆధారం దొరికింది. ఆమె నడిపే బైక్ రైవస్ కాల్వలో లభించింది. దీంతో సూర్యకుమారి కాలువలో దూకి ఉంటుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను ప్రత్యేకంగా రంగంలోకి దింపారు. ఆమె నడిపే మోపెడ్ బైక్ లభించిన కాల్వలో గాలింపు చర్యలు ప్రారంభించారు. కాల్వమొత్తం ప్రత్యేక బోటులతో గాలిస్తున్నారు. సూర్యకుమారి అదృశ్యం కేసులో మిస్టరీ వీడలేదు.
సూర్యకుమారి మిస్టరీ కేసులో మాజీ ఎమ్మెల్యే తనయుడు విద్యాసాగర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సూర్యకుమారి తల్లిదండ్రులు విజయ్‌కుమార్, మేరిలు పలు అనుమానాలు విద్యాసాగర్‌పైనే అనుమానం వ్యక్తం చేయగా పోలీసులు ఇప్పటికే అతడిని ప్రశ్నించి వదిలేశారు. అయితే, అతడిపై పూర్తిగా అనుమానాలు తొలగినట్లేనా లేక పోలీసులు పరిశీలనలో పెట్టారా అనే విషయం తేలాల్సి ఉంది. ఒక వేళ సూర్యకుమారి కాలువలో దూకితే అందుకుగల కారణాలు కూడా పోలీసులు శోధించాల్సి ఉంది. ఎవరైనా ఆత్మహత్యకు పురికొల్పారా లేక ఆమెనే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందా.. అసలు ఆమె నిజంగానే ఆత్మహత్యకు పాల్పడిందా అనే తదితర ప్రశ్నలకు ఇంకా సమాధానం తెలియాల్సి ఉంది.
సూర్యకుమారి కాలువలో దూకిందా?
Published Sat, Aug 5 2017 6:31 PM | Last Updated on Mon, Sep 11 2017 11:21 PM
Advertisement