Vidyasagar
-
బాధితుడినే నిందితుడిగా మార్చారు
సాక్షి, అమరావతి: బాధితుడినే నిందితుడిగా మార్చి.. నిందితులకు పోలీసులు మద్దతు పలుకుతున్నారని కుక్కల విద్యాసాగర్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఇలాంటి ఘటన చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. సినీ నటి జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సినీనటి జత్వానీ, ఆమె కుటుంబ సభ్యులు విద్యాసాగర్ నుంచి బలవంతంగా రూ.కోటి వరకు గుంజితే.. పోలీసులు రివర్స్‌లో అతనిపైనే కేసుపెట్టి ప్రాసిక్యూట్ చేయాలంటున్నారని వివరించారు. జత్వానీకి సంబంధించిన మొబైల్ ఫోన్లు, ఐపాడ్, ల్యాప్‌టాప్‌లలో కీలక సమాచారం ఉందని, డబ్బు కోసం విద్యాసాగర్‌ను బెదిరించిన మెసేజ్‌లు అందులో ఉన్నాయని తెలిపారు.అందుకే వాటిని భద్రపరచాలని తాము న్యాయ పోరాటం చేస్తున్నామని చెప్పారు. జత్వానీ చాటింగ్ మెసేజ్‌లను పోలీసులు ఉద్దేశపూర్వకంగానే బయటపెట్టడం లేదని తెలిపారు. జత్వానీ రెండు ఆధార్ కార్డులు కలిగి ఉన్నారని, కేంద్రం ఎవరికీ రెండో ఆధార్ కార్డు ఇవ్వదన్నారు. జత్వానీ సోదరుడికి అండర్ వరల్డ్‌తో సంబంధాలున్నాయని, ఈ విషయంలో కూడా పోలీసులు మౌనంగా ఉన్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో క్రియాశీలకంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని, ఇందుకు జత్వానీని ఓ సాధనంగా వాడుకుంటోందన్నారు.ఆ బాధ్యత పోలీసులపై ఉందినిరంజన్రెడ్డి వాదనలపై హైకోర్టు స్పందిస్తూ.. ఇలాంటి కీలక విషయాలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని వ్యాఖ్యానిస్తూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నందిగం సురేష్ కు హైకోర్టులో ఊరట మాజీ ఎంపీ నందిగం సురేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. బీజేపీ నేత, ప్రస్తుత మంత్రి సత్యకుమార్‌పై దాడి కేసులో సురేష్ రిమాండ్‌ను కోరవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. మరియమ్మ అనే మహిళ హత్య కేసులో సురేష్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నేపథ్యంలో ఆయన విషయంలో కఠిన చర్యలేవీ తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో దర్యాప్తును కొనసాగించవచ్చని పోలీసులకు స్పష్టం చేస్తూ పోలీసుల విచారణకు హాజరు కావాలని నందిగంను ఆదేశించారు. ఈ వ్యాజ్యంలో పోలీసుల తరఫున పీపీ వాదనల నిమిత్తం న్యాయమూర్తి విచారణను ఈ నెల 16కి వాయిదా వేశారు. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
సీఐడీ చీఫ్ అయ్యన్నార్ వీరంగం!
సాక్షి, అమరావతి: అక్రమ కేసులతో వేధింపులకు పాల్పడుతున్న చంద్రబాబు ప్రభుత్వం మరింతగా బరితెగించింది. వలపు వలతో బడా బాబులను బురిడీ కొట్టించే కాదంబరి జత్వానీ కుట్రపూరితంగా ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించిన కేసులో న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ బెదిరింపులకు దిగుతోంది. ఇందులో భాగంగా సీఐడీ చీఫ్‌గా ఉన్న అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ రంగంలోకి దిగడం.. న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధంగా బెదిరింపులకు పాల్పడటం విభ్రాంతి కలిగిస్తోంది. ఈ కేసులో అరెస్టయిన పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్‌ను కస్టడీలోకి తీసుకుని విచారణ పేరుతో తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో అయ్యన్నార్పై హైకోర్టుకు ఫిర్యాదు చేసేందుకు కుక్కల విద్యాసాగర్ తరఫు న్యాయవాదులు సిద్ధపడుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఏమిటంటే..వేరే గదిలోకి తీసుకువెళ్లి బెదిరింపులు..హనీట్రాప్ ట్రాక్ రికార్డ్ ఉన్న కాదంబరి జత్వానీ ఇచ్చిన ఫిర్యాదుతో పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్టుచేసి న్యాయస్థానం ఆదేశాలతో రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును ఇటీవల సీఐడీకి బదిలీచేసింది. దీంతో ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీఐడీ అధికారులు విద్యాసాగర్‌ను విచారణ నిమిత్తం న్యాయస్థానం అనుమతితో మూడ్రోజుల కస్టడీకి తీసుకున్నారు. గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో ఆయన్ని ఆదివారం విచారించారు. విచారణ ప్రక్రియను పూర్తిగా ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అందుకు సీఐడీ కార్యాలయంలో ఓ గదిలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేస్తూ కొంతసేపు విచారించారు. ఆ తర్వాత ఆయన్ను మరో గదిలోకి తీసుకెళ్లారు. ఆ గదిలో ఆడియో, వీడియో రికార్డింగ్‌కు ఏర్పాట్లుచేయకపోవడం గమనార్హం. మరి ఆయన్ని ఆ గదిలోకి ఎందుకు తీసుకువెళ్లారన్నది అర్థంకాలేదు. కానీ, కొన్ని క్షణాలకే సీఐడీ అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ అక్కడికి చేరుకోవడంతో అసలు విషయం స్పష్టమైంది. ఆడియో, వీడియో రికార్డింగ్లేని ఆ గదిలో విద్యాసాగర్‌ను రవిశంకర్ అయ్యన్నార్ తీవ్రస్థాయిలో బెదిరించినట్లు సమాచారం. తాము చెప్పినట్లుగా వాంగ్మూలం ఇవ్వాలని.. లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన పోలీసు శైలిలో హెచ్చరించారు. తాము చెప్పిన కొందరి పేర్లను వాంగ్మూలంలో పేర్కొనాలని.. వారు చెప్పినట్లే తాను చేశానని.. అంతా వారి ప్రమేయంతోనే జరిగిందనే అసత్య వాంగ్మూలాన్ని ఇవ్వాలని బెదిరించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా గతంలో తాము ఎవరెవర్ని ఎలా కేసుల్లో ఇరికించింది.. ఎంతగా వేధించిందీ చెబుతూ బెదిరించారు. ఓ సమయంలో ఆయన నిగ్రహం కోల్పోయి మరీ తీవ్రస్థాయిలో విరచుకుపడినట్లు తెలిసింది. దీంతో అసలక్కడ ఏం జరుగుతోందోనని సీఐడీ వర్గాలే కాసేపు ఆందోళన చెందాయి.అయ్యన్నార్ బెదిరింపులపై హైకోర్టుకు నివేదన..న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని నిర్వహిస్తున్న విచారణ సందర్భంలోనే సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ నిబంధనలను ఉల్లంఘించడంపట్ల విస్మయం వ్యక్తమవుతోంది. ఆయన వ్యవహారశైలి న్యాయస్థానం ఆదేశాలకు పూర్తి విరుద్ధంగా ఉందన్నది స్పష్టమవుతోంది. మరోవైపు.. అయ్యన్నార్ బెదిరింపులను విద్యాసాగర్ తరఫు న్యాయవాదులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు వారు సమాయత్తమవుతున్నారు. కస్టడీలో వేధింపులు, కోర్టు ఆదేశాల ధిక్కరణ తదితర అభియోగాలతో అయ్యన్నార్‌కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. విద్యాసాగర్ కూడా తనను రవిశంకర్ అయ్యన్నార్ ఏ రీతిలో బెదిరించిందీ.. అంతుచూస్తానని హెచ్చరించిందీ న్యాయస్థానానికి విన్నవించేందుకు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ కేసుకు సంబంధించి తదుపరి పరిణామాలు ఎలా ఉండనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. -
అరెస్ట్‌కు కారణాలను రాతపూర్వకంగా చెప్పాల్సిందే
సాక్షి, అమరావతి: ఏ కేసులో అయినా అరెస్ట్‌కు గల కారణాలను నిందితులకు రాతపూర్వకంగా ఇవ్వాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో పోలీసులు ఏకీకృత, నిర్ధిష్ట విధానాన్ని అనుసరించడం లేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఆ దిశగా కీలక ఆదేశాలు జారీ చేసింది. అరెస్ట్‌కు గల కారణాలను నిందితునికి రాతపూర్వకంగా తెలియచేసి తీరాలని పోలీసులను ఆదేశించింది. తద్వారా కస్టోడియల్ రిమాండ్ నుంచి తనను తాను కాపాడుకుని, బెయిల్ కోరేందుకు అవకాశం ఇవ్వాలని తేల్చిచెప్పింది. అలా చేయని పక్షంలో వివాదాస్పద అంశాల్లో వాస్తవాలేమిటన్న విషయం తేలకుండా పోతుందని పేర్కొంది.అరెస్ట్‌కు గల కారణాలను నిందితులకు రాతపూర్వకంగా తెలియచేసే విషయంలో ఏకీకృత విధానాన్ని రూపొందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. అరెస్ట్‌కు దారి తీసిన కేసుకు సంబంధించిన మౌలిక వివరాలను కూడా అందులో పొందుపరచాలంది. అరెస్ట్‌కు సంబంధించి ఏ కారణాలనైతే నిందితునికి తెలియచేశారో వాటిని రిమాండ్ రిపోర్ట్‌తో జత చేయాలని కూడా ఆదేశించింది.రిమాండ్ అధికారాన్ని ఉపయోగించే న్యాయాధికారులు, మేజిస్ట్రేట్లు, జడ్జీలందరూ అరెస్ట్‌కు గల కారణాలను నిందితులకు తెలియచేయాలన్న రాజ్యాంగంలోని అధికరణ 22(1)లోని ఆదేశాన్ని, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్)లోని సెక్షన్ 47(1)ను పోలీసులు అనుసరించారా లేదా అన్న దానిపై తమ సంతృప్తిని రికార్డ్ చేసి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. అరెస్టయిన వ్యక్తికి కూడా హక్కులుంటాయని, మానవ హక్కులు కూడా వర్తిస్తాయని తెలిపింది.విద్యాసాగర్ రిమాండ్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోంసినీ నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసిన కేసులో విజయవాడ కోర్టు తనకు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. విద్యాసాగర్ రిమాండ్ విషయంలో విజయవాడ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. విజయవాడ కోర్టు రిమాండ్ ఉత్తర్వులను కొట్టేసేందుకు ఎలాంటి కారణం కనిపించడం లేదంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి సోమవారం తీర్పు వెలువరించారు. ఈ తీర్పు కాపీని రాష్ట్రంలోని న్యాయాధికారులందరికీ, డీజీపీకి పంపాలని రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించారు.ఇదే సమయంలో తన అరెస్ట్ గురించి, అరెస్ట్‌కు గల కారణాల గురించి తన కుటుంబ సభ్యులకు గానీ, స్నేహితులకు గానీ పోలీసులు తెలియచేయలేదన్న విద్యాసాగర్ వాదనను న్యాయమూర్తి తన తీర్పులో తోసిపుచ్చారు. అరెస్ట్ గురించి, అరెస్ట్‌కుగల కారణాలను పోలీసులు విద్యాసాగర్‌కు 20.09.2024 ఉదయం 6.30 గంటల సమయంలోనే తెలియచేశారన్నారు. రిమాండ్ రిపోర్ట్‌లో జతచేసిన డాక్యుమెంట్లలో విద్యాసాగర్ అరెస్ట్‌కు సంబంధించిన అరెస్ట్ మెమో కూడా ఉందని తెలిపారు. జత్వానీ ఫిర్యాదు మేరకు విద్యాసాగర్‌పై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఆయన్ను అరెస్ట్ చేశారు. విజయవాడ కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. దీనిని సవాల్ చేస్తూ విద్యాసాగర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిపిన జస్టిస్ చక్రవర్తి సోమవారం తీర్పు చెప్పారు. -
జత్వానీ కేసులో విద్యాసాగర్‌కు తాత్కాలిక ఊరట
సాక్షి, అమరావతి: సినీ నటి జత్వానీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్‌కు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. విద్యాసాగర్ కస్టడీ కోరుతూ విజయవాడ కోర్టులో పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించాలని అక్టోబర్ 1 వరకు ఆ కోర్టును పట్టుబట్టబోమని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పిన విషయాన్ని పరిగణనలోకి తీసకున్న హైకోర్టు.. విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ)కు తెలపాలని పోలీసులను ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎలాంటి కారణాలు చెప్పకుండానే విజయవాడ కోర్టు విధించిన రిమాండ్ ఉత్తర్వులను కొట్టేయాలని, తన అరెస్టును అక్రమమని ప్రకటించాలని కోరుతూ విద్యాసాగర్ దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ జ్యోతిర్మయి ప్రతాప గురువారం విచారణ జరిపారు. విద్యాసాగర్ తరపున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంలో పలు రాజ్యాంగపరమైన అంశాలు ముడిపడి ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో విచారణ జరపాల్సి ఉంటుందని న్యాయమూర్తి తెలిపారు. ఇప్పటికిప్పుడు విచారణ సాధ్యం కాదన్నారు. పోలీసుల తరపున రాష్ట్ర పీపీ మెండ లక్ష్మీనారాయణ జోక్యం చేసుకుంటూ.. ఈ వ్యాజ్యం విచారణను అక్టోబర్ 1కి వాయిదా వేయాలని, అప్పటివరకు కస్టడీ పిటిషన్‌పై విచారణ జరపాలని కింది కోర్టును పట్టుబట్టవద్దని సంబంధిత పీపీకి చెబుతామని ప్రతిపాదించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఆ మేర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని కూడా పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను 1వ తేదీకి వాయిదా వేశారు.హనుమంతరావు పిటిషన్‌పై విచారణ 1కి వాయిదా జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ విజయవాడ వెస్ట్‌జోన్ అప్పటి ఏసీపీ హనుమంతరావు దాఖలు చేసిన వ్యాజ్యం తదుపరి విచారణను హైకోర్టు అక్టోబర్ 1కి వాయిదా వేసింది. -
డెహ్రాడూన్‌లో కుక్కల విద్యాసాగర్ అరెస్ట్
విజయవాడ స్పోర్ట్స్ : ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వాని ఇచ్చిన ఫిర్యాదులో నిందితుడుగా ఉన్న వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్‌ను ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అరెస్ట్ చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు తెలిపారు. ఈ నెల 13వ తేదీన నటి జత్వాని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే విద్యాసాగర్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఆ వెంటనే అతడి కోసం ఢిల్లీ, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. డెహ్రాడూన్‌లో ప్రత్యేక బృందాలు అతన్ని పట్టుకున్నాయని, ఈ నెల 20న అరెస్ట్ చేసి.. డెహ్రాడూన్ మూడో అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజి్రస్టేట్ ముందు హాజరు పరిచాయన్నారు. ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడ తీసుకొస్తున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అంతా రివర్స్: సినీ నటి కాదంబరి జత్వాని తనను మోసం చేసిందని తొలుత కేసు పెట్టిందే కుక్కల విద్యాసాగర్. ఆమె ఫోన్లు వెనక్కు ఇవ్వద్దని, అలా ఇస్తే డేటా తొలగిస్తారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి, పోరాడుతున్నది కూడా ఇతనే. పోర్జరీ సంతకాలతో భూమిని కొట్టేసేందుకు యత్నించిందని ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఇతని ఫిర్యాదుతో జత్వానిపై కేసు నమోదు చేసి.. ముంబై నుంచి ఆమెను అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇలా ఎంతో మందిని ఆమె మోసగించిందని విచారణలో తేలింది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే టీడీపీ పెద్దలు ఆమెను అడ్డం పెట్టుకుని కొందరు ఐపీఎస్ అధికారులపై కక్ష సాధింపునకు దిగారు. ముగ్గురిని సస్పెండ్ కూడా చేశారు. కేసును తిమ్మినిబమ్మి చేసి తమ కక్ష సాధింపునకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇందులో భాగంగానే కుక్కల విద్యాసాగర్‌పై ఆమెతో ఉల్టా కేసు పెట్టించి, అరెస్ట్ చేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిపై ఇలా కక్ష సాధిస్తున్నారు. -
ఉపకరణాలే కాదు.. డేటా కూడా ముఖ్యం
సాక్షి, అమరావతి : సినీ నటి కాదంబరి జత్వానీ నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలను భద్రపరిచే విషయంలో హైకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. జత్వానీ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్, లాప్‌ట్యాప్‌లను, అందులో ఉన్న డేటాను ఒరిజినల్ రూపంలోనే భద్రపరచాలని పోలీసులను ఆదేశించింది. ఉపకరణాలంటే అందులో ఉన్న డేటా కూడా అని, దానిని కూడా భద్రపరచడం తప్పనిసరని తెలిపింది. డేటా అత్యంత కీలకమంది. తన ఫిర్యాదు మేరకు జత్వానీ తదితరులపై కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు.. దర్యాప్తులో భాగంగా ఆమెకు చెందిన పలు ఎలక్ట్రానిక్ ఉపకరణాలను జప్తు చేశారని, అందులో కీలక సమాచారం ఉన్న నేపథ్యంలో ఆ ఉపకరణాలను వెనక్కి ఇచ్చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ ఫిర్యాదుదారు కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జత్వానీ నుంచి జప్తు చేసిన ఉపకరణాలన్నింటినీ భద్రపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు.. జత్వానీ నుంచి జప్తు చేసిన మొబైల్ ఫోన్లు, ఇతర ఉపకరణాలను భద్రపరచాలని పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం ఈ వ్యాజ్యంపై జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి మరోసారి విచారణ జరిపారు. వెనక్కి ఇచ్చేసేందుకే వాటిని తెప్పించారురాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ, జత్వానీ నుంచి జప్తు చేసిన మొబైల్ ఫోన్లు ఇతర ఉపకరణాలను ఆమెకు తిరిగి ఇచ్చే ఉద్దేశం ఏమీ ప్రస్తుతానికి దర్యాప్తు అధికారికి లేదని తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ, ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) వద్ద ఉన్న జత్వానీ ఎలక్ట్రానిక్ ఉపకరణాలను తిరిగి ఆమెకు ఇచ్చేస్తున్నారని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, అసలు ఆ ఉపకరణాలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. పోలీస్‌స్టేషన్‌లో దర్యాప్తు అధికారి వద్ద ఉన్నాయని దమ్మాలపాటి శ్రీనివాస్ చెప్పారు. ఈ సమయంలో విద్యాసాగర్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ, ఎఫ్ఎస్ఎల్ వద్ద విశ్లేషణ నిమిత్తం ఉన్న జత్వానీ మొబైల్ ఫోన్లు తదితర ఉపకరణాలను వెనక్కు ఇచ్చేందుకు హడావుడిగా తెప్పించారని తెలిపారు. ఆ ఉపకరణాలను విశ్లేషించి, అందులో ఉన్న వివరాలతో ఎఫ్ఎస్ఎల్ నివేదిక అందచేయాల్సి ఉంటుందన్నారు. మొబైల్ ఫోన్లు జప్తు చేసిన నేపథ్యంలో, అందులో ఉన్న సిమ్ కార్డ్ స్థానంలో తాజా సిమ్ కార్డ్‌ను జత్వానీకి ఇవ్వాలని సంబంధిత ఆపరేటర్‌ను పోలీసులు ఆదేశించే అవకాశం ఉందన్నారు. ఇదే జరిగితే ఆ సిమ్‌లో ఉన్న డేటా మొత్తం పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు గురించి జత్వానీ ఇష్టమొచ్చినట్లు మీడియా ముందు మాట్లాడుతున్నారని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్డీటీవీకి ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలను ఆయన కోర్టుకు సమర్పించారు. ఈ సమయంలో ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ, ఆ ఉపకరణాలను వెనక్కి ఇచ్చే ఉద్దేశం ప్రస్తుతానికి లేదని పునరుద్ఘాటించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ మొత్తం వ్యవహారంలో వారం కల్లా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేసింది. విచారణకు జత్వానీ, ఆమె తల్లిదండ్రులు కోర్టులో హాజరయ్యారు. -
ఆ శిక్ష.. ఐపీఎస్‌లపై కక్ష!
సాక్షి, అమరావతి: వలపు వల (హనీ ట్రాప్)తో బడా బాబులను బ్లాక్ మెయిల్ చేయడం ఆమె వ్యవహార శైలి.. ఫోర్జరీ పత్రాలతో మోసాలకు పాల్పడటం ఆమె నైజం..ఏపీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో కేసులు ఆమె నేర చరిత్రకు సాక్ష్యం..ఫోర్జరీ నేరంపై విజయవాడ కోర్టు ఆదేశాలతో రిమాండ్.. ఇదీ ఇటీవల నేపథ్యం.. తీవ్రమైన నేరాల్లో నిందితురాలైన కాదంబరి జత్వానీ నిరాధార ఆరోపణలతో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ఫిర్యాదు చేస్తే, ప్రభుత్వం ఎలా స్పందించాలి? ఆమెను అరెస్ట్ చేసి, న్యాయస్థానం ద్వారా రిమాండ్ విధించిన అధికారులపై ఆరోపణలు చేస్తున్నట్టుగా భావించాలి. మరోవైపు ఆమె ఆరోపణలు ఎంత వరకు వాస్తవమో దర్యాప్తునకు ఆదేశించాలి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు తనను అరెస్టు చేసి జైలులో పెట్టడాన్ని మనసులో ఉంచుకున్న చంద్రబాబు.. ఏదో ఒక సాకు చూపి.. సీనియర్ ఐపీఎస్ అధికారులపై వేటు వేయాలని ఎదురు చూస్తున్నారు. ఇందులో భాగంగానే జుగుప్సాకరమైన, తీవ్రమైన ఆర్థిక నేరాల్లో నిందితురాలైన కాదంబరి జత్వానీకి ప్రభుత్వం విశిష్ట అతిథి స్థాయిలో ప్రోటోకాల్ మర్యాదలు చేసింది. ఆపై ఆమె ఫిర్యాదును సాకుగా చేసుకుని డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు, ఐజీ టి.కాంతి రాణా, డీఐజీ విశాల్ గున్నీలను ఏకపక్షంగా సస్పెండ్ చేసింది. వారిపై మరిన్ని చర్యలకు సన్నద్ధమవుతోంది. ఈ పరిణామం యావత్ దేశ వ్యాప్తంగా అఖిల భారత సర్వీసు అధికారుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్నికలకు ముందు తనను అరెస్ట్ చేయడాన్ని మనసులో పెట్టుకున్న చంద్రబాబు.. అధికారంలోకి రాగానే సీనియర్ ఐపీఎస్ అధికారులపై.. అదీ ఏకంగా డీజీ స్థాయి, ఐజీ, డీఐజీ స్థాయి అధికారులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని అర్థమవుతోంది. వ్యక్తిగత కక్షతోనే ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం మేరకు కుట్ర పూరితంగా కక్ష సాధింపునకు పాల్పడుతోంది. ఇప్పటికే వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు, అక్రమ కేసులతో వేధిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం.. కీలక ఉన్నతాధికారులే లక్ష్యంగా కుట్రలకు పదును పెడుతోంది. కాదంబరితో క్విడ్ ప్రో కో కుట్రవలపు వల (హనీట్రాప్)తో బడా బాబులను బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడటమే వ్యాపకంగా మార్చుకున్న కాదంబరి జత్వానీతో కూడా చంద్రబాబు ప్రభుత్వం క్విడ్ ప్రో కో కుట్రకు తెరతీసింది. ఫోర్జరీ పత్రాలతో భూములు కొల్లగొట్టేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయిన ఆమెతో టీడీపీ ప్రభుత్వం అవగాహనకు రావడం విడ్డూరంగా ఉంది. తీవ్రమైన నేరాలకు పాల్పడిన కేసుల్లో నిందితురాలికి వత్తాసు పలుకుతూ ఐపీఎస్ అధికారులను వేధిస్తుండటం పట్ల అఖిల భారత సర్వీసు అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నేర చరిత్ర ఉన్న కాదంబరి జత్వానీతో తప్పుడు ఫిర్యాదు ఇప్పించి.. ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, టి.కాంతిరాణా, విశాల్ గున్నీలను ఇప్పటికే ఏకపక్షంగా సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. వారిపై మరిన్ని వేధింపులకు పాల్పడేందుకు సన్నద్ధమవుతుండటం పట్ల ఆగ్రహం వ్యక్యం చేస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాదంబరి జత్వానీ విజయవాడలో ప్రత్యక్షం కావడం వెనుక పక్కా కుట్ర దాగి ఉందని అధికార వర్గాలే వెల్లడిస్తున్నాయి. గతంలో ఆమెపై నమోదు చేసిన ఫోర్జరీ కేసును నీరుగారుస్తామని చెబుతూ.. అందుకు ప్రతిగా ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయమని ఆమెకు షరతు విధించినట్టు స్పష్టమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వ కథ, స్క్రీన్ ప్లే ప్రకారం కాదంబరి జత్వానీ నెల రోజులుగా విజయవాడలో హైడ్రామా సృష్టిస్తున్నారు. జత్వానీపై ఏపీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో పలు కేసులు ఉన్నాయి. వలపు వలతో బడా బాబులను బ్లాక్ మెయిలింగ్ చేయడం ఆమె వ్యాపకంగా చేసుకున్నారని పలు ఫిర్యాదులు, విమర్శలు ఉన్నాయి.నిందితురాలితో ప్రభుత్వం కుమ్మక్కుపారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్‌కు చెందిన ఐదు ఎకరాలను ఫోర్జరీ పత్రాలతో మరొకరికి విక్రయించేందుకు కూడా కాదంబరి జత్వానీ బరి తెగించారు. వెంటనే అప్రమత్తమైన విద్యాసాగర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫిర్యాదు చేయడంతో విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. న్యాయస్థానం అనుమతితో నిబంధనలను పాటిస్తూ ముంబయిలో ఆమెను అరెస్ట్ చేసి విజయవాడ తీసుకువచ్చారు. ఫోర్జరీ అభియోగాలకు సంబంధించి పోలీసులు సమర్పించిన ఆధారాలతో న్యాయస్థానం సంతృప్తి చెంది ఆమెకు రిమాండ్ విధించింది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంత మాత్రాన జత్వానీ గతంలో పాల్పడిన తీవ్రమైన, జుగుప్సాకరమైన నేరాలు ఒక్క దెబ్బతో మాయమైపోయినట్టు కాదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం తన ఫోర్జరీ బాగోతాన్ని ఆధారాలతోసహా వెలికి తీసినందుకే ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ఆమె కక్ష గట్టారు. కాగా ఆ పోలీసు అధికారులను అక్రమ కేసులతో వేధించాలని అప్పటికే నిర్ణయించిన చంద్రబాబు ప్రభుత్వం కాదంబరి జత్వానీని తమ కుట్రలో భాగస్వామిగా చేసుకుంది. ప్రభుత్వ పెద్దలు ఆమెతో ఇటీవల ఇప్పించిన ఫిర్యాదుతో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఇంకొందరు పోలీసు అధికారుల పేర్లను కూడా చేర్చేందుకు సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు, అధికారులను అవమానిస్తూ వేధిస్తున్న తీరు అఖిల భారత సర్వీసు అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. ఇదే ప్రభుత్వ విధానంగా మారితే.. రాష్ట్రంలో ఏ అఖిల భారత స్థాయి అధికారి కూడా నిబద్ధతతో పని చేయడం సాధ్యం కాదని చెబుతున్నారు. ఏదైనా నేరానికి పాల్పడిన వారిపై విచారణ నిర్వహించి పక్కా ఆధారాలతో చర్యలు తీసుకుంటే ప్రభుత్వ పెద్దలు అభినందించాలి. కానీ నిందితులతో కుమ్మక్కై అధికారులనే వేధిస్తుంటే రాష్ట్రంలో పని చేసేందుకు ఏ అఖిత భారత సర్వీసు అధికారి కూడా ఇష్టపడరని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ అధికార యంత్రాంగం మనో ధైర్యం దెబ్బతింటే అంతిమంగా ప్రజలే నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మరో టార్గెట్ రామకృష్ణే .. చంద్రబాబు, ఈనాడు రామోజీరావు కుటుంబం క్విడ్ ప్రో కోకుట్ర మరోసారి అధికారికంగా బట్టబయలవుతోంది. అందులో భాగంగానే స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ పూర్వపు ఐజీ రామకృష్ణకు టీడీపీ కూటమి ప్రభుత్వం గురి పెట్టింది. ఎందుకంటే.. రామోజీరావు కుటుంబం దశాబ్దాలుగా మార్గదర్శి చిట్ ఫండ్స్ ద్వారా యథేచ్చగా పాల్పడిన ఆర్థిక అక్రమాలను ఆధారాలతో సహా ఆయన నిగ్గు తేల్చారు. కేంద్ర సర్వీసుల నుంచి డెప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చిన ఐఆర్ఎస్ అధికారి రామకృష్ణ.. కేంద్ర చిట్ ఫండ్ చట్టాన్ని పక్కాగా అమలు చేసేందుకు ప్రయత్నించారు. ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తూ రామోజీరావు కుటుంబం మార్గదర్శి చిట్స్ చందాదారుల సొమ్మును అక్రమ మార్గాల ద్వారా మళ్లించి తమ కుటుంబ వ్యాపార సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్‌లో అక్రమ పెట్టుబడులుగా పెట్టినట్టు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ గుర్తించింది. ఘోస్ట్ చందాదారుల పేరుతో అక్రమాలు, రశీదుల ముసుగులో అక్రమ డిపాజిట్ల సేకరణ తదితర ఆర్థిక నేరాలను వెలుగులోకి తెచ్చింది. దాంతో రెండేళ్లపాటు మార్గదర్శి చిట్ ఫండ్స్‌లో కొత్త చిట్టీ గ్రూపులు నిలిచి పోవడంతో రామోజీ కుటుంబ ఆర్థిక అక్రమాల పునాదులు కదిలాయి. స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఫిర్యాదుతో సీఐడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అక్రమాలకు పక్కా ఆధారాలు లభించడంతో గత ఏడాది రామోజీరావు (ప్రస్తుతం చనిపోయారు), ఆయన కోడలు శైలజ కిరణ్‌ను హైదరాబాద్‌లో విచారించారు. ఇది ఆ కుటుంబంతో అనుబంధం ఉన్న చంద్రబాబుకు ఏమాత్రం రుచించలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రామకృష్ణను వ్యక్తిగత లక్ష్యంగా చేసుకున్నారు. ఆయనకు పోస్టింగు ఇవ్వనే లేదు. మరోవైపు ఐఆర్ఎస్ అధికారిగా ఆయన డెప్యుటేషన్ పూర్తి కావడంతో కేంద్ర సర్వీసులకు తిరిగి వెళ్లాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేయకపోయినా సరే.. డీమ్డ్ టు బీ రిలీవ్డ్‌గా పరిగణించి ఆయనకు కేంద్ర ప్రభుత్వం పోస్టింగు ఇచ్చేందుకు సిద్ధమైంది. నిబంధనల మేరకు సాగుతున్న పరిణామాలపై రామోజీరావు కుటుంబం భగ్గుమంది. రామకృష్ణను లక్ష్యంగా చేసుకుని ఈనాడు పత్రికలో రెండు రోజులుగా ప్రత్యేక కథనాలు ప్రచురించారు. రాజగురువు కుటుంబానికి ఆగ్రహం కలిగిందని బెంబేలెత్తిన చంద్రబాబు ప్రభుత్వం.. నిబంధనలను అతిక్రమించేందుకు కూడా వెనుకాడటం లేదు. రామోజీ కుటుంబాన్ని సంతృప్తి పరిచేందుకు రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలాయాన్ని ఆదేశించినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వ అధికారి అయిన ఆయనపై ఏకపక్షంగా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయ వర్గాలు తర్జన భర్జన పడుతున్నాయి. కానీ రామోజీ కుటుంబం కళ్లల్లో ఆనందం చూడటమే తమ లక్ష్యం.. అన్నట్లు రామకృష్ణపై చర్యలు తీసుకోవాల్సిందేనని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసినట్టు సమాచారం. దాంతో రామకృష్ణపై ప్రభుత్వం ఒకట్రెండ్రోజుల్లో కక్ష సాధింపు చర్యలు చేపట్టే అవకాశాలున్నాయని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. -
కాదంబరీ జత్వానీ తల్లి గురించి షాకింగ్ నిజాలు
-
డబ్బున్నవాళ్లే టార్గెట్
-
జైన గురువు ‘సల్లేఖనం’
రాజ్‌నందన్‌గావ్: ప్రముఖ జైన గురువు ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ ‘సల్లేఖన’ వ్రతం ద్వారా శరీరత్యాగం చేశారు. రాజ్‌నందన్‌గావ్ జిల్లా డొంగార్‌గఢ్‌లోని చంద్రగిరి తీర్థ్‌లో ఆదివారం ఉదయం ఆయన తుదిశ్వాస వదిలారని తీర్థ్ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఆరు నెలలుగా మహారాజ్ దొంగార్‌గఢ్ తీర్థ్‌లోనే ఉంటున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మూడు రోజులుగా సల్లేఖన దీక్షను పాటిస్తున్నారు. జైన మతాచారం ప్రకారం సంపూర్ణ ఉపవాస దీక్ష (సల్లేఖనం)తో శరీరం వదిలారు. ఆత్మ శుద్ధీకరణార్థం ఈ దీక్ష చేపట్టారు’’ అని తీర్థ్ తెలిపింది. తీర్థ్‌లోనే అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. -
తనువు చాలించిన విద్యాసాగర్ మహారాజ్ .. ప్రధాని మోదీ నివాళి!
ప్రముఖ జైన దిగంబర ముని ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ శనివారం తనువు చాలించారు. గత ఏడాది నవంబర్ ఐదున ప్రధాని నరేంద్ర మోదీ ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని చంద్రగిరి జైన దేవాలయంలో విద్యాసాగర్ మహారాజ్ శనివారం అర్థరాత్రి 2:35 గంటలకు తన దేహాన్ని విడిచిపెట్టారు. దీనికి ముందు ఆయన ఆచార్య పదవిని వదులుకున్నారు. మూడు రోజులపాటు ఉపవాసం ఉంటూ, మౌనం పాటించారు. అనంతరం ప్రాణాలు విడిచారు. విద్యాసాగర్ మహారాజ్ మరణవార్త తెలియగానే జైన సమాజానికి చెందిన పలువురు చంద్రగిరి జైన దేవాలయానికి చేరుకున్నారు. ఆదివారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. My thoughts and prayers are with the countless devotees of Acharya Shri 108 Vidhyasagar Ji Maharaj Ji. He will be remembered by the coming generations for his invaluable contributions to society, especially his efforts towards spiritual awakening among people, his work towards… pic.twitter.com/jiMMYhxE9r — Narendra Modi (@narendramodi) February 18, 2024 -
నటి మీనా భర్త విద్యాసాగర్‌కు కోలీవుడ్ నివాళి (ఫొటోలు)
-
‘తిట్టిన వాళ్లే కేసీఆర్ క్యాబినేట్లో ఉన్నారు’
సాక్షి, ఢిల్లీ: టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు అవమానాలు, అన్యాయాలు జరుగుతున్నాయని టీఆర్ఎస్ అసమ్మతి ఎమ్మెల్సీ భూపతి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ద్రోహులకు టీఆర్ఎస్ పార్టీలో పెద్దపీట వేస్తున్నారని విమర్శించారు. అందుకే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నానని వెల్లడించారు. పదవులు తనకు ముఖ్యం కాదన్నారు. అనర్హత వేటు వేసినా తాను సిద్ధంగానే ఉన్నానని తెలిపారు. 14 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీని నిర్మించామని, కానీ పార్టీని వీడిపోవాల్సి వస్తోందని అన్నారు. నాలుగున్నర సంవత్సరాల నుంచి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడంలో పూర్తిగా కేసీఆర్ విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. నీళ్లు, నియామకాలు, నిధులు అంశాల్లో ఇంకా న్యాయం జరగలేదని అన్నారు. రైతు బంధు పథకం వల్ల అసలైన రైతులకు న్యాయం జరగలేదని, కౌలు రైతులకు ఎటువంటి ప్రయోజనం దక్కలేదని చెప్పారు. సరైన గిట్టుబాటు ధర ఇచ్చి ఉంటే బాగుండేదని, కానీ కేసీఆర్ అలా చేయలేదని చెప్పారు. ధనిక తెలంగాణను అప్పుల తెలంగాణాగా మార్చివేశారని విమర్శించారు. ప్రస్తుతం కేసీఆర్ చుట్టూ తెలంగాణ ద్రోహులే ఉన్నారని ధ్వజమెత్తారు. ఎస్టీలకు 9 శాతం రిజర్వేషన్, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పి మాట తప్పారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది ప్రాణత్యాగం చేస్తే 400 మందిని కూడా ఆదుకోలేదని విమర్శించారు. కేసీఆర్‌ను తిట్టిన వాళ్లే కేసీఆర్ క్యాబినేట్లో ఉన్నారని, నిజాయతీగా ఉండి పార్టీకి సేవ చేసిన వాళ్లను బయటికి పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్ఎస్ పార్టీ పనిచేయడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ బడుగు బలహీనవర్గాలకు చెందిన పార్టీ, ఇవ్వన్నీ కాంగ్రెస్ పార్టీతో సాధ్యమౌతుందన్న నమ్మకం ఉందన్నారు. నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నుంచి పోటీ చేయాలన్న కోరికని ఆయన వెల్లడించారు. బంగారు కుటుంబమే బంగారు తెలంగాణ కాలే: విద్యాసాగర్ ప్రత్యేక రాష్ట్రం సాధించడంలో తాము భాగస్వాములు అయ్యామని, కానీ ఆశించిన రీతిలో టీఆర్ఎస్ పనిచేయడం లేదని ప్రొఫెసర్ విద్యాసాగర్ విమర్శించారు. కేసీఆర్ కుటుంబం బంగారు కుటుంబం అయింది కానీ బంగారు తెలంగాణ కాలేదని ఎద్దేవా చేశారు. ఉద్యమకారులను టీఆర్ఎస్ పట్టించుకోవడంలేదని, అసమర్థులకు టిక్కెట్లు కేటాయించడం వల్లే పార్టీని వీడాల్సి వచ్చిందని తెలిపారు. -
సూర్యకుమారిని విద్యాసాగర్ మోసం చేశాడు
సాక్షి, విజయవాడ : విజయవాడలో సంచలనం సృష్టించిన డాక్టర్ కొర్లపాటి సూర్య కుమారి విషాదానికి కారణం మాజీ ఎమ్మెల్యే తనయుడు విద్యాసాగర్‌రావు అని పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. తదుపరి విచారణ అనంతరం అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయనున్నారు. నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన సూర్యకుమారి శనివారం రైవస్ కాలువలో శవమై కనిపించింది. విస్తృత గాలింపుల అనంతరం ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు కాలువలో ఓ ముళ్లకంపలో చిక్కుకొని ఆమె మృతదేహం లభించింది. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణను చూస్తున్న జాయింట్ కమిషనర్ రమణ కుమార్ రైవస్ కాలువ వద్ద మృతదేహం బయటకు తీసిన సమయంలో ఉండగా సాక్షి మీడియా ఆయనను సంప్రదించి వివరాలు కోరింది. దీనికి ఆయన స్పందిస్తూ సూర్యకుమారిని విద్యాసాగర్ మోసం చేశాడని అన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం తీసుకోవడానికి అతడే కారణం అని తెలిపారు. తమ పరిశోధనలో ఇదే విషయం తెలిసిందని, అయితే, స్నేహితులు, బంధువులను ప్రశ్నించి పూర్తి పరిశోధన చేయాల్సి ఉందని, అది పూర్తయ్యాక విద్యాసాగర్‌పై సంబంధిత సెక్షన్లు నమోదు చేస్తామన్నారు. తమ విచారణలో వారిద్దరి ఏడేళ్ల నుంచే సంబంధం ఉందని తెలిసిందన్నారు. ఈ కేసును చేధించేందుకు ఆరు బృందాలు పెట్టినట్లు తెలిపారు. -
సూర్యకుమారిని విద్యాసాగర్ మోసం చేశాడు
-
సూర్యకుమారి మిస్టరీ విషాదాంతం
-
సూర్యకుమారి మిస్టరీ విషాదాంతం
విజయవాడ: విజయవాడలో సంచలనం సృష్టించి మిస్టరీగా మారిన డాక్టర్ కొర్లపాటి సూర్య కుమారి అదృశ్యం కేసు విషాదంగా ముగిసింది. రైవస్ కాలువలో ఆమె మృతదేహం లభ్యమైంది. విస్తృత గాలింపుల అనంతరం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆమె మృతదేహం వెలికితీశాయి. గత నాలుగు రోజులుగా కనిపించకుండాపోయిన సూర్యకుమారి కేసులో శనివారమే పోలీసులకు ఆధారం దొరికింది. ఆమె నడిపే బైక్ రైవస్ కాల్వ వద్ద లభించింది. దీంతో సూర్యకుమారి కాలువలో దూకి ఉంటుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ప్రత్యేకంగా రంగంలోకి దింపారు. ఆమె నడిపే మోపెడ్ బైక్ లభించిన కాల్వలో గాలింపు చర్యలు ప్రారంభించారు. కాల్వమొత్తం ప్రత్యేక బోటులతో గాలించడంతో ఓ రైల్వేగేటుకు సమీపంలోని రైవస్ కాలువలో ముళ్ల కంపలోచిక్కుకొని ఉన్న ఆమె మృతదేహం గుర్తించి వెలికి తీశారు. నాలుగు రోజులు కావడంతో ఆమె మృతదేహం దాదాపు కుళ్లిన స్థితిలోకి వచ్చింది. -
సూర్యకుమారి కాలువలో దూకిందా?
విజయవాడ: విజయవాడలో సంచలనం సృష్టించి మిస్టరీగా మారిన డాక్టర్ కొర్లపాటి సూర్య కుమారి అదృశ్యం కేసులో పోలీసులకు ఆధారం దొరికింది. ఆమె నడిపే బైక్ రైవస్ కాల్వలో లభించింది. దీంతో సూర్యకుమారి కాలువలో దూకి ఉంటుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ప్రత్యేకంగా రంగంలోకి దింపారు. ఆమె నడిపే మోపెడ్ బైక్ లభించిన కాల్వలో గాలింపు చర్యలు ప్రారంభించారు. కాల్వమొత్తం ప్రత్యేక బోటులతో గాలిస్తున్నారు. సూర్యకుమారి అదృశ్యం కేసులో మిస్టరీ వీడలేదు. సూర్యకుమారి మిస్టరీ కేసులో మాజీ ఎమ్మెల్యే తనయుడు విద్యాసాగర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సూర్యకుమారి తల్లిదండ్రులు విజయ్‌కుమార్, మేరిలు పలు అనుమానాలు విద్యాసాగర్పైనే అనుమానం వ్యక్తం చేయగా పోలీసులు ఇప్పటికే అతడిని ప్రశ్నించి వదిలేశారు. అయితే, అతడిపై పూర్తిగా అనుమానాలు తొలగినట్లేనా లేక పోలీసులు పరిశీలనలో పెట్టారా అనే విషయం తేలాల్సి ఉంది. ఒక వేళ సూర్యకుమారి కాలువలో దూకితే అందుకుగల కారణాలు కూడా పోలీసులు శోధించాల్సి ఉంది. ఎవరైనా ఆత్మహత్యకు పురికొల్పారా లేక ఆమెనే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందా.. అసలు ఆమె నిజంగానే ఆత్మహత్యకు పాల్పడిందా అనే తదితర ప్రశ్నలకు ఇంకా సమాధానం తెలియాల్సి ఉంది. -
‘సూర్యకుమారి ఫ్రెండే.. ఏ సంబంధం లేదు’
-
‘సూర్యకుమారి ఫ్రెండే.. ఏ సంబంధం లేదు’
విజయవాడ: విజయవాడ నగరంలో కలకలం సృష్టించిన డాక్టర్ కొర్లపాటి సూర్యకుమారి అదృశ్యం కేసులో మిస్టరీ వీడలేదు. ఈ కేసులో పోలీసు విచారణను ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే తనయుడు విద్యాసాగర్‌పై సూర్యకుమారి తల్లిదండ్రులు విజయ్‌కుమార్, మేరిలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె అదృశ్యానికి విద్యాసాగర్ బాధ్యత వహించాలన్నారు. తనకు వివాహం కాలేదని విద్యాసాగర్ సూర్యకుమారిని మభ్యపెట్టాడని, రాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ఆమెతో విద్యాసాగర్ కుటుంబీకులు మాట్లాడారని చెప్పారు. ఆమె ఎక్కడ ఉందో పోలీసులు తేల్చాలని డిమాండ్ చేశారు. విద్యాసాగర్ ఫోన్‌కు సూర్యకుమారి ఫోన్ నుంచి వచ్చినట్లు చెబుతున్న మెసేజ్‌లు విద్యాసాగర్ సృష్టించాడని తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. తమ కుమార్తె వివాహ సంబంధాలు కూడా చెడగొట్టడంలో విద్యాసాగర్ హస్తం ఉందన్నారు. పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి తమ కుమార్తె ఆచూకీ కనిపెట్టాలని వారు వేడుకుంటున్నారు. ఆమెతో ఎలాంటి సంబంధం లేదు: విద్యాసాగర్ సూర్యకుమారి మిస్సింగ్ కేసులో ఆమె తల్లిదండ్రులు విద్యాసాగర్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తుండగా ఆమెకు తనకు ఎలాంటి సంబంధం లేదని విద్యాసాగర్ చెప్పారు. పొరపాటున తనకు మెస్సేజ్ పంపించి ఉంటుందని భావిస్తున్నానని అన్నారు. ఢిల్లీ వెళ్లి క్రాష్ కోర్స్ చేయాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నట్లు సూర్యకుమారి తనతో చెప్పిందని ఆయన అన్నారు. ఢిల్లీకి వెళ్లడం ఆమెకు ఇష్టం లేదని, తమ మధ్య ఉంది స్నేహం మాత్రమేనని ఇంకా ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. -
నయీమ్ కేసులో మళ్లీ మొదలైన హడావిడి
-
నల్లగొండ నేతల్లో ‘నయీమ్’ వణుకు
-
నల్లగొండ నేతల్లో ‘నయీమ్’ వణుకు
- రాజకీయ నాయకులపై చర్యలుంటాయన్న వార్తలతో కలకలం - నయీమ్‌తో నేతి విద్యాసాగర్, చింతలకు సంబంధాల నిర్ధారణ - జిల్లాకు చెందిన ముగ్గురు, నలుగురు నేతలకూ సంబంధాలు సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో కలిసి భూదందాలు, సెటిల్మెంట్లకు పాల్పడిన ఆయన అనుచరుల ఎపిసోడ్ అయిపోయింది. వారంతా అరెస్టయి జైలుకెళ్లి మళ్లీ బెయిల్‌పై విడుదలై కేసుల విచారణ ఎదుర్కొంటున్నారు. నయీమ్‌తో అంటకాగిన పోలీసు లపై చర్యలూ పూర్తయ్యాయి. ఐదుగురు అధికారులు సస్పెండ్ కాగా, మిగిలిన వారిని మౌఖిక విచారణ జరిపి నేరం రుజువైతే వారిని కూడా సస్పెండ్ చేసి కటకటాల పాలు చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఇక, మిగిలిం దల్లా రాజకీయ నాయకులే. అది కూడా నల్లగొండ జిల్లాకు చెందినవారే. నయీమ్ అనుచరులు, అంట కాగిన పోలీసుల ఎపిసోడ్లు ముగిసిన తర్వాత రాజ కీయ నాయకుల పీకలపై కత్తి పెట్టేందుకు రంగం సిద్ధమవుతుందన్న వార్తలు ఇప్పుడు నల్లగొండ జిల్లాకు చెందిన నాయకులకు వణుకు పుట్టిస్తున్నాయి. జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న శాసన మండలి ఉపాధ్యక్షుడు నేతి విద్యాసాగర్, భువనగిరికి చెందిన టీఆర్ఎస్ నేత చింతల వెంకటేశ్వరరెడ్డిలకు నయీమ్‌తో ప్రత్యక్ష సంబంధాలున్న విషయం కూడా ఇప్పటికే నిర్ధారణ అయింది. ఇందులో విద్యాసాగర్‌ను నయీమ్ కేసు విచారించేందుకు ఏర్పాటు చేసిన సిట్ విచారించింది కూడా. వీరిద్దరికి తోడు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. వీరికి తోడు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జి దుబ్బాక నర్సింహారెడ్డిలకు కూడా నయీమ్‌తో సంబంధాలున్నాయనే ప్రచారం ఉంది. అయితే, వీరి ప్రత్యక్ష ప్రమేయం పోలీసు విచారణలో నిర్ధారణ అయిందా, వీరిద్దరూ కేవలం మాటామంతీలు మాత్రమే నడిపించారా, భూదందాలు చేశారా? అన్నది బయటకు రానీయడం లేదు. ఈ నేపథ్యంలో నయీమ్ తో ఎవరి సంబంధాలు ఎంత వరకు ఉన్నాయి? అందు లో నేరపూరిత కోణం ఎవరి విషయంలో నిర్ధారణ అయింది? వారిని అరెస్టు చేస్తారా? లేదా పదవులకు రాజీనామా చేయిస్తారా? తాజాగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారనే ప్రచారం కూడా ఆ నియోజకవర్గంలో హాట్‌టాపిక్‌గా మారడం విశేషం. గన్‌లైసెన్స్ రద్దు? నేతి విద్యాసాగర్ వ్యక్తిగత గన్ లైసెన్స్‌ను రద్దు చేసినట్టు తెలుస్తోంది. తన గన్‌లైసెన్స్‌ను పునరుద్ధరించాలని ఆయన చేసుకున్న దరఖాస్తును పోలీసులు తిరస్కరించారని సమాచారం. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత ఆయనపై నాలుగైదు కేసులు నమోదు కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. నయీమ్ ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో లభించిన డైరీ ఆధారంగా ఆయన ముఖ్య అనుచరులు, కుటుంబ సభ్యులు, బినామీలు, బంధువులు, పోలీసు ఉన్నతాధికారులు, అధికార, ప్రతిపక్షపార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీల వివరాలు బయటపడ్డాయి. మరో నేత చింతల వెంకటేశ్వర్‌రెడ్డి తన కుటుంబీకుల పేరిట ఎలాంటి ఆస్తులు కూడగట్టకపోయినా, నయీమ్ తో కలసి నడిపిన ఓ భూదందాలో తన స్నేహితుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని పోలీసు విచారణలో తేలింది. ఎమ్మెల్యే గాదరి కిశోర్ కూడా నయీమ్‌కు దగ్గరయ్యాడని పోలీసు విచారణలో తేలినట్టు సమాచారం. నయీమ్ అనుచరులిద్దరిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు కాగా, వారిని పోలీసులు పట్టుకోకుండా తప్పించే యత్నం కిశోర్ చేశాడని, వారిని పోలీసులు వెంటాడినా పట్టుకోలేకపోయారని, భువనగిరి నుంచి తుంగతుర్తి వరకు పోలీసులు వెంబండించినా ప్రయోజనం లేకుండా పోయిందనే చర్చ అప్పట్లో హల్చల్ సృష్టించింది. వీరు ముగ్గురే కాకుండా నయీమ్‌తో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్న నలుగురైదుగురు నేతలు జిల్లాలో ఉన్నా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ప్రస్తుతానికి ఈ ముగ్గురిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగు తోంది. మరి సీఎం కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుం టారు..? రానున్న రోజుల్లో ఎలాంటి పరిణా మాలు జరుగుతాయన్నది వేచి చూడాల్సిందే. -
విద్యాసాగర్ ఎన్నికపై వేసిన పిటిషన్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ తరఫున కోరుట్ల అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన కె.విద్యాసాగర్ ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్(ఈపీ)ను రాష్ట్ర హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. 2014 ఎన్నికల్లో శివసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన నరేష్కుమార్ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. తనకు కేటాయించిన విల్లు,బాణం గుర్తు ఓటర్లను ఆయోమయానికి గురి చేసిందని, దీని వల్ల తనకు వేయాల్సిన ఓట్లను ప్రజలు విద్యాసాగర్‌కు వేశారని ఆయన ఆరోపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు ఎన్నిక పిటిషన్లో నరేష్కుమార్ చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపలేదంటూ పిటిషన్‌ను కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రేమ పేరుతో మోసగించిన వ్యక్తికి రిమాండ్
బంజారాహిల్స్ : ప్రేమించినట్లు నటించి పెళ్ళి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసం చేయడంతో ఆమె సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కస్తూరిపాడు గ్రామానికి చెందిన సనపాల విద్యాసాగర్(35) పంజగుట్టలో ఓ కన్సల్టేషన్ కార్యాలయం నిర్వహిస్తూ ఇన్ఫోటెక్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న డి.ఉషారాణి(26)ని ప్రేమించాడు. పెళ్ళి చేసుకుంటానని నమ్మించాడు. తీరా మరో యువతిని పెళ్ళి చేసుకోవడంతో ఉషారాణి తీవ్ర మనస్థాపానికి గురై గత నెల 17వ తేదీన బంజారాహిల్స్ రోడ్ నెం. 2 లోని ఇందిరానగర్‌లో ఉన్న తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయే ముందు తాను ప్రేమించిన విద్యాసాగర్ చీటింగ్ వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు, తన సంపాదనంతా వాడుకొని మోసగించినట్లు సూసైడ్ నోట్ రాసింది. దీని ఆధారంగా నిందితుడిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసి పరారీలో ఉన్న విద్యాసాగర్‌ను ఫోన్ సిగ్నల్ ఆధారంగా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్ ఎస్ఐ సంతోషం కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ నలుగురి మధ్య..
ముగ్గురు యువకులు, ఓ యువతి మధ్య ప్రేమకథ -‘నిన్నే కోరుకుంటా’. సందీప్, విజయభాస్కర్, ఆనంద్, పూజిత, సారిక ముఖ్య తారలు. గణమురళి శరగడం దర్శకత్వంలో మరిపి విద్యాసాగర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రణవ్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. అతిథులుగా నిర్మాతలు మల్కాపురం శివకుమార్, రామ సత్యనారాయణ పాల్గొన్నారు. -
కళే శ్వాస..ధ్యాస
ఆయన నాటకంపై మక్కువతో ఆ రంగంలో అడుగుపెట్టారు. పదకొండో ఏటే ఓ నాటక సంఘం స్థాపించి సంచలనం సృష్టించారు. ఈ రంగంలో రాణించడంతో జంద్యాల దృష్టిలో పడి సినీ రంగ ప్రవేశం చేశారు. తనకంటూ పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. నేడు అనారోగ్యం కుంగదీస్తున్నప్పటికీ రంగస్థలంలో దర్శకుడిగా రాణిస్తున్నారు ప్రముఖ రంగస్థల, సినీ నటుడు విద్యాసాగర్. నాటకంపై ఉన్న మమకారంతో తిరుపతిలో జరుగుతున్న నంది నాటకోత్సవాలను తిలకించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో ముఖాముఖి. ప్ర : రంగస్థల ప్రవేశం ఎలా జరిగింది. జ: మా సొంతూరు గుంటూరు. నాకు ఎనిమిదేళ్ల ప్రా యంలో మా ఊళ్లో ఆంధ్ర బాలానందం సంఘం వ్యవస్థాపకుడు రేడియో అన్నయ్య(జ్ఞాపతి రాఘవరావు) చిన్నపిల్లలతో ‘బుజి బుజి రేకుల పిల్లుందా’ మ్యూజికల్ బేరె(డ్రామా) ప్రదర్శన ఇవ్వడానికి వచ్చారు. అందులో నాకో చిన్న పాత్ర దక్కడంతో మొదలైంది రంగస్థల ప్రవేశం. ప్ర: ఏదో సంస్థకు పోటీగా బ్యా నర్ పెట్టారని తెలిసింది. జ : మ్యూజికల్ బేరెలో పెళ్లికొడుకు పాత్ర ఇవ్వమని రేడియో అన్నయ్యను అడిగాను. ఆయన అదిగో ఇదిగో అంటూ ఇవ్వలే దు. దీంతో ఆంధ్రా బాలానందం సంస్థకు పోటీగా నేను 11 ఏటనే శ్రీవెంకటేశ్వర బాలానందం సంఘం స్థాపించాను. మా ఇంటి చుట్టు పక్క ఉన్న పిల్లలతో కలిసి డ్రామాలు వేశాం. రేడియో అన్నయ్య పాత్ర ఇవ్వలేదన్న కసే నన్ను ఇంతవాణ్ణి చేసింది. ప్ర : సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది. జ: 1984లో హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి నాటక పోటీ ల్లో ‘లిఫ్ట్’ అనే నాటికను ప్రదర్శించాం. సినీ దర్శకులు జంద్యాల, ఉషాకిరణ్ మూవీస్ మేనేజర్ అట్లూరు రామారావు ఆ పోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఆ ప్రదర్శనకు విశేష స్పందన రావడంతో జంద్యాల దర్శకత్వంలో ఉషాకిరణ్ మూవీ స్ మొదటి సినిమా ‘శ్రీవారికి ప్రేమలేఖ’లో అవకాశం ఇచ్చారు. ప్ర : కేవలం నటనతోనే సరిపెట్టారా? జ : నా జీవితమనే నాటకంలో బ్యాంకు ఉద్యోగిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, కోడెరైక్టర్‌గా ఇలా పలు పాత్రలు పోషిం చాను. ఇప్పటి వరకు 102 సినిమాల్లో నటించాను. ఎస్వీ కృష్ణారెడ్డి డెరైక్షన్‌లో బాలకృష్ణ నటించిన టాప్‌హీరో నా ఆఖరు సినిమా. దర్శకుడిగా అవకాశం వచ్చే సమయంలో 1994లో పక్షవాతం రావడంతో సినీ రంగానికి దూరమయ్యాను. అయితే మాతృరంగాన్ని మాత్రం వీడలేదు. ప్ర : నేటి రంగస్థల నటులకు మీ సూచనలు? జ : ఒకప్పట్లో టీవీ వంటి మాధ్యమాలు లేకపోవడంతో నాటక రంగానికి విశేషాదరణ ఉండే ది. దీంతో నాటకమే ఊపిరి, శ్వాసగా జీవించేవాళ్లు. అయితే ఇప్పుడు కొత్తగా నటనారంగంలోకి వస్తున్న వారికి కమిట్మెంట్ కొరవడింది. వచ్చిన రెండ్రోజులకే నంది అవార్డు వస్తుందా? సినిమా, టీవీలో అవకాశాలు ఇప్పిస్తారా? అని అడుగుతున్నారు. ఏదైనా ఒక కళను నమ్ముకుంటే అదే శ్వాస, ధ్యాస కావాలి. అప్పుడే ఆ కళలో గుర్తింపుతోపాటు అగ్రస్థానం దక్కుతుంది. -
విద్యాసాగర్ తాత్కాలికంగా ఏపీలోనే: క్యాట్
సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ అధికారి విద్యాసాగర్‌ను తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకూ ఆంధ్రప్రదేశ్ క్యాడర్లోనే కొనసాగించాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్(క్యాట్) ఆదేశించింది. ఈ మేరకు కేంద్రానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వం గత నెల 10న తనను తెలంగాణకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ఏపీ గిరిజన శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న విద్యాసాగర్ దాఖలు చేసిన పిటిషన్‌ను క్యాట్ సభ్యులు బీవీ రావు, రంజనా చౌదరిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారిం చింది. ప్రత్యూష్‌సిన్హా కమిటీ మార్గదర్శకాల ప్రకారం ఏపీ క్యాడర్లోనే కొనసాగిం చాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వై.శ్రీనివాసమూర్తి వాదనలు వినిపించారు. -
తమ్మిడి కుంట సర్వే పూర్తి
రెండు రోజుల్లో సర్కార్‌కు నివేదిక ఎఫ్టీఎల్ నిర్ధారించనున్న ఇరిగేషన్, సర్వే రికార్డ్స్ అధికారులు గచ్చిబౌలి: ఖానామెట్ సర్వే నంబర్ 36లోని తమ్మిడి కుంట సర్వే రెండో రోజైన శనివారం కూడా కొనసాగింది. రెవెన్యూ, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, ల్యాం డ్ రికార్డ్స్ అధికారులు కుంట పక్కనే గల ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్లోనే ఎక్కువ సమయం సర్వే జరిపారు. సర్వే పూర్త చేసిన అధికారులు ప్రభుత్వానికి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డెరైక్టర్ నరహరి, శేరిలింగంపల్లి సర్వేయర్ మధుసూదన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులు ఈ సర్వేలో పాల్గొన్నారు. శిల్పారామానికి కేటాయించిన స్థలంపై దృష్టి తమ్మిడికుంట ఎఫ్టీఎల్లో గతంలో శిల్పారామం పార్కింగ్ కోసం రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఆ ప్రాంతాన్ని బండ రాళ్లతో పూడ్చిన శిల్పారామం అధికారులు అక్కడ పనిచేసే వారి నివాసానికి కేటాయించారు. సర్వే చేసిన అధికారులు శిల్పారామానికి కేటాయించిన స్థలం ఎంతవరకు ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందో తేల్చనున్నారు. రెండు రోజుల్లో నివేదిక: తహశీల్దార్ ఫీల్డ్ సర్వే పూర్తయినప్పటికీ మంగళవారం నాటికి నివేదిక రూపొందించే అవకాశం ఉందని శేరిలింగంపల్లి తహశీల్దార్ విద్యాసాగర్ తెలిపారు. ఎఫ్టీఎల్ను నిర్ధారిస్తే బఫర్ జోన్ తెలిసిపోతుందన్నారు. ఆక్రమణలుంటే చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. -
అమ్మకు నమస్కారం...
నవమాసాలు మోసి పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు... ఆ బిడ్డలనే తమ పంచప్రాణాలుగా భావించుకున్నారు... అయితే ఆ ఆనందం ఎంతోసేపు నిలబడలేదు... ఆ బిడ్డలకు పంచేంద్రియాలు పనిచేయవని తెలుసుకున్నారు... అయినప్పటికీ ఏ మాత్రం దిగాలు పడిపోలేదు... జన్మనిస్తే సరిపోదు... వారికి జీవితాన్ని కూడా ఇవ్వాలి అనుకున్నారు... వారిలోని ప్రత్యేక ప్రతిభను వెలికి తీశారు... స్వయం ఉపాధితో వారు తలెత్తుకునేలా తీర్చిదిద్దారు... ఆ బిడ్డలకు పాతిక ముప్ఫై సంవత్సరాలు నిండినా కన్నతల్లులకు మాత్రం ఇంకా చంటిబిడ్డలే... అలాంటి అయిదుగురు పిల్లల్ని అత్యంత సహనంతో సాకుతున్న అయిదుగురు మాతృమూర్తుల కథ ఇది... మానసిక వికలాంగుల కోసం ‘విద్యాసాగర్’ అనే విద్యాసంస్థ ప్రత్యేకంగా పనిచేస్తోంది. ఇందులో చేరిన పిల్లల్లోని మేధాశక్తిని వెలికి తీసేందుకు ఈ సంస్థ ఎంతో కృషి చేస్తోంది. ఎన్ని అంగవైకల్యాలు ఉన్నా, ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక ప్రత్యేక నైపుణ్యం దాగి ఉంటుందని ఈ సంస్థ విశ్వాసం. అందుకే ఇక్కడ చేరిన మానసిక వికలాంగులకు వృత్తి విద్యలపై శిక్షణ ఇస్తోంది. ఈ సంగతి తెలిసి, తమిళనాడు నలుమూలల నుండి ప్రత్యేక ప్రతిభావంతులను ఈ విద్యాసంస్థలో చేర్పిస్తున్నారు. అలా పిల్లలను చేర్పించిన వారిలో నలుగురు తల్లులు ఒకరికొకరు పరిచయమయ్యారు. వనజకు లక్ష్మి (30) అనే కుమార్తె, భారతికి విఘ్నేష్ (24), శాంతికి సాయి సంతోష్ (23), కవితకు కార్తిక్ (32) కుమారులు. వీరితో సంతోష్ (30) తండ్రి కుంచితపాదం కూడా కలిశారు. ఈ బిడ్డలు బాగా చదివి ఏదో సాధించాలనే ఆశ వీరికి లేదు. అలాగని వీరిని గాలికి వదిలేయలేరు. మానసిక వికలాంగులైన ఈ బిడ్డలకు ఒక ఉపాధి మార్గం కల్పించాలని ఈ తల్లులంతా కృత నిశ్చయానికి వచ్చారు. ఇందుకోసం అనేక మార్గాలను అన్వేషించారు. ‘‘ఇటువంటి పిల్లలతో ఏమి చేయగలరని మమ్మల్ని కొందరు ఎద్దేవా చేశారు. మేం సాధించాలనుకున్నది అసాధ్యమని కొందరు కొట్టిపారేశారు. తల్లిదండ్రులతో చనువున్నవారైతే ఇటువంటి పిల్లలతో రిస్క్ ఎందుకంటూ తిట్టిపోశారు’’ అని వారు ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని వివరించారు ఆ తల్లులు. కన్నపేగు బంధం వారిలోని పట్టుదలను మరింత బలోపేతం చేసింది. తమ బిడ్డలకు ఇస్తున్న వృత్తి విద్య శిక్షణను తాము కూడా తీసుకున్నారు. దాని నుంచి ‘ఎన్లైటన్ ఎంటర్ప్రైజెస్’ అనే చిన్న ఉత్పత్తుల సంస్థ ఉద్భవించింది. ఈ సంస్థలో రెండేళ్లపాటు శిక్షణ పొందిన వారికి నేషనల్ హాండీక్యాప్డ్ ఫెడరల్ కార్పొరేషన్ సిఫార్సుతో వారి బిడ్డల పేరున సీసీ బ్యాంకు రుణం మంజూరు చేసింది. ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున రూ. 2.50 లక్షల పెట్టుబడితో చెన్నై టి-నగర్లో సంస్థను ప్రారంభించారు. ‘‘అరటిబోదెతో భోజనం ప్లేట్లు, కప్పులు, వివాహాది శుభకార్యాలకు వినియోగించే తాంబూలం బ్యాగులు, కవర్లు, ఎన్వలప్‌లు, శారీ బాక్సులు తయారు చేయడం ప్రారంభించాం. మా బిడ్డల్లోని నైపుణ్యాన్ని బట్టి వారికి తగ్గ బాధ్యతలను అప్పగిస్తున్నాం’’ అంటూ వారు స్థాపించిన సంస్థ గురించి వివరించారు. అరటి బోదెలను నీళ్లతో కడిగి మట్టిని తొలగిస్తాడు సాయిసంతోష్. విఘ్నేష్ వాటిని బ్రష్‌తో శుభ్రం చేస్తాడు. కార్తిక్, సంతోష్లలో ఒకరు అందిస్తుంటే మరొకరు ప్రెస్సింగ్ మిషన్‌ను ఆపరేట్ చేస్తారు. ఇలా ఐదు అంచెలుగా ఈ ప్లేట్లను తయారుచేస్తారు. సంస్థలోని తల్లుల్లో ఒకరు వారికి సహకరిస్తారు. ఇలా తయారైన ఉత్పత్తులను శాంతి, భారతి మార్కెటింగ్ చేస్తారు. ‘‘కొందరు బజారుకు వెళ్లినపుడు మిగతావారి పిల్లలను మా సొంత పిల్లల్లాగ చూసుకుంటాం’’ అని వివరించారు అక్కడి మిగతా తల్లులు. ఇంటి దగ్గర సంసార బాధ్యతలను ఉదయాన్నే పూర్తిచేసుకుని, బిడ్డను తీసుకుని పది గంటలకల్లా యూనిట్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4.30కు పనులు పూర్తిచేసుకుని ఇళ్లకు చేరుకుంటారు. మానసిక చైతన్యం లేని ఐదుగురిని అదుపు చేయడం మహా కష్టం. ప్రతి ఒక్కరినీ కుర్చీలకు వేసి కట్టేయాల్సిందే. పాతికేళ్లు పైబడిన వారంతా పసిబిడ్డల్లా కోరే బొమ్మలు, ఆట వస్తువులు కొనివ్వాల్సిందే. ‘‘మా సంస్థ కార్యకలాపాలతో ఈ ఐదుగురు బిడ్డలూ ఒకే తల్లి బిడ్డల్లా కలిసిపోయారు. మేమంతా అక్కాచెల్లెళ్లుగా మారిపోయాం. మన కర్మ అని కుంగిపోకుండా ముందుకు సాగిపోతున్నాం’’ అంటున్న వీరు సమాజంలో ఆదర్శ తల్లులుగా నిలిచిపోతారనడంలో సందేహమే లేదు. భవిష్యత్తుకు బాటలు కడుపున పుట్టిన పిల్లల భవిష్యత్తుకు తగిన రీతిలో బాటలు వేసే ప్రయత్నం చేస్తున్నాం. వ్యాపారంలో వచ్చిన మొత్తంలో ముందుగా ఒక్కో రుణ వాయిదా కింద రూ.1,400 చొప్పున చెల్లించి, మిగిలిన లాభాన్ని ఐదు సమానభాగాలు చేసి వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నాం. 2012 ఏప్రిల్‌లో తీసుకున్న రుణం మూడేళ్లలో అంటే 2015కు తీరిపోతుంది. అప్పు తీరిపోతే పడిన శ్రమకు మరింత ఫలితం దక్కే అవకాశం ఉంది. అయితే మా ఉత్పత్తులను నిలకడగా కొనుగోలు చేసే వారు లేక ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతమవుతున్నాం. ప్రతినెలా వాయిదాలకు సరిపడా సొమ్ము కోసం మేమంతా పాకులాడక తప్పడం లేదు. మనిషి ఎదుగుతున్నా మనసు ఎదగని మా పిల్లల భవిష్యత్తు కోసం ఎంతైనా శ్రమించేందుకు మేం సిద్ధం. - శాంతి ‘సాక్షి’కి హాయ్ సంతోష్ ప్రత్యేకమైన పరిభాషలో ప్లస్ ఐఐ ఉత్తీర్ణుడయ్యాడు. మిగతా వారితో పోల్చుకుంటే కొంత మెరుగ్గా వ్యవహరించగలడు. తల్లుల హావభావాల ద్వారా ఎవరో వచ్చి తమ కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటున్నట్లు లీలగా గుర్తిస్తాడు. అందరికీ ఫోటోలు తీసి తల్లులతో ఇంటర్వ్యూను ముగించుకుని వెళుతున్న సాక్షి బృందానికి ఒక ప్లాస్టిక్ పలకపై ఉన్న ఏబీసీడీల వరుసలో వేలితో స్పెల్లింగ్ చూపుతూ థ్యాంక్యూ చెప్పాడు. ‘హెచ్ఐ’ అక్షరాలను చూపాడు. - కొట్రా నందగోపాల్, బ్యూరో ఇన్చార్జ్, చెన్నై ఫోటోలు: వన్నె శ్రీనివాసులు -
ప్రజల కోసమే పనిచేయాలి
ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు ఈడుపుగల్లు (కంకిపాడు) : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందని ఏపీ ఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీ. అశోక్‌బాబు పిలుపునిచ్చారు. ఏపీ ఎన్జీవోల సంఘం కంకిపాడు తాలూకా యూనిట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈడుపుగల్లులోని శ్రీ వెంకటేశ్వర కల్యాణ మండపంలో సోమవారం రాత్రి జరిగింది. అశోక్‌బాబు హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగటానికి సహకరించిన ప్రజలకు ఉద్యోగులంతా రుణపడి ఉన్నారన్నారు. విభజన ప్రభావం మరో ఇరవై ఏళ్లు ఉంటుందని, అప్పటి వరకూ ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలపై స్పందించి పనిచేయాల్సిన బాధ్యత తమపై ఉందనే విషయాన్ని ఉద్యోగులు గుర్తించాలని సూచించారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగుల అండదండలతోనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్జీవో హోమ్‌కు 5 సెంట్ల స్థలం అందించేందుకు కృషి చేస్తానన్నారు. తోట్లవల్లూరు జెడ్పీటీసీ, వైఎస్సార్సీపీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి మాట్లాడుతూ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రజలు, ప్రజా ప్రతినిధుల హక్కులను గౌరవిస్తూ ప్రజా సమస్యలపై పని చేయాలని సూచించారు. రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంఘం అధ్యక్షుడు తుమ్మలపల్లి హరికృష్ణ, రాష్ట్ర గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు, ఏడీ, డాక్టర్ నగేష్‌బాబు , ఎన్జీవో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, కంకిపాడు జెడ్పీటీసీ గొంది శివరామకృష్ణ ప్రసాద్, ఈడుపుగల్లు, కోలవెన్ను సర్పంచులు షేక్ మాబు సుబాని, తుమ్మల చంద్రశేఖర్, రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి రామ్మోహన్, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు లాం విద్యాసాగర్, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చండ్ర కృష్ణమోహన్ పాల్గొన్నారు. తొలుత కంకిపాడు తాలూకా యూనిట్ కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. -
‘దేశం’ దాడిలో వైఎస్సార్ సీపీ నేత మృతి
పెద్దమోదుగపల్లిగ్రామంలో టీడీపీ నేతల అరాచకం మృతుడు మధుసూదనరావు మాజీ సర్పంచి వివాదం వద్దని సర్ది చెబుతుండగా దాడి వత్సవాయి : టీడీపీ నేతల దాడిలో వైఎస్సార్ సీపీ నాయకుడు ఆదివారం మృతి చెందిన ఘటన మండలంలోని పెద్దమోదుగపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామ మాజీ సర్పంచి కల్యాణం మధుసూదనరావు(61)కు గ్రామ శివారున మామిడితోట ఉంది. అక్కడ ఆయన కుమారుడు విద్యాసాగర్ జేసీబీతో కాలువ తీయిస్తున్నాడు. తోట పక్కన నివాసం ఉంటున్న వారు కట్టెలను తీసి గట్టుపై ఉంచారు. జేసీబీకి అడ్డు వస్తున్నాయి.. వాటిని తీయాలని విద్యాసాగర్ చెప్పారు. ఇది పోరంబోకు స్థలం తియ్యమని చెప్పడానికి నీవెవరు అంటూ అతడిపై దాడికి దిగారు. విషయం తెలుసుకున్న మధుసూదనరావు తోట దగ్గరకు వెళ్లగా, అప్పటికే వివాదం ముదిరింది. ఘర్షణ వద్దని మధుసూదనరావు సర్ది చెబుతుండగా, టీడీపీ నేతలై న గ్రామ ఉప సర్పంచి నందమూరి శ్రీను, రాము, కనగాల గణపతిలు దాడికి దిగారు. ఈ ఘటనలోమధుసూదనరావు అక్కడిక్కడే కుప్పకూలారు. గ్రామస్తులు ఆటోలో జగ్గయ్యపేటలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గ్రామస్తుల ఆందోళన మధుసూదనరావు మృతికి కారకులైన వారిని వెంటనే శిక్షించాలని కోరుతూ జగ్గయ్యపేట మున్సిపల్ కూడలిలో గ్రామస్తులు ఆందోళన చేశారు. నిందితుల్ని అరెస్టు చేస్తామని సీఐ వీరయ్యగౌడ్ హామీతో శాంతించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పేట ప్రభుత్వ వైద్యశాలలో ఉంచారు. మృతుని కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మధుసూదనరావు మృతితో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా ముందస్తుగా పోలీసులు అక్కడ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఉదయభాను పరామర్శ తెలుగుదేశం నాయకుల దౌర్జన్యానికి బలైన గ్రామ మాజీ సర్పంచి మధుసూదనరావు మృతదేహాన్ని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, నియోజవర్గ వైఎస్సార్ సీపీ నాయకులు కనపర్తి శేషగిరిరావు, మారెళ్ల పుల్లారెడ్డి, ఇంటూరి చిన్నా, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎంవీ చలం, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు నంబూరి రవి, చౌడవరపు జగదీష్ తదితరులు వసందర్శించి నివాళులర్పించారు. మధుసూదనరావు మృతికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
అందుకనే ఆయనతో పెళ్లికి ఒప్పుకున్నా!
మీనా నవ్వితే... పూసింది పూసింది పున్నాగ! మీనా మాట్లాడితే... రేపల్లె మళ్లీ మురళి విన్నది! మీనా కవ్విస్తే... ఎన్నెన్నో అందాలు.. ఏవేవో రాగాలు! మీనా కెరీర్లో ఎన్ని హిట్టు పాటలున్నాయో... ఎన్ని హిట్టు సినిమాలున్నాయో... నిజంగా మీనా కెరీర్... ఓ సుందరకాండ! బాలనటిగా మొదలుపెట్టి... దక్షిణాదిలో హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన మీనా పెళ్లి తర్వాత సినిమా కెరీర్‌కు కామా పెట్టారు. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. చాలా రోజుల తర్వాత ‘దృశ్యం’తో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఇక వరుసగా సినిమాలు చేస్తానంటున్న మీనా చెప్పిన సంసారం ముచ్చట్లు, కెరీర్ కబుర్లు... పెళ్లయిన తర్వాత సినిమాలు చేయడం చాలా తగ్గించేశారు... ఎందుకని? మీనా: దాదాపు మూడు, నాలుగేళ్లు మాత్రమే సినిమాలు చేయలేదు. ఆ నాలుగేళ్లూ మావారే నాకు మంచి కంపెనీ. రోజులు ఎలా గడిచిపోయాయో తెలియలేదు. ఏది నచ్చితే అది చేసేంత తీరిక. నిజం చెప్పాలంటే నేను జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టింది పెళ్లి తర్వాతే. అప్పటివరకు పరిగెత్తి పరిగెత్తి సినిమాలు చేశాను. దాంతో పెళ్లి తర్వాత రిలీఫ్‌గా అనిపించింది. మీ శ్రీవారి గురించి చెబుతారా? మీనా: మావారి పేరు విద్యాసాగర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా ఇద్దరి మనస్తత్వాలూ ఒకటే. నాకు సరదాగా ఉండటం ఇష్టం. ఆయనకు కూడా అంతే. అయితే నాకన్నా నాలెడ్జబుల్ పర్సన్. నాకు తెలియని ఎన్నో విషయాలను ఆసక్తిగా చెబుతుంటారు. ఆయన దగ్గర నాకు నచ్చిన విషయాల్లో అదొకటి. మీది ప్రేమ వివాహమా? మీనా: అదేం కాదు కానీ, ఇద్దరికీ ముందే పరిచయం ఉంది. ఇద్దరి కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిశాం. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్లం. అయితే, పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. ఆ సమయంలో మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మా అమ్మే ఆయన ప్రస్తావన తీసుకొచ్చింది. ఆయ నను వద్దనుకోవడానికి కారణాలేవీ కనిపించలేదు. అందుకని ఒప్పుకున్నా. పెళ్లి తర్వాత మీ జీవితంలో ఏమైనా మార్పులొచ్చాయా? మీనా: మార్పంటే.. నాకు నేనుగా కొన్ని నిబంధనలు పెట్టుకున్నాను. ఒక దశ తర్వాత మన ప్రాధాన్యతలేంటో మనకు తెలిసిపోతాయ్. అలాగే, సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్త వహిస్తున్నా. బయటకు నేను పెద్ద స్టార్‌ను కావచ్చు. ఇంట్లో మాత్రం సాదాసీదా అమ్మాయినే. భార్యగా, తల్లిగా మిగతా ఆడవాళ్లు తమ బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తారో నేనూ అంతే. పదిహేను, ఇరవయ్యేళ్లు బిజీగా సినిమాలు చేశారు కదా.. ఒక్కసారిగా ‘జాబ్ లెస్’ గా ఉండడం బాధగా అనిపించలేదా? మీనా: మొదట్లో అంత తీరిక బాగానే ఉన్నా, ఆ తర్వాత మాత్రం ఏదో ఒక వ్యాపకం లేకుండా ఉండలేం అనిపించింది. నా భర్త, పాపకు తగిన సమయం కేటాయిస్తూనే, అడపా దడపా సినిమాలు చేయాలనుకున్నాను. భార్య, తల్లి... బాధ్యతలు ఎలా అనిపిస్తున్నాయి? మీనా: చెప్పాలంటే పెళ్లయిన తర్వాత బాధ్యతలు పెరిగాయి. జీవితం గురించి బోల్డన్ని విషయాలు తెలిశాయి. ఇక, అమ్మ అయిన తర్వాత అయితే జీవితం ఇంకా అద్భుతంగా ఉంది. మా పాప పేరు నైనిక. పాపకు మూడేళ్లు వచ్చేశాయి. మాటలు రాకముందు తనెందుకు ఏడుస్తుందో తెలియక సతమతమయ్యేదాన్ని. ఇప్పుడు ఫరవాలేదు. ఇవన్నీ చూశాక, నన్ను పెంచడానికి మా అమ్మ ఎంత కష్టపడి ఉంటుందో అనిపించింది. ‘నేను కరెక్ట్‌గానే పెంచుతున్నానా’ అని అమ్మను చీటికీ మాటికీ అడుగుతుంటాను. పాపకు ఏం తినిపించాలి? ఎలాంటి దుస్తులు వేయాలి.. ఇలా అన్ని విషయాల్లోనూ నాకు టెన్షనే. షూటింగ్స్‌లో పాల్గొంటున్నప్పుడు మీ అమ్మాయిని మిస్ అయిన ఫీలింగ్ కలగదా.. మిమ్మల్ని సినిమాల్లో చూసి తనెలా స్పందిస్తుంది? మీనా: నాతో పాటు షూటింగ్స్‌కు తీసుకెళ్లిపోతుంటాను. ఒకవేళ ఇంట్లో వదిలి వెళితే నాకు మనశ్శాంతిగా ఉండదు. టీవీలో నా సినిమాలొస్తే ‘అమ్మా... నువ్వే’ అని గుర్తుపడుతోంది. నేను విడిగా బయటికెళ్లినప్పుడు అందరూ గుర్తుపట్టి, ‘హాయ్ మీనాగారు’ అని పలకరిస్తారు. అప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. కానీ, నా సొంత కూతురే నన్ను గుర్తుపడితే ఇక ఆ ఆనందం మాటల్లో చెప్పలేనంత. మీ అమ్మా, నాన్నకు మీరొక్కరే కూతురు.. మీకు కూడా అంతేనా? మీనా: (నవ్వుతూ) ఏమోనండి.. ఆ విషయం గురించి ఇప్పుడు ఆలోచించడం లేదు . మీ మాతృభాష తమిళమనీ, కాదు తెలుగు అనీ చాలామంది అంటారు? అసలు మీ మాతృభాష ఏంటి? మీనా: మా అమ్మగారు మలయాళీ. నాన్న గారు తెలుగువారు. నేను పుట్టి, పెరిగింది చెన్నయ్‌లోనే. ఇంట్లో ఎక్కువగా తమిళమే మాట్లాడతాం. మీ కెరీర్ విషయంలో మీ అమ్మా, నాన్న సపోర్ట్ చాలా ఉంది కదా? మీనా: నాకు అన్ని విధాల అండ మా అమ్మే. ఏది ఒప్పో.. ఏది తప్పో వివరించి చెప్పేది. నాన్న సపోర్ట్ లేకపోతే అసలు నా కెరీర్ సాఫీగా సాగేది కాదు. మీ అమ్మా, నాన్నకు మీరొక్కరే అమ్మాయి కాబట్టి, చాలా గారాబంగా పెంచారా? మీనా: ఎక్కడ స్ట్రిక్ట్‌గా ఉండాలో అక్కడ ఉంటారు. మిగతా సమయాల్లో మామూలుగా ఉంటారు. మరి.. మీ మీరెలాంటి మదర్? మీనా: మా అమ్మా, నాన్న నన్ను పెంచినట్లుగానే మా అమ్మాయిని నేను పెంచాలనుకుంటున్నా. అన్ని విషయాలూ నేర్పించి, మంచి గైడ్‌గా ఉండాలన్నది నా కోరిక. మా అమ్మా నాన్న తప్పొప్పులు చెప్పి, ‘నీకేది మంచి అనిపిస్తే అది చెయ్యి’ అనేవారు. మా అమ్మాయి విషయంలో నేనూ అదే చేస్తా. మీ సినిమాల విషయంలో మీ భర్త జోక్యం ఎంతవరకూ ఉంటుంది? మీనా: ఆయన జోక్యం అసలు ఉండదు. ఎందుకంటే, నాకో పది అవకాశాలొస్తే నేనే రెండు, మూడు మినహా ఒప్పుకోవడం లేదు. పాత్రల ఎంపిక పరంగా నేనంత జాగ్రత్తపడుతున్న విషయం ఆయనకు తెలుసు. అందుకే, ఆయన ఇన్వాల్వ్ కారు. ఓకే... ఇటీవల విడుదలైన ‘దృశ్యం’ విషయానికొద్దాం... మలయాళంలో మీరే చేసిన పాత్రను మళ్ళీ తెలుగులో చేసినప్పుడు ఎలా అనిపించింది? మీనా: మలయాళ సినిమా అంతా అయ్యాక చూసినప్పుడు ‘ఇది బాగుంది కానీ, ఇంకా బెటర్‌గా చేసుండొచ్చు’ అనుకున్నా. ఇప్పుడు మళ్లీ తెలుగులో అదే పాత్ర చేస్తూ, ఆ బెటర్మెంట్ ఉండేలా చూసుకున్నాను. గతంలో వెంకటేశ్‌తో ‘చంటి’, ఆ తర్వాత చాలా సినిమాలు చేశారు. చాలా విరామం తర్వాత మళ్లీ ఆయనతో సినిమా చేయడం పట్ల మీ ఫీలింగ్? మీనా: వెంకీగారితో మళ్లీ యాక్ట్ చేయడం ఆనందం అనిపించింది. షూటింగ్ అంతా కూల్‌గా సాగింది. అయితే గతంలో నేనాయనతో సినిమాలు చేసినప్పుడు పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. అప్పట్లో నేను మితభాషిని. ఇప్పుడు చాలా మారాను. మితభాషిని అన్నారు... ఎందుకని? మీనా: మద్రాసులోనే పెరిగినందువల్ల తెలుగు సరిగ్గా వచ్చేది కాదు. ఒకటి మాట్లాడబోయి ఇంకోటి మాట్లాడితే.. ఎవరి మనసైనా నొచ్చుకుంటుందేమో... అపార్థం చేసుకుంటారేమోనని భయం. కొంచెం అమాయకంగా కూడా ఉండేదాన్ని.. అభద్రతాభావం ఉండేది. అందుకని నా పనేంటో నేనేంటో అన్నట్లుగా ఉండేదాన్ని. కలుపుగోలుగా ఉంటే, అడ్వాంటేజ్ తీసుకుంటారేమోనని భయం. దాంతో పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. దానివల్ల ‘మీనాకు తలబిరుసుతనం’ అన్నవాళ్లు ఉన్నారు. వరుసగా సినిమాలు చేయడం మొదలుపెట్టాక నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎలాంటి పరిస్థితిని అయినా అధిగమించగలననే ధైర్యం ఏర్పడింది. ఆ తర్వాత కొంచెం మాట్లాడడం మొదలుపెట్టాను. చిన్నప్పటి నుంచీ ఈ రంగంలో ఉన్నారు. ఏదైనా పశ్చాత్తాపపడాల్సిన సంఘటనలున్నాయా? మీనా: వ్యక్తిగతంగా ఏమీ లేవు. కానీ, డేట్స్ అడ్జస్ట్ చేయలేక కొన్ని మంచి సినిమాలు వదులుకున్నాను. అది మాత్రం ఎప్పటికీ బాధగా ఉంటుంది. నేను వదులుకున్న సినిమాల్లో ‘నరసింహ’లో రమ్యకృష్ణ చేసిన నీలాంబరి పాత్ర ఒకటి. ఆ సినిమా అప్పుడు రజనీకాంత్ సార్ ఫోన్ చేసి, ‘నువ్వు చేస్తున్నావ్.. కంగ్రాట్స్’ అన్నారు. మా అమ్మకు ఆ పాత్ర అంత సంతృప్తిగా అనిపించలేదు. డేట్సూ లేవు. కారణాలేవైనా ఓ మంచి పాత్ర వదులుకున్నా. చైల్డ్ ఆర్టిస్ట్‌గా నన్ను శివాజీ గణేశన్గారే పరిచయం చేశారు. ‘నరసింహ’లో ఆయన నటించిన విషయం తెలిసిందే. ఒకవైపు శివాజీ సార్, మరోవైపు రజనీ సార్ నటించిన సినిమాను వదులుకున్నందుకు ఇప్పటికీ బాధపడుతుంటా. అలాగే, కృష్ణవంశీ కంటిన్యూస్‌గా రెండు నెలలు డేట్స్ అడగడంతో ‘నిన్నే పెళ్లాడతా’ మిస్సయ్యా. అప్పుడు నాలుగు భాషల్లో సినిమాలు చేయడం వల్ల ఒక సినిమాకు వరుసగా 20 రోజులు డేట్స్ ఇవ్వడమే గగనంగా ఉండేది. అలాంటిది 2 నెలలా అని ఆలోచనలోపడ్డాను. కరెక్ట్‌గా ప్లాన్ చేసి చెప్పమని కృష్ణవంశీని అడిగితే ‘కరెక్ట్‌గా ప్లాన్ చేసే చెబుతున్నా.. రెండు నెలలు కావాల్సిందే’ అన్నారు. దాంతో వదులుకోక తప్పలేదు. రజనీకాంత్‌తో బాలనటిగా చేసి, ఆయన పక్కనే హీరోయిన్గా చేశారు కదా.. ఎలా అనిపించింది? మీనా: రజనీ సార్‌తో తమిళంలో ‘అన్బుళ్ల రజనీకాంత్’ సినిమా చేసినప్పుడు ఆయన నన్ను ఒళ్లో కూర్చోబెట్టుకుని ముద్దు చేసేవారు. నాకు బాగా నిద్ర వచ్చినప్పుడు, జో కొట్టేవారు కూడా. ఇక, నేను హీరోయిన్గా చేయడం మొదలుపెట్టిన తర్వాత దర్శకుడు ఆర్.వి. ఉదయ్‌కుమార్ ఒక కథ చెప్పి, రజనీగారి పక్కన యాక్ట్ చేయాలన్నారు. జోక్ చేస్తున్నారేమో అనుకున్నా. కానీ, ఆయన సీరియస్‌గానే చెబుతున్నారని తెలుసుకుని, ‘అసలు రజనీ సార్ నాతో చేస్తారా’ అన్నాను. కానీ, రజనీ సార్ కూడా చేస్తానన్నారట. వాస్తవానికి ఉదయ్‌కుమార్‌గారు ఆ సినిమాకు అడిగినప్పుడు, నేను తెలుగులో ఫుల్ బిజీ. పైగా, ఉదయ్‌కుమార్‌గారు అడిగిన డేట్స్ కమల్ హాసన్‌గారి సినిమాకిచ్చాను. అందుకని, ‘ఇది జరగదులే’ అనుకున్నాను. ఓ రోజు ఏవీయం శరవణన్‌గారు ఫోన్ చేసి, ‘ఈ సినిమా చేయాలి’ అన్నారు. ఎలాగోలా డేట్స్ అడ్జస్ట్ చేసి ఇచ్చాను. అదే ‘ముత్తు’ సినిమా. మొదటిరోజు షూటింగ్ అప్పుడు రజనీ సార్‌తో ‘ఏం మాట్లాడాలి.. ఎలా మెలగాలి’ అని సతమతమయ్యాను. సూపర్‌స్టార్ పక్కన చేస్తున్నామన్న థ్రిల్ ఓ వైపు.. భయం మరోవైపు.. ఇలా చాలా కన్ఫ్యూజ్డ్గా ఉండేదాన్ని. కొన్నిరోజుల తర్వాత అడ్జస్ట్ అయ్యాను. శివాజీ గణేశన్‌తో బాలనటిగా చేశారు కదా.. ఆ అనుభవాలు గుర్తున్నాయా? మీనా: తమిళ సినిమా ‘నెంజంగళ్’ అది. శివాజీ సార్ చుట్టూ, నా చుట్టూనే ఆ సినిమా తిరుగుతుంది. అప్పుడు నా వయసు మూడున్నరేళ్లు ఉంటుందేమో. అసలు సినిమా అంటే ఏంటో తెలియదు. డైలాగ్స్ నేర్పించేవారు.. చెప్పేసేదాన్ని. ఈ షూటింగ్ అప్పుడు నాకు బాగా గుర్తున్న విషయం ఒకటి చెబుతాను. లంచ్ టైమ్‌లో శివాజీ సార్ గదికి వెళ్లిపోయేదాన్ని. ఎందుకంటే, ఆయనకు ఇంటి నుంచి చికెన్ 65 లాంటి వెరైటీలు వచ్చేవి. వాటి కోసం వెళ్లిపోయేదాన్ని. మా అమ్మేమో ‘రోజూ వెళితే బాగుండదు’ అని మందలించేది. దాంతో ఎప్పుడైనా ఒక రోజు వెళ్లకపోతే... శివాజీ సారే ‘ఏంటీ ఇవ్వాళ్ల రాలేదు.. రారా.. కలిసి భోంచేద్దాం’ అని పక్కన కూర్చోబెట్టుకుని, నేను తినేవరకూ ఊరుకునేవారు కాదు. చిన్నప్పుడే సినిమాల్లోకి రావడం వల్ల చదువుకునే తీరిక చిక్కి ఉండేది కాదేమో? మీనా: ప్రైవేట్‌గా ఎం.ఏ హిస్టరీ చేశాను. అమ్మా, నాన్నకు చదువంటే ఇష్టం. వాళ్ల కోరిక తీర్చడం కోసమే చదువుకున్నాను. కానీ, సినిమాలు చేస్తూ, చదవడం అంత సులువు కాదు. ‘కర్తవ్యం’లో చిన్న పాత్ర చేశారు కదా.. వెంటనే హీరోయిన్ ఎలా అయ్యారు? మీనా: ఈతరం ఫిలింస్ పోకూరి బాబురావుగారు ఏదో సినిమాకి హీరోయిన్ కోసం వెతుకుతున్నారని తెలిసింది. నేను వెళితే స్క్రీన్ టెస్ట్ చేసి, తీసుకున్నారు. అలా హీరోయిన్గా తెలుగులో ‘నవయుగం’ నా తొలి సినిమా. మీ కెరీర్లో కీలకంగా నిలిచిన ‘సీతారామయ్యగారి మనవరాలు’ జ్ఞాపకాలు...? మీనా: ముందు ఆ సినిమా చేయకూడదనుకున్నా. ఎందుకంటే అంతకుముందు చేసిన ‘నవయుగం’ పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత చేసిన ‘ప్రజల మనిషి’ కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దాంతో ఇక చదువుకుందామనుకున్నాను. అమ్మా, నాన్న కూడా అదే మంచిదనుకున్నారు. అప్పుడు హరిగారని ఓ అసిస్టెంట్ డెరైక్టర్ వచ్చి, క్రాంతికుమార్‌గారు ఓ సినిమా చేయాలనుకుంటున్నారని, నన్ను తీసుకోవాలనుకుంటున్నారని చెప్పారు. మాకు ఇంట్రస్ట్ లేదని అమ్మ చెప్పింది. ‘ఈ ఒక్క సినిమా ట్రై చేయండి. చాలా మంచి కేరెక్టర్. ఓ తాత, మనవరాలి కాంబినేషన్లో జరిగే కథ. మీకు క్రాంతికుమార్‌గారి గురించి తెలియడం లేదు. చాలా గొప్ప డెరైక్టర్’ అన్నారు. సరేనని వెళ్లాం. కొద్దిగా మేకప్ వేసి, ఆ తర్వాత మేకప్ లేకుండా ఫొటోషూట్ చేసి, ఓకే అన్నారు. ‘అయ్యో.. ఓకే అయ్యిందా’ అనుకున్నా. కట్ చేస్తే ఆ సినిమా బాగా ఆడడం, నేను 200 చిత్రాల దాకా చేయడం జరిగిపోయాయి. ఆ సినిమా సమయంలో అక్కినేని నాగేశ్వరరావుగారు సలహాలిచ్చేవారా? మీనా: ‘మనం ఎవరి కోసమైనా వెయిట్ చేయొచ్చు.. మన కోసం ఎవరూ వెయిట్ చేయకూడదు’ అని ఏయన్నార్ గారు చెప్పారు. ఆయన నాకిచ్చిన మొదటి సలహా అది. ఆ సినిమా విడుదలైన తర్వాత... ‘లొకేషన్లో నువ్వు యాక్ట్ చేసినప్పుడు అంతగా అనిపించలేదు. కానీ, సినిమాలో చూస్తే చాలా బాగానే యాక్ట్ చేశావ్ అనిపించింది’ అని మెచ్చుకున్నారు. చివరిసారిగా నాగేశ్వరరావు గారిని ఎప్పుడు కలిశారు? మీనా: చెన్నైలో గత ఏడాది జరిగిన వందేళ్ల భారతీయ సినిమా పండగకు అన్ని భాషలకు చెందిన వాళ్లూ వచ్చారు. చెన్నైలోనే ఏయన్నార్‌గారి పుట్టినరోజు వేడుక జరిగింది. ఆ వేడుకలో నేనూ పాల్గొన్నా. ఆయనను చూడడం అదే చివరిసారి. ఆయన నటించిన ఆఖరి చిత్రం ‘మనం’ ఇటీవల చూసినప్పుడు, కొద్దిగా ఎమోషనల్ అయ్యాను. కథానాయికల కెరీర్ తక్కువ కాలం ఉంటుంది కదా. ఆ స్టార్ హోదా నుంచి పక్కకు రావాల్సొచ్చినప్పుడు చాలామంది ఎంతో బాధపడతారు. మరి మీరెలా? మీనా: కథానాయికల కెరీర్ చాలా తక్కువ కాలమని నాకు తెలుసు. అయినప్పటికీ నేను పది, పదిహేనేళ్లు చేయగలిగాను. ఉన్నంతవరకూ మంచి సినిమాలు చేయగలిగాను. మొత్తం నాలుగు భాషల్లోనూ 200కి పైగా సినిమాలు చేశాను. ఇక, ఇంతకన్నా ఏం కావాలి? దక్షిణాది భాషల్లో స్టార్ హీరోలందరి సరసన చేశారు కదా.. అప్పట్లో ఎలా అనిపించింది? మీనా: అసలా ఫేమ్‌ను గ్రహించే తీరిక ఉండేది కాదు. ఇంత పెద్ద స్టార్స్‌తో చేస్తున్నాం, ఇన్ని మంచి పాత్రలు చేస్తున్నాం అని ఎప్పుడూ ఆలోచించలేదు. వరుసగా సినిమాలు చేయడం, చేయబోయే సినిమాల కథలు వినడంతోనే సరిపోయేది. పెళ్లయిన తర్వాతే నా కెరీర్ వైభవం గురించి ఆలోచించే తీరిక చిక్కింది. అది కూడా ఎక్కడైనా బయటికెళ్లినప్పుడు ‘సినిమాలు ఎందుకు మానేశారు? మిమ్మల్ని చాలా మిస్సవుతున్నాం’ అని అందరూ అంటున్నప్పుడు, ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి, చేసిన సినిమాలను గుర్తు చేసుకుంటుంటాను. మీనాకు తలబిరుసుతనం అనే వ్యాఖ్యలు విని, బాధపడేవారా? మీనా: మొదట్లో నాకు తెలియలేదు. ఆ తర్వాత తర్వాత తెలిసింది. ‘మన గురించి ఎందుకలా అనుకుంటున్నారు’ అని ఆలోచించేదాన్ని. ఆ తర్వాత తేలికగా తీసుకునేదాన్ని. మనమేంటో మనకూ, మన కుటుంబానికీ తెలుసు. బయటివాళ్లకు తెలియకపోతే ఏంటిలే అనుకునేదాన్ని. కానీ, నాతో ఫ్రెండ్స్ అయిన తర్వాత ‘మీరింత స్వీట్ పర్సనా? చాలా బాగా మాట్లాడుతున్నారే. కానీ, మీ గురించి మేం వేరేలా అనుకున్నాం’ అనేవారు. పోనీలే.. ఇప్పుడైనా తెలుసుకున్నారు కదా అనేదాన్ని. ఒకప్పుడు స్లిమ్‌గా ఉండేవారు... ఇప్పుడలా ఉండాలనుకోవడం లేదా? మీనా: పాప పుట్టిన తర్వాత బరువు పెరిగాను. మావారైతే నా బరువు గురించి ఆటపట్టిస్తుంటారు. మా పాప అన్నప్రాసన గుళ్లో చేస్తే, ఆ ఫొటోలు బయటికొచ్చాయి. అప్పుడు నేనింకా లావుగా ఉండేదాన్ని. పాప పుట్టిన తర్వాత నా గురించి నేను ఆలోచించడం మానేశాను. ఇప్పుడు మా నైనికకు మూడేళ్లు వచ్చేశాయ్. మాటలు వచ్చేశాయ్ కాబట్టి, తనకేం కావాలో చెబుతోంది. అందుకని టెన్షన్ తగ్గింది. ఇక, ఇప్పుడు నా గురించి కూడా ఆలోచించడం మొదలుపెడతా. - డి.జి. భవాని -
రెచ్చగొట్టడం సరికాదు
కేసీఆర్ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి పశ్చిమకృష్ణా ఎన్జీవోల సంఘం విజయవాడ, న్యూస్‌లైన్ : సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాల్సిందే అంటూ టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని ఎన్జీవోల సంఘం పశ్చిమకృష్ణా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత సీమాంధ్రుల ప్రయోజనాలు కాపాడతామంటూ ఎన్నికల ముందు చెప్పిన కేసీఆర్ ఈ విధంగా మాట్లాడడం తగదన్నారు. స్థానిక ఎన్జీవో హోంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో విద్యాసాగర్ మాట్లాడుతూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. అంతగా ఉద్యోగులపై ఒత్తిడి తెస్తే ఆంధ్రలో ఉన్న తెలంగాణ ఉద్యోగుల విషయంలోనూ ఇక్కడి ప్రభుత్వం అదే తీరుగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో లక్షలాది ఉద్యోగాలను సీమాంధ్రులు దోచుకుంటున్నారంటూ తప్పుడు ప్రచారం చేశారని గుర్తు చేశారు. తీరా రాష్ట్రం విడిపోయాక ఉద్యోగుల సంఖ్య వందల్లోనే ఉండడంతో అక్కడి ప్రజలను మభ్యపెట్టేందుకు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎన్నికల్లో లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని అక్కడి యువతను మోసగించారని, ఎన్నికల్లో గెలిచాక ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితుల్లోనే సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. సచివాలయంలో ఉన్న ఉద్యోగులంతా తెలంగాణలో జన్మించిన వారేనని విద్యాసాగర్ స్పష్టం చేశారు. ఈ విషయం కేసీఆర్‌కు తెలిసి కూడా అనుచితంగా వ్యవహరిస్తున్నారన్నారు. కేవలం ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి వైదొలిగేందుకు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ నిజస్వరూపం తెలంగాణ ప్రాంత ప్రజలకు, యువతకు అర్థమైందన్నారు. తప్పడు ప్రచారం, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో రాష్ట్ర విభజనకు కారకుడైన కేసీఆర్ ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్నాడన్నారు. లక్ష ఎకరాలకు నీరందిస్తామంటూ కేసీఆర్ చేసిన హామీ నెరవేరే పరిస్థితి కనుచూపుమేరలో లేదన్నారు. సీమాంధ్ర ఉద్యోగుల విషయంలో కేసీఆర్ వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామన్నారు. కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కూడా పెడతామన్నారు. విభజన తర్వాత స్థిరాస్తి పంపకాల్లో సీమాంధ్రకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా అటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కళ్లేపల్లి మధుసూదనరాజు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకుడు శ్రీనివాసరావు, వాసు, సిటీ అధ్యక్షుడు కోనేరు రవి తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయం సేవామార్గం కావాలి
సాక్షి, మచిలీపట్నం : ఆయన పేరు విద్యాసాగర్.. చదివింది బిట్స్పిలానీలో బీఎస్సీ నాటికల్ సైన్స్.. వృత్తిరీత్యా దాదాపు అరవై దేశాల్లో 300ఓడ రేవులను సందర్శించారు. తండ్రి, జెడ్పీ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు ఆకస్మిక మృతితో వ్యాపార రంగానికే పరిమతమై సాఫీగా వెళుతున్న ఆయన జీవన నౌక ఒక్కసారిగా కుదుపునకు గురైంది.. అదే సమయంలో నేనున్నాంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహనరెడ్డి భరోసా ఇచ్చారు. అంతే వ్యాపార రంగం నుంచి అనూహ్యంగా రాజకీయ రంగంలోకి వచ్చారు.. బందరు లోక్‌సభ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వకర్తగా అనతికాలంలోనే ప్రజలతో మమేకమైన డాక్టర్ కేవీఆర్ విద్యాసాగర్ రాజకీయాలు సేవామార్గంగా ఉండాలని గట్టిగా నమ్ముతున్నారు. యువతరం ప్రతినిధిగా రాజకీయాల్లో అరంగేట్రం చేసిన తనకు ఒక ఛాన్స్ ఇస్తే బందరు లోక్‌సభ నియోజకవర్గ భవితను బంగారంలా తీర్చిదిద్దుతానని చెబుతున్నారు. వైఎస్ ఆశయాలను నెరవేర్చే సత్తా ఉన్న జగన్మోహనరెడ్డి అండదండలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి తన తండ్రి కుక్కల నాగేశ్వరరావు కలలను నిజం చేస్తానని విద్యాసాగర్ ధీమాగా చెబుతున్నారు. ఆయనతో సాక్షి ముఖాముఖి.. సాక్షి : అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన మీరెలా ఫీలవుతున్నారు? విద్యాసాగర్ : రాజకీయాలు ఇలా ఉంటాయి.. అలా ఉంటాయని వినేవాడిని. కానీ మా తండ్రి కుక్కల నాగేశ్వరరావు మరణంతో వైఎస్.జగన్మోహనరెడ్డి ఆదరణతో నేను రాజకీయాల్లోకి వచ్చా. దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రోత్సాహం, ప్రజల ఆదరణతో నా తండ్రి రాజకీయాల్లో రాణించారు. వైఎస్.జగన్మోహ నరెడ్డి భరోసాతోనే రాజకీయాల్లోకి వచిన నేను ప్రజలకు వీలైనంత ఎక్కువగా సేవ చేసే అవకాశం ఈ రంగంలో ఉందని గుర్తించా. సాక్షి : బందరు లోక్‌సభ నియోజకవర్గంలో మీరు గుర్తించిన ప్రధాన సమస్యలేమిమిటి? విద్యాసాగర్ : బందరు లోక్‌సభ నియోజకవర్గంలో వనరులకు, మేధస్సుకు, యువశక్తికి లోటులేదు. వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కీలకమైన బందరు పోర్టు ఏర్పాటు, గన్నవరం ఎయిర్‌పోర్టు అభివృద్ధి, ఆక్వా రంగం, వ్యవసాయం వంటి ప్రధానమైన అంశాలపై దృష్టి సారించాల్సి ఉంది. సాక్షి : ఏఏ రంగాలను ప్రధానంగా గుర్తించి అభివృద్ధి చేస్తారు ? విద్యాసాగర్ : ఒక రంగం అని కాదు. ప్రజలందరికీ మేలు కలిగేలా ఇక్కడి వనరులను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చేయాల్సి ఉంది. బందరు పోర్టు ఏర్పాటు, గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయస్థాయిలో తీర్చిదిద్దడం, నరసాపురం, బాపట్ల, రేపల్లే మీదుగా బందరును కలుపుతూ కోస్తా లింక్ రైలు వంటి వాటిని పూర్తి చేస్తే ఈ ప్రాంత రూపురేఖలే మారిపోతాయి. వీటి ఏర్పాటుతోపాటు అంతర్జాతీయ స్థాయి కార్గో హబ్ ఏర్పాటు చేస్తే మన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేసుకునే వీలు కలుగుతుంది. అలాగే కృత్తివెన్ను మండలంలో గోగులేరు వద్ద సుమారు 200కోట్లతో మినీ పోర్టు ఏర్పాటు చేస్తే తీరంలోని మత్స్యకారులకు ఎంతో మేలు కలుగుతుంది. చిన్నిపాటి ఎగుమతి, దిగుమతులు సైతం చేసుకోవచ్చు. మచిలీపట్నంలో ఐటీ మినీ హబ్, పెడనలో కళంకారీ పరిశ్రమకు ఊతమిచ్చేలా టెక్స్టైల్ పార్కు, చినపాండ్రాక, మంగెనపూడి ప్రాంతాల్లో కాస్టిక్ సోడా ప్యాక్టరీలు నిర్మించాల్సి ఉంది. అలాగే పామర్రు-పెనమలూరు ప్రాంతంల్లో బీఎస్సీ అగ్రికల్చరల్, ఇతర ఉన్నత విద్యా కాలేజీలు, గుడివాడలో ఆక్వా రంగానికి ఊతమిచ్చే కాళాశాల, పరిశోధనశాల, ల్యాబలేటరీ వంటి ఎన్నో ఏర్పాటు చేయ్యొచ్చు. ప్రధానంగా అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు, నాగయలంక, ఘంటసాల ప్రాంతాల్లోనూ, బందరులోని మంగెనపూడి తదితర ప్రాంతాలను పర్యాటకంగా తీర్చిదిద్దే సంకల్పంతో ఉన్నా. దీనికితోడు ప్రధానంగా సుమారు 70వేల మందికిపైగా ఉద్యోగం, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా కృషి చేస్తాం. వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా వైఎస్ చేపట్టిన డెల్టా ఆధునికీకరణ పనులు పూర్తి చేయడం, వ్యవసాయ రంగం పురోగతికి అవసరమైన సాంకేతి పరిజ్ఞానం అందించేలా పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తా. సాక్షి : దశాబ్దాల కలగా మారిన బందరు పోర్టు సాధన ఎలా? విద్యాసాగర్ : కోస్తా తీరంలో కీలకమైన మచిలీపట్నంలో బందరు పోర్టు తెస్తే దీని రూపురేఖలే మారిపోతాయి. ఇప్పటికే ఆ దిశగా బందరు మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని విశేష కృషి చేశారు. వైఎస్ హయాంలో బందరు పోర్టు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దురదృష్టవశాత్తు వైఎస్ చనిపోవడంతో పోర్టు అక్కడే ఆగిపోయింది. వందల ఏళ్ల కిత్రం ఒక వెలుగు వెలిగిన బందరు పోర్టుకు గత వైభవం తీసుకొస్తే తీర ప్రాంతంలో ప్రగతి కెరటాలు ఎగుస్తాయి. బందరు పోర్టు సాధించగలనన్న ధీమా నాకుంది. ఎందుకంటే బీఎస్సీ నాటికల్ సైన్స్ చదివిన నేను దాదాపు తొమ్మిదేళ్లలో 60దేశాల్లో 300ఓడ రేవులను సందర్శించా. కొలంబో యూనివర్సిటీ నాకు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. పోర్టు రంగంలో దాదాపు 25ఏళ్ల అనుభవం ఉన్న మా నాన్న కుక్కల నాగేశ్వరరావు నాకు అందించిన విజ్ఞానంతో ఖచ్చితంగా పోర్టు సాధించి ఓడను రప్పించేలా చేయగలనన్న ధృడ సంకల్పం ఉంది. అదే జరిగితే తెలంగాణాకు అతి సమీపంలోని ఓడ రేవుగా బందరు పోర్టు అవుతుంది. ఇదే సమయంలో బందరు పోర్టుకు అనుసంధానంగా కోస్తా జాతీయ రహదారి, గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాధించగలిగితే తెలంగాణలోని హైదరాబాద్ చుట్టుపక్కల విస్తరించిన పరిశోధన సంస్థలు, ఐటీ హబ్‌లు, పరిశ్రమలు, విద్యా సంస్థలు అన్నీ బందరు ప్రాంతానికి తరలిరావల్సిందే. -
వైఎస్సార్ సీపీలోకి విద్యాసాగర్
=హైదరాబాదులో వైఎస్ జగన్ సమక్షంలో చేరిక =బందరు పార్లమెంటు నియోజకవర్గ కన్వీనర్‌గా నియామకం మచిలీపట్నం, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, జెడ్పీ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు కుమారుడు డాక్టర్ కేవీఆర్ విద్యాసాగర్ గురువారం వైఎస్సార్ సీపీలో చేరారు. హైదరాబాదులో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరగా, బందరు పార్లమెంటు నియోజకవర్గ కన్వీనరుగా ఆయన్ని నియమిస్తున్నట్టు అధినేత ప్రకటించారు. దివంగత వైఎస్సార్‌తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా అప్పట్లో కాంగ్రెస్‌లో చేరిన కేఎన్నార్ జెడ్పీ చైర్మన్ పదవిని అధిష్టించి అనతికాలంలోనే జిల్లా రాజకీయాల్లో రాణించిన సంగతి తెలిసిందే. వైఎస్ మరణంతో ఆయన కుటుంబానికి అండగా ఉండేందుకు కేఎన్నార్ పామర్రులో జరిగిన సభలో వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వైఎస్సార్ సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడిగా, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా కుక్కల నాగేశ్వరరావు జిల్లాలో పార్టీ పటిష్టానికి కృషి చేశారు. నవంబరు 21న ఆయన గుండెపోటుతో మృతి చెందటం ఆ పార్టీ శ్రేణులతో పాటు జిల్లా వాసులను ఆవేదనకు గురిచేసింది. నవంబరు 22న వైఎస్ జగన్మోహన్రెడ్డి కోసూరు వచ్చి కేఎన్నార్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అదే సందర్భంలో కేఎన్నార్ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ మేరకు తన తండ్రి ఆశయాలను కొనసాగించాలన్న తలంపుతో కేఎన్నార్ పెద్ద కుమారుడు విద్యాసాగర్ వైఎస్సార్ సీపీలో చేరేందుకు జగన్మోహన్రెడ్డిని కలిసి, హైదరాబాదులోని లోటస్‌పాండ్‌లో అధినేత సమక్షంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, బందరు, గుడివాడ, పెనమలూరు, పామర్రు, పెడన అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు పేర్ని నాని, కొడాలి నాని, పడమట సురేష్‌బాబు, తాతినేని పద్మావతి, ఉప్పులేటి కల్పన, ఉప్పాల రాంప్రసాద్, ఉప్పాల రాము తదితరులు విద్యాసాగర్‌కు వెన్నుదన్నుగా ఉంటామని చెప్పారు. విద్యాసాగర్ మాట్లాడుతూ జిల్లాలో పార్టీకి సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తానని, జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తల అభీష్టం మేరకు నడుచుకుంటానని తెలిపారు. -
ఘనంగా రన్ ఫర్ ఇండియా రన్ ఫర్ యూనిటీ
-
తెలంగాణ ఏర్పాటు మైలురాయి : విద్యాసాగర్
జగిత్యాల, న్యూస్‌లైన్ : తెలంగాణ ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెడితే ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీజేపీ మద్దతు ప్రకటిస్తుందని, ఇది చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని బీజేపీ సీనియర్ నేత సీహెచ్. విద్యాసాగర్‌రావు అన్నారు. శనివారం జగిత్యాలలోని ఎస్సారెస్పీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్ని ఇబ్బందులు తలెత్తినా.. మూడు రాష్ట్రాలు ఇచ్చిన ఘనత బీజేపీదేనన్నారు. 60 ఏళ్ల పోరాట చరిత్ర కలిగిన తెలంగాణను కొత్త రాష్ట్రంగా ఏర్పాటుకు ప్రధాన ప్రతిపక్షంగా తాము పూర్తి స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణకు అనుకూలమని చెప్పి మాటమార్చుతున్న పార్టీలతో వచ్చే ఇబ్బందులేమీ లేవన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అధిష్టానం ఆదేశాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం తగదన్నారు. రాష్ట్ర ఏర్పాటు ప్రారంభమైందని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ స్పష్టంగా చెబుతున్నా.. అడ్డుకునేందుకు ప్రయత్నించడం అవివేకమన్నారు. అసెంబ్లీ తీర్మానంతో లింక్ పెట్టకుండా ఆర్టికల్-3 ప్రకారం పార్లమెంట్లో బిల్లు పెట్టాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రదీఫ్ కుమార్, మోరపల్లి సత్యనారాయణ, బైరినేని అజిత్ కుమార్‌లు ఇతర నాయకులు