‘సూర్యకుమారి ఫ్రెండే.. ఏ సంబంధం లేదు’
విజయవాడ: విజయవాడ నగరంలో కలకలం సృష్టించిన డాక్టర్ కొర్లపాటి సూర్యకుమారి అదృశ్యం కేసులో మిస్టరీ వీడలేదు. ఈ కేసులో పోలీసు విచారణను ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే తనయుడు విద్యాసాగర్‌పై సూర్యకుమారి తల్లిదండ్రులు విజయ్‌కుమార్, మేరిలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె అదృశ్యానికి విద్యాసాగర్ బాధ్యత వహించాలన్నారు. తనకు వివాహం కాలేదని విద్యాసాగర్ సూర్యకుమారిని మభ్యపెట్టాడని, రాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ఆమెతో విద్యాసాగర్ కుటుంబీకులు మాట్లాడారని చెప్పారు.
ఆమె ఎక్కడ ఉందో పోలీసులు తేల్చాలని డిమాండ్ చేశారు. విద్యాసాగర్ ఫోన్‌కు సూర్యకుమారి ఫోన్ నుంచి వచ్చినట్లు చెబుతున్న మెసేజ్‌లు విద్యాసాగర్ సృష్టించాడని తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. తమ కుమార్తె వివాహ సంబంధాలు కూడా చెడగొట్టడంలో విద్యాసాగర్ హస్తం ఉందన్నారు. పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి తమ కుమార్తె ఆచూకీ కనిపెట్టాలని వారు వేడుకుంటున్నారు.
ఆమెతో ఎలాంటి సంబంధం లేదు: విద్యాసాగర్
సూర్యకుమారి మిస్సింగ్ కేసులో ఆమె తల్లిదండ్రులు విద్యాసాగర్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తుండగా ఆమెకు తనకు ఎలాంటి సంబంధం లేదని విద్యాసాగర్ చెప్పారు. పొరపాటున తనకు మెస్సేజ్ పంపించి ఉంటుందని భావిస్తున్నానని అన్నారు. ఢిల్లీ వెళ్లి క్రాష్ కోర్స్ చేయాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నట్లు సూర్యకుమారి తనతో చెప్పిందని ఆయన అన్నారు. ఢిల్లీకి వెళ్లడం ఆమెకు ఇష్టం లేదని, తమ మధ్య ఉంది స్నేహం మాత్రమేనని ఇంకా ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు.