విజయవాడ నగరంలో కలకలం సృష్టించిన డాక్టర్ కొర్లపాటి సూర్యకుమారి అదృశ్యం కేసులో మిస్టరీ వీడలేదు. ఈ కేసులో పోలీసు విచారణను ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే తనయుడు విద్యాసాగర్‌పై సూర్యకుమారి తల్లిదండ్రులు విజయ్‌కుమార్, మేరిలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె అదృశ్యానికి విద్యాసాగర్ బాధ్యత వహించాలన్నారు. తనకు వివాహం కాలేదని విద్యాసాగర్ సూర్యకుమారిని మభ్యపెట్టాడని, రాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ఆమెతో విద్యాసాగర్ కుటుంబీకులు మాట్లాడారని చెప్పారు.