
సాక్షి,హైదరాబాద్: పదోతరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈమేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు ముమ్మరం చేసింది. ఇంటర్మీడియేట్ పరీక్షలు ముగిసే రెండ్రోజుల ముందు టెన్త్ పరీక్షలు ప్రారంభిస్తుండగా...ఈ సారి కూడా అదే తరహాలో పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. వారంలోపు పరీక్షల షెడ్యూల్‌ను ప్రభు త్వ పరీక్షల విభాగంప్రకటించే అవకాశం ఉంది. మార్చి21 నుంచి పరీక్షలు ప్రారంభించే అంశంపై అధికారులు చర్చించినప్పటికీ.. షెడ్యూ ల్‌లో ఒకట్రెండు రోజులు అటుఇటు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్‌ను బోర్డు విడుదల చేసింది.
మార్చి 4 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలను, 5 నుంచి ద్వితీయ సంవత్సర పరీక్షలను ప్రారంభించేలా షెడ్యూలును (టైంటేబుల్) బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ప్రకటించారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇంటర్ జనరల్, వొకేషనల్ విద్యార్థులకు 2020 ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షను జనవరి 28న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, ఎని్వరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను అదే నెల 30న నిర్వహిస్తామని వెల్లడించారు. వొకేషనల్ పరీక్షలకు కూడా ఇవే తేదీలను వర్తింపజేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 9.5 లక్షల మంది హాజరుకానున్నారు.