Public examinations
-
28 నుంచి పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదలైంది. 2024–25లో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 28 నుంచి వచ్చేనెల 11 వరకు ఫీజు చెల్లించాలని ఎస్ఎస్సీ బోర్డు పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్ నామినల్ రోల్స్‌ను సైతం ఈ తేదీల్లోనే సమర్పించాలని సూచించారు. రూ.50 ఆలస్య రుసుంతో నవంబర్ 18 వరకు, రూ.200 ఆలస్య రుసుంతో 25 వరకు, రూ.500 లేట్ ఫీజుతో నవంబర్ 30 వరకు చెల్లించవచ్చని తెలిపారు. ఫీజును bse.ap.gov.inలో స్కూల్ లాగిన్‌లో చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.శిక్షణ, ఉపాధిపై వర్క్షాప్సాక్షి, అమరావతి: యువతకు శిక్షణ ఇచ్చి, మెరుగైన ఉపాధి అందించేలా ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పన, వ్యవస్థాపన అభివృద్ధి సంస్థ (సీడాప్) కృషి చేస్తుందని సంస్థ చైర్మన్ దీపక్ రెడ్డి గుణపాటి తెలిపారు. ఎనిమిది సెక్టార్ల వారితో సీడాప్ కార్యాలయంలో శుక్రవారం యువతకు శిక్షణ, ఉపాధిపై వర్క్‌షాప్ జరిగింది. రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించే వారికి స్కిల్డ్ యువతను అందిస్తామని ఈ సందర్భంగా దీపక్‌రెడ్డి తెలిపారు. -
టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ ఎగ్జామ్స్ విభాగం ఏర్పాట్లు పూర్తిచేసింది. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని వసతులతో 3,473 సెంటర్లను సిద్ధం చేసింది. ప్రధాన పరీక్షలు మార్చి 28వ తేదీతో ముగుస్తాయి. ఆ తర్వాత రెండు రోజులు ఓరియంటల్, ఒకేషనల్ పరీక్షలు ఉంటాయి. కాగా, 2023–24 విద్యా సంవత్సరంలో మొత్తం 6,23,092 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు ఎన్రోల్ చేసుకున్నారు. వీరిలో గత ఏడాది పదో తరగతి ఫెయిలై తిరిగి ప్రవేశం పొందినవారు 1,02,528 మంది ఉన్నారు. ఓరియంటల్ విద్యార్థులు 1,562 మంది ఉన్నారు. కాగా, మొత్తం పదో తరగతి విద్యార్థుల్లో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు ఉన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటలకు పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులను ఉదయం 8.45 నుంచి 9.30 గంటలకు వరకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ప్రత్యేక సందర్భాల్లో మరో 30 నిమిషాల వరకు అంటే ఉదయం 10గంటల వరకు అనుమతిస్తారు. మొత్తం 156 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 682 సిట్టింగ్ స్వాడ్స్‌ను అధికారులు సిద్ధంచేశారు. సమస్యాత్మక పరీక్ష కేంద్రాలను గుర్తించి అక్కడ స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారులు సిట్టింగ్ స్క్వాడ్‌ను నియమిస్తారు. 130కి పైగా కేంద్రాల్లో సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. ‘క్యూఆర్ కోడ్’తో పేపర్ లీకులకు చెక్ పదో తరగతి పరీక్షల్లో మాల్ ప్రాక్ట్రీస్‌కు అవకాశం లేకుండా ఈ ఏడాది ప్రశ్నపత్రాలను ప్రత్యేక టెక్నాలజీతో రూపొందించారు. ప్రతి పేపర్‌పైనా, ప్రతి ప్రశ్నకు క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. దీంతో మాల్ ప్రా్రక్టీస్ చేసినా, పేపర్ లీక్ చేసినా ఆ పేపర్ ఏ జిల్లా, ఏ మండలం, ఏ సెంటర్లో ఏ విద్యార్థికి కేటాయించినది అనేది వెంటనే తెలిసిపోతుంది. మరోవైపు ఇన్విజిలేటర్లు, విద్యాశాఖ అధికారులు, పోలీసులు, నాన్–టీచింగ్ సిబ్బంది, ఏఎన్‌ఎంలతోపాటు పరీక్షల సరళిని పర్యవేక్షించే చీఫ్ ఇన్విజిలేటర్లు కూడా పరీక్షా కేంద్రాలకు సెల్‌ఫోన్ తీసుకువెళ్లకుండా నిషేధించారు. ఎలక్ట్రానిక్ పరికరాలు సైతం ఎవరూ తీసుకువెళ్లకూడదని విద్యాశాఖ పరీక్షల విభాగం స్పష్టంచేసింది. వెబ్ లింక్ ద్వారా పేపర్ సాఫ్ట్ కాపీ మార్చి 31 నుంచి ఏప్రిల్ 8 వరకు స్పాట్ వ్యాల్యూషన్ పూర్తిచేసి అనంతరం ఫలితాలను వెల్లడించనున్నారు. గతంలో రీ కౌంటింగ్, రీ వ్యాల్యూషన్‌కు దరఖాస్తు చేసుకుంటే ఫలితాలు తెలుసుకునేందుకు సంబంధిత పేపర్ ఇచ్చేవారు. ఈ ఏడాది అలాంటి వారికి వెబ్ లింక్ పంపించనున్నారు. సదరు లింక్‌ను ఓపెన్ చేస్తే పేపర్ సాఫ్ట్ కాపీని పొందేలా ఏర్పాట్లు చేశారు. పరీక్షలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం పదో తరగతి పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. విద్యార్థులు పదో తరగతి హాల్‌టికెట్‌ను చూపించి తమ ఇంటి నుంచి పరీక్ష కేంద్రాలకు అల్ట్రా పల్లెవెలుగు, పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా వెళ్లి, రావొచ్చు. ఈ సదుపాయం ఓపెన్ స్కూల్ టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కూడా కల్పించారు. -
ఇంటర్ పరీక్షల నిర్వహణకు కసరత్తు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు బోర్డు చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఆలస్య రుసుంతో సహా ఫీజు చెల్లింపు గడువు ముగిసింది. నామినల్ రోల్స్‌లో తప్పులు సరిదిద్దుకునే గడువు కూడా శనివారంతో పూర్తయ్యింది. బోర్డు పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పేపర్ల మోడరైజేషన్(సెట్టింగ్), పరీక్ష కేంద్రాల ఎంపిక పూర్తి కావడంతో ఇంటర్ బోర్డు అధికారులు పరీక్షల నిర్వహణపై దృష్టి పెట్టారు. 2023–24 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో 10,07,097 మంది విద్యార్థులు ఇంటర్ చదువుతున్నారు. వీరిలో మొదటి ఏడాది 5,29,015 మంది, రెండో ఏడాది 4,75,744 మంది విద్యార్థులున్నారు. గతేడాది పలు సబ్జెక్టులలో ఫెయిలైన 1.48 లక్షల మందిలో దాదాపు 90 వేల మంది వరకు ప్రభుత్వం కల్పించిన ‘రీ అడ్మిషన్’ అవకాశాన్ని వినియోగించుకున్నారు. మరో 53 వేల మంది పరీక్షలకు ఫీజు చెల్లించారు. కాగా, నామినల్ రోల్స్‌లో విద్యార్థుల పేర్లు, తల్లి/తండ్రి పేర్లు, పుట్టిన తేదీ, కులం తదితరాల్లో ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకునే అవకాశాన్ని ఇంటర్ బోర్డు కల్పించింది. శనివారంతో ఈ గడువు కూడా ముగిసింది. ఇంకా తప్పులు సరిదిద్దకుండా నిర్లక్ష్యం వహించిన కాలేజీల ప్రిన్సిపల్స్‌ను బాధ్యులను చేసి, వారిపై చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. విద్యార్థుల సంఖ్యపై స్పష్టత రావడంతో ఇంటర్ బోర్డు పరీక్షల నిర్వహణ అధికారులు.. పరీక్షా కేంద్రాలపై దృష్టి పెట్టారు. గతంలో ప్రాంతీయ పరిశీలన అధికారులు(ఆర్ఐఓ) తమ రీజియన్ పరిధిలో పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసేవారు. ఈ విద్యా సంవత్సరం ఈ బాధ్యతను ఇంటర్మీడియట్ విద్యామండలి పర్యవేక్షిస్తోంది. అనుమతుల కోసం వచ్చిన వాటిలో అన్ని అర్హతలున్న 1,489 జూనియర్ కాలేజీలను కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎంపిక చేసింది. రీజనల్ అధికారులు, జిల్లా విద్యా శాఖ అధికారులు ఆయా కేంద్రాలను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి, నివేదిక సమర్పిస్తారు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ సీసీ కెమెరాలతో నిఘా, తగినంతగా తాగునీటి వనరులు, టాయిలెట్లు తదితరాలను తప్పనిసరి చేశారు. -
వేసవి సెలవుల పొడిగింపు
సాక్షి, చైన్నె: గత విద్యా సంవత్సరం చివరిలో పబ్లిక్ పరీక్షలు ముగిసినానంతరం రాష్ట్రంలో ఏప్రిల్ 28వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ముందుగా నిర్ణయించిన మేరకు జూన్ 1వ తేదీ 8 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలను తెరిచేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే, ఎండల ప్రభావం ఏ మాత్రం తగ్గని దృష్ట్యా, వేసవి సెలవులను జూన్ 7వ తేదీ వరకు పొడిగించారు. అయితే, అనేక ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ ఉత్తర్వులను రాష్ట్రంలో ఖాతరు చేయలేదు. ముందుగా నిర్ణయించినట్టుగా జూన్ ఒకటో తేదీనే పాఠశాలలను రీ ఓపెన్ చేశారు. ఈ సమాచారంతో విద్యాశాఖ అధికారుల ఆగ్రహానికి ప్రైవేటు పాఠశాలలు గురి కావాల్సి వచ్చింది. చివరకు పాఠశాలల పునఃప్రారంభించాల్సిన తేదీ జూన్ 7 అని తెలియజేసే బోర్డులు అన్ని పాఠశాలల ముందూ ప్రత్యక్షమయ్యాయి. అయితే, రాష్ట్రంలో ఎండ వేడిమి ఏమాత్రం తగ్గలేదు. అనేక జిల్లాలో ఆదివారం, సోమవారం 108 ఫారిన్ హిట్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో పాఠశాలల ప్రారంభ తేదీని మార్చాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. విద్యార్థులు క్షేమం కోసం.. నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకేందుకు మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు ఇటీవల వాతావరణ కేంద్రం ప్రకటించింది. అంత వరకు రాష్ట్రంలో అనేక జిల్లాలో ఎండ వేడమి అధికంగానే ఉంటుందని వివరించారు. దీంతో విద్యా శాఖమంత్రి అన్బిల్ మహేశ్ నేతృత్వంలోని అధికారుల బృందం సోమవారం ఉదయం సచివాలయంలో సీఎం స్టాలిన్‌ను కలిశారు. రాష్ట్రంలో ఎండల ప్రభావం గురించి వివరించారు. పాఠశాలలను ఇప్పుడు తెరిచిన పక్షంలో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని, సెలవులను పొడిగించాలని సీఎంను కోరారు. సీఎం స్టాలిన్ ఆమోదించడంతో మరో వారం పాటు సెలవులను పొడిగిస్తూ విద్యా శాఖ మంత్రి అన్భిల్ మహేశ్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ మేరకు 6 నుంచి 12వ తరగతికి ఈనెల 12వ తేదీ పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. అలాగే 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఈనెల 14వ తేదీన పాఠశాలలు తెరుస్తారు. 2023–24 విద్యా సంవత్సరం ప్రారంభం రోజు నుంచే విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఐఏఎస్ అధికారి గజలక్ష్మి నేతృత్వంలోని బృందం సిద్ధం చేసింది. ఇక, ప్రేవేటు విద్యాసంస్థలకు తీవ్ర హెచ్చరికలు చేశారు. ముందుగానే పాఠశాలలను రీ ఓపెనింగ్ చేసిన పక్షంలో ఆయా యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫిర్యాదులు వచ్చిన పక్షంలో సీజ్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వానికి ముఖ్యమని, అందుకే వేసవి సెలవులు వారం రోజులు పొడిగించాల్సి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తమిళనాడుతో పాటుగా పుదుచ్చేరిలోనూ సెలవులు పొడిగించారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఈనెల 14వ తేదీ 1 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు తెరచుకోనున్నాయి. కాగా, ఓ వైపు సెలవులు పొడిగించారో లేదో మరోవైపు చైన్నె, శివారు జిల్లాలో సాయంత్రం వాతావరణం పూర్తిగా మారింది. ఉరుములు మెరుపులతో సోమవారం కాసేపు వర్షం పడడం గమనార్హం. అలాగే, అరుప్పు కోట్టైలో వడగళ్ల వాన పడింది. ఈదురు గాలుల దెబ్బకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అనుకున్నదే అయ్యింది.. సూర్యప్రతాపం కారణంగా వేసవి సెలవులను మరో వారం పాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం విద్యాశాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ఇక ముందస్తుగా పాఠశాలలను తెరిచినా, ప్రత్యేక తరగతుల పేరిట విద్యార్థులను వేధించినా కఠిన చర్యలు తప్పవని ప్రైవేటు విద్యా సంస్థలకు ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్! పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు మేలు జరిగేలా పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా విద్యార్థి పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో నిర్ణీత ప్రశ్నల సంఖ్య కన్నా ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాసి ఉంటే.. వాటిలో ఎక్కువ మార్కులు వచ్చిన సమాధానాన్ని పరిగణనలోకి తీసుకుని ఆ విద్యార్థి మొత్తం మార్కులను నిర్ణయించనున్నారు. తక్కువ మార్కులు వచ్చిన ప్రశ్నల జవాబులను తీసివేయనున్నారు. ఈ మేరకు తాజాగా పాఠశాల విద్యాశాఖ ప్రొసీడింగ్స్ విడుదల చేసింది. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 3నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నెల 18వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. 19 నుంచి మూల్యాంకనం ఈ నెల 19నుంచి 26వ తేదీ వరకు విద్యార్థుల సమాధాన పత్రాల మూల్యాంకన చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మూల్యాంకన ప్రక్రియలో తీసుకోవాలి్సన జాగ్రత్తలపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ పలు మార్గదర్శకాలతో కూడిన ప్రొసీడింగ్స్ జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లా కేంద్రాల్లో (పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, నంద్యాల జిల్లా కేంద్రాలు మినహా) మూల్యాంకనకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం అన్ని జిల్లాల విద్యా శాఖాధికారులకు మార్గదర్శకాలతో కూడిన బుక్లెట్లను కూడా పాఠశాల విద్యాశాఖ అందించింది. ఆయా జిల్లాల్లో మూల్యాంకన కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలన్నిటినీ ఏర్పాటు చేసే బాధ్యతను ఆయా జిల్లాల విద్యా శాఖాధికారులకు అప్పగించింది. మూల్యాంకనం సందర్భంగా అందులో పాల్గొనే సిబ్బంది నిర్వర్తించాల్సిన విధులను తాజా ప్రొసీడింగ్స్‌లో కమిషనర్ వివరించారు. వాటిని తప్పనిసరిగా అమలు చేయాల్సిన బాధ్యత డీఈవోలదేనని స్పష్టం చేశారు. మార్గదర్శకాలు ఇవీ ♦ మూల్యాంకనంలో పాల్గొనే అసిస్టెంట్ ఎగ్జామినర్లు రోజుకు 40 సమాధానాల పత్రాలను మాత్రమే మూల్యాంకన చేయాలి ♦ అసిస్టెంట్ ఎగ్జామినర్లు మూల్యాంకన చేసే సమాధాన పత్రాలన్నిటినీ స్పెషల్ అసిస్టెంట్లు పూర్తిగా పరిశీలన చేసి మార్కులను లెక్కించాలి. ♦ పరీక్ష రాసిన అభ్యర్థి నిర్ణీత సంఖ్యకు మించి ప్రశ్నలకు సమాధానాలు రాశాడా అన్న అంశాన్ని స్పెషల్ అసిస్టెంట్లు గమనించాలి. ♦ ఒకవేళ నిర్ణీత సంఖ్యకు మించి ప్రశ్నలకు సమాధానం రాసి ఉంటే.. వాటిని మూల్యాంకనం చేసి మార్కులు వేశారా? లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలన చేయాలి. ♦ అదనంగా రాసిన ప్రశ్నల సమాధానాలను అసిస్టెంట్ ఎగ్జామినర్ మూల్యాంకన చేసి మార్కులు ఇచ్చినట్టయితే ఎక్కువ మార్కులు వచ్చిన సమాధానాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని విద్యార్థికి నిర్ణీత ప్రశ్నల సంఖ్య మేర మార్కులను కేటాయించాలి. తక్కువ మార్కులు వచ్చిన ప్రశ్నల సమాధానాలను పరిహరించాలి. ♦ అసిస్టెంట్ ఎగ్జామినర్లు మూల్యాంకన చేసిన సమాధాన పత్రాల్లోని కనీసం 20 ఆన్సర్ స్క్రిప్టులను ఆయా కేంద్రాల్లోని చీఫ్ ఎగ్జామినర్లు పరిశీలించాలి. రోజులో మొత్తంగా 60 వరకు ఆన్సర్ స్క్రిప్టులను పరిశీలన చేయాలి. ♦ అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లు మూల్యాంకన పూర్తయిన రెండు సమాధానాల పత్రాలను పరిశీలించాలి. ♦ అసిస్టెంట్ ఎగ్జామినర్లు మూల్యాంకన చేసిన సమాధాన పత్రాల్లో డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్ ప్రతి రోజూ కనిష్టంగా 45 పత్రాలను పరిశీలన చేయాలి. ♦ అసిస్టెంట్ ఎగ్జామినర్లు మూల్యాంకనం చేసిన సమాధాన పత్రాల్లో క్యాంప్ ఆఫీసర్ ప్రతి రోజూ కనిష్టంగా 20 పత్రాలను పరిశీలించాలి. పొరపాట్లు జరిగితే చర్యలే ♦ పరీక్ష ఫలితాల వెల్లడి అనంతరం అభ్యర్థులకు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు అవకాశం, ఫొటోస్టాట్ కాపీలను అందించడం వంటివి ఉన్నందున మూల్యాంకనంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ముందునుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. ♦ రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ల సమయంలో ఏ విధమైన మార్పులు చేయాల్సి వచ్చినా అందుకు వరుసగా స్పెషల్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, చీఫ్ ఎగ్జామినర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ♦ పొరపాట్లు చేసిన వారిపై నిబంధనల ప్రకారం పెనాల్టీ సహా క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటారు. ♦ మూల్యాంకనాన్ని ఎలాంటి పొరపాట్లు, ఇతర అవాంఛిత అంశాలకు తావులేని విధంగా ప్రశాంతంగా ముగించేందుకు డీఈవోలు చర్యలు తీసుకోవాలి. ♦ జిల్లాస్థాయి పరిశీలకులు మూల్యాంకన కేంద్రాలను తొలి రెండు రోజులు తప్పనిసరిగా సందర్శించి తగిన జాగ్రత్తలు తీసుకునేలా చూడాలి. -
మార్చి 21 నుంచి టెన్త్ పరీక్షలు!
సాక్షి,హైదరాబాద్: పదోతరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈమేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు ముమ్మరం చేసింది. ఇంటర్మీడియేట్ పరీక్షలు ముగిసే రెండ్రోజుల ముందు టెన్త్ పరీక్షలు ప్రారంభిస్తుండగా...ఈ సారి కూడా అదే తరహాలో పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. వారంలోపు పరీక్షల షెడ్యూల్‌ను ప్రభు త్వ పరీక్షల విభాగంప్రకటించే అవకాశం ఉంది. మార్చి21 నుంచి పరీక్షలు ప్రారంభించే అంశంపై అధికారులు చర్చించినప్పటికీ.. షెడ్యూ ల్లో ఒకట్రెండు రోజులు అటుఇటు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్‌ను బోర్డు విడుదల చేసింది. మార్చి 4 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలను, 5 నుంచి ద్వితీయ సంవత్సర పరీక్షలను ప్రారంభించేలా షెడ్యూలును (టైంటేబుల్) బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ప్రకటించారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇంటర్ జనరల్, వొకేషనల్ విద్యార్థులకు 2020 ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షను జనవరి 28న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, ఎని్వరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను అదే నెల 30న నిర్వహిస్తామని వెల్లడించారు. వొకేషనల్ పరీక్షలకు కూడా ఇవే తేదీలను వర్తింపజేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 9.5 లక్షల మంది హాజరుకానున్నారు. -
టీచర్ల నెత్తిన ప్రచార కత్తి
►నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ►ఉపాధ్యాయులకు ఇష్టం లేకున్నా తిప్పుతున్న అధికార పార్టీ నేతలు ►తమ అభ్యర్థుల గెలుపుకోసం మరో 24 గంటలు శ్రమించాలని హుకుం జారీ ►పాఠశాలల్లో జన్మభూమి కమిటీలదే పెత్తనం ►దగ్గరపడుతున్న పబ్లిక్ పరీక్షలు ►అయోమయంలో తల్లిదండ్రులు, విద్యార్థులు టీచర్ల నెత్తిన ప్రచార కత్తి వేలాడుతోంది. ఇష్టం ఉన్నా.. లేకపోయినా తమ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాల్సిందేనని అధికార పార్టీ నేతలు హుకుం జారీచేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే నెల రోజులుగా ప్రచారపర్వంలో మునిగితేలిన ఉపాధ్యాయులు మరో 24 గంటలపాటు మరింత శ్రమించాల్సిందేనని సంబంధిత అధికారులు సైతం ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. దగ్గరపడుతున్న పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు సరైన న్యాయం చేయలేక.. అధికారులు, రాజకీయ ఒత్తిళ్లు భరించలేక పలువురు బడిపంతుళ్లు తలలు పట్టుకుంటున్నారు. తిరుపతి ఎడ్యుకేషన్: తూర్పు రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల నియోజకవర్గం పరిధిలో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాతోపాటు చిత్తూరు, ప్రకాశం జిల్లాలున్నాయి. ఈ మూడు జిల్లాల్లో ప్రధాన ఉపాధ్యాయ సంఘాలకు చెందిన నాయకులు, సిట్టింగ్ ఎమ్మెల్సీలు బరిలో ఉన్నారు. ఈనెల 9వ తేదీన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీరి గెలుపునకు ఆయా ఉపాధ్యాయ సంఘాలు, అధికార పార్టీ నేతలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా టీడీపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘం నాయకులు, ఉపాధ్యాయులు బోధన వదిలి ప్రచారబాట పట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రెండింటికీ సంబంధం లేని మరికొన్ని ఉపాధ్యాయ సంఘాలు స్వతంత్ర అభ్యర్థులను బలపరుస్తూ బడికి టాటా చెప్పినట్టు కొందరు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద జిల్లాలో 40నుంచి 60 శాతం మంది ఉపాధ్యాయులు ఎన్నికల్లో తీరిక లేకుండా గడుపుతున్న భోగట్టా. ఇష్టం లేకపోయినా ప్రచారంలోనే ఉండాలట! ఉన్నతాధికారులు, అధికార పార్టీ నేతలు, జన్మభూమి కమిటీల ఆదేశాలతో కొందరు ఉపాధ్యాయులు ఇష్టం లేకపోయినా ప్రచారపర్వాన్ని నెత్తికెత్తుకుని ఆపసోపాలు పడాల్సి వస్తోంది. తమ అభ్యర్థుల విజయానికి సహకరించిన వారికి అన్నివిధాలా పార్టీ అండదండలు ఉంటాయని ఎమ్మెల్యేలు భరోసా ఇస్తున్నట్టు కొందరు ఉపాధ్యాయులే చెబుతున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ఇబ్బందులు, ఒత్తిడులు రాకుండా జన్మభూమి కమిటీలు మేనేజ్ చేస్తున్నాయి. అన్నిరకాలుగా సహకరిస్తుండడంతో కొందరు ఉపాధ్యాయులు బడికి టాటాచెప్పి ప్రచారానికి పరిమితమైనట్టు తెలుస్తోంది. సందిగ్ధంలో విద్యార్థుల భవితవ్యం దాదాపు సగం మంది ఉపాధ్యాయులు నెలరోజుల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తలమునకలైపోయారు. ఈనెల 17 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానుండడంతో విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. 5 నుంచి 17 వరకు 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు సమ్మేటివ్–3పరీక్ష జరగాల్సి ఉంది. కానీ ఎన్నికల కారణంగా ఈ పరీక్షలను 15 నుంచి 25వ తేదీ వరకు వాయిదావేశారు. దీనివల్ల ఉపాధ్యాయులు కష్టనష్టాలు ఎదుర్కోక తప్పని పరిస్థితి. ఉదయం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు, మధ్యాహ్నం సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించడం కత్తిమీద సాములాంటిదేనని పలువురు వాపోతున్నారు. -
జూనియర్ ఇంటర్ పరీక్షలు ప్రారంభం
చల్లపల్లి : ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు బుధవారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. చల్లపల్లిలో ఆరు ప్రైవేటు, ఎయిడెడ్, గురుకుల జూనియర్ కళాశాలలకు చెందిన 790 మంది విద్యార్థులు మూడు కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్నారు. తొలిరోజు నిర్వహించిన తెలుగు, హిందీ, సంస్కృత పరీక్షలకు 21 మంది గైర్హాజరయ్యారు. ఎస్సార్‌వైఎస్పీ జూనియర్ కళాశాలలో 200 మందికి గాను 196 మంది, విజయ జూనియర్ కళాశాలలో 244కుగాను 233 మంది, ఎస్సార్‌వైఎస్పీ కళాశాలలో 346కుగాను 340 మంది హాజరయ్యారు. కస్టోడియన్ సూర్యదేవర నాగేశ్వరరావు పర్యవేక్షణలో పరీక్షలను చీఫ్ సూపరింటెండెంట్లు తగిరిశ సాంబశివరావు, బి.శ్రీనివాసరావు, ఎం.ఎస్.ఆర్.కె. ప్రసాద్, డిపార్ట్మెంటల్ అధికారులు వై.ఎన్.ఎల్.పద్మావతి, ఏ.శ్రీనివాసరావు, ఎల్. వెంకటేశ్వరరావు నిర్వహించారు. అవనిగడ్డకు తరలిన విద్యార్థులు కోడూరు: ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రారంభించిన పరీక్షలకు కోడూరు నుంచి 189 మంది విద్యార్థులు అవనిగడ్డలో పరీక్ష రాసేందుకు వెళ్లారు. స్థానిక మారుతీ కళాశాల నుంచి 56 మంది, బాలభాను జూనియర్ కళాశాల నుంచి 133 మంది మొదటి సంవత్సరం పరీక్షకు వెళ్లినట్లు ఆయా కళాశాలల అధినేతలు దుట్టా శివరామప్రసాద్, జె.వి.ఎస్.ఎస్. మూర్తి తెలిపారు. -
టేన్ షన్
పూర్తి కాని పదోతరగతి సిలబస్ కీలక సబ్జెక్టులకు ఉపాధ్యాయులు కరువు ఆందోళనలో విద్యార్థులు చిత్తూరు(గిరింపేట): ప్రతి విద్యార్థి జీవితంలో కీలకఘట్టం పదోతరగతి. అక్కడ గట్టెక్కితే కొండంత ఆత్మవిశ్వాసం వస్తుంది. అంతటి ప్రాధాన్యం ఉన్న పదో తరగతి విద్యార్థులకు.. జిల్లాలో చాలాచోట్ల టీచర్లు లేరు. కనీసం విద్యావలంటీర్లను కూడా నియమించక పోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పబ్లిక్ పరీక్షలకు మరో రెండు నెలలే గడువుంది. కీలక సబ్జెక్టులకు టీచర్లు లేకపోవడంతో పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో తెలియక తికమకపడుతున్నారు. ఈ అంశంపై విద్యాశాఖ అధికారులు దృష్టిసారించకపోవడం దారుణమని ఉపాధ్యాయసంఘాలు చెబుతున్నాయి. జిల్లాలో 534 ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో 28 వేల మంది పదో తరగతి విద్యార్థులు చదువుతున్నారు. విద్యాశాఖ లెక్కల ప్రకారం పదో తరగతికి సంబంధించి 386 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెబుతున్నారు. కీలక సబ్జెక్టులైన ఇంగ్లీషు, గణితం, భౌతిక, రసాయన శాస్త్రం, సాంఘికశాస్త్రానికి టీచర్లే లేరు. నిబంధనల ప్రకారం 20 మంది విద్యార్థులకు ఒక సబ్జెక్టు టీచరు ఉండాలి. ఈ స్థాయిలో ఎక్కడా నియామకాలు జరగలేదు. నెలాఖరువరకే గడువు.. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ నె లాఖరుకు పదోతరగతి సిలబస్ మొత్తం పూర్తి కావాలి. కానీ ఉపాధ్యాయుల కొరత వల్ల కొన్నిచోట్ల 80 శాతం, మరికొన్ని చోట్ల 50 నుంచి 60 శాతం పాఠ్యాంశాలు మాత్రమే పూర్తయ్యాయి. ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులు లేకపోవడంతో ఉన్న వారితోనే తరగతులు నిర్వహిస్తున్నామని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. ఇటీవల జరిగిన బదిలీలలో ఉన్నత పాఠశాలల్లో బోధించే టీచర్లు వేరే ప్రాంతాలకు బదిలీ కావడం వల్ల ఆ స్థానాలు ఖాళీ అయ్యాయని చెబుతున్నారు. విద్యాశాఖాధికారులు కుప్పం మండలానికి మాత్రం వలంటీర్లను నియమించి జిల్లాలోని మిగిలిన మండలాల్లోని పాఠశాలలను గాలికొదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సక్సెస్‌లో మరీ అధ్వానం జిల్లాలో 339 సక్సెస్ పాఠశాలల్లో ప్రత్యేక సబ్జెక్టులు బోధించేందుకు ఉపాధ్యాయులే లేరు. ఆ పాఠశాలల్లో ఈ ఏడాది 27 వేల మంది విద్యార్థులు పదోతరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్నారు. ఆంగ్ల మాధమ్యం చెప్పే వారు లేక తెలుగు మీడియం వారితోనే బండిలాకొస్తున్నారు. ఇదిగో సాక్ష్యం.. పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో తమిళ్ ల్వాంగేజ్ బోధించడానికి ఉపాధ్యాయుడు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడు మరొక ప్రాంతానికి బదిలీ అయినప్పటి నుంచి ఆ సబ్జెక్ట్‌కు వేరొక ఉపాధ్యాయున్ని నియమించ లేదు. గుడిపాల మండలంలోని మిట్టఇండ్లు, ఏఎల్‌పురంలో సోషియల్, బయాలజీ బోధించే టీచర్లు లేరు. యాదమరి మండలంలోని 14 కండ్రిగ ఉర్ధూ ఉన్నతపాఠశాలలో భౌతిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయుడి పోస్టు ఖాళీ. పీటీఎం మండలంలోని కందుకూరు జడ్పీ హైస్కూల్లో గణితం, హిందీ, పీటీయంలోని ఉన్నత పాఠశాలలో బయాలజీ, సోషియల్ సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేరు. కొన్ని చోట్ల ప్రధానోపాధ్యాయులే తమ సొంత డబ్బులతో వలంటీర్లను నియమించుకుని బోధించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. రాష్ట్ర అధికారులకు నివేదిక పంపాం జిల్లాలో ఉన్న ఉపాధ్యాయు పోస్టులకు సంబంధించిన ఖాళీల జాబితాను రాష్ట్ర విద్యాశాఖకు పంపాం. వారి నుంచి అదేశాలు వచ్చిన తర్వాత ఆయా ప్రాంతాల్లో తాత్కాలిక సర్ధుబాటు చేయడం జరుగుతుంది. వారంలోపు ఖాళీగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు యత్నిస్తాం. - నాగేశ్వరరావు, డీఈవో -
3నేలబారు చదువులు
శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో సమస్యల గురించి విద్యార్థులు చెప్పినవి, చూసినవి చాలా బాధ కలుగుతోంది. వీటిపై సమగ్ర నివేదిక రూపొందించి ఇంటర్ విద్య కమిషనర్ దృష్టికి తీసుకెళ్తాను. ప్రస్తుతానికి ఎక్యూమలేషన్ ఫండ్స్ నుంచి డ్రా చేసి కొన్ని సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాను. అధ్యాపకుల కొరత ఒక్క శ్రీకాకుళంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెల కొంది. వచ్చే విద్యాసంవత్సరం నాటికి కొరత లేకుం డా చూడాలని ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. శ్రీకాకుళం పట్టణ పరిధిలో హెచ్ఆర్ఏ తక్కువ ఇస్తున్నారన్నట్లు కొందరు నా దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం, ఉన్నతాధికారుల నుంచి సానుకూలంగా నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాను. - పాత్రుని పాపారావు, జిల్లా వృత్తివిద్యాధికారి, శ్రీకాకుళం విద్యా సంవత్సరం దాదాపు చివరికొచ్చింది. మరో మూడు వారాల్లో ప్రాక్టికల్ పరీక్షలు, అక్కడికి పక్షం రోజుల తర్వాత పబ్లిక్ పరీక్షలు మొదలుకానున్నాయి. కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు మాత్రం పాఠాలకు నోచుకోవడంలేదు. ప్రధానంగా అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది కొరత సర్కారీ విద్యను వెంటాడుతోంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలోనే పలు సమస్యలు తిష్ఠ వేశాయి. తరగతి గదులు పూర్తిస్థాయిలో లేవు. నేలచదువులే దిక్కు. మరుగుదొడ్లు లేవు. తాగునీరు కూడా గగనమే. ఇలా ఎన్నో సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతున్నామని పిల్లలు, మిగిలిన జిల్లాల మాదిరిగా ప్రభుత్వం తమకు అందించాల్సిన రాయితీలను ఇవ్వడంలేదని జూనియర్ లెక్చరర్లు, ఉద్యోగ భద్రత లేక బిక్కుబిక్కుమంటూ పాఠాలు బోధిస్తున్నామని కాంట్రాక్ట్ లెక్చరర్లు ‘సాక్షి వీఐపీ రిపోర్టర్’కు తమ గోడు వినిపించారు. ఆయన మరెవరో కాదు.. జిల్లా వృత్తివిద్య అధికారి (డీవీఈవో) పాత్రుని పాపారావు. ఇంటర్ విద్య పర్యవేక్షణాధికారి ఆయన స్వయంగా కళాశాలకు వెళ్లి అధ్యాపకులు, విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆ వివరాలు యథాతథంగా... ప్రిన్సిపాల్‌తో.. డీవీఈవో : సార్ చెప్పండి.. ఈ కళాశాలకు చాలా ప్రత్యేకత ఉంది కదా! ప్రస్తుతం పరిస్థితి ఏంటి. సదుపాయాలు ఎలా ఉన్నాయి? ప్రిన్సిపాల్(సత్యనారాయణ) : ఇక్కడ చదువుకున్న ఎంతోమంది వ్యక్తులు ఉన్నత హోదాల్లో ఉన్నారు. నేను గత ఏడాదిన్నర కాలంగా ఇక్కడ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాను. 1200 మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. తరగతి గదులు, మరుగుదొడ్లు లేవు. మంచినీరు అందుబా టులో ఉండదు. మరీ ముఖ్యంగా అవసరమైనంతమంది అధ్యాపకులు లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది. డీవీఈవో : ఏఏ సబ్జెక్టుల్లో ఖాళీలున్నాయి? ప్రిన్సిపాల్: అధ్యాపకులతోపాటు బోధనేతర సిబ్బంది కొరత కూడా ఉంది. ప్రధానంగా ఇంగ్లిషుకు ఇద్దరు అవసరం. జువాలజీ, జాగ్రఫీ, హిందీ సబ్జెక్టులకు అధ్యాపకులే లేరు. డీవీఈవో : ఉన్నతాధికారులకు నివేదించారా? ప్రిన్సిపాల్: కళాశాలలో మౌలిక సదుపాయాల కొరతపై ఇప్పటికే ఇంటర్ విద్య కమిషనర్, మున్సిపల్ కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాను. ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. విద్యార్థులతో.. డీవీఈవో(తరగతి గదిలోకి వెళి): నేల చదువులు చదువుతున్న విద్యార్ధులతో మాట్లాడుతూ.. చెప్పమ్మా కళాశాలలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? కె.దేవి(సీఈసీ ద్వితీయ): కళాశాలలో మేం చాలా ఇబ్బందులు పడుతున్నాం. టాయిలెట్స్ లేవు. నీరు కూడా రాదు. నేలచదువులే చదువుతున్నాం. డీవీఈవో : మీ సార్లు తరగతులు బాగా చెబుతున్నారా?.. సమయపాలన పాటిస్తున్నారా? దేవి : ఉన్న సార్లంతా బాగా క్లాసులు చెబుతారు సార్. కానీ చాలా సబ్జెక్టులకు సార్లే లేరు. నాతోపాటు మిగిలిన గ్రూపుల్లోని మా స్నేహితులు చాలా ఇబ్బందులు పడుతున్నాం. పరీక్షలు దగ్గరపడుతున్నాయి. భయమేస్తోంది. అధికారులు చర్యలు తీసుకోవాలి సార్. డీవీఈవో : మరో క్లాసు రూమ్‌కు వెళ్లి.. బాబూ ఈ కళాశాలలో ఉన్న సమస్యలేంటి చెప్పు? ఎ.మహేష్(ఒకేషనల్ ప్రథమ): బాత్రూమ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. అత్యవసర సమయాల్లో నాగావళి నదే మాకు దిక్కు. తరగతి గదులు లేక స్టోర్రూములో కూర్చుంటున్నాం. ఫ్యాన్లు లేవు. కొన్ని సబ్జెక్టులకు సార్లు లేరు. ఆధ్యాపకులతో.. డీవీఈవో : మీ కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలేంటి? జీతాలు సక్రమంగా అందుతున్నాయా? ఎన్.సత్యనారాయణ(కాంట్రాక్ట్ లెక్చరర్): దశాబ్దకాలంగా నాతోపాటు జిల్లాలో చాలామంది కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. భద్రత లేని ఉద్యోగాలు కావడంతో మనోధైర్యంతో పనిచేయలేకపోతున్నాం. కొన్నిసార్లు ఏకాగ్రత దెబ్బతింటోంది. ప్రభుత్వం మాకు భద్రత కల్పిస్తుందని భావిస్తున్నాం. జీతాలు నెలనెలా అందడంలేదు. ఉన్నతాధికారులు దానిపై దృష్టిసారించాలి. డీవీఈవో : చెప్పండి.. మీరు కెమిస్ట్రీ లెక్చరర్ కదా.. ప్రాక్టికల్స్ ఏవిధంగా నిర్వహిస్తున్నారు? బి.శ్యామ్‌సుందర్(లెక్చరర్) : విద్యార్థులను ప్రాక్టికల్ పరీక్షలకు ఇప్పటికే సిద్ధం చేశాం సార్. సైన్స్ లెక్చరర్లమంతా ఒక క్రమ పద్ధతిలో విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా బాలురకు కంపెనీల్లో చేరదలచుకునేవారికి టైట్రేషన్స్ అనాలసిస్, మూలకాలపై పూర్తిస్థాయిలో తర్ఫీదు ఇస్తున్నాం సార్. డీవీఈవో : ప్రాక్టికల్ పరీక్షలకు డీవోలగా ఇతర శాఖల సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై మీ అభిప్రాయమేంటి? జి.వెంకటేశ్వరరావు(సీనియర్ ఫిజిక్స్ లెక్చరర్) : ఇంటర్‌బోర్డు ఏర్పడినప్పటి నుంచి ప్రాక్టికల్ పరీక్షలకు డిపార్ట్మెంటల్ అధికారులుగా ఇతర శాఖల సిబ్బందిని నియమించలేదు. ఆనవాయితీని పక్కనపెడితే మా మనోభావాలను దెబ్బ తీసినట్లే. అదే జరిగితే ఊరుకునేది లేదు సార్. ప్రభుత్వానికి చేతనైతే కార్పొరేట్‌కు తలొగ్గకుండా ప్రాక్టికల్ పరీక్షలను జంబ్లింగ్ పద్ధతిలో నిర్వహించాలి. బోధనేతర సిబ్బందితో.. డీవీఈవో : జిల్లాలో బోధనేతర సిబ్బంది ఎంతమంది ఉన్నారు? కొరత ఏమైనా ఉందా? కె.కమలాకర్(నాన్‌టీచింగ్ స్టాఫ్ జిల్లా అధ్యక్షుడు) : జిల్లాలో 43 ప్రభుత్వ కళాశాలల్లో ప్రస్తుతం 120 మంది మాత్రమే నాన్‌టీచింగ్ స్టాఫ్ ఉన్నాం. 200కుపైగా ఖాళీలను భర్తీచేయాల్సి ఉంది. దీంతో కళాశాలల్లో పరిపాలన సక్రమంగా సాగడంలేదు. ప్రస్తుతం అంతా ఆన్లైన్లోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇంటర్నెట్ వినియోగంపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే మంచిది.