చల్లపల్లి : ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు బుధవారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. చల్లపల్లిలో ఆరు ప్రైవేటు, ఎయిడెడ్, గురుకుల జూనియర్ కళాశాలలకు చెందిన 790 మంది విద్యార్థులు మూడు కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్నారు. తొలిరోజు నిర్వహించిన తెలుగు, హిందీ, సంస్కృత పరీక్షలకు 21 మంది గైర్హాజరయ్యారు. ఎస్సార్‌వైఎస్పీ జూనియర్ కళాశాలలో 200 మందికి గాను 196 మంది, విజయ జూనియర్ కళాశాలలో 244కుగాను 233 మంది, ఎస్సార్‌వైఎస్పీ కళాశాలలో 346కుగాను 340 మంది హాజరయ్యారు. కస్టోడియన్ సూర్యదేవర నాగేశ్వరరావు పర్యవేక్షణలో పరీక్షలను చీఫ్ సూపరింటెండెంట్‌లు తగిరిశ సాంబశివరావు, బి.శ్రీనివాసరావు, ఎం.ఎస్.ఆర్.కె. ప్రసాద్, డిపార్ట్‌మెంటల్ అధికారులు వై.ఎన్.ఎల్.పద్మావతి, ఏ.శ్రీనివాసరావు, ఎల్. వెంకటేశ్వరరావు నిర్వహించారు.
అవనిగడ్డకు తరలిన విద్యార్థులు
కోడూరు: ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రారంభించిన పరీక్షలకు కోడూరు నుంచి 189 మంది విద్యార్థులు అవనిగడ్డలో పరీక్ష రాసేందుకు వెళ్లారు. స్థానిక మారుతీ కళాశాల నుంచి 56 మంది, బాలభాను జూనియర్ కళాశాల నుంచి 133 మంది మొదటి సంవత్సరం పరీక్షకు వెళ్లినట్లు ఆయా కళాశాలల అధినేతలు దుట్టా శివరామప్రసాద్, జె.వి.ఎస్.ఎస్. మూర్తి తెలిపారు.
జూనియర్ ఇంటర్ పరీక్షలు ప్రారంభం
Published Thu, Mar 3 2016 12:50 AM | Last Updated on Sun, Sep 3 2017 6:51 PM
Advertisement