inter first year
-
ఇంటర్ విద్యలో సంస్కరణలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్ విద్యలో జాతీయ విద్యా విధానం–2020కి అనుగుణంగా సంస్కరణలను అమలు చేయనున్నారు. ఇప్పటికే పాఠశాల విద్యలో సీబీఎస్ఈ విధానంలో ఎన్సీఈఆర్టీ పాఠాలను బోధిస్తుండగా, ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో సైతం సీబీఎస్ఈ విధానంలోకి మారింది. 2025 మార్చిలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు అనుగుణంగా 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యలో ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను ప్రవేశ పెట్టనున్నట్టు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు.జాతీయ విద్యా విధానాలను అనుసరిస్తున్న నేపథ్యంలో ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులకు బోర్డు పరీక్షలను రద్దు చేసి, సాధారణ వార్షిక పరీక్షలు నిర్వహించాలనే ప్రతిపాదనలు చేశామన్నారు. ఈ అంశంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యావేత్తల సూచనలు, సలహాలు అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. బోర్ట్ ఆఫ్ ఇంటర్మీడియట్ వెబ్సైట్లో అభిప్రాయాలను వెల్లడించాలని కోరారు. ఇంటర్ విద్యలో తీసుకురానున్న విద్యా సంస్కరణలపై బుధవారం తాడేపల్లిలోని బోర్డు కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో తీసుకువచ్చే సంస్కరణల ఫలితాలు 10 లక్షల మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన అంశమని, అందుకే విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తల సూచనలు కోరుతున్నట్టు చెప్పారు. ప్రతిపాదిత సంస్కరణలను www.bieap.gov.in వెబ్సైట్లో ఉంచామని.. సూచనలు, అభ్యంతరాలను జనవరి 26వ తేదీలోగా biereforms@gmail.com మెయిల్ చేయాలన్నారు.వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ సిలబస్ప్రస్తుతం అమల్లో ఉన్న ఇంటర్మీడియేట్ సిలబస్ కొన్ని సంవత్సరాలుగా మార్చలేదని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్‌ను అందుబాటులోకి తేనున్నట్టు కృతికా శుక్లా వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 15కు పైగా రాష్ట్రాల్లో ఇంటర్ విద్యలో ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలను ప్రవేశపెట్టాయన్నారు. విద్యా రంగంలో అనుభవం గల నిపుణులతో ప్రతి సబ్జెక్టుకు ఒక నిపుణుల కమిటీ చొప్పున 14 కమిటీలను వేశామన్నారు. వారి సూచనలతో నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్–2023కు అనుగుణంగా ఇంటర్మీడియట్ విద్యలో ఈ సంస్కరణలు తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. ఇందులో భాగంగా 2025–26 విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ సిలబస్‌ను ప్రవేశ పెడుతున్నామన్నారు. ఆ పై సంవత్సరం ఇంటర్ రెండో ఏడాది సిలబస్ అందుబాటులోకి వస్తుందన్నారు. పాఠశాల విద్యా శాఖ 2024–25 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలను ప్రవేశపెట్టిందని, ఈ విద్యార్థులకు అనుగుణంగా 2025–26 విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రథమ, 2026–27 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలోను ఎన్సీఈఆర్టీ సిలబస్ పాఠ్య పుస్తకాలను ప్రవేశపెడుతున్నామన్నారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన నీట్, జేఈఈ సిలబస్‌కు అనుగుణంగా సైన్స్ సిలబస్ ఉంటుందని ఆమె వెల్లడించారు.ఇంటర్ తొలి ఏడాది పరీక్షల రద్దు ప్రతిపాదనదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మినహా ఇతర రాష్ట్రాల బోర్డులు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను నిర్వహించడం లేదని శుక్లా తెలిపారు. అత్యధిక రాష్ట్రాల్లో ఇంటర్ బోర్డులు, యూనివర్సిటీల్లో ప్రవేశాలకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారన్నారు. ఈ కమ్రంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు పరీక్షలు, మూల్యాంకనంలోనూ మార్పులు తీసుకొస్తున్నట్టు వివరించారు. ఇందులో భాగంగా ఇంటర్ మొదటి సంవత్సరానికి బోర్డు పరీక్షలు రద్దుచేసి, కళాశాలల అంతర్గత పరీక్షలుగా మార్చనున్నట్టు చెప్పారు. బోర్డు నిర్ణయించిన సిలబస్, బ్లూ ప్రింట్ ఆధారంగా కాలేజీల్లో అంతర్గతంగా నిర్వహిస్తారన్నారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలను మాత్రమే బోర్డు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తుందన్నారు. ఈ ప్రతిపాదనలపై సలహాలను ఈనెల 26వ తేదీలోగా ఆన్లైన్లో ఇంటర్ బోర్డుకు తెలియచేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కొత్త ముసాయిదా ప్రకారం ఇంటర్ పరీక్షల విధానంలో కూడా మార్పులు చేస్తామని, ప్రతి సబ్జెక్టులో ఇంటర్నల్ మార్కులతో పాటు ప్రాక్టికల్స్ తప్పనిసరి చేస్తామన్నారు. పరీక్షల్లో మల్టిపుల్ ఛాయిస్ ఒక్క మార్కు ప్రశ్నలను ప్రతిపాదించారని, 8 మార్కుల వ్యాసరూప ప్రశ్నల స్థానంలో 5 లేదా 6 మార్కుల ప్రశ్నలు ప్రవేశ పెట్టాలని భావిస్తున్నట్టు చెప్పారు. కాగా, మొదటి సంవత్సరం పరీక్షల రద్దు అనేది ప్రతిపాదనలు మాత్రమే అని, ఇంకా రద్దు చేయలేదన్నారు.అన్ని గ్రూపుల్లోను థియరీ, ప్రాక్టికల్ మార్కులు సీబీఎస్ఈ విధానం ప్రకారం ఇంటర్మీడియట్ అన్ని గ్రూపులకు థియరీ, ప్రాక్టికల్ మార్కులు తప్పనిసరి చేశారు. ఆర్ట్స్ గ్రూపుల్లో ఐదు సబ్జెక్టులకు 500 మార్కులు ఇచ్చారు. ప్రతి సబ్జెక్టుకు 100 మార్కులు, ఇందులో 80 మార్కులు థియరీకి, 20 మార్కులు ప్రాక్టికల్స్/ ప్రాజెక్టు వర్క్‌కు కేటాయిస్తారు. ఎంపీసీ గ్రూప్‌లో 380 మార్కులు థియరీకి, 120 మార్కులు ప్రాక్టికల్స్.. మొత్తం 500 మార్కులు ఇస్తారు. బైపీసీ గ్రూప్‌లో 370 మార్కులు థియరీకి, 130 మార్కులు ప్రాక్టికల్స్‌కు ఇస్తారు. అన్ని గ్రూపులకు ఐచ్చికంగా ఎంచుకునే ఆరో సబ్జెక్టుకు మార్కులు ఎన్ని అనేది ఇంకా నిర్ణయించలేదు.ప్రతి గ్రూప్‌లో ఐదు సబ్జెక్టుల విధానంప్రస్తుతం ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూపుల్లో రెండు లాంగ్వేజ్‌లు, నాలుగు మెయిన్‌సబ్జెక్టులు (మొత్తం ఆరు), ఆర్ట్స్ గ్రూపుల్లో రెండు లాంగ్వేజ్‌లు, మూడు మెయిన్ సబ్జెక్టుల (మొత్తం ఐదు) విధానం అమల్లో ఉంది. మార్కుల కేటాయింపు కూడా భిన్నంగా ఉంది. దీంతో సైన్స్ గ్రూపుల విధానంపై దేశంలోని కొన్ని యూనివర్సిటీలు అభ్యంతరం పెడుతుండడంతో జేఈఈ, నీట్ ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఐదు సబ్జెక్టులు ప్రధానంగా.. ఆరో సబ్జెక్టు ఐచ్చికంగా ఎంపిక చేసుకునే విధానం రానుంది. ఈ క్రమంలో అన్ని గ్రూపులకు ఒక లాంగ్వేజ్, నాలుగు మెయిన్ సబ్జెక్టులు (మొత్తం ఐదు), 500 మార్కుల విధానం ప్రతిపాదించారు. ఇందులో ఒక సబ్జెక్టు ఇంగ్లిష్ లాంగ్వేజ్ తప్పనిసరి. రెండో సబ్జెక్టు ‘ఎలక్టివ్’. ఇందులో ఏదైనా లాంగ్వేజ్ లేదా 23 మెయిన్ సబ్జెక్టుల్లో ఒకటి ఎంచుకోవచ్చు. సైన్స్ లేదా ఆర్ట్స్ గ్రూపుల్లో మూడు (3, 4, 5 సబ్జెక్టులు) ప్రధాన సబ్జెక్టులు ఎంచుకోవాలి. ఎంపీసీలో మ్యాథ్స్–ఏ, బీ పేపర్ల స్థానంలో ఒకే పేపర్ ఉంటుంది. బైపీసీలో బోటనీ, జువాలజీ సబ్జెక్టులను కలిపి ‘జువాలజీ’గా పరిగణిస్తారు. ఆర్ట్స్‌లో కోర్సులైన సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ప్రస్తుతం ఉన్న 26 కాంబినేషన్లు ఉంటాయి. విద్యార్థులు నచ్చిన కాంబినేషన్‌ను ఎంచుకోవచ్చు. ఆరో సబ్జెక్టుగా (ఆప్షనల్ మాత్రమే.. తప్పనిసరి కాదు) ఏదైనా లాంగ్వేజ్ లేదా 23 మెయిన్ సబ్జెక్టుల్లో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. విద్యార్థులు మొదటి ఐదు సబ్జెక్టుల్లో ఒక సబ్జెక్టు ఫెయిలై.. ఆరో సబ్జెక్టు పాసైతే అప్పుడు ఆరో సబ్జెక్టును మెయిన్ సబ్జెక్టుగా పరిగణిస్తారు. ఆరో సబ్జెక్టును పరిగణనలోకి తీసుకోవాలంటే ఇంగ్లిష్ తప్పనిసరిగా పాసవ్వాలి. -
గురుకులంపై గురి... లేకుంటే ‘ప్రైవేటు’ సరి
సాక్షి, హైదరాబాద్: గురుకులంలో సీటొచ్చిందా... సరేసరి. లేకుంటే ప్రైవేటు కాలేజీనే బెస్ట్ అంటున్నారు ఇంటర్ విద్యార్థులు. 2023–24 ప్రవేశాలను పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. ఈ ఏడాది 4,92,873 మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్‌లో చేరారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 83,177 మంది చేరగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాలు, మోడల్ స్కూల్స్, కస్తూర్బా బాలికల విద్యాలయాల్లో 98,536 మంది చేరారు. ఇక రాష్ట్రంలోని 1,285 ప్రైవేటు కాలేజీల్లో ఏకంగా 3,11,160 మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు తీసుకున్నారు. ఈ లెక్క గమనిస్తే సాధారణ ప్రభుత్వ కాలేజీల కన్నా, గురుకులాల్లో చేరేందుకే విద్యార్థులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కేజీబీవీలు, గురుకులాల్లో ప్రత్యేక హాస్టళ్లు ఉండటం, విద్యాబోధనలో ప్రమాణాలు పాటించడం వల్ల మంచి ఫలితాలొస్తున్నాయని, అందుకే గురుకులాలకు తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రాధాన్యతనిస్తున్నారని అధికారులు అంటున్నారు. గురుకులాల తర్వాత ప్రైవేటు కళాశాలలవైపే విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. గతేడాది కంటే ఇంటర్ ప్రవేశాలు తక్కువే నిజానికి గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఇంటర్లో చేరిన వారి సంఖ్య తక్కువే. 2022–23లో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో 4,98,699 మంది ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలు పొందారు. ఈ ఏడాది 4,92,873 మంది విద్యార్థులు ఇంటర్లో చేరారు. అంటే, ఈ సంవత్సరం 5,826 మంది తగ్గిపోయారు. టెన్త్‌లో ఉత్తీర్ణత తగ్గడం దీనికి ఒక కారణమైతే, పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సులు రావడంతో కొంతమంది అటు వైపు మొగ్గు చూపారు. ఇంటరే కీలకం.. టెన్త్ వరకూ విద్యాభ్యాసం ఎలా ఉన్నా.. ఇంటర్ విద్యను కీలకంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులూ భావిస్తున్నారు. ఇంటర్‌తో పాటే జేఈఈ, నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమవ్వాలని భావిస్తుంటారు. ఈ కారణంగా ఇంటర్ మొదటి సంవత్సరం నుంచి అకడమిక్ విద్యతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన తర్ఫీదు తీసుకుంటున్నారు. ఇంటి వద్ద నుంచి కాలేజీకి వెళ్లి రావడం వల్ల మంచి ఫలితాలు రావని తల్లిదండ్రులు భావిస్తున్నారు. హాస్టల్ వసతి ఉన్న చోటే పిల్లలను చదివించాలనే ఆలోచన కొన్నేళ్లుగా పెరిగింది. ప్రభుత్వ గురుకులాల్లో సీట్లు వస్తే సరి... లేకుంటే వ్యయ ప్రయాసలు భరించైనా హాస్టల్ వసతి ఉన్న ప్రైవేటు కాలేజీల్లో చదువు చెప్పించేందుకు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు 3,178 ఉన్నాయి. -
జూన్ 1 నుంచి ఇంటర్ ఫస్టియర్ తరగతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలు ఈ నెల 15 నుంచి ప్రారంభించవచ్చు. ఇందుకు సంబంధించి షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ శుక్రవారం విడుదల చేశారు. జూన్ 30లోగా ప్రవేశాలు పూర్తి చేయాలని,ఇంటర్ మొదటి సంవత్సరం క్లాసులు జూన్ 1 నుంచి ప్రారంభించాలని సూచించారు. అడ్మిషన్ల ప్రక్రియకు ఎలాంటి ప్రవేశ పరీక్ష నిర్వహించవద్దని కాలేజీలకు సూచించారు. టెన్త్ గ్రేడింగ్ ఆధారంగానే ప్రవేశాలు జరపాలని ఆదేశించారు. ఇంటర్ బోర్డ్ గుర్తింపు ఉన్న కాలేజీల జాబితాను టీఎస్‌బీఐఈ అధికారిక వెబ్సైట్లో ఉంచుతామని, ఆ కాలేజీల్లోనే విద్యార్థులు చేరాలని సూచించారు. ప్రతీ కాలేజీ రిజర్వేషన్ పాటించాలని ఆదేశించారు. సీట్లలో ఎస్సీలకు 15, ఎస్టీలకు 10, బీసీలకు 29, వికలాంగులకు 3, ఎన్సీసీ, స్పోర్ట్స్, ఇతర అర్హతలున్న వారికి 5, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 3, ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం కేటాయించాలన్నారు. ప్రతీ కాలేజీ బాలికలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కొన్ని మార్గదర్శకాలను బోర్డ్ విడుదల చేసింది. మార్గదర్శకాలు ఇవీ... ♦ ఇంటర్లో ప్రతీ సెక్షన్లో 88 మంది విద్యార్థులనే చేర్చుకోవాలి. అదనపు సెక్షన్లు నిర్వహించాలంటే కాలేజీ విధిగా బోర్డ్ అనుమతి తీసుకోవాలి. ఇందుకు విరుద్ధంగా ఏ కాలేజీ వ్యవహరించినా కఠిన చర్యలుంటాయి. ♦ విద్యార్థుల ఆధార్ నెంబర్ తప్పకుండా నమో దు చేయాలి. అడ్మిషన్ల వివరాలను ప్రతీ రోజూ కాలేజీ బోర్డుపై ఉంచాలి. ఎన్ని సీట్లు భర్తీ అయ్యాయి? ఎన్ని మిగిలి ఉన్నాయి? అప్డేట్ సమాచారం బోర్డ్‌పై ప్రదర్శించాలి. ♦ జోగిని, తండ్రి లేని పిల్లల విషయంలో పేరెంట్స్ కాలమ్‌లో తల్లి పేరు నమోదు చేయాలి. బాలికలకు అన్ని రకాల రక్షణ వ్యవస్థను కాలేజీలే క ల్పించాలి. -
కాళ్లు మొక్కుతా.. వదిలేయండి
ఖిలా వరంగల్: ఇంటర్ ఫస్టియర్ బాలిక.. క్లాస్మేట్ ద్వారా ఓ యువకుడు పరిచయమయ్యాడు.. ప్రేమ, పెళ్లి పేరిట శారీరకంగా లొంగదీసుకున్నా డు.. మాట్లాడుకుందామని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. తన ఇద్దరు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ‘కాళ్లు మొ క్కుతా వదిలేయండి’అని ప్రాధేయపడ్డా వదలలేదు. చివరికి విషయం బయటికి చెప్పొద్దని బెదిరించి ఇంటి వద్ద వదిలిపెట్టారు. ఆవేదన భరించలేని బాలిక తల్లికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరంగల్ కాశీబుగ్గలో మంగళవారం జరి గిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తండ్రి లేని బాలిక..: పోలీసుల కథనం ప్రకారం.. నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ.. భర్తను కోల్పోవడంతో తమ గ్రామాన్ని వీడి ఇద్దరు కుమార్తెలతో వరంగల్ కాశిబుగ్గకు వలస వచ్చింది. అద్దె ఇంట్లో ఉంటూ, కూలి పనులకు వెళ్తూ కుమార్తెలను చదివిస్తోంది. పెద్ద కుమార్తె ఇంటర్ సెకండియర్, చిన్నకుమార్తె ఫస్టియర్ చదువుతున్నారు. ఫస్టియర్ చదువుతున్న బాలికకు అదే కాలేజీలో చదివే స్నేహితురాలి ద్వారా నర్సంపేట సమీపంలోని మాదన్నపేటకు చెందిన దూడల ప్రభాస్ (22)తో పరిచయం ఏర్పడింది. ప్రభాస్ ప్రేమ పేరిట బాలికను నమ్మించాడు. పలుమార్లు మాదన్నపేటకు రప్పించుకున్నాడు. పెళ్లి చేసుకుంటానంటూ లైంగిక దాడికి పాల్పడ్డాడు. మాట్లాడుకుందాం రమ్మని చెప్పి.. ప్రభాస్ మంగళవారం ఉదయం మాట్లాడుకుందామని చెప్పి ఆ బాలికను మాదన్నపేటకు రప్పించాడు. ఇంట్లో బంధువులు ఉన్నారని, బయటికి వెళ్దామని చెప్పాడు. తన స్నేహితులు భరత్, బన్నిలను అడిగితే ఖిలా వరంగల్ శివార్లలో నిర్మానుష్య ప్రదేశాలు ఉన్నాయని చెప్పారని.. అటు తీసుకెళ్లాడు. బైక్‌పై ఆ ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. కాసేపటికే భరత్, బన్ని, మరో యువకుడు కలిసి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఏం చేస్తున్నారని బెదిరిస్తున్నట్టుగా నటిస్తూ.. బాలి క సెల్‌ఫోన్ లాక్కున్నారు. ‘కాళ్లు మొక్కుతా నన్ను వదిలేయండి’అని ప్రాధేయపడినా వినకుండా భరత్, బన్ని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. మరో యువకుడు వారికి కాపలా ఉన్నాడు. బాలిక ఈ ఘటనతో షాక్‌లోకి వెళ్లి స్పృహ కోల్పోయింది. ఆమె తిరిగి లేచే వరకు ప్రభాస్ అక్కడే ఉన్నాడు. అత్యాచారం విషయాన్ని బాలిక తల్లికి చెప్తుందేమోనని భయపడి.. ఆమెను మాదన్నపేటలోని అతడి బావ అనిల్ ఇంటికి తీసుకెళ్లాడు. బాలిక తనపై జరిగిన దారుణాన్ని చెప్పడంతో అనిల్, బాలికను అద్దె కారులో ఇంటికి పంపించారు. తర్వాత బాలిక ఘటనను తల్లికి చెప్పగా.. బుధవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ముగ్గురు యువకులతోపాటు వీరికి సహకరించిన మరో వ్యక్తిపై దాడి, పోక్సో చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని, గాలిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. -
నేటి నుంచి తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు
-
ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్స్డ్
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశానికి సంబంధించి ఆదివారం నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్–2021 ప్రశాంతంగా ముగిసింది. ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్–2 పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన 2.50 లక్షల మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 1.5 లక్షల మంది హాజరయ్యారు. ఏపీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్న 15 వేల మందిలో 90 శాతం మంది పరీక్షకు హాజరైనట్టు ప్రాథమిక గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 30 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఐఐటీ ఖరగ్‌పూర్ జేఈఈ అడ్వాన్స్డ్–2021 నిర్వహించింది. 15న ఫైనల్ కీ అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు సంబంధిత వెబ్సైట్లో ఈనెల 5నుంచి అందుబాటులో ఉంటాయి. ఈ నెల 10న ఉదయం 10 గంటలకు ప్రాథమిక కీ ప్రకటించనున్నారు. 10, 11 తేదీల్లో ప్రాథమిక కీపై అభ్యర్థులు వారి అభ్యంతరాలను ఆధారాలతో సహా ఆన్లైన్ ద్వారా సమర్పించడానికి అవకాశం ఉంటుంది. అభ్యంతరాల పరిశీలన, పరిష్కారం అనంతరం అక్టోబర్ 15న ఫైనల్ కీ, తుది ఫలితాలను ఐఐటీ ఖరగ్‌పూర్ విడుదల చేయనుంది. ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ) అక్టోబర్ 18న నిర్వహిస్తారు. వీటి ఫలితాలను అక్టోబర్ 22న విడుదల చేస్తారు. 16 నుంచి కౌన్సెలింగ్ దేశంలోని 23 ఐఐటీలు, 31 ఎన్ఐటీలు, 26 ఐఐఐటీలు, 29 ఇతర గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లలో ప్రవేశాల కోసం జేఈఈ కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానుంది. జేఈఈ అడ్వాన్స్డ్ తుది ఫలితాలు, ర్యాంకులు విడుదలైన అనంతరం జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఈ ప్రక్రియను ప్రారంభిస్తుంది. జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్‌లో మెరిట్ సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్‌లో ఇచ్చే వెబ్ ఆప్షన్లను అనుసరించి వారి ర్యాంక్, రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ప్రశ్నల తీరిలా.. జేఈఈ అడ్వాన్స్‌లో ప్రశ్నలు మోడరేట్‌గా అడిగినట్టు పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులలో సరిసమాన ప్రాధాన్యతలో ప్రశ్నలు వచ్చినట్టు పలు కోచింగ్ కేంద్రాల నిపుణులు విశ్లేషించారు. గతానికీ.. ఇప్పటికీ ప్యాట్రన్‌లో స్వల్పంగా మార్పు చేశారని, ప్రతి విభాగంలో 19 ప్రశ్నలు చొప్పున 57 ప్రశ్నలను 180 మార్కులకు ఇచ్చారని వివరించారు. ఆయా సబ్జెక్టులలో నాలుగు సెక్షన్లుగా ప్రశ్నలు పొందుపరిచారని, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లో ఇంటర్మీడియెట్ రెండేళ్లకు సంబంధించిన టాపిక్‌లను కవర్ చేస్తూ ప్రశ్నలు అడగ్గా, ఫిజిక్సులో ఇంటర్ ఫస్టియర్ చాప్టర్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయని విజయవాడకు చెందిన ప్రముఖ కోచింగ్ సెంటర్ అధ్యాపకులు వివరించారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్‌తో పోల్చుకుంటే మేథమెటిక్స్ ప్రశ్నలు ఒకింత కఠినంగా ఉన్నట్టు పేర్కొన్నారు. కెమిస్ట్రీలో ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన ప్రశ్నలు ఎన్సీఈఆర్టీలో ఉన్న వాటిని యథాతథంగా అడిగారని వివరించారు. ఫిజిక్స్‌లో ఎలక్ట్రిసిటీ, ఆప్టిక్స్, రొటేషన్ అంశాలతో పాటు మోడ్రన్ ఫిజిక్స్ అంశాలపై ప్రశ్నలు వచ్చాయి. మ్యాథమెటిక్స్‌లో మేట్రిక్స్, డిటర్మినెంట్స్, ఫంక్షన్స్, కంటిన్యుటీ, డిఫరెన్షియలబిలిటీ, 3డీ జియోమెట్రీ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వచ్చాయి. ట్రిగ్నోమెట్రీ నుంచి కొన్ని గమ్మత్తయిన ప్రశ్నలు అడిగారని అభ్యర్థులు పేర్కొన్నారు. -
పారదర్శకంగా అడ్మిషన్ల ప్రక్రియ: మంత్రి సురేష్
సాక్షి, అమరావతి: విద్యా సంవత్సరం ఎలా ప్రారంభించాలనే అంశంపై.. అధికారులతో సమావేశం నిర్వహించామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజీల్లో నిబంధన ప్రకారమే అడ్మిషన్లు నిర్వహిస్తామని తెలిపారు.(చదవండి: ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం జగన్ భూమిపూజ) ఆన్లైన్లోనే ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుందని.. దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇప్పటికే రూపొందించామని వెల్లడించారు. ‘‘ప్రైవేట్ కాలేజీలు అడ్మిషన్లపై కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారు. వచ్చే సంవత్సరం ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ. ఈ ఏడాదికి ఆఫ్‌లైన్‌లోనే ఇంటర్ అడ్మిషన్లు. ఈ నెల 18 నుంచి ఇంటర్ తరగతులు. కాలేజీల్లో కచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించాలి. యథావిధిగా ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తామని’’ మంత్రి సురేష్ పేర్కొన్నారు.(చదవండి: చరిత్రలో తొలిసారిగా.. దేవాలయానికి ప్రభుత్వ నిధులు) -
సోషల్ మీడియాలో ప్రశ్నపత్రం!
► ఇంటర్ ప్రథమ సంవత్సర ఇంగ్లిష్ పేపర్ లీక్? ► ప్రభుత్వం ఎంపిక చేసింది సెట్–1 ► వాట్సాప్‌లో లీకైంది సెట్–3 ► ఈ ఏడాదికి సంబంధించిన పేపరే కాదన్న ఆర్ఐఓ కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వం వైఫల్యమో లేక అధికారుల నిర్లక్ష్యమో తెలియదు కానీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సోషల్ మీడియాలో (వాట్సాప్) ప్రశ్నాపత్రం లీక్ కావడం వంటి ఘటనలు విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసున్నాయి. ఇంత జరగుతున్నా అధికారులు ఇలాంటి సంఘటనలు అరికట్టడంలో విఫలమయ్యారనే చెప్పాలి. తాజాగా శుక్రవారం కూడా కడప నగరంలోని ఓ కార్పొరేట్ కళాశాలకు చెందిన విద్యార్థుల మొబైల్ నుంచి ప్రశ్నపత్రం లీకైంది. సంబంధిత విషయం సోషియల్ మీడియాలో హల్చల్ చేసింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పరీక్ష ప్రారంభమైన మొదటి రోజే రాయచోటి సెంటర్ నుంచి వాట్సప్‌లో కొశ్చన్ పేపర్ లీకైంది. ఇది జరిగిన రెండు రోజులకే మళ్లీ కడపలో పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రథమ సంవత్సరం ఇంగ్లిష్ పేపర్–1కు సంబంధించి సెటర్–3 ప్రశ్నపత్రం వాట్సాప్‌లో లీకైందని వందంతులు కదం తొక్కాయి. ప్రభుత్వం మాత్రం ఇంటర్ ఇంగ్లిష్ పరీక్షకు సంబంధించి శుక్రవారం సెట్–1 ఎంపిక చేసినప్పటికి వాట్సాప్‌లో మాత్రం సెట్–3 లీక్ కావడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ ఏడాది ప్రశ్నపత్రామే కాదు వాట్సాప్‌లో శుక్రవారం వచ్చిన ప్రశ్నపత్రం ఈ ఏడాదికి సంబంధించింది కాదు. ఎందుకంటే ఇంటర్‌కు శుక్రవారం జరిగిన మొదటి సంవత్సర ఇంగ్లిష్ పేపర్‌ను రాష్ట్ర అధికారులు సెట్–1ను ఎంపిక చేశారు. కానీ వాట్సాప్‌లో వచ్చింది సెట్–3 . ఇది కేవలం ఆకతాయిలు చేసిన పని తప్ప మరొకటి కాదు. సెట్–3కి సంబంధించిన ప్రశ్నాపత్రం పోలీస్స్టేషన్లలో భద్రంగా ఉంది. కనుక ఆ పేపర్ లీక్ ఆయ్యే దానికి చాన్సే లేదు, వాట్సాప్‌లో వచ్చిన పేపర్ గతేడాదికి సంబంధించిన పేపర్ తప్ప మరొకటి కాదు. ఇదంతా విద్యార్థులను తప్పుదారి పట్టించేందుకు ఆకతాయిలు చేసిన పని. ఇలాంటి వదంతులను విద్యార్థులు ఎవరూ నమ్మాల్సిన పనిలేదు. – రవి, ఇంటర్ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి. -
ఫ్రెండ్సే... కానీ...
జీవన గమనం నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మూడేళ్లుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మేమిద్దరం చాలాకాలంగా ఫ్రెండ్స్. అందువల్ల ప్రేమ విషయాన్ని ఆమెకు చెప్పలేకపోతున్నాను. ఆమె చాలామంది జులాయి అబ్బాయిలతో తిరగడం నేను కళ్లారా చూశాను. అయినా ఆమెను ప్రేమించడం మానుకోలేక పోతున్నాను. ఆమె వాళ్లతో తిరగడం తట్టుకోలేక పోతున్నాను. ఏం చేయాలో చెప్పండి. - సురేశ్, హైదరాబాద్ మనకు దొరకనిది ఎప్పుడూ బాధగానే ఉంటుంది. మోహం ఎక్కువైతే, అది వ్యామోహం అవుతుంది. ఎనిమిదో క్లాసులో ఉండగా ప్రేమలో పడ్డ మీరు, ఏ గమ్యం ఊహించి ప్రేమిస్తున్నారు? కేవలం తిరగడం (ఈ పదం మీరు వాడిందే) కోసం అయితే, మీరు నచ్చకే కదా ఆమె మీతో తిరగటానికి ఒప్పుకోవడం లేదు. లేకపోతే పెళ్లి చేసుకుందామని ప్రేమిస్తే మాత్రం, మీరు అదృష్టవంతులు. ఎందుకంటే భార్య అయిన తర్వాత తిరిగితే మరింత బాధ కదా. ఇలా పాజిటివ్‌గా ఆలోచించండి. జీవితంలో పైకి వస్తే, మిమ్మల్నే బోలెడు మంది ప్రేమిస్తారు. ఐన్‌స్టీన్ నుంచి అబ్దుల్ కలాం దాకా అందరూ ప్రేమించబడ్డారు. నేను బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను. నా వయసు 23 ఏళ్లు. డిగ్రీ తర్వాత అక్వాఫార్మాలో పని చేశాను. రెండేళ్లుగా వాళ్ల షాప్‌లో అకౌంట్స్ చూస్తున్నాను. కారణం మా ఇంట్లో వాళ్లు ఆ షాప్ వాళ్లకు అప్పు ఉండటం. అది ఇప్పుడు తీరిపోయింది. ఇప్పుడు నాకు మార్కెటింగ్‌లో జాబ్ వచ్చింది. మంచి జీతం కూడా. చేయగలనన్న నమ్మకం కూడా నాకుంది. అయితే, మా ఇంట్లో వాళ్లకు అది ఇష్టం లేదు. షాప్‌లో పని చేయమని పోరుపెడుతున్నారు. ఎంత చెప్పినా వినడం లేదు. ఇన్నాళ్లూ వాళ్లకు నచ్చినట్లు ఉన్నాను. ఇక నుంచైనా నాకు నచ్చినట్లు ఉండాలనుకుంటు న్నాను. వాళ్లు మాత్రం ‘నువ్వు మా కంట్రోల్లోనే ఉండాలి. బయటకు వెళితే మా మాట వినవు’ అంటున్నారు. జీవితంలో ఇలా బతకాల్సిందేనా? ఏం చేయాలో మీరే సలహా ఇవ్వండి. - రాకేశ్, నెల్లూరు ఒక చక్కటి సాయంత్రం మీరొక నావలో వ్యాహ్యాళి వెళ్తున్నారనుకుందాం. మీతో పాటు కుళ్లిన శవం ఒకటి ప్రవాహంతో పాటూ వస్తోంది. భరించలేని దుర్గంధంతో ఉన్న ఆ శవం నుంచి దూరంగా వెళ్దామనుకున్నారు. ప్రవాహవేగంతో మీరూ వేగంగా ముందుకుపోతారా? ఎదురు తెడ్డు వేసుకుంటూ వెనక్కి పయనిస్తారా? ఏది ఎక్కువ శ్రమతో కూడిన వ్యవహారం? ఈ ప్రశ్నకి రోవింగ్‌లో ఎంతో అనుభవం ఉన్నవారూ, నీటి మీద తరచూ ప్రయాణాలు చేసేవారు కూడా తప్పుడు సలహా ఇస్తారు. వేగంగా... ప్రవాహంతో పాటూ ముందుకు వెళ్లి పోవటమే మంచిదని అంటారు. విజ్ఞులు మాత్రం ముందుకు వెళ్లినా, వెనక్కి వెళ్లినా ఒకే శ్రమ అంటారు. నీటికి ఎదురు తెడ్డు వేసుకుంటూ వెళ్లాలంటే రెట్టింపు బలం అవసరం. చిత్రమేమిటంటే ముందుకు వెళ్లాలన్నా ‘రెట్టింపు శ్రమతోనే’ తెడ్డు వేయాలి. ఎందుకంటే, ప్రవాహశక్తి శవానికి, పడవకూ ఒకటే. ప్రవాహవేగంతో శవం కూడా మనతో ప్రయాణం చేస్తోంది...! అది తెలుసుకోవటమే విజ్ఞత. మరేం చెయ్యాలి? చుక్కాని ఉంటే, కాస్త దిశ మార్చి పట్టుకోవాలి. తెరచాప ఉంటే గాలివాటం చూసుకోవాలి. అప్పుడు ప్రవాహమే మనల్ని దుర్గంధానికి దూరంగా తీసుకెళ్తుంది. ఇదే జీవితసూత్రం. ఈ సూత్రం తెలియని వారు దుర్గంధంతో పాటు పయనిస్తూ, తెడ్డు ఎంత వేగంగా వేసినా ఫలితం రాలేదని వాపోతారు. ఇష్టం లేని షాపులో పని కొనసాగించమని మీ పెద్దలు ఎందుకు చెబుతున్నారు? అప్పు తీరిపోయింది కదా. దానివల్ల వారికిగానీ, మీకు గానీ ఏం లాభం? మీకు మంచి ఉద్యోగం వచ్చిందంటున్నారు. దానికి వారు ఎందుకు అడ్డుపడుతున్నారు? కొత్త ఉద్యోగం అంటే వారి నుంచి మీరు దూరంగా వెళ్లాలా? అది వారికి ఇష్టం లేదా? మార్కెటింగ్ అంటే బాగా తిరగాలా? అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని వారి భయమా? ఇంట్లో వారికి మనపై ఉండే ప్రేమలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. కానీ వారు ఇచ్చే సలహాలు కేవలం ప్రేమతో/ స్వార్థంతో కూడుకున్నవా? తర్కంతో కూడుకున్నవా? అన్నది మనం ఆలోచించుకోవాలి. మన జీవితం మనది కదా. అయితే, మీ పెద్దవాళ్లు ఎందుకు వద్దంటున్నారో క్లియర్‌గా తెలుసుకోండి. మీ వాదనలు వినిపించండి. వారి వాదనలు వినండి. అప్పుడు లాభనష్టాలు బేరీజు వేసుకొని మీ నిర్ణయంతో వారిని ప్రభావితం చేయండి. - యండమూరి వీరేంద్రనాథ్ -
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. ఏపీ మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ రోజు ఉదయం 10 గంటలకు విజయవాడలో విడుదల చేశారు. తొలిసారిగా ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇంటర్ పరీక్షల ఫలితాలను రికార్డు స్థాయిలో 28 రోజుల లోపే విడుదల చేసినట్లు మంత్రి గంటా తెలిపారు.ఒకేషనల్ కోర్సు ఫలితాలను కూడా తొలిసారిగా ఆన్ లైన్ ద్వార విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఫస్టియర్ 68.05, సెకండియర్ 73.78 ఉత్తీర్ణత శాతం నమోదైంది. మొత్తం ఫస్టియర్ 4,67,747 సెకండియర్ 4,11941 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫస్టియర్ లో 3,18,120 సెకండియర్ 3,03,934 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలలో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉండగా.. ఫస్టియర్ లో అనంతపురం, సెకండియర్ లో కడప జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలను మే 24 తేదీ నుంచి నిర్వహించనున్నట్లు మంత్రి గంటా తెలిపారు. సప్లమెంటరీ పరీక్షల ఫీజును చెల్లించేందుకు ఏప్రిల్ 26 చివర తేదీగా ప్రకటించారు. -
తమ్ముడి పరీక్ష రాస్తూ పట్టుబడిన అన్నయ్య
ఇంటర్ ఫస్ట్ఇయర్ ఇంగ్లిష్ పరీక్షకు 94.47 శాతం హాజరు సాక్షి, హైదరాబాద్: ఇంటర్లో గట్టెక్కించ్చేందుకు తమ్ముడి పరీక్ష రాసిన అన్నయ్య కటకటాల పాలయ్యాడు. నగరంలోని గోకుల్ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. చంచల్గూడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ ఇంటర్ చదువుతున్న జాఫర్ అలీ ఇంగ్లిష్ పరీక్షను గండిపేట్ ఎంబీఐటీలో బీటెక్ చదువుతున్న అస్దర్అలీ రాశాడు. అనుమానం వచ్చిన చీఫ్ సూపరింటెండెంట్ హాల్‌టికెట్‌ను తనఖీ చేశారు. అందులోని ఫొటోకు, పరీక్ష రాస్తున్న అస్దర్కు పోలిక లేకపోవడంతో అతడిని నిలదీశారు. దీంతో తన తమ్ముడి కోసం పరీక్ష రాసేందుకు వచ్చినట్లు ఒప్పుకున్నాడు. కళాశాల ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు అస్దర్ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై 491, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, శనివారం రిమాండ్‌కు తరలిస్తామని పోలీసులు తెలిపారు. కాగా, వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్ తెచ్చినా పరీక్షకు అనుమతించాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి వారం రోజులుగా మొత్తుకుంటున్నా... క్షేత్ర స్థాయిలో అధికారులు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. కరీంనగర్ జిల్లా ఎన్టీపీసీ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో వెబ్సైట్ హాల్‌టికెట్ తెచ్చిన ఓ విద్యార్థిని పరీక్షా కేంద్రం అధికారులు లోనికి అనుమతించలేదు. అలాగే.. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట పరీక్షా కేంద్రంలో ఫర్నిచర్ లేక విద్యార్థులు నేలపైనే కూర్చొని రాయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇంటర్‌బోర్డు నుంచి వెళ్లిన ప్రత్యేక పరిశీలకులే ఈ దృశ్యం చూసి దిగ్భ్రాంతి చెందారు. 94.47 శాతం హాజరు: శుక్రవారం జరిగిన ఇంటర్మీడియెట్ ఫస్టియర్ ఇంగ్లిష్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 94.47 శాతం హాజరు నమోదైంది. మొత్తం 5,08,415 మందికి గాను 4,80,312 మంది హాజరయ్యారు. మొత్తం ఐదు మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. -
జూనియర్ ఇంటర్ పరీక్షలు ప్రారంభం
చల్లపల్లి : ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు బుధవారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. చల్లపల్లిలో ఆరు ప్రైవేటు, ఎయిడెడ్, గురుకుల జూనియర్ కళాశాలలకు చెందిన 790 మంది విద్యార్థులు మూడు కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్నారు. తొలిరోజు నిర్వహించిన తెలుగు, హిందీ, సంస్కృత పరీక్షలకు 21 మంది గైర్హాజరయ్యారు. ఎస్సార్‌వైఎస్పీ జూనియర్ కళాశాలలో 200 మందికి గాను 196 మంది, విజయ జూనియర్ కళాశాలలో 244కుగాను 233 మంది, ఎస్సార్‌వైఎస్పీ కళాశాలలో 346కుగాను 340 మంది హాజరయ్యారు. కస్టోడియన్ సూర్యదేవర నాగేశ్వరరావు పర్యవేక్షణలో పరీక్షలను చీఫ్ సూపరింటెండెంట్లు తగిరిశ సాంబశివరావు, బి.శ్రీనివాసరావు, ఎం.ఎస్.ఆర్.కె. ప్రసాద్, డిపార్ట్మెంటల్ అధికారులు వై.ఎన్.ఎల్.పద్మావతి, ఏ.శ్రీనివాసరావు, ఎల్. వెంకటేశ్వరరావు నిర్వహించారు. అవనిగడ్డకు తరలిన విద్యార్థులు కోడూరు: ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రారంభించిన పరీక్షలకు కోడూరు నుంచి 189 మంది విద్యార్థులు అవనిగడ్డలో పరీక్ష రాసేందుకు వెళ్లారు. స్థానిక మారుతీ కళాశాల నుంచి 56 మంది, బాలభాను జూనియర్ కళాశాల నుంచి 133 మంది మొదటి సంవత్సరం పరీక్షకు వెళ్లినట్లు ఆయా కళాశాలల అధినేతలు దుట్టా శివరామప్రసాద్, జె.వి.ఎస్.ఎస్. మూర్తి తెలిపారు. -
ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థి బలి
-
ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థి బలి
చెట్టుకు ఉరివేసుకున్న ‘అనంత’ విద్యార్థి నెల్లూరులోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్న మధువర్దన్‌రెడ్డి కదిరి: ర్యాగింగ్ భూతానికి బలైన రిషితేశ్వరి పేరు ఇంకా అందరి మదిలో మెదులుతూనే ఉంది... ఏపీలోని పొట్టి శ్రీరా ములు నెల్లూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి మధువర్దన్‌రెడ్డి అదే భూతానికి బలయ్యాడు. పదోతరగతిలో 10కి 10 పాయింట్లు సాధించిన మధువర్దన్ను తమ కళాశాలలో చేరమని యాజమాన్యం కోరడంతో అక్కడ తనకు ఏ లోటూ ఉండదని భావించి చేరాడు. నెల రోజులు కూడా తిరక్కుండానే ర్యాగింగ్ భూతానికి బలయ్యాడు. ఆ విద్యార్థి తండ్రి పోలీసులకిచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి.. అనంతపురం జిల్లా దొన్నికోటవారిపల్లికి చెందిన కాలువ రాజేశ్వరి, బ్రహ్మానందరెడ్డి దంపతుల రెండో కుమారుడు మధువర్దన్‌రెడ్డి టెన్త్‌లో 10కి 10 పాయింట్లు సాధించాడు. ఈ విషయం తెలుసుకున్న నెల్లూరులో కళాశాల యాజమాన్యం... తమ కళాశాలలో ఇంటర్ చేరమని ఫోన్ చేసి కోరడంతో ఆ విద్యార్థి తండ్రి జూన్ 14న మధువర్దన్రెడ్డిని అక్కడ చేర్పించారు. అక్కడ స్లిప్ టెస్టుల్లో మధువర్దన్‌రెడ్డి టాపర్‌గా నిలవడం కొందరిని అసూయకు గురి చేసింది. ఈ విషయం వారు సీనియర్ విద్యార్థుల దృష్టికి తీసుకెళ్లడంతో... జూలై 11న అర్ధరాత్రి సమయంలో మధును రక్తం కారేలా కొట్టి తీవ్రంగా గాయపరిచారు. మధువర్దన్‌రెడ్డి ఈ విషయాన్ని కళాశాల క్యాంపస్ ఇన్చార్జ్ శ్రీరాములురెడ్డి, ప్రిన్సిపల్ కిరణ్‌ల దృష్టికి తీసుకెళ్లాడు. ఇలాంటివన్నీ లైట్ తీసుకోవాలని చెప్పి హాస్టల్ గదికి పంపేశారు. అయితే దీనిని అవమానంగా భావించిన మధు 12వ తేదీనే ఇంటికి వచ్చేశాడు. తండ్రి బ్రహ్మానందరెడ్డి ఫోన్‌చేసి అడిగితే యాజమాన్యం నుండి సరైన సమాధానం రాలేదు. కొత్తలో ర్యాగింగ్ లాంటివి మామూలే.. కొద్ది రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి.. అని చెప్పి ఫోన్ కట్ చేశారు. ఇక ఆ కాలేజ్‌కు వెళ్లకూడదని, మరో కాలేజీలో చేరాలని మధు నిర్ణయించుకున్నాడు. అయితే 30వ తేదీన కళాశాల క్యాంపస్ ఇన్చార్జ్ శ్రీరాములురెడ్డి మధు తండ్రికి ఫోన్ చే సి.. ఇంకోసారి అలా జరక్కుండా జాగ్రత్త పడతాం. మీ అబ్బాయిని పంపండని కోరారు. అయితే మీరే మాట్లాడండని ఆయన ఫోన్ మధుకి ఇచ్చారు. సిగ్నల్స్ సరిగా రాకపోవడంతో మిద్దెపై కెక్కి మధు ఏం మాట్లాడాడో తెలీదు.. అరగంటకే తాను కాలేజ్‌కి వెళ్లేందుకు బట్టలు ఇస్త్రీ చేయించుకొస్తానని వెళ్లాడు. రాత్రి 10 గంటలైనా ఇంటికి రాకపోయేసరికి రాత్రంతా గాలించారు. శుక్రవారం ఉదయాన్నే వారి మామిడితోట సమీపంలోనే ఆ విద్యార్థి తీసుకెళ్లిన ద్విచక్ర వాహనం నిలిపి ఉండటం గమనించిన గ్రామస్థులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చుట్టూ వెదికితే సమీపంలోని మామిడిచెట్టుకు మధువర్దన్‌రెడ్డి ఉరేసుకొని వేలాడుతూ కన్పించడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కుప్పకూలారు. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, నెల్లూరు జిల్లా పిడతాపోలూరులో ఉన్న ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థి మధువర్ధన్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి శుక్రవారం ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సందర్శకుల గది, కళాశాల కిటికీలు, తలుపుల అద్దాలు ధ్వంసం చేశారు. కళాశాలకు సంబంధంలేదు: ప్రిన్సిపల్ మధువర్ధనరెడ్డి కళాశాలలో చేరినప్పటి నుంచీ ముభావంగా ఉన్నాడని, ఇక్కడ చదువుకోవడమే ఇష్టం లేదన్నట్టు వ్యవహరించాడని ప్రిన్సిపల్ కిరణ్ చెప్పారు. ఈ నెల 28న తండ్రితోపాటు కళాశాలకు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ చదువుకోనని గట్టిగా చెప్పాడని, కళాశాలను, గదిని ఖాళీ చేసి, ల గేజ్తోపాటు వెళ్లిపోయారని, ఈ ఘటనతో తమకు సంబంధం లేదన్నారు. -
అదే జోరు
ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల హవా రాష్ర్టంలో మూడో స్థానం 76శాతం ఉత్తీర్ణత బాలురకంటే బాలికలే టాప్ విశాఖపట్నం: ఇంటర్ ఫస్టియర్‌లోనే కాదు మంగళవారం ప్రకటించిన రెండో సంవత్సరం ఫలితాల్లోనూ జిల్లా విద్యార్థులు భళా అనిపించారు. 76శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో జిల్లాను తృతీయ స్థానంలో నిలిపారు. కిందటేడాది కూడా ఇంతే ఉత్తీర్ణత శాతం సాధించి ద్వితీయ స్థానం సంపాదించారు. రాష్ట్ర స్థాయిలో మార్కుల సాధనలో మాత్రం జిల్లా విద్యార్థులే అగ్రగామిగా నిలిచారు. ఎస్. శ్రావ్య ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు 990 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. అదే విధంగా 989 మార్కులు అయిదుగురు పొందగా 980 మార్కులకు పైగా వంద మంది విద్యార్థులు మార్కులు సాధించి విద్యాపరిమళాలు వెదజల్లారు. ఈ ఫలితాల్లో కూడా బాలిక ల హవానే కొనసాగింది. బాలురు 75శాతం ఉత్తీర్ణత సాధించగా బాలికలు 77శాతం ఉత్తీర్ణులయ్యారు. అయితే ఒకేషనల్ విభాగంలో జిల్లా పూర్తిగా దిగజారింది. కిందటేడాది 92శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలవగా ఈ ఏడాది 70శాతం ఉత్తీర్ణతతో 7వ స్థానానికి తగ్గిపోయింది.గొలుగొండ, జి.మాడుగుల గురుకుల కళాశాల విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించారు. 76శాతం ఉత్తీర్ణత : ఈ ఏడాది ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు జనరల్ కోర్సుల నుంచి 41,088 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 76శాతంతో 31,174 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 21,121 మంది పరీక్షలు రాయగా 75శాతంతో 15,766 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 19,967 మంది పరీక్షలు రాయగా 77శాతంతో 15,408 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో 3,071 మంది పరీక్షలు రాయగా 70శాతంతో 2,153 మంది పాసయ్యారు. బాలురు 1553 మంది పరీక్షలు రాయగా 73శాతంతో 1140 మంది పాసయ్యారు. బాలికలు 1518 మంది పరీక్షలు రాయగా 67శాతంతో 1013 మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కూడా ఉత్తీర్ణతలో చతికిలబడ్డాయి. గత ఏడాదితో పోల్చుకుంటే 4శాతం ఉత్తీర్ణత త గ్గింది. జిల్లాలో 34 ప్రభుత్వ కళాశాల నుంచి 5,238 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 65.85శాతంతో 3449 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో అత్యధికంగా 98.69శాతంతో దేవరాపల్లి జూనియర్ కళాశాల ప్రథమ స్థానంలో నిలవగా అనకాపల్లి జూనియర్ కళాశాల 5శాతం, పాడేరు జూనియర్ కళాశాల 14.55శాతం, డుంబ్రిగుడ జూనియర్ కళాశాల 33.40శాతంతో వెనుకబడ్డాయి. జిల్లాలో ఎయిడెడ్ కళాశాలలు నుంచి 1621 మంది పరీక్షలు రాయగా 56.94శాతంతో 923 మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ గిరిజన సంక్షేమ కళాశాలల నుంచి 544 మంది పరీక్షలు రాయగా 84.01శాతంతో 457 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలోని 5 మోడల్ స్కూల్స్ నుంచి 180 మంది పరీక్షలు రాయగా 79.44శాతంతో 143 మంది ఉత్తీర్ణులయ్యారు. సివిల్ సర్వీసు చేయాలని ఉంది. అందుకే టెన్త్ నుంచి లక్ష్యంగా చదువుతున్నాను. రెండేళ్ల కష్టం ఫలితంగానే ఎంపీసీ గ్రూప్‌లో 990 మార్కులు వచ్చాయి. రోజుకు 10 నుంచి 12గంటలు ప్రిపరేయ్యేదాన్ని. ఫిజిక్స్ సబ్జెక్ట్ అంటే కొద్దిగా భయం. అందుకే ఫిజిక్స్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాను. జేఈఈ మెయిన్స్‌లో 165 మార్కులు వచ్చాయి. అడ్వాన్స్‌డ్‌కు ప్రిపేర్ అవుతున్నాను. కచ్చితంగా ఐఐటిలో సీటొస్తుందని నమ్మకం. కంప్యూటర్ సైన్స్ చదివి సివిల్స్‌కు ప్రిపేరవుతాను. నా చదువు వెనుక అమ్మానాన్నల ప్రోత్సాహం మరువలేను. నాన్న గోపాలకృ్షష్ణ రైల్వేలో పనిచేస్తున్నారు. అమ్మ జయమ్మ గృహిణి. -ఎస్.శ్రావ్య, ఎంపీసీ 990 మార్కులు (శ్రీచైతన్య నారాయణకళాశాల) -
ఇంటర్లో తగ్గిన ఉత్తీర్ణత
- ఫలితాల్లో వెనుకబడిన తేగాడ ఆదర్శ, తాళ్లపాలెం గురుకులం - పూర్తిస్థాయిలో అధ్యాపకులు లేక అవస్థలు - నిరాశ వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు కశింకోట: మండలంలోని ప్రభుత్వ ఆదర్శ, గురుకుల పాఠశాలలు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నాయి. వీటిలో కనీసం యాభై ఉత్తీర్ణత లభింలేదు. ఇక్కడ నిర్వహిస్తున్న ఆంగ్ల మాద్యమం కోర్సులకు సంబంధించి అవసరమైన అధ్యాపకులు లేకపోవడమే కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. మండలంలో తేగాడలో రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఆదర్శ పాఠశాలలో నాలుగు గ్రూపులతో ఇంటర్మీడియెట్ నిర్వహిస్తున్నారు. ఇదే పాఠశాల నుంచి ఈ ఏడాఇ 57 మంది ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు హాజరుకాగా, 26 మంది మాత్రమే పాసయ్యారు. 46 శాతం ఉత్తీర్ణత లభించింది. బైపీసీలో 14 మందికి ఐదుగురు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఇక సీఈసీ గ్రూపులో ఉత్తీర్ణత దారుణం. 17 మందికి ఇద్దరు మత్రమే పాసయ్యారు. ఎంఈసీ గ్రూపులో కూడా 8 మందికి ఇద్దరు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీ గ్రూపులో పెదపాటి జానకి 389 మార్కులు, మంత్రి సాయికుమార్‌కు 369 మార్కులు రావడం అక్కడి ప్రమాణాలకు అద్దం పడుతున్నాయి. ఇక్కడ కెమిస్ట్రీ అధ్యాపకుడు లేకపోవడం, తెలుగు మాధ్యమంలో మొదటి నుంచి చదివి వచ్చిన విద్యార్థులు ఒక్కసారిగా ఆంగ్ల మాధ్యమంలో మారి పరీక్షలు రాయడం తదితర కారణాల వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గురుకుల పాఠశాలలోనూ... మండలంలోని తాళ్లపాలెం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలోని ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా ఆశాజనకంగా లేవు. ఈ ఏడాది సుమారు 40 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఇక్కడ ఎంఈసీ, సీఈసీ గ్రూపులను ఈ విద్యా సంవత్సరంలోనే ఆంగ్ల మాధ్యమం కొత్తగా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆంగ్లం, ఎకనామిక్స్ సబ్జెక్టులకు తప్ప మిగిలిన సబ్జెక్టులకు కాంట్రాక్టు ఉపాధ్యాయులతో నెట్టుకొచ్చారు. దీంతోపాటు విద్యార్థులు ఎక్కువ మంది తెలుగు మాధ్యమం నుంచి వ చ్చిన వారు కావడం వల్ల ఉత్తీర్ణత శాతం తగ్గడానికి కారణంగా తెలుస్తోంది. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఉపాధ్యాయ సిబ్బందిని నియమించి విద్యా ప్రమాణాలు పెంపొందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఫలితాల విడుదల
-
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ మే 25 నుంచి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ రెండు వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. గురువారం మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రథమ సంవత్సర పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఫలితాల వివరాలు తెలియజేసిన ఆయన అనంతరం మాట్లాడుతూ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల వివరాలు తెలియజేశారు. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు మే 1 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రీ కౌంటింగ్ కోసం రూ.600 మీ సేవా ద్వారా, ఏపీ ఆన్ లైన్ ద్వారా కూడా చెల్లించే వెసులుబాటు ఉంది. కాగా, ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షల్లో జనరల్ విభాగాల్లో 72 మందిపై, ఒకేషనల్ విభాగంలో 12 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలియజేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 4శాతం ఉత్తీర్ణత పెరిగింది. -
ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాలను విడుదల చేశారు. 62.98 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 4,61,932 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, బాలుర ఉత్తీర్ణత శాతం 59 గాను, బాలికల ఉత్తీర్ణత శాతం 67 గాను నమోదైంది. ఎప్పటిలాగే బాలుర కంటే బాలికలే ఎక్కువ శాతం ఉత్తీర్ణులయ్యారు. జనరల్‌లో 52.13 శాతం మందికి ఎ గ్రేడ్, 24.08 శాతం మంది బి గ్రేడ్, 13 శాతం మంది సి గ్రేడ్, 6.10 శాతం మంది డి గ్రేడ్‌లో పాసయ్యారని గంటా శ్రీనివాసరావు తెలిపారు. కృష్ణాజిల్లా (76 శాతం) అగ్రస్థానంలో నిలిచింది. వైఎస్ఆర్ కడప (59 శాతం) జిల్లా చిట్టచివరి స్థానంలో ఉంది. వచ్చే సంవత్సరానికి అక్కడ ఫలితాలు మెరుగుపరిచేందుకు ప్రయత్నం చేస్తామని గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఒకేషనల్‌లో 60 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పూర్తి మార్కులతో కూడిన ఫలితాలకు ఇక్కడ క్లిక్ చేయండి. -
22న ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు
హైదరాబాద్ : ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర ఫలితాలు ఈనెల 22న విడుదల కానున్నాయి. జనరల్, ఒకేషనల్ విద్యార్థుల ఫలితాలను ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేయనున్నారు. ఫలితాలను http://examresults.ts.nic.in, http://results.cgg.gov.in, www.sakshieducation.com వెబ్ సైట్ల ద్వారా పొందవచ్చు. కాగా ద్వితీయ సంవత్సర ఫలితాలను ఈనెల 28న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాలను పొందేందుకు మరిన్ని సదుపాయాలు : విద్యార్థులు బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌ఫోన్ ద్వారా 1100 (పరిష్కారం కాల్ సెంటర్) నెంబరుకు, మరే ఇతర ల్యాండ్‌ఫోన్/మొబైల్ ద్వారా అయినా 18004251110 నెంబరుకు ఫోన్ చేసి పొందవచ్చు. అలాగే ఏపీ ఆన్లైన్ కేంద్రాలు, ఈసేవా/మీసేవా/రాజీవ్ సిటిజన్ సర్వీస్ సెంటర్ల్లోనూ పొందవచ్చు. ఎస్ఎంఎస్ ద్వారా పొందాలంటే బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఇంటర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రూల్ నెంబరు టైప్ చేసి 53346 నెంబరుకు ఎస్ఎంఎస్ పంపించి ఫలితాలు పొందవచ్చు. ఏ నెట్వర్క్ వినియోగదారులైనా ఇంటర్మీడియట్ జనరల్ ఫలితాల కోసం ఐపీఈ2 అని టైప్ చేసి(క్యాపిటల్ లెటర్స్) స్పేస్ ఇచ్చి హాల్ టికెట్ నెంబరు టైప్ చేసి 54242 నెంబరు ఎస్ఎంఎస్ పంపించి పొందవచ్చు. ఒకేషనల్ విద్యార్థులైతే ఐపీఈవీ2 అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి హాల్‌టికెట్ నెంబరు టైప్ చేసి 54242 నెంబరుకు ఎస్ఎంఎస్ చేసి ఫలితాలను పొందవచ్చు. ప్రిన్సిపాళ్లు తమ కళాశాలల వారీ ఫలితాలను http://bietelangana.cgg.gov.in అనే వెబ్సైట్లో తమ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించి ఫలితాలను పొందవచ్చు. -
ఇంటర్లో 17 మంది విద్యార్థుల డిబార్
సాక్షి, సిటీబ్యూరో: జంట జిల్లాల పరిధిలో బుధవారం నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలో 17 మంది విద్యార్థులు డిబార్ అయ్యారు. హైదరాబాద్ జిల్లాలో మెహదీపట్నంలోని ఎల్బీ జూనియర్ కాలేజ్‌లో ఒకరు, శ్రీ అరబిందో జూనియర్ కాలేజీలో ఇద్దరు, పాతబస్తీలోని అల్హబెత్ కాలేజీలో నలుగురు, ఖైరతాబాద్‌లోని షాదాన్ జూనియర్ కాలేజీలో ఐదుగురు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో మరో ఐదుగురిపై మాల్ ప్రాక్టీస్ కింద కేసులు నమోదు చేసినట్లు జంట జిల్లాల ఆర్ఐఓలు రవికుమార్, గౌరీ శంకర్లు తెలిపారు. మొత్తం 2,01,248 మందికి గాను 1,90,721 మంది విద్యార్థులు (94.76 శాతం) పరీక్షకు హాజరయ్యారు. హైదరాబాద్ జిల్లాలో 94.62 శాతం, రంగారెడ్డి జిల్లాలో 94.87 శాతం విద్యార్థులు పరీక్ష రాశారు. -
ఇంటర్ ఫస్టియర్‌లో బాలికల హవా
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ఇంటర్మీడియెట్ ప్రథ మ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో బాలికలు విజయఢంకా మోగించారు. జనరల్, ఒకేషనల్ కోర్సుల్లో సత్తా చాటారు. సోమవారం విడుదలైన ప్రథమ సంవత్సరం ఫలితాల్లో విశాఖ జిల్లాను రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిపారు. జనరల్ కోర్సుల్లో 66 శాతం, ఒకేషనల్ కోర్సుల్లో 51 శాతం ఫలితాలను జిల్లా విద్యార్థులు సాధించగా, ఇందులో బాలికల ఫలితాల శాతమే అత్యధికం. ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఈ ఏడాది కూడా బాలికలదే పైచేయి. రాష్ట్రంలో వరుసగా మూడు దఫాలు రెండో స్థానంలో నిలిచిన విశాఖ జిల్లా ఈ ఏడాది ఫలితాల్లో మూడో స్థానం దక్కించుకుంది. కిందటేడాది ఫలితాల్లో 66 శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానంలో నిలవగా, ఈ ఏడాది కూడా 66 శాతం ఫలితాలు సాధించినా రంగారెడ్డి జిల్లాకు 68శాతం ఉత్తీర్ణత రావడంతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. 74శాతంతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ కోర్సుల్లో 51 శాతంతో రాష్ట్రంలో నాల్గో స్థానం దక్కింది. రాష్ట్రంలో మంచి స్థానమే సాధించినా గత ఏడాది 55శాతం సాధించిన ఫలితాలతో పోల్చుకుంటే 4 శాతం ఉత్తీర్ణత శాతం తగ్గింది. జనరల్ కోర్సుల్లో 45,161 మంది పరీక్షలు రాయగా 66శాతంతో 29,715 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో 3,557 మంది పరీక్షలకు రాయగా 51శాతంతో 1,813 మంది ఉత్తీర్ణులయ్యారు. మార్కుల్లో ముందంజ ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో మూడో స్థానం సాధించిన జిల్లా విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించడంలోనూ ముందంజలో నిలిచారు. అత్యధిక మార్కులు సాధించి తమ సత్తా చాటారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపుల్లో మెరుగైనా మార్కులు సాధించారు. శ్రీచైతన్య నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థులు బి.షర్మిల, పి.విశాల్వేదవ్యాస్ ఎంపీసీలో 466 మార్కులు సాధించి రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో నిలిచారు. నారాయణ శ్రీచైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు పి.యోగరాజశ్రీ బైపీసీలో 435 మార్కులు, ఎంఈసీలో శ్రీవిద్య 491 మార్కులు సాధించి ఉన్నత స్థానంలో నిలిచారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఫలితాలు అధ్వానం ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఉత్తీర్ణత అధ్వానంగా వచ్చాయి. ప్రభుత్వ కళాశాలలు 49 శాతం ఉత్తీర్ణతతో సరిపెట్టుకున్నాయి. ప్రభుత్వ కళాశాలల నుంచి 6327 మంది పరీక్షలు రాయగా 3,131 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 2,914 మంది పరీక్షలు రాయగా 46.5 శాతంతో 1,342 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 3,413 మంది పరీక్షలు రాయగా 52,42 శాతంతో 1,789 మంది ఉత్తీర్ణులయ్యారు. చింతపల్లి జూనియర్ కళాశాల 89.3 శాతంతో ప్రథమ స్థానంలో నిలవగా, అనకాపల్లి జూనియర్ కళాశాల 15శాతం ఉత్తీర్ణతతో చివర స్థానంలో నిలిచింది. నగరంలోని డాక్టర్ వి.ఎస్.కృష్ణ జూనియర్ కళాశాల ఫలితాలు నిరాశపరిచాయి. ఇక్కడ నుంచి 544 మంది పరీక్షలు రాయగా 105 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు సైతం మెరుగైనా ఫలితాలు సాధించడంలో విఫలమయ్యాయి. నర్సీపట్నం విద్యార్థినికి రాష్ట్ర స్థాయిలో రెండోర్యాంకు నర్సీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నర్సీపట్నం విద్యార్థిని సంచలనం సృష్టించింది. శ్రీవిద్య జూనియర్ కళాశాలకు చెందిన శెట్టి దీప్తి ఎంపీసీలో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. ఈమె 465 మార్కులు సాధించినట్టు కళాశాల ప్రిన్సిపాల్ గాడి శేషగిరిరావు తెలిపారు. పెదపల్లి దేవ (430), పెదపూడి ఆదిత్య (430), బోళెం రాజా (421) కూడా ప్రతిభ చూపారు. బైపీసీలో కొక్కుల చంద్రశ్రీ (429- పట్టణంలో రెండో ర్యాంకు), సి.హెచ్.భువనకళ్యాణి (427), కె.దివ్య (419) రాణించారు. విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది అభినందించారు. -
ఇంటర్ ఫలితాల్లో కృష్ణా టాప్
హైదరాబాద్: ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. సోమవారం గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 55.84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలకు 8,68,744 మంది విద్యార్థులు హాజరవగా, 4,85,069 మంది ఉత్తీర్ణులైనారు. ఇందులో బాలికలదే పైచేయి. బాలికలు 60.52 శాతం, బాలురు 51.37 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాల వారీగా చూస్తే కృష్ణా ప్రథమ స్థానంలో నిలిచింది. కృష్ణా జిల్లా 74 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఇక రంగారెడ్డి జిల్లా 68 శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానం దక్కించుకుంది. కాగా 38 శాతం ఉత్తీర్ణతతో ఆదిలాబాద్ జిల్లా చివరి స్థానానికి పరిమితమైంది. మే 25న అడ్వాన్స్డ్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. -
కోనేరులో పడి విద్యార్థి మృతి
చిల్లాపురం (సంస్థాన్ నారాయణపురం) న్యూస్‌లైన్: కోనేరులో పడి ఓ విద్యార్థి మృతిచెందిన సంఘటన శనివారం మండలంలోని చిల్లాపురం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెంది న మేకల రామకృష్ణ(16) సంస్థాన్ నారాయణపురంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తల్లిద ండ్రులు పద్మ, పెద్దులు వ్యవసాయం తో పాటు మేకలను పెంచుతున్నారు. ఉదయం పత్తిచేలకు మందు వేయడానికి తల్లిదండ్రులు తమ వ్యవసాయ భూమి వద్దకు వెళ్లారు. వారికి సాయం చేసేందుకు రామకృష్ణ, తన తమ్ముడితో కలసి మేకలను తోలుకొని అక్కడికి వెళ్లాడు. ఇంటికి తిరిగి వచ్చే సమయంలో మందు చల్లిన జబ్బకు మట్టి అంటింది. దానిని కడిగేందుకు రామకృష్ణ శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో కడిగేందు కు వెళ్లాడు. అది ప్లాస్టిక్ జబ్బ కోనేరు లో పడింది. దాన్ని పట్టుకునేందుకు రామకృష్ణ నీటిలోకి దిగాడు. లోతు ఎక్కువగా ఉండడంతో ఈత రాక నీటి లో మునిగిపోయాడు. తమ్ముడు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి కోనేటిలో దూకి రామకృష్ణను బయటికి తీశారు. అప్పటికే అతడు మృతిచెందాడు. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.