ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. మంగళవారం గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ ఫలితాలను విడుదల చేశారు.
హైదరాబాద్: ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. సోమవారం గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 55.84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలకు 8,68,744 మంది విద్యార్థులు హాజరవగా, 4,85,069 మంది ఉత్తీర్ణులైనారు. ఇందులో బాలికలదే పైచేయి. బాలికలు 60.52 శాతం, బాలురు 51.37 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
జిల్లాల వారీగా చూస్తే కృష్ణా ప్రథమ స్థానంలో నిలిచింది. కృష్ణా జిల్లా 74 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఇక రంగారెడ్డి జిల్లా 68 శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానం దక్కించుకుంది. కాగా 38 శాతం ఉత్తీర్ణతతో ఆదిలాబాద్ జిల్లా చివరి స్థానానికి పరిమితమైంది. మే 25న అడ్వాన్స్‌డ్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.