ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. ఏపీ మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ రోజు ఉదయం 10 గంటలకు విజయవాడలో విడుదల చేశారు. తొలిసారిగా ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇంటర్ పరీక్షల ఫలితాలను రికార్డు స్థాయిలో 28 రోజుల లోపే విడుదల చేసినట్లు మంత్రి గంటా తెలిపారు.ఒకేషనల్ కోర్సు ఫలితాలను కూడా తొలిసారిగా ఆన్ లైన్ ద్వార విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఫస్టియర్ 68.05, సెకండియర్ 73.78 ఉత్తీర్ణత శాతం నమోదైంది. మొత్తం ఫస్టియర్ 4,67,747 సెకండియర్ 4,11941 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫస్టియర్ లో 3,18,120 సెకండియర్ 3,03,934 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలలో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉండగా.. ఫస్టియర్ లో అనంతపురం, సెకండియర్ లో కడప జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలను మే 24 తేదీ నుంచి నిర్వహించనున్నట్లు మంత్రి గంటా తెలిపారు. సప్లమెంటరీ పరీక్షల ఫీజును చెల్లించేందుకు ఏప్రిల్ 26 చివర తేదీగా ప్రకటించారు.