ganta srinivasarao
-
టికెట్ ఎఫెక్ట్.. గంటా రహస్య భేటీ!
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలోని రుషికొండలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌజ్‌లో మాజీ మంత్రి గంటా తన అనుచరులతో రహస్య సమావేశం అయ్యారు. టీడీపీలో కొనసాగాలా? లేదా? అనే అంశంపై అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు. గంటా.. టీడీపీ అధిష్టానం వైఖరితో విసిగిపోయారు. టీడీపీ రెండో జాబితాలో కూడా గంటా శ్రీనివాస్‌కు టికెట్ కేటాయించలేదు. మొదటి నుంచీ భీమిలి టికెట్ కోసం గంటా పట్టుబట్టటారు. అయితే చంద్రబాబు మాత్రం గంటాకు భీమిలి టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఇదే విషయంలో తనకు కావాల్సిన టికెట్ లభించకపోతే.. గంటా పార్టీ మారే యోచనలో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. -
ఆ నాలుగూ అలా కొట్టేశారా ?
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రమంతటా కనీవినీ ఎరుగని రీతిలో వీచిన ఫ్యాన్ గాలికి బలమైన టీడీపీ కోటలన్నీ తుత్తునీయలయ్యాయి. విశాఖ జిల్లాలోనూ అదే ఉద్ధృతి.. మొత్తం గ్రామీణ జిల్లాతోపాటు విశాఖ శివారులోని మూడు నియోజకవర్గాల్లోనూ చతికిలపడిపోయిన అధికార టీడీపీ నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం ఎలా నెగ్గుకురాగలిగిందన్న ఆశ్చర్యం, అనుమానాలు ఇప్పటికీ వ్యక్తమవుతూనే ఉన్నాయి. మంత్రి హోదాలో ఉత్తరం నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు కేవలం 1800 ఓట్లతో బయటపడటం, దక్షిణంలోనూ 3893 ఓట్ల తేడాతో వాసుపల్లి గణేష్‌కుమార్ గట్టెక్కగా మిగిలిన పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లోనూ టీడీపీ నెగ్గుకురావడానికి కారణాలేమిటి?.. తెర వెనుక ఏం జరిగిందన్న చర్చ ఇప్పటికీ సాగుతోంది.దీని వెనుక పెద్ద కుట్రే జరిగిందన్న వాదనలు తాజాగా బయటకొస్తున్నాయి. ఇందులో జీవీఎంసీ అధికారుల పాత్రపై బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఒకే ఒక్కడిపై ఇవన్నీ కేంద్రీకృతమవుతున్నాయి. జీవీఎంసీ యూసీడీ ప్రాజెక్టు అధికారులు ఇళ్ల లబ్ధిదారులను దాదాపు బ్లాక్మెయిల్ చేసి టీడీపీకి ఓట్లు వేయించారని.. ఈ తతంగాన్ని సదరు ప్రాజెక్టు ముఖ్య అధికారి అంతా తానై నడిపించారని అంటున్నారు.ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకొని తలా రూ.25 వేలు చొప్పున డీడీలు కట్టిన నగరంలోని సుమారు 40వేల కుటుంబాలను.. టీడీపీని గెలిపిస్తేనే ఇళ్లు వస్తాయని, లేదంటే మీరు కట్టిన డబ్బులు కూడా పోతాయని యూసీడీ అధికారులే బెదిరించి వారి చేత బలవంతంగా టీడీపీకి ఓట్లు వేయించినట్లు తెలుస్తోంది. ఇదే నగరంలో ఆ నలుగురు టీడీపీ అభ్యర్థులను ఓటమి నుంచి బయటపడేసిందంటున్నారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో నగరంలో టీడీపీకి మద్దతుగా జీవిఎంసీ యూసీడీ(అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్) ప్రాజెక్ట్ ముఖ్య అధికారి ఆధ్వర్యంలో పెద్ద తతంగమే నడిచిందని యూసీడీ వర్గాలే చెప్పుకొస్తున్నాయి. సదరు అధికారి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్లకు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందాడు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు సెలవులో వెళ్లిన ఆ అధికారి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఆగమేఘాలపై రంగంలోకి దిగాడు. ఇళ్ల కోసం దరఖాస్తు చేసిన ప్రతిఒక్కరితో మాట్లాడాడు. మీకు ఇళ్లు రావాలంటే టీడీపీకి ఓటు వేయాల్సిందేనని నిస్సిగ్గుగా ప్రచారం చేశాడు. ఒక విధంగా బెదిరింపులకు పాల్పడ్డాడు. మొదటి నుంచి అతగాడిది ‘పచ్చ’పాతమే టీడీపీ మాదే.. అని భావించే సామాజికవర్గానికి చెందిన ఆ అధికారి సోషల్ వెల్ఫేర్ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశారు. 2016 నుంచి ప్రాజెక్టు డైరెక్టర్(పీడీ)గా పనిచేశారు. 2018లో బదిలీ అయినా ఇక్కడే కొనసాగుతూ వచ్చారు. ఈయన ఆధ్వర్యంలో డ్వాక్రా గ్రూపుల రుణాలు, పింఛన్లు, ఇళ్ల మంజూరుతో పాటు కుట్టుమిషన్ల పంపిణీ వంటి కార్యక్రమాలు అమలు చేస్తుంటారు. ఏడాది క్రితం ఈయన ఆధ్వర్యంలోనే పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ జరిగింది. ఇదే అదునుగా ఎన్నికల ముందు నుంచి అప్పటి నగర ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేష్‌కుమార్, గంటా శ్రీనివాసరావు, గణబాబులతో అతి సన్నితంగా ఉండేవారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత వ్యూహం ప్రకారం నగరంలోని సుమారు 40 వేల మంది ఇళ్ల దరఖాస్తుదారుల చేత రూ.25 వేలు చొప్పున డీడీలు కట్టించేసుకున్నారు. ఆనక టీడీపీకి ఓటు వేస్తేనే ఇళ్లు ఇస్తామని.. లేదంటే మీ డీడీలు రద్దు చేస్తామని బెదిరింపులకు దిగారు. తనకు తోడుగా మరో అధికారిని కూడా తెచ్చుకున్నారు. గతంలో జోన్–3 ,5లలో జోనల్ కమీషనర్‌గా పనిచేసిన ఆ అధికారి.. ఎన్నికలకు కొంతకాలం ముందు తూర్పుగోదావరి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారిగా నియమితలయ్యారు. అయితే యూసీడీ ముఖ్య అధికారి ఇక్కడ లేని పోస్టు సృష్టించి.. ఆ అధికారిని డిప్యుటేషన్ మీద ఇక్కడికి తీసుకొచ్చి హౌసింగ్ స్ఫెషల్ అధికారిగా నియమించుకున్నారు. ఇద్దరూ కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పినట్టల్లా అడుతూ దరఖాస్తుదారులను తీవ్రంగా ప్రభావితం చేసి ఓట్లు దండుకున్నారు. ఫలితాల అనంతరం బదిలీ తీరా ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయఢంకా మోగించడంతో వారిలో భయం ఆవహించింది. నగరంలో తాము అనుకున్నది సాధించగలిగినా అధికారం టీడీపీ చేజారడంతో ఇక్కడే ఉంటే తమ బండారం బయట పడుతుందనే భయంతో సదరు యూసీడీ ముఖ్య అధికారి పలాయనం చిత్తగించారు. ఉన్న పళంగా బదిలీ చేయించుకుని మే 31న సాంఘిక సంక్షేమ శాఖకు వెళ్లిపోయారు. ఇదంతా జీవీఎంసీ ఉన్నతాధికారుల కనుసన్నుల్లోనే జరిగిందని ఉద్యోగవర్గాలు పేర్కొంటున్నాయి. -
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ రిలీజ్
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది పదవ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం విడుదల చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకూ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 6.10 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు మంత్రి గంటా తెలిపారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకూ జరగనున్నాయని, హాల్ టికెట్లను విద్యార్థులు ఆన్లైన్ ద్వారా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. నెల రోజుల్లో పరీక్షల ఫలితాలు విడుదల చేస్తామన్ని మంత్రి గంటా వెల్లడించారు. పరీక్షల షెడ్యూల్ : 18/03/2019, ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు) పేపర్-1 19/03/2019 , ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు) పేపర్-2 20/03/2019, సెకండ్ లాంగ్వేజ్ (హిందీ) 22/03/2019, ఇంగ్లీష్ పేపర్-1 23/03/2019, ఇంగ్లీష్ పేపర్-2 25/03/2019, మ్యాథ్స్ పేపర్-1 26/03/2019, మ్యాథ్స్ పేపర్-2 27/03/2019, జనరల్ సైన్స్ పేపర్-1 28/03/2019, జనరల్ సైన్స్ పేపర్-2 29/03/2019, సోషల్ స్టడీస్ పేపర్-1 30/03/2019, సోషల్ స్టడీస్ పేపర్-2 -
రామచంద్రమూర్తికి ఆత్మీయ సమ్మేళనం
-
ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఈసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. పాలిటెక్నిక్ కోర్సు అనంతరం ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏపీ ఈసెట్) ఫలితాలను ఏపీ మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం విడుదల చేశారు. మొత్తం 98.37 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఆంధ్రప్రదేశ్ ఈసెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు
సాక్షి, విశాఖ : ఏపీ ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రా యూనివర్శిటీలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో జూనియర్ ఇంటర్ పరీక్ష ఫలితాలను శుక్రవారం మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. 62శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో కృష్ణాజిల్లా ప్రథమ స్థానం, పశ్చిమ గోదావరి రెండో స్థానం, గుంటూరు జిల్లా మూడో స్థానంలో నిలవగా 48 శాతం ఉత్తీర్ణతతో వైఎస్సార్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ.. మార్కులు ఇవ్వడం వల్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అటువంటి ఆత్మహత్యలను నియంత్రించేందుకు గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.సుమారు నాలుగు లక్షల ఎనభైవేలమంది పరీక్షకు హాజరు కాగా వారిలో 2,95, 891 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత రెండు శాతం తగ్గింది. ఇక ఉత్తీర్ణత సాధించిన వారిలో బాలికలే పైచేయిగా నిలిచారు. పరీక్ష ఫలితాలను ప్రభుత్వం 44 వెబ్సైట్లలో అందుబాటులో ఉంచింది. వీటితో పాటు www.sakshieducation.com వెబ్సైట్లోను పరీక్షా ఫలితాలను చూడవచ్చు. ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు (జనరల్) - ఇక్కడ చూడండి ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు (వొకేషనల్) - ఇక్కడ చూడండి -
నిబంధనలు పాటించకపోతే ఏ కాలేజీనీ వదలం: గంటా
-
ఆ కాలేజీల హాస్టళ్లకు అనుమతుల్లేవ్
సాక్షి, అమరావతి: నారాయణ, శ్రీ చైతన్య కాలేజీలు ఎలాంటి అనుమతుల్లేకుండా అధిక సంఖ్యలో హాస్టళ్లు నడుపుతున్నాయని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఈ విధంగా అనుమతుల్లేకుండా నిర్వహిస్తున్న 158 హాస్టళ్లకు నోటీసులు జారీ చేసి.. మూడు నెలల గడువిచ్చినట్లు తెలిపారు. శుక్రవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంత్రి గంటా మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కుటుంబ సమస్యలు, ఒత్తిడి, ప్రేమ వైఫల్యాలే కారణమని చెప్పారు. ఇందులో ఇంటర్ బోర్డు వైఫల్యం కూడా ఉందన్నారు. కాలేజీలను మూసివేయడం, యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెట్టడం వంటివి సమస్యకు పరిష్కారం కాదన్నారు. ఈ నెల 16న రాష్ట్రంలోని అన్ని కాలేజీల యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణ కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలను ఈ సందర్భంగా స్పష్టం చేస్తామన్నారు. అన్ని కాలేజీల యాజమాన్యాలు.. చక్రపాణి కమిటీ సూచనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కాగా, పదో తరగతి మాదిరిగానే ఇంటర్లో కూడా గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టే యోచన చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 20 తర్వాత ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లతో కలసి జిల్లాల వారీగా పర్యటిస్తానని ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో తెలుగును తప్పనిసరి చేస్తూ త్వరలో జీవో జారీ చేస్తామన్నారు. 6,500 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని ఈ నెల 15న 6,500 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు మంత్రి గంటా తెలిపారు. ఈ కార్యక్రమం విజయవాడలో జరుగుతుందని చెప్పారు. -
సిట్ విచారణలో అన్నీ తేలతాయి: చంద్రబాబు
అమరావతి: విశాఖపట్టణం భూ కుంభకోణం వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆయన సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ 276 ఎకరాల భూముల రికార్డులు ట్యాంపర్ అయ్యాయన్నారు. కానీ, ఎక్కడా వాటిపై లావాదేవీలు జరగలేదని చంద్రబాబు తెలిపారు. ట్యాంపరింగ్‌కు పాల్పడ్డ 25మంది ఫోటోలతో పాటు వివరాలు ఉన్నాయని, సిట్ విచారణలో అన్నీ తేలతాయన్నారు. ల్యాండ్ పూలింగ్‌లో అక్రమాలకు పాల్పడితే రద్దు చేశామని, ఆధారాలు ఉంటే సిట్‌కు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. కాగా అక్రమాలపై ప్రశ్నించినందుకు ప్రతిపక్షంపై ముఖ్యమంత్రి ఎదురుదాడికి దిగారు. సీబీఐ విచారణ అడుగుతున్న వారివద్ద ఆధారాలు ఉన్నాయ అంటూ ఎదురు ప్రశ్నించారు. సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తూ 20ఏళ్ల సమయం పడుతుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. పనిలో పనిగా మంత్రి గంటా శ్రీనివాసరావుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. గంటా అడిగితే నేను సీబీఐ విచారణ వేయాలా అని వ్యాఖ్యలు చేశారు. విశాఖలో వందల ఎకరాల భూములు కబ్జా అవ్వడం, స్వయంగా మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అనిత, బండారు సత్యనారాయణ మూర్తి, పంచకర్ల రమేష్‌బాబు తదితర నేతలపై ఆరోపణలు వెల్లువెత్తడం తెలిసిందే. ఈ కుంభకోణం మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి డైరెక్షన్లో మంత్రి లోకేష్ సారథ్యంలోనే జరిగినట్లు విపక్షాలు, మేధావులు, మాజీ ఉన్నతాధికారులు, అధికారులు దుయ్యబడుతున్నారు. విశాఖ జిల్లాకే చెందిన సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు మీడియా సమావేశంలోనే ఈ భూముల కబ్జాపై వాస్తవాలు వెల్లడించారు. మరోవైపు విశాఖ భూ కుంభకోణంపై సీబీసీఐడీ, సీబీఐ లేదా జట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రికి గంటా శ్రీనివాసరావు లేఖ రాసిన విషయం తెలిసిందే. -
గంటాతో విభేదాలపై అయ్యన్నపాత్రుడి స్పందన!
అమరావతి: విశాఖపట్నంలో భూకుంభకోణాల విషయమై సహచర మంత్రి గంటా శ్రీనివాసరావుతో తనకు విభేదాలు ఉన్నట్టు వస్తున్న కథనాలపై మంత్రి అయ్యన్నపాత్రుడు స్పందించారు. మంత్రి గంటాతో తనకు విభేదాలు లేవని ఆయన గురువారం స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబుకు మంత్రి గంటా రాసిన లేఖలో తన పేరు ఎందుకు పేర్కొన్నారో తెలియదని అన్నారు. తన వల్ల ప్రభుత్వ ప్రతిష్ట తగ్గడం కాదు పెరిగిందని చెప్పారు. విశాఖపట్నంలో వేల ఎకరాల భూమి కబ్జా అయిన మాట వాస్తవమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తాను గతంలోనే చెప్పినట్టు గుర్తుచేశారు. పేదలకు న్యాయం జరగాలన్నదే తన కోరిక అని, మంత్రి గంటా కూడా అదే కోరుకుంటున్నారని చెప్పారు. అందుకే సీఎం చంద్రబాబు ఈ వ్యవహారం సిట్ విచారణకు ఆదేశించారని అన్నారు. -
విశాఖనూ మేసేశారు...
►పెను ‘భూ’కంపంతో విశాఖ వణికిపోతోంది. ►ప్రకృతిలో భాగమైన భూమాతను చెరబట్టేందుకు ►రాజకీయ బేహారులు సృష్టించిన భూదందాల విలయమిది. ►డీ పట్టాలు, పోరంబోకు, ఈనాం, భూదాన భూములు.. ఇలా దేన్నీ వదల్లేదు. ►వాటి అనుభవదారులు, యజమానులపై సకల మాయోపాయాలు ప్రయోగించారు. ►రూ.లక్షల కోట్ల విలువైన భూ కుంభకోణాలు... చరిత్రలో కనీవినీ ఎరుగని దోపిడీకి పాల్పడిన టీడీపీ నేతలు ► అధికారులను పావులు చేసి వేల ఎకరాలు కబ్జా ► ప్రభుత్వ భూములు తనఖా పెట్టి రుణాలు, ఎగవేతలు ► లక్ష ఎకరాల భూముల రికార్డులు గల్లంతు ► హుద్‌హుద్‌లో కొట్టుకుపోయాయని మాయమాటలు ► సూత్రధారులు ప్రభుత్వ పెద్దలే ► పాత్రధారులు జిల్లా నేతలు ► బుధవారం నాటి విశాఖ పర్యటనలో ► ఓ మంత్రి ఆద్యంతం కలెక్టర్‌తో మంతనాలు ► ఆనక భూ కుంభకోణాలే జరగలేదని కలెక్టర్ ప్రకటన ► నిండా ముంచేశారని బాధిత రైతుల ఆవేదన అడ్డగోలుగా.. అధికారం అండతో ఖాళీగా కనిపించిన భూమినల్లా కబ్జా చేసేశారు. ఓటేసిన వారిని వెన్నుపోటు పొడిచారు. బడుగుల పొట్ట కొట్టి తమ బొక్కసాలు నింపుకొన్నారు. ఇదంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే సాగింది. వారే స్కెచ్ వేశారు.. అధికారుల మెడపై కత్తి పెట్టి అమలు చేయించారు. సామాన్యుడు నెత్తీనోరూ బాదుకున్నా వినలేదు. తరతరాలుగా ఆదరువుగా ఉన్న భూముల నుంచి వారిని ఈడ్చి పారేశారు. వీఆర్వో మొదలు తహసీల్దార్ వరకు అందరినీగుప్పిట పెట్టుకుని కబ్జాకాండ సాగించారు. రాష్ట్ర చరిత్రలోనే కనీ వినీ ఎరుగని భూదోపిడీకి పాల్పడ్డారు. ప్రభుత్వ పెద్దల సహకారం లేకుండా ఇంత భారీ కుంభకోణం జరగడం అసంభవం అని రెవెన్యూ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. విశాఖపట్నం : టీడీపీ అధికారంలోకి రావడంతోనే విశాఖలో భూ దోపిడీకి బీజం పడింది. విభజన తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖను లక్ష్యంగా చేసుకున్నారు. ఆర్థిక రాజధానిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళతామని బీరాలు పలికిన అధికార పార్టీ ప్రముఖులు.. భూ మాఫియాకు ద్వారాలు తెరిచి పాతాళానికి నెట్టేశారు. ముఖ్యనేత సహకారం, చినబాబు ప్రత్యక్ష ప్రమేయంతో కబ్జాకు రాచబాట వేసుకున్నారు. నగరానికి ఈ చివర.. ఆ చివర పాగా వేశారు. రికార్డులు తారుమారు చేయడం.. సాధ్యం కాకపోతే బలవంతంగా లాక్కోవడం.. ఇదీ వారి దందా.. ల్యాండ్ పూలింగ్ ముసుగు కూడా ఈ మాఫియా ఆగడాలను బాగా కవర్ చేసింది. పూలింగ్‌లో భూములు పోతాయని బడుగు జనాలను బెదిరించడం.. కారుచౌకగా వారి భూములను లాక్కోవడం.. తిరిగి వాటినే ప్రభుత్వానికి ఎక్కువ ధరకు ఇవ్వడం ద్వారా వందల కోట్ల రూపాయలు దండుకున్నారు. భీమిలి, ఆనందపురం, విశాఖ రూరల్, పెందుర్తి మండలాల్లో ఇలాంటి భూ మాఫియా అక్రమాలు కోకొల్లలు. ‘సాక్షి’ ప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో పర్యటించినప్పుడు బాధితులు వెల్లడించిన విషయాలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఒకరి బ్యాంకు ఖాతా నుంచి మరొకరి బ్యాంకు ఖాతాకు డబ్బు బదిలీ అయినంత ఈజీగా భూ రికార్డులు మారిపోయాయి. పచ్చిగా చెప్పాలంటే.. రైతు తన భూమిలో సాగు చేస్తుండగానే.. అక్కడ తహశీల్దార్ కార్యాలయాల్లో ఆ భూమి వేరొకరికి ధారాదత్తం అయిపోయింది. సొంతదారు భూమిలో ఉండగానే మరొకరు వచ్చి.. ఇది తనదని దబాయించే దారుణ పరిస్థితులు విశాఖ శివార్లలో రాజ్యమేలుతున్నాయి. తిమ్మిని బమ్మి చేసిన గంటా బంధువు విశాఖ భూముల కుంభకోణంలో మంత్రి గంటా శ్రీనివాసరావు బంధువు పరుచూరి వెంకట భాస్కరరావు కీలక పాత్ర పోషించారు. ప్రత్యూష కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన భాస్కరరావు రుణం కోసం ఇండియన్ బ్యాంకుకు భూములు కుదవ పెట్టాడు. ఆనందపురం మండలం వేములవలస గ్రామంలో 122 – 11లో 726 చదరపు గజాల భూమి, సర్వే నంబర్122–8, 9, 10, 11, 12, 13, 14, 15లలో 4.33 ఎకరాల భూములు, సర్వే నంబర్ 124–1, 2, 3, 4లలో 0.271 ఎకరాలు భూములు భాస్కరరావు కుదవపెట్టిన వాటిలో ఉన్నాయి. ఇందులో ప్రధానంగా సర్వే నంబర్ 122/9ని పరిశీలిస్తే మొత్తం 59 సెంట్ల భూమిని జాతీయ రహదారి విస్తరణ కోసం ప్రభుత్వం సేకరించింది. ప్రభుత్వం తీసుకునే సమయానికి ముందు ఇక్కడ కేవలం 7 సెంట్ల భూమి మాత్రమే పరుచూరి భాస్కరరావు పేరిట నమోదై ఉంది. మిగిలిన భూమి పూర్వం నుంచి ప్రభుత్వ భూమిగానే ఉంది. రోడ్డు విస్తీర్ణం కోసం సేకరించిన తర్వాత ప్రస్తుతం రికార్డుల్లో ఇది ప్రభుత్వ భూమిగానే నమోదై ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఒక్క సెంటు భూమి కూడా భాస్కరరావు పేరిట లేదు. ► సర్వే నంబర్ 122/10లో 47 సెంట్ల జిరాయితీ భూమి ఉండేది. ఈ భూమిని పూర్తిగా ఎన్‌హెచ్ విస్తరణలో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. రికార్డుల్లో ప్రస్తుతం ప్రభుత్వ భూమిగానే నమోదై ఉంది. ఇక్కడ కూడా భాస్కరరావు పేరిట ఒక్క గజం భూమి కూడా లేదు. ► సర్వే నంబర్ 122 – 11లో 66 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. దీంట్లో కూడా 60 సెంట్ల భూమి కోరాడ అచ్చమ్మ ఆక్రమణలో ఉన్నట్టుగా రికార్డుల్లో స్పష్టంగా ఉంది. మిగిలిన ఆరు సెంట్ల భూమి కూడా ప్రభుత్వ మిగులు భూమిగానే చూపిస్తున్నారు. కోరాడ అచ్చమ్మ ఆక్రమణలో ఉన్న 60 సెంట్ల భూమిలో ప్రస్తుతం బలహీన వర్గాల కాలనీ ఉంది. అంటే ఇక్కడ ఒక్క సెంట్ భూమి కూడా పరుచూరి భాస్కరరావు పేరిట లేదని అర్థమవుతోంది. ► సర్వే నంబర్..122/12లో 1.04 ఎకరాల భూమిలో భాస్కరరావు పేరిట 30 సెంట్ల భూమి నమోదై ఉంది. మిగిలిన భూమి ప్రభుత్వానిది. కాగా, భాస్కరరావుకు చెందిన 30 సెంట్లలో 8 సెంట్ల భూమి ఎన్‌హెచ్ విస్తరణ కోసం ప్రభుత్వం సేకరించిన భూమిలో ఉంది. కానీ ఇక్కడ ఉన్న 1.04 ఎకరాల భూమిని కూడా తనదిగానే చూపించి బ్యాంకుకు కుదవపెట్టారు. ఇలా తనవి కాని భూములనే కాదు.. ప్రభుత్వం సేకరించిన భూములను కూడా గ్యారెంటీ కింద బ్యాంకుల్లో కుదవపెట్టి రూ. కోట్ల రుణం పొందారు. ఇక్కడ విచిత్రమేమిటంటే ఎన్‌హెచ్ విస్తరణ కోసం భూసేకరణ చేసిన సంవత్సరం 2003. ప్రత్యూష కంపెనీ ఏర్పడిన సంవత్సరం 2005. రుణం పొందిన సంవత్సరం 2006. అంటే 2003 భూసేకరణలో కోల్పోయిన భూములను 2006లో రుణం కోసం కుదవపెట్టిన ఆస్తుల్లో చూపడం గమనార్హం. ఇక్కడ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. 2003లో భూసేకరణ తర్వాత రికార్డుల్లో ప్రభుత్వం ఎంత భూమి సేకరించింది. మిగిలిన భూమిలో ఎవరి పేరిట ఎంత భూమి ఉందన్న వివరాలు అడంగల్, ఎఫ్‌ఎంబీలలో నమోదు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. రెవెన్యూ అధికారుల నిర్లిప్తత భాస్కరరావుకు కలిసొచ్చింది. ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలచుకొని భూసేకరణలో కోల్పోయిన భూములను సైతం భాస్కరరావు తెలివిగా బ్యాంకులో కుదవపెట్టి రుణాలు పొందారు. మరో పక్క ప్రభుత్వ భూములను కూడా తనవిగా ఏమార్చి రుణాలు పొందడం గమనార్హం. కాగా, మంత్రి గంటా, ఆయన బంధువు భాస్కరరావు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి 1100 ఎకరాలు కబ్జా చేసినట్లు అధికార వర్గాల సమాచారం. ఇందులో మంత్రి లోకేశ్‌కూ వాటా ఉండబట్టే ఈ వ్యవహారం పెద్దది కాకుండా చక్రం తిప్పుతుండటం ప్రత్యక్షంగా కనిపిస్తోంది. బుధవారం విశాఖలో ఓ చిన్న కార్యక్రమానికి హాజరైన లోకేశ్ ఆద్యంతం కలెక్టర్‌తో మంతనాలు సాగిస్తూ భూ కుంభకోణాన్ని ఎలా పక్కదారి పట్టించారో మార్గనిర్దేశం చేశారు. లోకేశ్ అక్కడి నుంచి బయలు దేరిన వెంటనే.. విశాఖలో ఎలాంటి భూకుంభకోణాలు జరగలేదని కలెక్టర్ ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. సీఎం, మంత్రులు సూత్రధారులు విశాఖ జిల్లాలో భూ దందాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా అధికార టీడీపీ వారే. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అయన తనయుడు, మంత్రి లోకేశ్, మరో మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిపై ప్రజలు, రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. టీడీపీకే చెందిన మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, బీజేపీ శాసనసభాపక్ష నేత ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు సందర్భం వచ్చినప్పుడల్లా ఈ వ్యవహారంపై ఆరోపణలను గుప్పిస్తున్నారు. మంత్రి గంటా బంధువులు, అనుచరులపై వస్తున్న ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. బ్యాంకులకు ఎగనామం పెట్టిన వ్యవహారంలో గంటా సమీప బంధువు పరుచూరి భాస్కరరావు వ్యవహారం ఇటీవలే రచ్చకెక్కింది. భీమిలి ప్రాంతంలో ఏ రైతునడిగినా.. భాస్కరరావుపై ఆరోపణలు చేస్తున్నారు. అధికారులను చెప్పుచేతల్లో పెట్టుకొని తమ పొట్టకొట్టారని, టీడీపీకి ఓటు వేసిన వారినే దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేతిలో అధికారులు.. అడ్డగోలుగా దందాలు టీడీపీ అధికారంలోకి రాగానే జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు ముందుగా దృష్టి పెట్టింది రెవెన్యూ శాఖపైనే. ఆర్డీవో, తహసీల్దార్ల పోస్టుల్లో తాము చెప్పింది చెప్పినట్లు చేసే వారిని నియమించుకున్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చే నాటికి విశాఖ ఆర్డీవోగా ఉన్న మురళిని కొనసాగించాలని మంత్రి గంటా శ్రీనివాసరావు గట్టి పట్టుపట్టారు. మరో మంత్రి అయ్యన్న పాత్రుడు మాత్రం ఆయన్ను బదిలీ చేయాల్సిందేనని ప్రభుత్వ పెద్దల వద్ద డిమాండ్ చేశారు. అయ్యన్న మంత్రాంగమే ఫలించి మురళి బదలీ అయినప్పటికీ గంటా మరో విధంగా చక్రం తిప్పారు. కొన్ని రోజులపాటు పోస్టు ఖాళీగా ఉండే విధంగా తన పరపతి ఉపయోగించారు. ఆ తర్వాత కొన్ని నెలలకు ఇప్పుడున్న వెంకటేశ్వర్లును ప్రభుత్వం ఆర్డీవోగా నియమించింది. ఆ తర్వాత గంటా వర్గానికి రెవెన్యూ యంత్రాగం సాగిలపడిందనే వాదనలు ఉన్నాయి. అనుకున్నదే తడవుగా రికార్డులు పుట్టించడం, అవసరమైతే వాటిని తారుమారు చేయడం, కావాల్సిన పేరు మీద పట్టాలు పుట్టించడం.. ఇలా ఒకటేమిటి జరగని అక్రమమంటూ లేదని సాక్ష్యాలతో సహా బట్టబయలవుతున్నాయి. ఆ సీట్లు .. అక్రమాల పుట్టలు భీమిలి, ఆనందపురం, విశాఖ రూరల్ తహశీల్దార్ కార్యాలయాలు మూడేళ్లుగా పచ్చనేతల పాలిట కల్పవృక్షాలుగా మారిపోయాయి. అక్రమాల పుట్టలుగా తయారయ్యాయి. వీటి పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు వీటికి ఏమాత్రం తీసిపోవు. ప్రధానంగా భీమిలి తహసీల్దార్ కార్యాలయంలో మూడేళ్లలో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఇక్కడ పని చేసిన వారు, బదిలీపై వెళ్లిన వారిలో చాలా మంది ఏసీబీ కేసుల్లో, అక్రమాస్తుల కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. ఇక్కడ పని చేస్తున్న కాలంలో ఓ తహసీల్దార్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. తర్వాత వచ్చిన ఇద్దరు తహసీల్దార్లు ఎక్కువకాలం కొనసాగలేదు. ఆ తర్వాత వచ్చిన బీటీవీ రామారావు అవినీతి, అక్రమాల్లో రికార్డులు సృష్టించారని చెప్పొచ్చు. దాదాపు రూ.100 కోట్ల మేర అక్రమంగా ఆస్తులు సంపాదించారని ఏసీబీ సోదాల్లో బయటపడింది. రికార్డుల్లో యజమాని ఫొటో తొలగించి ఇంకుపోసిన సంఘటనలు రామారావు హయాంలోనే జరిగాయి. భీమిలి సమీపంలోని చిప్పాడకు చెందిన 37 ఎకరాల వ్యవహారంలో జరిగిన అవకతవకలు ఎవరినైనా షాక్‌కు గురి చేస్తాయి. పూసపాటి సీతారామారాజు అనే వ్యక్తి తన హక్కుల కోసం విజయనగరం మన్సాస్ ట్రస్ట్‌తో దశాబ్దాల కాలంగా పోరాటం చేస్తున్న సమయంలోనే.. ఈ భూమి కలిదిండి రమాదేవి పేరిట బదిలీ అయిపోయింది. ఈమె వెంటనే మరొకరికి విక్రయించేశారు. మన్సాస్ ట్రస్టు ఇచ్చినట్లుగా చెబుతున్న ఎన్వోసీ ఆధారంగా ఈ భూముల రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. రాష్ట్రంలో ఎన్వోసీ ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేసిన ఘటన ఇదేనని స్వయంగా రెవెన్యూ వర్గాలే చెబుతున్నాయి. ఈ ఒక్క స్కాం విలువే సుమారు రూ.40 కోట్లుపైగా ఉంటుంది. ఇది తహసీల్దార్ రామారావు హయాంలో జరిగిన ఓ కుంభకోణం మాత్రమే. 59 రోజులపాటు చార్జి ఇవ్వని తహసీల్దార్ విశాఖ రూరల్ తహసీల్దార్ కార్యాలయం కూడా అక్రమాల గని. ఇక్కడ తహసీల్దార్‌గా పని చేసిన లాలం సుధాకర్ నాయుడు విశాఖ జెడ్పీ చైర్పర్సన్ లాలం భవానీకి స్వయాన మరిది. టీడీపీ నేత లాలం భాస్కరరావుకు స్వయాన సోదరుడు. మంత్రి గంటాకు, అతని వర్గానికి అత్యంత అనుకూలంగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకున్నారనే అభియోగాలు సుధాకర్ నాయుడుపై ఉన్నాయి. ఆయన ఆస్తులపై దాడులు చేయాలన్న డిమాండ్లు చాలా కాలంగా వివిధ రాజకీయ, ప్రజాపక్షాల నుంచి వస్తున్నాయి. ఇంతటి ఘనుడైన సుధాకర్ నాయుడును విశాఖ రూరల్ తహసీల్దారుగా బదిలీ చేసిన తర్వాత దాదాపు 59 రోజులపాటు ‘కీ’ అప్పగించలేదు. రెవెన్యూ రికార్డులు, డిజిటల్ సిగ్నేచర్‌కు సంబంధించి ఈ కంప్యూటర్ కీ ఉంటేనే పని సాధ్యం. కొత్త తహసీల్దార్ వచ్చినా 59 రోజులపాటు కీ అప్పగించకపోవడం వెనక చాలా వ్యవహారాలు నడిచాయన్న విమర్శలు గట్టిగా వినిపించాయి. ఈయన తరువాత వచ్చిన శంకర్రావు అనే తహశీల్దార్‌కు కూడా గతంలో సస్పెండ్ అయిన చరిత్ర ఉంది. ఇలాంటి వ్యక్తిని మళ్లీ విశాఖకు తీసుకురావడం విమర్శలకు దారి తీయడంతో తిరిగి ఆయన్ను శ్రీకాకుళం జిల్లాకు పంపారు. ఆ తర్వాత సుధాకర్ నాయుడే ఇన్చార్జిగా వ్యవహరించారు. పది రోజుల కిందట జరిగిన బదిలీల్లో సదరు సుధాకర్‌నాయుడును విశాఖకు ఆనుకునే ఉన్న పెందుర్తి తహసీల్దార్‌గా నియమించడం గమనార్హం. తహసీల్దార్ కార్యాలయాలు అధికార పార్టీ నేతల చేతుల్లో చిక్కుకున్నాయనడానికి సుధాకర్ నాయుడు వ్యవహారమే ఉదాహరణ. వీరే ఇంత సంపాదిస్తే.. ఇక వారు? ఏసీబీ దాడిలో ఓ తాహసీల్దార్ 100 కోట్ల రూపాయల ఆస్తులతో పట్టుబడ్డారంటే అంతా నివ్వెరపోయారు. వీరే ఇంతగా సంపాదిస్తే వీరి వెనుక ఉండి దందాలు నడిపించిన ప్రభుత్వ పెద్దలు ఎన్ని వేల కోట్లు.. కాదు.. కాదు.. లక్షల కోట్లు వెనకేసుకుని ఉంటారో స్పష్టమవుతోంది. ఒక్క విశాఖ జిల్లాలోనే వ్యవహారం లక్షల కోట్లలో ఉంటే, ఇంకా బయట పడని వ్యవహారాలు ఇతర జిల్లాల్లో ఇంకెన్ని ఉన్నాయో అని జనం చర్చించుకుంటున్నారు. అధికారులను పావుగా వాడుకుంటూ.. వారితో తప్పులు చేయిస్తూ.. వందల కోట్లు వెనకేసుకోవడమే ‘పెద్దలు’ పనిగా పెట్టుకున్నారు. విశాఖలో ఈ పెద్దలకు పావుగా మారిన తహసీల్దార్ల వివరాలు ఇలా ఉన్నాయి.. 1. ఎస్.సిద్ధయ్య (2014 – 15) : ఓ ప్రజాప్రతినిధికి రూ.12 లక్షలు ఇచ్చి భీమిలిలో పోస్టింగ్ ఇప్పించుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్నాడు. వచ్చిన తొమ్మిది నెలల వ్యవధిలోనే భీమిలి మండలం లక్ష్మీపురంలో ఒక రైతుకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వడానికి రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. 2.ఎం.ఎ.మనోరంజని (ఆరు నెలలే పని చేశారు) : ఈమె విజయనగరం జిల్లా సాలూరు కోర్టులో నక్సలైట్ల చేతిలో హతమైన ఎస్ఐ ముద్దాడ గాంధీ భార్య. ఆ తర్వాత భీమిలి నుంచి బదలీపై వెళ్లిపోయారు. 3. బి.టి.వి.రామారావు(2015 – 17) : భీమిలి మండలంలోని పలువురు రైతులకు చెందిన భూములను వెబ్‌ల్యాండ్‌లో పేర్లు మార్చడం, డి.పట్టా భూములు, ఎండోమెంట్ భూములు, మాజీ సైనికుల భూముల రికార్డులు మార్చి మంత్రి అనుచరుడైన పరుచూరి భాస్కరరావు తదితరులకు కట్టబెట్టడంలో వివాదాస్పదుడయ్యారు. ఈయన ఏడాదిన్నర కాలంలోనే రూ.100 కోట్లు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. దీంతో ఇటీవల ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు. 4. సుమతీబాయి (పద్మనాభం మండలం – 2014 నుంచి ఇప్పటి వరకు) : గతంలో ఒకసారి లంచం తీసుకున్న కేసులో ఏసీబీకి పట్టుబడ్డారు. 2015లో మండలంలోని బి.తాళ్లవలస పంచాయతీలో ఉన్న 427 ఎకరాల నీలయమ్మ సత్రం భూములను బినామీ రైతుల పేర్లతో వన్–బిలు, పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేశారు. అనంతరం పట్టాల ద్వారా ఈ భూములను మంత్రి గంటా అండ్ కో కొనుగోలు చేసేందుకు స్కెచ్ వేశారు. ఈలోగానే ఎండోమెంట్ అధికారులు మేలుకుని ఎండోమెంట్ భూములను రైతులకు పట్టాలుగా ఇవ్వకూడదని కోర్టును ఆశ్రయించారు. 5.ఎస్వీ అంబేద్కర్ (ఆనందపురం మండలం – 2014 నుంచి ) : మంత్రి గంటాకు నమ్మినబంటు అనే ప్రచారం ఉంది. టీడీపీ భీమిలి నియోజకవర్గ కన్వీనర్, మంత్రి గంటా బంధువు పరుచూరి భాస్కరరావు, ఆ పార్టీ నేతలు కోరాడ రాజబాబు, కోరాడ నాగభూషణరావు, బంటుపల్లి మణిశంకరనాయుడుల కనుసన్నల్లోనే ఈయన పనిచేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. మండలంలో యథేచ్ఛగా భూకబ్జాలు, బంజరు, డి.పట్టా భూముల ఆక్రమణలు జరిగిపోతున్నా నిద్ర నటిస్తున్నారన్న అపవాదును మూట కట్టుకున్నాడు. -
ఆంధ్రా యూనివర్శిటీ దెయ్యాల కొంపా?
-
ఆంధ్రా యూనివర్శిటీ దెయ్యాల కొంపా?
విశాఖ : ప్రతిష్టాత్మక ఆంధ్రా యూనివర్శిటీపై టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. ఆంధ్రా వర్శిటీని ఓ దెయ్యాల కొంప, బందుల దొడ్డి అంటూ ఆయన ఓ సమావేశంలో వ్యాఖ్యలు చేశారు. అసలు ఇక్కడేముంది దెయ్యాల కొంప, బందుల దొడ్డి అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ‘ఏయూలో మహానాడు పెడితే తప్పేంటి.. రూములు తీసుకుంటున్నారు. శుభ్రంగా తుడుస్తున్నారు...బాగు చేస్తున్నారు.. పెయింట్లు గీయింట్లు వేయిస్తున్నారు. ట్యాప్‌లు కూడా బాగు చేస్తున్నారు. ఇదంతా యూనివర్శిటీకి ఉపయోగమా...నష్టమా? ఏయూ వాళ్లు ఎటూ బాగు చేయడం లేదు. వీళ్లు బాగు చేసి అందులో ఉంటామంటే ఇవ్వాలి..దెయ్యాల కొంపను ఇవ్వడానికి అడ్డుపడటం ఎందుకు’ అని అన్నారు. తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఎంవీవీఎస్ మూర్తి తాను చేసిన తప్పును కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఏయూలో టీడీపీ మహానాడును నిర్వహించడం ద్వారా వర్శిటీ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుందని చెప్పుకొచ్చారు. విశాఖలో మహానాడు సందర్భంగా ఆంధ్రా యూనివర్శిటీ ప్రాంగణాన్ని టిడిపి వేదికగా చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎంవీవీఎస్ మూర్తి వ్యాఖ్యలను ఏయూ విద్యార్థులు తీవ్రంగా ఖండించారు. ఆయన తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే మహానాడును అడ్డుకుంటామని విద్యార్థులు హెచ్చరించారు. మరోవైపు ఎమ్మెల్సీ వ్యాఖ్యలను ఆంధ్రా యూనివర్శిటీ టీచింగ్, నాన్ టీచింగ్ అసోసియేషన్ తప్పుపట్టింది. ఎంవీవీఎస్ మూర్తి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామన్నారు. ఎంతోమంది ప్రముఖులు ఏయూలోనే చదువుకుని ఉన్నత పదవులు అధిరోహించారని, అలాంటి వర్శిటీపై అనుచితంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కాగా విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఎంవీవీఎస్ మూర్తి వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆంధ్రా యూనివర్శిటీకి గొప్ప చరిత్ర ఉందని, ఏ ఉద్దేశ్యంతో మూర్తి ఈ వ్యాఖ్యలు చేశారో తనకు తెలియదని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు సరికాదని గంటా అభిప్రాయపడ్డారు. అలాగే ఆంధ్రా యూనివర్శిటీలో టీడీపీ మహానాడు నిర్వహణను సవాల్ చేస్తూ హైకోర్టులో గురువారం పిటిషన్ దాఖలైంది. ఏయూ రీసెర్చ్ స్కాలర్ ఇవాళ లంచ్ మెషన్ పిల్ వేయగా, కోర్టు విచారణకు స్వీకరించింది. తీర్పును రేపటికి వాయిదా వేసింది. -
ఏపీ సెట్ల ఫలితాలు విడుదల
అమరావతి: ఆంధప్రదేశ్ లాసెట్, ఎడ్‌సెట్, పాలిసెట్‌ల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఇందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల కోసం www.sakshieducation.comను చూడొచ్చు. ఫలితాల వివరాలు ఇలా ఉన్నాయి. ఎడ్‌సెట్: - హాజరైన వారు 7,152 మంది - అర్హత సాధించినవారు 7,010 మంది - 98.01 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు - ఎడ్‌సెట్‌లో ఉత్తీర్ణులైన వారికి జూన్ చివరి వారం నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. పాలిసెట్: - పరీక్షకు హాజరైన విద్యార్థులు ఒక లక్షా ఇరవై రెండు వేల మంది - 96155 మంది అర్హత సాధించారు - ఉత్తీర్ణత శాతం 78.20 - 66,191 అబ్బాయిలు, 29,904 అమ్మాయిలు పాలీసెట్‌లో అర్హత సాధించారు - తూర్పు గోదావరికి చెందిన సాయి ప్రవీణ్ గుప్తా మొదటి ర్యాంకు సాధించాడు. కృష్ణా జిల్లాకు చెందిన మధు మురళి రెండో ర్యాంకు సాధించాడు. ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ జూన్ మొదటివారంలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. లాసెట్: ఏపీ లాసెట్‌లో ఐదు సంవత్సరాల కోర్సుకు 85 శాతం మంది, మూడు సంవత్సరాల కోర్సుకు 82 శాతం మంది, 2 సంవత్సరాల కోర్సుకు 92 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. -
ఏపీ సెట్ల ఫలితాలు విడుదల
-
లోకేష్ టూర్ కోసం టెన్త్ ఫలితాల విడుదల వాయిదా
విజయవాడ: మంత్రి లోకేష్ విశాఖపట్నం పర్యటన కోసం ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల సమయాన్ని మార్చారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేయాలని తొలుత నిర్ణయించగా, మంత్రి గంటా శ్రీనివాసరావు మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. విజయవాడలో ఫలితాలను విడుదల చేయాల్సివుండగా, లోకేష్ టూర్లో పాల్గొనేందుకోసం మంత్రి గంటా వేదికను విశాఖకు మార్చారు. విశాఖలో లోకేష్ పర్యటన ముగిసిన తర్వాత టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు. మంత్రి గంటా తీరుపై విద్యాశాఖ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. లక్షలాదిమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మంత్రి లోకేష్ పర్యటన కోసం టెన్త్ ఫలితాల విడుదల సమయాన్ని మార్చడంపై విమర్శలు వస్తున్నాయి. -
వాళ్లు మంత్రులు కాదు, వ్యాపారులు
-
వాళ్లు మంత్రులు కాదు, వ్యాపారులు: రాచమల్లు
అమరావతి: కార్పొరేట్ సంస్థల నిర్వాహకులను మంత్రులుగా నియమిస్తే పాలన కూడా వ్యాపార పరంగానే ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. ఆయన గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావులు ఎన్నికల సమయంలో టీడీపీ పార్టీ గెలుపుకు రూ.700 కోట్లు వరకు ఖర్చు చేశారని, అప్పుడు చేసిన ఖర్చును రెండింతలు సంపాదించేందుకు అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పదో తరగతి పరీక్షా పత్రాలు మంత్రి నారాయణకు చెందిన విద్యాసంస్ధలో లీక్ అయితే, దానిపై చర్చించేందుకు అవకాశం ఇవ్వకుండా విద్యార్ధుల భవిష్యత్‌ను టీడీపీ ప్రభుత్వం నాశనం చేస్తోందన్నారు. ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదా అని ప్రశ్నిస్తూ ఈ ప్రశ్న పత్రాల లీకేజిపై విచారణ చేస్తుండగానే ఇతర పేపర్లు కూడా లీకు అవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని రాచమల్లు ప్రశ్నించారు. పదో తరగతి పరీక్షా పత్రాల లీకేజిపై ముఖ్యమంత్రి ఒక మాట, మంత్రులు గంటా, నారాయణలు వేర్వేరుగా ప్రకటనలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. 6.50 లక్షల విద్యార్ధుల సమస్యలపై సభలో చర్చించేందుకు ప్రయత్నిస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీయిజం చేస్తోందని ఆరోపిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
నెల్లూరులో పేపర్ లీకేజి నిజమే: మంత్రి
పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజి వ్యవహారంలో ఏపీ మంత్రులు, వియ్యంకులు అయిన నారాయణ, గంటా శ్రీనివాసరావు భిన్న ప్రకటనలు చేశారు. అసలు పేపర్ లీకేజి అన్నదే లేదని మంత్రి నారాయణ చెబుతుండగా.. నెల్లూరులో పేపర్ లీకేజి వాస్తవమేనని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. నెల్లూరులో పదో తరగతి పరీక్ష జరుగుతుండగా మధ్యలో ప్రశ్నపత్రం బయటకు వచ్చిందని, అలా రావడం తప్పేనని ఆయన అంగీకరించారు. ఆ విషయం తెలియగానే తాము విచారణకు ఆదేశించామని చెప్పారు. నివేదిక రాగానే తగిన చర్యలు తీసుకుంటామని, అందులో ఎవరి ప్రమేయం ఉన్నా చర్యలు తప్పవని గంటా శ్రీనివాసరావు అన్నారు. అయితే పదో తరగతి పరీక్షల్లో ఎక్కడా పేపర్ లీక్ కాలేదని మంత్రి నారాయణ అన్నారు. పేపర్ లీక్ కాలేదని అధికారులు తేల్చారని చెప్పారు. జంబ్లింగ్ విధానంతో ఒక పాఠశాల విద్యార్థులు అనేక చోట్లకు వెళ్తారని ఆయన అన్నారు. అందువల్ల ఎవరో ఒకరు లబ్ధి పొందడం అనే ప్రసక్తి ఉండదన్నారు. కానీ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ నుంచి వచ్చిన నివేదిక ప్రకారం మాత్రం నెల్లూరు నారాయణ హైస్కూలులోనే పేపర్ లీకేజి జరిగినట్లు వెల్లడి కావడం గమనార్హం. నెం. 4238 సెంటర్ అంటూ పక్కాగా నివేదిక ఇవ్వడం, ఆ నివేదికను ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో బయటపెట్టడంతో సర్కారుకు పచ్చివెలక్కాయ గొంతులో పడినట్లు అయ్యింది. దానికి తగ్గట్లుగానే మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా లీకేజిని నిర్ధారించడంతో ఇక ఏం చేయాలో అర్థంకాక తల పట్టుకుంటున్నారు. -
ఏపీ సెట్ల తేదీలు ప్రకటన
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించబోయే వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్ 19వ తేదీన ఎడ్‌సెట్‌తో పాటు లాసెట్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎంసెట్(ఇంజినీరింగ్)ను ఏప్రిల్ 24వ తేదీ నుంచి 27 వరకు.. ఎంసెట్(అగ్రి అండ్ మెడికల్)ను ఏప్రిల్ 28న జరుపుతామని వెల్లడించారు. ఐసెట్‌ను మే 2వ తేదీన, ఈ-సెట్‌ను మే నెల 3వ తేదీన జరగుతాయని చెప్పారు. పీజీఈసెట్‌ను మే 10,11వ తేదీల్లో నిర్వహించనున్నారు. -
పాలిటెక్నిక్ కళాశాలల్లో కరికులమ్-16
అమరావతి: మారుతున్న కాలానికి అనుగుణంగా, అంతర్జాతీయంగా విద్యార్థులు రాణించేలా కరికులమ్(పాఠ్యాంశం)ను అప్‌గ్రేడ్ చేస్తేనే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు విరివిగా లభిస్తాయని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి సాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విజయవాడ గేటేవే హోటల్లో సోమవారం సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ పాఠ్యాంశ నవీకరణపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా కరిక్యులమ్ ఉంటేనే ఉపాధి అవకాశాలు విద్యార్థులకు మెండుగా లభిస్తాయని, ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో కరికులమ్-16ను ప్రవేశపెడుతున్నామని అన్నారు. -
వివాదంలో విశాఖ ఫిల్మ్‌క్లబ్ వ్యవహారం
-
మూల్యాంకనంపై శిక్షణ ఇవ్వాలి
ఎయిడెడ్ మేనేజ్మెంట్ స్కూల్స్ అసోసియేషన్ మంత్రికి వినతి ఎస్కేయూ : సమగ్ర మూల్యాంకన పద్ధతిపై శిక్షణ ఇవ్వాలని ఏపీ అన్ ఎయిడెడ్ మేనేజ్మెంట్ స్కూల్స్ అసోసియేషన్ కోరింది. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కుసుమ పుల్లారెడ్డి అధ్యక్షతన మంత్రి గంటాకు వినతి పత్రం అందచేశారు. ప్రైవేటు పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులకు ఇదే తరహాలో సమగ్ర మూల్యాంకనం పై శిక్షణ ఇవ్వాలని విన్నవించారు. జిల్లా కార్యదర్శి గాజుల చం ద్ర, జిల్లా గౌరవధ్యక్షుడు జంగటి అమర్నాథ్, స్టేట్ జాయింట్ సెక్రెటరీ కణేకంటి రామిరెడ్డి, కే. సుబ్బారెడ్డి, నాగరాజు, ఇక్బాల్, రవిశంకర్ ప్రసాద్, రఘనాథరావు, మధుసూదన్‌రెడ్డి, రామ్మోహన్, సంజీ వరెడ్డి, శ్రీనివాసులు, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల
విశాఖ: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షలు విడుదలయ్యాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు ఉదయం పది గంటలకు ఆంధ్ర వర్సిటీ సెనేట్ హాలులో టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల 17వేల 30మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మొత్తం 94.52 శాతం ఉత్తీర్ణలు అయ్యారు. ఇక బాలురు 94.33 శాతం, బాలికలు 94.77 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే ఉత్తీర్ణతలో వైఎస్ఆర్ జిల్లా (98.89) ప్రథమ స్థానంలో నిలవగా, చిత్తూరు జిల్లా (90.11) చివరి స్థానంతో సరిపెట్టుకుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మూడు శాతం ఉత్తీర్ణత పెరిగింది. కాగా జూన్ 16 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. http://www.sakshieducation.com http://www.bseap.org http://www.manabadi.com http://www.vidyavision.com http://www.vidyavision.com http://www.vidyasamacharam.com http://www.vidyatoday.in http://www.indiaresults.com http://www.goresults.net తదితర వెబ్సైట్ల ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఏపీ ఆన్లైన్ ద్వారా ఈ ఫలితాలకు సంబంధించిన గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. వాయిస్ రికార్డర్ మోడ్ ద్వారా, ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకొనే ఏర్పాట్లు చేశారు. వాయిస్ రికార్డర్ మోడ్ కోసం 58888 నంబర్‌కు లేదా స్టార్ 588 యాష్‌కు కాల్ చేయవచ్చు. ఎస్ఎంఎస్ కోసం ఏపీ10(స్పేస్)రోల్ నంబర్‌ను టైప్ చేసి 58888కు ఎస్ఎంఎస్ చేయవచ్చు. -
టీడీపీ నేతలపై మంత్రి గంటా ఫైర్..
వైఎస్సార్ జిల్లా: కడపలో జరిగిన కాపు సంక్షేమం, అభివృద్ధి మేధోమథన సదస్సుకు హాజరయ్యేందుకు మంగళవారం కడపకు వచ్చిన జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు స్థానిక తెలుగుదేశం పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. విజయవాడ నుంచి మంత్రి గంటా విమానం ద్వారా కడపకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి మంత్రి గంటాను ఆ పార్టీ నాయకుడు పుత్తా నరసింహారెడ్డి భోజనానికి నగరంలోని తన హరిప్రియ హోటల్‌కు తీసుకెళ్లారు. అప్పటివరకు విషయాన్ని గుర్తించలేకపోయిన మంత్రి ఒక్కసారిగా పరిస్థితి అర్థం చేసుకుని పుత్తాపై మండిపడినట్లు తెలిసింది. రాష్ట్ర మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అయిన తనను ఇలా ఒక ప్రైవేటు హోటల్‌కు తీసుకు రావడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒక పద్ధతి అంటూ లేకుండా ప్రొటోకాల్‌ను ఏమాత్రం పాటించకుండా తమ ఆర్భాటాల కోసం తనను వాడుకోవడం తగదని సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయమై బందోబస్తులో ఉన్న పోలీసులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలాగే కడప నగర టీడీపీ అధ్యక్షుడు హరీంద్రనాథ్తోపాటు మరో టీడీపీ నాయకుడు దుర్గాప్రసాద్ మంత్రి గంటా వద్దకు వెళ్లారు. పార్టీలో ఇతర వర్గాల పెత్తనం కొనసాగుతోందని, కాపు వర్గాలకు ఏమాత్రం ప్రాధాన్యత కల్పించడం లేదని ఆరోపించినట్లు సమాచారం. ఈ సందర్భంగా హరీంద్రనాథ్ మాట్లాడుతూ పార్టీకి ఎంతో సేవలు చేస్తున్న దుర్గాప్రసాద్‌కు ఏ పదవి ఇవ్వకుండా, ప్రాధాన్యత కల్పించడం లేదని తెలిపారు. అతనికి ఏదో ఒక పదవిని కట్టబెట్టాలని సిఫార్సు చేశారు. దీంతో మంత్రి గంటా వారిద్దరిపై ఫైర్ అయ్యారు. పార్టీలో ఏం జరుగుతోందో? ఎవరు ఎలా నడుచుకుంటున్నారో? నాకు అంతా తెలుసని, ఎవరూ నాకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పినట్లు సమాచారం. మంత్రి గంటా సీరియస్ అయిన అంశం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది. -
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. ఏపీ మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ రోజు ఉదయం 10 గంటలకు విజయవాడలో విడుదల చేశారు. తొలిసారిగా ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇంటర్ పరీక్షల ఫలితాలను రికార్డు స్థాయిలో 28 రోజుల లోపే విడుదల చేసినట్లు మంత్రి గంటా తెలిపారు.ఒకేషనల్ కోర్సు ఫలితాలను కూడా తొలిసారిగా ఆన్ లైన్ ద్వార విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఫస్టియర్ 68.05, సెకండియర్ 73.78 ఉత్తీర్ణత శాతం నమోదైంది. మొత్తం ఫస్టియర్ 4,67,747 సెకండియర్ 4,11941 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫస్టియర్ లో 3,18,120 సెకండియర్ 3,03,934 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలలో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉండగా.. ఫస్టియర్ లో అనంతపురం, సెకండియర్ లో కడప జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలను మే 24 తేదీ నుంచి నిర్వహించనున్నట్లు మంత్రి గంటా తెలిపారు. సప్లమెంటరీ పరీక్షల ఫీజును చెల్లించేందుకు ఏప్రిల్ 26 చివర తేదీగా ప్రకటించారు. -
మంత్రులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం!
విజయవాడ: కేబినెట్ మంత్రులతో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి వ్యూహాత్మక సమావేశం నిర్వహించారు. ప్రతిపక్షాల విమర్శలపై స్పందించలేదని మంత్రులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య తనపై అంతగా వ్యాఖ్యలు చేస్తే కనీసం ఎందుకు స్పందించలేదని మంత్రి గంటా శ్రీనివాసరావును సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. తనపై గానీ, ఏపీ ప్రభుత్వంపై గానీ ఎవరు విమర్శలు చేసినా గట్టిగా మాట్లాడాలని, వారికి సమాధానాలివ్వాలని చంద్రబాబు హుకుం జారీ చేశారు. కాపునేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖపై సీఎం చంద్రబాబు, కేబినెట్ మంత్రులతో చర్చించారు. ముద్రగడ తనను డిక్టేట్ చేస్తున్నారంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం. రాజధాని భూముల దందాపై ఓ ప్రముఖ పత్రికలో వాస్తవాలు అంటూ కథనాలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ప్రభుత్వంపై ఈ విషయంలో తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. -
'తల్లిదండ్రుల వైఖరి మారాలి'
గుంటూరు : విద్యాసంస్థల యాజమాన్యాలతో పాటు పేరెంట్స్ వైఖరి మారాలని ఆంధ్రప్రదేశ్ మంత్రులు గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఒత్తిడి లేని విద్యావ్యవస్థ, కాలేజీ యాజమాన్యాల తీరుపై మంత్రులు గుంటూరు పట్టణంలో సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్ యాజమాన్యాల కోసం పిల్లల ప్రాణాలు పణంగా పెట్టలేమని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని ప్రత్తిపాటి అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వంతో పాటు కాలేజీ యాజమాన్యాలూ కారణమేనన్నారు. ఒత్తిడిలేని విద్యావ్యవస్థ కోసం అందరూ ప్రయత్నించాలని మంత్రులు పేర్కొన్నారు. విద్యార్థులకు యోగా, సాంస్కృతిక కార్యక్రమాలు నేర్పించడంపై విద్యాసంస్థలు దృష్టిపెట్టాలని మంత్రి ప్రత్తిపాటి సూచించారు. రిషితేశ్వరి ఆత్మహత్య తర్వాత ప్రభుత్వం పూర్తిస్థాయిలో విద్యావ్యవస్థపై దృష్టిసారించిందన్నారు. -
ప్రపంచ పర్యాటక స్థలంగా గండికోట!
కడప : వైఎస్ఆర్ జిల్లాలోని గండికోటను ప్రపంచ పర్యాటక స్థలంగా తీర్చిదిద్దుతామని మంత్రులు గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి రూ.500 కోట్లతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని చెప్పారు. గండికోటలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న వారసత్వ ఉత్సవాలను శనివారం వారు ప్రారంభించారు. బ్రోచర్ ఆవిష్కరణ అనంతరం ఉన్నత విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను కలుపుతూ ఏర్పాటు చేసే పర్యాటక సర్క్యూట్లో గండికోటను చేరుస్తామన్నారు. గండికోటలో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయని ఆయన కొనియాడారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ప్రముఖ రాజులు, కోటల వివరాలను పాఠ్యాంశాల్లో చేర్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఐటీ, సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ పురాతన కట్టడాలు, కళలను ప్రజలు మరచి పోతున్నారని.. వాటికి పునర్వైభవం తీసుకువస్తామని చెప్పారు. ప్రతిభ కలిగిన కళాకారులను గుర్తించి జనవరి 26, ఆగస్ట్ 15వ తేదీల్లో అవార్డులు అందజేసేలా చర్యలు చేపట్టాలన్నారు. అంతకు ముందు మంత్రులు గండికోటలోని జుమ్మా మసీదు, చార్మినార్, రంగనాయక స్వామి మండపం, పెన్నానది లోయను పరిశీలించారు. పెన్నా లోయపై స్కైవాక్ ఏర్పాటు చేసే విషయమై రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌తో చర్చించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చెర్మైన్ సతీష్‌రెడ్డి, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, కలెక్టర్ కె.వి.రమణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, జేసీ-2 కృష్ణభారతి పాల్గొన్నారు. -
ఏ ప్రొఫెసర్నూ సస్పెండ్ చేయలేదు: గంటా
విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ఏ ప్రొఫెసర్నూ సస్పెండ్ చేయలేదని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం రోజున ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రా విశ్వవిద్యాలయానికి ఆయన వచ్చారు. అనంతరం యువభేరీ సదస్సులో ఏయూ ప్రాఫెసర్లు, సిబ్బంది హాజరైన అంశంపై వీసీ జీఎస్ఎన్ రాజుతో మట్లాడారు. ఇప్పటివరకు ఏ ఆచార్యుడినీ సస్పెండ్ చేయాలని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని వెల్లడించారు. దీనిపై వర్సిటీ అధికారులు పరిశీలించాక చర్యలు తీసుకుంటారన్నారు. విశ్వవిద్యాలయాల్లో క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తామని.. ఇటీవల జరిగిన సంఘటనలకు రాజకీయ రంగు పులుముతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వర్సిటీలో బయటి వ్యక్తుల ప్రవేశాలు పూర్తిగా నియంత్రించే దిశగా పనిచేస్తామన్నారు. పరిశోధకులు సైతం నిర్ణీత కాలంలో తమ పరిశోధనలు పూర్తిచేసి, వర్సిటీని వదిలి వెళ్లాలన్నారు. వీసీ జి.ఎస్.ఎన్రాజు మాట్లాడుతూ.. వర్సిటీకి ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉందని, ఆచార్యుల ప్రసంగాలను పరిశీలించిన తర్వాత ఏదైనా చెబుతామన్నారు. -
'కోర్టు తీర్పు మాకు సానుకూలం'
హైదరాబాద్: అంబేడ్కర్, తెలుగు విశ్వవిద్యాలయాలపై కోర్టు తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సానుకూలంగా ఉందని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఇక్క మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలన్నారు. గవర్నర్ మాట కూడా లెక్కచేయకుండా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిందని వాపోయారు. పాఠ్యపుస్తకాల్లో సిలబస్‌ను కూడా తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని విమర్శించారు. పాఠ్యపుస్తకాల్లో ఆంధ్ర కవుల, రచయితల పాఠాలను తొలగించడం దారుణమని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. -
రిషితేశ్వరిది ప్రభుత్వ హత్య
* అసెంబ్లీలో వైఎస్సార్సీపీ సభ్యురాలు రోజా మండిపాటు * ప్రతిపక్షం శవరాజకీయాలు చేస్తోందని టీడీపీ ఎదురుదాడి సాక్షి, హైదరాబాద్: నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరిది ప్రభుత్వ హత్యేనని శాసనసభలో బుధవారం విపక్ష వైఎస్సార్సీపీ సభ్యులు నిప్పులు చెరిగారు. ర్యాగింగ్ భూతాన్ని నియంత్రించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందడంతో విద్యార్థులు ఆత్మహత్యలను పాల్పడ్డారని ధ్వజమెత్తారు. రిషితేశ్వరి ఆత్మహత్యపై వైఎస్సార్సీపీ సభ్యులు రోజా, ఉప్పులేటి కల్పన, భూమా అఖిలప్రియ, గిడ్డి ఈశ్వరి, చరితారెడ్డి, కళావతి అడిగిన ప్రశ్నపై సభలో వాడివేడిగా చర్చ జరిగింది. బాలసుబ్రహ్మణ్యం కమిటీ విద్యార్థులను విచారించ లేదని టీడీపీ సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర చెప్పగా, 87 మంది విద్యార్థులను విచారించిందని హోం మంత్రి చినరాజప్ప, 177 మందిని విచారించిందని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పొంతనలేని వివరాలు చెప్పారు. ప్రశ్న అడిగిన రోజాకు ఈ అంశంపై మొదట మాట్లాడే అవకాశం లభించింది. ర్యాగింగ్, లైంగిక వేధింపుల వల్లే రిషితేశ్వరి చనిపోయిందని చెప్పారు. ఈ వ్యవహారంలో ముగ్గురిని మాత్రమే అరెస్టు చేసి ప్రభుత్వం చేతులు దులిపేసుకుందని విమర్శించారు. రిషితేశ్వరి చావుకు ప్రిన్సిపల్ బాబురావే కారణమని బాలసుబ్రహ్మణ్యం కమిటీ స్పష్టంగా చెప్పిందని గుర్తుచేశారు. అయినా ప్రిన్సిపల్‌ను ప్రభుత్వ పెద్దలు రక్షిస్తున్నారని అన్నారు. ర్యాగింగ్ నిరోధానికి సుప్రీంకోర్టు విడుదల చేసిన మార్గదర్శకాలను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. రిషితేశ్వరి ఆత్మహత్య తర్వాత మంత్రులకు యూనివర్సిటీని సందర్శించే సమయం లేకుండా పోయిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కూడా యూనివర్సిటీకి రాలేదన్నారు. మంత్రి గంటా అవమానకరంగా మాట్లాడుతున్నారని, ప్రిన్సిపల్ తప్పున్నట్టుగా కమిటీ చెప్పలేదనడాన్ని రోజా తప్పుబట్టారు. ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 మంది విద్యార్థులు చనిపోతే, అందులో 11 మంది నారాయణ కాలేజీల్లోనే మరణించారని చెప్పారు.ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ.. విపక్షం శవ రాజకీయాలు చేస్తోందని ఎదురుదాడికి దిగారు. ప్రిన్సిపల్ పాత్ర తేలితే చర్యలు: హోం మంత్రి రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనలో ప్రిన్సిపల్ పాత్ర ఉందని తేలితే చర్యలు తీసుకోవడానికి వెనకాడమని హోంమంత్రి చినరాజప్ప చెప్పారు. ర్యాగింగ్ కమిటీలు లేకపోవడం వాస్తవమే: గంటా విశ్వవిద్యాలయాల్లో ర్యాగింగ్ నిరోధక కమిటీలు లేని మాట వాస్తవమేనని మంత్రి గంటా శ్రీనివాసరావు అంగీకరించారు. ర్యాగింగ్ నిరోధానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ర్యాగింగ్ అనే పదాన్ని ఉచ్ఛరించడానికైనా భయపడేలా చర్యలు ఉంటాయన్నారు. మంత్రి గంటా సభను తప్పుదోవ పట్టిస్తున్నారు నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి ఆత్మ ఘోషించేలా అధికార పక్ష సభ్యులు శాసనసభలో వ్యవహరించారని వైఎస్సార్ సీపీ మహిళా ఎమ్మెల్యేలు మండిపడ్డారు. పార్టీ ఎమ్మెల్యే రోజా.. ఇతర సభ్యులు గౌరు చరిత, గిడ్డి ఈశ్వరితో కలిసి బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. శాసనసభను తప్పుదోవ పట్టించే విధంగా మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహరించడం దారుణమన్నారు. ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ బాబూరావును కేసు నుంచి తప్పించే విధంగా ప్రభుత్వ చర్యలున్నాయని విమర్శించారు. ప్రిన్సిపల్‌ను కేసు నుంచి తప్పిస్తే తమకు అన్యాయం చేసినట్లేనని రిషితేశ్వరి తండ్రి ఆవేదన చెందుతుంటే... ప్రభుత్వాన్ని అభినందించారని మంత్రి గంటా సభలో నిస్సిగ్గుగా చెప్పుకోవడం దారుణమన్నారు. వియ్యంకుడైన మంత్రి నారాయణ కళాశాలలో విద్యార్థినుల ఆత్మహత్యలపై మంత్రి గంటా నోరు విప్పడం లేదని ధ్వజమెత్తారు. -
హడావుడిగా శ్రీమంతుడు ఆడియో ఫంక్షన్కా?
హైదరాబాద్ : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య అంశంపై బుధవారం అసెంబ్లీలో వాడీవేడిగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ రిషితేశ్వరి తల్లిదండ్రులను పరామర్శించకుండా హోటల్‌కు పిలిపించుకున్న ఘటన మంత్రులదని, ఇక్కడే వారి సంస్కారం అర్థం అవుతుందన్నారు. రిషితేశ్వరి చనిపోయిన తర్వాత తీరిగ్గా నాలుగు రోజులకు ప్రెస్‌మీట్ పెట్టి...హడావుడిగా శ్రీమంతుడు సినిమా ఆడియో ఫంక్షన్లో పాల్గొనడానికి మంత్రి హైదరాబాద్ వచ్చారని, అదే చిత్తశుద్ధి ర్యాగింగ్ అరికట్టేందుకు చిత్తశుద్ధే ఉంటే పలువురు విద్యార్థులు ప్రాణాలు తీసుకునేవారు కాదన్నారు. రోజా ఏం మాట్లాడారంటే... 'నాగార్జున వర్సిటీలో లైంగిక వేధింపులు, అసాంఘిక కార్యకలాపాలపై రిషితేశ్వరి డైరీలో రాసుకుంది. ఆమె డైరీని చదివితే మనసున్నవారు ఎవరైనా కంటతడి పెట్టక మానరు. ర్యాగింగ్, లైంగిక వేధింపులే రిషితేశ్వరిని చంపేశాయని బాలసుబ్రహ్మణ్యం కమిటీ తేల్చింది. ముగ్గురిని అరెస్ట్ చేసి పనైపోయిందని సర్కార్ చేతులు దులుపుకుంటోంది. వర్సిటీలో చదువుకున్న అమ్మాయిలకే రక్షణ లేకపోతే...ఇక మిగతా వారికి ఎలా రక్షణ కల్పించగలరు. రిషితేశ్వరి ఆత్మహత్యకు కారణం ప్రిన్సిపాల్ బాబూరావే. టీడీపీ అధికారంలోకి వచ్చాక మహిళలపై దాడులు పెరిగిపోయాయి. కడపలోని నారాయణ కాలేజీలో ఇద్దరు ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆమెను వేధిస్తున్నారని ప్రిన్సిపాల్‌కు రిషితేశ్వరి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ర్యాగింగ్‌ను నిరోధించాల్సింది పోయి ప్రిన్సిపాల్ బాబూరావు తాగి తందనాలు ఆడారు. వర్సిటీలో నిధులు దుర్వినియోగం చేశారంటూ బాబూరావు చెక్ పవర్‌ను రద్దుచేస్తే... ఆతర్వాత వచ్చిన వీసీ మళ్లీ మంజూరు చేశారు. బాబూరావు వెనక ఎవరున్నారో ఇట్టే అర్థం అవుతుంది. వర్సిటీ నిధులతో బాబూరావు మద్యాన్ని ఎలా కొనుగోలు చేయగలిగారు. రిషితేశ్వరికి అవార్డు ప్రిన్సిపాల్ కాకుండా...వేధింపులకు గురి చేసిన అబ్బాయిలతో ఇప్పించారు. రిషితేశ్వరి ఘటన జరిగిన తర్వాత మంత్రులు వెంటనే ఎందుకు స్పందించలేదు. రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంటే స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఎందుకు స్పందించలేదు. బాబూరావును ప్రాసిక్యూషన్ చేయాలని బాలసుబ్రహ్మణ్యం కమిటీ చెప్పినా సర్కారు చర్యలు తీసుకోలేదు. యాంటీ ర్యాగింగ్‌పై తాను తెచ్చిన చట్టాన్ని చంద్రబాబే ఎందుకు అమలు చేయటం లేదు' అని ప్రశ్నించారు. -
'సీఎం చేతుల్లో భద్రంగా విద్యార్థుల భవిష్యత్'
తాడేపల్లిగూడెం: ఆంధ్రప్రదేశ్ లో ర్యాంగింగ్ నిరోధానికి చర్యలు చేపడుతున్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. తమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల్లో విద్యార్థుల భవిష్యత్ భద్రంగా ఉందని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... విభజన చట్టం ప్రకారం 7 విద్యాసంస్థలు ప్రారంభం కాబోతున్నాయని చెప్పారు. ఈ నెల 30 నుంచి నిట్ లో తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. రాష్ట్రాన్ని విద్యా కేంద్రంగా తయారు చేయాలని చంద్రబాబు కోరుకుంటున్నారని అన్నారు. బడ్జెట్ లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించామని తెలిపారు. నిట్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, స్మృతీ ఇరాని, సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్, పీతల సుజాత పాల్గొన్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న గంటా
తిరుమల: ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో ఆయన స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయన తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏడాది కాలంలో స్వామి ఆశీస్సులతో విద్యాశాఖ మరింత అభివృద్ధి జరిగిందని చెప్పారు. నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పాఠ్యపుస్తకాలను తక్కువ ధరలకే అందిస్తున్నామని ఆయన చెప్పారు. అనుమతి లేని పాఠశాలలు, కళాశాలలను డీఈవోల సహాయంతో రద్దు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. -
'ఈ నెల 15న డిఎస్సీ ఎంపిక జాబితా ప్రకటన'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఓపెన్ స్కూల్ సొసైటీ ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేశారు. టెన్త్ క్లాస్ 75.16 శాతం, ఇంటర్లో 65.39 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. జూన్ 15వ తేదీన డీఎస్సీకి ఎంపికైన వారి జాబితా ప్రకటిస్తామన్నారు. అలాగే డిఎస్సీ ఫలితాలపై కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న సంగతి గంటా శ్రీనివాసరావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ అంశంపై ఈ నెల 10వ తేదీన విచారణలో కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని గంటా స్పష్టం చేశారు. -
'టీఎస్ మంత్రి హామీ ఇప్పటివరకూ అమలు కాలేదు'
హైదరాబాద్: ఉన్నత విద్యామండలి రికార్డులు అప్పగిస్తామని తెలంగాణ మంత్రి ఇచ్చిన హామీ ఇప్పటివరకూ అమలు కాలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రికార్డులు ఇవ్వకపోయినా ఎంసెట్ కౌన్సిలింగ్ కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు గంటా తెలిపారు. ఈ నెల 12 నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. డీఎస్సీ పోస్టింగ్ ల ప్రక్రియను ఈనెల 15వ తేదీ నాటికి పూర్తి చేస్తామన్నారు. డీఎస్సీపై కొంతమంది కోర్టుకు వెళ్లారని.. ఆ విచారణ ఈనెల 10కి వాయిదా పడిందన్నారు. ప్రభుత్వం కూడా డీఎస్సీకి సంబంధించి కౌంటర్ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకూ డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. దళారులను నమ్మొద్దని చెప్పినా.. కొందరు అమాయకులు మోసపోయారన్నారు. ఈనెల 15న పాఠశాలలు పునఃప్రారంభిస్తామన్నారు. కొత్తగా మంజూరైన నిట్ కు 480 సీట్లను కేంద్ర కేటాయించిందని.. కర్నూలు ఐఐటీ, ఎన్ఐటీ తరగతులను ఈ ఏడాదిలోనే ఆరంభిస్తున్నట్లు గంటా తెలిపారు. అనంతపురం సెంట్రల్ యూనివర్శిటీకి, విజయనగరంలో గిరిజన యూనివర్శిటీకి కేంద్రం స్థలాలు ఖరారు చేసిందన్నారు. నిబంధనలు పాటించని ఇంజనీరింగ్ కాలేజల సీట్లను తగ్గిస్తామని గంటా హెచ్చరించారు. -
ఏపీ డీఎస్సీ ఫలితాలు విడుదల
విశాఖపట్నం: ఏపీ డీఎస్సీ-2014 (టెట్ కమ్ టీఆర్టీ) పరీక్ష ఫలితాలను విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. 10,313 పోస్టులకు గానూ 3,90,000 మంది పోటీ పడ్డారు. డీఎస్సీ పరీక్షకు హాజరైన వారిలో 37.57 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. స్కూలు అసిస్టెంట్ 32.65 శాతం, లాంగ్వేజ్ పండిట్లు 29.23 శాతం మంది అర్హత సాధించారని మంత్రి గంటా తెలిపారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని అభ్యర్ధులకు ఆయన సూచించారు. (డీఎస్సీ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 9 సబ్జెక్టుల్లో 13 తప్పులను గుర్తించామని, అందుకే నిపుణులతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయాన్ని తీసుకున్నట్లు గంటా పేర్కొన్నారు. షెడ్యూలు ప్రకారం జూన్ 1న ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా, అభ్యర్ధుల అభ్యంతరాల వల్ల ఈరోజు విడుదలయ్యాయి. కాగా, ఈనెల 9, 10,11వ తేదీల్లో ఏపీ డీఎస్సీ-2014 జరిగిన విషయం విదితమే. -
ఏపీ డీఎస్సీ ఫలితాలు వాయిదా
హైదరాబాద్: ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన ఏపీ డీఎస్సీ ఫలితాలు వాయిదా పడ్డాయి. డీఎస్సీ అభ్యర్థుల వల్లే ఫలితాలు వాయిదా వేయాల్సి వచ్చినట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. జూన్ 2 లేదా 3వ తేదీన డీఎస్సీ ఫలితాలు విడుదల చేయనున్నట్లు మంత్రి చెప్పారు. అయితే, షెడ్యూల్ ప్రకారం జూన్ 1వ తేదీనే ఈ ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. ఆమేరకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు కూడా ఇదివరకే చేపట్టింది. అయితే డీఎస్సీ నిర్వహణకు సంబంధించి కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు ఆ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ జూన్ 3వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. -
గవర్నర్‌తో గంటా భేటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి విభజన అంశంపై గంటా చర్చించారు. -
21న ఎంసెట్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎంసెట్-2015 పరీక్షా ఫలితాలు ఈనెల 21వ తేదీన కాకినాడలోని జేఎన్ టీయూ క్యాంపస్‌లో విడుదల కానున్నాయి. రాష్ట్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాలను ర్యాంకుల రూపంలో విడుదల చేయనున్నారు. ఎంసెట్‌లో వచ్చిన మార్కులకు ఇంటర్లో వచ్చిన మార్కుల్లో 25 శాతం వెయిటేజీ ఇస్తూ ఈ ర్యాంకులను ప్రకటించనున్నారు. -
నేడు టెన్త్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం సాయంత్రం 4 గంటలకు విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారని ప్రభుత్వ పరీక్షల డెరైక్టర్ సురేందర్‌రెడ్డి తెలిపారు. ఏపీ ఆన్లైన్ ద్వారా ఈ ఫలితాలకు సంబంధించిన గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లను విద్యార్థులకు అందుబాటులో ఉంచనున్నారు. సాక్షి ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌తో పాటు www.bseap.org తదితర వెబ్సైట్ల ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. -
ఏపీలో 74 కేంద్రాల్లో ఈ సెట్
అనంతపురం: పాలిటెక్నిక్ విద్యార్థులు నేరుగా ఇంజినీరింగ్ లో ప్రవేశం పొందే ఈ సెట్ ఎంట్రెన్స్ పరీక్షను ఆంధ్రప్రదేశ్ లో నేడు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 74 పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. అందుకుగాను రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, పరిటాల సునీత, కామినేని శ్రీనివాసరావు ఈ సెట్ పరీక్షకు 'ఎల్-2' సెట్ ను అనంతపురం జెఎన్ టీయూ లో గురువారం ఉదయం విడుదల చేశారు. రాష్టాన్ని నాలెడ్జ్ హబ్ గా మార్చేందుకు విద్యాశాఖ ప్రయత్నిస్తోందని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. షెడ్యూలు ప్రకారం తరగతులు, పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నామని గంటా తెలిపారు. -
తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువ...
-
తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువ...
కర్నూలు: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలో కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉందని ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆయన మంగళవారం కర్నూలులో ఏపీ ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణలో 61.41 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయితే, ఏపీలో 72.07 శాతం ఉత్తీర్ణులయ్యారన్నారు. గత ఏడాదిలో పోలిస్తే 1.19 శాతం ఉత్తీర్ణత పెరిగిందని తెలిపారు. మే 25 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇక ఇంటర్ ఫలితాల్లో 83%తో మొదటి స్థానంలో కృష్ణా జిల్లా నిలవగా కడప జిల్లా 60%శాతంతో చివరి స్థానంతో సరిపెట్టుకుంది. -
ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల
-
ఇక్కడ కూడా అమ్మాయిలదే హవా
కర్నూలు: పరీక్షల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం పది గంటలకు ఏపీ మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో అబ్బాయిల ఉత్తీర్ణత 69.43శాతం నమోదవ్వగా అమ్మాయిలు వారికంటే 5.37శాతం ఎక్కువగా 74.80శాతం ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించారు. కాగా, ఈ ఫలితాల్లో మొత్తం పాసయినవారి శాతం 72.07 నమోదయినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఫలితాల్లో టాప్ ప్లేస్‌లో కృష్ణా జిల్లా (83శాతం) రాగా, ఆఖరి స్థానంలో కడప (60శాతం) వచ్చినట్లు చెప్పారు. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో కూడా అమ్మాయిలే పైచేయి సాధించిన విషయం తెలిసిందే. -
ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల
కర్నూలు : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ సెకండియర్ ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. ఏపీ మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈరోజు ఉదయం 10 గంటలకు కర్నూలులో విడుదల చేశారు. మొత్తం 2,90,789 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా, ఇంటర్ బోర్డు కార్యదర్శి, కమిషనర్ ఎంపీ సత్యనారాయణ పాల్గొన్నారు. ఫలితాల కోసం www.sakshi.com, www.sakshieducation.com, http://examresults.ap.nic.in, http://results.cgg.gov.in చూడవచ్చు. -
2315 మందికి ప్రతిభా పురస్కారాలు
-
గంటా పీహెచ్డీ ఎక్కడ చేస్తారో?
విశాఖ : విశాఖ తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు మధ్య పొసగని విషయం తెలిసిందే. తాజాగా మంత్రి గంటా శ్రీనివాసరావుపై జిల్లా టీడీపీ నేత రామానాయుడు సోమవారమిక్కడ విరుచుకుపడ్డారు. పూటకో పార్టీ మార్చే గంటా... అయ్యన్నపాత్రుడిపై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. గంటా..తన రాజకీయ లబ్ది కోసం ...'టెన్త్ చంద్రబాబు స్కూల్, ఇంటర్ చిరంజీవి కాలేజ్, డిగ్రీ కిరణ్ కుమార్ రెడ్డి కళాశాలలో గంటా చేరారు. పీజీ కోసం మళ్లీ చంద్రబాబు కాలేజీలో చేరిన ఆయన...మరి పీహెచ్‌డీని ఎక్కడ పూర్తి చేస్తారో' అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మంత్రి అయ్యన్నపాత్రుడికి వెన్నుపోటు రాజకీయాలు తెలియవని, అవకాశవాద, పార్టీ మార్చే రాజకీయాలు ఆయనకు లేవని రామానాయుడు అన్నారు. కాగా మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ అవంతి శ్రీనివాస్‌ల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ మాడుగుల నియోజకవర్గంలో మంత్రి అయ్యన్న శుక్రవారం పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. -
ఎటూ ‘సెట్’ కాలేదు
-
తెలంగాణ విధానాన్ని గవర్నర్ సమర్థించలేదు
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ వివాదంలో తెలంగాణ ప్రభుత్వ వాదనను, విధానాన్ని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సమర్థించినట్టుగా కొన్ని మీడియా వర్గాల్లో వెలువడిన కథనాలు నిజం కాదని రాజ్‌భవన్ వర్గాలు వివరించాయి. ఈ మేరకు రాజ్‌భవన్ మీడియా కార్యదర్శి శనివారం ప్రకటన విడుదల చేశారు. ‘విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలూ చర్చిం చుకొని ఓ పరిష్కారాన్ని కనుగొనాలి’ అని గవర్నర్ సూచించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
రేపు సెట్స్ తేదీలు ప్రకటిస్తాం
తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్, ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) తేదీల ప్రకటనను సోమవారాని(5వ తేదీ)కి వాయిదా వేసినట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మ న్ పాపిరెడ్డి తెలిపారు. గవర్నర్ నరసింహన్ ఎంసెట్ అంశంపైనే ఇరు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసినందున.. ఆయనపై ఉన్న గౌరవంతో తేదీల ప్రకటనను వాయిదా వేసినట్లు చెప్పారు. శనివారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, విద్యామండలి కార్యదర్శి వికాస్‌రాజ్, చైర్మన్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు మల్లేశ్, వెంకటాచలం, కార్యదర్శి శ్రీనివాసరావు, సాంకేతిక విద్యా కమిషనర్ అనిల్‌కుమార్, వివిధ వర్సిటీల వీసీలతో సమావేశం జరిగింది. అనంతరం పాపిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఎంసెట్‌తోపాటు ఇతర సెట్స్ తేదీలపై సమావేశంలో చర్చించినట్లు తెలి పారు. అయితే గవర్నర్ భేటీ నేపథ్యంలో ఆయనపై గౌరవంతో తేదీలను ప్రకటించడం లేదని, ఈ నెల 5వ తేదీన ప్రకటిస్తామని పాపిరెడ్డి వెల్లడించారు. అయితే ఎంసెట్‌ను తొలుత మే 3న నిర్వహించాలనుకున్నా.. దానిని మే 17న నిర్వహిస్తే బాగుంటుందని నిర్ణయానికి వచ్చినట్లు తెలి సింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివిధ సెట్స్ తేదీలు ఇలా ఉండే అవకాశం ఉంది.. వీటిల్లో మార్పులు ఉండొచ్చు.. సెట్స్ జరిగే అవకాశమున్న తేదీలు తేదీ సెట్ నిర్వహణ సంస్థ మే 17 ఎంసెట్ జేఎన్టీయూహెచ్ మే 6 ఐసెట్ కాకతీయ వర్సిటీ మే 24 ఎడ్‌సెట్ ఓయూ మే 14 ఈసెట్ ---- మే 30 పీజీఈసెట్ ---- మే 27 లాసెట్, పీజీలాసెట్ ----- మే 20 పీఈసెట్ ----- -
ఎటూ ‘సెట్’ కాలేదు
ఎంసెట్ నిర్వహణపై కొనసాగుతున్న ప్రతిష్టంభన అధికారం మాదంటే మాది అని ఇరు రాష్ట్రాల వాదనలు గవర్నర్‌తో మంత్రులు జగదీశ్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు సమావేశం మధ్యేమార్గంగా పలు సూచనలు చేసిన నరసింహన్ చెరో ఏడాది.. లేదంటే చెరో ఐదేళ్లు నిర్వహించుకోండి ఈసారికి తెలంగాణకు.. వచ్చే ఏడాది కేంద్రం చెప్పినట్లు చేయండి ఏదేమైనా చర్చలతోనే సమస్యకు పరిష్కారం చూపాలని సూచన రేపు భేటీ కానున్న ఇరు రాష్ట్రాల విద్యామంత్రులు..! తెలంగాణ సెట్స్ తేదీల ప్రకటన వాయిదా సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ పరీక్షల అంశంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది.. ఇరు రాష్ట్రాలూ పట్టువిడవకుండా వ్యవహరిస్తుండడంతో వివాదం సమసిపోయే అవకాశం కనిపించడం లేదు.. శనివారం గవర్నర్ నరసింహన్ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు జగదీశ్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావుతో సమావేశమై చర్చించినా వ్యవహారం కొలిక్కి రాలేదు. భేటీలో ఇరువురు మంత్రులూ ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ అధికారం తమదేనంటూ ఎవరికి వారే వాదన వినిపించినట్లు సమాచారం. అయితే మధ్యే మార్గంగా గవర్నర్ పలుసూచనలు చేశారు. ఏ నిర్ణయమైనా సరే.. ఇరు రాష్ట్రాల మంత్రులు కూర్చుని చర్చించిన తర్వాతే ప్రకటించాలని, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. గవర్నర్ సూచన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల విద్యా మంత్రులు సోమవారం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిని మంత్రులిద్దరూ ధ్రువీకరించలేదు. ఏదో ఒకటి తేల్చండి..: విద్యార్థుల ఆందోళనలను తొలగించేలా, వారికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని గవర్నర్ నరసింహన్ ఇరు రాష్ట్రాలకు సూచించినట్లు తెలిసింది. ఎంసెట్‌ను విడివిడిగాా అయినా, ఉమ్మడిగా నిర్వహించినా... ఇద్దరు కలిసి చర్చించి ప్రకటించాలని సూచించినట్లు తెలిసింది. అయితే రెండు రాష్ట్రాలకు కలిపి ఒకే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించడమే మంచిదని పేర్కొన్నట్లు సమాచారం. లేదంటే చట్టంలోని నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని, ఇందుకు రెండు రాష్ట్రాలు చర్చల ద్వారానే పరిష్కారించుకోవాలని గవర్నర్ స్పష్టం చేశారు. అలా కాకపోతే ఒక ఏడాది తెలంగాణ మరో ఏడాది ఆంధ్రప్రదేశ్ నిర్వహించేలా ఒప్పందానికి రావాలని... లేదా చెరో ఐదేళ్లు ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహించేందుకు ఒప్పందం చేసుకోవాలని సూచించినట్లు తెలి సింది. లేదంటే ఈసారి తెలంగాణ ప్రభుత్వానికి నిర్వహణ అధికారం అప్పగించి, వచ్చే ఏడాది నుంచి కేంద్రం ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకునేలా ఒప్పందం చేసుకోవాలని కూడా నరసింహన్ సూచించినట్లు సమాచారం. ఈ అంశాలన్నింటిపై మరోసారి రెండు రాష్ట్రాల సీఎంలతో చర్చించి ఒక నిర్ణయానికి రావాలని మంత్రులకు గవర్నర్ తెలిపారు. ఎవరికివారు మొండి వాదనలతో న్యాయ వివాదంగా మారకుండా చూడాలని వారికి హితవు పలికినట్లు తెలిసింది. అయితే రెండు రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు మాత్రం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ప్రకారం అధికారం తమదంటే.. తమదేనని గవర్నర్‌కు తెలిపినట్లు సమాచారం. అయితే ఈసారి తెలంగాణ ప్రభుత్వం పరీక్ష నిర్వహించేలా ఒప్పందం చేసుకుని... ఆ తరువాత ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధంగా నడుచుకోవాలన్న గవర్నర్ సూచనపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. స్పష్టత లేకపోవడంతోనే సమస్య! పునర్వ్యవస్థీకరణ చట్టంలో పదేళ్లపాటు ఉమ్మడి ప్రవేశాల ప్రక్రియను, కోటా, రిజర్వేషన్లను కొనసాగించాలని ఉందిగాని.. ఉమ్మడి ప్రవేశ పరీక్షలను ఎవరు నిర్వహించాలన్న విషయంలో స్పష్టత లేదు. ముఖ్యంగా రెండు అంశాలపై గందరగోళం నెలకొంది.. సెక్షన్ 75 ప్రకారం పదో షెడ్యూల్లోని సంస్థలు భౌగోళికంగా ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంతోపాటు పొరుగు రాష్ట్ర ప్రజలకు వివక్ష లేకుండా సేవలందించాలి. ఆ సేవలను పొందేందుకు 2 రాష్ట్రాలు ఒప్పందం చేసుకోవాలి. లేకుంటే కేంద్ర నిర్ణయమే అంతిమం అవుతుంది. న్యాయ పోరాటం చివరి యత్నమే: గంటా ‘ఉమ్మడి ఎంసెట్ కోసం న్యాయ పోరాటమనేది ఏమీ వీలు కానప్పుడు మేము తీసుకొనే అంతిమ నిర్ణయం అవుతుంది’ అని ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టంచేశారు. శని వారం సాయంత్రం తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు గంటా రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. అనంతరం గంటా మీడియాతో మాట్లాడారు. ఇదిలా ఉండగా ఎంసెట్‌పై గవర్నర్ చేసిన సూచనలకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మేరకు మంత్రి గంటా శ్రీనివాసరావు గవర్నర్‌కు లిఖితపూర్వక లేఖ ఇచ్చారు. ఉమ్మడిగా పరీక్షల కోసం ఏ విధానానికైనా తాము కట్టుబడి ఉంటామని గంటా గవర్నర్‌కు వినిపించడంతో పాటు లిఖిత పూర్వకంగా లేఖ ఇచ్చారు. సెక్షన్ 75 ప్రకారం.. పదో షెడ్యూల్లోని సంస్థలు భౌగోళికంగా ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంతోపాటు పొరుగు రాష్ట్ర ప్రజలకు ఎలాంటి వివక్ష లేకుండా గతంలో మాదిరిగానే సేవలు అందించాలి. ఆ సేవలను పొందేందుకు రెండు రాష్ట్రాలు ఒప్పందం చేసుకోవాలి. లేనిపక్షంలో కేంద్రం తీసుకునే నిర్ణయమే అంతిమం. మా పరిధిలోనే ఉండాలి...: తెలంగాణ ఏపీ ఉన్నత విద్యా మండలి భౌగోళికంగా తెలంగాణలోనే ఉన్నందున.. అది తెలంగాణ ప్రభుత్వ పరిధిలో పనిచేయాలి. కానీ ఏపీ ఉన్నత విద్యా మండలి కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సూచనల మేరకు పనిచేసింది. మొన్నటి ఇంజనీరింగ్ ప్రవేశాల సందర్భంగా కొంత గడువు పెంచాలని మేం సుప్రీంకోర్టును కోరాం. కానీ గడువులోగా ప్రవేశాలను పూర్తిచేస్తామని ఏపీ ఉన్నత విద్యా మండలి ఆ కేసులో ఇంప్లీడ్ అయింది. అంటే అది ఏపీ ప్రభుత్వం కోసమే పనిచేస్తోంది. మాకు ఇప్పటివరకు ఏ విషయంలోనూ అధికారికంగా జవాబుదారీగా పని చేయలేదు. దీంతో విభజన చట్టంలోని నిబంధనలకు అనుగుణంగానే తెలంగాణ ఉన్నత విద్యా మండలిని ఏర్పాటు చేసుకున్నాం. ఉమ్మడి పరీక్షల నిర్వహణ అధికారం మాకే ఉంది. ఏపీ ప్రభుత్వం అడిగితే సేవలు అందిస్తాం. ఒకవేళ ఏపీ వాదన సరైంది అనుకున్నా... మాతో చర్చించకుండా, ఏకపక్షంగా ఏపీ మండలి పరీక్షల తేదీలను ఎలా ప్రకటిస్తుంది? వారి మండలికి చట్టబద్ధత లేదు: ఏపీ సెక్షన్ 101 ప్రకారం జీవో ద్వారా ఏర్పడిన తెలంగాణ ఉన్నత విద్యా మండలికి ఉమ్మడి పరీక్ష నిర్వహించే అధికారం లేదు. నిబంధనల ప్రకారం పదో షెడ్యూల్లోని సంస్థలు స్వతంత్రంగానే ఉంటాయే తప్ప.. వాటిని ఏదో ఒక్క ప్రభుత్వానికి సంబంధించినవిగా పరిగణించడానికి వీల్లేదు. అందుకే విభజన చట్టంలో ఏపీ 58 శాతం, తెలంగాణ 42 శాతం వాటాగా ఆయా సంస్థలకు నిధులు కేటాయించాలని స్పష్టం చేశారు. సెక్షన్ 101 ప్రకారం జీవో ద్వారా తెలంగాణ ఉన్నత విద్యా మండలిని ఏర్పాటు చేయడం పదో షెడ్యూల్‌కు, సెక్షన్ 75కు విరుద ్ధం. పదో షెడ్యూల్‌కు సంబంధం లేని సంస్థలను మాత్రమే 101 సెక్షన్ ద్వారా తెలంగాణ ఏర్పాటుచేసుకోవాలి. అలా ఏర్పడే సంస్థలు తెలంగాణ పరిధిలో మాత్రమే పనిచేస్తాయి. దాని ప్రకారం ఏర్పడిన తెలంగాణ మండలి ఏపీకి సేవలందిస్తుందని పేర్కొనడం చట్ట విరుద్ధం. సెక్షన్ 95 ప్రకారం... విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఇరు రాష్ట్రాల్లోని ఉన్నత విద్యా సంస్థల ప్రవేశాల్లో ఇప్పుడున్న కోటా, రిజర్వేషన ్లను పాటిస్తూ, ఉమ్మడి ప్రవేశాల ప్రక్రియను పదేళ్ల పాటు కొనసాగించాలి. పదేళ్ల పాటు కోటా ఇస్తాం..: తెలంగాణ హైదరాబాద్ పరిసరాల్లో ప్రముఖ విద్యా సంస్థల్లోని సీట్లలో ఏపీ విద్యార్థులకు అవకాశం కల్పించేందుకు విభజన చట్టంలో పదేళ్ల నిబంధనను విధించారు. అందుకు మేం సిద్ధం. తెలంగాణలోని విద్యా సంస్థల్లోని 15 శాతం ఓపెన్ కోటా సీట్లను మెరిట్ ఆధారంగా తెలంగాణ, ఏపీ విద్యార్థులతో భర్తీ చేస్తాం. అందుకోసమే ఏపీ ప్రభుత్వ ప్రతినిధిని ప్రవేశాల కమిటీలోనూ సభ్యుడిగా చేర్చాం. ఏపీ ప్రభుత్వం కూడా అక్కడి విద్యా సంస్థల్లోని 15 శాతం ఓపెన్ కోటాలో ఏపీ విద్యార్థులతోపాటు తెలంగాణ విద్యార్థులకు మెరిట్ ఆధారంగా సీట్లు ఇస్తే సరిపోతుంది. ఇక్కడి విద్యార్థులు ఏపీలో, ఏపీ విద్యార్థులు ఇక్కడ పోటీ పడాల్సిందల్లా ఆ 15 శాతం సీట్లలోనే. దానికి పక్కాగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టిన పుడు అభ్యంతరం ఏముంది. సాధ్యం కాదు..: ఏపీ పదేళ్ల పాటు ఉమ్మడి ప్రవేశాల ప్రక్రియ అంటే పరీక్షల నిర్వహణతో కూడా కూడుకున్నదే. పరీక్షలు వేరుగా, ప్రవేశాలను వేరుగా చూడరాదు. వేర్వేరు పరీక్షల వల్ల ఉమ్మడి ప్రవేశాలకు మెరిట్ జాబితా రూపొందించడం సాధ్యం కాదు. విద్యార్థులు రెండు పరీక్షలు రాయాల్సి వస్తుంది. వేర్వేరు పరీక్షలు ఈ సెక్షన్‌లోని నిబంధనలకు విరుద్ధం. ఒకే పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిం చాలి. లేకపోతే విద్యార్థులు నష్టపోతారు. -
పార్టీలోకి వస్తామని చాలా మంది అడుగుతున్నారు
విశాఖపట్నం: ఎంసెట్ పరీక్ష ఇరు రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణపై చర్చిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం విశాఖలో స్పష్టం చేశారు. ఈ అంశంపై త్వరలో స్పష్టత వస్తుందని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీలోకి వస్తామని చాలా మంది అడుగుతున్నారని తెలిపారు. గచ్చిబౌలి తరహాలో విశాఖపట్నం నగరంలో కూడా క్రీడా ప్రాంగణాన్ని నిర్మిస్తామని చెప్పారు. త్వరలో నూతన క్రీడా విధానాన్ని తమ ప్రభుత్వం ప్రకటిస్తుందని గంటా శ్రీనివాసరావు తెలిపారు. -
గూడెం నుంచి ఆగిరిపల్లికి తరలిపోయిన నిట్
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పెట్టాలనుకున్న 'నిట్'ను కృష్ణాజిల్లా ఆగిరిపల్లికి మార్చేశారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మార్చి 11వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలను ఏపీ ప్రభుత్వమే నిర్వహిస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రస్థాయిలో తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలుకావట్లేదని గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలలో రెండు రోజులు 'బడిలో బస' కార్యక్రమాన్ని ఏర్పాటుచేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. త్వరలో ప్రభుత్వ పాఠశాలల్లో వీడియో పాఠాలు చెప్పిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆయన సూచించారు. -
ఏపీలో ఇంటర్ పరీక్షలు సొంతంగానే!
మార్చి 11 నుంచి నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 11 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడిగా ఈ పరీక్షలు నిర్వహించాలని ఏపీ సర్కారు చేసిన యత్నం ఫలించలేదు. తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియెట్‌కు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసుకుంది. దీంతో తాము సొంతంగగానే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని మంత్రి గంటా శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. -
'అవసరమైతే ఒక మెట్టు దిగడానికి ఓకే'
హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలపై జరగాల్సిన ఏపీ, తెలంగాణ మంత్రుల సమావేశం వాయిదా పడింది. సమావేశానికి తెలంగాణ విద్యాశాఖ జగదీశ్ రెడ్డి హాజరుకాలేదు. ఆయన కోసం ఇంటర్ బోర్డులో ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గంటకుపైగా నిరీక్షించారు. అసెంబ్లీలో ఎల్ బీసీ సమావేశం కారణంగా భేటీకి రాలేనని గంటాకు జగదీశ్ రెడ్డి సమాచారం ఇవ్వడంతో ఆయన వెనుదిరిగారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఒక్క మెట్టు దిగడానికైనా సిద్ధమని గంటా ప్రకటించారు. తెలంగాణ సర్కారు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరిపేందుకు కూడా తమకు అభ్యంతరం లేదన్నారు. సకాలంలో పరీక్షలు జరిపి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీయిచ్చారు. తెలంగాణ మంత్రితో మాట్లాడి తదుపరి భేటీ ఎప్పుడనేది తెలియజేస్తామన్నారు. -
అవసరమైతే కోర్టుకెళతాం: మంత్రి గంటా
-
అవసరమైతే కోర్టుకెళతాం: మంత్రి గంటా
హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ మంత్రులు గవర్నర్ నరసింహన్ ను కోరారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, కింజరపు అచ్చెన్నాయుడు, కామినేని శ్రీనివాస్ మంగళవారం గవర్నర్ ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. గవర్నర్ ను కలిసిన తర్వాత గంటా శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు. బుధవారం తెలంగాణ విద్యాశాఖ మంత్రిని పిలిచి గవర్నర్ మాట్లాడతానన్నారని చెప్పారు. పరీక్షలు వేర్వేరుగా నిర్వహిస్తే విద్యార్థులు నష్టపోతారని, ఉమ్మడిగా నిర్వహించాలని విభజన చట్టంలో ఉందని తెలిపారు. ఈ విషయంలో అవసరమైతే కోర్టుకు వెళతామని, కేంద్రానికి కూడా ఫిర్యాదు చేస్తామని గంటా శ్రీనివాసరావు అన్నారు. -
టీడీపీలో రెవెన్యూ బదిలీల చిచ్చు
విశాఖపట్నంపై పట్టు సాధించాలన్న టీడీపీ పెద్దల వ్యూహం అధికార పార్టీలో ఆధిపత్య పోరుకు దారితీస్తోంది. భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా జిల్లా అధికార యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్న ఇతర జిల్లాల మంత్రులు, సీఎం చంద్రబాబు పేషీ పెద్దలు వ్యూహరచన బెడిసికొట్టింది. జిల్లాలో ఆర్డీవోల బదిలీ అధికార టీడీపీలో చిచ్చు రాజేసింది. ఇతర జిల్లాల మంత్రులు, సీఎం పేషీలోచక్రం తిప్పుతున్న పెద్దల అభిమతానికి అనుగుణంగా జరిగిన ఈ బదిలీలపై విశాఖ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆర్డీవోల బదిలీల్లో తమ జిల్లాపై ఇతర జిల్లాల మంత్రులు, సీఎంపేషీలోని షాడో నేతలు పెత్తనమేమిటని జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన అనుకూల ఎమ్మెల్యేలు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధపడ్డారు. ప్రధానంగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, దేవినేని ఉమ, రావెల కిషోర్‌బాబు, యనమల రామకృష్ణుడుల తీరుపై మండిపడినట్లు తెలుస్తోంది. ఇక పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణమూర్తి ఏకంగా రాజీనామాకు సిద్ధపడటంతో పరిస్థితి తీవ్రరూపు సంతరించుకుంది. పరిస్థితి చేయిదాటేట్లు కనిపించడంతో ఆర్డీవోల బదిలీలపై ప్రభుత్వం వెనక్కితగ్గాలని నిర్ణయించుకుంది. కొత్త ఆర్డీవోలను జాయిన్ చేసుకోవద్దని కలెక్టర్‌ను మౌఖికంగా ఆదేశించింది. పట్టు కోసం... నవ్యాంధ్రప్రదేశ్ ఆర్థిక, పారిశ్రామిక రాజధానిగా భావిస్తున్న జిల్లాపై పట్టుకోసం టీడీపీ పెద్దలు సిగపట్లు పడుతున్నారు. జిల్లాలో పెట్రోకారిడార్, సెజ్‌లు, ఇతర ప్రాజెక్టులకు భారీస్థాయిలో భూసేకరణ చేపట్టనున్నారు. భూకేటాయింపులపై టీడీపీ పెద్దల సన్నిహితులు కన్నేశారు. అందుకే కీలకమైన రెవెన్యూ పోస్టుల్లో తమ సన్నిహితులు ఉండాలని ఆర్డీవో బదిలీలను మార్గంగా చేసుకుంటున్నారు. అందుకోసం ఇతర జిల్లాల మంత్రులు, సీఎంపేషీ పెద్దలు ఓవర్గంగా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు మరోవర్గంగా ఎత్తులు పైఎత్తులు వేసుకుంటున్నారు. ఆర్డీవోల నియామకానికి సంబంధించి జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు కొందరి పేర్లను సూచించారు. బుధవారం రాత్రి ఆర్డీవోల బదిలీ జాబితాతో వారు కంగుతిన్నారు. విశాఖ ఆర్డీవోగా ఉన్న వెంకట మురళి, అనకాపల్లి ఆర్డీవో ఎస్.ఎన్.వి.బి. వాసుదేవరాయుడులను ప్రభుత్వం బదిలీ చేసింది. వారికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా హైదరాబాద్‌లో రిపోర్టు చేయమన్నారు. దేవాదాయ శాఖలో పనిచేస్తున్న వై. రామచంద్రారెడ్డిని విశాఖ ఆర్డీవోగా బదిలీ చేసింది. వెయిటింగ్లో ఉన్న బి.పద్మావతిని అనకాపల్లి ఆర్డీవోగా నియమించింది. మంత్రి గంటా, టీడీపీ ఎమ్మెల్యేల అభిప్రాయానికి విరుద్ధంగా ఆర్డీవోలను బదిలీ చేసింది. మరోవైపు నర్సీపట్నం ఆర్డీవో విషయంలో మంత్రి అయ్యన్నపాత్రుడి మాట చెల్లుబాటైంది. ఆయన సూచనలమేరకు ప్రస్తుత ఆర్డీవో సూర్యారావును కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర జిల్లా మంత్రుల పెత్తనం ఆర్డీవోల బదిలీ వెనుక ఇతర జిల్లాల మంత్రులు చక్రం తిప్పారు. ఆర్డీవో నియామకంలో మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, దేవినేని నెహ్రూ కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. మంత్రులు యనమల రామకృష్ణుడు, రావెల కిషోర్‌బాబు అభీష్టం మేరకు అనకాపల్లి కొత్త ఆర్డీవోను నియమించారని సమాచారం. సీఎం పేషీలోనే చక్రం తిప్పి ఆ నలుగురు మంత్రులు తాము కోరుకున్నవారికి జిల్లాలో పోస్టింగులు వేయించుకున్నారు. దీనికి నారా లోకేష్ సన్నిహితుల ఆశీస్సులు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అందుకే జిల్లా మంత్రులు సూచించినవారిని కాకుండా కనీసం వారికి సమాచారం లేకుండానే ఆర్డీవోలను నియమించారు. భగ్గుమన్న విశాఖ నేతలు... ఆర్డీవోల బదిలీల వ్యవహారం బెడిసికొట్టింది. గంటా శ్రీనివాసరావు, ఆయన వర్గీయులైన అనకాపల్లి ఎంపీ అవంతీ శ్రీనివాస్, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణమూర్తి తీవ్రస్థాయిలో స్పందించారు. జిల్లాపై ఇతర జిల్లాల మంత్రుల పెత్తనమేమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణమూర్తి తాను రాజీనామాకు వెనుకాడేది లేదని చెప్పడం గమనార్హం. ఆర్డీవో పోస్టింగే కాదు కనీసం తహశీల్దార్ పోస్టింగులను కూడా ఇతర జిల్లాల మంత్రులే నిర్ణయిస్తే ఇక తామెందుకు పదవుల్లో కొనసాగడమని ఆయన ప్రశ్నించారు. ఆయన్ని మంత్రి గంటా అనునయించారు. పరిస్థితి చేయిదాటేట్లుగా ఉండటంతో సీఎం కార్యాలయ అధికారులు సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుకు సమాచారం అందించారు. దాంతో ప్రస్తుతానికి ఆర్డీవోల బదిలీలను నిలుపుదల చేయాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. ఆర్డీవోగా నియమితులైన వై.రామచంద్రారెడ్డిని బాధ్యతలు స్వీకరించవద్దని చెప్పారు. ఆయన బాధ్యతలు స్వీకరించేందుకు కలెక్టర్ యువరాజ్‌ను గురువారం ఉదయం కలిశారు. ఆయన్ను జాయిన్ చేసుకోవాలని తమకు ఆదేశాలు రాలేదని కలెక్టర్ ఆయనతో చెప్పడం గమనార్హం. మరోవైపు హైదరాబాద్‌లో రిపోర్టు చేయమని ఆదేశాలు వచ్చినప్పటికీ వెంకటమురళి విశాఖ ఆర్డీవోగా గురువారం విధులకు హాజరయ్యారు. అనకాపల్లి ఆర్డీవోగా ఉంటూ బదిలీ అయిన వసంతరాయుడు కూడా విధుల నుంచి రిలీవ్ కాలేదు. ఆయన గురువారం విధులు నిర్వర్తించారు. మంత్రి గంటా, ఎమ్మెల్యేల ఒత్తిడికి ప్రభుత్వం వెనక్కితగ్గినట్లే కనిపిస్తోంది. ఈ బదిలీలపై తుది నిర్ణయం ఇంకా అధికారికంగా వెలువడాల్సి ఉంది. -
'కేంద్రం నుంచి లేఖ రాగానే డీఎస్సీ నోటిఫికేషన్'
హైదరాబాద్ : డీఎస్సీ నోటిఫికేషన్‌పై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోద ముద్ర వేయలేదని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. కేంద్రం సాధ్యమైనంత త్వరలో ఆమోదముద్ర వేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకు సంబంధించి కేంద్రం నుంచి లేఖ రాగానే నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో గంటా విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఐఐటీ, ఐఐఎం, ఐఐఐటీ,ఎన్ఐటీ, ఐఐఎస్ఈఏఆర్ ఏర్పాటు కోసం స్థలాలను పరిశీలన చేస్తున్నట్లు వివరించారు. ఆ సంస్థల ఏర్పాటు కోసం గురు, శుక్రవారాల్లో జాతీయ విద్యాసంస్థల కమిటీలు పర్యటిస్తాయని చెప్పారు. అందుకోసం కర్నూలు, తిరపతి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో స్థలాలను ఆ కమిటీలు పర్యటిస్తాయని తెలిపారు. టీచర్ల బదిలీలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఓ విలేకర్లు అడిగిన ప్రశ్నకు గంటా సమాధానమిచ్చారు. -
లాసెట్ ఫలితాల విడుదల
తిరుపతి: లా ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు ఎస్వీ యూనివర్సిటీలో లాసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాస రావు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థలన్నీ ఒకే గొడుగు కింద ఉంటాయని చెప్పారు. తిరుపతిలో ఐఐటీ, ఐటీఐఆర్, కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. -
ఏపీకి 11 జాతీయ విద్యాసంస్థలు: గంటా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కు 11 జాతీయ విద్యాసంస్థలు రప్పించేందుకు కృషిచేస్తున్నట్టు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకోసం 8 వేల కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. ఈ నెల 25న కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు సీఎం చంద్రబాబుతో పాటు తాము కూడా ఢిల్లీ వెళ్తున్నట్టు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో తగ్గిన మెడికల్ సీట్లను తిరిగి అందుబాటులో తెచ్చేందుకు కృషి చేస్తామని, దీనిపై కేంద్రంతో సంప్రదింపులు జరపనున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. -
గంటాపై ఈసీకి సీపీఎం ఫిర్యాదు
విశాఖ జిల్లా భీమిలిలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేస్తున్న గంటా శ్రీనివాసరావుపై ఎన్నికల కమిషన్‌కు సీపీఎం వర్గాలు ఫిర్యాదు చేశాయి. గంటా అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కోరాయి. ప్రభుత్వ కాంట్రాక్టులు నిర్వహిస్తున్న ప్రత్యూష కంపెనీలో గంటా శ్రీనివాసరావు భాగస్వామిగా ఉన్నట్లు సీపీఎం నాయకులు తమ ఫిర్యాదులో తెలిపారు. 11.37 కోట్ల రూపాయల ఆదాయానికి తాను దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లో గంటా శ్రీనివాసరావు ఆధారాలు చూపించలేదని ఆరోపించారు. -
ఈ సారీ సీటు మార్చేద్దాం..
ఒక్కో ఎలక్షన్‌కు ఒక్కో స్థానం ఓటమి భయంతో నియోజకవర్గాల మార్పు గంటా రాజకీయ ప్రస్థానం తీరిది సాక్షి, విశాఖపట్నం : ప్రతి ఎన్నికకు కొత్తనియోజకవర్గాన్ని వెతుక్కుని అటు వలసపోవడం మాజీ మంత్రి గంటాకు మామూలైంది. 1999 లోక్‌సభ ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీచేసి తొలిసారి ఎంపీ అయ్యారు. ఆ తర్వాత 2004 అసెంబ్లీ ఎన్నికల్లో చోడవరం నుంచి టిక్కెట్ తెచ్చుకున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో సీటుమార్చి అనకాపల్లి నుంచి పోటీచేశారు. 2014 ఎన్నికల్లో తిరిగి అదేస్థానం నుంచి పోటీచేయాలని భావించినా సర్వే చేయించి చూసుకుంటే చిత్తుగా ఓడిపోతారని తేలడంతో మళ్లీ కొత్త సీటు కోసం ఎత్తుగడలు వేశారు. చివరకు సిట్టింగ్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ పోటీచేయాలని ప్రయత్నించిన భీమిలికి మారి ఇప్పుడు అక్కడినుంచి పోటీచేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న అయిదేళ్లలో నియోజకవర్గ ప్రజలను పూర్తిగా విస్మరించి కేవలం తన వ్యాపారాల్లో మునిగితేలడం ఆయనకు అలవాటు. దీంతో ఐదేళ్ల తరువాత ప్రజలకు ముఖం చూపేందుకు మనసొప్పక ఏకంగా నియోజకవర్గాన్నే మార్చేస్తున్నారు. వాస్తవానికి భీమిలినుంచి పోటీచేయడానికి గంటాకు ఏమాత్రం ఆసక్తిలేదు. ముందు విశాఖ ఎంపీ స్థానానాకి పోటీచేయాలనుకున్నారు. కాని వైఎస్సార్సీపీ నుంచి విజయమ్మ బరిలోకి దిగుతారనే ప్రచారం నేపథ్యంలో అప్పట్లో ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆతర్వాత అనకాపల్లికే వెళ్లాలని చివరకు నిర్ణయం తీసుకున్నారు. అక్కడ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని గ్రహించి తనకోసం నియోజకవర్గం త్యాగం చేసే నేత కోసం వెదుక్కున్నారు. చివరకు తనను నమ్మివచ్చిన బృంద సభ్యుడు అవంతిపై కన్నేశారు. ఆయన ఎప్పటినుంచో అక్కడ ఖర్చుపెట్టి బలంపెంచుకుంటే తీరా వచ్చి తన రాజకీయ అవసరం కోసం ఈయన్ను బలిచేసి అనకాపల్లి ఎంపీ సీటుకు పంపించారు. దీంతో గంటా వైఖరిపై అవంతి కక్కలేకమింగలేక అన్నట్లున్నారు. -
సుపుత్రుల వీరంగం...
తమ చేష్టలతో ఇద్దరు నేతల పుత్రరత్నాలు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఒకరు మద్యం మత్తులో వీరంగం వేస్తే.... మరొకరు ఏకంగా కానిస్టేబుల్‌పైనే దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సుపుత్రుడు అరవింద్ యాదవ్‌కు కోపం వచ్చింది. దాంతో నన్నే ప్రశ్నిస్తావా అంటూ కానిస్టేబుల్‌పై చేయి చేసుకుని తండ్రి అధికార దర్పాన్ని కుమారుడు ప్రదర్శించాడు. పాత బస్తీలోని హుస్సేనిఆలంలో హోలీ వేడుకలు నిర్వహించారు. అరవింద్ యాదవ్- కామదహన్ కార్యక్రమంలో పాల్గొని ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయడంతో బందోబస్తులో ఉన్న ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు యత్నించాడు. అయితే రోడ్డుపై హోలీ ఆడవద్దని చెప్పినందుకు వంశీ అనే కానిస్టేబుల్‌పై అరవింద్ యాదవ్ దాడి చేసి చితక్కొట్టాడు. గాయాలపాలైన వంశీ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుని.. హుస్సేన్ ఆలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అరవింద్ యాదవ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అంజన్‌కుమార్‌యాదవ్ తన కుమారుడుని కేసులో నుంచి తప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ వ్యవహారంలో తన కుమారుడి తప్పేమీ లేదంటూ వెనకేసుకు రావటం విశేషం. ఈ సంఘటన మరవకముందే మారో మాజీ మంత్రి కుమారుడు రవితేజ శంషాబాద్ విమానాశ్రయంలో తప్పతాగి తన స్నేహితులతో కలిసి హల్చల్ చేశాడు. మద్యం మత్తులో హంగామా సృష్టించారు. తప్పతాగి బార్ సిబ్బంది, పుష్పక్ బస్ డిపో కౌంటర్‌పై దాడికి పాల్పడ్డారు. తన స్నేహితుడు ఇంద్రజిత్తో కలిసి రవితేజ రచ్చ చేశాడు. ఎయిర్‌పోర్టు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చట్ట ప్రకారం రవితేజపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, ఒకవేళ ఒత్తిళ్లు వచ్చినా లొంగేది లేదని పోలీసులు తెలిపారు. ఇక తండ్రుల పరపతిని అడ్డం పెట్టుకొని నేతాశ్రీల తనయుడులు రెచ్చిపోవటం గతంలోనూ జరిగాయి కూడా. అవకాశం దొరికినప్పుడల్లా రాజకీయ నేతల కుమారుల వీరంగం వేస్తుండటం ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు తమ పుత్రుల అత్యుత్సాహంతో నేతలు కంగారు పడుతున్నారు. ఎన్నికల వేళ తమ కుమారులు రెచ్చిపోతుండడంతో గాభరా పడుతున్నారు. ఇక తండ్రులు తమ వెనక కొండంత అండగా ఉండటంతో పుత్నరత్నాలు తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. -
'అయ్యన్నపాత్రుడితో మనస్పర్దలు నిజమే'
విశాఖపట్టణం: టీడీపీ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడితో మనస్పర్దలు ఉన్న మాట నిజమేనని తాజా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అంగీకరించారు. ఎన్ని సమస్యలున్నా చంద్రబాబుతోనే ఉంటానని ఆయన చెప్పారు. సహచర ఎమ్మెల్యేలతో తన నివాసంలో గంటా శ్రీనివాసరావు ఈరోజు సమావేశమయ్యారు. చంద్రబాబు సమక్షంలోనే అయ్యన్నపాత్రుడు తనపై వ్యాఖ్యలు చేయడం పట్ల ఆయన మనస్తాపం చెందినట్టు తెలిసింది. టీడీపీ చేరిన గంటా సహా నలుగురు ఎమ్మెల్యేలు కన్నబాబురాజు, అవంతి శ్రీనివాస్, పంచకర్ల రమేష్, చింతలపూడి వెంకట్రామయ్యలపై అయన్నపాత్రుడు పరోక్షంగా విమర్శలు చేశారు. ‘ఇవాళ టీడీపీలోకి కొందరు వచ్చారు. వాళ్లు ఎంతకాలం ఉంటారో పోతారో తెలియదు. మనం మాత్రం పార్టీలోనే కొనసాగుదాం’’ అంటూ ఎద్దేవా చేశారు. కొత్తగా వచ్చిన నేతలు ఇకనైనా పార్టీలో బుద్ధిగా పనిచేస్తే పార్టీకి మంచిదంటూ విరుచుకుపడ్డారు. -
తెలంగాణ ప్రతినిధుల్లా ఢిల్లీ పెద్దలు: గంటా
హైదరాబాద్: ఢిల్లీ పెద్దలు తెలంగాణ ప్రతినిధుల్లా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. సమైక్య రాష్ట్రం కావాలంటే సస్పెండ్ చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలను తెలపడమే సీమాంధ్ర ఎంపీలు చేసిన తప్పా అని అడిగారు. తెలంగాణ ఎంపీలు గతంలో పలుమార్లు పార్లమెంట్ సమావేశాలను అడ్డుకున్నారని, వారిని ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని మంత్రి ఎస్. శైలజానాథ్ అనంతపురంలో అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనుకోవడమే వారు చేసిన తప్పా అని ప్రశ్నించారు. సీమాంధ్ర ఎంపీల బహిష్కరణ బాధాకరమని మరో మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. పార్లమెంట్ విభజన బిల్లు పెడితే సీఎం కిరణ్ రాజీనామా చేస్తారని చెప్పారు. -
సీఎం రాజీనామా చేస్తే నేనూ చేస్తా
గుంటూరు : రాష్ట్ర విభజన అనివార్యమైతే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవిని త్యాగం చేస్తారని గతంలో ప్రకటించారనీ, ఒకవేళ అదే జరిగితే తానూ రాజీనామా చేసి ముఖ్యమంత్రిని అనుసరిస్తానని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. విభజన విషయంలో శాస్త్రీయ పద్ధతులు పాటించలేదని చెప్పారు. ఇప్పటివరకు పార్లమెంట్ జరగకుండా ఎంపీలు చాలా చక్కగా సమైక్యవాదాన్ని వినిపిస్తున్నారని, ఇకమందు కూడా అదే ధోరణి కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. -
రాజ్యసభకు పోటీ చేస్తా: జేసీ
-
రాజ్యసభకు పోటీ చేస్తా: జేసీ
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యత్వానికి పోటీ చేస్తున్నట్లు మాజీమంత్రి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆమేరకు ఆయన తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తనకు సహకరించాలని గంటా శ్రీనివాసరావు, టీజీ వెంకటష్తో పాటు ఇతర నేతలను కోరినట్లు ఆయన శుక్రవారమిక్కడ తెలిపారు. రాజ్యసభకు గంటా పోటీ చేస్తారో లేదో తనకు తెలియదన్నారు. అధిష్టానాన్ని ధిక్కరించి రాజ్యసభకు స్వతంత్ర్యంగా పోటీ చేసేందుకు జేసీ అడుగులు వేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాగా అధిష్ఠానం నుంచి అభ్యర్థుల జాబితా రాకముందే పార్టీ ఎమ్మెల్యేలు ఎవరికివారుగా రాజ్యసభ అభ్యర్థిత్వానికి సంతకాల సేకరణ చేపట్టడంపై పార్టీ అధిష్ఠానం ఆగ్రహంగా ఉంది. మరోవైపు మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ సీమాంధ్ర కాంగ్రెస్ తరపున ఒక్కరే పోటీలో ఉంటారని అన్నారు. చిరంజీవితో సంప్రదించాకే పోటీపై నిర్ణయం ఉంటుందన్నారు. తమలో ఒకరిని మాత్రమే బరిలో దింపే యోచనలో ఉన్నట్లు గంటా తెలిపారు. -
గంటా తంటా నేను చూసుకుంటా..
*మంత్రి గంటాను టీడీపీలో చేర్చుకోవద్దంటూ అయ్యన్న సూచన *కలిసి పనిచేయలేమని స్పష్టీకరణ *పట్టించుకోని చంద్రబాబు *ఆ విషయం తనకొదిలేయాలని హితవు *చిన్నబోయిన ‘చింతకాయల’! సాక్షి, విశాఖపట్నం: ‘రాబోయే ఎన్నికలు పార్టీకి, మనకు చావుబతుకుల్లాంటివి. కొత్త వారు వస్తారు. పార్టీ అవసరాల రీత్యా వారిని మనం స్వాగతించాలి. గంటా శ్రీనివాసరావు విషయం నాకొదిలేయండి. ఆయన్ను ఎక్కడ పెట్టాలో నేను చూసుకుంటా’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన మదిలోని మాటను చెప్పకనే చెప్పారు. బుధవారం విశాఖలో మంత్రి గంటా కుమార్తె వివాహానికి హాజరైన చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడారు. రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే ప్రతిసారీ పార్టీలు మార్చే మంత్రి గంటాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోకి తీసుకోవద్దని, అలాంటి వాళ్లను చేర్చుకుంటే పార్టీకే నష్టమని సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఒకవేళ తీసుకుంటే తామెలా పనిచేయాలని చంద్రబాబు ఎదుట మరోసారి తన వ్యతిరేకతను వెల్లగక్కారని సమాచారం. అనకాపల్లి లోక్‌సభ నుంచి తన కుమారుడు విజయ్‌కు పోటీచేసే అవకాశం ఇవ్వాలని కోరారు. ఒకే కుటుంబానికి రెండు టికెట్లు అనుకుంటే తాను నర్సీపట్నం అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి వెనక్కుతగ్గుతానని తన అభిప్రాయం వెల్లడించినట్టు తెలిసింది. కానీ బండారు సత్యనారాయణమూర్తి వర్గం గంటా రాకకు పచ్చ జెండా ఊపింది. తన మాటను చంద్రబాబు సీరియస్‌గా పట్టించుకోకపోవడంతో అయ్యన్న అసహనంతో బయటకు వచ్చేశారని సమాచారం. శ్రీకాకుళం జిల్లా నేతలతో సమీక్షించిన బాబు అక్కడ కళా వెంకట్రావు, రామ్మూర్తినాయుడు మధ్య విభేదాలు పార్టీకి నష్టం చేస్తున్నాయని, విభేదాలు పక్కనపెట్టి కలిసిపనిచేయాలని, లేదంటే పార్టీకి నష్టమంటూ ఘాటుగా హెచ్చరించారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. నా కుమారుడి సీటు కోసం మాట్లాడా.. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు విజయ్‌కు అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వాలని చంద్రబాబును కోరినట్ట్టు పార్టీ సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు చెప్పారు. బాబును కలిసేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ నా కుమారుడికి అనకాపల్లి ఎంపీ సీటు, తనకు నర్సీపట్నంలో ఎమ్మెల్యే సీటు అడిగానన్నారు. ఇంకా ఆయన ఎటువంటి హామీ ఇవ్వలేదని చెప్పారు. ఒకే కుటుంబానికి రెండు సీట్లు ఇవ్వడం కుదరదంటే తాను పక్కకు తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. టీడీపీ నేతలు సి.ఎం.రమేష్, పయ్యావుల కేశవ్‌లు మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రంలోనే వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతాయన్నారు. -
అయ్యన్నపాత్రుడుకి మతి చలించింది: గంటా
విశాఖ : మంత్రి గంటా శ్రీనివాసరావు, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా అయ్యన్నపాత్రుడిపై మంత్రి గంటా విరుచుకుపడ్డారు. అయ్యన్నకు మతి చలించిందని, అందుకే తనపై చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. అటువంటి వాటిని తాను పట్టించుకోనవసరం లేదని గంటా స్పష్టం చేశారు. అగనంపూడిలో టాటా సంస్థ నిర్మిస్తున్న కేన్సర్ ఆస్పత్రికి మంత్రి గంటా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత సుబ్బరామిరెడ్డి పాల్గొన్నారు. ఇక రాష్ట్ర విభజన నేపథ్యంలో అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారన్న ప్రచారంతో ఆయన ప్రత్యర్థులు అప్రమత్తం అవుతున్న విషయం తెలిసిందే. గతంలో గంటా టీడీపీలో ఉన్నప్పుడు ఆయనకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రత్యర్థిగా ఉన్న విషయం తెలిసిందే. గంటా ఏ పార్టీలోకి వెళితే అది నాశనమేనని, ప్రజారాజ్యంలోకి వెళ్లి ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయించారని... . గంటాది ఐరన్ లెగ్ అని అయ్యన్న వ్యాఖ్యలు చేశారు. -
నా విషయంలో తలదూర్చడానికి గంటా ఎవరు?
-
నా విషయంలో తలదూర్చడానికి గంటా ఎవరు?
విశాఖ : గత కొంతకాలంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై అసంతృప్తితో ఉన్న గిరిజన మంత్రి బాలరాజు తన కోపాన్ని ఈసారి సహచర మంత్రి గంటా శ్రీనివాసరావుపై చూపారు. తన విషయంలో తలదూర్చడానికి గంటా ఎవరు అని ఆయన సూటిగా ప్రశ్నించారు. రచ్చబండ విషయంలో తనకు సమాచారం లేదని బాలరాజు తెలిపారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చాకే తన నిర్ణయం చెబుతానని ఆయన అన్నారు. రాజకీయ నేతలు రాజకీయం చేయకపోతే వ్యాపారాలు చేస్తారా అని అన్నారు. వ్యక్తులకు విధేయత చూపటం తన పద్ధతి కాదని బాలరాజు వ్యాఖ్యానించారు. కాగా ముఖ్యమంత్రికి, తనకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని, అన్నీ తొందర్లోనే సర్దుకుంటాయని మంత్రి బాలరాజు పేర్కొనటం విశేషం. కిరణ్‌కుమార్‌రెడ్డి చోడవరం సభకు వచ్చినప్పుడు గిరిజన శాఖ పథకాన్ని తాను లేకుండా ప్రారంభించడం సమంజసం కాదన్నారు. మరోవైపు బాలరాజు ఈరోజు సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. -
'మంత్రులను కించపరిచే స్థాయిలో ప్రభుత్వం లేదు'
విశాఖ:మంత్రులను కించపరిచే స్థాయిలో ప్రభుత్వం లేదని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మంత్రులను ప్రభుత్వం తక్కువగా చూస్తూ అవమానానికి గురి చేస్తుందన్న మంత్రి బాలరాజు వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడిన గంటా..బాలరాజును ఎవరు కించపరిచారో చెప్పాలన్నారు.మంత్రులను కించపరిచే విధంగా ప్రభుత్వం వ్యవహరించలేదని తెలిపారు. కాగా, విభజన జరిగిందంటూ పురందేశ్వరి వ్యాఖ్యలను కూడా ఆయన ఖండించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాను వివక్షను ఎదుర్కొంటున్న ట్టు గిరిజన శాఖ మంత్రి బాలరాజు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. శాఖాపరంగానూ, సంక్షేమ కార్యక్రమాల పరంగానూ కొం త వివక్షకు గురవుతున్నానన్న భావన బాధ కలిగిస్తున్నదన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలోని క్లబ్‌హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తన శాఖకు సంబంధించిన నిర్ణయాలన్నీ తన ప్రమేయం లేకుండానే జరుగుతున్నాయన్నారు. 7 (ఏ) క్లాజ్ ద్వారా ముఖ్యమంత్రికి ఉండే విస్తృత స్థాయి అధికారాలను ఉపయోగించుకొని నిర్ణయాలు తీసుకున్న సందర్భాలూ ఉన్నాయన్నారు. -
మళ్లీ డుమ్మా కొట్టిన బాలరాజు
విశాఖ : వరద ప్రాంతాల పర్యటన కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటనకు మంత్రి బాలరాజు మళ్లీ డుమ్మా కొట్టారు. ముఖ్యమంత్రి గురువారం విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నా.... కిరణ్ తనను పట్టించుకోవటం లేదనే ఆగ్రహంతో ఉన్న ఆయన రెండు రోజు కూడా పర్యటనకు దూరంగా ఉన్నారు. అంతేకాకుండా సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో అధిష్టానం వద్ద విధేయుడిగా ముద్ర పడేందుకే బాలరాజు ప్రాధాన్యత ఇచ్చినట్లు అయ్యింది. జిల్లా పాలనా, రాజకీయ వ్యవహారాల్లో మంత్రి గంటా శ్రీనివాసరావు తనకు విలువ లేకుండా చేస్తున్నారని ...బాలరాజు చాలాకాలంగా కారాలు మిరియాలు నూరుతున్నారు. అంతేకాకుండా ఇద్దరు మంత్రులకు సమాన విలువ, ప్రాధాన్యత ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి కూడా గంటాకు మాత్రమే పెద్దపీట వేస్తున్నారని పలుమార్లు బాలరాజు తన మనసులోని మాటను బయటపెట్టారు కూడా. ఈ నేపథ్యంలో సమైక్యాంధ్ర ఉద్యమం రావటం సీఎంతో పాటు మంత్రి గంటా కూడా పార్టీ హైకమాండ్ నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరిస్తుండటాన్ని తాను అవకాశంగా మార్చుకోవడానికి ఆయన వ్యూహ రచన చేశారు. ఎవరు ఎటుపోయినా తాను మాత్రం పార్టీ హైకమాండ్ వద్ద విధేయుడిగా మార్కులు వేయించుకోని జిల్లా పార్టీలో చక్రం తిప్పేందుకు బాలరాజు పావులు కదుపుతున్నారు. సీఎంతో పాటు మంత్రి గంటాతో అమీతుమీ తేల్చుకోవడానికే సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగానే ఈనెల 20న జరిగిన ముఖ్యమంత్రి పర్యటనకు బాలరాజు డుమ్మా కొట్టారు. అయితే సీఎం పర్యటనకు సంబంధించిన సమాచారం కూడా లేనందువల్లే హాజరు కాలేదని చెప్పుకోవటం విశేషం. -
విభజన రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతోంది: గంటా
న్యూఢిల్లీ : సమైక్య రాష్ట్ర అంశంపై సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు మరోసారి ఢిల్లీ బాటపట్టారు. ఈరోజు ఉదయం ఢిల్లీ వెళ్లిన పలువురు సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని రాత్రి ఏడుగంటలకు కలువనున్నారు. 60 మంది సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఇచ్చినట్టు సమాచారం. రాష్ట్ర విభజన ప్రక్రియ ఏకపక్షంగా సాగుతోందని.... విభజన వల్ల తలెత్తే సమస్యలను పరిష్కారంపై కేంద్రం స్పష్టత ఇవ్వకుండా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తోందంటూ సీమాంధ్ర నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుందని...అప్రజాస్వామిక విధానాన్ని నిలిపివేయాలని రాష్ట్రపతిని కోరతామన్నారు. రాత్రి ఏడు గంటలకు రాష్ట్రపతి, ఎనిమిది గంటలకు దిగ్విజయ్‌ను కలుస్తామన్నారు. విభజనపై అసెంబ్లీ తీర్మాణం లేకుండా తెలంగాణ ఏర్పాటు చేయడం అప్రజాస్వామికమన్నది సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఆరోపణ. తెలంగాణ ముసాయిదా బిల్లును అసెంబ్లీ వ్యతిరేకిస్తే విభజన ప్రక్రియను ఆపాలంటూ రాష్ట్రపతిని సీమాంధ్ర నేతలు కోరనున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్‌తో భేటీ కానున్న నేతలు... విభజన నిర్ణయం వల్ల సీమాంధ్రలో కుదేలైన కాంగ్రెస్‌ను ఎలా బతికిస్తారో చెప్పాలంటూ ప్రశ్నించనున్నారు. విభజన ముసాయిదా బిల్లు నవంబర్ అఖరుకల్లా అసెంబ్లీకి రానున్న నేపధ్యంలో సమైక్య రాష్ట్ర డిమాండ్‌పై సీమాంధ్ర నేతలు చేస్తున్న ఈ తాజా ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. హస్తిన చేరుకున్న వారిలో మంత్రులు గంటా శ్రీనివాసరావు,టీజీ వెంకటేష్,ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. -
‘ఆ నలుగురు‘లో చీలిక
గంటా వర్గంలో టికెట్ల గుబులు ‘దేశం’లోకి వెళ్దామంటే కార్యకర్తలు ససేమిరా ముందు జాగ్రత్తలతో కొందరు కొత్త మార్గాలు ‘ఐదేళ్లుగా ఒకే మాటగా ఉన్నాం.. మంత్రి గంటా శ్రీనివాసరా వు అడుగులను అనుసరించాం..ఇప్పుడూ ఆయన వెంటే ఉంటే పరిస్థితి ఏంటి..నష్టపోతామేమో’.. గంటా గ్రూపులోని ఎమ్మెల్యేలను వెంటాడుతున్న సంశయమిది. అందుకే భారమంతా ఆయన మీద వేసినా ముందు జాగ్రత్త చర్య గా కొత్తదారులు వెదుక్కోవడం మంచిదనే ఆలోచనలో వీరంతా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రజారాజ్యం పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిన గంటా శ్రీని వాసరావు, చింతలపూడి వెంకట్రామయ్య, ముత్తంశెట్టి శ్రీని వాసరావు, పంచకర్ల రమేష్‌బాబు ఐదేళ్లుగా ఒక వర్గంగా కొనసాగుతున్నారు. పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం కాకమునుపు, ఆ తర్వాత కూడా మిగతా ముగ్గురు గంటా నాయకత్వంలోనే పనిచేసుకుపోతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన యలమంచిలి శాసన సభ్యుడు రమణమూర్తిరాజు, ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు కూడా తాజాగా ఈ గ్రూపులో సభ్యత్వం తీసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే ప్రసక్తే లేదని, ఆ పార్టీ తరపున పోటీకి దిగితే నామినేషన్ వేసి ఇంట్లో కూర్చోవడం మంచిదని వీరంతా గట్టిగా నమ్ముతున్నారు. ఈ వర్గంలోని కొందరు బహిరంగంగానే ఈ అభిప్రాయం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో అంతా కలిసే ఒక నిర్ణయం తీసుకుందామని మంత్రి నాయకత్వంలో జరిగిన పిచ్చాపాటి సమావేశాల్లో ఒక నిర్ణయానికి వచ్చారని సమాచారం. తాము ఎక్కడికెళ్లాలి?, ఏ పార్టీకి వెళితే ఎక్కడి నుంచి టికెట్లు ఇస్తారు?, అందరినీ ఎలా సర్దుబాటు చేస్తారనే భారం మొత్తం వీరు గంటా మీదే వేసి ఆయన నిర్ణయమే తమ నిర్ణయమనేలా కొనసాగుతూ వచ్చారు. ఇందులో భాగంగానే కేడర్‌ను కూడా మానసికంగా సిద్ధం చేసేందుకు సమావేశాలు కూడా నిర్వహించారు. కానీ వీరంతా టీడీపీలోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారనే ఊహాగానాలు సాగుతున్న తరుణంలో ఇటీవల ఒక శాసన సభ్యుడు పార్టీ కేడర్‌తో నిర్వహించిన సమావేశంలో ‘మీరు టీడీపీకి వెళితే వెళ్లండి. మేం మాత్రం ఆ పార్టీలోకి వచ్చేది లేదు’ అని మండల స్థాయి ముఖ్య నేతలు, కార్యకర్తలు సైతం తెగేసి చెప్పడంతో ఆ ఎమ్మెల్యే కంగుతిన్నారని తెలిసింది. మరో ఎమ్మెల్యేకి కూడా ఇదే సెగ తగలడంతో ఏం చేయాలో పాలుపోక అనేక రకాల ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కోరుకుంటున్న పార్టీలో గ్రూపు మొత్తానికి టికెట్లు దొరికే అవకాశాలు కనిపించడం లేదని, అలాంటప్పుడు తమ పరిస్థితి ఏమవుతుందని ఇద్దరు ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారని తెలిసింది. చివరి వరకు ఇలా అనిశ్చితిలోనే గడిపి అంతా అయ్యాక ఎక్కడా బెర్త్ ఖరారు కాకపోతే రాజకీయంగా నష్టపోతామనే భయం వీరిని ఆవహించింది. దీంతో ఒక వైపు గంటాకు జై కొడుతూనే మరో వైపు తమ జాగ్రత్తలో తాము ఉంటున్నారు. అవకాశం దొరికితే కచ్చితంగా గెలుస్తామనే చోటికే చేరాలనే దిశగా ఎవరికి వారు పావులు కదుపుతున్నారని విశ్వసనీయంగా తెలిసింది.