అయ్యన్నపాత్రుడుకి మతి చలించింది: గంటా | Ayyanna Patrudu Mentally Disturbed, says Ganta srinivasarao | Sakshi
Sakshi News home page

అయ్యన్నపాత్రుడుకి మతి చలించింది: గంటా

Published Thu, Dec 5 2013 1:43 PM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM

అయ్యన్నపాత్రుడుకి మతి చలించింది: గంటా

అయ్యన్నపాత్రుడుకి మతి చలించింది: గంటా

విశాఖ : మంత్రి గంటా శ్రీనివాసరావు, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా అయ్యన్నపాత్రుడిపై మంత్రి గంటా విరుచుకుపడ్డారు. అయ్యన్నకు మతి చలించిందని, అందుకే తనపై చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. అటువంటి వాటిని తాను పట్టించుకోనవసరం లేదని గంటా స్పష్టం చేశారు. అగనంపూడిలో టాటా సంస్థ నిర్మిస్తున్న కేన్సర్ ఆస్పత్రికి మంత్రి గంటా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత సుబ్బరామిరెడ్డి పాల్గొన్నారు.

ఇక రాష్ట్ర విభజన నేపథ్యంలో అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారన్న ప్రచారంతో ఆయన ప్రత్యర్థులు అప్రమత్తం అవుతున్న విషయం తెలిసిందే. గతంలో గంటా టీడీపీలో ఉన్నప్పుడు ఆయనకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రత్యర్థిగా ఉన్న విషయం తెలిసిందే. గంటా ఏ పార్టీలోకి వెళితే అది నాశనమేనని, ప్రజారాజ్యంలోకి వెళ్లి ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయించారని... . గంటాది ఐరన్ లెగ్ అని అయ్యన్న వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement