
'అవసరమైతే ఒక మెట్టు దిగడానికి ఓకే'
హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలపై జరగాల్సిన ఏపీ, తెలంగాణ మంత్రుల సమావేశం వాయిదా పడింది. సమావేశానికి తెలంగాణ విద్యాశాఖ జగదీశ్ రెడ్డి హాజరుకాలేదు. ఆయన కోసం ఇంటర్ బోర్డులో ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గంటకుపైగా నిరీక్షించారు. అసెంబ్లీలో ఎల్ బీసీ సమావేశం కారణంగా భేటీకి రాలేనని గంటాకు జగదీశ్ రెడ్డి సమాచారం ఇవ్వడంతో ఆయన వెనుదిరిగారు.
విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఒక్క మెట్టు దిగడానికైనా సిద్ధమని గంటా ప్రకటించారు. తెలంగాణ సర్కారు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరిపేందుకు కూడా తమకు అభ్యంతరం లేదన్నారు. సకాలంలో పరీక్షలు జరిపి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీయిచ్చారు. తెలంగాణ మంత్రితో మాట్లాడి తదుపరి భేటీ ఎప్పుడనేది తెలియజేస్తామన్నారు.