
ప్రైవేటు కాలేజీలకు మించి ఉత్తీర్ణత నమోదు
సగటున 80% ఫలితాలు సాధించిన సంస్థలు
ప్రభుత్వ జూనియర్ కాలేజీల వెనకడుగు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడి యెట్ ఫలితాల్లో ప్రభుత్వ గురు కులాలు మంచి ఫలితాలు కనబరి చాయి. ప్రైవేటు, కార్పొరేట్ కాలే జీలకు దీటుగా ఉత్తీర్ణత సాధించాయి. సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, కేజీబీవీలు, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజీల్లో సగటున 80% ఫలితాలు నమోద య్యాయి.
అయితే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మాత్రం ఈసారి ఫలితాలు నిరాశే మిగి ల్చాయి. ఫస్టియర్‌లో 42 శాతం, సెకెండియర్‌లో 53 శాతానికి మాత్రమే రిజల్ట్ పరిమితమైంది. ఇక రూ.లక్షల్లో ఫీజులు తీసుకునే, గంటల కొద్దీ బోధన చేసే ప్రైవేటు కాలేజీల్లో 69.8 శాతం (ఫస్టియర్), 65.83 శాతానికే (సెకెండియర్) రిజల్ట్స్ పరిమితం కావడం గమనార్హం.