ఏపీ డీఎస్సీ ఫలితాలు విడుదల
విశాఖపట్నం: ఏపీ డీఎస్సీ-2014 (టెట్ కమ్ టీఆర్టీ) పరీక్ష ఫలితాలను విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. 10,313 పోస్టులకు గానూ 3,90,000 మంది పోటీ పడ్డారు. డీఎస్సీ పరీక్షకు హాజరైన వారిలో 37.57 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. స్కూలు అసిస్టెంట్ 32.65 శాతం, లాంగ్వేజ్ పండిట్లు 29.23 శాతం మంది అర్హత సాధించారని మంత్రి గంటా తెలిపారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని అభ్యర్ధులకు ఆయన సూచించారు. (డీఎస్సీ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
9 సబ్జెక్టుల్లో 13 తప్పులను గుర్తించామని, అందుకే నిపుణులతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయాన్ని తీసుకున్నట్లు గంటా పేర్కొన్నారు. షెడ్యూలు ప్రకారం జూన్ 1న ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా, అభ్యర్ధుల అభ్యంతరాల వల్ల ఈరోజు విడుదలయ్యాయి. కాగా, ఈనెల 9, 10,11వ తేదీల్లో ఏపీ డీఎస్సీ-2014 జరిగిన విషయం విదితమే.