
పార్టీలోకి వస్తామని చాలా మంది అడుగుతున్నారు
విశాఖపట్నం: ఎంసెట్ పరీక్ష ఇరు రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణపై చర్చిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం విశాఖలో స్పష్టం చేశారు. ఈ అంశంపై త్వరలో స్పష్టత వస్తుందని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీలోకి వస్తామని చాలా మంది అడుగుతున్నారని తెలిపారు.
గచ్చిబౌలి తరహాలో విశాఖపట్నం నగరంలో కూడా క్రీడా ప్రాంగణాన్ని నిర్మిస్తామని చెప్పారు. త్వరలో నూతన క్రీడా విధానాన్ని తమ ప్రభుత్వం ప్రకటిస్తుందని గంటా శ్రీనివాసరావు తెలిపారు.