
శ్రీవారిని దర్శించుకున్న గంటా
తిరుమల: ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో ఆయన స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయన తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏడాది కాలంలో స్వామి ఆశీస్సులతో విద్యాశాఖ మరింత అభివృద్ధి జరిగిందని చెప్పారు.
నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పాఠ్యపుస్తకాలను తక్కువ ధరలకే అందిస్తున్నామని ఆయన చెప్పారు. అనుమతి లేని పాఠశాలలు, కళాశాలలను డీఈవోల సహాయంతో రద్దు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు.