సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలోని రుషికొండలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌజ్‌లో మాజీ మంత్రి గంటా తన అనుచరులతో రహస్య సమావేశం అయ్యారు. టీడీపీలో కొనసాగాలా? లేదా? అనే అంశంపై అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు. గంటా.. టీడీపీ అధిష్టానం వైఖరితో విసిగిపోయారు. టీడీపీ రెండో జాబితాలో కూడా గంటా శ్రీనివాస్‌కు టికెట్ కేటాయించలేదు.
మొదటి నుంచీ భీమిలి టికెట్ కోసం గంటా పట్టుబట్టటారు. అయితే చంద్రబాబు మాత్రం గంటాకు భీమిలి టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఇదే విషయంలో తనకు కావాల్సిన టికెట్ లభించకపోతే.. గంటా పార్టీ మారే యోచనలో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment