secret meeting
-
టికెట్ ఎఫెక్ట్.. గంటా రహస్య భేటీ!
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలోని రుషికొండలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌజ్‌లో మాజీ మంత్రి గంటా తన అనుచరులతో రహస్య సమావేశం అయ్యారు. టీడీపీలో కొనసాగాలా? లేదా? అనే అంశంపై అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు. గంటా.. టీడీపీ అధిష్టానం వైఖరితో విసిగిపోయారు. టీడీపీ రెండో జాబితాలో కూడా గంటా శ్రీనివాస్‌కు టికెట్ కేటాయించలేదు. మొదటి నుంచీ భీమిలి టికెట్ కోసం గంటా పట్టుబట్టటారు. అయితే చంద్రబాబు మాత్రం గంటాకు భీమిలి టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఇదే విషయంలో తనకు కావాల్సిన టికెట్ లభించకపోతే.. గంటా పార్టీ మారే యోచనలో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. -
తెలంగాణ: బీజేపీ నేతల రహస్య సమావేశం.. అసలు కథేంటి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతలు శనివారం సాయంత్రం కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ శివారులో సీక్రెట్ డిన్నర్లో పాల్గొననున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, రఘునందన్, రాజాసింగ్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, వివేక్ హాజరుకానున్నారు. కాగా రాష్ట్ర బీజేపీ నేతల మధ్య ఉన్న విబేధాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. చదవండి: రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాల్సిందే: కేటీఆర్ కిషన్ రెడ్డి, రాజాసింగ్, బండి సంజయ్, రఘునందన్, జితేందర్ రెడ్డి, డీకే అరుణ లాంటి నేతల మధ్య విభేదాలు ఉండగా.. నేతలందరినీ ఒక్కతాటిపైకి తేవడానికి అధిష్టానం రంగంలోకి దిగుతోంది. ఇందుకు నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ హాజరయ్యే అవకాశం ఉంది. అందరూ కలిసి పనిచేస్తేనే టీఆర్ఎస్ను ఎదురుకోగలమని బీజేపీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అదే విధంగా ఆపరేషన్ ఆకర్ష్ -2 గురించి కూడా చర్చించే వీలుంది. వీటితో పాటు మిలియన్ మార్చ్ విజయవంతం చేయడం, పాదయాత్ర రెండో విడతలో తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు తీసుకునే చాన్స్ కూడా ఉంది. తెలంగాణలో పార్టీ బలోపేతం చేయడానికి పని విభజన చేసుకోవాలని పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు. అంతర్గత వ్యవహారాలు చక్కదిద్దేందుకు బీజేపీ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతమేరకు సఫలమవుతుందో చూడాలి! చదవండి: నల్గొండ: విద్యార్థినులపై ప్రధానోపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన -
టీడీపీ ఎమ్మెల్సీల్లో ఆందోళన.. రహస్య భేటీ
-
తాలిబన్ నేతలతో ట్రంప్ రహస్య భేటీ రద్దు
వాషింగ్టన్: తాలిబన్ నేతలతోపాటు అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో జరగాల్సిన రహస్య భేటీని రద్దు చేసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా సైనికుడి మృతికి కారణమైన కాబూల్ పేలుడుకు కారణం తామేనంటూ తాలిబన్ చేసిన ప్రకటనపై ఆయన ఈ మేరకు స్పందించారు. దీంతో అఫ్గానిస్తాన్‌లో శాంతి నెలకొల్పే లక్ష్యంతో అమెరికా– తాలిబన్ల మధ్య కొన్ని నెలలుగా కొనసాగుతున్న ప్రయత్నాలకు విఘాతం ఏర్పడినట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు. అఫ్గాన్ అధ్యక్షుడు ఘనీతోపాటు తాలిబన్ నేతలతో ఆదివారం డేవిట్ రిట్రీట్‌లోని తన క్యాంపు కార్యాలయంలో భేటీ కానున్నట్లు ట్రంప్ శనివారం ట్విట్టర్లో పేర్కొన్నారు. అయితే, గురువారం కాబూల్‌లో అమెరికా సైనికుడితోపాటు 11 మంది చనిపోయిన కారు బాంబు పేలుడు తమ పనే అంటూ తాలిబన్ ప్రకటించడంతో ఆ భేటీని, శాంతి చర్చలను రద్దు చేసుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ‘చర్చల్లో పైచేయి సాధించటం కోసం ఇలా చంపుకుంటూ పోతారా? ఎన్ని దశాబ్దాలు ఇలా పోరాటం సాగించాలనుకుంటున్నారు? ఇటువంటి చర్యలు పరిస్థితిని మరింత జఠిలంగా మారుస్తాయి. అర్థవంతమైన ఒప్పందం కుదరాలనే నైతిక అర్హత వారికి లేదు’ అని వ్యాఖ్యానించారు. తాలిబన్‌తో శాంతి చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని అమెరికా ప్రతినిధి ఖలీల్జాద్ ఇటీవలే ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. -
పాక్ పరువుపోయింది
ఐక్యరాజ్యసమితి: పాకిస్తాన్‌కు అంతర్జాతీయంగా మరోసారి భంగపాటు ఎదురైంది. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేయడంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి చెందిన 15 దేశాల రహస్య సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. సంయుక్త ప్రకటన విడుదల చేయాలన్న చైనా ఒత్తిడిని యూఎన్ బేఖాతర్ చేసింది. భారత్, పాక్ దేశాల మధ్య ద్వైపాక్షికంగా పరిష్కారం కావల్సిన కశ్మీర్ అంశానికి అంతర్జాతీయ రంగు అద్దడానికి చైనాతో కలిసి పాక్ చేసిన కుయుక్తులు బెడిసికొట్టాయి. ఈ సమావేశం జరగడానికి ముందు ఐక్యరాజ్యసమితిలో చైనా రాయబారి ఝాంగ్ జన్, పాక్ రాయబారి మలీహా లోథిలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కశ్మీర్ అంశంపై ఒకదాని తర్వాత ఒకటి చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. కానీ సమావేశం ముగిసిన తర్వాత విలేకరులతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఆగస్టు మాసానికి భద్రతా మండలి అధినేతగా పోలండ్ అధ్యక్షుడు కొనసాగుతున్నారు. అందుకే కశ్మీర్ అంశంలో ఐరాస తరఫున ఏదైనా ప్రకటన జారీ చేయాలని పోలండ్ అధ్యక్షుడిపై చైనా ఒత్తిడి తీసుకువచ్చింది. యూకే దానికి వంతపాడింది. ద్వైపాక్షిక సమస్యన్న మెజార్టీ దేశాలు.. నాలుగ్గోడల మధ్య జరిగిన ఆ సమావేశం వివరాలు తెలిసిన కొన్ని వర్గాలు మీడియాతో పలు విషయాలు పంచుకున్నాయి. ఈ సమావేశంలో పాల్గొన్న మెజార్టీ సభ్య దేశాలు కశ్మీర్ అంశం ద్వైపాక్షిక అంశమని అందులో ఐరాస జోక్యం అనవసరమని అభిప్రాయపడ్డాయి. ఈ అంశంపై సమావేశాన్ని నిర్వహించమని చైనా చెప్పడాన్ని కొన్ని దేశాలు తప్పుపట్టాయి. 370 రద్దుతో భౌగోళికంగా మార్పులు చోటు చేసుకుంటాయన్న చైనా వాదనని కొట్టిపారేశాయి. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడర్ (సీపీఈఎస్) ద్వారా మార్పులు వస్తున్నాయి కదాని దుయ్యబట్టాయి. చైనా తానేదైనా చేయదలచుకుంటే తమ దేశ అభిప్రాయంగా ప్రకటన అయినా ఇచ్చుకోవచ్చునని ఆ సమావేశంతో పాల్గొన్న ఇతర దేశాలు పేర్కొన్నాయి. కశ్మీర్ అంశంలో తలదూరిస్తే భారత్ వాదనలకు తమ దగ్గర సమాధానం లేదని యూఎన్ అభిప్రాయపడింది. Üమ్లా ఒప్పందానికి అనుగుణంగానే కశ్మీర్‌పై తాము నిర్ణయం తీసుకున్నామని భారత్ చెబుతోంది. అందుకే ఈ సమావేశానికి హాజరైన సభ్యదేశాలేవీ తమ వైఖరిని వెల్లడించడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. అందుకే ఈ సమావేశానికి సంబంధించి మినిట్స్ రికార్డు చేయలేదు. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, దానినైనా పట్టించుకోవాలని సమావేశంలో చైనా వాదించింది. అయితే అమెరికా, ఫ్రాన్స్, రష్యా, డొమినికన్ రిపబ్లిక్, ఆఫ్రికా దేశాలన్నీ భారత్‌కు మద్దతుగా∙నిలిచాయి. ఫ్రాన్స్, రష్యాలు కశ్మీర్ సమస్య ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలని సూచించాయి. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు ఆసియాకు మంచివి కావని ఇండోనేసియా సూచించింది. ఉగ్రవాదాన్ని నిరోధిస్తేనే చర్చలు చైనా ఒత్తిడి మేరకు జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం ముగిశాక యూఎన్‌లో పాక్, చైనా రాయబారులు మీడియాను తప్పించుకొని వెళ్లిపోయారు. కానీ యూఎన్‌లో భారత్ శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ మాత్రం పాకిస్తాన్ జర్నలిస్టుల దగ్గరకు స్వయంగా వచ్చి స్నేహపూర్వకంగా కరచాలనం చేశారు. వారు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలిచ్చారు. ఒకవైపు ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ భయోత్పాతం సృష్టిస్తూ ఉంటే ఏ దేశం కూడా చర్చలకు ముందుకు రాదని అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలు మానుకుంటేనే భారత్ చర్చలకు ముందుకు వస్తుందని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. సిమ్లా ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని భారత్ ఎప్పుడో ప్రకటించిందని, పాక్ ప్రతిస్పందన కోసం వేచి చూస్తున్నట్టుగా ఒక ప్రశ్నకు సమాధానంగా సయ్యద్ చెప్పారు. -
నేడు ఐరాస రహస్య చర్చలు
ఐక్యరాజ్యసమితి: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను భారత్ రద్దు చేయడంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అరుదైన సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశాన్ని శుక్రవారం ఉదయం గోప్యంగా నిర్వహించనున్నట్లు దౌత్యవేత్తలు తెలిపారు. చైనా విజ్ఞప్తి మేరకు ఈ విధంగా రహస్య సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో ఐరాసలో బహిరంగ చర్చను నిర్వహింపజేయడంలో పాక్ విఫలమైనట్లయింది. భద్రతా మండలికి ప్రస్తుతం రొటేషన్ పద్ధతిలో చీఫ్‌గా ఉన్న పోలండ్ అంశంపై ఉదయం పది గంటలకు చర్చ నిర్వహించేలా లిస్టింగ్ చేసిందని వారు చెప్పారు. కశ్మీర్ అంశంపై భద్రతా మండలి చర్చించడం చాలా అరుదన్నారు. -
మునుగోడు బీసీ నేతల ‘తిరుగుబాటు’
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం బీసీ నేతలంతా రాజకీయ పార్టీలపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. నియోజకవర్గంలో 65 శాతానికి పైగా బీసీ ఓటర్లున్నా ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలకు అవకాశం ఇవ్వడం లేదంటూ నిరసన గళం విప్పారు. పార్టీలకు అతీతంగా నియోజకవర్గానికి చెందిన దాదాపు 100 మంది బీసీ నేతలు జూబ్లీహిల్స్‌లో బుధవారం రహస్యంగా సమావేశమయ్యారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో 65 శాతానికి పైగా బీసీ ఓటర్లున్నా రెండు సామాజిక వర్గాలకే టికెట్లు ఇస్తున్నారన్నారు. బీసీల పక్షాన ఏ ప్రధాన పార్టీ అభ్యర్థిని ప్రకటించినా మద్దతివ్వాలని నిర్ణయించుకున్నారు. లేదంటే బీసీలందరి తరఫున ఉమ్మడి అభ్యర్థిని బరిలో దింపాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. 25న 5 వేల బైక్‌లతో ర్యాలీ మునుగోడు నియోజకవర్గంలోని పలు పార్టీల నేతలతో 21న రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. 25న అందోల్ మైసమ్మ దేవాలయం నుంచి 5 వేల మందితో బైక్ ర్యాలీ చేపట్టాలని, ఈ నెల 30 లేదా అక్టోబర్ 1న చండూరు లేదా మునుగోడులో ‘బీసీల ఆత్మగౌరవ సభ’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. భేటీలో తెలం గాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం నేత పల్లె రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు కాంగ్రెస్ తహతహ
-
పొత్తుకోసం.. కాంగ్రెస్-టీడీపీ తహతహ!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్: కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందంటూ ఇంతకాలం గొప్పలు చెప్పుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో పొత్తు కోసం తహతహలాడుతున్నారు! ఇటీవల బీజేపీతో తెగతెంపులు చేసుకున్న చంద్రబాబు దృష్టి కొంతకాలంగా కాంగ్రెస్‌పై పడింది. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో పొత్తు కోసం ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో తెర వెనుక దౌత్యం నడుపుతూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నేరుగానే ఆ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. పొత్తు కుదుర్చుకోవడానికి ముందే కాంగ్రెస్‌లో ఫలానా వారిని చేర్చడానికి వీలుగా ఓ జాబితాను రూపొందించుకున్నారు. దాన్ని అమలు చేసేందుకు రాహుల్ గాంధీతో తెరవెనుక చర్చలు జరిపారు. ఆ చర్చల సారాంశం మేరకు తెలంగాణకు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇటీవల అమరావతి వెళ్లి చంద్రబాబుతో సమావేశమయ్యారు. రెండ్రోజులపాటు అక్కడే ఉన్న ఎమ్మెల్యే రెండుసార్లు చంద్రబాబుతో రహస్యంగా సమావేశమైనట్లు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. రాహుల్‌గాంధీకి సలహాదారుగా ఉన్న ఓ మాజీ బ్యూరోక్రాట్‌కు ఈ ఎమ్మెల్యే అత్యంత సన్నిహితుడు. వచ్చే ఎన్నికల్లో పొత్తు నేపథ్యంలో చంద్రబాబు నుంచి తగిన సూచనలు, సలహాలు తీసుకుని వాటిని రాహుల్‌గాంధీకి అందజేయడమే ఈ సమావేశం ఉద్దేశమని తెలుస్తోంది. డ్రైవర్, గన్‌మెన్ లేకుండా వెళ్లిన ఎమ్మెల్యే పొత్తు ప్రతిపాదనపై చంద్రబాబుతో చర్చించేందుకు అధిష్టాన వర్గం తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు ఒకరిని ఎంపిక చేసుకుంది. అందులో భాగంగానే రాహుల్ సలహాదారు సూచనల మేరకు ఏపీ సరిహద్దు జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇటీవల విజయవాడ వెళ్లారు. ఈ వార్త ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో గుప్పుమంది. గన్‌మెన్, డ్రైవర్ లేకుండా తానే సొంతంగా వాహనాన్ని డ్రైవ్ చేస్తూ వెళ్లిన సదరు ఎమ్మెల్యే విజయవాడలో రెండ్రోజులు ఉన్నారు. మొదటి రోజు చంద్రబాబుతో సమావేశమైనప్పుడు ఆయన నుంచి వచ్చిన ప్రతిపాదనలను సదరు ఎమ్మెల్యే రాహుల్ సలహాదారుకు చేరవేశారు. ఆ ప్రతిపాదనలపై తిరిగి రాహుల్‌గాంధీ సలహాదారు నుంచి వచ్చిన స్పందనను చంద్రబాబుకు రెండోరోజు కలిసి వివరించారు. ఏపీకి చెందిన కొంతమందిని కాంగ్రెస్‌లో చేర్చుకోవాలన్నది చంద్రబాబు ప్రధాన డిమాండ్‌గా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికలకు పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు లభించే శాసనసభ, లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికలో తన మాట చెల్లుబాటు కావాలన్నది చంద్రబాబు వ్యూహం. ఇప్పటికే చంద్రబాబు సూచనల మేరకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఎటూ ఆ పార్టీలో చేరబోతున్న సంగతి తెలిసిందే. దానికి తోడు తెలుగుదేశం పార్టీకే చెందిన కొందరిని కాంగ్రెస్‌లో చేర్పించి ఆ పార్టీ నుంచి టిక్కెట్ ఇవ్వాలన్న వ్యూహరచన చంద్రబాబు చేసినట్లు తెలిసింది. ఈ అవగాహన మేరకు తెలంగాణ టీడీపీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌కు కొంత పాత్ర ఉండే అవకాశం ఉంది. శ్రీకాకుళం నుంచి కాంగ్రెస్ తరపున పారిశ్రామికవేత్త టీడీపీ–కాంగ్రెస్ పొత్తులో భాగంగా శ్రీకాకుళం లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీకి కేటాయించాలన్నది చంద్రబాబు వ్యూహం. ఉత్తరాంధ్రలోనే అతిపెద్ద వ్యాపారవేత్తగా పేరు గడించిన ఓ పారిశ్రామికవేత్తను కాంగ్రెస్ నుంచి బరిలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయన సదరు పారిశ్రామికవేత్తతో సంప్రదింపులు కూడా జరిపారు. జాతీయ పార్టీలో చేరి ఎంపీగా గెలిస్తే పలు కాంట్రాక్టులు దక్కించుకోవచ్చని చంద్రబాబు ఆ పారిశ్రామికవేత్తకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పోటీకి అవసరమైన విధంగా రూ.100 కోట్లు సమకూర్చుకోవాలని కూడా చంద్రబాబు సలహా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరితోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలు మరికొందరిని కాంగ్రెస్‌లో చేర్చి వారికి టిక్కెట్లు దక్కేలా చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు కైకలూరు స్థానాన్ని బీజేపీకి ఇచ్చి టీడీపీ నేత కామినేని శ్రీనివాస్‌ను ఆ పార్టీలో చేర్చించి టిక్కెట్ ఇప్పించిన సంగతి తెలిసిందే. పేరుకే బీజేపీ తప్ప శ్రీనివాస్ ఏనాడు ఆ పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొన లేదు. మంత్రి పదవికి రాజీనామా చేసినా తెలుగుదేశం నేతలతోనే ఆయన సన్నిహితంగా ఉంటున్నారు. ఇదే కోవలో కాంగ్రెస్ నుంచి కొందరికి టిక్కెట్లు ఇప్పించుకునేందుకు చంద్రబాబు ఇప్పట్నుంచే పావులు కదపడం మొదలుపెట్టారు. పత్రికాధిపతి సలహాలు రాహుల్‌గాంధీ సలహాదారు ఇటీవల హైదరాబాద్‌లో ప్రముఖ పత్రికాధిపతితో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుకు సంబంధించి ఈ పత్రికాధిపతి అనేక సూచనలు చేసినట్లు సమాచారం. ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పత్రికాధిపతి ప్రభుత్వంలోనూ, పార్టీ వ్యవహారాల్లోనూ కీలక పాత్ర పోషించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్న సమయంలో తన మీడియా ద్వారా దగ్గరైన ఈ పత్రికాధిపతి గడచిన ఎన్నికలకు ముందు (2014) టీడీపీ, బీజేపీ మైత్రి కోసం కృషి చేశారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌తో చంద్రబాబును కలిపేందుకు రంగంలోకి దిగి నేరుగా రాహుల్‌గాంధీకి సలహాలు ఇస్తున్నారు. సంబంధిత కథనాలు తల్లి కాంగ్రెస్-పిల్ల టీడీపీ; బండారం బట్టబయలు ఒకే వేదికపై సోనియా, రాహుల్, చంద్రబాబు -
కాంగ్రెస్ నేతకు ఐఏఎస్ లీకులు?
సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్: తమకు ప్రాధాన్యం కలిగిన పోస్టులివ్వడం లేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న కొందరు ఐఏఎస్ అధికారులు ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి సన్నిహితంగా ఉండే ఓ కాంగ్రెస్ నేతతో సమావేశం కావడం రాజకీయ, అధికార వర్గాల్లో సంచలనం రేపుతోంది! గడచిన రెండేళ్లుగా తెలంగాణలో తమ వర్గం ఐఏఎస్ అధికారులకు సరైన పోస్టులు దక్కకుండా ఓ ప్రభుత్వ సలహాదారు అడ్డుపడుతున్నారని వీరంతా ఆగ్రహంగా ఉన్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకువెళ్లేందుకు వీరు చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. ముఖ్యమంత్రిని కలవకుండా ఆ సలహాదారు అడ్డుకుంటున్నారని వీరు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వంలో తమకు ప్రాధాన్యం లేకుండా పోతోందని భావించిన ఈ వర్గం ఐఏఎస్ అధికారులు తమకు సన్నిహితుడైన ఓ కాంగ్రెస్ నేతతో ఇటీవల సమావేశమయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో తమకు సరైన ప్రాధాన్యం లభించడం లేదన్నది వీరి సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం. రాహుల్‌కు సన్నిహితుడైన సదరు కాంగ్రెస్ నేత పనిలో పనిగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు వీలుగా ఉండే సమాచారం ఏదైనా ఉంటే ఇవ్వాలని అడిగినట్లు తెలిసింది. దీంతో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఒకరిద్దరు కాంట్రాక్టర్లకు అనుకూలంగా రూపొందించిన నిబంధనలు, మియాపూర్ భూకుంభకోణానికి సంబంధించిన సమాచారాన్ని వీరు అందించినట్లు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంలో ఏయే అధికారుల పాత్ర ఉంది? వారు కాంగ్రెస్ నేతతో కలిసి ఏ విషయాలు చర్చించారన్న అంశంపై రకరకాల ప్రచారం జరుగుతోంది. దృష్టి సారించిన కేంద్రం! కాంగ్రెస్ నేతతో సదరు ఐఏఎస్ అధికారులు రెండుసార్లు సమావేశమయ్యారని విశ్వసనీయ సమాచారం. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచాలని అధికారులు భావించారు. అయితే ఆ అధికారుల బృందంలోని ఓ సభ్యుడే ఆ సమావేశం వివరాలను మరో ఐఏఎస్ అధికారితో పంచుకోవడంతో ఇది కాస్తా బయటకు పొక్కింది. ఆ నోటా ఈ నోటా ఇది ఢిల్లీకి చేరడంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. దీనిపై ఆరా తీయాలని ఇంటెలిజెన్స్ బ్యూరోను ఆదేశించినట్లు సమాచారం. ఐఏఎస్ అధికారులు వ్యక్తిగత పరిచయాల దృష్ట్యా ఎవరితో అయినా కలిసేందుకు అభ్యంతరం ఉండదని, అయితే ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని ప్రతిపక్ష నేతకు ఇవ్వడం దారుణమని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాతే తెలంగాణ ప్రభుత్వం ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేసినట్లు చెబుతున్నారు. మరికొందరికి కూడా ఏమాత్రం ప్రాధాన్యం లేని పోస్టులు కట్టబెట్టారని ప్రచారం జరుగుతోంది. ఆ సలహాదారు కుట్ర చేస్తున్నారని ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఒకరు ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారులకు ప్రాధాన్య పోస్టులు దక్కకుండా కుట్ర చేస్తున్నారన్నది ఆ వర్గానికి చెందిన సీనియర్ అధికారుల ఆరోపణ. గడచిన ఏడాదిన్నరగా ఈ అన్యాయం జరుగుతోందని వారు ఆవేదన చెందుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలోనూ ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారులు ఉన్నా వారిని పట్టించుకోకుండా జూనియర్ అధికారులను జిల్లా కలెక్టర్లుగా నియమించారని వారు ఉదాహరణలతో సహా చెబుతున్నారు. కొత్త జిల్లాల నియామకాల్లో అగ్రవర్ణాల వారికే అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నది వారి ఆరోపణల్లో ప్రధానమైనది. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కూడా ఓ వర్గం వారికే ప్రాధాన్యం కలిగిన పోస్టులు లభిస్తున్నాయని, దీని వెనుక సదరు ప్రభుత్వ సలహాదారు ఉన్నారని ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన సీనియర్ అధికారులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను డమ్మీ చేసి తానే పాలనా యంత్రాంగంలో చక్రం తిప్పుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. సలహాదారు తీరును సీఎం దృష్టికి తీసుకెళ్లాలని వారు భావించారు. ‘‘మేం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించాం. కానీ ఆ సలహాదారు మా ప్రయత్నాలను వమ్ము చేశారు. దీంతో చేసేది లేక మేం మిన్నకుండిపోయాం’’ అని ఓ అధికారి ‘సాక్షి’ ప్రతినిధికి చెప్పారు. పత్రాలు తీసుకువెళ్లారా? సీనియర్ ఐఏఎస్ అధికారులు కొందరు కాంగ్రెస్ నేతతో భేటీ కావడాన్ని ప్రభుత్వం ఎప్పుడో గమనించినట్లు ఉన్నతాధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకే వారిని అప్రాధాన్య పోస్టుల్లో నియమించిందని ఆ వర్గాలు చెప్పాయి. అయితే ప్రభుత్వంలో కీలక సమాచారాన్ని ఆ కాంగ్రెస్ నేతకు ఇచ్చారా లేదా అన్న విషయంలో స్పష్టత లేదు. కావాలనే కొన్ని పత్రాలు బయటకు తీసుకువెళ్లారని ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండే ఓ సలహాదారు చెప్పారు. ఆ పత్రాలతో కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కోర్టులకు వెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. -
బీజేపీ–జేడీఎస్ కుమ్మక్కు!
సాక్షి, బళ్లారి/ బెంగళూరు: రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ, జేడీ(ఎస్) కుమ్మక్కయ్యాయని సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి ఢిల్లీ విమానాశ్రయంలో ప్రత్యేకంగా కలుసుకుని మంతనాలు జరిపారని తెలిపారు. ఆ ఫొటోలు తన వద్ద ఉన్నాయని అవసరమైతే వాటిని బయటపెడతానని హెచ్చరించారు. ఆదివారం బెళగావిలో జరిగిన ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వారిద్దరూ ఒకే విమానంలో వెళ్లారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కుమ్మక్కై ప్రచారం చేస్తున్నాయి అనేందుకు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి’ అని అన్నారు. హంగ్ ఏర్పడితే జేడీఎస్ కింగ్‌మేకర్ అవుతుందని పలు సర్వేలు చెబుతున్న నేపథ్యంలో సీఎం వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వీటిని బీజేపీ, జేడీఎస్ కొట్టిపారేశాయి. సిద్దరామయ్య పిచ్చోడు: యడ్యూరప్ప సిద్దరామయ్యపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సీఎం అభ్యర్థి యడ్యూరప్ప తీవ్ర విమర్శలు చేశారు. ‘వాడొక పిచ్చోడంటూ’ మండిపడ్డారు . చాముండేశ్వరిలో గెలవడం అసాధ్యమని తెలిసిపోవడంతోనే సిద్దరామయ్య బాదామిలోనూ పోటీ చేస్తున్నారన్నారు. కింగ్ మేకర్ కాదు కింగ్‌నే: కుమారస్వామి కర్ణాటక ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తే కింగ్ మేకర్‌ను కాకుండా కింగ్‌నే అవుతానని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్డీ కుమార స్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పార్టీ రాజకీయ ఉనికికి ఈ ఎన్నికలు కీలకమైనవని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ రాదని, ఈసారి హంగ్ అసెంబ్లీ ఏర్పడనుందని అందులో జేడీఎస్ పార్టీ కింగ్ మేకర్ పాత్రను పోషించనున్నట్లు ఇటీవల సర్వేల్లో వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుమారస్వామి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తాము 113 సీట్లను లక్ష్యంగా చేసుకున్నామని అందుకు తగ్గట్లుగానే కీలకమైన వ్యూహాలతో అభ్యర్థులను నిలబెట్టామన్నారు. -
లోగుట్టు ఏమిటో?!
కర్నూలు(హాస్పిటల్): జిల్లా స్థాయిలో నిర్వహించే అభివృద్ధి కమిటీ సమావేశాలకు ప్రజాప్రతినిధులతో పాటు మీడియాను కూడా అనుమతిస్తారు. కానీ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నిర్వహించే ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలకు మాత్రం మీడియాను అడ్డుకుంటున్నారు. మంగళవారం సైతం ఇలాగే మీడియా ప్రతినిధులను సమావేశం నుంచి పంపించివేశారు. ఆసుపత్రి నిధుల వినియోగంపై జరిగే చర్చల్లో విషయాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే మీడియాను అడ్డుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సర్వజన వైద్యశాలలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే.. కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆలస్యంగా రావడంతో రాత్రి 7.15 గంటలకు సమావేశం ప్రారంభమై.. 9 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 5 నుంచి అక్కడే ఉన్న విలేకరులను సమావేశం ప్రారంభమయ్యాక అధికారులు బయటకు పంపించారు. ఇదేమంటే సమావేశమయ్యాక బ్రీఫింగ్ ఇస్తామని, మీడియా అవసరం లేదని చెప్పారు. ఎన్టీఆర్ వైద్యసేవ నిధులు రూ.15 కోట్లకు పైగా ఆసుపత్రిలో ఉన్నాయి. వీటిని ఖర్చు చేసేందుకే అధికారులు ఉన్న ఫలంగా సమావేశం ఏర్పాటు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత సమావేశంలో తీర్మానించిన పనులు పూర్తి కాకుండానే మళ్లీ సమావేశం ఏర్పాటు చేశారు. ఆసుపత్రి అధికారులతో పాటు కమిటీ సభ్యులు పాల్గొని నిధుల వినియోగంపై చర్చించారు. ఈ మేరకు పలు తీర్మానాలు చేశారు. అధికారులపై కలెక్టర్ ఆగ్రహం ఆసుపత్రిలో అంతర్గత రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరైనా ఇంకా ఎందుకు ప్రారంభించడం లేదని ఇంజినీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో పందులు విచ్ఛలవిడిగా తిరుగుతున్నాయని, ఆసుపత్రి అధికారులతో పాటు మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తున్నారని ఆయన మందలించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదని, వారిపై ఎవ్వరి అజమాయిషీ లేనట్లుగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. తాను ఆకస్మిక తనిఖీకి వస్తానని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనంతరం మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.ఆసుపత్రిలో రూ.11.56 కోట్లతో డయాగ్నోస్టిక్ బ్లాక్‌కు రెండోసారి టెండర్‌కు వెళ్తున్నామన్నారు. అంతర్గత రహదారుల నిర్మాణాన్ని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. శిథిలావస్థకు చేరుకున్న అధికారుల క్వార్టర్లను వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆసుపత్రిలో రెండు మినరల్ వాటర్ ప్లాంట్లు, గ్యాస్ట్రో విభాగం అభివృద్ధికి రూ.8లక్షలు, పీడియాట్రిక్ బ్లాక్‌లో రూ.7లక్షలతో బ్రాంకోస్కోపి, రెండు వెంటిలేటర్లు, రూ.17లక్షలతో ఫుల్లీ ఆటోఅనలైజర్ కొనుగోలు చేస్తామన్నారు. ఆసుపత్రికి అవసరమైన పరికరాలను రూ.4.73 కోట్లతో కొనుగోలు చేస్తామని తెలిపారు. డిజిటల్ రేడియోగ్రాఫిక్ పరికరానికి రూ.1.33 కోట్లు వెచ్చిస్తున్నామని, ఈ యంత్రం ఒకేసారి 400 ఎక్స్‌రే ప్రింట్లు తీస్తుందని తెలిపారు. ఈసీటీ(మానసిక వ్యాధులలో షాక్ ట్రీట్మెంట్)కి రూ.6లక్షలు, సెల్కౌంటర్కు రూ.6లక్షలు, మూడు బోర్లు, 320 కేవీ జనరేటర్‌కు నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. 3 సులభ్ కాంప్లెక్స్‌లకు అనుమతులు ఇస్తున్నామని, ఎన్టీఆర్ వైద్యసేవ నిధులతో 41 మందిని(3 ఫార్మాసిస్టు, 5 ఈసీజీ, 1 ఈఈజీ, 1 ఈఆర్సీపీ, 5 హెల్పర్లు, 10 డేటాఎంట్రీ ఆపరేటర్లు, 15 స్టెచ్చర్ బాయ్స్, 1 బార్బర్) ఔట్సోర్సింగ్ విధానంలో నియమిస్తామని వెల్లడించారు. ఎన్టీఆర్ వైద్యసేవ కింద 11 మంది ఉద్యోగుల వేతనాలకు ఆమోదం తెలిపినట్లు వివరించారు. సమావేశంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.చంద్రశేఖర్, కమిటీ సభ్యులు మంజునాథరెడ్డి, అనురాధ, మహేష్‌గౌడ్, పోతురాజు రవికుమార్, ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ విజయభాస్కర్, మున్సిపల్ కమిషనర్ హరినాథరెడ్డి పాల్గొన్నారు. -
రజనీ–కమల్ రహస్య భేటీ
చెన్నై: రాజకీయ అరంగేట్రానికి ముందు తాను సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో రహస్యంగా సమావేశమైనట్లు మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ తెలిపారు. ఈ భేటీలో తన రాజకీయ ప్రవేశంపై రజనీతో చర్చించినట్లు పేర్కొన్నారు. తమిళ వారపత్రిక ‘ఆనంద వికటన్’కు రాసిన వ్యాసంలో కమల్ ఈ వివరాలను వెల్లడించారు. అయితే ఈ భేటీ ఎప్పుడు జరిగిందన్న దానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. చెన్నై సమీపంలో పూనామాళ్లిలోని ఓ స్టూడియోలో బిగ్‌బాస్ షూటింగ్ జరుగుతుండగా, అక్కడికి సమీపంలోనే రజనీ ‘కాలా’ చిత్రం షూటింగ్ కూడా జరుగుతుండేదన్నారు. మనం రహస్యంగా కలుసుకోవచ్చా? అని రజనీకి తాను ప్రతిపాదించినట్లు కమల్ తెలిపారు. దీంతో తామిద్దరం ఓ కారులో రహస్యంగా సమావేశమయ్యామని వెల్లడించారు. ఈ సందర్భంగా రాజకీయ అరంగేట్రంపై తన నిర్ణయాలను రజనీకి వివరించినట్లు పేర్కొన్నారు. తొలుత రాజకీయ ప్రవేశంపై తన అభిప్రాయాన్ని విన్న రజనీ ఆశ్చర్యపోయారన్నారు. దీనికోసం కొన్నేళ్ల క్రితమే మానసికంగా సిద్ధమైపోయాననీ, ప్రస్తుతం ఆచరణలో పెడుతున్నానని రజనీకి సమాధానమిచ్చినట్లు కమల్ వ్యాసంలో తెలిపారు. భవిష్యత్‌లో ఇద్దరి రాజకీయ సిద్ధాంతాలు, మార్గాలు వేరైనా పరస్పరం గౌరవించుకోవాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే, ప్రస్తుతం దేశంలో జరుగుతున్న కాషాయీకరణ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నట్లు ఆ వ్యాసంలో కమల్ మరోసారి స్పష్టం చేశారు. ‘కాషాయాన్ని కమల్ కించపరుస్తున్నాడని కొందరంటున్నారు. అది ఎంత మాత్రం నిజం కాదు. త్యాగానికి ప్రతీకైన కాషాయానికి అత్యంత గౌరవముంది. అంతకంటే ముఖ్యంగా జాతీయ జెండాలోనూ కాషాయానికి చోటుంది’ అని కమల్ చెప్పారు. -
భారత్–పాక్ ఎన్ఎస్ఏల రహస్య భేటీ!
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ ఉన్నతాధికారుల మధ్య థాయ్‌లాండ్‌లో రహస్య భేటీ జరిగిందన్న వార్త చర్చనీయాంశంగా మారింది. భారత్, పాక్‌ల జాతీయ భద్రతా సలహాదారుల(ఎన్ఎస్ఏ) మధ్య ఈ భేటీ సానుకూలంగా సాగిందని పాకిస్తాన్ జాతీయ భద్రతా విభాగం అధికారి ఒకరు వెల్లడించారు. ఆ అధికారి వెల్లడించిన వివరాల్ని ఉటంకిస్తూ ‘ద డాన్’ అనే పాక్ వార్తాపత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. భారత్ ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, పాక్ ఎన్ఎస్ఏ నాజర్ ఖాన్లు డిసెంబర్ 27న రహస్యంగా కలుసుకున్నారని, భేటీలో దోవల్ సానుకూలంగా వ్యవహరించారని ఆ అధికారి చెప్పారు. భారత్–పాక్‌ల మధ్య ద్వైపాక్షిక స్థాయి చర్చలు ప్రారంభించేందుకు ఈ సమావేశం కొంత మేర సాయపడవచ్చని పాక్ అధికారి పేర్కొన్నట్లు డాన్ తన కథనంలో పేర్కొంది. భేటీ గురించి భారత్ వైపు నుంచి మాత్రం ఎలాంటి అధికారిక, అనధికారిక స్పందన వెలువడలేదు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకే భేటీ జరిగినట్లు భావిస్తున్నారు. అయితే పాకిస్తాన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కుల్‌భూషణ్ జాధవ్‌ను ఆయన కుటుంబ సభ్యులు కలిసిన రెండు రోజుల అనంతరం ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. జాధవ్ కుటుంబ సభ్యుల్ని పాకిస్తాన్ అవమానించడంతో.. భారత్, పాక్‌ల మధ్య సంబంధాలు ఇటీవల మరింత దిగజారిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ జైల్లో ఉన్న జాధవ్‌ను చూసేందుకు వెళ్లిన ఆయన భార్య, తల్లితో బొట్టు, తాళి తీయించడంపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. అణు కేంద్రాల సమాచార మార్పిడి ఇరుదేశాల్లోని అణు కేంద్రాలు, వాటికి సంబంధించిన అంశాలపై భారత్, పాక్‌లు దౌత్య మార్గాల ద్వారా సమాచారాన్ని మార్పిడి చేసుకున్నాయి. మూడు దశాబ్దాల క్రితం నాటి ద్వైపాక్షిక ఒప్పందం మేరకు ఢిల్లీ, ఇస్లామాబాద్ రాయబార కార్యాలయాలు సోమవారం అణు కేంద్రాల జాబితాల్ని ఇచ్చి పుచ్చుకున్నాయి. భారత్, పాకిస్తాన్‌ల్లోని అణు కేంద్రాలపై పరస్పర దాడుల నిషేధ ఒప్పందం డిసెంబర్ 31, 1988న జరగగా.. జనవరి 27, 1991 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ప్రతీ ఏడాది జనవరి 1న అణు కేంద్రాలు, సంబంధిత అంశాల సమాచారాన్ని మార్చుకుంటారు. -
మోదీ నన్ను తీవ్రంగా బాధపెట్టారు : మన్మోహన్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీ మాటలు తనను తీవ్రంగా బాధపెట్టాయని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. రాజకీయ ఎదుగుదల కోసం ప్రధాని స్థాయిలాంటి వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడటం ఏ మాత్రం సమంజసం కాదని, ప్రధాని హుందాతనాన్ని కాపాడుకోవాలని, ఆయన చేసిన వ్యాఖ్యలకు దేశానికి క్షమాపణలు చెప్పాలని ఆయన ఓ లేఖ విడుదల చేశారు. 'రాజకీయంగా లబ్ధి పొందడం కోసం శ్రీ ప్రధాని నరేంద్రమోదీ అన్నమాటలు నన్ను బాధించాయి. గుజరాత్ ఎన్నికల్లో ఓటమి పాలవుతారని ఊహించి ఆయన వీలయినన్ని అబద్ధాలు ఆడుతున్నారు. దుష్ఫ్రచారం చేస్తున్నారు. వదంతులు సృష్టిస్తున్నారు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రితో కాంగ్రెస్ పార్టీ నేతలు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో సహా మణిశంకర్ అయ్యర్ ఇంట్లో రహస్య సమావేశం అయ్యారని మోదీ ఆరోపించారు. దాదాపు మూడుగంటలపాటు జరిగిన రహస్య సమావేశంలో మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు హమీద్ అన్సారీతోపాటు సీనియర్ నేతలు హాజరయ్యారని, మొత్తానికి గుజరాత్ ఎన్నికల్లో పాక్ జోక్యం చేసుకునేందుకు అవకాశం ఇచ్చారని మోదీ అన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా మోదీపై విమర్శలు చేయడం మొదలు పెట్టారు. భారత ఆర్మీకి చెందిన మాజీ చీఫ్‌తో సహా పలువురు దౌత్యవేత్తలు, గౌరవనీయ మాజీ అధికారుల సమక్షంలో ఈ సమావేశం అధికారికంగానే జరిగిందని, దీనిపై మోదీ బాధ్యతా రహితమైన వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఈ వరుసలోనే తాజాగా మన్మోహన్ సింగ్ కూడా ఓ లేఖ విడుదల చేశారు. -
రవాణాశాఖ అధికారుల రహస్య సమావేశం
• ఒంగోలు నగరంలోని ఓ కల్యాణమండపంలో మంతనాలు • ఆర్టీవోల ఇళ్లలో ఏసీబీ దాడులపై తీవ్ర చర్చ ఒంగోలు సబర్బన్ : రవాణాశాఖ అధికారులు ఒంగోలులో రహస్యంగా సమావేశమయ్యారు. ఒంగోలు దక్షిణ బైపాస్‌లోని కార్గిల్ పెట్రోలు బంకు ఎదురుగా ఉన్న కల్యాణమండపం ఇందుకు వేదికగా మారింది. మీడియాకు ఎలాంటి సమాచారం లేకుండానే సమావేశమైన ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై లోతుగా చర్చించినట్టు తెలిసింది. ఒంగోలు ఆర్టీవో ఎన్.రాంప్రసాద్‌తో పాటు నెల్లూరు ఆర్టీవో, నెల్లూరు జిల్లాకు చెందిన మరో బ్రేక్ ఇన్స్పెక్టర్లకు సంబంధించిన ఇళ్లపై బినామీదారుల నివాసాలపై ఏసీబీ అధికారులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ ముగ్గురిని ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టుకున్నారని కేసుల్లో రిమాండ్‌కు కూడా పంపించారు. ఈ నేపథ్యంలో బ్రేక్ ఇన్స్పెక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ రహస్య సమావేశం జరిగింది. రవాణాశాఖ కమిషనర్ తీరుపై మండిపాటు.. రవాణాశాఖ మంత్రి ప్రకాశం జిల్లాకు చెందిన శిద్దా రాఘవరావు కావడంతో పాటు ఆయన సొంత జిల్లాలో పని చేస్తున్న ఆర్టీవో, ఇన్చార్జి డీటీసీ ఎన్.రాంప్రసాద్‌ను ఆదాయానికి మించిన అక్రమ ఆస్తుల కేసుల్లో అరెస్ట్ చేయడంతో పాటు సమీప జిల్లా అయిన నెల్లూరు జిల్లాలో కూడా ఇదే తరహాలో ఏసీబీ అధికారులు దాడులు చేయటం, రవాణాశాఖ అధికారుల్లో ఒక రకమైన భీతిని రేకెత్తించినట్లయింది. దీంతో రవాణాశాఖాధికారులు ఈ రహస్య సమావేశానికి వేదికగా మారింది. దీనికి తోడు జిల్లాకు చెందిన మంత్రి శిద్దా, రవాణాశాఖ రాష్ట్ర కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంకు మధ్య సఖ్యత లేదన్న అంశంపైనే రవాణాశాఖాధికారులపై ఏసీబీ దాడుల దాడులు జరుగుతున్నాయన్న దానిపై అధికారులు లోతుగా చర్చించుకున్నారు. గత రెండేళ్లుగా రాష్ట్ర కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం రవాణాశాఖలో మార్పులు తీసుకురావాలన్న అంశంపై రూ.కోట్లు సంపాదిస్తున్న అధికారులపై దృష్టి సారించినట్లు సమాచారం. అందులో భాగంగానే ఏసీబీ అధికారుల దాడులు కూడా జరుగుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఒంగోలును కేంద్రంగా చేసుకొని బ్రేక్ ఇన్స్పెక్టర్లు, సహాయ బ్రేక్ ఇన్స్పెక్టర్లు రహస్యంగా సమావేశమై దీనిపై భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపై కూడా వీరు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. -
రహస్య సమావేశం ఎందుకు..?
సివిల్ వర్కుల్లో అధికార పార్టీ నేతల ఆగడాలు ప్రజా ధనానికి గండి కొట్టే ప్రయత్నం రూ.2 కోట్ల మేర నగర పాలకానికి నష్టం..? ఇంజినీరింగ్ అధికారులు, ఫైవ్‌మెన్ కమిటీ తెరవెనుక డెరైక్షన్ రంగంలోకి అధికార పార్టీ కాంట్రాక్టర్లు ఒంగోలు అర్బన్: ప్రకాశం జిల్లా ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆదివారం రాత్రి కాంట్రాక్టర్లు రహస్యంగా సమావేశమయ్యారు. ఈ నెల 17వ తేదీ 170 పనులకి సంబంధించి రూ.11 కోట్ల టెండర్లు జరగనున్న నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు సమావేశం కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నారు. గతంలో కూడా ఇదే మొత్తానికి టెండర్లు నిర్వహించి భారీఎత్తున పర్సంటేజిలు ముందుగానే తీసుకొని ప్రజాధనాన్ని కొల్లగొట్టే ప్రయత్నం చేసిన అధికార పార్టీ నేతలు, ఫైవ్‌మెన్ కమిటీ ప్రయత్నాలను ‘సాక్షి’ బహిర్గతం చేయడంతో ఈ ఏడాది జనవరి 1వ తేదీన హడావుడిగా రాత్రికిరాత్రే సాంకేతిక కారణాల పేరుతో టెండర్లు రద్దుచేసిన విషయం తెలిసిందే. అయితే ఫైవ్‌మెన్ కమిటీ ప్రజాధనంపై పెట్టుకున్న ఆశలు మాత్రం చావలేదు. దీంతో ఎన్నో రకాలుగా తమ కాంట్రాక్టర్లకు లెస్‌లు లేకుండా పనులు అప్పగించి కోట్లాది రూపాయలు స్వాహా చేసేందుకు ప్రయత్నాలు చే స్తూనే ఉన్నారు. దీనికి ఓఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు తోడ్పాటు ఉండటంతో ఏదో విధంగా తమవారికే పనులు కేటాయించుకోవాలని అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఎప్పటికప్పుడు ‘సాక్షి’ వారి ఆగడాలను వెలుగులోకి తెస్తూనే ఉంది. కార్పొరేషన్ ప్రత్యేక అధికారి అయిన కలెక్టర్ కూడా టెండర్ల విషయంపై దృష్టి సారించకపోవడంతో అధికార పార్టీ ఆగడాలకు అంతులేకుండా పోతోంది. అధికార పార్టీ వారిని కాదని ఎవరైనా ఇతర కాంట్రాక్టర్లు పోటీకి దిగితే వారికి ఇప్పటి వరకు రావాల్సిన బిల్లులను నిలుపుదల చేస్తామని ఇంజినీరింగ్ విభాగం అధికారులు హెచ్చరించడం పరిపాటి అయింది. ఇప్పటికే ఇంజినీరింగ్ విభాగం అడ్డగోలుగా వారికి ఇష్టమొచ్చిన వారికే పనులు ముందుగా కేటాయిస్తూ తర్వాత టెండర్లకు పిలవడం కూడా పలు మార్లు జరిగింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఇంజినీరింగ్ విభాగం అధికారులు, ఫైవ్‌మెన్ కమిటీ సభ్యులు సీన్లోకి రాకుండా తెరవెనుక ఉండి డెరైక్షన్ చేయడంతో వారికి సంబంధించిన కాంట్రాక్టర్లు రహస్యంగా సమావేశమై పనుల కేటాయింపుపై తర్జనభర్జనలు పడ్డారు. రూ.11 కోట్లకి సంబంధించి 170 పనులను డివిజన్ల వారీగా 5 పనుల లెక్కన ప్యాకేజిలుగా విడగొట్టారు. ఒక్కో ప్యాకేజిలో 3 డ్రైన్లు, 2 రోడ్లుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. వాటిలో కూడా ఏదైనా డివిజన్లో ఎక్కువ మిగిలే పనులు ఉంటే వాటిని డ్రా పద్ధతిలో కేటాయించేలా చర్చలు జరిపారు. దీనికి సంబంధించి అధికార పార్టీ కమిటీకి డ్రైన్‌కు 5శాతం, రోడ్డుకి 6 శాతం లెక్కన పర్సటేంజ్లు ఇచ్చేలా నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఈ మామూళ్లను టెండర్లు వేసేటపుడు ముందుగానే కమిటీ సభ్యులకి ముట్టచెప్పాలని అధికార పార్టీ మనుషులు కాంట్రాక్టర్లకు హుకుం జారీ చేశారు. అయితే సదరు కాంట్రాక్టర్లు గత అనుభవం దృష్ట్యా ముందుగా డబ్బు ఇవ్వమని వర్క్ ఆర్డర్ చేతికి వచ్చాక మాత్రమే ఇస్తామని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఇవే పనులను జరగాల్సిన ప్రక్రియ ప్రకారం టెండర్లు వేస్తే దాదాపుగా 20 నుంచి 25 శాతం వరకు లెస్సుల రూపంలో నగర పాలకానికి రూ.2 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అలా కాకుండా అధికార పార్టీకి తలొగ్గి 5,6 శాతం మామూళ్ల కోసం ఒక శాతం లోపు లెస్సులకి టెండర్లు వేయడం ద్వారా ప్రజాధనం దాదాపుగా రూ.1.50 కోట్లు అధికార పార్టీ కమిటీ సభ్యులు, వారి నాయకుడు, ఇంజినీరింగ్ విభాగం అధికారుల జేబుల్లోకి పోతుంది. ఈ నేపథ్యంలో ప్రజాధనం వృథా కాకుండా చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి. ఇప్పటికైనా కార్పొరేషన్ ప్రత్యేక అధికారి కలెక్టర్ టెండర్ల వ్యవహారంపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. -
రాత్రంతా నిద్ర పోకుండా ఏంచేస్తారు?
పట్టు పరుపు మీద పవళిస్తే.. ఎవరికైనా నిద్ర ఇట్టే ముంచుకొచ్చేస్తుంది. కానీ, కొంతమంది పట్టు పాన్పులపై పడుకున్నా కూడా నిద్రా దేవి కరుణించదు. షాహిద్ కపూర్, ఆలియా భట్ ఈ బాపతుకి చెందినవాళ్లే. పాపం.. ఇద్దరికీ నిద్రపట్టదు. కాకపోతే రియల్ లైఫ్‌లో కాదు.. రీల్ లైఫ్‌లో. ఇలా నిద్రలేమిని ‘ఇన్సోమ్నియా’ అంటారు. అలాంటి వ్యాధితో బాధపడేవాళ్లుగా ‘షాన్‌దార్’లో షాహిద్, ఆలియా నటించారు. ఈ ఇద్దరూ ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? అనే కథతో ఈ చిత్రం సాగుతుంది. ‘క్వీన్’ ఫేం వికాస్ బెహల్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. 1958లో వచ్చిన ‘పోస్ట్‌బాక్స్ నం 999’ చిత్రంలోని పాటను ఈ సినిమా కోసం రీమిక్స్ చేశారట. దీని గురించి వికాస్ బెహల్ మాట్లాడుతూ -‘‘నిజజీవితంలో ఎంతోమంది ఇన్సోమ్నియా వ్యాధితో బాధపడుతుంటారు. వాళ్లకు ఈ సినిమాలోని షాహిద్, ఆలియా పాత్రలు బాగా కనెక్ట్ అవుతాయి’’ అన్నారు. -
ఇరుక్కుపోయిన కలెక్టర్!
► పతాక స్థాయికి చేరిన మృణాళిని, స్వాతిరాణి విభేదాలు ► జెడ్పీ చైర్పర్సన్ చాంబర్లో రహస్య సమావేశం ► సీఎం, అశోక్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్న చైర్పర్సన్ వర్గం సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీలో విభేదాలు పతాక స్థాయికి చేరాయి. జిల్లాలో చక్రం తిప్పాలని జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి ఉవ్విళ్లూరుతుండగా, తాను చెప్పినట్టు జరగాలని మంత్రి మృణాళిని ఆరాటపడుతున్నారు. వీరి మధ్య గొడవ కలెక్టర్ ఇరుక్కుపోయారు. ఈ నేపథ్యంలో మంత్రి, కలెక్టర్‌ను తీరును తప్పుపడుతూ జెడ్పీ చైర్పర్సన్ వర్గం నిర్ణయం తీసుకుంది. సీఎం, అశోక్ గజపతిరాజు దృష్టికి తీసుకెళ్లాలని మంగళవారం చైర్పర్సన్ ఛాంబర్లో జరిగిన రహస్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇదెక్కడికి దారితీస్తుందో తెలియదు గాని జిల్లా పాలనపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. మంత్రి మృణాళిని, జెడ్పీ చైర్పర్సన్ స్వాతిరాణి మధ్య ఏడాదిగా పొసగడం లేదు. తాజాగా వైద్య ఆరోగ్య సమీక్ష వారి మధ్య చిచ్చు రేపింది. ఇటీవల కుమారుడ్ని కోల్పోయిన విజయనగరం జెడ్పీటీసీ తుంపల్లి రమణను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో సీజనల్ వ్యాధులపై ఒక సమీక్ష నిర్వహించాలని తనను కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు ఆదేశించినట్టు జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి చెబుతున్నారు. ఆ కారణంతోనే ఒక సమీక్ష నిర్వహించాలని జెడ్పీ సీఈఓ, డీఎంఅండ్హెచ్ఓకు చైర్పర్సన్ సూచించారు. ఆమేరకు సమీక్షా తేదీ( జూలై 28)ని ఖరారు చేశారు. అందులో భాగంగా సోమవారం అటు జెడ్పీటీసీలు, ఎంపీపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జెడ్పీ చైర్పర్సన్ సమాచారం అందించారు. ఆ తర్వాత హైడ్రామా మొదలయింది. అదే రోజు రాత్రి కలెక్టర్ ఎం.ఎం.నాయక్ జోక్యం చేసుకుని జెడ్పీ చైర్‌పర్సన్‌కు ఫోన్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితిలో సమావేశం నిర్వహించొద్దని, మంత్రి మృణాళిని వద్దన్నారని కలెక్టర్ చెప్పినట్టు తెలిసింది. అయితే, జెడ్పీ చైర్పర్సన్ సమీక్ష రద్దు చేయడం కుదరదని, నిర్వహించి తీరుతామని గట్టిగా చెప్పినట్టు తెలియవచ్చింది. ఈ క్రమంలో సమీక్షకు హాజరు కావద్దని అధికారులకు కలెక్టర్ చెప్పినట్టు, ప్రజా ప్రతినిధులకు మంత్రి ఆదేశించినట్టు గుసగుసలు వినిపించాయి. మొత్తానికి సమీక్ష నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. కాకపోతే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ మృతి చెందడంతో సమీక్ష చేసేందుకు అవకాశం లేక సంతాపానికి పరిమితమయింది. ఆ తర్వాత జెడ్పీ చైర్పర్సన్ చాంబర్లో టీడీపీ ప్రజాప్రతినిధులతో రహస్య సమావేశం జరిగింది. ఇందులో మంత్రి మృణాళిని, కలెక్టర్ ఎం.ఎం.నాయక్ లక్ష్యంగా చేసుకుని ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆవేదన వ్యక్తం చేసుకున్నారు. ముందుగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ కలెక్టర్ తనకు పోన్ చేసి సమీక్ష నిర్వహించొద్దని, మంత్రి మృణాళిని వద్దని చెప్పారని, సమీక్ష నిర్వహించాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలని చెప్పినట్టు వివరించారు. ఈ సందర్భంలో కలెక్టర్‌తో వాగ్వాదం కూడా జరిగిందని తెలిపారు. ‘ తనతో మాట్లాడే తీరు ఇదేనా...అంతా ఇగోకు పోకూడదని...కలెక్టర్ ఘాటైనా స్వరంతో అన్నారని, తాను కూడా వెనక్కి తగ్గలేదని జెడ్పీ చైర్‌పర్సన్‌తో మాట్లాడేది ఇలాగేనా అంటూ కలెక్టర్‌తో గట్టిగా మాట్లాడినట్టు చెప్పుకొచ్చారు. సోమవారం రాత్రి జరిగిన పరిణామాల్ని అశోక్ దృష్టికి తీసుకెళ్లగా అనుమతి తీసుకోవల్సిన అవసరం లేదని, అటెండెన్స్ రిజిస్టర్ పెట్టి సమీక్ష నిర్వహించాలని, అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్ని సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లాలని సూచించినట్టు కూడా స్వాతిరాణి తన అనుయాయులకు వివరించారు. ఈ సందర్భంలో మంత్రి గ్రూపుగా భావిస్తున్న ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌తో పాటు ఎమ్మెల్యేలు కె.ఎ.నాయుడు, మీసాల గీత, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి తదితరులు వరుసగా కలెక్టర్, మంత్రి తీరును తప్పు పడుతూ మాట్లాడినట్టు తెలిసింది. జగదీష్ కాస్త ఆచితూచి మాట్లాడినా మిగతా ప్రజాప్రతినిధులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తినట్టు తెలిసింది. కొందరు జెడ్పీటీసీలు, ఎంపీపీలైతే తేల్చుకుందామనే దోరణితో మాట్లాడారు. చివరిగా వ్యవహారాన్ని సీఎం దృష్టికి, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు దృష్టికి తీసుకెళ్లి ఏదొకటి తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. -
టీ టీడీపీ ఎమ్మెల్యేల రహస్య భేటీ
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారని కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు మంగళవారం రాత్రి నగరంలోని ఓ హోటల్లో రహస్యంగా సమావేశం కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. నగరానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాశ్ గౌడ్, మాధవరం క్రిష్ణారావు, అరికెపూడి గాంధీ బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో సమావేశమై మంతనాలు జరిపినట్లు సమాచారం. వీరితో పాటు మరికొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు సమాచారం.దీనిపై మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా... 10వ తేదీన చేపడుతున్న బస్సు యాత్ర ఏర్పాట్లపైనే చర్చించేందుకే సమావేశమైనట్లు తెలిపారు. పార్టీ మారే అంశం చర్చకు రాలేదన్నారు. -
కాంగ్రెస్ నేతల రహస్య భేటీ?
శంకర్పల్లి,న్యూస్‌లైన్: మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో రాజకీయ సమీకరణాల కోసం వివిధ పార్టీల నాయకులు సమాయత్తం అవుతున్నారు. శంకర్పల్లి మండల పరిధిలోని పొద్దుటూర్ ప్రగతి రిసార్ట్స్‌లో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఈమేరకు రహస్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రులు సబితారెడ్డి, ప్రసాద్‌కుమార్, ఎమ్యెల్సీ యాదవరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వెంకటస్వామి, చేవెళ్ల అసెంబ్లీ అభ్యర్థి కాలె యాదయ్య ఇతర ముఖ్యనేతలు హాజరయినట్లు తెలిసింది. సోమవారం వెలువడనున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు , మంగళవారం వెలువడనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై అంచనాలు, ఆ తరువాత అనుసరించవలసిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. జిల్లా వ్యాప్తంగా మెజార్టీ ఎంపీపీ స్థానాలతోపాటు, జెడ్పీటీసీ చైర్మన్‌గిరి కైవసం చేసుకోవాలనే దానిపై ప్రత్యేకంగా చర్చించారని తెలుస్తోంది. అయితే సమావేశానికి సంబంధించి వివరాలు వెల్లడించేందుకు నాయకులు నిరాకరించారు. -
దిగ్విజయ్ సింగ్ , కెసిఆర్ రహస్య సమావేశం
టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్‌సింగ్ ఢిల్లీలో ఈరోజు రహస్యంగా సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు(తెలంగాణ బిల్లు), టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అంశాలపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ అంశం చివరి దశకు రావడంతో ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ లో టిఆర్ఎస్ విలీనంపైనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా లాభంలేనిదే ఏ పనికీ పూనుకోదన్నది జగమెరిగిన సత్యం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసే క్రమంలో అటు ఓట్లు,సీట్లుతోపాటు టిఆర్ఎస్ని కాంగ్రెస్‌లో విలీనం చేసే ప్రక్రియ కూడా మొదలు పెడుతోంది. పార్టీ విలీనంపై కెసిఆర్ తడవకు ఓ రకంగా మాట్లాడారు. తెలంగాణ ప్రకటిస్తే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని తొలుత ప్రకటించారు. ఆ తరువాత విలీనం లేదు - రాష్ట్ర పునర్నిర్మాణంలో తామే కీలక పాత్ర - అధికారం మాదే - బిల్లు పాస్ అయిన తరువాత ఆలోచిద్దాం... అని మాట్లాడారు. కాంగ్రెస్ వాళ్లు ఎందుకు ఊరుకుంటారు? పార్టీ విలీనం కాకుండా, తెలంగాణ ప్రకటిస్తే ఆ క్రెడిట్ అంతా టిఆర్ఎస్కు, కెసిఆర్‌కు పోతుందన్న విషయం వారికి తెలియనిదికాదు. ఈ నేపధ్యంలో ఒకవైపు తెలంగాణ బిల్లును పార్లమెంటులో నెగ్గించడానికి సర్వ ప్రయత్నాలు చేస్తూనే, మరో పక్క టిఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి కెసిఆర్‌తో మంతనాలు జరుపుతోంది. కెసిఆర్ ఎన్నిసార్లు ఏ విధంగా మాట్లాడినా, తన ప్రధాన ఆశయం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటమే అయినందున, ఆ పని పూర్తి అయితే టిఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేసే అవకాశం ఉంది. ప్రస్తుత పరిణామాల నేపధ్యంలో టిఆర్ఎస్ నేతలలో టెన్షన్ మొదలైంది. -
లోకేష్ వేగులొచ్చారు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితిని అంచనా వేసేందుకు తెలుగుదేశం పార్టీ వేగులను రంగంలోకి దించింది. రాష్ట్రంలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో మారిన సమీకరణలను అధ్యయనం చేసేందుకు చంద్రబాబు తనయుడు లోకేష్ తన దూతలను పురమాయించారు. ఈ క్రమంలోనే సోమవారం చేవెళ్లలో పార్టీ ముఖ్య నేతలతో రహస్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కేఎస్ రత్నం సహా ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు, ఇతర ముఖ్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన అనంతరం పార్టీ పరిస్థితిని అంచనా వే యడంలో భాగంగానే ఈ పర్యటన సాగినట్లు తెలిసింది. గ్రామాల వారీగా పార్టీ పనితీరు, తెలంగాణ వాదం, ప్రభుత్వ వ్యతిరేకతను ఆరా తీసిన వేగులు.. పార్టీ విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై నాయకుల అంతరంగం తెలుసుకున్నారు. తెలంగాణ లో కాస్తో కూస్తో గెలుపుపై ఆశలు పెట్టుకున్న రంగారెడ్డి జిల్లాలో సానుకూల ఫలితాలు సాధించేందుకు వీలుగా ఇతర పార్టీల్లోని అసంతుష్టులను చేరదీసే అభిప్రాయ సేకరణ జరిపినట్లు సమాచారం. అధికారపార్టీలో నెలకొన్న గ్రూపు రాజకీయాలను అనుకూలంగా మలుచుకోవాలని, అసంతృప్త నేతలను పార్టీలో చేర్చుకునేందుకు వీలుగా సంప్రదింపులు జరపాలని సూచించినట్లు తెలిసింది. గెలుపోటములను ప్రభావితం చేసే కుల, ఉపకులాలు, సామాజిక సమీకరణలపై కూడా ఈ సమావేశంలో లోతైన విశ్లేషణ సాగించారని తెలిసింది. నియోజకవర్గంలోని 245 పోలింగ్ బూత్‌లలో పార్టీ సానుభూతిపరులు సహా.. ఇతర కులాల, ఉప కులాల ఓటర్ల వివరాలను కూడా సేకరించాలని లోకేష్ అంతరంగికుడు ఆదేశించినట్లు తెలిసింది. ఈ ప్రక్రియను పక్షం రోజుల్లో పూర్తి చేయాలని సూచించినట్లు సమాచారం. ఇదిలావుండగా... తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడంతో పార్టీకి మంచి మైలేజ్ వచ్చినప్పటికీ, అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ద్వంద్వ ప్రకటనలు పార్టీకి నష్టం చేకూరుస్తున్నాయని కొందరు తమ్ముళ్లు కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. జిల్లాపై ఆశలు.. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ దాదాపుగా తుడుచుపెట్టుకుపోయింది. అయితే రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ వాదం బలీయంగా లేకపోవడం, శివార్లలో సెటిలర్ల ఓట్లు అధికంగా ఉండడంతో టీడీపీ ఇక్కడ నిలదొక్కుకోవాలని ఆశిస్తోంది. జిల్లాలో నెలకొన్న ‘ప్రత్యేక’ పరిస్థితుల దృష్ట్యా పాగా వేయాలని భావిస్తోంది. అంతేగాకుండా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంటరీ స్థానానికి పోటీచే స్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో పార్టీని బలోపేతం చేయడం ద్వారా గెలుపునకు బాటలు వేసుకోవాలని అగ్రనాయకత్వం భావిస్తోంది. అంతేగాకుండా చంద్రబాబు తనయుడు నారాలోకేష్ కూడా ఈసారి ఎన్నికల బరిలో దిగుతారనే వార్తలు వెలువడుతున్నాయి. తమ సామాజికవర్గం బలంగా ఉన్న శేరిలింగంపల్లిపై ఆయన కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలోనే తన అంతరంగికులతో జిల్లాలో పార్టీ పరిస్థితిపై సర్వే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా పార్టీ కేడర్‌లో కదలిక తెచ్చేందుకు త్వరలోనే లోకేష్ కూడా జిల్లా పర్యటన చేసే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. జిల్లాలో రాజకీయ అరంగేట్రం చేసేందుకు చేవెళ్లను వేదిక చేసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లా బాట పట్టిన అంతరంగికులు అన్ని నియోజవకర్గాల్లో పార్టీ తీరుపై శ్రేణుల మనోగతాన్ని తెలుసుకునే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం.