సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతలు శనివారం సాయంత్రం కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ శివారులో సీక్రెట్ డిన్నర్‌లో పాల్గొననున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, రఘునందన్, రాజాసింగ్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, వివేక్ హాజరుకానున్నారు. కాగా రాష్ట్ర బీజేపీ నేతల మధ్య ఉన్న విబేధాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాల్సిందే: కేటీఆర్
కిషన్ రెడ్డి, రాజాసింగ్, బండి సంజయ్, రఘునందన్, జితేందర్ రెడ్డి, డీకే అరుణ లాంటి నేతల మధ్య విభేదాలు ఉండగా.. నేతలందరినీ ఒక్కతాటిపైకి తేవడానికి అధిష్టానం రంగంలోకి దిగుతోంది. ఇందుకు నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ హాజరయ్యే అవకాశం ఉంది. అందరూ కలిసి పనిచేస్తేనే టీఆర్ఎస్‌ను ఎదురుకోగలమని బీజేపీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అదే విధంగా ఆపరేషన్ ఆకర్ష్ -2 గురించి కూడా చర్చించే వీలుంది.
వీటితో పాటు మిలియన్ మార్చ్ విజయవంతం చేయడం, పాదయాత్ర రెండో విడతలో తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు తీసుకునే చాన్స్ కూడా ఉంది. తెలంగాణలో పార్టీ బలోపేతం చేయడానికి పని విభజన చేసుకోవాలని పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు. అంతర్గత వ్యవహారాలు చక్కదిద్దేందుకు బీజేపీ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతమేరకు సఫలమవుతుందో చూడాలి!
చదవండి: నల్గొండ: విద్యార్థినులపై ప్రధానోపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన
Comments
Please login to add a commentAdd a comment