టీ టీడీపీ ఎమ్మెల్యేల రహస్య భేటీ | Telangana TDP MLAs to Secret meeting with TRS | Sakshi
Sakshi News home page

టీ టీడీపీ ఎమ్మెల్యేల రహస్య భేటీ

Published Wed, Oct 8 2014 1:08 AM | Last Updated on Fri, Aug 10 2018 7:19 PM

Telangana TDP MLAs to Secret meeting with TRS

సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారని కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు మంగళవారం రాత్రి నగరంలోని ఓ హోటల్‌లో రహస్యంగా సమావేశం కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. నగరానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాశ్ గౌడ్, మాధవరం క్రిష్ణారావు, అరికెపూడి గాంధీ బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో సమావేశమై మంతనాలు జరిపినట్లు సమాచారం. వీరితో పాటు మరికొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు సమాచారం.దీనిపై మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా... 10వ తేదీన చేపడుతున్న బస్సు యాత్ర ఏర్పాట్లపైనే చర్చించేందుకే సమావేశమైనట్లు తెలిపారు. పార్టీ మారే అంశం చర్చకు రాలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement