tirumal
-
తిరుమలలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
-
నేడు తిరుమలకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. ఇందుకోసం ఆయన శుక్రవారం రాత్రికి తిరుమల చేరుకుంటారు. వైఎస్ జగన్ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు తిరుమల చేరుకుని, అక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం 10.20 గంటలకు గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు, అనంతరం తిరుమల నుంచి తిరుగు ప్రయాణమవుతారు. -
వైకుంఠ దర్శనం: పోటెత్తిన భక్తులతో తిరుమల కిటకిట
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. నేడు(సోమవారం) త్రయోదశి శ్రీవారి దర్శనం కోసం భక్తులు కిటకిటలడుతున్నారు. వరుసగా సెలవులు నేపధ్యంలో దర్శనానికి భక్తులు బారులు తీరారు. త్రయోదశి సందర్భంగా ప్రముఖులు శ్రీవారి దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు జడ్జి కృపాసాగర్, సుప్రీంకోర్టు జడ్జ్ నాగరత్నం, హైకోర్టు జడ్జ్ కే సురేష్‌రెడ్డి, కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే రోహిత్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠ ద్వాదశి నాడు(ఆదివారం) శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 63,519. నిన్న తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 26,424. ద్వాదశి నాడు శ్రీవారి హుండీ ఆదాయం 5.05 కోట్లు వచ్చింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రెండు రొజల్లో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 131,425. ఏకాదశి, ద్వాదశి రెండు రోజుల్లో హుండీ ఆదాయం 7.55 కోట్లు వచ్చింది. తిరుపతిలో కేటాయిస్తున్న ఉచిత వైకుంఠ ద్వార దర్శన టికెట్లు పూర్తి అయ్యాయి. 53 గంటల్లో తిరుమల తిరుపతి దేవసస్థానం(టీటీడీ) 4,23,500 టికెట్లు జారీ చేసింది. ముగిసిన వైకుంఠద్వార దర్శనం టోకెన్ల కోటా ఈనెల 22 రాత్రి 11:30 నుంచి టోకెన్లు జారీ చేసిన టీటీడీ 4.25 లక్షల భక్తులకు వైకుంఠద్వార దర్శన టోకెన్లు జారీ చేసింది. టైమ్ స్లాట్, టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. రోజూ 65 వేల మందికి పైగా భక్తులకు వైకుంఠద్వార దర్శనం చేసుకుంటున్నారు. ఈనెల 23 నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార భక్తులు దర్శనం చేసుకోవచ్చు. నంద్యాల(శ్రీశైలం): శ్రీశైలం మల్లన్న ఆలయంలో రెండోవరోజు భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుసగా సెలవులు వచ్చిన నేపథ్యంలో స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీతో క్షేత్రమంత భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. -
అలనాడు బ్రహ్మోత్సవాలే... కల్యాణోత్సవాలు
శ్రీవారి ఆలయంలో స్వామివారికి నిత్యకల్యాణోత్సవం జరుగుతుంది. కాని ప్రాచీనకాలంలో ఈ నిత్యకల్యాణోత్సవ సంప్రదాయం ఉన్నట్లు కనిపించదు. అప్పట్లో బ్రహ్మోత్సవాలనే స్వామివారి కల్యాణోత్సవాలుగా భావించేవారని తెలుస్తోంది. కాని బ్రహ్మోత్సవాలలో స్వామివారికి, అమ్మవారికి కల్యాణం చేసే ఉత్సవం ఏమీ ఉండదు. శ్రీవారి ఆలయంలో స్వామివారికి వివాహోత్సవాన్ని మొదటిసారి 1546 జూలై 17వ తేదీన తాళ్లపాక పెద తిరుమలాచార్యులు ప్రారంభించినట్లు శాసనంలో కనిపిస్తుంది. ఆనాటి సంప్రదాయంగా ఐదు రోజులు శ్రీవారి వివాహ కార్యక్రమాన్ని దగ్గరుండి ఎంతో ఘనంగా నిర్వహించారు. అనురాధ నక్షత్రం నుంచి ఉత్తరాషాఢ వరకు ఐదు రోజులపాటు ఈ ఉత్సవాలను మార్చి, ఏప్రిల్ మాసాలలో నిర్వహించేవారు. ఆ రోజుల్లో 5 రోజుల వివాహంలో జరిగే అన్ని తతంగాలను, లాంఛనాలను ఈ వివాహంలో జరిపించేవారు. స్వామివారికి అభ్యంగనస్నానం, తిరుమంజనం, నూతన వస్త్రధారణ, తిరువీథి ఉత్సవం, నైవేద్యం, స్వామివారిని, దేవేరులను ఉయ్యాలపై ఉంచి చేసే ఉయ్యాలసేవ, పెళ్లికొడుకు పాదాలను క్షీరంతో అభిషేకించడం, ధ్రువనక్షత్ర దర్శనం, చందన వసంతోత్సవం, కల్యాణహోమం, మంగళసూత్రధారణ, తలంబ్రాలు, పూలబంతి ఆట... ఇలా అన్ని వేడుకలను ఐదు రోజులపాటు వివాహోత్సవం కార్యక్రమంలో నిర్వహించేవారు. తాళ్లపాక వారు ఏర్పాటు చేసిన ఈ ఉత్సవంలో తాళ్లపాక వంశీయులు ప్రధానపాత్ర వహించి స్వామివారికి కన్యాదానం చేసే సంప్రదాయం మెదలైంది. అటు తరువాత ఈ కార్యక్రమం నిత్య కల్యాణోత్సవంగా రూపాంతరం చెంది ప్రతినిత్యం నిర్వహిస్తున్నారు. కన్య తరపున తాళ్లపాక వంశీకులే కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకుగానూ అన్నమయ్య వంశీకులకు టీటీడీ ప్రత్యేకంగా సంభావన, ప్రసాదాలు అందిస్తోంది. ఐదు రోజులపాటు వైభవంగా స్వామివారికి నిర్వహించే కల్యాణోత్సవం ఖర్చుల నిమిత్తం తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు కొండవీడు సీమలోని శెందళూరు అనే గ్రామం, మల్లవరం అనే గ్రామాన్ని దేవదాయం చేశాడట. అ సమయంలో మలయప్పస్వామి, దేవేరులకే కాకుండా, ఆలయంలో శ్రీకృష్ణునికి, వరాహస్వామివారికి నైవేద్య సమర్పణ జరిగింది. మనోహరం అనే ప్రసాదం కూడా అప్పుడే స్వామివారికి సమర్పించడం ప్రారంభమైంది. దీనికి సంబంధించిన వివరాలు కూడా స్వామివారి కల్యాణోత్సవం గురించి లిఖించిన శాసనంలోనే ప్రస్తావించారు. అంతకు పూర్వం ఈ నైవేద్యం గురించి ఎక్కడా ప్రస్తావన లేదట. ఇది ఒక రకమైన బెల్లపు లడ్డు, సున్నుండ లాంటిది. 16వ శతాబ్దం మధ్యభాగంలో మొదలైన ఈ ప్రసాదం 20వ శతాబ్దం మధ్య భాగం వరకు చాలా ప్రాచుర్యంలో వుండేది. శ్రీవారి దర్శనానికి విచ్చేసే ముఖ్య భక్తులకు దేవస్థానం ఇచ్చే ప్రధాన ప్రసాదంగా పేరు తెచ్చుకుంది. దాని స్థానంలో ఇప్పుడు తిరుపతి లడ్డూగా పేరుగాంచిన శనగపిండి లడ్డూ ప్రాముఖ్యానికి వచ్చింది. రుచిలో... నాణ్యతలో తిరుపతి లడ్డూనే దానికది సాటిగా పేరు తెచ్చుకుంది. (చదవండి: తిరుమలలో అన్నీ ప్రత్యేకతలే...) -
భక్తులకు మరింత సులభంగా వసతి గదులు
తిరుమల: తిరుమలలోని ఆరు ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా వసతి గదులు పొందే అవకాశాన్ని భక్తులకు కల్పిస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని సీఆర్వో వద్ద ఏర్పాటు చేసిన నూతన కౌంటర్లను అదనపు ఈవో శనివారం పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు సీఆర్వో వద్ద మాత్రమే వసతి గదుల రిజిస్ట్రేషన్, కేటాయింపు చేసేవారన్నారు. ఇక్కడ రద్దీ అధికంగా ఉండడం, పార్కింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల భక్తులు ఇబ్బందులు పడుతుండటంతో త్వరితగతిన రిజిస్ట్రేషన్ చేసి, గదులు కేటాయించేందుకు తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో నూతన కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటిల్లో సీఆర్వో వద్ద రెండు కౌంటర్లు, బాలాజీ మెయిన్ బస్టాండ్ వద్ద రెండు కౌంటర్లు, కౌస్తుభం అతిథి భవనం వద్ద ఉన్న కారు పార్కింగ్ ప్రాంతంలో రెండు కౌంటర్లు, రాంభగీచ బస్టాండ్ వద్ద రెండు కౌంటర్లు, ఎంబీసీ ప్రాంతంలోని శ్రీవారి మెట్టు వద్ద రెండు కౌంటర్లు, జీఎన్సీ టోల్గేట్ వద్ద ఉన్న లగేజీ కౌంటర్ వద్ద రెండు కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ కౌంటర్లలో పేర్లు నమోదు చేసుకున్న భక్తులకు ఎస్ఎమ్ఎస్ ద్వారా వారికి కేటాయించిన గదుల సమాచారం తెలియజేస్తామన్నారు. అనంతరం వారికి గదులు కేటాయించిన ప్రాంతాల్లోని ఉప విచారణ కార్యాలయాల వద్ద రుసుం చెల్లించి గదులు పొందవచ్చని ధర్మారెడ్డి తెలిపారు. -
తిరుమలలో మహిళ ఆత్మహత్య
సాక్షి, తిరుమల : సుపథం ప్రాంతంలో గుర్తుతెలియని మహిళ ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. మృతదేహం ఉన్న పరిస్థితిని బట్టి రెండు రోజుల క్రితం మృతి చెందినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతి చెందిన మహిళ వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. గుర్తుతెలియని మహిళ మృతిగా కేసు నమోదు చేసుకున్న తిరుమల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
తిరుమల: ఏపీ ప్రభుత్వ వివాదాస్పద నిర్ణయం
సాక్షి, అమరావతి/తిరుమల: కలియుగ ఆరాధ్య దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి నైవేద్యం విషయంలో ఏపీ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ప్రతి సోమవారం మధ్యాహ్న వేళ సమర్పించే నైవేద్యాన్ని ఉదయం ఏడు గంటలకు మార్చింది. దీంతో అప్పటి నుంచి రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో జరిగే నైవేద్యం వరకూ స్వామివారిని 13 గంటలపాటు పస్తు ఉంచుతున్నారు. తిరుమల ఆలయంలో ఉదయం వీవీఐపీ బ్రేక్ దర్శనాలకు వచ్చే వారి సంఖ్య ఇటీవల కాలంలో ముఖ్యంగా సోమవారం బాగా పెరిగిపోతోంది. దీంతో ఎల్–2, ఎల్–3 దర్శనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు శ్రీవారి నైవేద్యం వేళలో కీలక మార్పులు చేస్తూ ఆదివారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. అలాగే ప్రతి సోమవారం స్వామి వారికి మధ్యాహ్న నేవైద్యాన్ని ఉదయం ఏడు గంటలకే పూర్తిచేయాలని అర్చకులను ఆదేశిస్తూ ఆ ఉత్తర్వులో తెలిపింది. ఈ నిర్ణయంపై హిందూ మత ప్రచారకులు మండిపడుతున్నారు. ఇది స్వామి వారికి మహా అపచారం చేయడమే అవుతుందని హెచ్చరిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున సుప్రభాత సేవ మొదలు రాత్రి పవళింపు సేవ వరకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో స్వామివారికి నైవేద్యం సమర్పణ ఉంటుంది. దీనిని త్రికాల నివేదనగా పిలుస్తుంటారు. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున సుప్రభాత సేవ, అర్చన కార్యక్రమాల అనంతరం ఉదయం ఐదున్నర గంటలకు స్వామి వారికి తొలివిడత నైవేద్యం సమర్పిస్తారు. దీనిని ప్రాతఃకాల ఆరాధనగా పిలుస్తారు. తొలి విడత నైవేద్యం అనంతరం వీవీఐపీ బ్రేక్ దర్శనాలు కొనసాగుతాయి. రెండో విడతగా మధ్యాహ్నం మళ్లీ నైవేద్యం సమర్పిస్తారు. మూడో విడతగా రాత్రి 8 గంటలకు జరుగుతుంది. వీవీఐపీ కోటా కింద భారీ సంఖ్యలో ఎల్–2, ఎల్–3 దర్శనాలను మధ్యాహ్నం ఎంతసేపైనా కొనసాగించడానికే ప్రభుత్వం మధ్యాహ్నం నైవేద్యం వేళలలో మార్పులు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారమే ఎందుకంటే.. తిరుమలలో ప్రతి సోమవారం కల్యాణోత్సవ మండపంలో ‘విశేష పూజ’సేవ నిర్వహించాల్సి ఉండటం, అదే రోజు వీవీఐపీ బ్రేక్ దర్శనానికి బాగా డిమాండ్ ఉండటం వంటి కారణాలతో ప్రత్యేకించి సోమవారం స్వామి వారికి మధ్యాహ్న వేళ సమర్పించే నైవేద్య వేళలో మార్పులు తీసుకొచ్చారని చెబుతున్నారు. అలాగే, ఈ ఒక్కరోజు మాత్రం తెల్లవారుజామున తొలి విడత నైవేద్యం అనంతరం ఎల్–1 బ్రేక్ దర్శనాలు కొనసాగించి 7 గంటలకు మధ్యాహ్న నైవేద్యం పూర్తిచేసి ఆ తర్వాత ఎల్–2, ఎల్–3 దర్శనాలను ఎంతసేపైనా కొనసాగిస్తారు. మిగిలిన రోజుల్లో మధ్యాహ్న నైవేద్య కార్యక్రమాలు యథావిధిగానే కొనసాగుతాయి. ప్రభుత్వ తాజా ఆదేశాల కారణంగా ప్రతీ సోమవారం తిరుమలలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఎక్కువసేపు క్యూలలో వేచి ఉండాల్సి వస్తుందని చెబుతున్నారు. అభ్యంతరాలతో ఆగమ సలహా మండలికి సిఫారసు మధ్యాహ్న నైవేద్యం వేళలో మార్పుపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఈ విషయాన్ని పూర్తిస్థాయి పరిశీలనార్ధం ఆగమ సలహా మండలికి సిఫార్సు చేసినట్లు డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. వీరి సలహా వచ్చే వరకు ప్రతి సోమవారం పాత పద్ధతిలోనే మధ్యాహ్న నైవేద్యం నిర్వహిస్తామన్నారు. మరోవైపు.. శ్రీవారి ఆలయంలో ప్రతీ సోమవారం విశేషపూజ నిర్వహణకు తగినంత సమయం కోసం ఆలయ ప్రధాన అర్చకులు, ముగ్గురు ఆగమ పండితులు ఇతర అర్చకుల సలహా మేరకే మధ్యాహ్న నైవేద్యాన్ని సోమవారం ఉ.7 గంటలకు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. -
2 నెలలు శ్రీవారి ప్రత్యేక దర్శనాలు రద్దు
సాక్షి, తిరుమల: వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు విచ్చేసే భక్తుల రద్దీ దృష్ట్యా మే, జూన్ నెలల్లో శ్రీవారి ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. టీటీడీ గత ఏడాది ఆగస్టు నుంచి ప్రతి నెలా రెండు సామాన్య రద్దీ దినాలలో 4 వేల మంది వృద్ధులు, దివ్యాంగులు, 5 సంవత్సరాలలోపు చిన్నారులు, వారి తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పిస్తున్న విషయం తెలిసిందే. టీటీడీ తాజా నిర్ణయంపై భక్తులు సహకరించాలని ప్రజాసంబంధాల విభాగం అధికారి తలారి రవి కోరారు. -
భక్తుల ఫిర్యాదులకు టీటీడీ యాప్
సాక్షి, హైదరాబాద్: తిరుమలకు వచ్చే భక్తులు తాము ఎదుర్కొంటున్న అన్ని రకాల ఇబ్బందులపై ఫిర్యాదు చేయడానికి వీలుగా ఓ యాప్‌ను రూపొందిస్తున్నట్లు టీటీడీ అధికారులు మంగళవారం హైకోర్టుకు నివేదిం చారు. ఈ యాప్ రూపకల్పన బాధ్యతలను టీసీ ఎస్‌కు అప్పగించినట్లు తెలిపారు. ఈ యాప్ భక్తు లకు బహుళ ప్రయోజనకారిగా ఉంటుందని వివ రించారు. భక్తులు ఫిర్యాదులు చేయడానికి ఇప్పటికే ఓ టోల్‌ఫ్రీ నంబర్‌తో పాటు వాట్సాప్ నంబర్ కూడా కేటాయించామని తెలిపారు. అధిక ధరలు మొదలు ఏ అంశానికి సంబంధించైనా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేసి, ఆ ఫిర్యాదు ఏ దశలో ఉంది, ఏం చర్యలు తీసుకున్నారు తదితర వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు ఉందని వివరించారు. ఈ నంబర్లపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ ద్వారా విస్తృత ప్రచారం కల్పించనున్నామని టీటీడీ తరఫు న్యాయవాది శివరాజు శ్రీనివాస్ తెలియజేశారు. తిరుమలలో వ్యాపారులు తినుబండారాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారని, దీనిపై ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ చిత్తూరుకు చెందిన పరిహార సేవా సమితి గత ఏడాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. తదుపరి విచారణను డిసెంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. -
తిరుమల క్యూలైన్లలో విద్యుదాఘాతం!
సాక్షి, తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. శ్రీవారి ఆలయ ప్రవేశద్వారం దగ్గరున్న స్కానింగ్ సెంటర్ వద్ద షార్ట్ సర్క్యూట్ కావడంతో భక్తులకు షాక్ తగిలింది. దీంతో భయాందోళనకు గురైన భక్తులు ఒక్కసారిగా పరుగులు తీశారు. దీంతో స్వల్ప తోపులాట చోటుచేసుకొని పలువురు భక్తులకు గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో శ్రీవారి దర్శనానికి కొంత అంతరాయం ఏర్పడింది. ఆలయ ప్రవేశద్వారం వద్ద ఉన్న లగేజీ స్కానింగ్ సెంటర్ వద్ద ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద, శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద స్కానింగ్ సెంటర్లు ఏర్పాటుచేశారు. ఇక్కడ భక్తులను తనిఖీ చేసిన అనంతరం శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. మహాద్వారం ఉన్న స్కానింగ్ సెంటర్ వద్ద తనిఖీలు చేస్తుండగా భక్తులకు షార్ట్ సర్క్యూట్ వల్ల షాక్ తగిలింది. దీంతో భయాందోళనకు గురైన భక్తులు క్యూలైన్లో ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో స్వల్ప తోపులాట జరిగి పలువురికి గాయాలయ్యాయి. గాయాలైన వారికి క్యూలైన్లోనే ప్రాథమిక చికిత్స అందించినట్టు తెలుస్తోంది. అనంతరం శ్రీవారి దర్శనానికి ఆ క్యూలైన్లోని వారిని అనుమతించారు. -
3న తిరుమలకు రానున్న ప్రధాని మోదీ
తిరుమల: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 3వ తేదీన తిరుమలకు రానున్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఢిల్లీకి తిరిగివెళ్తారు. మోదీ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. మంగళవారం తిరుమలలో కోయిళ్ ఆల్వార్ తిరుమంజనం ఉండటంతో ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఆదివారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులు 7 కంపార్ట్మెంట్లలో ఉన్నారు. సర్వదర్శనానికి 4 గంటలు, కాలిబాట భక్తులకు 3 గంటల సమయం పట్టింది. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఏడుకొండల వాడి దర్శనానికి ప్రస్తుతం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. నిన్న(బుధవారం) శ్రీవారిని 69,317 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.38 కోట్లుగా నమోదైనట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
ఎంసెట్-2 లీకేజీ వ్యహారంలో ముగ్గురి అరెస్ట్
-
ఎంసెట్-2 లీకేజీ వ్యహారంలో ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల వ్యవహారంలో ముగ్గురిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ లీకేజీ వ్యవహారంలో మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేసిన సీఐడీ.. హైదరాబాద్‌కు చెందిన కన్సల్టెన్సీ నిర్వాహకుడు విష్ణుధర్, దళారీ తిరుమల్ అనే ఇద్దరు నిందితులను గురువారం అదుపులోకి తీసుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు. మరోక నిందితుడి వివరాలు ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ లీకేజీలో మొత్తం 30 మంది విద్యార్థులకు పేపర్ లీక్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 25న కేసు దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ అధికారులు రెండు సెట్ల పేపర్లు లీక్ అయినట్టు నిర్ధారించారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ. 30 నుంచి రూ. 40 లక్షల చొప్పున వసూలు చేసినట్టు సీఐడీ పేర్కొంది. ఢిల్లీలో ప్రింటింగ్ ప్రెస్ నుంచి పేపర్ లీక్ అయినట్టు వెల్లడించింది. ముంబై, బెంగళూరులో విద్యార్థులకు పేపర్ ఇచ్చినట్టు తెలిపింది. రెండు రోజుల ముందు పేపర్‌ను స్టూడెంట్స్‌కు ఇచ్చారని తెలిపింది. పేపర్ కొన్న విద్యార్థులు బెంగళూరు, ముంబైల్లో ప్రాక్టీస్ చేసినట్టు సీఐడీ వెల్లడించింది. రెండు సెట్లలోని మొత్తం 320 ప్రశ్నలపై ప్రాక్టీస్ చేయించారు. ప్రాక్టీస్ ముగియగానే తిరిగి విద్యార్థులను వెనక్కి పంపినట్టు సీఐడీ తెలిపింది. రాజగోపాల్ రెడ్డి విద్యార్థుల చేత ప్రాక్టీస్ చేయించినట్టు పేర్కొంది. ఈ లీకేజీ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని సీఐడీ భావిస్తోంది. తద్వారా లీకేజీ వ్యవహారంలో అనుమానితులను కస్టడీలోకి తీసుకుని లోతుగా దర్యాప్తు చేయనుంది. ఒకవైపు సీఐడీ నివేదిక కోసం ప్రభుత్వం కూడా వేచిచూస్తోంది. అయితే ఇప్పటివరకు లభించిన ఆధారాల మేరకు ఎంసెట్-1లో వేలకుపైగా ర్యాంకు వచ్చి, ఎంసెట్-2లో మెరుగైన ర్యాంకులు సాధించిన వారు 24 మంది ఉన్నట్లు సీఐడీ పోలీసులు గుర్తించారు. బ్రోకర్‌గా చెలామణీ అవుతున్న వెంకట్రావు సెల్‌ఫోన్ నుంచి వీరిలో కొందరికి కాల్స్ వెళ్లినట్లు గుర్తించారు. సీఐడీ ప్రాథమిక విచారణను మూడు అంశాలుగా విభజించి దర్యాప్తు చేస్తోంది. పేపర్ తయారీ-ప్రింటింగ్, కోచింగ్ సెంటర్లు-పరీక్షకు హాజరైన విధానం, సెల్‌ఫోన్ కాల్స్-ఎంసెట్ ర్యాంకులుగా విభజించి విచారణ చేస్తున్నారు. కాగా, మరోవైపు డీజీపీ, సీఐడీ చీఫ్‌తో ఎంసెట్ కన్వీనర్ రమణారావు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంపై వారు చర్చిస్తున్నట్టు సమాచారం. -
తిరుమలలో ప్రమాదకరంగా మారిన ఘాట్ రోడ్లు
-
నాల్గోరోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలు
-
తిరుమలకు శ్రీవారి బ్రహ్మోత్సవ శోభ
-
నారాయణగిరిలో వైభవంగా ఛత్రస్థాపనోత్సవం
తిరుమల: తిరుమలలోని నారాయణగిరిలో ఉన్న శ్రీవారి పాదాల వద్ద మంగళవారం ఉదయం వైభవంగా ఛత్రస్థాపన మహోత్సవం జరిగింది. శ్రీనివాసుడు భూలోకానికి వచ్చినప్పుడు తొలిసారిగా పాదాలు మోపిన దివ్య స్థలంగా ప్రసిద్ధిగాంచిన నారాయణగిరిలో ఉన్న పాదాల చెంత ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా అక్కడ అర్చకులు శాస్త్రోకంతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నూతన ఛత్రాన్ని అక్కడ ప్రతిష్టించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కాగా, తిరుమల శ్రీవారిని కంచికామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. మరోవైపు భక్తుల రద్దీ తక్కువగా ఉంది. సర్వదర్శనం భక్తులకు 4 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. -
శ్రీవారిని దర్శించుకున్న గంటా
తిరుమల: ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో ఆయన స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయన తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏడాది కాలంలో స్వామి ఆశీస్సులతో విద్యాశాఖ మరింత అభివృద్ధి జరిగిందని చెప్పారు. నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పాఠ్యపుస్తకాలను తక్కువ ధరలకే అందిస్తున్నామని ఆయన చెప్పారు. అనుమతి లేని పాఠశాలలు, కళాశాలలను డీఈవోల సహాయంతో రద్దు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. -
తిరుమల సమాచారం
తిరుమల: తిరుమలలో సోమవారం ఉదయం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500 గదులు లభించక భక్తులు అవస్థలు పడుతున్నారు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 30 కంపార్టుమెంట్లూ నిండిపోయాయి. భక్తుల క్యూ వెలుపలి వరకూ ఉంది. ఉదయం 6 గంటలకు అందిన సమాచారం: గదుల వివరాలు: ఉచిత గదులు, రూ.50 గదులు. రూ.500 గదులు - ఖాళీ లేదు. రూ.100 గదులు - 16 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత సేవా టికెట్ల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం: ఖాళీ లేవు సహస్ర దీపాలంకరణ సేవ: 45 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం: ఖాళీ లేవు. సోమవారం ప్రత్యేక సేవ - విశేష పూజ. -
తిరుమల సమాచారం
తిరుమల: తిరుమలలో శనివారం ఉదయం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. గదులు లభించక భక్తులు అవస్థలు పడుతున్నారు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు నిండాయి. ఉదయం 6 గంటలకు అందిన సమాచారం: గదుల వివరాలు.. ఉచిత గదులు: ఖాళీ లేవు రూ.50 గదులు: ఖాళీ లేవు రూ.100 గదులు: ఖాళీ లేవు రూ.500 గదులురూ: 4 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత సేవా టికెట్ల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం - 16 ఖాళీగా ఉన్నాయి. సహస్ర దీపాలంకరణ సేవ - ఖాళీ లేవు వసంతోత్సవం - 28 ఖాళీగా ఉన్నాయి. -
తిరుమల సమాచారం
తిరుమల: తిరుమలలో శుక్రవారం ఉదయం భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500 గదులు లభించక భక్తులు అవస్థలు పడుతున్నారు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 20 కంపార్టుమెంట్లు నిండాయి. ఉదయం 6 గంటలకు అందిన సమాచారం: గదుల వివరాలు.. ఉచిత గదులు: ఖాళీ లేదు రూ.50 గదులు: 11 ఖాళీగా ఉన్నాయి. రూ.100 గదులు: ఖాళీ లేదు రూ.500 గదులురూ: ఖాళీ లేదు. ఆర్జిత సేవా టికెట్ల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం - 116 సహస్ర దీపాలంకరణ సేవ - 197 వసంతోత్సవం - 203 ఖాళీగా ఉన్నాయి. శుక్రవారం ప్రత్యేకత - అభిషేకం. -
షకీలా ఆత్మకథతో సినిమా!
ఒకప్పుడు షకీలా చిత్రాలంటే ‘హాట్’ కేకులే. వాటి దెబ్బకి స్టార్ల చిత్రాలే బెంబేలెత్తిపోయేవి. అందుకే, తమ సినిమాల విడుదల సమయంలో షకీలా సినిమాలు అడ్డు రాకూడదని అప్పట్లో మలయాళ హీరోలు ఓ నిబంధన విధించారు. అయితే, ఆ తర్వాత వారికి షకీలా టెన్షన్ లేకుండాపోయింది. ఆమె హాట్ చిత్రాలు చేయడం మానుకున్నారు. కొంచెం నీట్‌గా ఉండే పాత్రలు చేయడం మొదలుపెట్టారు. ఇటీవల తన ఆత్మకథ రాశారు షకీలా. అప్పట్లో షకీలా సినిమాల్లానే ఇప్పుడీ ఈ పుస్తకం హాట్ కేక్‌లా అమ్ముడుపోయింది. ఈ ఆత్మకథ చదివిన షకీలా ఫ్రెండ్స్.. ‘దీన్ని సినిమాగా తీస్తే బాగుంటుంది’ అన్నారట. ఆ ఆలోచన షకీలాకి కూడా నచ్చింది. దక్షిణాది భాషలతో పాటు, సౌత్‌లోనూ షకీలా నటించారు కాబట్టి, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాని నిర్మించాలనుకుంటున్నారామె. కె. తిరుమల్ దర్శకుడు. ఓ ప్రముఖ తారతో తన పాత్రను నటించజేయాలనుకుంటున్నారు షకీలా.