షకీలా ఆత్మకథతో సినిమా! | Shakeela Biography shakes Film Industry | Sakshi
Sakshi News home page

షకీలా ఆత్మకథతో సినిమా!

Published Thu, Feb 27 2014 11:00 PM | Last Updated on Sat, Sep 2 2017 4:10 AM

షకీలా ఆత్మకథతో సినిమా!

షకీలా ఆత్మకథతో సినిమా!

ఒకప్పుడు షకీలా చిత్రాలంటే ‘హాట్’ కేకులే. వాటి దెబ్బకి స్టార్ల చిత్రాలే బెంబేలెత్తిపోయేవి. అందుకే, తమ సినిమాల విడుదల సమయంలో షకీలా సినిమాలు అడ్డు రాకూడదని అప్పట్లో మలయాళ హీరోలు ఓ నిబంధన విధించారు. అయితే, ఆ తర్వాత వారికి షకీలా టెన్షన్ లేకుండాపోయింది. ఆమె హాట్ చిత్రాలు చేయడం మానుకున్నారు. కొంచెం నీట్‌గా ఉండే పాత్రలు చేయడం మొదలుపెట్టారు. ఇటీవల తన ఆత్మకథ రాశారు షకీలా.
 
 అప్పట్లో షకీలా సినిమాల్లానే ఇప్పుడీ ఈ పుస్తకం హాట్ కేక్‌లా అమ్ముడుపోయింది. ఈ ఆత్మకథ చదివిన షకీలా ఫ్రెండ్స్.. ‘దీన్ని సినిమాగా తీస్తే బాగుంటుంది’ అన్నారట. ఆ ఆలోచన షకీలాకి కూడా నచ్చింది. దక్షిణాది భాషలతో పాటు, సౌత్‌లోనూ షకీలా నటించారు కాబట్టి, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాని నిర్మించాలనుకుంటున్నారామె. కె. తిరుమల్ దర్శకుడు. ఓ ప్రముఖ తారతో తన పాత్రను నటించజేయాలనుకుంటున్నారు షకీలా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement