2 నెలలు శ్రీవారి ప్రత్యేక దర్శనాలు రద్దు | 2 months Srivari Special Dharshanam Was Canceled | Sakshi
Sakshi News home page

2 నెలలు శ్రీవారి ప్రత్యేక దర్శనాలు రద్దు

Published Wed, May 2 2018 3:25 AM | Last Updated on Wed, May 2 2018 3:25 AM

2 months Srivari Special Dharshanam Was Canceled - Sakshi

సాక్షి, తిరుమల: వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు విచ్చేసే భక్తుల రద్దీ దృష్ట్యా మే, జూన్‌ నెలల్లో శ్రీవారి ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. టీటీడీ గత ఏడాది ఆగస్టు నుంచి ప్రతి నెలా రెండు సామాన్య రద్దీ దినాలలో 4 వేల మంది వృద్ధులు, దివ్యాంగులు, 5 సంవత్సరాలలోపు చిన్నారులు, వారి తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పిస్తున్న విషయం తెలిసిందే. టీటీడీ తాజా నిర్ణయంపై భక్తులు సహకరించాలని ప్రజాసంబంధాల విభాగం అధికారి తలారి రవి కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement